Top Stories
ప్రధాన వార్తలు

ఏపీ ఎమ్మెల్యేకు హైడ్రా షాక్
సాక్షి, హైదరాబాద్: ఏపీ మైలవరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు హైడ్రా షాక్ తగిలింది. కొండాపూర్ పరిధిలో ప్రభుత్వ భూముల్లో ఆయన చేపట్టిన అక్రమ కట్టడాలను శనివారం ఉదయం అధికారులు కూల్చేశారు. కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టారు.కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయ సమీపంలోని సర్వే నెంబర్ 79లో 39 ఎకరాల స్థల వివాదంపై హైడ్రాకు ఫిర్యాదు అందింది. దీంతో భారీ పోలీసు బందోబస్తు అక్కడికి చేరుకున్న హైడ్రా.. వసంత కృష్ణ ప్రసాద్ కబ్జాల పర్వాన్ని గుర్తించింది. ఆ స్థలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్ తోపాటు భారీ షెడ్లను జేసీబీలతో తొలగించింది. కూల్చివేతలను అడ్డుకునేందుకు ఆయన కుటుంబ సభ్యులు ప్రయత్నించగా.. భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగించింది. ఈ క్రమంలో వసంత హౌస్ పేరుతో ఏర్పాటు చేసిన ఆఫీస్‌తో పాటు భారీ షెడ్లను తొలగించారు. హఫీజ్‌పేటలో రూ.2000 కోట్ల విలువగల వివాదాస్పద భూమిలో ఆయన కబ్జా పెట్టినట్లు తేలింది. అలాగే.. మాదాపూర్‌లోని 20 ఎకరాల భూమిని వసంత గ్రూప్ రియల్ ఎస్టేట్ సంస్థ కబ్జా చేసినట్లు హైడ్రా గుర్తించింది. ఈ వ్యవహారంపై ఆయన అధికారికంగా స్పందించాల్సి ఉంది.

‘చంద్రబాబు మహిళా ద్రోహిగా మిగిలిపోతారు’
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రలు, కుతంత్రాలతో కూటమి సర్కార్ మేయర్ పీఠం కైవసం చేసుకుందని ఆరోపించారు. కూటమి పాలనలో ధర్మం వధ, సత్యం చెరలో పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.విశాఖ మేయర్ పీఠం కూటమి గెలుపుపై వైఎస్సార్సీపీ నేతలు స్పందించారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ..‘యాదవ మహిళకు వైఎస్ జగన్ మేయర్ పదవి ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. కుట్రలు, కుతంత్రాలతో కూటమి సర్కార్ మేయర్ పీఠం కైవసం చేసుకుంది. పార్టీ మారని వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను బెదిరించాలని చూస్తున్నారు. చావుబతుకుల మధ్య కూటమి సర్కార్ మ్యాజిక్ ఫిగర్‌కు చేరుకుంది. వైఎస్సార్సీపీ పాలనలో గెలిచే అవకాశం ఉన్న స్థానాల్లో మేం ప్రలోభపెట్టలేదు. కూటమి పాలనలో ధర్మం వధ, సత్యం చెరలో పడిపోయింది. కూటమి నేతలు గెలిచే బలం లేకున్నా అవిశ్వాస తీర్మాన లేఖ ఇచ్చారు. ధర్మం గెలిచిదంటున్న కూటమి నేతలకు మాట్లాడే అర్హత లేదు. కూటమి చావు బతుకుల మీద మ్యాజిక్ ఫిగర్ చేరుకుంది. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు గెలిచారు. కుట్రలు తంత్రాలకు తెర తీశారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. విలువలు విశ్వసనీయత లేని వ్యక్తి చంద్రబాబు. కూటమిని తట్టుకొని నిలబడ్డ వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు చేతులెత్తి నమస్కరిస్తున్నాము.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కామెంట్స్..బలం లేకుండా అవిశ్వాస తీర్మానం నోటీసు అందజేశారు..ధర్మం న్యాయం గురించి మాట్లాడే హక్కు కూటమి నాయకులకు లేదు.మేయర్ మీద అవిశ్వాసం గెలిచారు. విశాఖ ప్రజల మనసుల్లో విశ్వాసం కోల్పోయారు.విప్ ఉల్లంఘించిన వారి పదవులు పోవడం కాదు..యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళకు మేయర్ పదవి ఇచ్చారు..ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తామని ప్రలోభ పెట్టారు.99 పైసలకే విశాఖ భూములను ఇష్టానుసారంగా కట్టబెడుతున్నారు.ఇదే తరహాలో భూములు కట్టబెడతామని లోకేష్ చెప్తున్నారు..టీసీఎస్ విశాఖ రాక ముందే భూములు అప్పనంగా కట్టబెడుతున్నారు.విశాఖ మేయర్ పీఠం చేతిలో ఉంచుకొని విశాఖను దోచుకోవాలని చూస్తున్నారు.ధర్మశ్రీ పాయింట్స్ కామెంట్స్..మేయర్ ఎన్నికలో వైఎస్సార్సీపీ నైతికంగా గెలిచింది..కూటమి నిజంగా గెలిచే పరిస్థితి ఉంటే నెల రోజుల సమయం ఎందుకు తీసుకున్నారు..జీవీఎంసీ డబ్బులతో ప్రత్యేక విమానాలు వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల కోసం తీసుకువెళ్లారు..యాదవ్ కుల ద్రోహులు కూటమిలో ఉన్నారు..ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కామెంట్స్..పది నెలల పదవి కోసం ఒక మహిళను పదవి నుంచి దించుతారా?.చంద్రబాబు మహిళా ద్రోహిగా మిగిలిపోతారు..ప్రజలు 164 సీట్లు ఇచ్చిన చంద్రబాబుకు అధికార దాహం తీరలేదు..వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను భయబ్రాంతులకు గురి చేశారు.చంద్రబాబు ప్రలోభాలకు పెట్టింది పేరున్యాయం ధర్మం గెలిచిందని కూటమి నేతలు మాట్లాడడం సిగ్గుచేటు.కుట్రలు తంత్రాలకు మేయర్ ఎన్నికలో గెలిచాయి.

వాళ్లందరిపైనా ఇలాగే చర్యలు తీసుకుంటారా?: స్మితా సబర్వాల్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్మాల్ శనివారం గచ్చిబౌలి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారానికి సంబంధించిన ఆమె సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టుకుగానూ నోటీసులు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఇవాళ గచ్చిబౌలి పీఎస్‌లో ఆమె విచారణకు హాజరై స్టేట్మెంట్ ఇచ్చారు. ఆపై తన ఎక్స్ ఖాతాలో ఓ సందేశం ఉంచారు. ‘‘చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చా. పోలీసులకు పూర్తిగా సహకరించా. నేను ఎలాంటి పోస్ట్ చేయలేదు. హాయ్ హైదరాబాద్ పోస్టును రీట్వీట్ చేశా. 2 వేల మంది అదే పోస్ట్‌ను షేర్ చేశారు. వాళ్లందరితోనూ ఇలాగే వ్యవహరిస్తారా?. .. ఇలాగే నోటీసులు ఇచ్చి వారందరిపై ఇలాగే చర్యలు తీసుకుంటారా?. అలా చేయకపోతే కొంతమందినే టార్గెట్ చేసినట్లు అవుతుంది. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు అవుతుంది. ఇది ఎంత వరకు కరెక్ట్?. జస్టిస్ అనేది అందరికీ సమానంగా ఉండాలి. చట్టం అందరికీ సమానమా? ఎంపిక చేసిన వారినే టార్గెట్ చేస్తున్నారా?’’ అని అన్నారామె. ఇదిలా ఉంటే.. కంచ గచ్చిబౌలి భూముల అంశంలో ఆమెకు ఈనెల 12నే నోటీసులు జారీ అయ్యాయి. కంచ గచ్చిబౌలిలో వన్యప్రాణుల పరిస్థితి ఇదంటూ వైరల్ అయిన నకిలీ ఫొటోలను ఆమె సోషల్‌మీడియాలో షేర్ చేసిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే నోటీసులు అందుకున్నాక కూడా ఆమె సోషల్ మీడియాలో చేసిన కొన్ని రీట్వీట్లు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

GVMC: అడ్డదారిలో అవిశ్వాసం నెగ్గిన కూటమి
విశాఖపట్నం, సాక్షి: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి పాలనలో ప్రజాస్వామ్యం మళ్లీ మళ్లీ ఖూనీ అవుతోంది. బలం లేకున్నా విశాఖ మేయర్‌పై అవిశ్వాసం పెట్టి.. కుట్రలు, ప్రలోభాల పర్వాలతో అడ్డదారిలో నెగ్గింది. ఏకంగా 30 మంది కార్పొరేటర్లను కొనుగోలు చేసిన టీడీపీ.. యాదవ సామాజిక వర్గానికి చెందిన గొలగాని హరి వెంకటకుమారిను మేయర్ పీఠం నుంచి దించేసింది. అధికార వ్యామోహంలో ఉన్న కూటమి ప్రభుత్వం.. కేవలం పది నెలల కాలం ఉన్న ఓ మేయర్ పదవి కోసం కోట్లాది రూపాయలు గుమ్మరించడం గమనార్హం. ఈ క్రమంలో దిగజారుడు రాజకీయాలు చేసింది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను తమవైపు తిప్పుకునేందుకు చివరి నిమిషం దాకా ప్రలోభాల పర్వం కొనసాగిస్తూ వచ్చింది. కార్పొరేటర్లను ప్రత్యేక విమానాల్లో విదేశీ పర్యటనలకు పంపడం, స్టార్ హోటల్స్‌లో విడిది ఏర్పాటు చేయడం లాంటి చేష్టలకు పాల్పడింది. కేరళకు వెళ్లి మరీ వైస్సార్సీపీ కార్పొరేటర్లను బెదిరించి.. బతిమాలి.. డబ్బు ఆశ చూపించి తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో కొందరు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఏమాత్రం తగ్గకపోవడం గమనార్హం. అవిశ్వాసం నెగ్గాలంటే 74 ఓట్లు అవసరం. ఒకవైపు డబ్బు ఎర, మరోవైపు బెదిరింపులు, ఇంకోవైపు కిడ్నాపులు.. ఇలా టీడీపీ నేతలు ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారు. అయినా సరే బొటాబొటిగా 74 మంది సభ్యులతోనే విశాఖ మేయర్‌పై అవిశ్వాసం నెగ్గింది టీడీపీ. ఇక అవిశ్వాస ఓటింగ్‌కు దూరంగా ఉంటూనే.. భారీ భద్రత నడుమ ఓటింగ్ నిర్వహించాలని, ఓటింగ్ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేయించాలని వైఎస్సార్సీపీ చేసిన విజ్ఞప్తిని అధికార యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. కూటమి నేతలను అడ్డుకోని పోలీసులుఅవిశ్వాసం వేళ.. కూటమి కార్పొరేటర్లు, ఎక్స్ ఆఫీషియో సభ్యులు కాకుండా కొందరు కూటమి నేతలను పోలీసులు జీవీఎంసీ కార్యాలయంలోకి లోపలికి అనుమతించారు. బస్సులో ఉన్న కూటమి నాయకులను వారి అనుచరులను నిలువరించకుండా చూస్తూ ఉండిపోయారు. ఓటింగ్‌కు వెళ్లిన సభ్యులతో కలిసి జీవీఎంసీ దర్జాగా కొందరు కూటమి నేతలు వెళ్తున్న దృశ్యాలు మీడియాకు చేరడం గమనార్హం. నీచమైన రాజకీయాలు వద్దని చెప్పాప్రత్యేక విమానంలో కేరళ వచ్చి కూటమి నేతలు నన్ను బెదిరించారు. కూటమికి అనుకూలంగా ఓటు వేయమన్నారు. నేను పార్టీ మారేది లేదని చెప్పాను. మొదటినుంచి నేను వైఎస్సార్సీపీలో ఉన్నాను. రాజకీయమంటే వ్యాపారం కాదు. డబ్బులు కోసం నీతిమాలిన రాజకీయాలు చేయను. నీచమైన రాజకీయాలను చెయ్యొద్దని చెప్పాను. వైయస్ జగన్ వలనే నేను కార్పోరేటర్ అయ్యాను అని వైఎస్సార్సీపీ కార్పొరేటర్ శశికళ ఈ ఉదయం ఓ వీడియో విడుదల చేశారు కూడా. ఓటింగ్‌కు ముందు వాస్తవ బలాబలాలువైఎస్సార్సీపీ 58 టీడీపీ 29జనసేన 3బీజేపీ 1సీపీఐ 1సీపీఎం 1ఇండిపెండెన్స్ 4.ఖాళీలు 1.జీవీఎంసీలో 98 మంది కార్పొరేటర్లుజీవీఎంసీలో 14 మంది ఎక్స్ ఆఫీషియో సభ్యులుటీడీపీకి 11 మంది సభ్యులు ఉన్నారు.. వీరిలో 8 మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఒక ఎమ్మెల్సీ..వైఎస్సార్సీపీకి ముగ్గురు ఎక్స్ అఫీషియ సభ్యులు.ఎంపీ గొల్ల బాబురావు, ఇద్దరు, ఎమ్మెల్సీలు పండుల రవీంద్రబాబు, కుంభ రవిబాబు..ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం జీవీఎంసీ సభ్యుల సంఖ్య బలం 97+14= 111అవిశ్వాసం నెగ్గేందుకు 2/3 మెజారిటీ అంటే 74 మంది సభ్యులు అవసరం..ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి వైఎస్సార్సీపీ మొత్తం బలం 61ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి కూటమి మొత్తం బలం 48ఎన్నికకు దూరంగా ఇద్దరు సీపీఎం, సీపీఐ సభ్యులు.

ఒక్కరికీ కామన్ సెన్స్ లేదు.. ఇంత చెత్తగా ఆడతారా?: సెహ్వాగ్ ఫైర్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటర్ల తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ (Virender Sehwag) ఆగ్రహం వ్యక్తం చేశాడు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో నిర్లక్ష్యపు షాట్లతో వికెట్లు పారేసుకున్నారని.. ఒక్కరు కూడా బుద్ధిని ఉపయోగించలేకపోయారంటూ ఘాటుగా విమర్శించాడు.హోం గ్రౌండ్లో వరుస పరాజయాలు కాగా సొంత మైదానంలో ఇతర జట్లు ఇరగదీస్తుంటే ఆర్సీబీ మాత్రం.. హోం గ్రౌండ్లో వరుస పరాజయాలు నమోదు చేస్తోంది. తాజాగా చిన్నస్వామి స్టేడియంలో శుక్రవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పాటిదార్ సేన ఓటమిపాలైంది. వర్షం ఆటంకం కలిగించిన నేపథ్యంలో ఈ పోరును 14 ఓవర్లకు కుదించారు.పెవిలియన్‌కు క్యూ ఈ క్రమంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి ఆరంభంలోనే వరుసగా షాకులు తగిలాయి. పంజాబ్ పేసర్ అర్ష్‌దీప్ బౌలింగ్‌లో ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (4), విరాట్ కోహ్లి (Virat Kohli- 1) వెనువెంటనే వెనుదిరిగారు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ రజత్ పాటిదార్ (23) నిలదొక్కుకునే ప్రయత్నం చేయగా చహల్ అతడిని పెవిలియన్‌కు చేర్చాడు.2️⃣ sharp catches 🫡2️⃣ early strikes ✌Arshdeep Singh and #PBKS with a solid start ⚡Updates ▶ https://t.co/7fIn60rqKZ #TATAIPL | #RCBvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/jCt2NiuYEH— IndianPremierLeague (@IPL) April 18, 2025 డేవిడ్ మెరుపుల వల్లమిగిలిన వాళ్లలో లియామ్ లివింగ్‌స్టోన్ (4), జితేశ్ శర్మ (2), కృనాల్ పాండ్యా (1) పూర్తిగా విఫలం కాగా.. ఆఖర్లో టిమ్ డేవిడ్ మెరుపులు మెరిపించాడు. 26 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 50 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా ఆర్సీబీ 14 ఓవర్లలో 95 పరుగులు చేయగలిగింది.𝘽𝙊𝙊𝙈 💥Nehal Wadhera is in a hurry to finish it for #PBKS 🏃Updates ▶ https://t.co/7fIn60rqKZ #TATAIPL | #RCBvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/upMlSvOJi9— IndianPremierLeague (@IPL) April 18, 2025ఇక లక్ష్య ఛేదనలో ఆరంభంలో తడబడినా నేహాల్ వధేరా ధనాధన్ ఇన్నింగ్స్ (19 బంతుల్లో 33 నాటౌట్) కారణంగా.. పంజాబ్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ నేపథ్యంలో పంజాబ్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్ల తీరుపై వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు.ఒక్కరికీ కామన్ సెన్స్ లేదు.. ఇంత చెత్తగా ఆడతారా?‘‘ఆర్సీబీ బ్యాటింగ్ మరీ తీసికట్టుగా ఉంది. జట్టులోని ప్రతి ఒక్కరు నిర్లక్ష్యపు షాట్లు ఆడారు. ఒక్కరంటే ఒక్కరు కూడా.. మంచి బంతికి అవుట్ కాలేదు. అంతా సాధారణ బంతులే ఆడలేక పెవిలియన్ చేరారు.ఆర్సీబీ బ్యాటర్లలో ఒక్కరైనా కామన్ సెన్స్ ఉపయోగించి ఉంటే బాగుండేది. వాళ్ల చేతిలో గనుక వికెట్లు ఉండి ఉంటే స్కోరు 14 ఓవర్లలో కనీసం 110- 120గా ఉండేది. తద్వారా విజయం కోసం పోరాడే పరిస్థితి ఉండేది. కానీ వీళ్లు మాత్రం చేతులెత్తేశారు.సొంత మైదానంలో ఆర్సీబీ గెలవలేకపోతోంది. పాటిదార్ ఇందుకు పరిష్కారాన్ని కనుగొనాలి. నిజానికి ఆర్సీబీ బౌలర్లు బాగానే ఆడుతున్నారు. కానీ బ్యాటర్లే చిత్రంగా ఉన్నారు. సొంత మైదానంలో అందరూ వరుసగా విఫలమవుతున్నారు’’ అని క్రిక్‌బజ్ షోలో సెహ్వాగ్ పేర్కొన్నాడు. ఇటు కోహ్లి.. అటు భువీకాగా ఈ సీజన్లో ఇప్పటికి ఏడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఆర్సీబీ నాలుగు గెలిచి పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇక ఈ సీజన్లోనూ ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి జట్టు తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లలో కలిపి అతడు 249 పరుగులు సాధించాడు. ఇక కోహ్లి ఓపెనింగ్ జోడీ అయిన ఫిల్ సాల్ట్ 212 పరుగులతో రెండో స్థానంలో ఉండగా.. కెప్టెన్ పాటిదార్ ఇప్పటికి 209 పరుగులు సాధించాడు. బౌలర్లలో ఆర్సీబీ తరఫున భువనేశ్వర్ కుమార్ టాప్‌లో ఉన్నాడు. ఈ సీజన్లో భువీ ఇప్పటి వరకు ఎనిమిది వికెట్లు తీశాడు.చదవండి: సంజూతో విభేదాలు!.. స్పందించిన రాహుల్ ద్రవిడ్

చంద్రబాబు చెవిలోనైనా ఆ విషయం చెబుతారా?
భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ ప్రభుత్వంపై చేసిన సంచలన వ్యాఖ్యలు ఆశ్చర్యంగా ఉన్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వద్ద కంచ గచ్చిబౌలి వద్ద ఉన్న 400 ఎకరాల భూమికి సంబంధించి ఒకవైపు సుప్రింకోర్టు విచారణ జరుపుతుండగా, ప్రధానమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న తలెత్తుతుంది. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అడవులపై బుల్డోజర్లు ప్రయోగిస్తోందని మోదీ ఆరోపించారు. అక్కడ జంతువులను ప్రమాదంలో పడేసేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. తాము పర్యావరణాన్ని కాపాడుతుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అటవీ సంపదను నాశనం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. అయితే.. .. ఏపీలో కూటమి ప్రభుత్వం(AP Kutami Prabhutvam) ఇప్పటికే 33 వేల ఎకరాల పచ్చటి పంటల భూములను పర్యావరణంతో సంబంధం లేకుండా నాశనం చేస్తే మద్దతు ఇచ్చిన బీజేపీ పెద్దలకు.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి నైతికంగా అర్హత ఎంత మేర ఉంటటుందన్నది ఆలోచించుకోవాలి. అది చాలదన్నట్లుగా మరో 45 వేల ఎకరాలు సమీకరిస్తామని బాబు సర్కార్ చెబుతుంటే కనీసం స్పందించని బీజేపీ.. తెలంగాణలో రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 👉అయినా తెలంగాణలో బీజేపీ నేతలు ప్రతిపక్షంలో ఉన్నారు కనుక విమర్శలు, ఆరోపణలు చేస్తే చేయవచ్చు. కాని దేశ ప్రధాని అంతటివారు ఈ వివాదంలో వేలు పెట్టడం పద్దతేనా?. అది సుప్రీం కోర్టు విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందా? ఉండదా? అనే చర్చకు ఆస్కారం ఇస్తోంది. హామీలు అమలు చేయకుండా రేవంత్ సర్కార్ బుల్డోజర్లను వాడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ పాలిత ప్రాంతాలలో అభివృద్ది పరుగులు తీస్తోందని ఆయన అన్నారు. బీజేపీ రాష్ట్రాలను పొగుడుకుంటే పొగుడుకోవచ్చు. కాని ప్రతిపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాలపై మోదీ అధిక విమర్శలు చేయడం ద్వారా ఆయనలోని రాజకీయ నేత కోణం అంతగా మంచి పేరు తేకపోవచ్చు. ఉత్తరప్రదేశ్ తదితర కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలలో నేరస్తుల పేరుతో ఇళ్లను ఇష్టారాజ్యంగా కూల్చివేస్తున్న తీరుపై చాలా అసంతృప్తి ఉంది. సుప్రీంర్టు సైతం దీనిపై పలుమార్లు వ్యతిరేక వ్యాఖ్యలు చేసింది. ఆ విషయాలను మోదీ గమనంలోకి తీసుకుంటారో లేదో తెలియదు. రేవంత్ ప్రభుత్వం కంచ గచ్చి బౌలి భూముల విషయంలో అనుసరిస్తున్న వైఖరి సరైనదా? కాదా? అనేది ఇక్కడ చర్చ కాదు. దానిని సమర్ధించవచ్చు. వ్యతిరేకించవచ్చు. స్థానిక ప్రజలు తమ అభీష్టాన్ని ప్రభుత్వానికి చెప్పవచ్చు. అది వేరే సంగతి. కాని గతంలో దేశ ప్రధానులలో ఎవరూ ఇలా రాష్ట్రాలపై తరచు విమర్శలు చేసినట్లు అనిపించదు. ఎన్నికల సమయంలో పార్టీ పరంగా, విధానపరంగా విమర్శలు,ప్రతి విమర్శలు చేయడానికి వారు ప్రాధాన్యత ఇచ్చి ఉండవచ్చు. అంతే తప్ప, ఏ రాష్ట్రానికి వెళ్లినా అదే పనిలో ఉండడం గతంలో ఈ స్థాయిలో ఉండేది కాదని చెప్పవచ్చు. లేదా మహా అయితే పరోక్షంగా ఏమైనా ఒకటి,రెండు విమర్శలు చేసి ఉండొచ్చు. 👉మన్మోహన్ సింగ్(Manmohan Singh) ప్రధానిగా ఉన్నప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలపై పనికట్టుకుని ఆరోపణలు చేసేవారుకాదు. కాకపోతే సింగ్ బ్యూరోక్రాట్ నుంచి రాజకీయనేతగా మారారు. మోదీ మొదట ఆర్ఎస్ఎస్ లో ఉండి ,తదుపరి రాజకీయ నేతగా ఎదిగారు. ఆ సంగతి ఎలా ఉన్నా, తెలంగాణలోని కంచ గచ్చిబౌలి వద్ద 400 ఎకరాల భూమిపై వివాదం ఏర్పడిన మాట నిజం. ఆ భూములలోఎలాంటి పనులు చేపట్టవద్దని పలువురు కోరిన సంగతి కూడా నిజమే. దానిపై కేంద్రప్రభుత్వపరంగా ఏవైనా ఆలోచనలు ఉంటే వాటిని సజెస్ట్ చేస్తూ రాష్ట్రానికి లేఖ రాసి ఉండవచ్చు. కాని అవేవీ చేయలేదు. 👉తెలంగాణ బీజేపీ నేతలు(Telangana BJP) ఏ విమర్శలు చేశారో వాటినే ప్రధాని మోదీ కూడా చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నదాని ప్రకారం అవి అసలు అటవీశాఖ భూములే కాదు. ప్రభుత్వ భూములని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తర్వాతే అక్కడ కొన్ని కార్యకలాపాలు చేపట్టడం జరిగింది. ఆ భూముల ఆధారంగా పదివేల కోట్ల రుణ సమీకరణ కూడా చేశారు. ఈలోగా దీనిపై యూనివర్శిటీలో విద్యార్దులు వ్యతిరేకించి ,ఆ భూమి కూడా సెంట్రల్ యూనివర్శిటీకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. దానికి బీజేపీ, బీఆర్ఎస్లు మద్దతు ఇవ్వడం, సడన్‌గా సుప్రీం కోర్టు కూడా సుమోటోగా జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు ఇవ్వడం జరిగింది. దీనికి రేవంత్ సర్కార్ బదులు ఇస్తూ కంచగచ్చిబౌలి(kanche Gachibowli) భూములు అటవీ భూములు కాదని, ప్రభుత్వం అధీనంలో ఉన్న భూములని స్పష్టం చేసింది. అక్కడ జంతువులకు ఆవాసం లేదని,వాటికి తగు రక్షణ కల్పించడానికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. 👉ఇక్కడ కొట్టేసిన చెట్లు నిషేదిత జాబితాలో లేవని కూడా ప్రభుత్వం చెబుతోంది. అయితే సుప్రీం కోర్టు దీనిపై కూడా అంత సంతృప్తి చెందలేదు. చెట్లు కొట్టివేయడానికి అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నించింది. ఆ కేసు ఇంకా పూర్తి కాలేదు..కాని ఈలోగా ప్రధాని మోదీ అవి అడవులని, అక్కడ జంతువులు ఉన్నాయని, అడవిని, జంతువులను కాంగ్రెస్ ప్రభుత్వం హరిస్తోందని రాజకీయంగా మాట్లాడడం పద్దతేనా అనే అభిప్రాయం కలుగుతుంది. తెలంగాణలో అధికారం సాధించాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తుండవచ్చు. దానికి తగిన విధంగా రాజకీయ వ్యూహాలు అమలు చేస్తుంటారు. తెలంగాణకు వచ్చినప్పుడు కాంగ్రెస్‌పై మోదీ విమర్శలు చేస్తే అదో తరహా. కాని ఎక్కడో హర్యానాలో ఒక సభలో మాట్లాడుతూ ఈ విమర్శలు చేశారు. నిజంగానే పర్యావరణంపైన ప్రధానమంత్రికి అంత శ్రద్దాసక్తులు ఉన్నట్లయితే ఏపీలో రాజధాని పేరుతో 33వేల ఎకరాలు సమీకరించినప్పుడు బిజెపి ఎందుకు అభ్యంతరం చెప్పలేదు?. మోదీ స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసి వెళ్లారే. అవసరమైనమేర ప్రభుత్వ భూమిని వాడుకుంటే మంచిదని అప్పట్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మోడీ ఎందుకు సలహా ఇవ్వలేదు. ఆ తర్వాత టీడీపీ, బీజేపీ విడిపోయాక.. పోలవరం, అమరావతి టీడీపీ నేతలకు ఏటీఎంగా మారాయని ఆయనే ఆరోపించారు కదా?. ఆ తర్వాత 2024లో మళ్లీ పొత్తు పెట్టుకున్నాక అవన్ని తూచ్ అయిపోయినట్లనుకోవాలా?. ఇంతకుముందు తీసుకున్న 33 వేల ఎకరాలు కాకుండా,మరో 45వేల ఎకరాల భూమి సమీకరించడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించడం సరైనదా? కాదా? అనేదానిపై మోదీ మాట్లాడడానికి సిద్దంగా ఉంటారా?. మరోసారి రాజధాని పనులకు శంకుస్థాపన చేయడానికి ప్రధాని మే 2 న వస్తారట.అప్పుడైనా పర్యావరణానికి విఘాతం కలిగేలా ఇన్నివేల ఎకరాల భూములు ఎందుకు?అక్కడ పంటలను ఎందుకు నాశనం చేస్తున్నారు? పక్కనే ఉన్న కృష్ణానది మరింత కలుషితంగా మారడానికి ఈ చర్య అవకాశం ఇస్తుంది కదా? అని ప్రధాని ప్రశ్నించితే.. తెలంగాణ భూములపై చేసిన వ్యాఖ్యలను సమర్దించవచ్చు. అలా కాకపోతే అవకాశవాద రాజకీయాలకే ప్రధాని ప్రాధాన్యం ఇస్తున్నారన్న సంగతి ప్రజలకు తెలిసిపోదా?. తెలంగాణలో ఒక రకంగా, ఏపీలో మరో రకంగా మాట్లాడితే మోదీకి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.., ఉప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లకు మద్య తేడా ఏముంటున్నదన్న ప్రశ్న వస్తుంది. ఏది ఏమైనా ప్రతి అంశంలోను పార్టీపరంగా కాకుండా దేశ ,రాష్ట్ర ప్రయోజనాలను గమనంలోకి తీసుకుని ప్రధాని మోదీ వ్యవహరిస్తే బాగుంటుంది కదా!:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

హీరో అజిత్‌కు మరోసారి కారు ప్రమాదం.. వీడియో వైరల్
తమిళ స్టార్ హీరో అజిత్ (Ajith Kumar) కారుకు మరోసారి ప్రమాదం జరిగింది. బెల్జియం కారు రేసింగ్‌లో అజిత్ నడుపుతున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జవగా అజిత్ సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.కారు రేసింగ్‌లో అజిత్ పలుమార్లు ప్రమాదానికి గురయ్యాడు. ఇటీవల మార్చిలో స్పెయిన్‌లో జరిగిన రేసింగ్‌లో కారు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ రేసింగ్‌లో.. మరో కారును తప్పించే క్రమంలో అజిత్ కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో ఆయన కారు ట్రాక్ తప్పి పల్టీలు కొట్టింది. అక్కడున్న సిబ్బంది వెంటనే అలర్ట్ అవడంతో అజిత్ సురక్షితంగా బయటకు వచ్చాడు.సినిమాఅజిత్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ (Good Bad Ugly Movie) బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. తొమ్మిది రోజుల్లోనే రూ.200 కోట్ల కలెక్షన్స్ రాబట్టి అజిత్ కెరీర్లోనే టాప్ మూవీగా రికార్డు సృష్టించింది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటించింది. ప్రియ ప్రకాశ్ వారియర్, సునీల్, అర్జున్ దాస్ కీలక పాత్రలు పోషించారు. தல அஜீத்குமார் அவர்கள் கார் பந்தயத்தில் விபத்தில் சிக்கி நலமுடன் மீண்டு வந்தார் 🔥#Ajithkumar𓃵 #AjithKumar #AjithKumarRacing #GoodBadUgly pic.twitter.com/3RR4g5p8Up— Aadhi Shiva (@aadhi_shiva1718) April 19, 2025 చదవండి: నెలసరి నొప్పులు.. అబ్బాయిలు అస్సలు భరించలేరు: జాన్వీ కపూర్

ఫోన్ రీచార్జ్‌లకు జేబులు ఖాళీ!
ఫోన్ రీచార్జ్‌లకు వినియోగదారుల జేబులు ఖాళీ అయ్యే పరిస్థితులు త్వరలో రాబోతున్నాయి. దేశంలోని ప్రముఖ టెలికాం ఆపరేటర్లు అయిన భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా (విఐ) రానున్న డిసెంబర్ నాటికి తమ టారిఫ్‌లను 10-20% పెంచే అవకాశం ఉందని ఒక నివేదిక తెలిపింది.ఇది ఆరు సంవత్సరాలలో నాలుగో అతిపెద్ద టారిఫ్ పెంపు కానుంది. టెలికాం కంపెనీలు చివరిసారిగా 2024 జులైలో టారిఫ్‌లను పెంచాయి. 4G, 5G మౌలిక సదుపాయాలపై పెట్టిన పెట్టుబడులను రాబట్టుకునేందుకు, ఆదాయాన్ని పెంచుకునేందుకు 25 శాతం వరకూ టెలికాం సంస్థలు టారిఫ్‌లను పెంచాయి.గ్లోబల్ బ్రోకరేజీ సంస్థ బెర్న్‌స్టీన్ విశ్లేషకుల ప్రకారం.. భారత్‌లో టెలికాం టారిఫ్‌లలో సుమారు 15% పెంపు ఉండే అవకాశం ఉంది. టెలికాం కంపెనీలు 10% టారిఫ్ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సాధించడానికి టారిఫ్‌ల పెంపు దోహదపడనున్నది. ఇండియన్ టెలికాం మార్కెట్లో పోటీ తీవ్రత కారణంగా టారిఫ్‌లు గత కొన్ని సంవత్సరాలుగా తక్కువగా ఉన్నాయని, దీనిని సరిదిద్దేందుకు ఈ చర్య తీసుకోవాలని ఆపరేటర్లు భావిస్తున్నారు. అయితే టారఫ్‌ల పెంపు కారణంగా వినియోగదారులపై ఆర్థిక భారం పడే అవకాశం ఉందని, దీని ప్రభావం వినియోగ శక్తి, మార్కెట్ డైనమిక్స్‌పైనా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.టెలికాం రంగ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, భవిష్యత్ సాంకేతిక అవసరాల కోసం పెట్టుబడులను సమర్థించేందుకు టారిఫ్‌ల పెంపు అవసరమని టెలికాం ఆపరేటర్లు పేర్కొంటున్నారు. అయితే, ఈ నిర్ణయం ఖరారు కాకపోయినా, ఇది వినియోగదారుల మధ్య చర్చనీయాంశంగా మారింది. మరింత సమాచారం రానున్న నెలల్లో టెలికాం ఆపరేటర్ల నుండి వెల్లడవుతుందని భావిస్తున్నారు.

Mulberry మల్బరీ జ్యూస్ : ఆరోగ్య ప్రయోజనాలు
తియ్య తియ్యగా... పుల్ల పుల్లగా ఉండే మల్బరీ పండ్లు అన్ని కాలాలలోనూ అందుబాటులో ఉంటాయి. మల్బరీ పండ్లతో చేసిన జ్యూస్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. అవేమిటో చూద్దాం..మల్బరీతో ఆరోగ్య ప్రయోజనాలుమల్బరీలో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచి మలబద్ధకం, కడుపులో మంటలను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి మల్బరీ యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉండి రక్తనాళాల పనితీరును మెరుగుపరచి రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. తద్వారా స్ట్రోక్స్, గుండెపోటు వంటి సమస్యలను నివారిస్తుంది.ఇదీ చదవండి: ప్రియుడితో మాజీ సీఎం కుమార్తె పెళ్లి : వైభవంగారోగనిరోధక శక్తి పెంపు: మల్బరీ లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలోని వ్యాధులకు వ్యతిరేకంగా శక్తిమంతమైన రక్షణను అందిస్తుంది.ఎముకల ఆరోగ్యానికి: మల్బరీలోని విటమిన్ కె, కాల్షియం, ఐరన్ వంటి ఖనిజాలు ఎముకల ఆరోగ్యానికి మంచిది.కంటి చూపు మెరుగు: మల్బరీ జ్యూస్‌లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది కాబట్టి ఇది తాగడం వల్ల చూపు మెరుగుపడుతుంది. కంప్యూటర్ ముందు గంటల తరబడి పనిచేసే వారికి కంటి ఒత్తిడిని తగ్గిస్తుంది.వేగంగా కోలుకోవడానికి తోడ్పడుతుంది: శస్త్రచికిత్స తర్వాత రోగులకు మల్బరీ జ్యూస్ చాలా ఉపయోగ కరంగా ఉంటుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, ఇన్ఫెక్షన్లు రాకుండా నివారిస్తుంది. జుట్టు సహజ రంగును నిలుపుకుంటుంది: మల్బరీ జుట్టులో మెలనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది జుట్టు సహజ రంగును నిలుపుకోవడానికి సహాయ పడుతుంది, జుట్టు నెరిసిపోవడాన్ని తగ్గిస్తుంది.చదవండి: ఇషా అంబానీ డైమండ్ థీమ్డ్ లగ్జరీ ఇల్లు : నెక్ట్స్ లెవల్ అంతే!మెదడు ఆరోగ్యానికి మంచిది: మల్బరీలో న్యూరో ప్రొటెక్టివ్ లక్షణాలను కలిగి ఉన్న వివిధ బయో యాక్టివ్ సమ్మేళనాలు మెదడు కణాలను ఒత్తిడి నుంచి రక్షించి ఐక్యూను మెరుగుపరుస్తాయి. మల్బరీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కణాలను ఆక్సీకరణ ఒత్తిడి, నష్టం నుంచి రక్షించడంలో సహాయపడతాయి. ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. నోట్ : చివరగా... ప్రయోజనాలు ఉన్నాయి కదా అని ఈ జ్యూస్‌ని విపరీతంగా తాగ కూడదు. పరిమితి పాటించడం మంచిది.

సుప్రీం కోర్టే చెప్పింది, ఇక ములాఖత్‌లో ఏకాంతంగా..
‘‘ఖైదీలతో జైళ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. వాళ్ల మానసిక ఆరోగ్యం ఏమాత్రం బాగుండడం లేదు. కుటుంబాలతో వాళ్ల బంధాలు బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే భాగస్వాములతో శారీరకంగా కలిసేందుకు అనుమతి ఇవ్వండి. పైగా అది వాళ్లకు ఉన్న హక్కు కూడా’’ అంటూ ఇటలీ సుప్రీం కోర్టు(Italy Constitution Court) తాజాగా ఇచ్చి తీర్పు ఇది. ఈ తీర్పునకు అనుగుణంగానే.. ఇటలీ జైళ్లలో శుక్రవారం నుంచి శృంగార గదులు(S*X Rooms) అందుబాటులోకి వచ్చాయి. ఉంబ్రియా రీజియన్‌లోని జైలులో ఓ ఖైదీని తన భార్యతో కలిసేందుకు అధికారులు అనుమతించారు. ఇందుకోసం అక్కడే లవ్ రూమ్(Love Rooms) పేరిట ఓ గదిని ఏర్పాటు చేయించారు. సాధారణంగా ములాఖత్‌ల టైంలో పక్కనే గార్డులు పర్యవేక్షిస్తుంటారు. కానీ, ఈ ఏకాంత ములాఖత్‌లో ఎవరూ పక్కన ఉండడానికి వీల్లేదు. న్యాయ శాఖ ఈ తరహా ఏర్పాట్లకు సంబంధించి మార్గదర్శకాలను కూడా రూపొందించడం గమనార్హం.ఉత్తర ఇటలీలోని అస్టి కారాగారంలో ఉన్న ఓ ఖైదీ తాను మానసికంగా ఎంతో కుంగిపోయి ఉన్నానని, తనను తన భార్యతో శారీరకంగా కలిసేందుకు అనుమతించాలని ట్యూరిన్ కోర్టులో పిటిషన్ వేశాడు. అయితే అది తిరస్కరణకు గురైంది. దీంతో అతను ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. అక్కడ అతనికి అనుకూలంగా తీర్పు వచ్చింది. తాజా గణాంకాల ప్రకారం.. ఇటలీ వ్యాప్తంగా జైళ్లలో 62 వేలమంది ఖైదీలు ఉన్నారు. ఇది జైళ్ల సామర్థ్యం కంటే 21 శాతం ఎక్కువ. అంతేకాదు తరచూ ఖైదీలు బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇందుకు మానసిక ఒత్తిడే కారణంగా తెలుస్తోంది. అయితే.. ఖైదీలకు కూడా హక్కులు ఉంటాయని, వాటిని అడ్డుకోవాలని చూడొద్దని జైళ్ల శాఖను కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే శృంగారానికి అనుమతించాలని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో ప్రిజనర్స్ రైట్స్ గ్రూప్ సంబురాలు చేసుకుంటోంది.అయితే ఈ తరహా ఏర్పాట్లు ఇటలీ(Italy)లోనే మొదటిసారి కాదు. ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్‌లాంటి యూరప్ దేశాల్లో ఈ తరహా ఏర్పాట్లు ఎప్పటి ుంచో ఉన్నాయి.
అధికారంలో ఉన్నప్పుడు విజయసాయే చక్రం తిప్పింది
అయ్యో ఎంత విషాదం : కన్నీటి సుడుల మధ్య ప్రియురాలితో పెళ్ళి
ఏపీ ఎమ్మెల్యేకు హైడ్రా షాక్
ఇంకెంత కాలం జాబ్ చేస్తారు.. ఇకనైనా మారండి
ఒక్కరికీ కామన్ సెన్స్ లేదు.. ఇంత చెత్తగా ఆడతారా?: సెహ్వాగ్ ఫైర్
కంగారు పడకు! నేనే ఈ సారి ఎండలు కాస్త ఎక్కవగా ఉన్నాయ్!
కోటి రూపాయల ఇళ్లే కొంటున్నారు..!
మేమేం పాపం చేశామమ్మా..
అబ్రకదబ్ర.. అంటే ఏంటో తెలుసా?
మంత్రులు పొంగులేటి, జూపల్లి పర్యటనలో అపశృతి
ఆ బంగారం మర్చిపోండి.. ఈ లోహమే ‘భవిష్యత్ బంగారం’
RCB VS PBKS: చరిత్ర సృష్టించిన అర్షదీప్ సింగ్
వావి వరసలు మరచి.. కూతురి మామతో ప్రేమాయణం..
ఈ రాశి వారికి వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ కృషి ఫలిస్తుంది.
అయ్యో! ఆగండయ్యా! అది అప్పుడు ఇప్పుడు మనం వాళ్ల కూటమిలో ఉన్నాం!
చల్లటి కబురు!
'పుష్ప 2' వీఎఫ్ఎక్స్ వీడియో రిలీజ్
ఝూటా వకీల్ సాబ్ పతనం మొదలైందా?
పీఎం మోదీ ఏసీ యోజన: కొత్త AC కొనుగోలుపై డిస్కౌంట్
హ్యాట్రిక్ కొట్టిన బంగారం.. తులం ఎంతకు చేరిందంటే..
మామిడి తోటలో మృత్యువు కాటేసింది
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' మూవీ రివ్యూ
BCCI: ఫిక్సింగ్ యత్నం.. బీసీసీఐ ఆగ్రహం.. అతడిపై నిషేధం
రెండో పెళ్లి చేసుకున్న ప్రముఖ యాంకర్, ఫోటోలు వైరల్
అమెరికా పౌరుడినని చెప్పినా వదలని ఐసీఈ
వెనక్కి తగ్గని ఐఏఎస్ స్మితా సబర్వాల్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుస రీట్వీట్లు
‘నన్ను బలవంతంగా తీసుకెళ్లారు’
ఆ సమయంలో చాలా బాధపడ్డాను: సమంత
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో అత్యధిక పారితోషికం అతడిదే.. ఐపీఎల్‌తో పోలిస్తే..!
మీరు కొత్త చట్టం కనిపెట్టారు.. హైకోర్టుపై సుప్రీంకోర్టు సీరియస్
అవసరాలకు అప్పు ఇచ్చి.. భార్యను లొంగదీసుకున్నాడు..
'గుడ్ బ్యాడ్ అగ్లీ' కలెక్షన్స్.. అజిత్ కెరీర్లో ఇదే టాప్
GVMC: అడ్డదారిలో అవిశ్వాసం నెగ్గిన కూటమి
వచ్చేస్తోంది EPFO 3.0: ప్రయోజనాలెన్నో..
జేఈఈ మెయిన్‌లో తెలుగు తేజాలు
ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు.. ఆ మూడు స్పెషల్
అల్లుడితో కలిసి 7 ఎకరాలు కొన్న బాలీవుడ్ నటుడు.. ఎక్కడంటే?
కమిన్స్, స్టార్క్ కాదు!.. అతడిని ఎదుర్కోవడమే అత్యంత కష్టం: రోహిత్
విశ్వమూ భ్రమిస్తోంది
కేఎల్ రాహుల్ ముద్దుల కూతురు.. పేరు రివీల్ చేసిన అతియాశెట్టి!
కొండాపూర్, వనస్థలిపురంలో హైడ్రా కూల్చివేతలు..
సంజూతో విభేదాలు!.. స్పందించిన రాహుల్ ద్రవిడ్
రూ. 50 కోట్ల కుక్క.. ఈడీ దాడులు!
ఏపీలో మరో ట్విస్ట్.. కొత్త రకం పన్ను వేసిన మాధవి రెడ్డి
ఇషా అంబానీ డైమండ్ థీమ్డ్ లగ్జరీ ఇల్లు : నెక్ట్స్ లెవల్ అంతే!
ఉపాధి హామీ పనులు.. 17జిల్లాలు అప్.. 15జిల్లాలు డౌన్..
మూతపడిన జిందాల్ స్టీల్స్
వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్స్
వేములవాడ రాజన్నకు కొత్త గుడి
రూ. 3 వేల కోట్ల భూమి కేవలం రూ.59కే..
ఇంటర్వ్యూ స్లాట్లు అదృశ్యం
వైరల్: వధువు తెగించేసింది భయ్యా! వరుడి నోట్లో నోరు పెట్టి..
అనేక విషాద గాథల మధ్య.. స్ఫూర్తినిచ్చే జ్యోతి, శోభనాద్రి దాంపత్యం!
విశాఖ ఉక్కు.. అమరావతి నిర్మాణాలకు పనికిరాదా?.. కార్మికుల ఆగ్రహం
మూడు బ్యాంకులపై ఆర్బీఐ కొరడా: భారీ జరిమానా..
చైనా పై 245 శాతం సుంకాలు విధించిన అమెరికా
'డియర్ ఉమ' రివ్యూ.. మంచి ప్రయత్నం
‘మీరు పనులు చేయకపోతే.. న్యాయ వ్యవస్థ చూస్తూ కూర్చోవాలా?’
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ఫస్ట్ డే కలెక్షన్స్
పెరుగుతున్న మత సమ్మతి
ఏసీబీ వలలో నస్పూర్ ఎస్సై
IPL 2025: చెలరేగిన పంజాబ్ బౌలర్లు.. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆర్సీబీపై పంజాబ్ విజయం
‘అమిత్ షానే కాదు.. ఏ షా వచ్చినా మాకేం కాదు.. అది డీఎంకే పవర్’
యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ?: క్లారిటీ ఇచ్చిన కేంద్రం
రొయ్యకు లోకల్ మార్కెట్
బ్యాంకులకు నేడు సెలవు ఉందా?
'బురుజులు' ఎందుకు నిర్మించేవారో తెలుసా..?
సచిన్ రికార్డు బద్దలు కొట్టిన పాటిదార్.. ఐపీఎల్లో భారత తొలి బ్యాటర్‌గా..
అమ్మా..ఊపిరాడలేదు!
IPL 2025: సీఎస్కే అభిమానులకు అదిరిపోయే వార్త.. జట్టులోకి చిచ్చరపిడుగు
నీతా అంబానీ దగ్గరికి వెళ్లిన ఇషాన్.. మాజీ ఓనర్ రియాక్షన్ ఇదే!
చాలెంజర్స్‌పై పంజా...
రెడ్ మిర్చిలా మీనాక్షి చౌదరి.. మట్టికుండతో పూజాహెగ్డే
40+ ఉద్యోగులను టీసీఎస్ టార్గెట్ చేసిందా?
ఇద్దరు కొడుకుల గొంతుకోసి చంపి.. తల్లి ఆత్మహత్య
ఎవడ్రా కూసేది.. 2028 వరకు ఖాళీ లేదిక్కడ.. ఇచ్చిపడేసిన అనురాగ్ కశ్యప్
ఈ సైకిళ్లు ఎవరికి ఇవ్వాలి దేవుడా?
అర్జున్ చిన్నకూతురి ఎంగేజ్మెంట్.. 13 ఏళ్ల ప్రేమ అంటూ..
రోహిత్ శర్మకు ఫ్రెండ్.. సీనియర్లకు అతడి ప్రవర్తన నచ్చలేదు!
టీడీపీలో పొలిటికల్ వార్.. ఎమ్మెల్యే కారణంగా కీలక నేతల రాజీనామా!
భారత్‌లోకి వెల్లువలా చైనా ఉత్పత్తులు?
అందుకే ఓడిపోయాం.. అదే అతిపెద్ద గుణపాఠం: పాటిదార్
ప్రియురాలితో అమిర్ ఖాన్ సందడి.. టీమిండియా క్రికెటర్ గర్ల్‌ఫ్రెండ్ కూడా!
కంగారు పడకు! నేనే ఈ సారి ఎండలు కాస్త ఎక్కవగా ఉన్నాయ్!
తూటాకు బలైన భారతీయ విద్యార్థిని
హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు ఎంతలా పెరిగాయంటే..
వైద్యులే కంటతడి పెట్టేలా.. 11 ఏళ్ల బాలికపై అత్యాచారం
జర్మనీ అమ్మాయితో సూపర్ స్టార్ కొడుకు డేటింగ్
PSLతో పోలికా?.. ఐపీఎల్‌కు ఏదీ సాటి రాదు: ఇచ్చి పడేసిన ఇంగ్లండ్ స్టార్
విద్యార్థుల వీసాలపై పిడుగు
సూర్య 'రెట్రో' ట్రైలర్ రిలీజ్
'కోర్ట్' హీరో కొత్త మూవీ.. సైలెంట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్
'ఉత్తరాఖండ్‌లో ఆలయం.. ఊర్వశి రౌతేలాపై చర్యలు తీసుకోవాలి'
రాజధాని నిర్మాణ పనుల్లో.. రూ.9,000 కోట్ల ప్రజాధనానికి ’టెండర్’!
కాస్ట్ లీ కారు కొన్న ఏఆర్ రెహమాన్.. ధర ఎంతో తెలుసా?
మార్చిలో అధికంగా అమ్ముడైన టాప్ 5 మొబైళ్లు
భేతాళ కుట్రే.. బాబు స్క్రిప్టే
IPl 2025: 'మరీ అంత స్వార్ధం పనికిరాదు బ్రో.. నీ వల్లే రాజస్తాన్ ఓడిపోయింది'
ఉపాధ్యాయుల సర్దుబాటుకు రంగం సిద్ధం
భారత్‌కు షింకన్సెన్ రైళ్లు
సుప్రీం కోర్టే చెప్పింది, ఇక ములాఖత్‌లో ఏకాంతంగా..
రూ.10 వేలలోపు టాప్ 10 మొబైళ్లు
'ఇక మమ్మల్ని ఎవరూ విడదీయలేరు'
‘సీఐ పొన్నూరు భాస్కర్ నన్ను టార్చర్ చేశారు సర్’..కోర్టులో కృష్ణవేణి ఆవేదన
ఆ చట్టం కేవలం కోడళ్ల కోసమే చేయలేదమ్మా: అలహాబాద్ హైకోర్టు
గ్రూప్–1 నియామకాలు నిలిపివేయండి
దేశంలో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు
సౌర వ్యవస్థకు ఆవల జీవం!
ట్రిపుల్ ట్రీట్.. ఆర్య 3, కార్తికేయ 3.. ఇంకా ఎన్నెన్నో..
50 ఏళ్ల వయసులో పడుచుపిల్లలా ఖుష్బూ.. సీక్రెట్ అదే!
అధికారంలో ఉన్నప్పుడు విజయసాయే చక్రం తిప్పింది
అయ్యో ఎంత విషాదం : కన్నీటి సుడుల మధ్య ప్రియురాలితో పెళ్ళి
ఏపీ ఎమ్మెల్యేకు హైడ్రా షాక్
ఇంకెంత కాలం జాబ్ చేస్తారు.. ఇకనైనా మారండి
ఒక్కరికీ కామన్ సెన్స్ లేదు.. ఇంత చెత్తగా ఆడతారా?: సెహ్వాగ్ ఫైర్
కంగారు పడకు! నేనే ఈ సారి ఎండలు కాస్త ఎక్కవగా ఉన్నాయ్!
కోటి రూపాయల ఇళ్లే కొంటున్నారు..!
మేమేం పాపం చేశామమ్మా..
అబ్రకదబ్ర.. అంటే ఏంటో తెలుసా?
మంత్రులు పొంగులేటి, జూపల్లి పర్యటనలో అపశృతి
ఆ బంగారం మర్చిపోండి.. ఈ లోహమే ‘భవిష్యత్ బంగారం’
RCB VS PBKS: చరిత్ర సృష్టించిన అర్షదీప్ సింగ్
వావి వరసలు మరచి.. కూతురి మామతో ప్రేమాయణం..
ఈ రాశి వారికి వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ కృషి ఫలిస్తుంది.
అయ్యో! ఆగండయ్యా! అది అప్పుడు ఇప్పుడు మనం వాళ్ల కూటమిలో ఉన్నాం!
చల్లటి కబురు!
'పుష్ప 2' వీఎఫ్ఎక్స్ వీడియో రిలీజ్
ఝూటా వకీల్ సాబ్ పతనం మొదలైందా?
పీఎం మోదీ ఏసీ యోజన: కొత్త AC కొనుగోలుపై డిస్కౌంట్
హ్యాట్రిక్ కొట్టిన బంగారం.. తులం ఎంతకు చేరిందంటే..
మామిడి తోటలో మృత్యువు కాటేసింది
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' మూవీ రివ్యూ
BCCI: ఫిక్సింగ్ యత్నం.. బీసీసీఐ ఆగ్రహం.. అతడిపై నిషేధం
రెండో పెళ్లి చేసుకున్న ప్రముఖ యాంకర్, ఫోటోలు వైరల్
అమెరికా పౌరుడినని చెప్పినా వదలని ఐసీఈ
వెనక్కి తగ్గని ఐఏఎస్ స్మితా సబర్వాల్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుస రీట్వీట్లు
‘నన్ను బలవంతంగా తీసుకెళ్లారు’
ఆ సమయంలో చాలా బాధపడ్డాను: సమంత
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో అత్యధిక పారితోషికం అతడిదే.. ఐపీఎల్‌తో పోలిస్తే..!
మీరు కొత్త చట్టం కనిపెట్టారు.. హైకోర్టుపై సుప్రీంకోర్టు సీరియస్
అవసరాలకు అప్పు ఇచ్చి.. భార్యను లొంగదీసుకున్నాడు..
'గుడ్ బ్యాడ్ అగ్లీ' కలెక్షన్స్.. అజిత్ కెరీర్లో ఇదే టాప్
GVMC: అడ్డదారిలో అవిశ్వాసం నెగ్గిన కూటమి
వచ్చేస్తోంది EPFO 3.0: ప్రయోజనాలెన్నో..
జేఈఈ మెయిన్‌లో తెలుగు తేజాలు
ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు.. ఆ మూడు స్పెషల్
అల్లుడితో కలిసి 7 ఎకరాలు కొన్న బాలీవుడ్ నటుడు.. ఎక్కడంటే?
కమిన్స్, స్టార్క్ కాదు!.. అతడిని ఎదుర్కోవడమే అత్యంత కష్టం: రోహిత్
విశ్వమూ భ్రమిస్తోంది
కేఎల్ రాహుల్ ముద్దుల కూతురు.. పేరు రివీల్ చేసిన అతియాశెట్టి!
కొండాపూర్, వనస్థలిపురంలో హైడ్రా కూల్చివేతలు..
సంజూతో విభేదాలు!.. స్పందించిన రాహుల్ ద్రవిడ్
రూ. 50 కోట్ల కుక్క.. ఈడీ దాడులు!
ఏపీలో మరో ట్విస్ట్.. కొత్త రకం పన్ను వేసిన మాధవి రెడ్డి
ఇషా అంబానీ డైమండ్ థీమ్డ్ లగ్జరీ ఇల్లు : నెక్ట్స్ లెవల్ అంతే!
ఉపాధి హామీ పనులు.. 17జిల్లాలు అప్.. 15జిల్లాలు డౌన్..
మూతపడిన జిందాల్ స్టీల్స్
వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్స్
వేములవాడ రాజన్నకు కొత్త గుడి
రూ. 3 వేల కోట్ల భూమి కేవలం రూ.59కే..
ఇంటర్వ్యూ స్లాట్లు అదృశ్యం
వైరల్: వధువు తెగించేసింది భయ్యా! వరుడి నోట్లో నోరు పెట్టి..
అనేక విషాద గాథల మధ్య.. స్ఫూర్తినిచ్చే జ్యోతి, శోభనాద్రి దాంపత్యం!
విశాఖ ఉక్కు.. అమరావతి నిర్మాణాలకు పనికిరాదా?.. కార్మికుల ఆగ్రహం
మూడు బ్యాంకులపై ఆర్బీఐ కొరడా: భారీ జరిమానా..
చైనా పై 245 శాతం సుంకాలు విధించిన అమెరికా
'డియర్ ఉమ' రివ్యూ.. మంచి ప్రయత్నం
‘మీరు పనులు చేయకపోతే.. న్యాయ వ్యవస్థ చూస్తూ కూర్చోవాలా?’
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ఫస్ట్ డే కలెక్షన్స్
పెరుగుతున్న మత సమ్మతి
ఏసీబీ వలలో నస్పూర్ ఎస్సై
IPL 2025: చెలరేగిన పంజాబ్ బౌలర్లు.. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆర్సీబీపై పంజాబ్ విజయం
‘అమిత్ షానే కాదు.. ఏ షా వచ్చినా మాకేం కాదు.. అది డీఎంకే పవర్’
యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ?: క్లారిటీ ఇచ్చిన కేంద్రం
రొయ్యకు లోకల్ మార్కెట్
బ్యాంకులకు నేడు సెలవు ఉందా?
'బురుజులు' ఎందుకు నిర్మించేవారో తెలుసా..?
సచిన్ రికార్డు బద్దలు కొట్టిన పాటిదార్.. ఐపీఎల్లో భారత తొలి బ్యాటర్‌గా..
అమ్మా..ఊపిరాడలేదు!
IPL 2025: సీఎస్కే అభిమానులకు అదిరిపోయే వార్త.. జట్టులోకి చిచ్చరపిడుగు
నీతా అంబానీ దగ్గరికి వెళ్లిన ఇషాన్.. మాజీ ఓనర్ రియాక్షన్ ఇదే!
చాలెంజర్స్‌పై పంజా...
రెడ్ మిర్చిలా మీనాక్షి చౌదరి.. మట్టికుండతో పూజాహెగ్డే
40+ ఉద్యోగులను టీసీఎస్ టార్గెట్ చేసిందా?
ఇద్దరు కొడుకుల గొంతుకోసి చంపి.. తల్లి ఆత్మహత్య
ఎవడ్రా కూసేది.. 2028 వరకు ఖాళీ లేదిక్కడ.. ఇచ్చిపడేసిన అనురాగ్ కశ్యప్
ఈ సైకిళ్లు ఎవరికి ఇవ్వాలి దేవుడా?
అర్జున్ చిన్నకూతురి ఎంగేజ్మెంట్.. 13 ఏళ్ల ప్రేమ అంటూ..
రోహిత్ శర్మకు ఫ్రెండ్.. సీనియర్లకు అతడి ప్రవర్తన నచ్చలేదు!
టీడీపీలో పొలిటికల్ వార్.. ఎమ్మెల్యే కారణంగా కీలక నేతల రాజీనామా!
భారత్‌లోకి వెల్లువలా చైనా ఉత్పత్తులు?
అందుకే ఓడిపోయాం.. అదే అతిపెద్ద గుణపాఠం: పాటిదార్
ప్రియురాలితో అమిర్ ఖాన్ సందడి.. టీమిండియా క్రికెటర్ గర్ల్‌ఫ్రెండ్ కూడా!
కంగారు పడకు! నేనే ఈ సారి ఎండలు కాస్త ఎక్కవగా ఉన్నాయ్!
తూటాకు బలైన భారతీయ విద్యార్థిని
హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు ఎంతలా పెరిగాయంటే..
వైద్యులే కంటతడి పెట్టేలా.. 11 ఏళ్ల బాలికపై అత్యాచారం
జర్మనీ అమ్మాయితో సూపర్ స్టార్ కొడుకు డేటింగ్
PSLతో పోలికా?.. ఐపీఎల్‌కు ఏదీ సాటి రాదు: ఇచ్చి పడేసిన ఇంగ్లండ్ స్టార్
విద్యార్థుల వీసాలపై పిడుగు
సూర్య 'రెట్రో' ట్రైలర్ రిలీజ్
'కోర్ట్' హీరో కొత్త మూవీ.. సైలెంట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్
'ఉత్తరాఖండ్‌లో ఆలయం.. ఊర్వశి రౌతేలాపై చర్యలు తీసుకోవాలి'
రాజధాని నిర్మాణ పనుల్లో.. రూ.9,000 కోట్ల ప్రజాధనానికి ’టెండర్’!
కాస్ట్ లీ కారు కొన్న ఏఆర్ రెహమాన్.. ధర ఎంతో తెలుసా?
మార్చిలో అధికంగా అమ్ముడైన టాప్ 5 మొబైళ్లు
భేతాళ కుట్రే.. బాబు స్క్రిప్టే
IPl 2025: 'మరీ అంత స్వార్ధం పనికిరాదు బ్రో.. నీ వల్లే రాజస్తాన్ ఓడిపోయింది'
ఉపాధ్యాయుల సర్దుబాటుకు రంగం సిద్ధం
భారత్‌కు షింకన్సెన్ రైళ్లు
సుప్రీం కోర్టే చెప్పింది, ఇక ములాఖత్‌లో ఏకాంతంగా..
రూ.10 వేలలోపు టాప్ 10 మొబైళ్లు
'ఇక మమ్మల్ని ఎవరూ విడదీయలేరు'
‘సీఐ పొన్నూరు భాస్కర్ నన్ను టార్చర్ చేశారు సర్’..కోర్టులో కృష్ణవేణి ఆవేదన
ఆ చట్టం కేవలం కోడళ్ల కోసమే చేయలేదమ్మా: అలహాబాద్ హైకోర్టు
గ్రూప్–1 నియామకాలు నిలిపివేయండి
దేశంలో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు
సౌర వ్యవస్థకు ఆవల జీవం!
ట్రిపుల్ ట్రీట్.. ఆర్య 3, కార్తికేయ 3.. ఇంకా ఎన్నెన్నో..
50 ఏళ్ల వయసులో పడుచుపిల్లలా ఖుష్బూ.. సీక్రెట్ అదే!
సినిమా

'గుడ్ బ్యాడ్ అగ్లీ' కలెక్షన్స్.. అజిత్ కెరీర్లో ఇదే టాప్
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' (Good Bad Ugly) భారీ కలెక్షన్స్ సాధించింది. అజిత్ మూడు దశాబ్ధాల సినీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా ఈ చిత్రం నిలిచింది. ఏప్రిల్ 10న విడుదలైన ఈ చిత్రం కలెక్షన్స్‌ను తాజాగా మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేసింది. దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో అజిత్‌కు జోడీగా త్రిష మరోసారి మెరిసింది. ఈ సినిమాతో మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్‌తో పాటు సునీల్, అర్జున్ దాస్‌లకు కూడా ప్రత్యేక గుర్తింపు వచ్చింది.'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రం తొమ్మిదిరోజుల్లోనే రూ. 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి అజిత్ కెరీర్లోనే టాప్ చిత్రంగా నిలిచింది. బాక్సాఫీస్ షేకింగ్ కలెక్షన్స్ అంటూ చిత్ర నిర్మాణ సంస్థ ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. కలెక్షన్స్ పరంగా అజిత్ కెరీర్లో రూ. 200 కోట్ల క్లబ్లో చేరిన ఏకైక చిత్రంగా గుడ్ బ్యాడ్ అగ్లీ నిలిచింది. అయితే, ఇప్పటి వరకు అజిత్ కెరీర్లో టాప్-5 కలెక్షన్స్ సాధించిన చిత్రాలు ఇవే.. తెగింపు (రూ. 194 కోట్లు), విశ్వాసం (రూ.180 కోట్లు), వలిమై (రూ.152 కోట్లు), వివేకం (రూ. 121 కోట్లు), వేదాళం (రూ.119 కోట్లు) ఉన్నాయి. ఇప్పుడు 'గుడ్ బ్యాడ్ అగ్లీ' రూ. 200 కోట్లు రాబట్టడంతో ఆయన కెరీర్లోనే టాప్ చిత్రంగా నిలిచింది. మూడు దశాబ్దాల అజిత్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన దర్శకుడు అధిక్ రవిచంద్రన్‌కు ఆయన ఫ్యాన్స్ అభినందనలు తెలుపుతున్నారు.అజిత్ నెక్ట్స్ ప్రాజెక్ట్అజిత్ ప్రస్తుతం మరోసారి అంతర్జాతీయ స్థాయిలో కార్ రేసులో పాల్గొనడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో తన తదుపరి చిత్రాన్ని ఈ ఏడాది చివరిలో ప్రారంభించి 2026లో దీపావళి సందర్భంగా విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రాన్ని ఏ నిర్మాణ సంస్థ తీయనుంది.. ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాటేమిటి అన్నది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. కాగా నటుడు తాను ఎంతగా అభిమానిస్తున్నాను అన్న విషయాన్ని తెలిపేలా గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం చివర్లో ఒక మేకింగ్ వీడియోను దర్శకుడు అదిక్ రవిచంద్రన్ విడుదల చేశారు. అందులో ఈయన నటుడు అజిత్ కాళ్లకు నమస్కరించడం, ఆయన చేతుల్ని పట్టుకొని ముద్దాడడం వంటి దృశ్యాలు చోటుచేసుకున్నాయి. దీంతో నటుడు అజిత్ మళ్లీ అదిక్ రవిచంద్రన్‌కు అవకాశం ఇవ్వడం ఖాయం అనే టాక్ సినీ వర్గాల్లో వైరల్ అవుతోంది.The MASS SAMBAVAM is shaking the box office ❤🔥#GoodBadUgly hits 200 CRORES WORLDWIDE GROSS 💥💥Book your tickets for #GoodBadUgly now!🎟️ https://t.co/jRftZ6vpJD#200crGrossForGBU#BlockbusterGBU#AjithKumar @trishtrashers @MythriOfficial @Adhikravi @gvprakash… pic.twitter.com/CUrTW1NB2D— Mythri Movie Makers (@MythriOfficial) April 18, 2025

'డియర్ ఉమ' రివ్యూ.. మంచి ప్రయత్నం
తెలుగు చిత్రసీమలో తెలుగమ్మాయిలు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. హీరోయిన్గా మెరిసేందుకు చాలా కష్టపడుతుంటారు. అలాంటిది సుమయ రెడ్డి అయితే తన తొలి ప్రయత్నంలోనే హీరోయిన్గా, రచయితగా, నిర్మాతగా భిన్న పాత్రల్ని పోషించింది. 'డియర్ ఉమ' అంటూ ఏప్రిల్ 18న వచ్చిన ఈ చిత్రం రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. పృథ్వీ అంబర్, సుమయ రెడ్డి( Sumaya Reddy) హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని సాయిరాజేష్ మహాదేవ్ దర్శకత్వం వహించాడు. మరి ఈ సుమయ రెడ్డి తొలి ప్రయత్నం ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.కథేంటి..?గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగిన ఉమ (సుమయ రెడ్డి) వైద్య విద్యను పూర్తి చేసి సొంతంగా ఓ హాస్పిటల్ నిర్మించి తండ్రి కలను నెరవేర్చాలని అనుకుంటుంది. మరోవైపు దేవ్‌కు(పృథ్వీ అంబర్) మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. భవిష్యత్‌లో రాక్‌స్టార్ కావాలని ఎన్నో కలలు కంటాడు. కానీ, చదువులో చాలా వెనుకపడిపోతాడు. తన కాలేజీ సమయంలో దేవ్ ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే, మ్యూజిక్ కారణంగానే దేవ్‌కు ఆ అమ్మాయి బ్రేకప్ చెప్పి వెళ్లిపోతుంది. ప్రేమలో విఫలమైన దేవ్ రాక్ స్టార్ అవ్వాలనే ప్రయత్నంలో అంతగా సక్సెస్ కాలేకపోతాడు. చిన్నా చితకా అవకాశల కోసం గడపగడపకూ తిరుగుతుంటాడు. అలాంటి దేవ్‌కి ఓ సారి ఉమ డైరీ దొరుకుతుంది. తనకు గాయమై హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు తన జీవితం మారిందని.. అప్పటి నుంచే ఉమ జీవితం ఆగిపోయిందని తెలుసుకుంటాడు. అసలు ఉమకి ఏం జరిగింది..? ఉమ నేపథ్యం ఏంటి? ఉమ ఎక్కడి నుంచి వచ్చింది? ఏం చేస్తుండేది? అనే ప్రశ్నలతో సతమతం అవుతుంటాడు దేవ్. ఇక ఉమ కోసం దేవ్ చేసిన పోరాటం ఏంటి? ఉమతో దేవ్ ప్రేమ ప్రయాణం ఎక్కడి వరకు దారి తీస్తుంది? ఈ కథలో దేవ్ అన్న సూర్య (కమల్ కామరాజ్) పాత్ర ఏంటి..? అన్నది కథ.వైద్యం పేరుతో కార్పొరేట్ హాస్పిటల్స్ చేసే మోసాలకు లవ్‌స్టోరీని జోడించి డియర్ ఉమ కథను సుమయ రెడ్డి రాసుకుంది. ఈ కథను సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. వైద్య రంగంలోని లోపాలను ఎత్తిచూపుతూ తెరకెక్కించాడు. ప్రస్తుత కాలంలో జరుగుతున్న కొన్ని సంఘటనలను గుర్తుచేస్తూ, సామాన్య ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేలా కథను నడిపించారు. ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.ఎలా ఉందంటే..?రధన్ సంగీతం సినిమా మూడ్‌కు తగ్గట్టుగా ఉంది, అయితే, కొన్ని చోట్ల మరింత మెరుగ్గా ఉండాల్సింది. రాజ్ తోట కెమెరా వర్క్ సహజంగా ఉన్నప్పటికీ, కొన్ని ప్రత్యేకమైన షాట్స్ మిస్ అయినట్టు అనిపించవచ్చు. స్క్రీన్ ప్లే సినిమాకు ఒక బలంగా నిలిచింది, ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ ట్విస్ట్‌లు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. అయితే, క్లైమాక్స్‌లోని ఎమోషనల్ సన్నివేశాలు కొందరికి అతిగా అనిపించవచ్చు. పతాక సన్నివేశంలోని పాట సినిమా సందేశాన్ని స్పష్టంగా చెప్పినప్పటికీ, కథలో మరింత సహజంగా కలిసిపోయి ఉంటే బాగుండేది. మొత్తానికి, "డియర్ ఉమర్" ఒక మంచి ప్రయత్నం, కానీ కొన్ని అంశాలలో మరింత శ్రద్ధ పెడితే ఇది ఒక గొప్ప చిత్రంగా నిలిచేది. తొలి చిత్రమే అయినా సుమ చిత్ర ఆర్ట్స్, నిర్మాత సుమయ రెడ్డి గొప్ప కథను అందించడంలో సక్సెస్ అయ్యారు.డియర్ ఉమ చిత్రానికి సుమయ రెడ్డి ఆల్ రౌండర్ అని చెప్పుకోవచ్చు. మంచి కథను ఇవ్వడమే కాకుండా.. ఈ కథను అనుకున్నట్టుగా తీయడంలో ఖర్చు పెట్టిన నిర్మాతగానూ సుమయ రెడ్డి సక్సెస్ అయింది. సుమయ రెడ్డిలోని రచయిత, నిర్మాతకు వంద మార్కులు వేసుకోవచ్చు. ఇక నటిగా ఇంకాస్త మెరుగు పర్చుకోవాల్సి ఉంటుందేమో. తెరపై సుమయ రెడ్డి అందంగా కనిపించారు. హీరోగా పృథ్వీ అంబర్ యాక్షన్, ఎమోషన్ ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌ను పలికించాడు. కమల్ కామరాజ్ పాత్ర సర్ ప్రైజింగ్‌గా ఉంటుంది. అజయ్ ఘోష్ పాత్ర రొటీన్ అనిపిస్తుంది. ఫైమా, లోబో, సప్తగిరి, భద్రం పోషించిన పాత్రలు అక్కడక్కడా నవ్విస్తాయి. పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా డియర్ ఉమను చూస్తే తప్పకుండా మెప్పిస్తుంది.

మనకు 'పుష్ప' మాదిరే.. కోలీవుడ్‌లో కెప్టెన్ ప్రభాకరన్ ఉన్నాడు
తమిళ్ సినీ పుటల్లో లెక్కించబడిన చిత్రం కెప్టెన్ ప్రభాకరన్. దివంగత ప్రముఖ నటుడు విజయ్ కాంత్ కథానాయకుడిగా నటించిన 100వ చిత్రం కావడం గమనార్హం. సాధారణంగా స్టార్ హీరోలు నటించిన నూరవ చిత్రాలు ఆశించిన విజయాన్ని సాధించడం అన్నది అరుదే. అలాంటిది కెప్టెన్ ప్రభాకరన్ తమిళంలోనే కాకుండా ఇతర భాషల్లోనూ ఘన విజయాన్ని సాధించింది. పులన్ విచారణపై చిత్రం తర్వాత దర్శకుడు ఆర్కే సెల్వమణి మరో బ్రహ్మాండ సృష్టి ఈ చిత్రం. నటుడు విజయ్ కాంత్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిపోయిన చిత్రం కెప్టెన్ ప్రభాకరన్. అందుకే ఈ చిత్రం జ్ఞాపకంగా నటుడు విజయ్ కాంత్ తన పెద్ద కుమారుడికి విజయ్ ప్రభాకరన్ అని పేరు పెట్టారు. కాగా ఈ చిత్రం పలువురికి పేరు తెచ్చిపెట్టింది.నటి రూపిణీ, రమ్యకృష్ణ, లివింగ్ స్టన్, తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఇందులో నటుడు శరత్ కుమార్ కీలక పాత్రను పోషించారు. నటుడు మన్సూర్ అలీఖాన్ ఈ చిత్రం ద్వారా విలన్‌గా పరిచయం అయ్యారు. ఈయన వీరప్పన్ గా నటించినా ఈ పాత్ర ఇప్పటికీ ప్రేక్షకుల్లో గుర్తుండిపోతుంది. ఐవీ.సినీ ప్రొడక్షనన్స్ పతాకంపై ఏఎస్ ఇబ్రహీమ్ రావుత్తర్ నిర్మించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని, రాజారాజన్ ఛాయాగ్రహణంను అందించారు. 1991లో తమిళ ఉగాది సందర్భంగా విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. 34 ఏళ్ల తరువాత కెప్టెన్ ప్రభాకరన్ సంగీతాన్ని 4కే డిజిటల్ ఫార్మెట్లో 7.1 సౌండ్ మిక్సింగ్ తో ఈ చిత్రాన్ని మురుగన్ ఫిలిం ఫ్యాక్టరీ, స్పాట్లో సినిమాస్ సంస్థల ద్వారా కార్తీక్ వెంకటేశన్ త్వరలో రీ రిలీజ్ చేస్తున్నారు. దీన్ని తమిళనాడులో 500 థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఆయన మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు తెలుగులో ఇటీవల గంధపు చెక్కల నేపథ్యంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన పుష్ప చిత్రం తరహాలో చాలా కాలం క్రితమే తెరకెక్కిన చిత్రం కెప్టెన్ ప్రభాకరన్ అని, ఇప్పుడు ఆంధ్రాకు పుష్ప చిత్రం ఎలాగో తమిళనాడుకు అప్పుడే కెప్టెన్ ప్రభాకరన్ చిత్రం అని ఆయన అన్నారు.

వాళ్లందరూ కేవలం ఫాలోవర్స్ మాత్రమే: పూజా హెగ్డే
సినిమా కళాకారులు సొంత డబ్బా కొట్టుకోవడం మామూలే. అది వారికి చాలా అవసరం కూడా. అయితే శ్రుతిమించితేనే హాస్యాస్పదంగా మారుతుంది. పూజా హెగ్డే(Pooja Hegde) ఇలాంటి సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిగా మంచి పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ ముఖ్యంగా ఆ మధ్య తెలుగులో టాప్ హీరోయిన్గా వెలిగారు. అయితే ఆ తరువాత వరుస ఫ్లాప్‌లు ఎదురవడంతో మార్కెట్ పూర్తిగా డౌన్ అయిపోయ్యింది. అయితే ఇప్పుడు మళ్లీ పుంజుకుంటున్నారు. ముఖ్యంగా తమిళంలో ముఖముడి చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన పూజాహెగ్డే తొలి చిత్రంతోనే అపజయాన్ని మూటకట్టుకున్నారు. అదేవిధంగా పదేళ్ల తరువాత విజయ్ సరసన నటించిన బీస్ట్ చిత్రం నిరాశ పరిచింది. అలాంటిది మరోసారి ఆయనతో జతకట్టే అవకాశాన్ని అందుకోవడం విశేషం. విజయ్‌తో జత కడుతున్న జననాయకన్ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. సూర్యకు జంటగా నటించిన రెట్రో చిత్రం మే 1న తెరపైకి రానుంది. లారెన్స్‌కు జంటగా ఒక చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇలా తమిళంలో సెకెండ్ ఇన్నింగ్స్ మొదలెట్టిన పూజాహెగ్డేకు ఈ చిత్రాల విజయాలు చాలా అవసరం. అయితే జననాయకన్, రెట్రో చిత్రాలపై ఈ అమ్మడు చాలా ఆశలు పెట్టుకున్నారు. అదేవిధంగా రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ చిత్రంలో ప్రత్యేక పాటలో నటించారు. ఈ పాట తనకు మంచి పేరు తెచ్చి పెడుతుందనే నమ్మకంతో ఉన్నారు. దీంతో ఒక ఇంటర్వ్యూలో పూజాహెగ్డే పేర్కొంటూ తనకు ఇన్‌స్ట్రాగామ్‌లో 3 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారని సెల్ఫ్‌గోల్ కొట్టుకున్నారు. అయితే తన చిత్రాలకు 3 కోట్ల టికెట్లు అమ్ముడు పోతాయన్న నమ్మకం మాత్రం లేదని కూడా చెప్పుకొచ్చింది. కొందరికైతే ఏకంగా 26 మిలియన్ల ఫాలోవర్స్ ఉంటారు.. వారి సినిమాలకు కూడా అంతమంది వెళ్లరని చెప్పింది. వాస్తవంగా పూజాకు కూడా 27 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. కొందరు ప్రముఖులకు 50 లక్షల ఫాలోవర్స్ ఉంటారని, వారి చిత్రాలకు థియేటర్లలో ప్రేక్షకుల రద్దీ పెరుగుతుందని, సామాజిక మాధ్యమాలు నిజమైన ప్రపంచం కాదని అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja)
న్యూస్ పాడ్‌కాస్ట్

వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసు... దర్యాప్తు ముసుగులో సిట్ అరాచకాలు

సుదీర్ఘ కాలంగా వక్ఫ్ అధీనంలో ఉన్న ఆస్తులను ఇకపై కూడా వక్ఫ్ ఆస్తులుగానే పరిగణించాలని భావిస్తున్నాం... ఈ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలనుకుంటున్నాం... సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ

ఆంధ్రప్రదేశ్‌లో ఫీజుల షెడ్యూల్‌కు చెల్లుచీటి... కూటమి పాలనలో గతితప్పిన ఫీజు రీయింబర్స్మెంట్... ఊసేలేని వసతి దీవెన

వక్ఫ్(సవరణ) చట్టంపై వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం.. చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్

ఆంధ్రప్రదేశ్‌లోని కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటం. 8 మంది సజీవ దహనం. 8 మందికి తీవ్ర గాయాలు

కొత్త సుంకాల నుంచి ఎలక్ట్రానిక్స్‌కు మినహాయింపు. ట్రంప్ సర్కారు తాజా ప్రకటన. అమెరికా కంపెనీల ప్రయోజనాలే లక్ష్యం

అమెరికా ఉత్పత్తులపై సుంకాలు 125 శాతానికి పెంపు... డొనాల్డ్ ట్రంప్ విధించిన 145 శాతానికి ప్రతీకారంగా చైనా నిర్ణయం

చర్యకు ప్రతి చర్య తప్పదు.. అధికార దురహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు, దేవుడు కచ్చితంగా మొట్టికాయ వేస్తారు... ఏపీ సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరిక

చైనా మినహా మిగతా దేశాలపై ప్రతీకార సుంకాల అమలు 90 రోజుల పాటు వాయిదా... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన... చైనా ఉత్పత్తులపై 125 శాతం సుంకాలు విధిస్తున్నట్లు స్పష్టీకరణ

మీ కుటుంబానికి అండగా ఉంటాం... పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య కుటుంబాన్ని ఓదార్చిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
క్రీడలు

సంజూతో విభేదాలు!.. స్పందించిన రాహుల్ ద్రవిడ్
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ (Sanju Samson)తో విభేదాలంటూ వచ్చిన వార్తలపై.. ఆ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) స్పందించాడు. ఇలాంటి వదంతులు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయో తనకు అర్థం కావడం లేదని.. సంజూ, తానూ జట్టు ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచిస్తామని స్పష్టం చేశాడు. కాగా ఐపీఎల్-2025 (IPL 2025)లో రాజస్తాన్ రాయల్స్ వైఫల్యాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఇద్దరికీ గాయాల బెడదఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో రాయల్స్ కేవలం రెండు మాత్రమే గెలిచింది. మరోవైపు.. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ సంజూ శాంసన్ గాయాల బారి నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఈ సీజన్ ఆరంభానికి ముందు ద్రవిడ్ లీగ్ మ్యాచ్ ఆడి కాలికి దెబ్బ తాకించుకోగా.. వీల్‌చైర్‌లో కూర్చునే జట్టుకు మార్గదర్శనం చేస్తున్నాడు.ఇంపాక్ట్ ప్లేయర్గానేఇక సంజూ పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించని కారణంగా తొలి మూడు మ్యాచ్‌లలో కేవలం ఇంపాక్ట్ ప్లేయర్‌గానే బరిలోకి దిగాడు. ఆ తర్వాత సారథిగా పగ్గాలు చేపట్టిన ఈ కేరళ బ్యాటర్.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ సందర్భంగా మరోసారి గాయపడ్డాడు. పక్కటెముకల నొప్పితో అతడు తదుపరి లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌కు దూరమయ్యే పరిస్థితి.ద్రవిడ్- సంజూ మధ్య విభేదాలు?ఇదిలా ఉంటే.. ఢిల్లీపై గెలవాల్సిన మ్యాచ్‌ను రాయల్స్ చేజార్చుకున్న విషయం తెలిసిందే. ఇరు జట్లు సరిగ్గా 188 పరుగులే చేయడంతో మ్యాచ్ ‘టై’ కాగా.. సూపర్ ఓవర్లో ఢిల్లీ రాయల్స్‌పై జయభేరి మోగించింది. అయితే, సూపర్ ఓవర్‌కు ముందు ద్రవిడ్ ఆటగాళ్లతో డగౌట్లో చర్చలు జరుపగా.. సంజూ మాత్రం అందులో పాలుపంచుకోలేదు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొట్టగా.. ద్రవిడ్- సంజూ మధ్య విభేదాలనే వదంతులు వచ్చాయి.అతడు జట్టులో అంతర్భాగంఅయితే, ఈ వార్తలను ద్రవిడ్ ఖండించాడు. లక్నోతో శనివారం నాటి మ్యాచ్ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి వస్తాయో నాకైతే అర్థం కావడం లేదు. నేను, సంజూ ఒకే విధంగా ఆలోచిస్తాం. మా ప్రణాళికలు ఒక్కటే.అతడు జట్టులో అంతర్భాగం. ప్రతి చర్చ, నిర్ణయంలోనూ అతడు భాగమై ఉంటాడు. అయితే, కొన్నిసార్లు మనం అనుకున్న ఫలితాలు రాకపోతే ప్రతి ఒక్కరు నిరాశ చెందుతారు. ఆటలో ఇవన్నీ సహజం.మన ప్రదర్శన బాగా లేకపోతే విమర్శలు వస్తూనే ఉంటాయి. కానీ ఇలా ఆధారాల్లేకుండా వస్తున్న వార్తలను మేమైతే అరికట్టలేము. మా జట్టులోనూ ఎలాంటి విభేదాలు లేవు.మా వాళ్లు కఠినంగా శ్రమిస్తున్నారు. గెలుపు కోసం కృషి చేస్తున్నారు. తమ ప్రదర్శన బాగాలేకపోతే ఆటగాళ్ల మనసు ఎంతగా గాయపడుతుందో మీకు తెలియదు. ఎవరో పనిగట్టుకుని వారిని విమర్శించాల్సిన పనిలేదు. పొరపాట్లను సమీక్షించుకుని సరిచేసుకోగల సత్తా వారికి ఉంది’’ అని ద్రవిడ్ విమర్శకులకు, వదంతులు వ్యాప్తి చేసే వారికి చురకలు అంటించాడు.చదవండి: సచిన్ రికార్డు బద్దలు కొట్టిన పాటిదార్.. ఐపీఎల్ చరిత్రలో భారత తొలి బ్యాటర్‌గా

BCCI: ఫిక్సింగ్ యత్నం.. బీసీసీఐ ఆగ్రహం.. అతడిపై నిషేధం
ఫిక్సింగ్‌కు యత్నించిన గుర్మీత్ సింగ్ భమ్రా అనే వ్యక్తిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిషేధం విధించింది. భమ్రా ముంబై టీ20 లీగ్‌లో సొబో సూపర్ సానిక్స్ అనే ఫ్రాంచైజీ కలిగి ఉన్నాడు. ఐదేళ్ల క్రితం అతడు ఆ లీగ్‌లో ఫిక్సింగ్‌కు యత్నించినట్లు తేలడంతో బోర్డు అంబుడ్స్‌మన్ రిటైర్డ్ జస్టిస్ అరుణ్ మిశ్రా నిషేధం విధించారు. అయితే, భమ్రాపై ఐదేళ్లా లేదంటే జీవితకాల నిషేధమా అనేది తెలియాల్సి ఉంది. కాగా 2019 సీజన్లో సొబో సూపర్ సానిక్స్ ప్లేయర్లు ధవళ్ కులకర్ణి, భవిన్ ఠక్కర్‌లతో ఫిక్సింగ్ కోసం సంప్రదింపులు జరిపారు. టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన కులకర్ణి సహా ఠక్కర్‌లు ఫిక్సింగ్‌కు నిరాకరించారు. తదనంతరం ఈ విషయాన్ని బోర్డు అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ)కు తెలిపారు. సోనూ వాసన్ అనే వ్యక్తి ద్వారా గుర్మీత్ సింగ్ ఫిక్సింగ్ ప్రయత్నాలు చేశారు. సోనూ వాసన్ డబ్బు ఆశ చూపినా భవిన్ తలొగ్గలేదు. ఇద్దరు ఫిక్సింగ్‌కు ససేమిరా అనడంతో వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. విచారణలో గుర్మీత్ దోషి అని తేలడంతో శిక్ష ఖరారు చేశారు.ఇక భమ్రా జీటీ20 కెనడా లీగ్ (ప్రస్తుతం మనుగడలో లేదు)లోనూ భాగమయ్యాడు. కాగా కోవిడ్‌కు ముందు అతడు ముంబై టీ20 లీగ్ ఫ్రాంఛైజీ ఓనర్‌గా ఉండగా.. ప్రస్తుతం అతడిని లీగ్ నుంచి తొలగించారు.ఐపీఎల్‌లోనూ ఫిక్సింగ్ కలకలంకాగా ఐపీఎల్-2025లోనూ ఫిక్సింగ్‌కు అవకాశముందంటూ ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన బీసీసీఐ జట్ల యజమానులు, ఆటగాళ్లు, సిబ్బందికి కీలక సూచనలు చేసింది.హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త గట్టిగానే ఫిక్సింగ్ యత్నాలు చేస్తున్నాడని.. ఆ వ్యక్తి గనుక సంప్రదిస్తే వెంటనే అవినీతి నిరోధక భద్రతా విభాగం దృష్టికి తీసుకురావాలని ఆదేశించింది. ప్లేయర్లతో పాటు వారి కుటుంబ సభ్యులకు ఖరీదైన బహుమతుల పేరిట వల వేసే అవకాశం ఉందని.. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. సదరు వ్యాపారవేత్త గతంలోనూ ఇలాంటి అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డాడని.. అతడికి దూరంగా ఉండాలని హెచ్చరించింది. ఒకవేళ అతడు ఏ రకంగానైనా సంప్రదింపులు జరపాలని చూస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని ఆటగాళ్లను అప్రమత్తం చేసింది.చదవండి: సచిన్ రికార్డు బద్దలు కొట్టిన పాటిదార్.. ఐపీఎల్ చరిత్రలో భారత తొలి బ్యాటర్‌గా

సచిన్ రికార్డు బద్దలు కొట్టిన పాటిదార్.. ఐపీఎల్లో భారత తొలి బ్యాటర్‌గా..
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్ (Rajat Patidar) టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ రికార్డు బద్దలు కొట్టాడు. ఐపీఎల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్ట్రైక్‌రేటుతో వెయ్యి పరుగుల మైలురాయిని అందుకున్న భారత తొలి క్రికెటర్‌గా నిలిచాడు. వర్షం వల్ల 14 ఓవర్ల ఆటఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా పాటిదార్ ఈ ఘనత సాధించాడు. బెంగళూరు వేదికగా శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. ఈ నేపథ్యంలో పద్నాలుగు ఓవర్లకు మ్యాచ్‌ను కుదించగా.. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్.. ఆర్సీబీని తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (4), విరాట్ కోహ్లి (1) పూర్తిగా విఫలం కాగా.. రజత్ పాటిదార్ (18 బంతుల్లో 23) ఫర్వాలేదనిపించాడు.95 పరుగులుఆఖర్లో టిమ్ డేవిడ్ మెరుపు ఇన్నింగ్స్ (26 బంతుల్లో 50 నాటౌట్) ఆడటంతో ఆర్సీబీ తొమ్మిది వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, మార్కో యాన్సెన్, యజువేంద్ర చహల్, హర్‌ప్రీత్‌బ్రార్ రెండేసి వికెట్లు కూల్చగా.. జేవియర్ బార్ట్లెట్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.పంజాబ్ ఫటాఫట్‌ఇక పంజాబ్ 12.1 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి ఆర్సీబీ విధించిన లక్ష్యాన్ని ఛేదించింది. నేహాల్ వధేరా (19 బంతుల్లో 33) ధనాధన్ ఇన్నింగ్స్‌తో పంజాబ్‌ను విజయతీరాలకు చేర్చాడు.ఇదిలా ఉంటే.. పంజాబ్‌తో మ్యాచ్‌లో 23 పరుగులు చేసిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్.. ఐపీఎల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. కేవలం 30 ఇన్నింగ్స్‌లోనే పాటిదార్ ఈ మైలురాయిని చేరుకున్నాడు.సచిన్ రికార్డు బ్రేక్ఈ క్రమంలో సచిన్ టెండుల్కర్, రుతురాజ్ గైక్వాడ్ పేరిట ఉన్న రికార్డును పాటిదార్ బద్దలు కొట్టాడు. వీరిద్దరు 31 ఇన్నింగ్స్‌లో వెయ్యి పరుగుల మార్కును అందుకున్నారు. ఇక.. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ కేవలం 25 ఇన్నింగ్స్‌లోనే ఈ మైలురాయిని చేరుకుని.. ఐపీఎల్లో భారత్ తరఫున అత్యంత వేగంగా వెయ్యి పరుగులు సాధించిన బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు.ఐపీఎల్లో భారత తొలి బ్యాటర్‌గా రికార్డుఅయితే, రజత్ ఇన్నింగ్స్ పరంగా సుదర్శన్ కంటే వెనుకబడి ఉన్నా... సగటు, స్ట్రైక్‌రేటు పరంగా మెరుగ్గా ఉన్నాడు. తద్వారా ఐపీఎల్లో 35కు పైగా సగటుతో 150కి పైగా స్ట్రైక్‌రేటుతో 1000 పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా పాటిదార్ చరిత్రకెక్కాడు. టీ20 ఫార్మాట్లో అతడి నిలకడైన ఆటకు ఇది నిదర్శనం.ఐపీఎల్-2025: బెంగళూరు వర్సెస్ పంజాబ్👉వర్షం వల్ల మ్యాచ్ 14 ఓవర్లకు కుదింపు👉వేదిక: ఎం.చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు👉టాస్: పంజాబ్.. తొలుత బౌలింగ్👉బెంగళూరు స్కోరు: 95/9 (14)👉పంజాబ్ స్కోరు: 98/5 (12.1)👉ఫలితం: ఐదు వికెట్ల తేడాతో బెంగళూరుపై పంజాబ్ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: టిమ్ డేవిడ్ (26 బంతుల్లో 50 నాటౌట్). .@PunjabKingsIPL's red is shining bright in Bengaluru ❤️They continue their winning streak with an all-round show over #RCB 👏Scorecard ▶ https://t.co/7fIn60rqKZ #TATAIPL | #RCBvPBKS pic.twitter.com/NOASW2XRMD— IndianPremierLeague (@IPL) April 18, 2025చదవండి: RCB VS PBKS: చరిత్ర సృష్టించిన అర్షదీప్ సింగ్

హంపి–హారిక గేమ్ ‘డ్రా’
పుణే: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్ ఐదో అంచె చెస్ టోర్నమెంట్లో భారత స్టార్ గ్రాండ్‌మాస్టర్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కోనేరు హంపి అజేయపరంపర కొనసాగుతోంది. భారత్‌కే చెందిన మరో స్టార్ గ్రాండ్‌మాస్టర్, హైదరాబాద్‌కు చెందిన ద్రోణవల్లి హారికతో శుక్రవారం జరిగిన ఐదో రౌండ్ గేమ్‌ను హంపి ‘డ్రా’గా ముగించింది. తెల్ల పావులతో ఆడిన హంపి గేమ్‌ను 19 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. ఐదో రౌండ్ తర్వాత హంపి 3.5 పాయింట్లతో ప్రపంచ జూనియర్ చాంపియన్ దివ్య దేశ్ముఖ్తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉంది. ఈ టోర్నీలో హంపి రెండు గేముల్లో గెలిచి, మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకుంది. పొలీనా షువలోవా (రష్యా)తో జరిగిన గేమ్‌ను దివ్య దేశ్‌ముఖ్ 72 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్, తమిళనాడు అమ్మాయి వైశాలి రమేశ్‌బాబు ఈ టోర్నీలో తొలి విజయాన్ని అందుకుంది. బత్కుయాగ్ మున్‌గున్‌తుల్ (మంగోలియా)తో జరిగిన గేమ్‌లో వైశాలి తెల్లపావులతో ఆడుతూ 52 ఎత్తుల్లో గెలుపొందింది. జు జినెర్ (చైనా)–నుర్గుల్ సలీమోవా (బల్గేరియా) మధ్య జరిగిన గేమ్ 71 ఎత్తుల్లో... మెలియా సలోమి (జార్జియా)–అలీనా కష్లిన్స్కాయా (పోలాండ్) మధ్య జరిగిన గేమ్ 41 ఎత్తుల్లో ‘డ్రా’ అయ్యాయి. పది మంది అగ్రశ్రేణి క్రీడాకారిణుల మధ్య తొమ్మిది రౌండ్లపాటు జరుగుతున్న ఈ టోర్నీలో ఐదో రౌండ్ తర్వాత జు జినెర్ నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. శనివారం విశ్రాంతి దినం. ఆదివారం జరిగే ఆరో రౌండ్ గేముల్లో దివ్య దేశ్ముఖ్తో ద్రోణవల్లి హారిక; బత్కుయాగ్ మున్‌గున్‌తుల్‌తో కోనేరు హంపి; జు జినెర్‌తో వైశాలి; పొలీనా షువలోవాతో మెలియా సలోమి; నుర్గుల్ సలీమోవాతో అలీనా కష్లిన్స్కాయా తలపడతారు.
బిజినెస్

కోత కోసి.. పూత పూసి..
దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఇంటర్నల్ అసెస్మెంట్ పరీక్షలో ఫెయిలైన 240 మంది ట్రెయినీలను తొలగించింది. తాజాగా కొలువుల నుంచి తొలగించిన వారితోపాటు ఈ ఏడాది ఫిబ్రవరిలో లేఆఫ్స్ ప్రకటించిన వారికి ఉచితంగా నైపుణ్యాలు అభివృద్ధి చేసుకునేందుకు ప్రత్యేక ప్రోగ్రామ్‌లతో మద్దతుగా నిలుస్తున్నట్లు చెప్పింది. లేఆఫ్స్‌తో గాయం చేసి ఉచిత స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌తో దానికి పూత పూసినట్లయింది. ఏప్రిల్ 18న ఇన్ఫోసిస్ లేఆఫ్స్‌కు సంబంధించి ట్రెయినీలకు ఈమెయిల్ పంపించింది. ‘జెనెరిక్ ఫౌండేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్’లో అర్హత సాధించని వారిని తొలగిస్తున్నట్లు అందులో పేర్కొంది. అదనపు ప్రిపరేషన్ సమయం, సందేహాల నివృత్తి సెషన్లు, అనేక మాక్ అసెస్మెంట్లు ఉన్నప్పటికీ ఈ ప్రోగ్రామ్‌లో అర్హత ప్రమాణాలను చేరుకోలేదనే సాకుతో ఉద్యోగులకు ఈమెయిల్ ద్వారా సమాచారం అందించింది.తొలగించిన ఉద్యోగులకు మద్దతుగా..ఎన్ఐఐటీ, అప్‌గ్రాడ్ సంస్థల భాగస్వామ్యం ద్వారా కొలువు కోల్పోయిన ట్రయినీలకు ఉచితంగా నైపుణ్యాలు పెంచుకునేలా అవకాశాలను అందిస్తున్నట్లు తెలిపింది. ఫిబ్రవరిలో లేఆఫ్స్ ప్రకటించిన వారికి కూడా ఈ కార్యక్రమాన్ని వర్తింపజేస్తున్నట్లు పేర్కొంది. శిక్షణార్థులకు బీపీఎం పరిశ్రమలో ఉద్యోగాల సాధన కోసం లేదా ఐటీ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు ఈ ప్రోగ్రామ్‌లు ఎంతో తోడ్పడుతాయని ఈమెయిల్లో తెలిపింది.‘మీరు ఇన్ఫోసిస్‌లో కాకుండా బయట ఉద్యోగ అవకాశాలను చూస్తుంటే మీకు సాయం చేసేందుకు ప్రొఫెషనల్ అవుట్ ప్లేస్మెంట్ సేవలను ప్లాన్ చేశాం. బీపీఎం పరిశ్రమలో మీరు ఉద్యోగాలు సాధించేలా తోడ్పాటు అందించాలని అనుకుంటున్నాం. ఈ ప్రోగ్రామ్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన తరువాత ఇన్ఫోసిస్ బీపీఎం లిమిటెడ్‌లో అందుబాటులో ఉన్న ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు ఐటీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలనుకుంటే అందుకు మద్దతుగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫండమెంటల్స్‌పై ఇన్ఫోసిస్ స్పాన్సర్డ్ ఎక్స్టర్నల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను ఎంచుకునే అవకాశం కూడా ఉంది’ అని ఈమెయిల్‌తో తెలిపింది. టెక్ కంపెనీల ఆదాయాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఇది తమ ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించడానికి ఒక కారణంగా నిలుస్తుంది. కంపెనీల ఆదాయాలు తగ్గుతుండడానికిగల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.ప్రపంచ ఆర్థిక అనిశ్చితిట్రంప్ సుంకాలు ప్రధానంగా భారత టెక్ కంపెనీలకు అవాంతరంగా తోస్తున్నాయి. ఎందుకంటే భారత్‌లోని టెక్నాలజీ సర్వీసులను యూఎస్‌లోకి ఎగుమతి చేస్తున్నాయి. ఈ క్రమంలో యూఎస్ దిగుమతులపై ట్రంప్ సుంకాలు విధిస్తుండడంతో ఈ రంగం కుదేలవుతుందని భావిస్తున్నారు. దాంతోపాటు ఆర్థిక మాంద్యం భయాలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితిని ఎదుర్కొంటోంది. భారత ఐటీ సేవలకు కీలక మార్కెట్ అయిన అమెరికా ద్రవ్యోల్బణం, విధాన మార్పులతో సతమతమవుతుండటంతో ఔట్ సోర్సింగ్ టెక్ సేవలపై ఖర్చు తగ్గింది.బలహీనమైన ఆదాయ అంచనాలుప్రధాన ఐటీ కంపెనీలు ఊహించిన దానికంటే బలహీనమైన రాబడులను నమోదు చేస్తున్నాయి. ఉదాహరణకు, విప్రో భవిష్యత్తులో రెవెన్యూ క్షీణిస్తుందని ముందుగానే అంచనా వేసింది. ఇన్ఫోసిస్, టీసీఎస్ కూడా వృద్ధిని కొనసాగించడానికి కష్టపడుతున్నాయి.ఐటీ సేవలకు తగ్గుతున్న డిమాండ్చాలా కంపెనీలు తమ బడ్జెట్లను కఠినతరం చేస్తున్నాయి. దాంతో అవసరమైన ఐటీ సేవల కోసం వ్యయాలు(డిసిక్రీషినరీ స్పెండింగ్) తగ్గాయి. కంపెనీలు కొత్త టెక్నాలజీ పెట్టుబడుల కంటే వ్యయ తగ్గింపు చర్యలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇది ఐటీ సర్వీస్ ప్రొవైడర్లకు కాంట్రాక్టులు తగ్గేందుకు దారితీస్తోంది.ఇదీ చదవండి: పది రోజుల్లో కొత్త టోలింగ్ వ్యవస్థ..?భౌగోళిక, వాణిజ్య సవాళ్లుముఖ్యంగా అమెరికాలో కొత్త వాణిజ్య విధానాలు, టారిఫ్ నిబంధనలు ఐటీ కంపెనీల కష్టాలను మరింత పెంచాయి. ఈ మార్పులు నిర్వహణ వ్యయాలను అధికం చేస్తున్నాయి. భవిష్యత్తు ఒప్పందాలపై అనిశ్చితి సృష్టించాయి.

హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు ఎంతలా పెరిగాయంటే..
సాక్షి, సిటీబ్యూరో: దేశంలో ప్రాపర్టీ ధరలు భారీగా పెరిగాయి. దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో గతేడాది కొత్త ప్రాజెక్టుల ధరలు సగటున 9 శాతం మేర పెరిగినట్లు డేటా అనలిటిక్స్ సంస్థ ప్రాప్ ఈక్విటీ తెలిపింది. 2024–25లో ప్రాపర్టీ ధరలు సగటున 9 శాతం పెరిగి చ.అ.కు రూ.13,197కు చేరినట్లు పేర్కొంది. ఏడాది కాలంలో కోల్‌కతాలో ఇళ్ల ధరలు అత్యధికంగా 29 శాతం మేర పెరిగాయి. ఆ తర్వాత థానేలో 17 శాతం, బెంగళూరులో 15 శాతం, పుణెలో 10 శాతం, ఢిల్లీ–ఎన్సీఆర్లో 5 శాతం, హైదరాబాద్‌లో 5 శాతం, చెన్నైలో 4 శాతంగా ఉన్నాయి.ముంబై, నవీ ముంబైలో ఇళ్ల ధరలు 3 శాతం తగ్గాయి. కాగా రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఇళ్ల ధరలు 18 శాతం పెరిగాయి. అత్యధికంగా బెంగళూరులో 44 శాతం వృద్ధి నమోదయ్యింది. కోల్‌కత్తాలో 29 శాతం, చెన్నైలో 25 శాతం, థానేలో 23 శాతం, ఢిల్లీ–ఎన్సీఆర్లో 20 శాతం, పుణేలో 18 శాతం, నవీ ముంబైలో 13 శాతం, ముంబైలో 11 శాతం, హైదరాబాద్‌లో 5 శాతం పెరుగుదల నమోదు చేసింది. మరోవైపు ఈ ఏడాది జనవరి–మార్చిలో గృహాల అమ్మకాలు 23 శాతం తగ్గి, 1,05,791 యూనిట్లకు చేరుకోగా.. సరఫరా 34 శాతం తగ్గి 80,774లకు చేరుకుంది.ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్‌లలో ధరలను పరిశీలిస్తే.. బెంగళూరులో గతేడాది చ.అ. సగటున ధర రూ.8,577 ఉండగా.. ప్రస్తుతం అది రూ.9,852కు పెరిగింది. కోల్‌కత్తాలో చ.అ. ధర రూ.6,201 నుంచి రూ.8,009కి పెరిగింది. చెన్నైలో రేట్లు చ.అ.కు రూ.7,645 నుంచి రూ.7,989కు పెరిగాయి. హైదరాబాద్‌లో చ.అ.కు రూ.7,890 నుంచి రూ.8,306కు పెరిగాయి. పుణెలో చ.అ.కు రూ.9,877 నుంచి రూ.10,832కు పెరిగాయి. థానేలో సగటు చ.అ. ధర రూ.11,030 నుంచి రూ.12,880కు పెరిగాయి. ఢిల్లీలో చ.అ.కు రూ.13,396 నుంచి రూ.14,020కు పెరిగాయి.

పది రోజుల్లో కొత్త టోలింగ్ వ్యవస్థ..?
శాటిలైట్ ఆధారిత టోలింగ్ వ్యవస్థను మే 1 నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. శాటిలైట్ ఆధారిత టోలింగ్ సిస్టమ్ ఫాస్టాగ్ ఆధారిత టోల్ కలెక్షన్ వ్యవస్థను భర్తీ చేస్తుందని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేస్తూ, 2025 మే 1 నుంచి దేశవ్యాప్తంగా ఈ సర్వీసుల అమలుకు సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది.టోల్ ప్లాజాలగుండా వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా సులువైన ప్రయాణం కోసం భవిష్యత్తులో టోల్ ప్లాజాల వద్ద ‘ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్(ఏఎన్పీఆర్)-ఫాస్టాగ్ టోలింగ్ సిస్టమ్’ను అమలు చేయనున్నట్లు తెలిపింది. ఇది వాహనాల నంబర్ ప్లేట్లను స్కాన్ చేసి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ)ను ఉపయోగించే ప్రస్తుత ఫాస్టాగ్ సిస్టమ్ ద్వారా పని చేస్తుందని పేర్కొంది. ఇది అమలులోకి వస్తే టోల్ ప్లాజాల అధిక సమయం ఆగాల్సిన అవసరం లేకుండా హై పెర్ఫార్మెన్స్ ఏఎన్పీఆర్ కెమెరాలు, ఫాస్టాగ్ రీడర్ల ద్వారా వెంటనే టోల్ ఛార్జీలు కట్ అయ్యేలా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఈ-నోటీసులు జారీ చేస్తామని, వాటిని చెల్లించకపోతే ఫాస్టాగ్, ఇతర వాహన సంబంధిత సదుపాయాలను నిలిపివేయాల్సి వస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.ఇదీ చదవండి: ప్రముఖ బ్యాంకులు వడ్డీ రేట్ల కోత..ఎంపిక చేసిన టోల్ ప్లాజాల వద్ద ‘ఏఎన్పీఆర్-ఫాస్టాగ్ టోలింగ్ సిస్టమ్’ అమలుకు ఎన్హెచ్ఏఐ ఇప్పటికే బిడ్లను ఆహ్వానించింది. ఈ వ్యవస్థ పనితీరు, సామర్థ్యం, వినియోగదారుల స్పందన ఆధారంగా దేశవ్యాప్తంగా దీని అమలుపై నిర్ణయం తీసుకోనున్నారు. భారతదేశ జాతీయ రహదారి నెట్‌వర్క్‌లో సుమారు 855 ప్లాజాలు ఉన్నాయి. వీటిలో 675 ప్రభుత్వ నిధులతో, మిగతావి ప్రైవేట్ ఆపరేటర్లతో నిర్వహిస్తున్నారు.శాటిలైట్ ఆధారిత టోలింగ్గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అమలులోకి వచ్చిన తరువాత టోల్ ఫీజు చెల్లించడానికి ప్రత్యేకంగా.. వాహనాలను ఆపాల్సిన అవసరం లేదు. వాహనం ప్రయాణించిన దూరాన్ని శాటిలైట్ పరిగణించి వాహనదారుల ఈ-వ్యాలెట్ నుంచి టోల్ ఛార్జీ కట్ అవుతుంది. అయితే దీనికోసం వాహనదారులు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) చిప్ కలిగిన ఫాస్టాగ్‌ను వాహనానికి అతికించాల్సి ఉంటుంది. లేదా ఇతర ఆన్ బోర్డ్ యూనిట్ (OBU) లేదా ట్రాకింగ్ పరికరాలను అమర్చి.. టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ప్రముఖ బ్యాంకులు వడ్డీ రేట్ల కోత..
భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) ఇటీవల రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు కట్ చేసిన నేపథ్యంలో ప్రముఖ బ్యాంకులు అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాయి. లాభాలను దృష్టిలో ఉంచుకుని హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌తో సహా ప్రధాన భారతీయ బ్యాంకులు ఇటీవల సేవింగ్స్ ఖాతా వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించాయి. కాసా (కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్) ఖాతాలు క్షీణించడం, డిపాజిట్ వృద్ధి మందగించడంతో బ్యాంకులు తమ నిధుల వ్యయాన్ని నియంత్రించడానికి, నికర వడ్డీ మార్జిన్లను మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి.ప్రధాన బ్యాంకుల్లో రేట్ల సవరణలుహెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.50 లక్షల లోపు సేవింగ్స్ ఖాతా బ్యాలెన్స్‌పై వడ్డీ రేటును 2.75 శాతానికి, దానికంటే అధిక బ్యాలెన్స్‌పై 3.25 శాతానికి చేర్చింది.రూ.10 కోట్ల కంటే తక్కువ పొదుపు ఖాతా డిపాజిట్లపై 2.7% వడ్డీ రేటును ఎస్బీఐ అందిస్తుంది. ఇందులో అక్టోబర్ 2022 నుంచి ఎలాంటి మార్పులేదు.ఐసీఐసీఐ బ్యాంక్ రూ.50 లక్షల లోపు పొదుపు ఖాతాలోని బ్యాలెన్స్‌పై 2.75 శాతం, దాని కంటే అధిక మొత్తాలకు 3.25 శాతం వడ్డీ రేట్లను సవరించింది.డిపాజిట్ వ్యయాలను తగ్గించడానికి యాక్సిస్ బ్యాంక్ కూడా ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ మాదిరిగానే వడ్డీ రేట్లను సర్దుబాటు చేసింది.రేట్ల కోతకు కారణంమారుతున్న ఆర్థిక పరిణామాలకు అనుగుణంగా బ్యాంకులు ఈ చర్యలు తీసుకున్నాయి. బ్యాంకుల్లో కాసా(కరెంట్ ఖాతా సేవింగ్స్ ఖాతా) నిష్పత్తులు తగ్గుతున్నాయి. ఉన్న పొదుపు ఖాతాల్లో నగదు జమ భారీగా క్షీణిస్తోంది. ఇది బ్యాంకులకు తక్కువ ఖర్చుతో కూడిన నిధులను నిర్వహించే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఖాతాదారులు అధిక వడ్డీ రేట్లతో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లను ఎక్కువగా ఎంచుకోవడంతో సేవింగ్స్ ఖాతాల వృద్ధి తగ్గిపోయింది. వీటికితోడు ఆర్బీఐ ఇటీవల రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు కట్ చేసింది. దీనికి ప్రతిస్పందనగా బ్యాంకులు డిపాజిట్ రేట్లను తగ్గించాయి.ఇదీ చదవండి: రూ.10 వేలలోపు టాప్ 10 మొబైళ్లుడిపాజిటర్లకు మార్గాలు..బ్యాంకుల వడ్డీ తగ్గింపు నిర్ణయాలతో పొదుపు ఖాతాదారులు తమ డిపాజిట్లపై తక్కువ రాబడిని పొందుతారు. అయితే అధిక రాబడినిచ్చే ఫిక్స్డ్ డిపాజిట్లలో నగదు మళ్లించడం మంచి రాబడిని ఇస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. డిపాజిటర్లు తమ నగదును దీర్ఘకాలంలో అధిక రాబడినిచ్చే ఈక్విటీ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు, రియల్ ఎస్టేట్, బంగారం.. వంటి వాటిలో ఇన్వెస్ట్ చేయవచ్చని చెబుతున్నారు. మంచి ఆర్థిక నిపుణులను సంప్రదించి పెట్టుబడికి సంబంధించి సరైన నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఫ్యామిలీ

స్పేస్ ఫుడ్ టేస్ట్‌ని ఇలా పరీక్షిస్తారా..? వీడియో వైరల్
అంతరిక్షంలో ఉండే వ్యోమగాములు భోజనం ఎలా ఉంటుందో అని తెలుసుకోవాలనే కుతుహలం అందరికి ఉంటుంది. అయితే ఇటీవల సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ల పుణ్యమా అని అంతరిక్షంలో వ్యోమగాముల కష్టాలు, భోజనం ఎలా ఉంటుదనేది తెలిసింది. ఎందుకంటే ఎనిమిది రోజుల యాత్రకని బయలుదేరి ఏకంగా తొమ్మిదినెలలు అంతరిక్షంలోనే చిక్కుకుపోవడంతో వాళ్ల ఆర్యోగపరిస్థితి..వాళ్ల భోజనం ఎలా.. అనే వివరాలు ఎప్పటికప్పుడు ప్రకటించడంతో ప్రజలకు తెలిసింది. అదీగాక భారరహిత స్థితిలో ఉండే వాళ్లకు ఎలాంటి ఫుడ్ బెటర్ అనేది ప్రముఖ నిపుణులు పలు దఫాలుగా కేర్ తీసుకుని మరీ ప్యాక్ చేస్తారని విన్నాం. మరీ వాటి టేస్ట్ ఎలా ఉంటయనేది మనం వినలేదు కదా..అదెలా ఉంటుంది, ఎవరు దాన్ని పరీక్ష ఇస్తారు తదితరాల గురించి తెలుసుకుందామా..!.వ్యోమగాములకు అందించే భోజనాలను ఎలా టెస్ట్ చేస్తారో Axiom స్పేస్ షేర్ చేసింది. వచ్చే నెల మేలో ప్రారంభం కానున్న ఆక్సియం మిషన్ 4 (Ax-4) కోసం సన్నాహాలు వేగవంతం కావడంతో వ్యోమగాములకు అందించే ఆహారం టేస్ట్ సెషన్ ఎలా ఉంటుందో వివరించింది. ఈ రుచి సెషన్ ట్రయల్‌లో భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా పాల్గొన్నారు. ఈ ఏడాది మేలో ఈ ఆక్సియం మిషన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే ఆక్స్-4 సిబ్బందికి ఇచ్చే స్పేస్ ఫుడ్ టెస్ట టెస్ట్ ఎలా ఉంటుందో కళ్లకటినట్లుగా చూపించింది Axiom స్పేస్. ఈ ట్రయల్ సెషన్ మైసూరులో డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ లాబొరేటరీ (DFRL)లో నిర్వహించారు. ముందుగా వ్యోమగాములకు అందించే ఫుడ్ నమునాలను ఆ సెషన్లో పాల్గొన్న వాళ్లు రుచి చూసి రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని ఆధారంగా చేసుకుని ఈ ఫుడ్‌ని వ్యోమగాములు 14 రోజుల మిషన్ సమయంలో తినేందుకు పంపడం జరుగుతుంది. ఇక్కడ తాము టేస్ట్ చేసి..నచ్చినా నచ్చకపోయినా వాటికి స్కోర్లు ఇవ్వక తప్పదని అన్నారు శుక్లా. ఆ తర్వాత దాన్ని ఆధారంగా చేసుకుని ఐఎస్ఎస్కి పంపుతారని అన్నారు.ట్రయల్‌లో ఏం వంటకాలు ఉంటాయంటే..ట్రయల్ సమయంలో వడ్డించే ఆహారంలో దాల్ చావల్, రాజ్మా, కిచ్డి మరియు వెజిటబుల్ బిర్యానీ వంటి ప్రసిద్ధ కంఫర్ట్ వంటకాలు సుమారు 50 ఉన్నాయి. శాస్త్రవేత్తలు శాస్త్రీయంగా ప్రాసెస్ చేస్తూనే భారతీయ వంటకాల ప్రామాణిక రుచిని పోకుండా కేర్ తీసుకుంటారట.ఇదిలా ఉండగా..ఈ మిషన్ కారణంగా శుభాన్షు శుక్లా ISSకి ప్రయాణించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించనున్నారు. ఈ ఏఎక్స్4 మిషన్‌లో పోలాండ్‌కు చెందిన సావోజ్ ఉజ్నాన్స్కీ-విస్నివ్స్కీ, హంగేరీకి చెందిన టిబోర్ కాపు తదితరులు ఉన్నారు. కుటుంబానికి దూరంగా ఉండాల్సినా ఆ సమయంలో తమకు ఆహారం చాలా ముఖ్యమని, అది తమకు ఓదార్పునిస్తుందన్నారు శుక్లా.కాగా, భారత వైమానిక దళ పైలట్, గగన్‌యాన్ మిషన్‌కు వ్యోమగామి అయిన శుభాన్షు శుక్లా స్పేస్ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌకలో పైలట్‌గా వ్యవహరించనున్నారు. అలాగే ఈ మిషన్ ఆక్స్-4లో శాస్త్రీయ ప్రయోగాలు, ఔట్రీచ్ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయట. We're counting down to the #Ax4 crew launch, expected no earlier than May this year. In our new astronaut training video series, you'll learn what it takes to prepare for a mission, from the crew's arrival in Houston all the way to launch day.Ever wondered what it takes to… pic.twitter.com/wqzcspiMuV— Axiom Space (@Axiom_Space) April 15, 2025 (చదవండి: ఆవేశం అదే క్షణం.. ఆవేదన జీవితాంతం..)

బట్టల మిషనా? బంగాళదుంపల మిషనా? వైరల్ వీడియో
వంట చేయడం కంటే.. ప్రిపరేషన్‌కే ఎక్కువ టైం పడుతుంది. కూర వండాలంటే..చిక్కుడు కాయలు, బీన్స్ గిల్లడం, దొండకాయలు, బెండకాయలు కట్ చేయడం అబ్బో పెద్దపనే కదా. అలాగే బంగాళాదుంపలను తొక్క తీసి శుభ్రం చేయడం అంటే అదో పెద్ద పని. కానీ ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో కనిపించిన మహిళ కేవలం రెండు నిమిషాల్లో వాషింగ్ మెషిన్ సహాయంతో బంగాళాదుంపలు తోలు తీయడం అందర్నీ ఆకర్షించింది.‘ఆమె వాషింగ్ మెషిన్ దగ్గరకు వెళ్లింది. ఆ తరువాత ఏం చేస్తుంది?’ అనే ప్రశ్నకు ఎవరైనా ఇచ్చే జవాబు....‘బట్టలను వాషింగ్ మెషిన్లో వేస్తుంది’ అయితే సదరు మహిళ మాత్రం బట్టలను కాదు బంగాళదుంపలను వేసింది. మన ఆశ్చర్యాన్ని మరింత పెంచేలా మెషిన్ ఆన్ చేసింది. ఆ తరువాత ఏమిటి అనే విషయానికి వస్తే..... తొక్క రహిత బంగాళదుంపలు కనిపించాయి! వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి ‘భేష్’ అని కొందరు కితాబు ఇవ్వగా చాలామంది మాత్రం ‘ఇది సరికాదు’ అని విమర్శించారు. మరికొందరు ‘ఇది ఫేక్ వీడియో’ అన్నారు. बढ़ती हुई तकनीक ने बहुत कामों को बहुत सरल बना दिया है।ये देखो आलू को छीलने वाली मशीन।एक मिनट में कितने सारे आलू छील दिए हैं। pic.twitter.com/gpwu6Y5KG0— kuldeep kumar (@kdgothwal1) April 6, 2025ఎండలను చల్లపుచ్చండి వేసవిలో ఎదురయ్యే సమస్యలలో డీ హైడ్రేషన్ ఒకటి. డీ హైడ్రేషన్‌కు గురి కాకుండా పుచ్చకాయ తింటే మంచిది. పుచ్చకాయతో లాభాలునీరు ఎక్కువగా ఉండే పుచ్చకాయ ఒంట్లోని టాక్సిన్స్‌ను తొలగిస్తుందినీరసం, నిస్సత్తువ లేకుండా చేస్తుంది. చెమట రూపంలో కోల్పోయిన నీరు భర్తీ అవుతుంది. పుచ్చలో అమైనో ఆమ్లం ‘సిట్రులిన్’ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది.ఎండలో కమిలిన చర్మానికి పుచ్చపండు గుజ్జు రాస్తే మంచిది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మలబద్ధకం లేకుండా చేస్తుంది.కండరాల నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది. ఎముకలను దృఢంగా ఉంచుతుంది.పుచ్చకాయలో ఎక్కువగా ఉండే ఎ విటమిన్ కంటిచూపును మెరుగుపరుస్తుంది.

ఆవేశం అదే క్షణం.. ఆవేదన జీవితాంతం..
‘ఏడాదిన్నర వయసు ఉన్న బిడ్డకు ఉరివేసి, అదే తాడుకు తల్లి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇటీవల పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగింది. తాను బక్కగా ఉన్నాననే బాధతో మనస్తాపం చెంది అఘాయిత్యానికి పాల్పడింది’.‘ఈనెల 11న రామగుండం కార్పొరేషన్ 14వ డివిజన్ ఎల్కలపల్లి గేట్ గ్రామానికి చెందిన వివాహిత భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. దీంతో ముగ్గురు పిల్లలు తల్లిలేని బిడ్డలయ్యారు’.‘గత నెల 6న చొప్పదండి మండలానికి చెందిన ఇద్దరు ప్రేమికులు తమ ప్రేమను పెద్దలు అంగీకరించడం లేదని మనస్తాపం చెంది ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా ఓ కష్టం.. ఓ నష్టం.. ఆవేదన, ఆవేశం, ఆక్రోశం, మనిషిని తన ప్రాణం తాను తీసుకునేలా చేస్తోంది. దీంతో వారిపై ఆధారపడిన వారు ఒంటరవుతున్నారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం.. వారి కుటుంబాలను జీవితాంతం ఆవేదన మిగుల్చుతోంది....వీరంతా బతకాల్సిన వారే అనారోగ్యంతో కొందరు, కుటుంబ కలహాలతో మరికొందరు, అప్పుల బాధ, నిరుద్యోగం, పరీక్షల్లో ఫెయిల్, ప్రేమలో విఫలం, ఇష్టం లేని పెళ్లితో ఇంకొందరు.. వరకట్న వేధింపులు, అవమానం, ఆవేశం ఇలా కారణాలు ఎన్ని ఉన్నా మానసిక ఒత్తిడిలో బలహీనమైన క్షణంలో బలమైన నిర్ణయాలతో ప్రాణాలు తీసుకుంటున్నారు. ఆత్మహత్యలతో ఆయా కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోయి ఇబ్బందులు పడుతున్నాయి. మహిళలు ఆత్మహత్య చేసుకుంటే వారి పిల్లలు అనాథలవుతున్నారు. ప్రేమ, ఉద్యోగం, పరీక్షలు తదితర కారణాలతో యువత ఆత్మహత్యలకు పాల్పడి తల్లిదండ్రులకు కడుపుకోత మిగుల్చుతున్నారు.రోజూ ఇద్దరు..ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో సంవత్సరానికి 8లక్షల మందికి పైగా, అంటే ప్రతీ సెకనుకు ఒకరు ఆత్మబలిదానం చేసుకుంటున్నారు. ప్రపంచంలో జరిగే ప్రతి 4 ఆత్మహత్యల్లో ఒకటి ఇండియాలోనే నమోదవుతోంది. ఉమ్మడి జిల్లాలో గతేడాది 776 మంది సూసైడ్ చేసుకున్నారు. అంటే సగటున ప్రతీ రోజుకు ఇద్దరు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏదో కారణంతో తమ ప్రాణాలు తీసుకుంటున్నారు.నివారిద్దాం ఇలా..నిరాశ, నిస్పృహల్లో ఉన్నవారికి స్వాంతన కలిగించడం ద్వారా ఆత్మహత్యలను తగ్గించవచ్చు. ఆత్మహత్య ఆలోచన రావడమే తరువాయి వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా వారిని మన వైపు మళ్లించవచ్చు. వారి బాధలను వినాలి, అర్థం చేసుకోవాలి. వారి సమస్యకు ఎలా పరిష్కారం దొరుకుతుందో వారితోనే చెప్పించాలి. ఇలాంటివారిని గుర్తించగానే ఒంటరిగా ఉంచకుండా నలుగురితో కలిసేలా కుటుంబసభ్యులంతా స్నేహంగా మెలగాలి. వారు సాధారణ జీవితం గడిపేంత వరకు వారిని గమనిస్తూ ఉండాలి. సమస్య మరీ తీవ్రంగా ఉంటే మానసిక వైద్యులను కలిసి చికిత్స ఇప్పించాలి.గుర్తించడం ఇలా.. ఆత్మహత్య గురించి పదేపదే మాట్లాడుతుండటం, తనకు తాను హాని కలిగించుకునేందుకు ప్రయత్నించడం, తీవ్ర ఒత్తిడితో చికాకు పడుతుండటం, ఒంటరితనాన్ని ఇష్టపడటం, ప్రతీ విషయం గురించి ప్రతికూలంగా ఆలోచించడం, నిద్రపోకుండా ఉండటం, చేసే ప్రతి పనిపట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తుండడం.. ఇలాంటి మార్పులు ఒక వ్యక్తిలో కనిపిస్తే, వారు ఆత్మహత్య గురించి ఆలోచనలు చేస్తుండొచ్చని భావించాలి.కౌన్సెలింగ్ తీసుకుంటే తప్పేంటి..ఆత్మహత్య ఆలోచనలు వెంటాడుతున్న వారికి వీలైతే మానసిక వైద్యుడితో కౌన్సెలింగ్ ఇప్పించాలి. కానీ, మనదగ్గర మానసిక వైద్యం అంటే నామోషీ. మానసిక వైద్య చికిత్స అంటే.. అదేదో పిచ్చిపట్టినవాళ్లకు అందించే చికిత్స అనే భావన ప్రజల మెదళ్లలో నాటుకుపోవడం వల్లే ఈ సమస్య ఎక్కువ అవుతుంది. ఆత్మహత్యకు ముందు కొంతమంది ప్రదర్శించే నిర్దిష్ట లక్షణాలను అర్థం చేసుకోవడం ద్వారా చాలావరకు బలవన్మరణ కేసులను నివారించే అవకాశం ఉంటుందని మానసిక వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.ప్రతీ సమస్యకు పరిష్కారంఆత్మహత్య చేసుకునే ముందు ఒక్క నిమిషం ఆలోచించాలి. ఎంత పెద్ద సమస్య వచ్చినా పరిష్కార మార్గాలు వెతుక్కోవాలి. మానసిక ఒత్తిడి పెరిగినప్పుడు మానసిక నిపుణుల సూచనలు తీసుకోవడం మంచిది. ఆత్మహత్య చేసుకోవాలనుకునే సమయంలో తమను నమ్ముకొని ఉన్న అమ్మనాన్నలు, భార్యాపిల్లలు, స్నేహితులను ఐదు క్షణాలు తలుచుకుంటే కొంతమేర మార్పు వస్తుంది.– రవివర్మ, మానసిక వైద్యనిపుణుడు, జీజీహెచ్ గోదావరిఖని (చదవండి: Cooking Oil: వంటనూనెలతో ఆ కేన్సర్ ప్రమాదం పొంచి ఉంది..! నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్)

ల్యాప్‌టాప్ అమ్ముతున్నారా? రీసైకిల్ చేస్తున్నారా?
మీరు ల్యాప్‌టాప్ అమ్మడం, రీసైకిల్ లేదా డొనేట్ చేయడానికి ముందు విండోస్ బిల్ట్–ఇన్ ఫ్యాక్టరీ రీసెట్ ఉపయోగించడం మంచిది. ఇది అన్ని యాప్స్, సెట్టింగ్స్, పర్సనల్ ఫైల్స్‌ను డిలీట్ చేస్తుంది రీసెట్ తర్వాత కూడా పాస్వర్డ్లు, డాక్యుమెంట్లు, బ్యాంకు వివరాలను హ్యాకర్లు తిరిగి పొందగలిగే అవకాశం ఉంది. సెకండ్ హ్యాండ్ ల్యాప్‌టాప్, హార్డ్‌డ్రైవ్‌లు, మెమొరీ కార్డులలో 90 శాతం రికవరీ చేయదగిన డేటా ఉంటుంది. చాలామంది కస్టమర్లు తమ డివైజ్‌లను రీసేల్ లేదా డిస్పోజ్ చేసేముందు డేటాను వైప్ చేయడంలో విఫలమవుతున్నారు.వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా ఉంచుకోవడానికి.... పర్సనల్ యూజర్లు తమ డివైజ్‌లను విక్రయించడానికి లేదా రీసైకిల్ చేయడానికి ముందు డేటా–వైపింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించాలి. అయితే కొన్ని ట్రెడిషినల్ వైపింగ్ మెథడ్స్ ప్రభావవంతంగా ఉండకపోవచ్చు ఆండ్రాయిడ్ ఫోన్లలో ‘ష్రెడ్డిట్’లాంటి యాప్‌లు సురక్షితమైన డేటా–వైపింగ్ ఆప్షన్లను అందిస్తాయి సమాచారాన్ని తొలిగించడానికి పూర్తి రీసెట్ అత్యంత ప్రభావంతమైన మార్గం సర్టిఫైడ్ డేటా–వైపింగ్ సాధనాలను ఉపయోగించడం మంచిది. (చదవండి: Cooking Oil: వంటనూనెలతో ఆ కేన్సర్ ప్రమాదం పొంచి ఉంది..! నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్)
ఫొటోలు


దిల్‌రాజు బ్యానర్ 'ఆకాశం దాటి వస్తావా' సెట్స్‌లో ధనశ్రీ వర్మ (ఫోటోలు)


రెడ్ రోజ్ డ్రెస్ లో 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ బ్యూటీ మీనాక్షి చౌదరి


రెట్రో లుక్‌లో వింటేజ్ గర్ల్ 'పూజా హెగ్డే' లుక్స్ (ఫోటోలు)


తిరుమల శ్రీవారి సేవలో మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ దంపతులు (ఫొటోలు)


విడాకులు తీసుకుంటాంలే.. హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ (ఫొటోలు)


బ్యాంకాక్ ఫెస్టివల్లో జగ్గు భాయ్ సందడి.. మన సంక్రాంతిలాగే ఎంజాయ్ చేశా (ఫోటోలు)


తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రీతి జింటా (ఫోటోలు)


శబరిమల అయ్యప్పకు ఇరుముడి సమర్పించిన హీరో కార్తీ (ఫోటోలు)


రెండో పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ ఫేమ్ ప్రియాంక (ఫొటోలు)


పుజారా చాలా మొండివాడు.. రాజ్‌కోట్ వీధుల నుంచి ఇక్కడిదాకా (ఫొటోలు)
అంతర్జాతీయం

ఉక్రెయిన్-రష్యా శాంతి చర్చలపై ఆసక్తి పోయిందా?
రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందంపై అమెరికా కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్‌లో యుద్ధం ఆపడం సాధ్యం కాకపోతే తమ ప్రయత్నాలు విరమించుకుంటామని వెల్లడించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో(Marco Rubio) కీలక వ్యాఖ్యలు చేశారు.ఉక్రెయిన్ (Ukraine) యుద్ధం ముగించడం సాధ్యంకాని పక్షంలో.. చర్చల ప్రయత్నాలు ఆపేసి అమెరికా తన దారి తాను చూసుకుంటుందని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో తేల్చి చెప్పారు. ఈ యుద్ధాన్ని మేం ప్రారంభించలేదు. ఇన్నాళ్లూ కేవలం ఉక్రెయిన్‌కు సాయం చేస్తున్నాం. ఇది మా యుద్ధం కాదు కాబట్టి ముగించాలనుకుంటున్నాం అని మార్కో రూబియో అన్నారు.ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ యుద్ధాన్ని ఓ ముగింపునకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగని నెలలు, సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉండబోరు. ఆయనకు ప్రపంచంలో ఇతర ప్రాధాన్యాలు కూడా ఉన్నాయి. చర్చల్లో గనుక పురోగతి కనిపించకపోతే ఆయన దీనిని వదిలేస్తానన్నారు అని రుబియో వెల్లడించారు.తాజాగా ఐరోపా నేతలతో భేటీ సందర్భంగా ఉక్రెయిన్ శాంతి ఒప్పందంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అతి తొందరలోనే ఇది సాకారం కావచ్చని పేర్కొన్నారు. అమెరికా ఓ శాంతిఒప్పందం ముసాయిదా తయారుచేసి ఐరోపా నేతలకు వెల్లడించింది. వారినుంచి సానుకూల స్పందనలు వచ్చినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇక దీనినే మార్కో రూబియో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్‌కు వెల్లడించారు.

విమానం హైజాక్‌కు యత్నం.. నిందితుడ్ని కాల్చి చంపిన తోటి ప్రయాణికుడు
బెల్మోపాన్: అమెరికా ఈశాన్య తీర దేశమైన బెలిజ్‌లో విమానం హైజాక్ (Hijack Plane) కలకలం రేపింది. గురువారం (స్థానిక సమయం) బెలిజ్‌లో ఓ అమెరికన్ పౌరుడు గాల్లో ఉండగా ఓ చిన్న ట్రాఫిక్ ఎయిర్ విమానాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో నిందితుడు తోటి ప్రయాణికులపై కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. ఆ తర్వాత నిందితుణ్ని కాల్చి చంపినట్లు తెలుస్తోంది. బెలిజ్ పోలీస్ కమిషనర్ చెస్టర్ విలియమ్స్ ప్రకారం..49ఏళ్ల అమెరికా పౌరుడు అకిన్యేలా సావా టేలర్ (Akinyela Sawa Taylor) గాలిలో ఉండగా శాన్ పెడ్రోకు వెళ్తున్న విమానాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించాడు. తోటి ప్రయాణికులపై కత్తితో దాడి చేశాడు. ప్రతిఘటించిన తోటి ప్రయాణికుడు గన్నుతో నిందితుణ్ని కాల్చి చంపారు. ఈ సందర్భంగా టేలర్‌ను కాల్చి చంపిన ప్రయాణీకుడిని హీరో అంటూ కమిషనర్ విలియమ్స్ ప్రశంసించారు.కాగా,టేలర్ విమానంలోకి కత్తిని ఎలా తీసుకురాగలిగాడో అస్పష్టంగా ఉందని అధికారులు తెలిపారు.ఈ సంఘటనపై జరుగుతున్న దర్యాప్తులో సహాయం కోసం బెలిజియన్ అధికారులు అమెరికా రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు.

మెలోనీతో భేటీ.. సుంకాలపై మెత్తబడ్డ ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విషయంలో కాస్త మెత్తబడ్డారు. సుంకాలపై పలు దేశాలు అగ్రరాజ్యంతో చర్చలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ అమెరికా అధినేతతో సమావేశమయ్యారు. ఈ భేటీ సందర్భంగా ఆయన సానుకూల వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈయూ దేశాలపై అమెరికా 20 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. అయితే దాని అమలును 90 రోజులపాటు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పరిణామాల నడుమ.. ట్రంప్‌ను కలిసిన తొలి యూరప్ దేశపు నేత మెలోనీనే కావడం గమనార్హం. ఐరోపా సమాఖ్య(European Union)తో పాటు ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందం అంశంపై వీరు చర్చలు జరిపారు. అయితే ఈయూతో సుంకాలపై ఒప్పందం నూటికి నూరు శాతం కుదురుతుందని ట్రంప్ భరోసా ఇచ్చారు. ఈ డీల్ విషయంలో మాత్రం తాను తొందర పడటం లేదని వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రతీ ఒక్కరూ అమెరికాతో డీల్ కుదుర్చుకోవాలని తాపత్రయపడుతున్నారు. ఒకవేళ అలా వాళ్లు అనుకోకుంటే గనుక మేమే వాళ్లతో ఒప్పందానికి దిగి వస్తాం అంటూ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఇక.. మరోవైపు ఈ భేటీలో మెలోనీని ట్రంప్ ఆకాశానికెత్తారు. ఆమె ఓ అద్భుతమైన నేత అంటూ పొగడ్తలు గుప్పించారు. మరోవైపు.. పశ్చిమాన్ని గొప్పగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, కలిసికట్టుగా ఆ పని చేయగలమని అనుకుంటున్నా’ అని ఓవల్ ఆఫీసులో రిపోర్టర్లతో మెలోనీ మాట్లాడారు. ట్రంప్‌ను రోమ్ను ఆహ్వానించిన మెలోనీ.. అక్కడ ఈయూ దేశాల ప్రతినిధులతో సుంకాల అంశంపై చర్చిస్తామని వెల్లడించారు. Rendiamo l’Occidente di nuovo grande - Make the West Great Again pic.twitter.com/Z499ZRGx85— Giorgia Meloni (@GiorgiaMeloni) April 17, 2025

FSU: అమెరికా యూనివర్సిటీలో కాల్పులు.. ఇద్దరి మృతి
సాక్రమెంటో: అగ్రరాజ్యం మరోసారి కాల్పుల ఘటనతో ఉలిక్కి పడింది. ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ(Florida state University)లో ఓ సాయుధుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు. పోలీసులు దుండగుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాల్పులకు గల కారణాలు తెలియరావాల్సి ఉంది.తొలుత.. తల్లహస్సి క్యాంపస్‌లోని స్టూడెంట్ యూనియన్‌లో యాక్టివ్ షూటర్ ఉన్నట్లు తొలుత సమాచారం రావడంతో యూనివర్సిటీ వెంటనే అలర్ట్ జారీ చేసింది. విద్యార్థులు, ఫ్యాకల్టీ, సిబ్బంది వెంటనే యూనివర్సిటీని వీడాలని, సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని హెచ్చరించింది. అనంతరం పోలీసులు, ఇతర ఏజెన్సీలు కాల్పులు చోటుచేసుకున్న ప్రాంతానికి వచ్చి సహాయ చర్యలు చేపట్టాయి. ఈ ఘటనతో క్యాంపస్ లాక్డౌన్(Lock Down)లోకి వెళ్లింది. ఈ రోజు జరగాల్సిన క్లాస్‌లు, స్పోర్ట్స్ ఈవెంట్స్, ఇతర కార్యక్రమాలను రద్దు చేశారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని తల్లహస్సి మెమోరియల్ హెల్త్‌కేర్ ప్రతినిధి తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్‌నకు ఈ విషయాన్ని అధికారులు చేరవేశారు. ఈ ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇదొక భయంకర సంఘటన అని ట్రంప్ పేర్కొన్నారు. ఓ యువకుడు తుపాకీతో కాల్పులు జరుపుతున్నట్లుగా ఫుటేజీ ఒకటి వెలుగులోకి వచ్చింది. నిందితుడు యూనివర్సిటీ విద్యార్థిగానే తెలియగా.. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. మరోవైపు.. ఐదుగురు మృతి చెందినట్లు కథనాలు వెలువడుతున్నప్పటికీ అధికారికంగా ధృవీకరణ కావాల్సి ఉంది. #Shooting at American universityMedia report that over 30 shots were fired on the campus of #Florida State #University.At least 5 people were killed and 4 others injured in the incident. pic.twitter.com/49nBiC6SLv— Tamadon News - English (@TamadonTV_EN) April 18, 2025
జాతీయం

ఎలాన్ మస్క్ కు ప్రధాని మోదీ ఫోన్
న్యూఢిల్లీ: టెస్లా, స్పేస్ఎక్స్ సంస్థల అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఫోన్లో మాట్లాడారు. ఇండియన్ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లోకి త్వరలో టెస్లా అడుగుపెట్టబోతున్న నేపథ్యంతో వారిద్దరూ మాట్లాడుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మస్క్, మోదీ పలు కీలక అంశాలపై చర్చించుకున్నట్లు సమాచారం. టెక్నాలజీ, ఇన్నోవేషన్ వంటి రంగాల్లో భారత్, అమెరికా మధ్య పరస్పర సహకార మరింత బలోపేతం కావాలని వారు ఆకాంక్షించారు. సాంకేతికత, నవీన ఆవిష్కరణల విషయంలో ఉమ్మడి ప్రయోజనాలు కాపాడుకొనేలా పటిష్ట వ్యూహంతో ముందుకెళ్లాలని ఉద్ఘాటించారు. మస్క్ తో సంభాషణ అనంతరం మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. మస్క్ తో చక్కటి సంభాషణ జరిగిందన్నారు. వేర్వేరు అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నామని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో తాము కలిసినప్పుడు చర్చించుకున్న అంశాలు మరోసారి ప్రస్తావనకు వచ్చాయన్నారు. ప్రధానంగా టెక్నాలజీ, ఇన్నోవేషన్ పైనే తమ మాట్లాడుకున్నామని వివరించారు. ఈ రెండు అంశాల్లో అమెరికాతో భాగస్వామ్యాన్ని మరింత దృఢతరం చేసుకొనేందుకు కట్టుబడి ఉన్నామని మోదీ స్పష్టంచేశారు. మరోవైపు ఇండియన్ మార్కెట్లో ప్రవేశించానికి టెస్లా ఏర్పాట్లు చేసుకుంటోంది. తొలుత ముంబై, ఢిల్లీ, బెంగళూరులో టెస్లా కార్లు విక్రయించబోతున్నారు. వేలాది టెస్లా కార్లు ఇండియాను ముంచెత్తబోతున్నాయి.

2023–24 రక్తహీనత నివారణలో ఏపీదే అగ్రస్థానం
సాక్షి, న్యూఢిల్లీ: ‘రక్తహీనత ముక్త్ భారత్’ పథకంలో అమలులో భాగంగా 2023–24లో పిల్లలు, బాలికలు, గర్భిణులకు ఐరన్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లు అందించే ప్రక్రియలో 91.1శాతం కవరేజీతో దేశంలోనే తొలి స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. 82.9శాతం కవరేజీతో తెలంగాణ ఏడో స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2024–25 రెండో త్రైమాసికంలో 15.4 కోట్ల మంది పిల్లలు, కౌమార బాలికలకు ఐరన్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లను అందించినట్లు తెలిపింది. ప్రతి నలుగురు భారతీయ మహిళల్లో ముగ్గురికి అందుతున్న ఆహారంలో ఐరన్ తక్కువగా ఉంటోందని పేర్కొంది. పురుషుల్లోనూ 25శాతం మందిలో.. జాతీయ ఆరోగ్య సర్వే–5 (2019–21) ప్రకారం భారతదేశంలో 67.1శాతం మంది 6 నుంచి 59 నెలల మధ్య వయసున్న పిల్లలు, 59.1శాతం మంది 15 నుంచి 19 సంవత్సరాల మధ్య గల కౌమార బాలికలు, 15–49 సంవత్సరాల మధ్య ఉన్న 52.2శాతం మహిళలు, గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్నారని పేర్కొంది. అయితే 15 నుంచి 49 సంవత్సరాల మధ్య పురుషుల్లో రక్తహీనత ప్రభావం మహిళలతో పోలిస్తే కాస్త తక్కువగానే ఉంది. ఈ వయసులోని మహిళల్లో 57శాతం రక్తహీనత ఉంటే.. పురుషుల్లో 25శాతం రక్తహీనత నమోదైంది. అదే సమయంలో తెలంగాణలోని 70శాతం మంది పిల్లల్లో, 64.7శాతం కౌమార బాలికల్లో, 53.2శాతం గర్భిణుల్లో రక్తహీనత ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 63.2శాతం పిల్లల్లో, 60.1శాతం బాలికల్లో, 53.7శాతం గర్భిణుల్లోలో రక్తహీనత సమస్య ఉందని జాతీయ ఆరోగ్య సర్వే–5 గుర్తించింది. కాగా.. రక్తహీనత ప్రపంచవ్యాప్తంగా 15 నుంచి 49 సంవత్సరాల వయసు గల 500 మిలియన్ల మహిళలను, 5 సంవత్సరాలలోపు (6–59 నెలలు) 269 మిలియన్ల పిల్లలను ప్రభావితం చేస్తోందని కేంద్రం తెలిపింది. కాగా దాదాపు 30శాతం గర్భిణులు కాని స్త్రీలు (539 మిలియన్లు), దాదాపు 37శాతం గర్భిణులు (32 మిలియన్లు) రక్తహీనతతో బాధపడుతున్నారు.

Delhi: ఎవరీ లేడీ డాన్?.. ఆ సంచలన కేసుతో లింకేంటి?
ఢిల్లీ: నగరంలో 17ఏళ్ల బాలుడు కునాల్ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మరో కోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసు సీలంపూర్‌లో ఓ లేడీ డాన్ చుట్టూ తిరుగుతోంది. బాలుడి హత్య వెనుక లేడీ గ్యాంగ్ స్టర్ జిక్రా ఉందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. జిఖ్రా తన కుమారుడిని చాలాసార్లు బెదిరించిందని.. ఆమె తుపాకీతో తిరుగుతూ ఉండేదన్నారు. అవకాశం దొరికితే నా కొడుకును చంపేస్తానని చెప్పేదని బాలుడి తండ్రి అన్నారు. జిక్రా గన్‌తో రీల్స్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన వీడియోలు కూడా ఉండగా, సీలంపూర్‌లో ఆమెపై పలు కేసులు కూడా నమోదయ్యాయి.జిక్రాకు పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ హషీమ్ బాబాతో ప్రేమ సంబంధం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఆమెకు అండర్ వరల్డ్‌తో కూడా సంబంధాలు ఉన్నాయని సమాచారం. గతంలో ఢిల్లీలో బడా క్రిమినల్ అయిన గ్యాంగ్‌స్టర్ హషీమ్ బాబా భార్య జోయా ఆమెను బౌన్సర్‌గా నియమించినట్లు సమాచారం. ప్రస్తుతం 10-15 మందితో జిక్రా తన సొంత ముఠాను నడిపిస్తుందనే ప్రచారం జరుగుతోంది.పాలస్తీనియన్ జెండా ప్రొఫైల్ ఫోటో ఉన్న జిక్రాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 15,300 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ఇటీవలి పోస్ట్‌లలో చాలా వరకు ఆమె వివిధ పాటలకు డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తాయి. గన్‌తో ప్రజలను బెదిరిస్తూ భయభ్రాంతులకు గురిచేసేంది. తుపాకులతో రీల్స్ చేసినందుకు ఆయుధ చట్టం కింద జిక్రాపై ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయ్యింది. ఆమె పోలీసు కస్టడీలోనూ వీడియోలు తీసి ఆన్లైన్లో పోస్ట్ చేసేంది. కునాల్ వర్గానికి చెందిన వ్యక్తులు గతంలో జిక్రా సోదరుడు సాహిల్‌పై దాడి చేయగా, దానికి ప్రతీకారంగానే కునాల్‌ను హత్య చేసి ఉండొచ్చని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు.

అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌కు భారత వ్యోమగామి.. ముహూర్తం ఫిక్స్
న్యూఢిల్లీ: భారత్ తన అంతరిక్ష యాత్రలో అరుదైన మైలురాయిని చేరుకోవడానికి మూహూర్తం ఖరారైంది. భారత్ కు చెందిన వ్యోమగామి శుభాన్ష్ శుక్లా అంతర్జాతీయ స్పేస్ స్టేషన్((ఐఎస్ఎస్) లోకి వెళ్లనున్నారు. వచ్చే నెలలో శుభాన్ష్ శుక్లా స్పేస్ స్టేషన్ లో అడుగుపెట్టే విషయాన్ని తాజాగా వెల్లడించారు శాస్త్ర సాంకేతికత మంత్రి డా. జితేందర్ సింగ్. ‘అంతర్జాతీయ స్పేష్ మిషన్ భారత వ్యోమగామిని తీసుకువెళ్లడానికి మూహూర్తం ఖరారు చేయబడింది . వచ్చే నెలలో ‘గగన్ యాత్రి’ గ్రూప్ కు కెప్టెన్ గా ఉన్న శుభాన్ష్ శుక్లా అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ లో అడుగుపెట్టనున్నారు. ఇది భారత అంతరిక్ష యాత్రలో సువర్ణాధ్యాయంగా లిఖించబడుతుంది. ఇస్రో సరికొత్త హద్దులను ఛేదించడానికి ఒక భారతీయ వ్యోమగామి అంతరిక్ష యాత్రకు సిద్ధంగా ఉన్నాడు.మన అంతరిక్ష కలలు మరింత ఎత్తును తాకడానికి ఈ సన్నాహక యాత్ర కచ్చితంగా మైలురాయి కాబోతుంది’ అని జితేందర్ సింగ్ పేర్కొన్నారు. యాక్సియోమ్ 4 మిషన్ లో భాగంగా స్పేస్ ఎక్స్ అభివృద్ధి చేసిన స్పేస్ క్రాఫ్ కు నాసా మాజీ ఆస్ట్రోనాట్ పెగ్గీ విటన్స్ సారథ్యం వహిస్తున్నారు. దీనికి పైలట్ గా శుభాన్ష్ శుక్లా వ్యవహరించనున్నారు. వీరిద్దరితో పాటు ఉజ్ నాన్ స్కీ(పోలెండ్), టిబోర్ కపూ( హంగేరీ)లు అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ కు చేరుకుని అక్కడ రెండు వారాల పాటు పరిశోధనలు చేసిన అనంతరం భూమికి తిరిగి వస్తారు. ఈ ప్రయోగంలోభారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో భాగస్వామిగా ఉంది. ఇస్రో వ్యోమగామి శుభాన్ష్ శుక్లా ఐఏఎన్ఎస్ లోకి అడుగుపెడితే అక్కడకు వెళ్లిన తొలి భారతీయుడిగా, రోదసిలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా రికార్డు సృష్టిస్తారు. ఇస్రో మావనసహిత అంతరిక్ష మిషన్‌లో భాగంగా గగన్‌యాన్‌కు ఎంపికైన నలుగురు వ్యోమగాముల్లో శుభాన్ష్ ఒకరుగా ఉన్నారు.
ఎన్ఆర్ఐ

హాంగ్‌కాంగ్‌లో ఘనంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలు
హాంకాంగ్‌లో ఉగాది వేడుకలు తెలుగు కుటుంబాలకు యెంతో ఉత్సాహాన్నిచ్చాయి, తెలుగు సంవత్సరాదిని ఐక్యతతో, సాంస్కృతిక సంపదతో జరుపుకుంన్నారు. ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య (THKTS) నిర్వహించే ఈ కార్యక్రమం, అనధికారికంగా ఇరవై రెండు సంవత్సరాలుగా మరియు పదమూడు సంవత్సరాల అధికారిక సంస్థగా తెలుగు సేవ కొనసాగిస్తోంది. చింగ్ మింగ్ ఉత్సవం కారణంగా హాంకాంగ్‌లో సుదీర్ఘ వారాంతం సెలవలు ఉన్నప్పటికీ, విశేషమైన సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి హాంకాంగ్ & మకావులోని భారత కాన్సులేట్ జనరల్ నుంచి కాన్సుల్ శ్రీ కూచిభొట్ల వెంకట రమణ గారు; హోం అఫైర్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ జిల్లా అధికారి శ్రీ మొక్ మాంగ్-చాన్ గారు; ఎన్.ఎ.ఎ.సి టచ్ సెంటర్ ప్రాంతీయ డైరెక్టర్ శ్రీమతి కోనీ వాంగ్ గారు; మరియు హాంకాంగ్‌లో ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్ ఉన్నత అధికారి శ్రీ దేవేష్ శర్మ గారు హాజరయ్యారు.చీకటిని పారద్రోలడానికి మరియు కొత్త ప్రారంభాలను స్వాగతించడానికి ప్రతీకగా గౌరవనీయ అతిథుల దీప ప్రజ్వలనతో ఉగాది వేడుకలు ప్రారంభమైంది. ప్రార్థన తర్వాత, హాజరైన వారిని "మా తెలుగు తల్లి" శ్రావ్యమైన పాట ఆకట్టుకుంది,తెలుగుతనాన్ని ప్రేక్షక హృదయాలలో ప్రతిధ్వనించింది. ప్రముఖుల ప్రసంగాలు సమాజ ప్రయాణం మరియు దాని సభ్యులను బంధించే లక్ష్యం గురించి ప్రతిబింబించాయి. శ్రీ కూచిభొట్ల వెంకట రమణ గారు తెలుగు భాష మరియు సాంస్కృతిక విలువలను పునరుద్ఘాటిస్తూ ఇది భావితరాలికి అందించాల్సిన కర్తవ్య ప్రాముఖ్యతని గుర్తుచేశారు. తెలుగు సమాఖ్య ద్వారా హాంగ్ కాంగ్ తెలుగు ప్రజలకు చేస్తున్న సేవలను ఆయన అభినందించారు.తన ప్రసంగంలో, తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు హాంకాంగ్‌లోని తెలుగు వారిలో ఒక అనుబంధ భావన మరియు సంబంధాన్ని సృష్టించడం ముఖ్యోద్దేశంగా సంస్థ ప్రయాణం మరియు దాని లక్ష్యం గురించి ప్రతిబింబించారు. సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడం మరియు సమాజానికి తిరిగి ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను ఆమె యెంతో అవసరం అని చెప్పారు. హాంకాంగ్ మరియు భారతదేశంలోని వెనుకబడిన వర్గాలకు మద్దతు ఇవ్వడానికి తమ సంస్థ చేస్తున్న ప్రయత్నాలను ప్రస్తావించారు.వినోదాత్మక స్కిట్ వైవిధ్యమైన ప్రదర్శనలను సజావుగా అనుసంధానించింది, ప్రేక్షకుల హర్షధ్వానాలు - కరతాళధ్వనులతో సాంస్కృతికోత్సవం ముగిసింది. ప్రదర్శలిచ్చిన కళాకారులను కాన్సల్ శ్రీ కూచిభొట్ల వెంకట్ రమణ గారు పురస్కరాలు అందజేస్తూ అభినందించారు.హాంకాంగ్‌లోని తెలుగు సమాజం శ్రీ విశ్వవాసు నామ ఉగాది వేడుకలను ప్రారంభిస్తున్నందున, తెలుగు నూతన సంవత్సర ప్రారంభాన్ని సూచిస్తూ సాంప్రదాయ ఉగాది పచ్చడితో, తెలుగు భోజనంతో వేడుకలు ముగిశాయి. ఈ కార్యక్రమం సమాజం యొక్క ఐక్యత, సేవా స్ఫూర్తికి నిదర్శనం, స్నేహం మరియు సేవా బంధాలను పెంపొందించడం, ఆనందం, విజయం మరియు సద్భావనతో నిండిన సంవత్సరాన్ని వాగ్దానం చేయడం మరియు తెలుగు ప్రజల గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకోవడం తార్కాణం.అధ్యక్షురాలు తన కృతజ్ఞతా ప్రసంగంలో,గౌరవనీయులైన అతిథులు, కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సేవకులు, సమాఖ్య సభ్యులు, స్నేహితులు మరియు తుంగ్ చుంగ్ కమ్యూనిటీ హాల్ సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

రాజాంలో విద్యార్ధులకు నాట్స్ ఉపకారవేతనాలు
జన్మభూమి రుణం తీర్చుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే నాట్స్ తాజాగా శ్రీకాకుళం జిల్లా రాజాం లో విద్యార్ధులకు ఉపకారవేతనాలు, మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసింది. నాట్స్ ఫినిక్స్ చాప్టర్ జాయింట్ కో ఆర్డినేటర్ సతీశ్ గంథం తన సొంత ఊరికి చేతనైన సాయం చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రాజాంలోని శ్రీ విద్యానికేతన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో సతీశ్ గంథం విద్యార్ధులకు ఉపకారవేతనాలు అందించారు. అలాగే ఇక్కడే మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు వారికి ఉచితంగా కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు పాల్గొని సతీశ్ గంథం సేవా నిరతిని ప్రశంసించారు. జన్మభూమి రుణం తీర్చుకునేందుకు నాట్స్ ఫినిక్స్ చాప్టర్ జాయింట్ కో ఆర్డినేటర్ సతీష్ గంథం చూపిన చొరవను నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి లు ప్రత్యేకంగా అభినందించారు.

డల్లాస్‌లో నాట్స్ అడాప్ట్ ఎ పార్క్ కార్యక్రమం
అమెరికాలో సామాజిక బాధ్యత పెంచే కార్యక్రమాలను నాట్స్ తరచూ చేపడుతోంది. ఈ క్రమంలోనే నాట్స్ అడాప్ట్ ఎ పార్క్ కార్యక్రమాన్ని డల్లాస్‌లోని ఫ్రిస్కో నగరంలో చేపట్టింది. డల్లాస్ నాట్స్ విభాగం ఆధ్వర్యలో ప్రిస్కోలోని మోనార్క్ పార్క్‌లో 50 మందికి పైగా నాట్స్ సభ్యులు, తెలుగు విద్యార్ధులు పాల్గొని పార్క్‌ని శుభ్రం చేశారు. ప్రకృతిని కాపాడేందుకు, శుభ్రతను ప్రోత్సహించేందుకు అడాప్ట్ ఎ పార్క్ వంటి కార్యక్రమాలు ఎంతో మేలును కలిగిస్తాయని, పార్కులను శుభ్రంగా ఉంచడం వల్ల పర్యావరణ హితమైన జీవనశైలికి మార్గం సుగమం అవుతుందని నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి అన్నారు. విద్యార్ధుల్లో సామాజిక బాధ్యత పెంచేందుకు నాట్స్ చేపట్టిన ఈ సామాజిక సేవా కార్యక్రమం ద్వారా విద్యార్ధుల సేవను అమెరికా ప్రభుత్వం గుర్తిస్తుందని నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత తమ విలువైన సమయాన్ని వినియోగించి పార్కును శుభ్రపరిచారు. చెత్తను తొలగించారు. చెట్లకు నీరు పట్టారు ప్రకృతి పరిరక్షణకు తోడ్పడ్డారు. విద్యార్ధులకు ఇది ఒక సామాజిక బాధ్యతగా మాత్రమే కాకుండా, భవిష్యత్తులో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించే గొప్ప అనుభవంగా మిగులుతుందని డల్లాస్ చాప్టర్ వ్కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటి అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించటానికి ప్రోత్సాహాన్ని అందిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో జాయింట్ ట్రెజరర్ రవి తాండ్ర, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ సత్య శ్రీరామనేని, నేషనల్ కోఆర్డినేటర్ ఫర్ మీడియా రిలేషన్స్ కిషోర్ నారె, నాట్స్ సభ్యులు శివ మాధవ్, బద్రి, కిరణ్, పావని, శ్రీ దీపిక, ఉదయ్, వంశీ, వీరా తదితరులు పాల్గొన్నారు. మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! రేపటి తరంలో సామాజిక బాధ్యత పెంచే అడాప్ట్ ఎ పార్క్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన డల్లాస్ చాప్టర్ జట్టుకు నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి తమ అభినందనలు తెలిపారు. జూలై 4,5,6 తేదీల్లో టంపాలో జరిగే 8 వ అమెరికా తెలుగు సంబరాలకు డల్లాస్‌లో ఉండే తెలుగువారంతా తరలిరావాలని కోరారు.

30వ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతల ప్రకటన
గత మూడు దశాబ్దాల సత్ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.....“విశ్వావసు” నామ సంవత్సర ఉగాది (మార్చ్ 30, 2025) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన 30వ ఉగాది ఉత్తమ రచనల పోటీ లో ఈ క్రింది రచనలు ఉత్తమ రచనలుగా వంగూరు ఫౌండేషన్ ఎంపిక చేసి విజేతల వివరాలను ప్రకటించింది. అలాగే విజతలకు శాయి రాచకొండ, దీప్తి పెండ్యాల, వంగూరి చిట్టెన్ రాజు అభినందనలు తెలిపారు.వంగూరు ఫౌండేషన్ ప్రకటనఅమెరికా, కెనడా, భారత దేశం, దక్షిణ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, ఖతార్, చెకొస్లొవేకియా, అబుదాభి, బోస్ట్వానా, దుబై తదితర ప్రాంతాల నుండి ఈ పోటీలో పాలు పంచుకుని, విజయవంతం చేసిన రచయితలకు మా ధన్యవాదాలు. చేయి తిరిగిన రచయితలు, ఔత్సాహిక రచయితలూ అనేక మంది ఈ పోటీ కాని పోటీలో పాల్గొనడం సంతోషంగా ఉంది. అన్ని రచనలకూ సర్వ హక్కులూ రచయితలవే. బహుమతి పొందిన రచనలు, ప్రచురణకి అర్హమైన రచనలూ కౌముది.నెట్, సిరిమల్లె. కామ్ మొదలైన పత్రికలలో ఆయా సంపాదకుల నిర్ణయానుగుణంగా ప్రచురించబడతాయి.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! అందుబాటులో ఉన్న విజేతల నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు ఏప్రిల్ 13, 2025 నాడు శ్రీ త్యాగరాజ గాన సభ వేదిక, హైదరాబాద్ లో నిర్వహించబడుతున్న "అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం" లో ఆహూతుల సమక్షంలో బహూకరిస్తాం.30వ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతలుప్రధాన విభాగం – 30వ సారి పోటీఉత్తమ కథానిక విభాగం విజేతలు“కాంతా విరహగురుణా”- పాణిని జన్నాభట్ల, Boston, MA,)“నల్లమల్లె చెట్టు” - గౌతమ్ లింగా (Johannesburg, South Africa)ప్రశంసా పత్రాలు‘లూసఫర్’ -నిర్మలాదిత్య (భాస్కర్ పులికల్), Tampa, FL‘తెలివి’ - మురళీశ్రీరాం టెక్కలకోట, Frisco, TXఉత్తమ కవిత విభాగం విజేతలు“వర్ణాక్షరం” - గౌతమ్ లింగా, (జొహానెస్ బర్గ్, దక్షిణ ఆఫ్రికా)“కృత్రిమ మేధా వికూజనము” – స్వాతి శ్రీపాద (Detroit, MI)ప్రశంసా పత్రాలు“డయాస్పోరా ఉగాది పచ్చడి”- సావిత్రి మాచిరాజు, Edmonton, Canada“చెప్పిన మాట వింటా!”- అమృత వర్షిణి, Parker, CO, USA“మొట్టమొదటి రచనా విభాగం” -17వ సారి పోటీ“నా మొట్టమొదటి కథ” విభాగం విజేతలు‘ప్రత్యూష రాగం -కైలాస్ పులుగుర్త’ – హైదరాబాద్,“మనో నిశ్చలత” – సీతా సుస్మిత, మద్దిపాడు గ్రామం,ఒంగోలు - ప్రశంసా పత్రం“మంకెన పూలు” -సుజాత గొడవర్తి, ఆశ్వాపురం, తెలంగాణా - ప్రశంసా పత్రం"నా మొట్ట మొదటి కవిత” విభాగం విజేతలు“ఇంకెంత కాలమని?” కరిపె రాజ్ కుమార్, ఖానాపూర్, నిర్మల్ జిల్లా, తెలంగాణా “వర్షాగమనానికి ఆశగా ఎదురుచూసే ప్రకృతిని హృద్యంగా, కొంత కరుణాత్మకంగా వర్ణించే కవిత”“అచ్చం నాలానే” -మళ్ళ కారుణ్య కుమార్, అమ్మవారి పుట్టుగ (గ్రామం), శ్రీకాకుళం“వయసు ఒక అనిరిర్ధారిత సంఖ్య” - ప్రొఫెసర్ దుర్గా శశికిరణ్ వెల్లంచేటి, Bangalore, India-
క్రైమ్

బంగ్లాదేశ్ యువతులతో హైదరాబాద్‌లో వ్యభిచారం
సాక్షి, హైదరాబాద్: రాజధానితో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటీవల విదేశీ యువతులతో వ్యభిచారం చేయిస్తున్న అనేక ముఠాలు పట్టుబడ్డాయి. ఈ బాధితుల్లో అత్యధికం బంగ్లాదేశీ యువతులే ఉంటున్నారు. దీంతో వీరు దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న విధానంపై దర్యాప్తు అధికారులు దృష్టి పెట్టారు. ప్రాథమిక ఆధారాలను బట్టి కొన్ని కీలక విషయాలు గుర్తించారు. ఈ మనుషుల అక్రమ రవాణా దందాకు పశ్చిమ బెంగాల్ కీలకంగా ఉన్నట్లు తేలింది. అక్కడి కొందరు సూత్రధారులు బంగ్లాదేశ్‌లోనూ నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. వారి ద్వారా ఒకరిని అక్రమంగా బోర్డర్ దాటించడానికి రూ.4 వేలు చొప్పున వసూలు చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. కీలకంగా వ్యవహరిస్తున్న రాహుల్... బంగ్లాదేశీయులతో పాటు మయన్మారీల అక్రమ రవాణా దందాకు పశ్చిమ బెంగాల్‌లోని సరిహద్దు జిల్లాలు కీలకంగా మారాయి. ఆయా దేశాల్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఇటీవలి కాలంలో అక్రమ రవాణా పెరిగింది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు కొత్తగా ముఠాలు పుట్టుకువచ్చాయి. వీటికి నేతృత్వం వహిస్తున్న వ్యక్తులకు ఇటు పశ్చిమ బెంగాల్ తో పాటు అటు బంగ్లాదేశ్‌లోని సరిహద్దు గ్రామాల్లో అనుచరులు ఉంటున్నారు. ఇలాంటి సూత్రధారుల్లో పశ్చిమ బెంగాల్ లోని బసిర్హత్ జిల్లా సోలదాన గ్రామానికి చెందిన రాహుల్ అమన్ దాలి కీలకమని దర్యాప్తు అధికారులు గుర్తించారు. అక్రమంగా సరిహద్దులు దాటాలని భావించిన బంగ్లాదేశీయులు ఆ దేశంలో ఉన్న సరిహద్దు గ్రామాలకు చేరుతున్నారు. వీరిని సంప్రదిస్తున్న రాహుల్ అనుచరులు రూ.4 వేలకు.. డిమాండ్ ఎక్కువగా ఉంటే రూ.5 వేలకు ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఇక్కడి నుంచే కథ నడిపించే రాహుల్... ఈ మొత్తాన్ని ఆ యువతులతోనే బంగ్లాదేశ్‌లోని సరిహద్దు గ్రామాల్లో ఉండే దుకాణదారుల వద్ద భారత కరెన్సీలోకి మార్పిస్తున్నాడు. మరికొందరు దళారుల ద్వారా ఈ నగదు బ్యాంకు ఖాతా లేదా యూపీఐ ద్వారా తనకు చేరేలా చేస్తున్నాడు. ఈ మొత్తం నుంచి రూ.1000 కమీషన్‌గా సరిహద్దుకు అటు–ఇటు ఉన్న గ్రామాలకు చెందిన తన అనుచరులకు ఇస్తుంటాడు. అక్కడ ఉన్న వారు అనువైన ప్రాంతం, సమయంలో యువతుల్ని పంపిస్తుండగా... ఇక్కడ ఉన్న వాళ్లు రిసీవ్ చేసుకుని సురక్షిత ప్రాంతానికి తరలిస్తుంటారు. రాహుల్ ఎక్కడా తెరపైకి రాకుండా ఈ వ్యవహారం నడిపిస్తుంటాడని అధికారులు చెబుతున్నారు. 2017 నుంచి ఈ దందా చేస్తున్న రాహుల్‌కు కోల్‌కతాకు చెందిన కొన్ని ముఠాలతో సంబంధాలు ఉన్నాయి. వారి సహకారంతోనే డిమాండ్ చేసిన మొత్తం చెల్లించిన వారికి నకిలీ గుర్తింపుకార్డులు తయారు చేయించి ఇస్తున్నాడు. ఇలా ఇక్కడి ఆధార్, ఓటర్ ఐడీలు పొందుతున్న బంగ్లాదేశీ యువతులు పశ్చిమ బెంగాల్ వాసులుగా చెలామణి అవుతున్నారు. హైదరాబాద్ సహా మరికొన్ని చోట్లకు... కొందరు దళారులు సదరు యువతులను హైదరాబాద్ సహా మరికొన్ని నగరాలకు తరలిస్తున్నారు. ఉద్యోగం పేరుతో తీసుకువచ్చి వ్యభిచార కూపాల్లోకి నెడుతున్నారు. అతి తక్కువ మంది మాత్రం మసాజ్ పార్లర్లు, బార్ అండ్ రెస్టారెంట్లలో పని చేస్తున్నారు. ఇదే పంథాలో కొందరు బంగ్లాదేశ్ యువకులు కూడా అక్రమంగా సరిహద్దులు దాటి వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మనుషుల అక్రమ రవాణా నెట్వర్క్ పూర్వాపరాలతో ఓ సమగ్ర నివేదికను సిద్ధం చేస్తున్నారు. ఎవరెవరు కీలకంగా వ్యవహరిస్తున్నారు? ఎక్కడ నుంచి సరిహద్దులు దాటిస్తున్నారు? తదితర అంశాలను నిఘా వర్గాలతో పాటు సరిహద్దు భద్రతా దళం దృష్టికి తీసుకెవెళ్లాలని దర్యాప్తు అధికారులు నిర్ణయించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండల్లో నమోదైన మనుషుల అక్రమ రవాణా కేసుల్లో కొన్ని దర్యాప్తు నిమిత్తం జాతీయ దర్యాప్తు సంస్థకు (ఎన్ఐఏ) చేరాయి. దీంతో ఆ విభాగంతో సమన్వయం ఏర్పాటు చేసుకుని, సమాచార మార్పిడి చేసుకోనున్నట్లు తెలిసింది.

ఈ సైకిళ్లు ఎవరికి ఇవ్వాలి దేవుడా?
ఖమ్మం: వేసవి సెలవులు వచ్చేశాయి.. ఒకటి, రెండు రోజుల్లో వెళ్లి మనవళ్లను తీసుకురావాలి.. నెలపాటు వారితో ఇంట్లో సందడిగా ఉంటుంది.. అని భావించిన ఆ తాత హతాశుడయ్యే సమాచారం అందింది. మనవళ్లు ఇద్దరిని కుమార్తె హత్య చేసి ఆమె సైతం బలవన్మరణానికి పాల్పడిందని తెలియడంతో కన్నీరమున్నీరయ్యాడు. మనవళ్లు గత ఏడాది వచ్చినప్పుడు అడిగినట్లుగా కొన్న సైకిళ్లు ఎవరికి ఇవ్వాలి అంటూ ఆయన రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. పెనుబల్లి మండలం తాళ్లపెంటకు చెందిన గువ్వల వెంకటరెడ్డి సింగరేణిలో ఉద్యోగం చేస్తున్నాడు. ఐదేళ్ల క్రితం సత్తుపల్లిలోని బైపాస్‌రోడ్ టీచర్స్ కాలనీలో ఇల్లు కట్టుకుని నివస్తుండగా ఆయనకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె తేజస్వినిరెడ్డి(35) వివాహం 13ఏళ్ల క్రితం సత్తుపల్లి మండలం రేజర్లకు చెందిన గండ్ర వెంకటేశ్వరరెడ్డితో జరగగా వారికి కుమారులు హర్షిత్‌రెడ్డి(11), అశిష్‌రెడ్డి(7) ఉన్నారు. కుటుంబమంతా హైదరాబాద్‌లోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తుండగా గురువారం వెంకటేశ్వరరెడ్డి విధులకు వెళ్లొచ్చేలోగా కుమారులిద్దరిని చంపిన తేజస్విని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా, వెంకటరెడ్డి కుమారుడు, తేజస్విని తమ్ముడు సైతం 14ఏళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు కుమారుడు, ఇప్పుడు కుమార్తె, మనవళ్ల మృతితో వెంకటరెడ్డి కుటుంబీకుల రోదనలను ఆపడం ఎవరి వల్లా కాలేదు. ఘటనా సమాచారం తెలియగానే కుటుంబమంతా హైదరాబాద్ వెళ్లగా ముగ్గురి మృతదేహాలకు హైదరాబాద్‌లోనే అంత్యక్రియలు నిర్వహించారు.

అనుమానంతో బ్లేడుతో భార్య గొంతు కోసిన భర్త
క్రోసూరు(పల్నాడు): స్థానిక బోయ కాలనీలో భార్యపై అనుమానం పెంచుకుని భర్త బ్లేడుతో గొంతుకోసిన సంఘటన శుక్రవారం జరిగింది. స్టేషన్ రైటర్ దాసు వివరాల ప్రకారం.. బోయ కాలనీకి చెందిన చార్ల శ్రీను భార్య మల్లమ్మ. ఆమె ఎవరితోనో ఫోనులో మాట్లాడుతుండటంతో అనుమానపడి శ్రీను బ్లేడుతో దాడి చేసి గొంతు కోశాడు. చుట్టపక్కల వారు ఆమెను సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆమెకు వైద్యులు 25 కుట్లు వేశారు. ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించాలని వైద్యులు సూచించారు. శ్రీను, మల్లమ్మలకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం కూడా అయింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు రైటర్ దాసు తెలిపారు.

ఏసీబీ వలలో నస్పూర్ ఎస్సై
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/నస్పూర్: క్షుద్ర పూజల కేసులో జప్తు చేసిన నగదును బాధితుడికి ఇవ్వక సొంతానికి వాడుకున్న ఎస్సై అవినీతి నిరోధక శాఖకు చిక్కి జైలు పాలయ్యాడు. ఆదిలాబాద్ రేంజీ డీఎస్పీ పి.విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా నస్పూర్ ఎస్సై నెల్కి సుగుణాకర్ గత జనవరి 26న క్షుద్రపూజలతో రెట్టింపు డబ్బులు చేస్తానని మహారాష్ట్రకు చెందిన ఓ పూజరి మోసం కేసులో రూ.2లక్షలు జప్తు చేశాడు. కేసు ఫిర్యాదుదారుడు ప్రభంజన్ కోర్టు నుంచి నగదు విడుదల కోసం ఈ నెల 4న ఉత్తర్వులు తీసుకు రాగా, ఇచ్చేందుకు ఎస్సై దాట వేశాడు. రూ.1.50లక్షలు బాధితుడి చేతిలో పెడుతూ ఫొటో దిగి, వెంటనే డ్రాలో వేసుకున్నాడు. రూ.2లక్షలు తీసుకున్నట్లు సంతకం చేయమని ఒత్తిడి చేయగా బాధితుడు ఒప్పుకోలేదు. ఈ నెల 8న మళ్లీ స్టేషన్‌కు వెళ్లి ఎస్సైని అడిగితే, డబ్బులు ఖర్చయ్యాయని, రూ.50వేలు ఉన్నాయని, నీ మీద కూడా కేసు అయ్యేది ఇచ్చింది తీసుకో అంటూ బెదిరించి పంపేశాడు. ఈ నెల 10న రూ.70వేలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాక ఇవ్వలేదు. చివరకు రూ.50వేలకు మరో పది వేలు కలిపి ఓ వైన్స్ వద్ద తీసుకోవాలని చెప్పాడు. ఇదే కేసులో బాధితుడి పేరు లేకుండా ఉండేందుకు ఎస్సై బినామీ డి.దీపక్‌కు ఫోన్ పేలో రూ.30వేలు చెల్లించాడు. విసిగెత్తిన బాధితుడు ఏసీబీ టోల్ ఫ్రీ 1064ను సంప్రదించగా, ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి ఎస్సై ఫోన్లో మాట్లాడిన ఆడియో రికార్డులు, ఫోన్ పే చెల్లింపు, జప్తు చేసిన నగదు లేకపోవడం ఆధారాలు సేకరించారు. ఎఫ్ఐఆర్ చేసి ఎస్సైని కరీంనగర్ ఏసీబీ కోర్టు ముందు ప్రవేశపెట్టగా రిమాండ్ విధించారు. 2020బ్యాచ్‌కు చెందిన ఎస్సై గతేడు జూలై నుంచి నస్పూర్ ఎస్సైగా పని చేస్తున్నారు.
వీడియోలు


కెనడాలో మరోసారి కాల్పులు.. భారతీయ విద్యార్థిని మృతి


అమరావతిలోనే లక్షల కోట్లు పెట్టడమంటే రాష్ట్రంపై అప్పుల భారం వేయడమే


హాలీవుడ్ రేంజ్ లో ఎన్టీఆర్ ఎంట్రీ.. 30 రోజుల ఫైటింగ్ షూట్..!


విశాఖలో బీసీ మహిళను మేయర్ పదవి నుంచి దించేసిన కూటమి సర్కార్


వైఎస్సార్సీపీ నేతల పేర్లు చెప్పకపోతే వ్యభిచారం కేసు పెడతారా?


పోలీసుల భయంతో.. హోటల్ మూడో అంతస్తు నుంచి దూకేసి నటుడు


అడ్డదారిలో GVMC మేయర్ పై అవిశ్వాసం నెగ్గిన కూటమి సర్కార్


డబ్బు కోసం నీతిమాలిన రాజకీయాలు చేయను.. కూటమికి కార్పొరేటర్ శశికళ కౌంటర్


బెల్టు షాపుల బాద్షా.. జగన్ పై విష ప్రచారం


పవన్ సవాల్.. టీడీపీకి దిమ్మతిరిగింది!