Top Stories
ప్రధాన వార్తలు

ఆపరేషన్ సిందూర్.. పాక్ దాడులపై ఇండియన్ ఆర్మీ ప్రకటన
India-Pakistan War Updates:👉త్రివిధ దళాధిపతులతో రాజ్‌నాథ్ సింగ్ భేటీసరిహద్దులో ఉద్రిక్తతలపై రాజ్‌నాథ్ సింగ్ సమీక్షప్రస్తుత పరిస్థితులపై సమీక్షిస్తున్న రక్షణ మంత్రితదనంతర వ్యూహాలపై చర్చిస్తున్న రాజ్‌నాథ్ సింగ్👉అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక ప్రకటనభారత్ - పాక్ యుద్ధం మధ్యలో మేం జోక్యం చేసుకోంఇది మాకు సంబంధం లేని విషయంఆయుధాలు పక్కన పెట్టమని మేము ఎవరిని కోరంఏదైనా ఉంటే దౌత్య మార్గాల్లో ప్రయత్నాలు చేస్తాంఈ ఘర్షణలు అణు యుద్ధానికి తీయకుండా ఉండాలని కోరుకుంటున్నాం👉ఢిల్లీలో హైఅలర్ట్.. ఇండియా గేట్ దగ్గర భద్రత పెంపుఢిల్లీ నుంచి జమ్మూ వెళ్లే రైళ్లన్నీ నిలిపివేతఢిల్లీ నుంచి గుజరాత్, రాజస్థాన్ వెళ్లే వాహనాలు బంద్👉కాసేపట్లో సీడీఎస్, త్రివిధ దళాల అధిపతులతో రాజ్‌నాథ్ సింగ్ భేటీపాకిస్థాన్ దాడులు, సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులను సమీక్షించనున్న రక్షణ మంత్రిజమ్మూ చేరుకున్న సీఎం ఒమర్ అబ్ధుల్లాపరిస్థితిని సమీక్షిస్తున్న ఒమర్ అబ్ధుల్లాహోంమంత్రి అమిత్‌షాతో బీఎస్ఎఫ్ చీఫ్ భేటీ 👉ఆపరేషన్ సిందూర్.. పాక్ దాడులపై ఇండియన్ ఆర్మీ ప్రకటనపాకిస్థాన్ సాయుధ దళాలు నిన్న మధ్య రాత్రి పశ్చిమ సరిహద్దు వెంబడి డ్రోన్లు ఆయుధ సామగ్రితో అనేక దాడులను చేశాయి.జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పాక్ దళాలు కాల్పుల విరమణ ఉల్లంఘనలను పాల్పడ్డాయిడ్రోన్ దాడులను భారత దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయిభారత సైన్యం దేశం యొక్క సార్వభౌమత్వాన్ని ప్రాదేశిక సమగ్రతను కాపాడటానికి కట్టుబడి ఉందిదుర్మార్గపు కుట్రలకు దీటుగా స్పందిస్తాం👉పాకిస్థాన్‌లో మరోసారి బలూచిస్థాన్ ఆర్మీ దాడిహజారా, క్వెట్టాపై బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ కాల్పులు👉పాకిస్థాన్‌లో అంతర్గత సంక్షోభంపాకిస్తాన్ వ్యాప్తంగా పీటీఐ నిరసన ర్యాలీలుప్రధాని షెహబాజ్ అసమర్థ ప్రధాని అంటూ నినాదాలుఇప్పటికే సురక్షిత ప్రాంతానికి పారిపోయిన షెహబాజ్👉ఆపరేషన్ సింధూర్ .3.o పై ఉదయం 10 గంటలకి మీడియా సమావేశంరాత్రి నిర్వహించిన దాడులపై బ్రీఫింగ్కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రి, ఆర్మీ ప్రతినిధుల మీడియా బ్రీఫింగ్జమ్ము సరిహద్దు గ్రామాల్లో సీఎం ఒమర్ అబ్దుల్లా పర్యటనపాకిస్తాన్ కాల్పుల్లో చనిపోయిన గాయపడిన కుటుంబాలను పరామర్శించనున్న ఒమర్ 👉నేడు దేశ భద్రతపై ఢిల్లీలో కీలక సమావేశాలుపాక్ దాడులు, భారత్ ప్రతిదాడులపై ప్రధాని మోదీ సమీక్షసరిహద్దులతో పరిస్థితులపై అజిత్ ధోవల్‌తో చర్చసరిహద్దు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడిన ప్రధాని మోదీపాకిస్థాన్‌పై కౌంటర్ ఎటాక్ దిగిన భారత్‌లాహోర్, సియాల్కోట్, కరాచీపై భారత్ ప్రతిదాడిజమ్మూ కశ్మీర్, రాజస్థాన్, పంజాబ్‌లో హై అలర్ట్‌ఆరేబియా సముద్రంలో భారత నౌకాదళం గర్జనపాక్‌పై గురిపెట్టిన 26 యుద్ధనౌకలుపాక్‌లోని ప్రధాన నగరాలను టార్గెట్ చేసిన ఇండియన్ నేవీఇప్పటికే కరాచీ సీ పోర్టును ధ్వంసం చేసిన భారత్ నేవీ👉సరిహద్దుల వెంబడి 15 సైనిక స్థావరాలపై దాడి యత్నాలు విఫలం కావడంతో గురువారం పాక్ మరింతగా పేట్రేగిపోయింది. రాత్రివేళ పాక్ ఫైటర్ జెట్లు భారత్‌పై తీవ్రస్థాయిలో దాడులకు తెరతీశాయి. రాజస్తాన్ మొదలుకుని జమ్మూ కశ్మీర్ దాకా సరిహద్దుల పొడవునా పలుచోట్ల సైనిక లక్ష్యాలతో పాటు విచక్షణారహితంగా పౌర ఆవాసాలపైనా గురిపెట్టాయి.👉శ్రీనగర్, జమ్మూ విమానాశ్రయాలను ధ్వంసం చేసేందుకు విఫలయత్నం చేశాయి. జమ్మూ–శ్రీనగర్ హైవేపై భారీ పేలుడు చోటుచేసుకుంది. రాజౌరీ జిల్లాలో పలుచోట్ల పేలుళ్లు విని్పంచాయి. పాక్ దాడులన్నింటినీ సైన్యం సమర్థంగా అడ్డుకుంది. సత్వారీలోని జమ్మూ విమానాశ్రయం, సాంబా, ఆర్ఎస్ పుర, అరి్నయా తదితర ప్రాంతాలపైకి కనీసం 8కి పైగా క్షిపణులు దూసుకొచ్చే ప్రయత్నం చేయగా మధ్యలోని అడ్డుకుని కూల్చేసినట్టు ప్రకటించింది.👉మన ‘ఆకాశ్’, ఎంఆర్‌ఎస్‌ఏఎంతో పాటు అత్యాధునిక ఎస్–400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పాక్ క్షిపణులు, డ్రోన్లను ఎక్కడివక్కడ కూల్చేశాయి. పఠాన్‌కోట్‌లో రెండు, జమ్మూలో ఒక పాక్ యుద్ధ విమానాన్ని ఎస్–400 వ్యవస్థ నేలకూలి్చంది. వాటిలో రెండు జేఎఫ్–17, ఒక ఎఫ్–16 ఉన్నాయి. రెండు యుద్ధ విమానాలను నష్టపోయినట్టు పాక్ కూడా అంగీకరించింది. పఠాన్‌కోట్‌లో ఇద్దరు పైలట్లు మన బలగాలకు చిక్కినట్టు సమాచారం. ఆ వెంటనే పాక్‌పై సైన్యం విరుచుకుపడింది.👉ఇస్లామాబాద్, లాహోర్, సియాల్కోట్, కరాచీ, రావలి్పండిలపై దీర్ఘశ్రేణి క్షిపణులతో రెండోసారి భారీస్థాయిలో దాడులకు దిగింది. లాహోర్ తదితర నగరాల్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలన్నింటినీ సమూలంగా నాశనం చేసేసింది. పాక్‌లోని పంజాబ్ ప్రాంతంలో నెలకొన్న కీలక ఎయిర్‌బోర్న్ వారి్నంగ్ అండ్ కంట్రోల్ సిస్టం (ఏడబ్ల్యూఏసీఎస్)ను తుత్తునియలు చేసింది. పాక్ నగరాలు బాంబు పేలుళ్లతో దద్దరిల్లినా పౌర ఆవాసాలు, వ్యవస్థలకు నష్టం కలగని రీతిలో సైనిక వ్యవస్థలను మాత్రమే ఎంచుకుని అత్యంత కచి్చతత్వంతో దాడులు నిర్వహించినట్టు సైన్యం పేర్కొంది.👉సరిహద్దు భద్రతా చీఫ్‌లతో అమిత్ షా భేటీ ఇరువైపులా పరస్పర దాడుల వేళ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) సహా వేర్వేరు సరిహద్దు భద్రతా చీఫ్‌లతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. గురువారం రాత్రి ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో బీఎస్ఎఫ్, ఐటీబీపీ, సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ) బలగాల అధినేతలు పాల్గొన్నారు. అంతర్జాతీయ సరిహద్దుల వెంట తాజా పరిస్థితిని అడిగి తెల్సుకున్నారు.దేశవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ, జాతీయ విమానాశ్రయాల వద్ద భద్రతా పరిస్థితులపై సెంట్రల్ ఇండ్రస్టియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) చీఫ్‌తో అమిత్ షా చర్చించారు. ఇండో–పాక్ సరిహద్దుసహా బంగ్లాదేశ్ సరిహద్దు వెంట భద్రతను బీఎస్ఎఫ్ బలగాలు చూసుకుంటున్నాయి. ఇక చైనాతో సరిహద్దు వెంట పహారా బాధ్యతలను ఐటీబీపీ, నేపాల్, భూటాన్లతో సరిహద్దు భద్రతను సశస్త్ర సీమాబల్(ఎస్ఎస్బీ) బలగాలు పర్యవేక్షిస్తున్న విషయం విదితమే.

పాకిస్థాన్‌కు ఆర్థిక సంకెళ్లు?
ఢిల్లీ: పాకిస్తాన్ బెయిల్ ఔట్ ప్యాకేజీపై అంతర్జాతీయ ద్రవ్య నిధి బోర్డు (IMF) ఆలోచనలో పడింది.. 1.3 బిలియన్ డాలర్ల అప్పు ఇవ్వాలా ? వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకోనుంది. కాసేపట్లో ఐఎంఎఫ్ సమావేశం కానుంది. పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ అప్పు ఇవొద్దని భారత్ కోరుతోంది. పాకిస్థాన్‌కు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ అవుట్ ప్యాకేజ్ నిధులు విడుదల చేయవద్దని భారత డిమాండ్ చేస్తోంది.పాకిస్థాన్‌కు నిధులు విడుదల చేస్తే అవి ఉగ్రవాదులకు చేరుతాయని భారత్ స్పష్టం చేసింది. ఉగ్ర స్థావరాలను ఏర్పాటు చేసి భారత్‌పైకి ఎగదోస్తున్న పాకిస్థాన్‌ను అంతర్జాతీయంగా ఏకాకి చేయడమనే లక్ష్యంగా ఇండియా పావులు కదుపుతోంది. మరో వైపు, పాకిస్థాన్ ఐఎంఎఫ్ నుంచి తీసుకున్న నిధులను దారి మళ్లిస్తున్నట్టు తగిన ఆధారాలను కూడా భారత్ సమర్పించిన సంగతి తెలిసిందే.కాగా, ఆపరేషన్ సిందూర్ దాడిలో హతమైన ఉగ్రవాదులకు పాకిస్థాన్ సైన్యం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించటంపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇలాంటి పనులు ఆ దేశానికి అలవాటుగా మారాయని మండిపడింది. ఆపరేషన్ సిందూర్‌పై గురువారం ఢిల్లీలో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ.. పాక్‌లో లష్కరే తోయిబా ఉగ్రవాది నాయకత్వంలో ఆ దేశ సైన్యం, పోలీసులు ఉగ్రవాదుల మృతదేహాలకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్న ఫొటోలను ప్రదర్శించారు.ఇలాంటి చర్యలతో పాకిస్తాన్ ఏం సందేశం ఇవ్వాలనుకుంటోందని ప్రశ్నించారు. భారత్ దాడుల్లో సాధారణ పౌరులు మరణించారన్న పాకిస్తాన్ ప్రకటనను ఖండించారు. ‘దాడుల్లో నిజంగా సామాన్య పౌరులే మరణిస్తే.. మరి ఈ ఫొటోలో ఉన్నదేమిటి? సామాన్యుల మృతదేహాలను శవపేటికల్లో పెట్టి.. వాటిపై పాకిస్తాన్ జాతీయ జెండాలు కప్పి, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారా?’అని ఆశ్చర్యం వ్యక్తంచేశారు.తమ దాడుల్లో చనిపోయినవాళ్లంతా ఉగ్రవాదులేనని స్పష్టంచేశారు. ‘ఉగ్రవాదంతో మలినమైన చేతులను కడుక్కొనేందుకు పాకిస్తాన్ ప్రయతి్నస్తోంది. పాకిస్తాన్లో ఉగ్రవాదులే లేరని ఆ దేశ సమాచార శాఖ మంత్రి ఓ టీవీ చర్చలో ప్రకటించారు. కానీ, ఆ చర్చలోనే ఆయన తన ప్రకటనకు గట్టి సవాలు ఎదుర్కొన్నారు. ఉగ్రవాదానికి పాకిస్తానే కేంద్ర స్థానమని అనేక సందర్భాల్లో నిరూపణ అయ్యింది. ఇందుకు సంబంధించిన ఆధారాలు భారత్‌తోపాటు అనేక దేశాల వద్ద ఉన్నాయి’అని మిస్రీ పేర్కొన్నారు.

Subham Review: సమంత ‘శుభం’ మూవీ రివ్యూ
స్టార్ హీరోయిన్ సమంత నిర్మించిన తొలి సినిమా ‘శుభం’. ఇందులో ఆమె అతిథి పాత్రలో నటించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. దానికి తోడు సినిమా ప్రమోషన్స్‌లో సమంత పాల్గొనడం..వరుస ఇంటర్వ్యూలు ఇచ్చి ఆసక్తికర విషయాలు చెప్పడంతో ‘శుభం’పై బజ్ క్రియేట్ అయింది. ఓ మోస్తరు అంచనాల మధ్య నేడు(మే 09) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. వైజాగ్‌లోని భీమిలీపట్నంలో నివసించే ముగ్గురు యువజంటల కథ ఇది. శ్రీను(హర్షిత్‌రెడ్డి)‘మన టౌన్ కేబుల్ టీవీ’ ఆపరేటర్. అతని స్నేహితులు(గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరీ)లకు అల్రేడీ పెళ్లి అయిపోతుంది. భార్యలను ఫరిదా, గాయత్రి(శ్రావణి లక్ష్మి, శాలిని కొండెపూడి) చెప్పుచేతల్లో పెట్టుకోవడమే కాకుండా.. బ్యాచిలర్ అయిన శ్రీనుకి కూడా అదే విషయాన్ని ఎక్కిస్తారు. శ్రీనుకి అదే ప్రాంతానికి చెందిన శ్రీవల్లీ(శ్రియ కొంతం)తో పెళ్లి జరుగుతుంది. స్నేహితులు చెప్పిన మాటలతో పెళ్లాన్ని హద్దుల్లో పెట్టుకోవాలని శ్రీను కూడా డిసైడ్ అయిపోతాడు. ఫస్ట్‌నైట్ రోజు శ్రీవల్లీ శోభనం గదిలోకి రాగానే అసలు ట్విస్ట్ మెదలవుతుంది. రాత్రి 9గంటలు కాగనే శ్రీవల్లి టీవీ ఆన్ చేసి ‘జన్మజన్మల బంధం’ సీరియల్ చూస్తుంది. ఈ టైంలో సీరియల్ చూడడం ఏంటని శ్రీను అడిగితే..దెయ్యం పట్టినట్లుగా ప్రవర్తిస్తుంది. మరుసటి రోజు కూడా ఇలానే వింతగా ప్రవర్తిసుంది. ఇది తన ఒక్కడి సమస్యే అనుకుంటాడు. కానీ తన స్నేహితులిద్దరు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నట్లు తర్వాత తెలుసుకుంటాడు. ఈ ముగ్గురు మాత్రమే కాదు.. ఊరు మొత్తం ఇదే సమస్య ఉందనే విషయం బయటపడుతుంది. అసలు ఆ సీరియల్‌కి ఊర్లోని ఆడవాళ్లకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? సీరియల్ టైం కాగానే ఎందుకు వాళ్లు దెయ్యం పట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారు? మాతాజీ మాయ(సమంత) వాళ్ల సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపింది? అనేది తెలియాలంటే ‘శుభం’ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..సందేశం ఇవ్వాలంటే కథను సీరియస్‌గానే చెప్పాలా? లేదంటే ఇదిగో మేం ఈ మంచి మేసేజ్ ఇస్తున్నాం అని తెలిసేలా సన్నివేశాలను తీర్చిదిద్దాలా? అలా చేయకుండా, నవ్విస్తూ కూడా ఓ మంచి విషయం చెప్పొచ్చు అనేది ‘శుభం’ సినిమా ద్వారా తెలియజేశాడు దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల. సీరియల్ పిచ్చి అనే కాన్సెప్ట్‌ని తీసుకొని.. అందులోనే పురుషాధిక్యత ఎత్తిచూపుతూ మహిళల అణచివేత, ఆత్మాభిమానం లాంటి సున్నితమైన అంశాలను జోడించి, కథను నడిపించిన తీరు చాలా బాగుంది. చిన్న చిన్న సన్నివేశాలతోనే మంచి సందేశం ఇచ్చాడు. ఓ హారర్-కామెడీ చిత్రంలో ఇలాంటి మంచి విషయం చెప్పడం ‘శుభ’ పరిణామం. అయితే ఇదంతా ఒకవైపు మాత్రమే. రెండోవైపు చూస్తే కామెడీ-హారర్ జానర్లో తెరకెక్కిన ఈ చిత్రంలో హారర్ నేపథ్యం అంతగా ఆకట్టుకోలేదు. కామెడీ కొన్ని చోట్ల మాత్రమే నవ్వులు పూయిస్తుంది. అయితే ఈ హారర్ కానీ, కామెడీ కానీ తెలుగు ప్రేక్షకులకు కొత్త కాదు. ఇంతకు మంచి కామెడీ-హారర్ కథలను మనం చూశాం. ఉన్నంతలో కొత్తదనం ఏదైన ఉందంటే.. సీరియల్‌కి ముడిపెడుతూ నిజ జీవిత వ్యక్తులను హారర్ యాంగిల్లో చూపించడమే. అసలు కథను ప్రారంభించడానికి దర్శకుడు చాలా సమయమే తీసుకున్నాడు. పెళ్లి చూపులు, పెళ్లి, ఫస్ట్‌నైట్ వరకు కథనం రొటీన్‌గా సాగుతుంది. ఫస్ట్‌నైట్ రోజు శ్రీవల్లీ ఇచ్చే ట్విస్ట్‌తో కథనంపై ఆసక్తి పెరుగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆ ఆసక్తిని మరింత పెంచుతుంది. అయితే సెకండాఫ్‌కి వచ్చేసరికి మాత్రం కథనం కాస్త గాడి తప్పుతుంది. సమస్యను పరిష్కరించుకునేందుకు శ్రీనుబృందం చేసే ప్రయత్నం సాగదీతగా అనిపిస్తుంది. ఇక లాజిక్ గురించి ప్రస్తావించకపోవడమే మంచింది. దర్శఖుడు తన ‘సినిమా బండి ’టీమ్‌ని ఈ కథకు వాడుకున్న విధానం బాగుంది. అయితే సీరియల్ సమస్యను క్లోజ్ చేసే సన్నివేశాలు కూడా సీరియల్‌గా సా..గడంతో కథ అక్కడడక్కడే తిరిగినట్లుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ బాగుంటుంది. ఎలాంటి వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా కథను తీర్చిదిద్దారు. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమా మొత్తం కొత్త నటీనటులతోనే తెరకెక్కించారు. అయినా కూడా ప్రతి ఒక్కరు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. కేబుల్ ఆపరేటర్‌గా హర్షిత్ రెడ్డి, అతని స్నేహితులుగా గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరీ బాగా నటించారు. ఇక ఈ ముగ్గురి భార్యలుగా శ్రీయ కొంతం, శ్రావణి లక్ష్మి, శాలిని కొండెపూడి తమదైన నటనతో కొన్ని చోట్ల భయపెడుతూనే నవ్వించారు. ముఖ్యంగా శ్రీవల్లీగా శ్రీయ కొంతం తనదైన నటనతో ఆకట్టుకుంది..సాంకేతికంగా సినిమా బాగుంది. సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అన్ని కథకు తగ్గట్లుగా ఉంది. సమంత నిర్మించిన తొలి చిత్రం కాబట్టి నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయని చెప్పలేం కానీ.. సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.

భారత్, పాక్ యుద్ధం.. అమెరికా మద్ధతుపై జెడి వాన్స్ క్లారిటీ
'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేసింది. ఈ క్రమంలో భారత్, పాకిస్థాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలపై అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, వాన్స్ మాట్లాడుతూ.. నన్ ఆఫ్ అవర్ బిజినెస్ (అది ప్రాథమికంగా మాకు సంబంధించినది కాదు) అని అన్నారు.ఈ రెండు దేశాలను తాము నియంత్రించలేమని జెడి వాన్స్ అన్నారు. ఇరుదేశాలు దాడులకు పాల్పడుతున్నాయని తెలిపారు. రెండు అణుశక్తి దేశాల మధ్య ఇలాంటి ఘర్షణలు అందరికీ ఆందోళనకరమేనని అమెరికా ఉపాధ్యక్షుడు అన్నారు. వీలైనంత త్వరగా ఉద్రిక్తతలు తగ్గాలని తాము కూడా ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు. సాధరణ ప్రజలకు నష్టం జరగకుండా చూడాలని తాము కోరుతున్నామని చెప్పారు. ఇండియా, పాకిస్థాన్ యుద్ధంలో అమెరికా కలుగజేసుకోదని క్లారిటీ ఇచ్చారు. తమ సైన్యం ఎవరికి సాయం చేయదని ప్రకటించారు. ఆపై అటు భారత్‌కు గాని పాకిస్థాన్‌కు గాని యుద్ధం ఆపమని చెప్పలేమన్నారు. అలా అని అణ్వాయుధాల ఉపయోగం ఎట్టిపరిస్థితిల్లోనూ జరగదని ఆయన తేల్చి చెప్పారు. 🚨🇺🇸 ‘NONE OF OUR BUSINESS’: JD Vance on 🇮🇳Indo-🇵🇰Pak escalation pic.twitter.com/EgQuySKbLt— Sputnik India (@Sputnik_India) May 8, 2025

Miss world 2025: అందరి చూపు.. భాగ్యనగరం వైపు..
ప్రస్తుతం ప్రపంచమంతా హైదరాబాద్ నగరం వైపే చూస్తోంది. దాదాపు 120 దేశాలకు పైగా ఆయా దేశ అధికార ప్రతినిథులు, ప్రముఖులు నగరానికి గగనతల ప్రయాణం చేస్తున్నారు. నగర వేదికగా ప్రతిష్టాత్మక 72వ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో నగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రతి రోజూ వివిధ దేశాలకు చెందిన సుందరీమణులతో కళకళలాడుతోంది. అయితే రేపటి నుంచి ప్రారంభం కానున్న ప్రపంచ సుందరి పోటీల నేపథ్యంలో నగరంతో పాటు దేశంలోని అన్ని ప్రముఖ నగరాల్లోనూ ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ పోటీల్లో పాల్గొనే 109 దేశాలకు చెందిన పోటీదారులు ఇప్పటికే నగరానికి చేరుకోగా మరికొన్ని దేశాలకు చెందిన వారు శుక్రవారం రానున్నారు. ప్రపంచ అందాల పోటీలకు హైదరాబాద్ ఘన వేదికగా మారిన విషయం విధితమే.. ఇందులో పాల్గొనే సుందరీమణులు ఇప్పటికే ప్రీ ట్రయల్స్‌లో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నందిని గుప్తాతో పాటు, అథెనా క్రాస్బీ (అమెరికా), ఎమ్మా మోరిసన్ (కెనడా), వాలేరియా కాన్యావో (వెనిజులా) వంటి తారలు మిస్ వరల్డ్ వేదిక పై ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు. అంతేకాకుండా అమెరికా, దక్షిణాఫ్రికా, వెనిజులా వంటి ప్రముఖ దేశాలతో పాటు గ్వాడలూప్, గిబ్రాల్టర్, మార్టినిక్, క్యురాకావ్ వంటి చిన్న దేశాల నుంచి కూడా 72వ మిస్ వరల్డ్ పోటీల్లో అభ్యర్థులు పాల్గోనుండడం విశేషం. ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో వరల్డ్ టాప్ మోడల్స్‌తో పాటు విద్యార్థులు, డాక్టర్లు, న్యాయవాదులు, సామాజిక వేత్తలు, ఆరి్టస్టులు, విభిన్న రంగాలకు చెందిన ఉద్యమకారులు తమ దేశాల తరపున ప్రాతినిధ్యం వహిస్తూ పోటీపడుతుండటం మరో విశేషం. దేశవ్యాప్తంగా డిజిటల్ వెల్కమ్.. పోటీదారులు దాదాపు నెల రోజులపాటు తెలంగాణలో పర్యాటక, సాంస్కృతిక, వైద్య, చేనేత, ఆవిష్కరణ కేంద్రాలను సందర్శించనున్నారు. గతేడాది ముంబయిలో మిస్ వరల్డ్ ఈవెంట్ జరగగా, ఈ ఏడాది మే 31న హైదరాబాద్, హైటెక్స్ వేదికగా గ్రాండ్ ఫినాలే జరగనుంది. మిస్ వరల్డ్ పోటీలను వరుసగా రెండేళ్ల పాటు భారత్‌లో నిర్వహించడం తొలిసారి. ఈ అరుదైన గౌరవం దేశానికి మాత్రమే కాదు, తెలంగాణకు కూడా విశ్వవేదికపై విశిష్ట గుర్తింపునిస్తుంది. ఈ విశిష్ట కార్యక్రమానికి సంబంధించి దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు చెందిన అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ వెల్కమ్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ పోటీలను తిలకించడానికి సామాన్యులకు సైతం ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడంతో వివిధ నగరాల నుంచి ఫ్యాషన్ ఔత్సాహికులు నగరానికి రావడానికి సన్నద్ధమవుతున్నారు. (చదవండి: Miss World 2025: అందాల పోటీలో హైలెట్‌గా 'పోచంపల్లి చీరలు')

Operation Sindoor 2.0: భారత్ దెబ్బకు పాకిస్తాన్ సూపర్ లీగ్ వేదిక మార్పు
ఆపరేషన్ సిందూర్ 2.0 పేరిట భారత దళాలు పాక్‌పై దాడులు జరుపుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 వేదికను మార్చారు. పాక్ క్రికెట్ బోర్డు ఇప్పటికే కొనసాగుతున్న పీఎస్ఎల్ 10వ ఎడిషన్‌ను యూఏఈకి మార్చింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. ఈ లీగ్ మరో ఎనిమిది మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా.. నిన్న (మే 8) భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పీఎస్ఎల్ వేదికను పాక్ నుంచి యూఏఈకి తరలించారు. పీఎస్ఎల్లో తదుపరి జరగాల్సిన మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ప్రకటించాల్సి ఉంది. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా పీఎస్ఎల్ను యూఏఈకి తరలిస్తున్నట్లు పీసీబీ అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ ప్రకటించాడు.జనావాసాలపై పాక్ దళాల దాడులకు బదులిచ్చే క్రమంలో నిన్న రావల్పిండి క్రికెట్ స్టేడియంపై భారత దళాలు డ్రోన్ దాడి చేశాయి. ఈ దాడి తర్వాత కొద్ది గంటల్లోనే పీఎస్ఎల్లో భాగంగా పెషావర్ జల్మీ, కరాచీ కింగ్స్ మధ్య జరగాల్సి ఉంది. భారత్ దాడుల తీవ్రతను పెంచిందని గ్రహించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తక్షణమే స్పందించి, అప్పటికప్పుడు ఆ మ్యాచ్‌ను రద్దు చేసింది. తాజాగా లీగ్ మొత్తాన్నే యూఏఈకి తరలిస్తున్నట్లు ప్రకటించింది.కాగా, పీఎస్ఎల్లో దాదాపు 40 మంది విదేశీ క్రికెటర్లు పాల్గొంటున్నారు. వారి భద్రత ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. విదేశీ క్రికెటర్ల జాబితాలో కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్ లాంటి ప్రముఖులు ఉన్నారు. పాక్ నుండి తమ స్వదేశాలను వెళ్లడం ప్రస్తుతం విదేశీ ఆటగాళ్లకు సవాలుగా మారింది. భారత దాడుల నేపథ్యంలో పాక్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయాలన్నీ మూతపడ్డాయి. విదేశీ క్రికెటర్లకు ఎక్కడ తల దాచుకోవాలో అర్దం కావడం లేదు. పాక్ ప్రభుత్వం విదేశీ క్రికెటర్ల భద్రతను గాలికొదిలేసింది. పీసీబీ అధికారులు, పీఎస్ఎల్ ఫ్రాంచైజీ యజమానులు చేతులెత్తేశారు. ప్రస్తుతం పాక్‌లో విదేశీ క్రికెటర్లు బిక్కుబిక్కుమంటున్నారు.మరోవైపు పాక్ దాడుల దృష్ట్యా భారత్‌లో ఐపీఎల్ కూడా వాయిదా పడే అవకాశం ఉంది. నిన్న ధర్మశాలలో జరగాల్సిన ఢిల్లీ, పంజాబ్ మ్యాచ్ అర్దంతరంగా రద్దైంది. ధర్మశాలలో బ్లాక్ అవుట్ ప్రకటించడంతో స్టేడియంలో ఫ్లడ్ లైట్లు ఆర్పేశారు. తొలుత ప్రేక్షకులను బయటకు పంపించిన అధికారులు, ఆతర్వాత పరిస్థితిని వివరించారు. ఐపీఎల్-2025 భవితవ్యంపై ఇవాళ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.కాగా, పహల్గామ్ ఉగ్రదాడికి బదులుగా భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరిట పాక్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తొలుత మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఇండియన్ ఆర్మీ.. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులతో విరుచుకుపడింది. ఇందులో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.అనంతరం పాక్ దళాల ముసుగులో ఉన్న ఉగ్రవాదులు భారత సరిహద్దుల్లో కాల్పులకు తెగబడటంతో పాటు మిసైళ్లతో దాడికి దిగారు. జనావాసాలపై దాడికి దిగడంతో సహనం కోల్పోయిన భారత్ పాక్‌కు ధీటుగా బదులిస్తోంది. ఈ క్రమంలో ఆపరేషన్ సిందూర్ 2.0ను మొదలుపెట్టింది. ఇప్పటికే భారత దళాలు పాక్‌కు తీవ్ర నష్టాన్ని చేకూర్చాయి. రావల్పిండి, ఇస్లామాబాద్, ముల్తాన్, కరాచీ లాంటి నగరాలపై దాడులతో విరుచుకుపడ్డాయి.

దాయాది దుస్సాహసం.. దీటుగా బదులిచ్చిన భారత్
ఆపరేషన్ సిందూర్‌తో కూడా దాయాది బుద్ధి తెచ్చుకోలేదు. పైపెచ్చు పనిగట్టుకుని యుద్ధ జ్వాలలను రగులుస్తోంది. భారత్‌పై భారీ స్థాయిలో సైనిక దాడులకు తెగించింది. హమాస్ ఉగ్ర సంస్థను తలపిస్తూ పౌర లక్ష్యాలపై ఎడాపెడా క్షిపణి, డ్రోన్ దాడులకు దిగింది. రాజస్తాన్ నుంచి కశ్మీర్ దాకా సరిహద్దుల వెంబడి దాడులకు పాక్ చేసిన యత్నాలను భారత్ పూర్తిస్థాయిలో తిప్పికొట్టింది. భారీ ప్రతి దాడులతో ముచ్చెమటలు పట్టించింది. ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్, పెషావర్, రావల్పిండిలపై 24 గంటల వ్యవధిలోనే రెండుసార్లు విరుచుకుపడి కీలక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు తదితరాలను తుత్తునియలు చేసింది. దాడుల ధాటికి ప్రధాని షహబాజ్ షరీఫ్ బంకర్లో తలదాచుకున్నారు! కరాచీ నౌకాశ్రయంపై మన నేవీ బాంబుల వర్షం కురిపించింది. పరిస్థితులు ఇరు దేశాల నడుమ పూర్తిస్థాయి యుద్ధం దిశగా సాగుతున్నాయి... న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: అవమాన భారంతో విచక్షణ కోల్పోయిన దాయాది దిద్దుకోలేని పొరపాటు చేసింది. బుద్ధి తెచ్చుకోవాల్సింది పోయి పూర్తిగా బరితెగించింది. ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకారం చేయబోయి మరోసారి పరువు పోగొట్టుకుంది. భారత్‌ను సైనికంగా రెచ్చగొట్టే దుస్సాహసానికి పూనుకుని అభాసుపాలైంది. బుధవారం అర్ధరాత్రి దాటినప్పటి నుంచీ భారత్‌పై ఎడాపెడా వైమానిక దాడులకు దిగింది. క్షిపణులు, డ్రోన్ దాడులతో సరిహద్దు రాష్ట్రాల్లో పలు పౌర, సైనిక లక్ష్యాలను ధ్వంసం చేసేందుకు విఫలయత్నం చేసింది. వాటన్నింటినీ మన సైన్యం పూర్తిగా తిప్పికొట్టడమే గాక మూడు పాక్ యుద్ధ విమానాలను కూల్చేసింది. ఇద్దరు పాక్ పైలట్లను బందీలుగా పట్టుకుంది. రాజధాని ఇస్లామాబాద్‌తో పాటు కీలక పాక్ నగరాలపై ఒకే రోజు రెండుసార్లు క్షిపణి దాడులతో విరుచుకుపడింది. అక్కడి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు తదితరాలను నేలమట్టం చేసింది. రెండు రోజుల వ్యవధిలో దాయాదికి వరుసగా రెండో పరాభవం రుచిచూపి మర్చిపోలేని గుణపాఠం నేర్పింది. మరోవైపు నౌకాదళం కూడా రంగంలోకి దిగింది. పాక్‌కు జీవనాడి వంటి కరాచీ నౌకాశ్రయంపై ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధనౌక బాంబుల వర్షం కురిపించి 10కి పైగా నౌకలను ధ్వంసం చేసినట్టు సమాచారం. 1971 పాక్ యుద్ధం తర్వాత కరాచీ నౌకాశ్రయంపై దాడి ఇదే తొలిసారి. అంతేగాక ఏకంగా 20కి పైగా భారత యుద్ధ నౌకలు పాక్ వైపు కదులుతున్నట్టు చెబుతున్నారు. ఎల్లలు దాటిన ఉద్రిక్తతల నడుమ పరిస్థితులు పూర్తిస్థాయి యుద్ధం దిశగా సాగుతున్నాయి. ఇరువైపుల నుంచీ కాల్పుల మోతతో సరిహద్దులు దద్దరిల్లిపోతున్నాయి. పౌర లక్ష్యాలపై పాక్ సైన్యం విచక్షణారహిత కాల్పులకు తెగబడుతోంది. అందుకు మన సైన్యం దీటుగా బదులిస్తోంది. ఇరు దేశాల్లోనూ సరిహద్దు రాష్ట్రాలు ఎయిర్ సైరన్లు, బాంబుల మోతతో దద్దరిల్లిపోతున్నాయి. పలు విమానాశ్రయాలు మూతబడ్డాయి. ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు నెలకొన్నాయి. అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిందిగా భద్రతా బలగాలను కేంద్రం ఆదేశించింది. సైనికులకు సెలవులు రద్దు చేశారు. కీలకమైన సైనిక తదితర మౌలిక వ్యవస్థల వద్ద రక్షణను కట్టుదిట్టం చేశారు. పాక్ అత్యంత అనాగరికంగా వ్యవహరిస్తోందంటూ కేంద్రం మండిపడింది. పౌర ఆవాసాలపై విచక్షణారహితంగా డ్రోన్లు, మిసైళ్లు ప్రయోగిస్తూ హమాస్ ఉగ్ర సంస్థను తలపిస్తోందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు దుయ్యబట్టాయి. జమ్మూ, పఠాన్‌కోట్, ఉద్ధంపూర్‌ల్లో పాక్ క్షిపణి, డ్రోన్ దాడి యత్నాలను పూర్తిగా తిప్పికొట్టినట్టు సైన్యం ప్రకటించింది. పరిస్థితి అదుపు తప్పుతున్న నేపథ్యంలో అమెరికా రంగంలోకి దిగింది. సంయమనం పాటించాల్సిందిగా ఇరు దేశాలకూ సూచించింది.పేట్రేగిన పాక్ సరిహద్దుల వెంబడి 15 సైనిక స్థావరాలపై దాడి యత్నాలు విఫలం కావడంతో గురువారం పాక్ మరింతగా పేట్రేగిపోయింది. రాత్రివేళ పాక్ ఫైటర్ జెట్లు భారత్‌పై తీవ్రస్థాయిలో దాడులకు తెరతీశాయి. రాజస్తాన్ మొదలుకుని జమ్మూ కశ్మీర్ దాకా సరిహద్దుల పొడవునా పలుచోట్ల సైనిక లక్ష్యాలతో పాటు విచక్షణారహితంగా పౌర ఆవాసాలపైనా గురిపెట్టాయి. శ్రీనగర్, జమ్మూ విమానాశ్రయాలను ధ్వంసం చేసేందుకు విఫలయత్నం చేశాయి. జమ్మూ–శ్రీనగర్ హైవేపై భారీ పేలుడు చోటుచేసుకుంది. రాజౌరీ జిల్లాలో పలుచోట్ల పేలుళ్లు విని్పంచాయి. పాక్ దాడులన్నింటినీ సైన్యం సమర్థంగా అడ్డుకుంది. సత్వారీలోని జమ్మూ విమానాశ్రయం, సాంబా, ఆర్ఎస్ పుర, అరి్నయా తదితర ప్రాంతాలపైకి కనీసం 8కి పైగా క్షిపణులు దూసుకొచ్చే ప్రయత్నం చేయగా మధ్యలోని అడ్డుకుని కూల్చేసినట్టు ప్రకటించింది. మన ‘ఆకాశ్’, ఎంఆర్‌ఎస్‌ఏఎంతో పాటు అత్యాధునిక ఎస్–400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పాక్ క్షిపణులు, డ్రోన్లను ఎక్కడివక్కడ కూల్చేశాయి. పఠాన్‌కోట్‌లో రెండు, జమ్మూలో ఒక పాక్ యుద్ధ విమానాన్ని ఎస్–400 వ్యవస్థ నేలకూల్చింది. వాటిలో రెండు జేఎఫ్–17, ఒక ఎఫ్–16 ఉన్నాయి. రెండు యుద్ధ విమానాలను నష్టపోయినట్టు పాక్ కూడా అంగీకరించింది. పఠాన్‌కోట్‌లో ఇద్దరు పైలట్లు మన బలగాలకు చిక్కినట్టు సమాచారం. ఆ వెంటనే పాక్‌పై సైన్యం విరుచుకుపడింది. ఇస్లామాబాద్, లాహోర్, సియాల్కోట్, కరాచీ, రావల్పిండిలపై దీర్ఘశ్రేణి క్షిపణులతో రెండోసారి భారీస్థాయిలో దాడులకు దిగింది. లాహోర్ తదితర నగరాల్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలన్నింటినీ సమూలంగా నాశనం చేసేసింది. పాక్‌లోని పంజాబ్ ప్రాంతంలో నెలకొన్న కీలక ఎయిర్‌బోర్న్ వారి్నంగ్ అండ్ కంట్రోల్ సిస్టం (ఏడబ్ల్యూఏసీఎస్)ను తుత్తునియలు చేసింది. పాక్ నగరాలు బాంబు పేలుళ్లతో దద్దరిల్లినా పౌర ఆవాసాలు, వ్యవస్థలకు నష్టం కలగని రీతిలో సైనిక వ్యవస్థలను మాత్రమే ఎంచుకుని అత్యంత కచ్చితత్వంతో దాడులు నిర్వహించినట్టు సైన్యం పేర్కొంది.పలుచోట్ల బ్లాకౌట్ పాక్ దాడుల నేపథ్యంలో గురువారం రాత్రి సరిహద్దు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సైరన్ల మోత మోగింది. జమ్మూ కశ్మీర్, పంజాబ్, హరియాణా, రాజస్తాన్, గుజరాత్‌ల్లో పలుచోట్ల వైమానిక దాడుల హెచ్చరికలు జారీ అయ్యాయి. దాంతో పంజాబ్‌లోని పఠాన్‌కోట్, జలంధర్, అమృత్సర్, హోషియార్పూర్, మొహాలీ, చండీగఢ్ మొదలుకుని రాజస్తాన్‌లోని జైసల్మేర్ దాకా పలు నగరాల్లో కరెంటు సరఫరా నిలిపేశారు. ఆయాచోట్ల రాత్రిపూట పలు డ్రోన్లతో పాటు పేలుడు శబ్దాలను గమనించినట్టు భద్రతా బలగాలు తెలిపాయి. ప్రజలు లైట్లన్నీ ఆర్పేసి ఇళ్లకే పరిమితం కావాలని పేర్కొన్నాయి.

ప్రశ్నించే గొంతు నొక్కేస్తారా?: ఆర్.ధనంజయరెడ్డి
సాక్షి, అమరావతి: ఎలాంటి నోటీసులు లేకుండా ఓ పత్రిక ఎడిటర్ ఇంట్లోకి పోలీసులు దౌర్జన్యంగా చొరబడి సోదాలు చేయడం దేశ చరిత్రలో ముందెన్నడూ జరగలేదని, ప్రశ్నించే గొంతును నొక్కేస్తారా.. అని సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయ రెడ్డి కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే కాకుండా, ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడిగానే భావిస్తున్నానని చెప్పారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ రాజకీయ కుట్రలో భాగంగా సోదాల పేరిట పోలీసులు వ్యవహరించిన నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేస్తామని, న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. విజయవాడలోని తన నివాసంలో గురువారం పోలీసుల సోదాల ఆనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇసుక, లిక్కర్, మైనింగ్, విద్యుత్ స్కామ్‌లతో పాటు విజయవాడలో వరదలు, తిరుమలలో తొక్కిసలాట, సింహాచలంలో ప్రభుత్వ నిర్లక్ష్యం.. రైతులకు మద్దతు ధర కల్పించకపోవడం వంటి వరుస వైఫల్యాలను ఎండగడుతున్న సాక్షి గొంతునొక్కాలనే యత్నమిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటడంలో, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయక పోవడంపై ప్రజల మూడ్‌ను రిఫ్లెక్ట్ చేసే ప్రయత్నంలో సాక్షి తన బాధ్యతను నిర్వర్తిస్తోందని చెప్పారు. దాన్ని ఓర్వలేకనే ఇలాంటి దుర్మార్గపు చర్యలకు ఒడిగడుతున్నారని, దీనిని ఖండించకపోతే ఎవరింట్లోకైనా సరే ఇలాగే చొరబడతారన్నారు. సరైన ఆధారాలు లేకుండా ఎవరి మీదా కేసు పెట్టకూడదని సుప్రీంకోర్టు, హైకోర్టులు స్పష్టంగా చెబుతున్నప్పటికీ.. పోలీసులకు చట్టం, న్యాయం, రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం లేనట్టుగా కన్పిస్తోందని చెప్పారు. ‘ఉదయం ఉన్న ఫళంగా పది మంది పోలీసులు ఇంట్లోకి చొర బడ్డారు. ఎలాంటి నోటీసు ఇవ్వలేదు. ఒక డీఎస్పీ, సీఐలతో పాటు పెద్ద ఎత్తున పోలీసులు లోపలికి వచ్చి, ఇల్లు సెర్చ్ చేస్తాం.. ఇది ఓపెన్ చేయండి.. అది ఓపెన్‌చేయండి.. ఇంట్లో ఉన్న వాళ్లను వాళ్లెవరు.. వీళ్లెవరు.. అంటూ ఆరాలు తీయడం దుర్మార్గం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఏమన్నారంటే.. నాపై ఇప్పటికే 3–4 కేసులు పెట్టారుఇప్పటికే నాపై మూడు నాలుగు కేసులు పెట్టారు. ఒకటి సభా హక్కుల ఉల్లంఘన కేసు అన్నారు. ఒక వార్త రాస్తే గవర్నమెంట్ దగ్గర నుంచి కాటమనేని భాస్కర్ ద్వారా ప్రాసిక్యూషన్ చేయడానికి అనుమతి జారీ చేశారు. మొన్నటికి మొన్న తెలంగాణ, ఏపీ ఎడిషన్‌లో ఒకే వార్త వేర్వేరుగా రిపోర్టు అయ్యిందని మరో కేసు పెట్టారు. జర్నలిజం మౌలిక నియమాలు, ఓనమాలు తెలిసిన వారెవరికైనా ఇదేంటని తెలుసు. ఎక్కడన్నా ఒక ఘటన జరిగితే ఆ ప్రాంత రిపోర్టర్ స్పాట్ రాస్తారు. సొంత ఊళ్లో ఉన్న రిపోర్టర్‌కు మరిన్ని వివరాలు తెలుస్తాయి కాబట్టి మరింత లోతుగా ప్రజంట్ చేస్తారు. దాన్ని అడ్డం పెట్టుకొని నాపై కేసు పెట్టారు. కొంత మంది సాక్షి పాత్రికేయులపై కూడా కేసులు పెట్టారు. ఇదంతా సాక్షి గొంతునొక్కే ప్రయత్నంగా చూడాల్సి వస్తుంది. రాజకీయ ఒత్తిళ్లతోనే సోదాలు ఎందుకొచ్చారు.. సెర్చ్ నోటీసు ఉందా? దాంట్లో నా పేరు ఏమైనా ఉందా? అని సోదాలకు వచ్చిన పోలీసు అధికారులను చాలా స్పష్టంగా అడిగాను. ‘లేదు సర్.. ఇన్ అండ్ అరౌండ్ సెర్చ్ చేస్తున్నాం.. జస్ట్ ఊరికే మీ ఇల్లు చూసేసి పోతాం’ అని చెప్పారు. కానీ వాళ్లు వ్యవహరించిన తీరు చూస్తుంటే రాజకీయ ఒత్తిళ్లతోనే సోదాల పేరిట వచ్చారని స్పష్టంగా కన్పించింది. నా కార్ నంబర్, నా ఫోన్ నంబర్లు తీసుకున్నారు. వారు స్పష్టమైన లక్ష్యం, ఉద్దేశంతోనే వచ్చినట్టుగా స్పష్టమైంది. వారు చెబుతున్న లిక్కర్ కేసులో నిందితులు నా ఇంట్లో ఎందుకు ఉంటారు? వారికి నాకు ఏమైనా సంబంధం ఉందా? ఇక్కడకు ఎందుకు వస్తారు? ఏమైనా అడిగితే పై నుంచి ప్రెజర్స్ ఉన్నాయని చెబుతున్నారు. ఇదంతా పొలిటికల్ మోటివేషన్‌తో జరుగుతోందని అర్థమవుతోంది.

ఐపీఎల్ వాయిదా?
ధర్మశాల: ఉగ్రవేటకు తలపెట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ను ఏమాత్రం జీర్ణించుకోలేని పాకిస్తాన్ మిలిటరీ కుటిలబుద్ధితో క్రూరమైన దాడులకు తెగబడుతోంది. సరిహద్దు రాష్ట్రాల పౌరులపై విచక్షణారహితంగా మోర్టార్లు, ఫిరంగులతో దాడులు చేస్తోంది. దీంతో భారత బలగాలు దీటుగా బదులిస్తున్నాయి. భారత్, పాకిస్తాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కాస్తా యుద్ధభూమిని తలపించడంతో భారత రక్షణ దళాలు కీలక నగరాల్లో విద్యుత్ సరఫరా (పవర్ బ్లాక్ అవుట్)ను నిలిపివేసింది. ఇంటర్నెట్, మొబైల్ సేవల్ని నిలిపివేసింది. పాక్ ప్రయోగించిన మిస్సైళ్లు, డ్రోన్లను నిర్వీర్యం చేసేందుకు భారత సాయుధ బలగాలు రాత్రంతా శ్రమిస్తున్నాయి. ఇలా ప్రస్తుతం దేశం కోసం భారత త్రివిధ దళాలు ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే స్టేడియాల్లో ఐపీఎల్ వినోదం పట్ల నెట్టింట తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. భారత పౌరులు, ప్రధాన నగరాలే లక్ష్యంగా పాక్ ఆర్మీ విచక్షణా రహితంగా జరిపే దాడుల్ని తిప్పికొడుతున్నప్పటికీ... పొరపాటున ఏ మిసైల్, డ్రోన్ దాడి అయిన స్టేడియంలో పడితే... వేలల్లో ప్రేక్షకులు, పదుల సంఖ్యలోని విదేశీ, భారత క్రికెటర్లకు జరిగే ప్రాణనష్టం ఊహకందదు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ను రద్దు చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉన్నతాధికారులు భావిస్తున్నారు. వినోదం కంటే కూడా దేశ రక్షణ, ఆటగాళ్ల భద్రతే తమకు ప్రధానమని బోర్డు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అందుబాటులో ఉన్న బీసీసీఐ ఉన్నతాధికారులతో నేడు సమావేశమై ఐపీఎల్‌పై తుది నిర్ణయం తీసుకుంటారు. శుక్రవారం ఐపీఎల్ రద్దు లేదంటే వాయిదా ప్రకటన వెలువడుతుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. నేటి మ్యాచ్ యథాతథం ప్రస్తుత పరిస్థితులపై సమీక్షిస్తున్నాం. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత ఇంకా కొనసాగుతూనే ఉంది. ఐపీఎల్ మ్యాచ్‌ల విషయంలో ప్రభుత్వ మార్గదర్శకాల్ని పాటిస్తాం. ఇప్పటివరకైతే కేంద్రం నుంచి మాకెలాంటి సూచనలు రాలేదు. ఆటగాళ్ల భద్రత, రవాణా తదితర పరిస్థితుల్ని సమీక్షించాకే తుది నిర్ణయం తీసుకుంటాం. లక్నోలో శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు ఏ ఇబ్బందులు లేవు. కాబట్టి మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం జరిగే అవకాశాలే ఉన్నాయి. –ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ ఐపీఎల్లో నేడులక్నో X బెంగళూరువేదిక: లక్నోరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

స్టార్‌లింక్ శాట్‌కామ్ వచ్చేస్తోంది..!
న్యూఢిల్లీ: భారత్‌లో శాటిలైట్ కమ్యూనికేషన్ (శాట్‌కామ్) సర్వీసులు ప్రారంభించే దిశగా తదుపరి పూర్తి చేయాల్సిన ప్రక్రియపై అమెరికన్ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్‌లింక్ దృష్టి పెట్టనుంది. ఇప్పటికే టెలికం శాఖ (డాట్) నుంచి ప్రాథమిక అనుమతులు (లెటర్ ఆఫ్ ఇంటెంట్–ఎల్వోఐ) లభించడంతో, ఇక ఒప్పంద నియమాలను అంగీకరిస్తున్నట్లు కంపెనీ సంతకాలు చేయాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అటుపైన నిర్దేశిత ఎంట్రీ ఫీజును చెల్లించాక తుది లైసెన్సు లభిస్తుందని పేర్కొన్నాయి. శాట్‌కామ్ స్పెక్ట్రం ధరను టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫార్సు చేసే ప్రక్రియ తుది దశలో ఉందని, ఎప్పుడైనా దీనిపై ప్రకటన వెలువడొచ్చని వివరించాయి. గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్స్ బై శాటిలైట్ (జీఎంపీసీఎస్), ఐఎస్పీ, వీశాట్ సేవలకు సంబంధించి స్టార్‌లింక్‌నకు ఎల్వోఐ జారీ అయినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. డాట్ లైసెన్సుతో నెట్‌వర్క్‌ను నిర్మించుకోవడానికి స్టార్‌లింక్‌కు అనుమతులు లభించినా, కార్యకలాపాలు ప్రారంభించడానికి ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్–స్పేస్) ఆమోదం, ప్రభుత్వం నుంచి స్పెక్ట్రం అవసరమవుతుంది. ఇప్పటికే వన్‌వెబ్, జియో శాటిలైట్‌కు లైసెన్స్.. ఇప్పటికే యూటెల్‌శాట్ వన్‌వెబ్, జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్ సంస్థలకు ఈ లైసెన్సులు వచ్చాయి. స్పెక్ట్రంను కేటాయించిన తర్వాత అవి సర్వీసులు ప్రారంభించనున్నాయి. భారత్‌లో లైసెన్సు కోసం కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్న స్టార్‌లింక్ ఈమధ్యే దేశీ టెలికం దిగ్గజాలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌తో ఒప్పందాలు కుదుర్చుకుంది. దీనితో భారత్‌లో తమ సొంత పంపిణీ, కస్టమర్ సర్వీస్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాల్సిన భారం లేకుండా, సంప్రదాయ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులో లేని ప్రాంతాల్లోకి సేవలను విస్తరించే వీలు చిక్కుతుంది. సుదూరంగా ఉండే జియోస్టేషనరీ ఉపగ్రహాలపై ఆధారపడే సాంప్రదాయ శాటిలైట్ సర్వీసులతో పోలిస్తే భూమికి కొంత సమీపంగా (550 కి.మీ. పైన ) ఉండే ’లో ఎర్త్ ఆర్బిట్’ (లియో) శాటిలైట్లను ఉపయోగిస్తుంది. ప్రస్తు తం ఇవి 7,000 ఉండగా, వీటి సంఖ్య 40,000కు పెరగనుంది.
భారత్-పాక్ యుద్ధం.. నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
మినీ ఆఫ్రికా@ టోలిచౌకీ..!
విమానాశ్రయాల్లోకి నో ఎంట్రీ.. నిజమేనా?
Operation Sindoor 2.0: భారత్ దెబ్బకు పాకిస్తాన్ సూపర్ లీగ్ వేదిక మార్పు
Miss world 2025: అందరి చూపు.. భాగ్యనగరం వైపు..
ఢిల్లీలో హై అలర్ట్.. రైళ్లన్నీ నిలిపివేత
'ఆపరేషన్ సిందూర్'పై నోరెత్తని బాలీవుడ్ ప్రముఖులు
ఒక్కరోజులో భారీగా క్షీణించిన రూపాయి విలువ
Subham Review: సమంత ‘శుభం’ మూవీ రివ్యూ
మిస్ వరల్డ్ 2025 : అందాల పోటీలో హైలెట్‌గా 'పోచంపల్లి చీరలు'
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. శుభవార్తలు వింటారు
మొదట్నుంచి మీరే ఏదో రకంగా విదేశీయులకు హర్రర్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూపిస్తున్నారుగా సార్!!
ఫ్లాష్ ఫ్లాష్: పాక్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి..30 మంది ఉగ్రవాదుల హతం
ఆపరేషన్ సిందూర్ అప్డేట్స్.. రేపు కేంద్రం అఖిలపక్ష సమావేశం
భారత్ దాడులు.. పాక్ ప్రధాని రియాక్షన్ ఇదే..
ప్రసాదంలో పాము పిల్ల
టీ20 క్రికెట్లో అది నేరం లాంటిదే!.. ఏదేమైనా క్రెడిట్ మా బౌలర్లకే: హార్దిక్
MI vs GT: ముంబై జోరుకు బ్రేక్
పవన్, విజయ్ ఇద్దరూ ఒక్కటే.. అవగాహన శూన్యం: ప్రకాష్‌రాజ్
Operation Sindoor : ఆపరేషన్ సిందూర్‌పై ఆర్మీ ఉన్నతాధికారుల ప్రెస్‌మీట్.. లైవ్
అక్కడ జరిగిందేమిటి?.. మీరు చేస్తున్నదేమిటి?
భారత్‌కే మా మద్ధతు- భారత్‌కు ప్రపంచ దేశాల మద్ధతు
భారత్ తడాఖా.. ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్ విలవిల (ఫొటోలు)
Operation Sindoor: శాంతించండి.. ‘ఆపరేషన్ సిందూర్’పై.. భారత్‌కు చైనా రిక్వెస్ట్
కన్నీటి నిశ్చితార్థం
Operation Sindoor: ‘ఆపరేషన్ సింధూర్’ అంటే ఏమిటి?
ఆపరేషన్ సిందూర్.. అర్ధరాత్రి ఎప్పుడేం జరిగింది..
భారత్ విమానాలు కూల్చివేత అంటూ పాక్ ప్రచారం.. నిజమెంత?
ఒక తార పుట్టింది!
భారత్ మెరుపు దాడులపై స్పందించిన ట్రంప్, పాక్
భారత్-పాక్ యుద్ధం.. నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
మినీ ఆఫ్రికా@ టోలిచౌకీ..!
విమానాశ్రయాల్లోకి నో ఎంట్రీ.. నిజమేనా?
Operation Sindoor 2.0: భారత్ దెబ్బకు పాకిస్తాన్ సూపర్ లీగ్ వేదిక మార్పు
Miss world 2025: అందరి చూపు.. భాగ్యనగరం వైపు..
ఢిల్లీలో హై అలర్ట్.. రైళ్లన్నీ నిలిపివేత
'ఆపరేషన్ సిందూర్'పై నోరెత్తని బాలీవుడ్ ప్రముఖులు
ఒక్కరోజులో భారీగా క్షీణించిన రూపాయి విలువ
Subham Review: సమంత ‘శుభం’ మూవీ రివ్యూ
మిస్ వరల్డ్ 2025 : అందాల పోటీలో హైలెట్‌గా 'పోచంపల్లి చీరలు'
సినిమా

ప్రేమ కబుర్లు?
ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘కుబేర’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఎస్వీసీఎల్ఎల్పీ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్రావు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది జూన్ 20న విడుదల కానుంది.ప్రస్తుతం ఈ సినిమాపోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ధనుష్, రష్మిక మాట్లాడుకుంటున్న ఓ కొత్తపోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ధనుష్, రష్మిక చిరునవ్వులు చిందిస్తూ, ఏవో ప్రేమ కబుర్లు చెప్పుకుంటున్నట్లుగా ఈపోస్టర్ ఉంది. తమిళ్, తెలుగు,హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాకు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.

కాన్స్‌కు బెంగాలీ ఫిల్మ్అరణ్యేర్ దిన్ రాత్రి
భారతీయ ప్రముఖ దివంగత దర్శకులు సత్యజిత్ రే ఐకానిక్ బెంగాలీ ఫిల్మ్ ‘అరణ్యేర్ దిన్ రాత్రి’ (1970) కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితం కానుంది. ఫ్రాన్స్‌లో ఈ నెల 13 నుంచి 24 వరకు 78వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రోత్సవాల తొలి రోజున ‘కాన్స్ క్లాసికల్ సెక్షన్’ విభాగంలో ‘అరణ్యేర్ దిన్ రాత్రి’ సినిమా స్క్రీనింగ్ కానుంది. సునీల్ గంగోపాధ్యాయ రాసిన ‘అరణ్యేర్ దిన్ రాత్రి’ నవలను అదే పేరుతో సత్యజిత్ రే సినిమాగా తెరకెక్కించారు. ఈ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా చిత్రం 1970 జనవరి 16న ఇండియాలో విడుదల కాగా, 1973 మార్చి 14న యూఎస్‌లో (ఇంగ్లిష్‌లో ‘డేస్ అండ్ నైట్స్ ఇన్ ది ఫారెస్ట్’) విడుదలైంది.సౌమిత్రా ఛటర్జీ, సుభాష్ ఛటర్జీ, సమిత్ భంజా, రబీ ఘోష్, షర్మిలా ఠాగూర్, కబీర్ బోస్, అపర్ణ సేన్ ఈ సినిమాలోని ప్రధాన పాత్రలుపోషించారు. ఈ సినిమా కాన్స్ చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు ఎంపికైనట్లుగా కాన్స్ ప్రతినిధులు అధికారికంగా వెల్లడించారు. ఇందుకోసం ఈ చిత్రాన్ని 4కే రెజల్యూషన్‌లో రీస్టోర్ చేశారు. ది ఫిల్మ్ ఫౌండేషన్స్ వరల్డ్ సినిమా ప్రాజెక్ట్, ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్, ది క్రైటీరియన్ కలెక్షన్స్ జానస్ ఫిల్మ్స్‌ల ఆధ్వర్యంలో ‘అరణ్యేర్ దిన్ రాత్రి’ సినిమా 4కే రెజల్యూషన్‌లో రీ స్టోర్ చేయడం జరిగింది. ఈ చిత్రనిర్మాత పూర్ణిమా దత్తా దగ్గర ఉన్న ఈ సినిమా ఒరిజినల్ కెమెరా, సౌండ్ నెగటివ్‌ల సాయంతో ఈ సినిమా 4కే రెజల్యూషన్ వీలుపడింది. గోల్డెన్ గ్లోబ్ ఫౌండేషన్ ఫండింగ్ చేసింది. దర్శకులు మార్టిన్ స్కోర్సెస్, వెస్అండర్సన్ ‘అరణ్యేర్ దిన్ రాత్రి’ సినిమాను 4కే రెజల్యూషన్‌లో రూపొందించడానికి కీలక పాత్రలుపోషించారు.సంతోషం... బాధ: సందీప్ రే ‘అరణ్యేర్ దిన్ రాత్రి’ సినిమా కాన్స్‌లో ప్రదర్శితం కానున్న సందర్భంగా సత్యజిత్ రే తనయుడు, దర్శకుడు–సంగీత దర్శకుడు సందీప్ రే స్పందించారు. ‘‘ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే బాధగా కూడా ఉంది. ‘కాన్స్’లో సినిమా ప్రదర్శితం కానున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమాలోని నటీనటుల్లో చాలా మంది ఇప్పుడు జీవించి లేకపోవడం బాధగా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా తీయాలని నాన్నగారు అనుకోలేదు. అంతర్జాతీయ స్థాయిలో ఆయన సినిమాలు ఉన్నాయని వారు తెలుసుకున్నారు. ‘పథేర్ పాంచాలి’ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది’’ అని పేర్కొన్నారు. కాన్స్ ఫెస్టివల్‌కు పూర్ణిమ... షర్మిల ఇక ఈ సినిమా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శన కానున్న సందర్భంగా ఈ చిత్ర నిర్మాత పూర్ణిమా దత్తా, ఈ చిత్రంలో నటించిన షర్మిలా ఠాగూర్ హాజరు కానున్నారు. ఈ చిత్రంలో నటించిన మరో నటి సిమీ గరేవాల్‌కు ఆహ్వానం అందినప్పటికీ అనారోగ్యం కారణంగా ఆమె హాజరు కాలేకపోతున్నారట. ఇక ఈ 78వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు భారతదేశం తరఫున ఎంపికైన ఏకైక చిత్రం ‘హోమ్‌బౌండ్’. జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమాకు హైదరాబాదీ వ్యక్తి నీరజ్ దర్శకత్వం వహించారు. ‘అన్సరై్టన్ రిగార్డ్’ విభాగంలో ‘హోమ్‌బౌండ్’ చిత్రంపోటీ పడుతోంది.

త్రీ రోజెస్
ఈషా రెబ్బా, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, ‘సత్యం’ రాజేశ్, కుషిత కల్లపు ప్రధానపాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘త్రీ రోజెస్’. ఆహా ఓటీటీలో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సిరీస్‌కు సీజన్ 2 రాబోతోంది. ఇందులో ఈషా రెబ్బా, కుషిత కల్లపు, రాశీ సింగ్ లీడ్ రోల్స్‌లో నటించారు. డైరెక్టర్ మారుతి షో రన్నర్‌గా వ్యవహరిస్తున్న ‘త్రీ రోజెస్’ సీజన్ 2కి రవి నంబూరి, సందీప్ బొల్ల రచన చేయగా, కిరణ్ కె.కరవల్ల దర్శకత్వం వహించారు.మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్కేఎన్ నిర్మించిన ఈ సిరీస్ ఆహా ఓటీటీలో త్వరలో స్ట్రీమింగ్ కానుంది. ఇదిలా ఉంటే.. ‘త్రీ రోజెస్’ సీజన్ 2 నుంచి రాశీ సింగ్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఆమె ఎందుకు ట్రెడిషనల్ నుంచి మోడ్రన్‌గా మారారు? అనేది గ్లింప్స్‌లో ఆసక్తి కలిగిస్తోంది. ‘త్రీ రోజెస్’ సీజన్ 2 నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ఈషా రెబ్బా, కుషిత కల్లపు గ్లింప్స్‌లకు మంచి స్పందన వచ్చింది. రాశీ సింగ్ క్యారెక్టర్ గ్లింప్స్‌కి కూడా అద్భుతమైన స్పందన వస్తోంది’’ అని మేకర్స్ పేర్కొన్నారు.

యాక్షన్ కన్నప్ప
విష్ణు మంచు హీరోగా నటించిన తాజా చిత్రం ‘కన్నప్ప’. ఈ చిత్రంలో ప్రీతీ ముకుందన్ హీరోయిన్గా నటించారు. మోహన్‌బాబు, ఆర్.శరత్‌కుమార్, మోహన్‌లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం ఇతర కీలకపాత్రల్లో నటించారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ పతాకాలపై మోహన్‌బాబు నిర్మించిన ఈ చిత్రం జూన్ 27న విడుదల కానుంది.ప్రస్తుతం ‘కన్నప్ప’ సినిమా అమెరికా ప్రమోషన్ టూర్లో బిజీగా ఉన్నారు విష్ణు మంచు. కాగా ఈ సినిమాలోని మేజర్ యాక్షన్ సీక్వెన్స్‌లకు తాను స్టంట్ కొరియోగ్రాఫర్‌గా చేసిన విషయాన్ని విష్ణు మంచు ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. ‘‘మార్షల్ ఆర్ట్స్‌లో నేను ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. లాస్ ఏంజిల్స్‌లో స్టంట్ మేన్‌గా వర్క్ చేశాను. తెలుగు స్టంట్ యూనియన్ సభ్యుడిగా కూడా నేను గర్వపడుతున్నాను.ఇదంతా నేను యాక్టర్ కాకముందే చేశాను. ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. అయితే ‘కన్నప్ప’ సినిమాకు షో రన్నర్‌గా చేస్తూనే, ఈ సినిమాలోని చాలా యాక్షన్ సీక్వెన్స్‌లను నేనే డిజైన్ చేశాను. ఈ యాక్షన్ సీక్వెన్స్‌లకు ప్రాణంపోసిన కెచా మాస్టర్‌కు ధన్యవాదాలు’’ అంటూ ‘ఎక్స్’లో పేర్కొన్నారు విష్ణు మంచు. అలాగే ‘కన్నప్ప’ చిత్రంలోని యాక్షన్ సీక్వెన్స్‌ల మేకింగ్ వీడియోను కూడా షేర్ చేశారు విష్ణు మంచు.
న్యూస్ పాడ్‌కాస్ట్

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం ప్రారంభం... సరిహద్దుల్లో దాడులతో కవ్వించిన పాక్ సైన్యం.. దీటుగా తిప్పికొడుతున్న భారత సేనలు... మూడు పాక్ ఫైటర్ జెట్ల కూల్చివేత, ఇద్దరు పైలట్ల పట్టివేత

పాకిస్తాన్ ఉగ్రవాద తండాలపై 'రక్త సిందూరం' 100 మందికి పైగా ముష్కరులు హతం..

పాక్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి..

దుష్ట పాకిస్తాన్ భరతం పట్టడానికి ముహూర్తం ఖరారు... ఈ వారాంతంలోపే భారీ ఆపరేషన్ జరిగే అవకాశం... బుధవారం రాష్ట్రాల్లో మాక్‌డ్రిల్స్

యాక్సిస్ ఎనర్జీ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో చంద్రబాబు సర్కారు అడ్డగోలు ఒప్పందం... అత్యధిక ధరకు 400 మెగావాట్ల విద్యుత్ కొనడానికి అంగీకారం

అన్నం పెట్టే రైతన్నలకు సున్నం పెడతారా?... కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు

వణుకుతున్న పాకిస్తాన్. భారత్‌ను నిలువరించాలని అరబ్ దేశాలను వేడుకుంటున్న పాకిస్తాన్. తమకు ఉగ్రచరిత్ర ఉందని అంగీకరించిన బిలావల్ భుట్టో

ప్రతి ఇంటినీ చంద్రబాబు మోసం చేశారు: వైఎస్ జగన్ ఆగ్రహం

దేశవ్యాప్తంగా జనగణనతో పాటే కులగణన: కేంద్రం కీలక నిర్ణయం

ఏపీలో అంతులేని అవినీతి, అంతా అరాచకమే: వైఎస్ జగన్
క్రీడలు

ఐపీఎల్ వాయిదా?
ధర్మశాల: ఉగ్రవేటకు తలపెట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ను ఏమాత్రం జీర్ణించుకోలేని పాకిస్తాన్ మిలిటరీ కుటిలబుద్ధితో క్రూరమైన దాడులకు తెగబడుతోంది. సరిహద్దు రాష్ట్రాల పౌరులపై విచక్షణారహితంగా మోర్టార్లు, ఫిరంగులతో దాడులు చేస్తోంది. దీంతో భారత బలగాలు దీటుగా బదులిస్తున్నాయి. భారత్, పాకిస్తాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కాస్తా యుద్ధభూమిని తలపించడంతో భారత రక్షణ దళాలు కీలక నగరాల్లో విద్యుత్ సరఫరా (పవర్ బ్లాక్ అవుట్)ను నిలిపివేసింది. ఇంటర్నెట్, మొబైల్ సేవల్ని నిలిపివేసింది. పాక్ ప్రయోగించిన మిస్సైళ్లు, డ్రోన్లను నిర్వీర్యం చేసేందుకు భారత సాయుధ బలగాలు రాత్రంతా శ్రమిస్తున్నాయి. ఇలా ప్రస్తుతం దేశం కోసం భారత త్రివిధ దళాలు ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే స్టేడియాల్లో ఐపీఎల్ వినోదం పట్ల నెట్టింట తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. భారత పౌరులు, ప్రధాన నగరాలే లక్ష్యంగా పాక్ ఆర్మీ విచక్షణా రహితంగా జరిపే దాడుల్ని తిప్పికొడుతున్నప్పటికీ... పొరపాటున ఏ మిసైల్, డ్రోన్ దాడి అయిన స్టేడియంలో పడితే... వేలల్లో ప్రేక్షకులు, పదుల సంఖ్యలోని విదేశీ, భారత క్రికెటర్లకు జరిగే ప్రాణనష్టం ఊహకందదు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ను రద్దు చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉన్నతాధికారులు భావిస్తున్నారు. వినోదం కంటే కూడా దేశ రక్షణ, ఆటగాళ్ల భద్రతే తమకు ప్రధానమని బోర్డు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అందుబాటులో ఉన్న బీసీసీఐ ఉన్నతాధికారులతో నేడు సమావేశమై ఐపీఎల్‌పై తుది నిర్ణయం తీసుకుంటారు. శుక్రవారం ఐపీఎల్ రద్దు లేదంటే వాయిదా ప్రకటన వెలువడుతుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. నేటి మ్యాచ్ యథాతథం ప్రస్తుత పరిస్థితులపై సమీక్షిస్తున్నాం. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత ఇంకా కొనసాగుతూనే ఉంది. ఐపీఎల్ మ్యాచ్‌ల విషయంలో ప్రభుత్వ మార్గదర్శకాల్ని పాటిస్తాం. ఇప్పటివరకైతే కేంద్రం నుంచి మాకెలాంటి సూచనలు రాలేదు. ఆటగాళ్ల భద్రత, రవాణా తదితర పరిస్థితుల్ని సమీక్షించాకే తుది నిర్ణయం తీసుకుంటాం. లక్నోలో శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు ఏ ఇబ్బందులు లేవు. కాబట్టి మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం జరిగే అవకాశాలే ఉన్నాయి. –ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ ఐపీఎల్లో నేడులక్నో X బెంగళూరువేదిక: లక్నోరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

అది అతని వ్యక్తిగత నిర్ణయం
న్యూఢిల్లీ: భారత విజయవంతమైన కెప్టెన్, ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ రిటైర్మెంట్ నిర్ణయం పూర్తిగా అతని వ్యక్తిగతమని బోర్డు సీనియర్ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు. వచ్చే నెలలో ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల ద్వైపాక్షిక సిరీస్‌కు ముందు రోహిత్ బుధవారం అనూహ్యంగా సంద్రదాయ టెస్టు ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఇది భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో పాటు క్రికెట్ అభిమానుల్ని నిర్ఘాంతపరిచింది. సీనియర్ క్రికెటర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ సారథి రహానే సైతం రోహిత్ నిర్ణయం షాక్‌కు గురి చేసిందని వ్యాఖ్యానించాడు. ‘హిట్‌మ్యాన్’ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంపై శుక్లా స్పందించారు. ‘అది పూర్తిగా అతని వ్యక్తిగత నిర్ణయం. ఇందులో బోర్డు పాత్ర ఏమీ లేదు. బోర్డు పాలసీ ప్రకారం ఎవరైనా ఆటగాడు ఆటకు వీడ్కోలు పలికితే... ఆ నిర్ణయం సవరించుకునేలా ఒత్తిడి చేయం. అలాగే ఎలాంటి సూచన గానీ, సంప్రదింపులు గానీ జరపం’ అని అన్నారు. అయితే సుదీర్ఘ కాలం ఆటగాడిగా, సారథిగా భారత క్రికెట్ అతను అందించిన సేవల్ని కొనియాడుతామన్నారు. ‘రోహిత్ ముమ్మాటికీ గొప్ప బ్యాటర్. అతను వన్డే క్రికెట్లో కొనసాగుతానని చెప్పడం ఇందులో సానుకూలాంశం.కాబట్టి అతని విశేషానుభవం, అసాధారణ ప్రదర్శన భారత వన్డే జట్టుకు బాగా ఉపయోగపడుతుంది’ అని శుక్లా అన్నారు. టెస్టుల్లో టీమిండియా తదుపరి సారథి ఎవరనేదానిపై సీనియర్ పేసర్ బుమ్రా సహా, బ్యాటర్లు కేఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్ల పేర్లు వినిపిస్తున్నప్పటికీ శుక్లా వీటిని కొట్టిపారేశారు. రోహిత్ వారసుడి ఎంపిక సెలక్షన్ కమిటీ చూసుకుంటుందని స్పష్టం చేశారు.

ఒస్ట్రావా గోల్డెన్ స్పైక్ మీట్లో నీరజ్ చోప్రా
న్యూఢిల్లీ: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా... వచ్చే నెలలో చెక్ రిపబ్లిక్లో జరగనున్న ఒస్ట్రావా గోల్డెన్ స్పైక్ అథ్లెటిక్స్ మీట్లో పాల్గొననున్నాడు. గత రెండు సార్లు గాయాల కారణంగా ఈ టోర్నీకి దూరంగా ఉన్న నీరజ్ చోప్రా... జూన్ 24న జరిగే మీట్లో బరిలోకి దిగనున్నాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పసిడి పతకం, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన నీరజ్ చోప్రా... ప్రస్తుతం కొత్త కోచ్ జాన్ జెలెజ్నీ వద్ద శిక్షణ తీసుకుంటున్నాడు. ‘ఒస్ట్రావా గోల్డెన్ స్పైక్ మీట్లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ మీట్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నా. నా కోచ్ జెలెజ్నీ గతంలో ఈ టోర్నీలో చాలా సార్లు విజేతగా నిలవడంతో పాటు... ఈవెంట్ డైరెక్టర్‌గానూ ఉన్నారు’ అని నీరజ్ పేర్కొన్నాడు. 1961 నుంచి జరుగుతున్న ఈ మీట్‌కు ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య... గోల్డ్ లెవల్ మీట్ గుర్తింపునిచ్చింది. ఈ నెల 16న దోహా డైమండ్ లీగ్‌లో పాల్గొననున్న ప్రపంచ చాంపియన్‌షిప్ స్వర్ణ పతక విజేత నీరజ్... ఈ నెల 24 భారత్‌లో తొలిసారి జరగనున్న ‘నీరజ్ చోప్రా క్లాసిక్’ ఈవెంట్లో పాల్గొననున్నాడు. బిజీ షెడ్యూల్ కారణంగా ఈ నెల 27 నుంచి 31 వరకు దక్షిణ కొరియాలో జరగనున్న ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ నుంచి నీరజ్ తప్పుకున్నాడు.

చరిత్ర సృష్టించిన ప్రభ్‌సిమ్రన్ సింగ్.. తొలి ప్లేయర్‌గా రికార్డు
ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా గురువారం ధర్మశాల వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో కూడా ప్రభ్సిమ్రాన్ బ్యాట్ ఝూళిపించాడు. ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో మెరిశాడు. తద్వారా ఓ అరుదైన ఘనతను ప్రభ్సిమ్రాన్ తన ఖాతాలో వేసుకున్నాడు.ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరపున వరుసగా అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ప్లేయర్‌గా రికార్డులెక్కాడు. ఈ ఏడాది సీజన్లో ప్రభుసిమ్రాన్ వరుసగా హాఫ్ సెంచరీలను సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు విండీస్ దిగ్గజం క్రిస్ గేల్, డేవిడ్ మిల్లర్, కేఎల్ రాహుల్, మాక్స్వెల్ పేరిట సంయుక్తంగా ఉండేది. వీరంతా వరుసగా మూడు సార్లు పంజాబ్ తరపున హాఫ్ సెంచరీలు నమోదు చేశారు.తాజా మ్యాచ్‌లో ఆర్ధశతకంతో మెరిసిన ప్రభ్సిమ్రాన్ వీరిని అధిగమించాడు. అదేవిధంగా ఐపీఎల్లో నాలుగు హాఫ్ సెంచరీలు నమోదు చేసిన తొలి అన్క్యాప్డ్ ప్లేయర్ కూడా ప్రభ్సిమ్రానే కావడం గమనార్హం. ఈ సీజన్లో ఇప్పటికి (ఈ మ్యాచ్‌తో కలిపి) 12 ఇన్నింగ్స్‌లు ఆడిన ప్రభ్‌సిమ్రన్ 487 పరుగులు సాధించాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో ఆరో స్దానంలో కొనసాగుతున్నాడు.మ్యాచ్ రద్దు..కాగా భద్రతా కారణాల దృష్ట్యా మ్యాచ్‌ను నిర్వహకులు రద్దు చేశారు.భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తల నడుమ స్ధానికంగా బ్లాక్ అవుట్ విధించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మ్యాచ్‌ను మధ్యలోనే ఆపేశారు. మ్యాచ్ రద్దు అయ్యే సమయానికి పంజాబ్ స్కోర్ 10.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 122 పరుగులు చేసింది.
బిజినెస్

ఎఫ్ఎంసీజీ అమ్మకాల్లో వృద్ధి 5 శాతమే
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ పరిశ్రమలో వృద్ధి కాస్తంత నిదానించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో అమ్మకాలు (పరిమాణం పరంగా) 5.1 శాతం పెరిగాయి. కానీ, క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో అమ్మకాలు 6.1 శాతం వృద్ధి చెందడం గమనార్హం. వినియోగదారులు తక్కువ ధరల ప్యాక్‌లను కొనుగోలు చేయడానికి మొగ్గు చూపిస్తున్నట్టు నీల్సన్ఐక్యూ నివేదిక వెల్లడించింది. అమ్మకాల్లో వృద్ధి తగ్గడం ఎఫ్ఎంసీజీ పరిశ్రమలోని దాదాపు అన్ని విభాగాల్లోనూ నమోదైంది. ఆహారోత్పత్తులతో పోలి్చతే ఆహారేతర ఉత్పత్తుల విభాగం కాస్త మెరుగైన ప్రదర్శన చూపించింది. చిన్న ప్యాక్‌లు ఎక్కువగా అమ్ముడుపోయే గ్రామీణ మార్కెట్ మార్చి త్రైమాసికంలో పట్టణ మార్కెట్ కంటే నాలుగు రెట్లు వేగవంతమైన వృద్ధిని నమోదు చేసింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపించింది. అయినప్పటికీ మొత్తం మీద గ్రామీణ మార్కెట్లోనూ వృద్ధి క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చూసినప్పుడు తగ్గింది. ఎఫ్ఎంసీజీ మార్కెట్లో చిన్న కంపెనీలు (అన్ బ్రాండెడ్) తమ వాటాను పెంచుకున్నాయి. అమ్మకాల్లో డబుల్ డిజిట్ వృద్ధి నమోదైంది. ఇక ధరల పెరుగుదల రూపంలోనూ 5.6 శాతం వృద్ధి నమోదైంది. దీంతో కలిపి చూస్తే మార్చి త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ పరిశ్రమలో వృద్ధి 11 శాతంగా ఉంది. సంప్రదాయ దుకాణాల్లో అధిక అమ్మకాలు సంప్రదాయ కిరాణా దుకాణాల్లోనూ ఎఫ్ఎంసీజీ అమ్మకాలు మార్చి త్రైమాసికంలో వృద్ధిని చూశాయి. మెట్రో మార్కెట్లో క్విక్‌కామర్స్ రూపంలో అధిక అమ్మకాలు కనిపించాయి. ‘‘ఆహార వినియోగంలో వృద్ధి 2025 క్యూ1లో (జనవరి–మార్చి) 4.9 శాతానికి తగ్గింది. 2024 చివరి మూడు నెలల్లో ఇది 6 శాతంగా ఉంది. వంట నూనెల విభాగంలో ధరలు పెరగడంతో వినియోగం తగ్గింది’’అని నీల్సన్ఐక్యూ నివేదిక వెల్లడించింది. ఆహారోత్పత్తుల విభాగంలో ధరల పెరుగుదల 7.2 శాతంగా ఉండడం గమనార్హం. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 0.9 శాతంగానే ఉంది. అంటే ధరల పెంపు ద్వారా కంపెనీలు ఆదాయాన్ని పెంచుకున్నట్టు తెలుస్తోంది. హోమ్ అండ్ పర్సనల్ కేర్ (హెచ్పీసీ) ఉత్పత్తుల అమ్మకాలు 5.7 శాతం పెరిగాయి. 2024 డిసెంబర్ త్రైమాసికంలో వృద్ధి 10.8 శాతం కంటే తక్కువే. ఓటీసీ అమ్మకాలు విలువ పరంగా 14 శాతం పెరిగాయి. ఈ విభాగంలో ధరలను 10.4 శాతం పెంచడం ఇందుకు అనుకూలించింది. టాప్–8 మెట్రో నగరాల్లో ఈ–కామర్స్ అమ్మకాలు 13 శాతం పెరిగాయి. ఏడాదికి రూ.100 కోట్ల టర్నోవర్ ఉండే చిన్న ఎఫ్ఎంసీజీ కంపెనీల అమ్మకాలు (పరిమాణం పరంగా) 11.9 శాతం వృద్ధి చెందాయి. రూ.100–1,000 కోట్ల టర్నోవర్ ఉండే కంపెనీల అమ్మకాలు పరిమాణం పరంగా 6.4 శాతం పెరిగాయి. రూ.5,000 కోట్ల వరకు ఆదాయం కలిగిన బడా ఎఫ్ఎంసీజీ కంపెనీల అమ్మకాలు పరిమాణం పరంగా కేవలం 1.6 శాతం వృద్ధినే చూశాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో వృద్ధి 8.1 శాతంతో పోలి్చతే గణనీయంగా తగ్గింది. ప్రధానంగా పెద్ద సంస్థలు అమ్మకాల విషయంలో తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నట్టు ఈ నివేదిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ఏషియన్ పెయింట్స్ లాభం డౌన్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం ఏషియన్ పెయింట్స్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 45 శాతం క్షీణించి రూ. 701 కోట్లకు పరిమితమైంది. డిమాండ్ తగ్గడంతోపాటు, పోటీ తీవ్రత ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 1,275 కోట్లు ఆర్జించింది.మొత్తం ఆదాయం సైతం రూ. 8,731 కోట్ల నుంచి రూ. 8,359 కోట్లకు స్వల్పంగా(4 శాతం) వెనకడుగు వేసింది. మొత్తం వ్యయాలు రూ. 7,277 కోట్లుగా నమోదయ్యాయి. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 20.55 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. విదేశీ అమ్మకాలు వీక్ క్యూ4లో ఇతర ఆదాయంతో కలిపి ఏషియన్ పెయింట్స్ మొత్తం టర్నోవర్ 5 శాతం తక్కువగా రూ. 8,459 కోట్లకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయాలు 2 శాతం నీరసించి రూ. 800 కోట్లకు పరిమితమయ్యాయి. ఇథియోపియా, ఈజిప్్టలలో కరెన్సీ విలువ క్షీణించడం, బంగ్లాదేశ్‌లో ఆర్థిక సవాళ్లు ఇందుకు కారణమైనట్లు కంపెనీ ఎండీ, సీఈవో అమిత్ సింగ్లే పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు బీఎస్ఈలో 1.3 శాతం బలహీనపడి రూ. 2,303 వద్ద ముగిసింది.

జీ ఎంటర్టైన్మెంట్ పటిష్ట పనితీరు
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం (2024–25) మార్చి త్రైమాసికంలో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజ్ పటిష్ట పనితీరు చూపించింది. నికర లాభం ఎన్నో రెట్ల వృద్ధితో రూ.188 కోట్లకు చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి లాభం కేవలం రూ.13 కోట్లుగానే ఉంది. వ్యయ నియంత్రణకు తీసుకున్న సమర్థవంతమైన చర్యలు ఫలితమిచ్చాయి. ఆదాయం కేవలం 1.6 శాతం వృద్ధితో రూ.2,185 కోట్ల నుంచి రూ.2,220 కోట్లకు చేరింది. సబ్స్క్రిప్షన్ ఆదాయం, ఇతర అమ్మకాలు, సేవలు మార్చి త్రైమాసికంలో వృద్ధిని నడిపించినట్టు కంపెనీ తెలిపింది.ప్రకటనల వాతావరణం బలహీనంగా ఉన్నప్పటికీ లాభదాయకత పెంచుకున్నట్టు పేర్కొంది. ప్రకటనల ఆదాయం 27 శాతం తగ్గిపోయింది. జీ సినీ అవార్డుల కార్యక్రమం వాయిదా వేయడం, క్రీడలతో కూడిన రద్దీ కేలండర్‌ను కారణాలుగా తెలిపింది. సబ్‌్రస్కిప్షన్ ఆదాయం 4 శాతం పెరిగి రూ.986 కోట్లుగా ఉంది. మొత్తం వ్యయాలు 4.2 శాతం తగ్గి రూ.1,958 కోట్లకు పరిమితమయ్యాయి. బీఎస్ఈలో కంపెనీ షేరు 1 శాతానికి పైగా లాభపడి రూ.111 వద్ద ముగిసింది.

మార్కెట్లకు సైబర్ దాడి ముప్పు
న్యూఢిల్లీ: దేశీ మార్కెట్లకు సైబర్ దాడుల ముప్పు పొంచి ఉందని మార్కెట్ వర్గాలను స్టాక్ ఎక్సే్చంజీ బీఎస్ఈ హెచ్చరించింది. రిస్క్‌లను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఒక సర్క్యులర్‌లో సూచించింది. రిస్క్ లను మదింపు చేసుకుని, నివారణ చర్యలు తీసుకోవాలని, సిస్టంల భద్రతకు సంబంధించి పర్యవేక్షణను పటిష్టపర్చుకోవాలని, దాడులు జరిగిన పక్షంలో సత్వరం స్పందించేలా తగు ప్రణాళికలతో సన్నద్ధంగా ఉండాలని తెలిపింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌పై భారత సైన్యం క్షిపణి దాడులతో విరుచుకుపడిన నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది.
ఫ్యామిలీ

30 డేస్ ఛాలెంజ్ : ఇలా చేస్తే యవ్వనంగా, ఆరోగ్యంగా!
ఉదయాన్నే వేడి వేడి కాఫీనో, టీనో తాగాలి. అదీ కాస్త చక్కెర ఎక్కువ వేసుకుంటే భలే మజాగా ఉంటుంది. ఇక అన్నం తినగానే మామిడిపండో, అరటిపండో ఏదో ఒక పండు తినాలి. లేదంటే ఏదో ఒక స్వీట్ లడ్డూనో,పాలకోవా, మైసుర్ పాక్ ఏదో ఒకటి అలా నోటికి తగిలితే భోజనం పూర్తి అయినట్టు. అంతే కాదండోయ్.. టీలో వేస్తూనో, పిల్లలకు పాలు కలుపుతూనో ఒక స్పూన్ నోట్లో వేసుకోవడం గృహిణులు బాగా అలవాటు. ఒక విధంగా చెప్పాలంటే షుగర్ లేని రోజంటూ ఉండదు. నిత్యం ఏదో ఒక రూపంలో చక్కెర బుక్కేస్తూ ఉంటాం. షుగర్ లెస్ టీ అంటూనే, టీలో మైదా, చక్కెర కలిపిన బిస్కట్లు నంజుకుంటాం. అసలు చక్కెర అతిగా తినడం వల్ల అనర్థాల గురించి ఎపుడైనా ఆలోచించారా? ఒక్క నెల రోజులు చక్కెర తినడం మానేస్తే మన శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు ఎలా ఉంటాయో తెలుసా?ఇలా నియంత్రణ లేకుండా స్వీట్లు, సోడా, పండ్ల రసాలు, కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ రూపంలో నిత్యం మనం చక్కెరను తీసుకుంటూ ఉంటాం. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ అధిక చక్కెర వినియోగం ఆరోగ్యంపై వివిధ ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. రక్తంలో చక్కెర స్థాయి పెరుగుదలకు కారణమవుతుంది. చక్కెర కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెప్పేమాట. టైప్ 2 డయాబెటిస్‌తోపాటు, గుండె జబ్బులు, దంత సమస్యలు , మానసిక ఆరోగ్యం సరిగా లేకపోవడం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇన్స్టాగ్రామ్ వీడియోలో, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి వరుసగా 30 రోజులు చక్కెరను మానేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వెల్లడించారు. View this post on Instagram A post shared by Saurabh Sethi (@doctor.sethi)> చదవండి: వాడిన నూనెను ఇంత బాగా క్లీన్ చేయొచ్చా.. సూపర్ ఐడియా! 30 రోజులు చక్కెర వాడకాన్ని మానేయడం వల్ల కలిగే ప్రయోజనాలు గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా తక్కువని అధ్యయనాల్లో తేలింది. ఒత్తిడి, ఆందోళన తగ్గుముఖం పడుతుంది. లివర్‌లో ఉండే కొవ్వు క్రమంగా తగ్గిపోతుంది.ముఖంలో ఉన్న కొవ్వు కూడా తగ్గుతుంది చక్కెరను తగ్గిస్తే ముఖం నాజూగ్గా తయారవుతుంది. ఉబ్బరం , నీరు తగ్గి చక్కటి ముఖం వస్తుంది. అధిక చక్కెర తీసుకోవడం వల్ల శరీరంలో మంట వస్తుంది. ఒక్క నె లరోజులు దీన్ని నియంత్రిస్తే, ఇది తగ్గుతుంది. అలాగే కళ్లు, కాళ్ళలో వాపు తగ్గుతుంది.నడుము సన్నగా అవుతుంది. బొడ్డు, కాలేయ కొవ్వు తగ్గుతుంది. కేలరీలు తగ్గి, బరువు తగ్గడానికి, లేదా పెరగకుండా ఉండటానికి దోహద పడుతుంది.గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చక్కెరను మానేయడం వల్ల గట్ బాక్టీరియా సమతుల్యమవుతుంది. జీర్ణక్రియ మెరుగుపడి, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది.ఆరోగ్యకరమైన చర్మం మీ సొంతమవుతుంది. మొటిమలు , చర్మం ఎర్రబారటం తగ్గి, స్కిన్ ప్రకాశవంతమవుతుంది. దీంతొవృద్ధాప్య ఛాయలు తగ్గి యవ్వనంగా కనిపిస్తారు.ఇదీ చదవండి: Operation Sindoor : అంబానీ లెక్క అది...తొలి సంస్థగా రిలయన్స్!చక్కెరను తగ్గించడానికి చిట్కాలు:ప్రాసెస్ చేసిన పదార్థాలకు దూరండా ఉండాలి. లేబుల్‌లను జాగ్రత్తగా చదివి తీసుకోవాలి.చక్కెర బాగా తీసుకోవడం బాగా అలవాటైతే నెమ్మదిగా తగ్గించేందుకు ప్రయత్నించాలి. చక్కెరను తీసుకోవడం మానేసిన వారిలో తలనొప్పి అలసట, శక్తి స్థాయిలు తగ్గినట్లు అనిపిస్తుంది. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ,లీన్ ప్రోటీన్లు వంటి ఆహారంపై దృష్టిపెట్టాలి. ప్రత్యామ్నాయ షుగర్ ఉత్పత్తులపై దృష్టిపెట్టాలి. నోట్. సోషల్‌మీడియా సమాచారం ఆధారంగా అందించిన సమాచారం అని గమనించగలరు. ముఖ్యంగా గుండెజబ్బుల, అధిక రక్తపోటుతో బాధపడేవారు వైద్యుల సలహా మేరకు తమ ఆహార పద్దతులను మార్చుకోవాలి.

Operation Sindoor : అంబానీ లెక్క అది...తొలి సంస్థగా రిలయన్స్!
భారతదేశం 'ఆపరేషన్ సిందూర్' సైనిక ఆపరేషన్‌ను ప్రకటించిన కొద్ది గంటలకే ఈ పదంపై ట్రేడ్ మార్క్‌కోసం కొన్నిసంస్థలు ముందుకొస్తున్నాయి. ఇందులో కుబేరుడు ముఖేష్ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ తొలి సంస్థగా నిలిచింది. ఈ మేరకు బార్ అండ్ బెంచ్ నివేదించింది.ముఖేష్ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ బుధవారం (మే 7) ట్రేడ్ మార్క్స్ రిజిస్ట్రీ ముందు 'ఆపరేషన్ సిందూర్' ను వర్క్ మార్క్ గా నమోదు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకుంది.విద్య మరియు వినోద సేవలను కవర్ చేసే క్లాస్ 41 కింద 'వస్తువులు మరియు సేవలు' కోసం ఈ పదాన్ని వాడుకునే హక్కు కోసం రిజిస్ట్రేషన్ కోరింది.అంబానీతోపాటు, మరో ముగ్గురు వ్యక్తులు కూడా ఈ పదంరిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. ఇందులో ముంబై నివాసి ముఖేష్ చెత్రం అగర్వాల్, భారత వైమానిక దళానికి చెందిన రిటైర్డ్ గ్రూప్ కెప్టెన్ కమల్ సింగ్ ఒబెర్హ్ ,ఢిల్లీలోని న్యాయవాది అలోక్ కొఠారి ఉన్నారు.ఇదీ చదవండి: Thalassemia Day: బడికి వెళ్లే వయసులోనే..రక్త కన్నీటి గాథ..!పహల్గామ్ ఉగ్రవాద దాడి,25 మంది భారతీయులు మరణించిన నేపథ్యంలో ‘ఆపరేషన్ సిందూర్’ కింద మే 6-7 తేదీల మధ్య రాత్రి పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారతదేశం భారత సాయుధ దళాలు ప్రారంభించిన ఆపరేషన్. ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా వైమానిక దాడులు ప్రారంభించింది. ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన మహిళలకు నివాళిగా కేంద్రం ఈ మిషన్‌ను ఈ పేరు పెట్టింది. సైనిక కార్యకలాపాల పేర్లకు ఆటోమేటిక్ రక్షణ లేదుభారతదేశంలో, 'ఆపరేషన్ సిందూర్' వంటి సైనిక కార్యకలాపాల పేర్లను ప్రభుత్వం స్వయం చాలకంగా రక్షించదు. రక్షణ మంత్రిత్వ శాఖ సాధారణంగా అటువంటి పదాలను నమోదు చేయదు లేదా వాటిని మేధో సంపత్తిగా పరిగణించదు. నిర్దిష్ట చట్టపరమైన రక్షణ లేకుండా, ఈ పేర్లను ప్రైవేట్ వ్యక్తులు లేదా కంపెనీలు ట్రేడ్‌మార్క్ దాఖలు ద్వారా క్లెయిమ్ చేయవచ్చని నివేదిక పేర్కొంది.చట్టపరమైన అడ్డంకులు ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్ కోసం ఈ పదం అందుబాటులో ఉన్నప్పటికీ, ట్రేడ్ మార్కుల చట్టం, 1999 కొన్ని కారణాల వల్ల దరఖాస్తులను తిరస్కరించడానికి రిజిస్ట్రీకి అధికారం ఉంది. సెక్షన్లు 9(2) మరియు 11 ప్రకారం, రిజిస్ట్రార్ తప్పుదారి పట్టించే, తప్పుడు ప్రభుత్వ అనుబంధాన్ని సూచించే లేదా ప్రజల మనోభావాలకు హాని కలిగించే ట్రేడ్‌మార్క్‌ను తిరస్కరించవచ్చు. అయితే, ప్రభుత్వం లేదా ప్రభావిత పార్టీ ద్వారా అధికారిక అభ్యంతరం లేవనెత్తకపోతే అటువంటి నిబంధనలను నమోదు చేయడంపై ఎటువంటి నిషేధం లేదు. మరి ఇది ఎవరికి దక్కనే భవిష్యత్తులో తేలనుంది. చదవండి: వాడిన నూనెను ఇంత బాగా క్లీన్ చేయొచ్చా.. సూపర్ ఐడియా!

'అస్సలు ఇది ఊహించలేదు చాలా గర్వంగా ఉంది'..! సోఫియా తండ్రి భావోద్వేగం
పహల్గాం ఉగ్రవాద దాడికి భారత సైన్యం 'ఆపరేషన్ సిందూర్' చేపట్టి తగిన రీతీలో బదులిచ్చింది. దీనిపై యావత్ దేశం హర్షాతీరేకాలు వ్యక్తం చేసింది. అన్నింటికంటే ఈ ఆపరేషన్ సిందూర్ గురించి మీడియా ముందు వెల్లండించిన ఇద్దరు మహిళా అధికారులు అందరి దృష్టిని ఆకర్షించారు. ఇది ఒకరకంగా భారత రక్షణదళం ఎవరి సారథ్యంలో కొనసాగుతోంది అనేది ప్రపంచానికి తెలిసేలా చేసింది. వారే కల్నల్ సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్‌లు. అయితే తాతా ముత్తాతల నుంచి ఆర్మీలో సేవలందిస్తున్న సోఫియా కుటుంబం తమ కుమార్తె చేసిన పనికి ఆనందపారవశ్యంలో మునిగితేలుతోంది. 'ఇది మాకెంతో గర్వం' అని భావోద్వేగంగా చెబుతున్నారు కుటుంబసభ్యులు. ఆమె తండ్రి తాజ్ మొహమ్మద్ ఖురేషి సైతం ఇలాంటి గొప్ప అవకాశం తన కుమార్తెకు వస్తుందని కల్లో కూడా ఊహించలేదన్నారు. ఆమె కారణంగా ఈ రోజు యావత్ దేశానికి తమ కుటుంబం గురించి తెలిసేలా వార్తల్లో నిలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో సోఫియాకి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఆమె కుటుంబసభ్యుల మాటల్లోనే చూద్దామా..!.తమ కుమార్తె భారత ఆర్మీ, నేవీ, వైమానిక బలగాలు సంయుక్తంగా నిర్వహించి ఈ సిందూర్ ఆపరేషన్ గురించి మీడియా ముందుకు వచ్చి చెప్పడం చాలా సంతోషంగా ఉందన్నారు కల్నల్ సోఫియా తల్లి హనిమా ఖురేషి. అంతేగాదు తమ కుమార్తె సోపియా కొడుకు(18) కూడా ఐఏఎఫ్(IAF)లో చేరడానికి సిద్ధంగా ఉన్నాడని అన్నారామె. ఇక కల్నల్ సోషియా తండ్రి తాజ్ ఖురేషి మాట్లాడుతూ.."నా కుమార్తె పట్ల నాకు గర్వంగా ఉంది" నా కుటుంబం ఎల్లప్పుడూ 'వయం రాష్ట్రే జాగ్రయం ( జాతి మొత్తాన్ని సజీవంగా, జాగరూకతతో ఉండేలా చేస్తాం)' అనే సూత్రాన్ని పాటిస్తుంది. 'ముందు మేము భారతీయులం ఆ తర్వాతే ముస్లీంలం' అని సగర్వంగా అన్నారు తాజ్ మొహ్మద్ ఖురేషి. అంతేగాదు ఆమె తాతతో ప్రారంభమైన ఈ దేశ సేవను..సోపియా మూడవ తరం సైనిక అధికారిగా ముందుకు తీసుకెళ్తుందన్నారు. Meet Taj Qureshi, the proud father of Colonel Sofiya Qureshi 🇮🇳“My grandfather, father & I were all in the #IndianArmy If I get a chance today, I will destroy Pakistan”Imagine RW & Godi Media question their patriotism everyday 💔Mad respect for the REAL HEROES OF INDIA 🫡🇮🇳 pic.twitter.com/CDHH2XoJkt— Ankit Mayank (@mr_mayank) May 7, 2025 ఇక సోఫియా తండ్రి తాజ్ ఖురేషి వడోదరలో ఎలక్ట్రానిక్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ కార్ఫ్స్ పనిచేయడమే గాక 1971 యుద్ధంలో సేవలందించారు. అలాగే సోఫియా తండ్రి (తాజ్)గారి అమ్మమ్మ తాతయ్య బ్రిటిష్ సైన్యంలో పనిచేయడమే గాక 1857 స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు కూడా. ఇక ఆమెకు ముగ్గురు సోదరులు కూడా ఉన్నారు. వారిలో ఒకరైన మొహమ్మద్ సంజయ్ ఖురేషి మాట్లాడుతూ..'దేశ భక్తి మా రక్తంలోనే ఉంది' అని సగర్వంగా చెప్పారు. ఎందుకంటే సోఫియా ప్రొఫెసర్ కావాలనుకుంని, అనివార్య కారణాలతో భారత ఆర్మీ యూనిఫాం ధరించిందని అన్నారు. అలా ఆమె కుటుంబ సంప్రదాయన్ని పుణికి పుచ్చుకుందని అన్నారు. ఇక ఆమె భర్త తాజుద్దీన్ ఆర్మీ మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీలో అధికారి కావడం విశేషం. చివరిగా కుటుంబ సభ్యులంతా.."ఆమె మాకు ఆదర్శం... ప్రతీకారం తీర్చుకోవడానికి మేము చాలా కాలంగా ఎదురుచూశామం కానీ, ఇలాంటి అద్భుత అవకాశం మా కుటుంబ సభ్యల్లో ఒకరికి దక్కడం ఎంతో సంతోషంగా ఉంది. ఆ పహల్గాం ఘటనలో భర్తలను కోల్పోయిన సోదరీమణులు, తల్లుల ఆక్రందనలకు సిందూరంతో ప్రతీకారం తీర్చుకున్నాం" అని అన్నారు. కాగా, సోఫియా పేరు మీద అనేక అవార్డులు కూడా ఉన్నాయట. అలాగే భారతదేశం నిర్వహించిన అతిపెద్ద విదేశీ సైనిక కవాతులో పాల్గొన్న 18 కంటింజెంట్లలో ఏకైక మహిళా కమాండర్ సోఫియానే అట.విద్యా నేపథ్యం:కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ మీడియంలో పాఠశాల విద్యను పూర్తి చేసినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ తర్వాత 1995లో బీఎస్సీ, 1997లో ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత భారత సైన్యంలో చేరేందుకు తన పీహెచ్డీ ప్రోగ్రామ్ని మధ్యలోనే విడిచిపెట్టినట్లు వివరించారు. ఇక సైన్యంలో చేరాక తన కెరీర్లో ఆరేళ్లు యూఎన్ శాంతి పరిరక్షక దళాలలో పని చేయడం, సంఘర్షణ ప్రాంతాలలో పనిచేయడం, మానవతా ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడం వంటి ఎన్నో అద్భుత సేవలందించారామె.(చదవండి: నేలరాల్చిన 'సిందూరం'తోనే బదులు..! ఆదిపరాశక్తులే స్వయంగా..)

బడికి వెళ్లే వయసులోనే.. రక్త కన్నీటి గాథ..!
కొందరు చిన్నారులు తల్లిపాలు తాగే వయస్సులో రక్తాన్ని ఎక్కించుకుంటూ తల్లడిల్లుతున్నారు. బడికి వెళ్లాల్సిన సమయంలో రక్తనిధి కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. చాక్లెట్లు చప్పరించాల్సిన నోటితో చేదు మందు బిల్లలు తింటున్నారు. తోటి చిన్నారులు ఆనందంగా ఆడుకుంటుంటే చూస్తూ ఉండటం తప్ప ఏమి చేయలేని నిస్సహాయస్థితి వారిది. అలసట, ఆయాసాల మధ్య ప్రాణాంతక వ్యాధి తలసేమియా బాధితుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. ఉమ్మడి జిల్లాలో 179 మంది చిన్నారుల సంతోషాన్ని ఇది దూరం చేస్తోంది. అయితే వారి ఆయుష్షు పెంచే బాధ్యతను జిల్లా జనరల్ ఆస్పత్రి, రెడ్‌క్రాస్ తీసుకుంది. రక్తం ఎక్కించాల్సిందే.. తలసేమియా జన్యు సంబంధిత వ్యాధి. వ్యాధి సోకిన వారికి వారం, పదిహేను రోజులకు ఒకసారి రక్తాన్ని ఎక్కించాల్సిందే. లేకపోతే వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడే పరిస్థితి ఉంది. ఈ వ్యాధిగ్రస్థుల్లో హిమోగ్లోబిన్ ఉత్పత్తి శరీరానికి అవసరమైనంత ఉండదు. ఒకవేళ ఉత్పత్తి అయినా ఎక్కువ కాలం ఉండదు. 2018లో తలసేమియాను ఆరోగ్యశ్రీ పథకంలో విలీనం చేయడం వల్ల బాధితులకు ప్రతి నెల మందులను జనరల్ ఆస్పత్రి నుంచి ఇస్తుంటే.. రక్తం మాత్రం రెడ్‌క్రాస్ నుంచి అందిస్తున్నారు. ఇదీ చదవండి: World Ovarian Cancer Day : సైలెంట్‌గా..స్త్రీలకు గండంగా!వ్యాధి లక్షణాలు.. తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించే అవకాశం ఉంది. చిన్నారులు ఎదుగుతున్న కొద్దీ వ్యాధి బయటపడుతుంది. వ్యాధి బారినపడిన పిల్లలకు రక్తహీనత మొదలై జీర్ణశక్తి మందగిస్తుంది. ముఖం పాలిపోవటం, ఎదుగుదల లేకపోవడం, హుషారు తగ్గడం, నీరసించి పోవడం వంటి లక్షణాలు కని్పస్తాయి. కీళ్ల నొప్పులు, కడుపు నొప్పి ప్రారంభమై, మూత్రం పసుపు వర్ణంతో వస్తోంది. ఇదీ చదవండి: వాడిన నూనెను ఇంత బాగా క్లీన్ చేయొచ్చా.. సూపర్ ఐడియా!పరీక్షలు చేయించు కోవాలి ఈ వ్యాధి బారిన పడినవారు పసువు రంగులో మూత్ర విసర్జన చేస్తుండటం వల్ల దీనిని తల్లిదండ్రులు పచ్చకామెర్లుగా భావిస్తుంటారు. అవగహన లేమి కారణంగా పచ్చ కామెర్లకు చికిత్స అందిస్తారు. పైలక్షణాలు పిల్లల్లో ఉంటే జనరల్ ఆస్పత్రిల్లో పూర్తిస్థాయి పరీక్షలు చేయించి చికిత్స చేయించుకోవాలి.
ఫొటోలు


అన్నవరం : కన్నుల పండువగా సత్యదేవుని దివ్య కల్యాణోత్సవం (ఫొటోలు)


హైదరాబాద్ : సైన్యానికి సంఘీభావం..సీఎం రేవంత్ క్యాండిల్ ర్యాలీ (ఫొటోలు)


తిరుపతి : గంగమ్మా..కరుణించమ్మా సారె సమర్పించిన భూమన (ఫొటోలు)


బర్త్‌డే స్పెషల్.. విజయ్ దేవరకొండ గురించి 10 ఆసక్తికర విషయాలు (ఫొటోలు)


నిర్మాత దిల్ రాజు భార్య తేజస్విని గ్లామరస్ స్టిల్స్ (ఫొటోలు)


అరుణాచల దర్శనం చేసుకున్న నటుడు ప్రభాకర్ ఫ్యామిలీ (ఫొటోలు)


మీ తెగువకు హ్యాట్సాఫ్: వైఎస్ జగన్ (ఫోటోలు)


‘శుభం’ మూవీ దెయ్యం బయట ఇంత అందంగా ఉందా? (ఫోటోలు)


తిరుపతి : రెండో రోజు గంగమ్మ జాతర.. బైరాగి వేషంలో మొక్కుల చెల్లింపులు (ఫొటోలు)


హైదరాబాద్‌లో ఉత్కంఠభరితంగా ‘ఆపరేషన్ అభ్యాస్’ మాక్ డ్రిల్ (ఫొటోలు)
అంతర్జాతీయం

భారత్‌కు దాడి చేసే హక్కు ఉంది.. బ్రిటన్ ఎంపీ ప్రీతి పటేల్ సపోర్ట్
లండన్: పాకిస్తాన్‌పై భారత్ తలపెట్టిన ఆపరేషన్ సిందూర్‌పై ప్రపంచ దేశాల నేతలు స్పందిస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు భారత్‌కు మద్దతు ప్రకటించారు. ఇక, తాజాగా భారత సంతతి, యూకే ఎంపీ ప్రీతి పటేల్.. బ్రిటన్ పార్లమెంట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆత్మరక్షణలో భాగంగా పాకిస్తాన్‌పై దాడి జరిపే హక్కు భారత్‌కు ఉందని తేల్చి చెప్పారు. ఈ విషయంలో భారత్‌కు మద్దతు ఉంటుందని చెప్పుకొచ్చారు.పాకిస్తాన్‌పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై బ్రిటన్ పార్లమెంట్లో తాజాగా భారత సంతతి ఎంపీ ప్రీతి పటేల్ ప్రస్తావించారు. ఈ సందర్భంగా ప్రీతి పటేల్.. భారత్‌తో కలిసి ఉగ్రవాదానికి వ్యతిరేక బ్రిటన్ పోరాడాల్సిన అవసరం ఉందనన్నారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థల వల్ల సరిహద్దు దాటి వస్తున్న ఉగ్రవాద ముప్పును బ్రిటన్ ప్రభుత్వం గుర్తించాలని కోరారు. పహల్గాం ఘటనలో ఉగ్రవాదులు 26 మంది అమాయక పర్యాటకులను దారుణంగా హతమార్చారని గుర్తు చేశారు. ముంబై, న్యూఢిల్లీ వంటి ఉగ్రవాద ప్రభావిత నగరాల జాబితాలో ఇప్పుడు పహల్గాం కూడా చేరిపోయింది.పహల్గాం దాడిని ఉగ్రవాద చర్యగా ప్రపంచ దేశాలు సైతం గుర్తించాయి. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గాలని నేను కోరుకుంటున్నాను. దేశాల మధ్య సైనిక చర్య, యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతలు ఏర్పడకూడదు. ఆత్మరక్షణలో భాగంగా తమను తాము రక్షించుకోవడానికి, ఉగ్రవాద క్యాంపులను నేలమట్టం చేయడానికి భారత్‌కు సహేతుక కారణాలు ఉన్నాయి. ఇది భారత్ హక్కు. పాకిస్తాన్ కేంద్రంగా ఉన్న ఉగ్రవాదుల ముప్పు భారత్‌కు మాత్రమే కాదని, అనేక దేశాలు ప్రభావితమవుతున్నాయి. ఒసామా బిన్ లాడెన్ వంటి వ్యక్తి పాకిస్తాన్‌లోనే దాక్కున్నాడు. ఇది అందరికీ తెలిసిన బహిరంగ విషయమేనని అన్నారు.Today in the House of Commons I reiterated my condolences for those impacted by the atrocity that took place in Pahalgam. We must stand with those affected by terrorism. The UK must work with our friends in India to tackle terrorist threats and engage with India, Pakistan and key… pic.twitter.com/8RXezaJHx0— Priti Patel MP (@pritipatel) May 7, 2025ఇక, బ్రిటన్- భారత్ నిఘా సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రదాడి తర్వాత బ్రిటన్ ప్రభుత్వం భారత్‌కు ఏదైనా ప్రత్యేక భద్రతా సహాయం అందించిందా? ఉద్రిక్తతలు పెరగకుండా నిరోధించడానికి బ్రిటన్ ప్రత్యేక మద్దతును అందించగలదా?" అని ప్రీతి పటేల్ ప్రశ్నించారు. చివరగా.. భారత్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడులు, సృష్టించిన హింసాత్మక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని బ్రిటన్ తన వంతు సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు.

భారత్-పాక్ యుద్ధం.. బిగ్ ట్విస్ట్ ఇస్తూ ట్రంప్ వ్యాఖ్యలు
వాషింగ్టన్: ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ మెరుపు దాడుల వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్తాన్ ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడం ఆపేయాలని కోరారు. అలాగే, ఇరు దేశాలు సాయం కోరితే తాను అందుబాటులో ఉంటానని ట్రంప్ వెల్లడించారు.ఆపరేషన్ సిందూర్ నేపథ్యం భారత్, పాకిస్తాన్ మధ్య మరోసారి ఉద్రిక్తకర వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పలువురు దేశాధినేతలు, రాయబారులు దాడుల ఘటనపై స్పందించారు. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని భారత్, పాక్‌లను కోరారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం మరోసారి స్పందించారు.ఓవల్ ఆఫీస్‌లో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. ‘భారత్, పాక్‌ల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. దాడులు చేయడం అవమానకరం. రెండు దేశాల గురించి నాకు చాలా తెలుసు. ఎప్పటి నుంచో వారి మధ్య వైరం ఉంది. అయితే, రెండు దేశాలతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని, వాటిని ఆపేయాలని కోరుకుంటున్నాను. వారు అనుకుంటే ఇప్పుడే ఇది చేయగలరు. రెండు దేశాలు కయ్యానికి కాలు దువ్వాయి. అమెరికాతో భారత్, పాక్‌కు మంచి సంబంధాల దృష్ట్యా వారికి సహాయం చేయాల్సి వస్తే నేను అందుబాటులో ఉంటాను. ఏ సహాయమైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను’ అంటూ వ్యాఖ్యలు చేశారు.U.S. President Donald Trump has condemned India's attack, calling it shamefulPakistan Zindabad!#Pakistan #PakistanismyRedLine #donaldjtrump #PakistanZindabad #IndiaPakistanWar pic.twitter.com/iDl8SwVeLH— Anmol Sheraz (@iamanmolsheraz) May 6, 2025 చైనాకు భారత్ వార్నింగ్మరోవైపు.. ఆపరేషన్ సిందూర్‌పై విషం గక్కే ప్రయత్నం చేసిన పొరుగు దేశం చైనా భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. భారత్‌కు చెందిన మూడు విమానాలను పాక్ కూల్చేసిదంటూ చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ రాసిన కథనంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటి కథనాలు రాయడం మానుకోవాలని హెచ్చరించింది.

ఆపరేషన్ సిందూర్.. తొలిసారి స్పందించిన పాక్ ప్రధాని
ఇస్లామాబాద్: పహల్గాంలో ఉగ్రదాడులకు భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. ఈ దాడుల్లో దాదాపు 100 మంది వరకు ఉగ్రవాదులు హతమైనట్టు సమాచారం. ఇక, ఆపరేషన్ సిందూర్‌పై పాకిస్తాన్ ప్రధాని షెహబాబ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తొలిసారి స్పందించారు. పాకిస్తాన్ జాతినుద్దేశించి ప్రసంగించిన షరీఫ్..తమ దేశంపై జరిగిన దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. భారత్ ధీటుగా సమాధానం ఎలా ఇవ్వాలో తమ దేశానికి, తమ బలగాలకు తెలుసు అంటూ హెచ్చరికలు జారీ చేశారు. పాక్ సాయుధ దళాలకు దేశం మొత్తం అండగా నిలుస్తుందన్నారు. మనం వెనక్కి తగ్గుతున్నామని వారు (భారత్) అనుకుంటోంది. కానీ, ఇది ధైర్యవంతుల దేశమని వారు మరచిపోయారు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. పాకిస్తాన్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత దళాలు బాంబుల వర్షం కురిపించాయి. జైషే మహ్మద్, లష్కరే తోయిబా ప్రధాన స్థావరాలను లక్ష్యంగా చేసుకొని నేలమట్టం చేశాయి. విజయవంతంగా జరిపిన ఈ ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జైషే ముఠాకు చెందిన ఓ స్థావరంపై జరిపిన దాడిలో 14 మంది మృతిచెందినట్లు సమాచారం. ఇందులో 10 మంది మసూద్ కుటుంబసభ్యులే ఉన్నారు. మసూద్ అజార్ సోదరి - ఆమె భర్త, మసూద్ మేనల్లుడు - అతడి భార్య, మేనకోడలు, ఐదుగురు చిన్నారులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈమేరకు జైషే వర్గాలను ఉటంకిస్తూ కథనాలు పేర్కొన్నాయి. వీరితో పాటు అజార్ అత్యంత సన్నిహితులు కూడా నలుగురు మరణించినట్లు సమాచారం. అయితే, దీనిపై అధికారిక ప్రకటన లేదు.Shehbaz Sharif says Pakistan will Retaliate & Avenge the blood🤣~ He is stammering. Unable to read the script given by Pakistan Army. Multiple CUTS just in 30 seconds. This is not Shehbaz. This is Asif Munir. This is Pakistan Army. P*gets have gone mad. pic.twitter.com/WbwQz83KPw— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) May 7, 2025మరోవైపు, ఉగ్రస్థావరాలపై భారత సైనిక చర్య నేపథ్యంలో పాకిస్థాన్ అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించింది. అన్ని ఆసుపత్రుల సిబ్బంది అత్యవసర విధుల్లో ఉండాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా 48 గంటలపాటు గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, బుధవారం సాయంత్రానికి ప్రధాన మార్గాల్లో విమాన రాకపోకలను పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించింది. ఇస్లామాబాద్, పంజాబ్‌లలో విద్యాసంస్థలు మూసివేసింది. దేశవ్యాప్తంగా భద్రతా బలగాలను సిద్ధంగా ఉంచింది.

ఎఫ్‌డీఏ వ్యాక్సిన్స్ విభాగం హెడ్‌గా ఇండియన్ అమెరికన్
వాషింగ్టన్: అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) వ్యాక్సిన్ విభాగం సెంటర్ ఫర్ బయోలాజిక్స్ ఎవాల్యుయేషన్ అండ్ రీసెర్చ్ (సీబీఈఆర్) డైరెక్టర్‌గా భారత సంతతికి చెందిన హెమటాలజిస్ట్–ఆంకాలజిస్ట్ వినయ్ ప్రసాద్ నియమితులయ్యారు. ఎఫ్‌డీఏ కమిషనర్ మార్టి మకారీ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రసాద్‌కు మెడిసిన్‌లో సుదీర్ఘమైన, విశిష్టమైన చరిత్ర ఉందని, ఆయన ఆంకాలజీలో విస్తృతమైన పరిశోధనలు చేశారని మకారీ పేర్కొన్నారు. సీబీఈఆర్.. ఎఫ్‌డీఏ కింద ఉన్న టీకాలు, ఔషధాలను పర్యవేక్షిస్తుంది. ప్రసాద్ గతంలో ఎఫ్‌డీఏను, కోవిడ్–19 వాక్సిన్స్, మాస్క్ ఆదేశాలను తీవ్రంగా విమర్శించడం గమనార్హం. కోవిడ్ సమయంలో ప్రసాద్ తన బ్లాగులో, సోషల్ మీడియా వేదికలపై సీబీఈఆర్ అప్పటి డైరెక్టర్ మార్క్స్ నాయకత్వాన్ని తీవ్రంగా ఖండించారు. పాఠశాల మూసివేతలు, మాస్క్ విధానాలు, కోవిడ్ –19 బూస్టర్ షాట్‌ను వ్యతిరేకించారు. అందుకు ప్రస్తుత ఎఫ్‌డీఏ కమిషనర్ డాక్టర్ మార్టి మకారీ నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రసాద్ నియమాకంపై సీబీఈఆర్ మాజీ డైరెక్టర్ పీటర్ మార్క్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, సీబీఈఆర్ డైరెక్టర్‌గా ప్రసాద్ నియామకం తరువాత వ్యాక్సిన్ తయారీ సంస్థ మోడెర్నా (నాస్డాక్: ఎంఆర్ఎన్ఏ) షేర్లు సుమారు 10 శాతం క్షీణించాయి. ఫైజర్ షేర్లు 3 శాతం తగ్గాయి. సరెప్టా థెరప్యూటిక్స్, టేషా జీన్ థెరపీస్ వంటి చిన్న జన్యు చికిత్స సంస్థలు తీవ్రమైన నష్టాలను చవిచూశాయి. సుమారు 20% పడిపోయాయి. చికాగో విశ్వవిద్యాలయం నుంచి వైద్య పట్టా పొందిన ప్రసాద్.. నేషనల్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌లో సేవలందించారు. శాన్ఫ్రాన్సిస్కోలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఎపిడెమియాలజీ ప్రొఫెసర్‌గా పనిచేశారు.
జాతీయం

ఉగ్రవాదులకు అధికారిక అంత్యక్రియలా?
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ దాడిలో హతమైన ఉగ్రవాదులకు పాకిస్తాన్ సైన్యం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించటంపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇలాంటి పనులు ఆ దేశానికి అలవాటుగా మారాయని మండిపడింది. ఆపరేషన్ సిందూర్‌పై గురువారం ఢిల్లీలో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ.. పాక్‌లో లష్కరే తోయిబా ఉగ్రవాది నాయకత్వంలో ఆ దేశ సైన్యం, పోలీసులు ఉగ్రవాదుల మృతదేహాలకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్న ఫొటోలను ప్రదర్శించారు. ఇలాంటి చర్యలతో పాకిస్తాన్ ఏం సందేశం ఇవ్వాలనుకుంటోందని ప్రశ్నించారు. భారత్ దాడుల్లో సాధారణ పౌరులు మరణించారన్న పాకిస్తాన్ ప్రకటనను ఖండించారు. ‘దాడుల్లో నిజంగా సామాన్య పౌరులే మరణిస్తే.. మరి ఈ ఫొటోలో ఉన్నదేమిటి? సామాన్యుల మృతదేహాలను శవపేటికల్లో పెట్టి.. వాటిపై పాకిస్తాన్ జాతీయ జెండాలు కప్పి, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారా?’అని ఆశ్చర్యం వ్యక్తంచేశారు. తమ దాడుల్లో చనిపోయినవాళ్లంతా ఉగ్రవాదులేనని స్పష్టంచేశారు. ‘ఉగ్రవాదంతో మలినమైన చేతులను కడుక్కొనేందుకు పాకిస్తాన్ ప్రయతి్నస్తోంది. పాకిస్తాన్లో ఉగ్రవాదులే లేరని ఆ దేశ సమాచార శాఖ మంత్రి ఓ టీవీ చర్చలో ప్రకటించారు. కానీ, ఆ చర్చలోనే ఆయన తన ప్రకటనకు గట్టి సవాలు ఎదుర్కొన్నారు. ఉగ్రవాదానికి పాకిస్తానే కేంద్ర స్థానమని అనేక సందర్భాల్లో నిరూపణ అయ్యింది. ఇందుకు సంబంధించిన ఆధారాలు భారత్‌తోపాటు అనేక దేశాల వద్ద ఉన్నాయి’అని మిస్రీ పేర్కొన్నారు. పుట్టినప్పటి నుంచీ అబద్ధాలే ∙ పాకిస్తాన్‌పై విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ ధ్వజం న్యూఢిల్లీ: పాకిస్తాన్లో ఉగ్రవాదుల శిబిరా లు, వారి మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయాలన్న ఏకైక లక్ష్యంతోనే ఆపరేషన్ సిందూర్ చేపట్టినట్లు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ తేల్చిచెప్పారు. భారత్‌కు వ్యతిరేకంగా ముష్కర మూకలకు పాకిస్తాన్ నిస్సిగ్గుగా మద్దతిస్తోందని, ఈ విషయం ప్రపంచం మొత్తానికి తెలుసని చెప్పారు. పాకిస్తాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లో టెర్రరిస్టు క్యాంపులపై జరిగిన దాడికి మతం రంగు పులుముతోందని పాక్ ప్రభుత్వంపై మండిపడ్డారు. పుట్టినప్పటి నుంచి పాకిస్తాన్ అబద్ధాలే చెబుతోందని విమర్శించారు. 1947 నుంచి పాకిస్తాన్ అబద్ధాలు వినడం అందరికీ అలవాటైపోయిందని అన్నారు. విక్రం మిస్రీ గురువారం ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడా రు. పాకిస్తాన్ తీరుపై విరుచుకుపడ్డారు. ‘‘1947లో పాకిస్తాన్ సైన్యం జమ్మూకశ్మీర్‌పై దాడికి దిగింది. కానీ, ఆ దాడితో సంబంధం లేదంటూ ఐక్యరాజ్యసమితికి అబద్ధాలు చె ప్పింది. కేవలం గిజరినులే జమ్మూకశ్మీర్‌లోకి చొరబడ్డారని నమ్మబలికింది. భారత సైన్యం, ఐరాస బృందం అక్కడికి చేరుకుంటే అసలు సంగతి తెలిసింది. చివరకు చేసేది లేక తమ సైన్యమే జమ్మూకశ్మీర్‌పై దాడి చేసినట్లు పాకిస్తాన్ అంగీకరించింది. పాకిస్తాన్ అబద్ధాల ప్రయాణం 75 ఏళ్ల క్రితమే మొదలైంది కాబట్టి ఇది మాకు ఆశ్చర్యం కలిగించడం లేదు. పహల్గాంపై పాక్ అలాంటి అబద్ధాలే చెబుతోంది. తప్పుడు ప్రచారంతో నమ్మించాలని చూస్తోంది. ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న భారత యుద్ధ విమానాలను కూల్చేశామంటూ అబద్ధాలు ప్రచారం చేస్తోంది. పుట్టుక నుంచే అబద్ధాలు మొదలు పెట్టిన పాకిస్తాన్‌ను నమ్మాల్సిన అవసరం లేదు. మసీదులపై భారత్ సైన్యం దాడి చేయలేదు భారత్‌కు చెందిన 15 సైనిక స్థావరాలపై దాడిచేసేందుకు పాక్ ప్రయతి్నంచగా భారత సైన్యం సమర్థంగా అడ్డుకుంది. భారత్‌ను ఎదుర్కొనే సత్తా లేని పాకిస్తాన్ మత ఉద్రిక్తతలు సృష్టించడానికి కుట్రలు పన్నుతోంది. ప్రజలను రెచ్చగొట్టడానికి మతంకార్డు వాడుతోంది. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌లో సిక్కు మతస్తులే లక్ష్యంగా పాక్ సైన్యం దాడులు చేసింది. గురుద్వారాతోపాటు సిక్కు ఇళ్లపై దాడికి దిగింది. ఈ దాడుల్లో 16 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. మసీదులపై భారత సైన్యం దాడి చేసిందంటూ పాక్ చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. ఉగ్రవాదుల క్యాంపులే ఇండియన్ ఆర్మీ లక్ష్యం. నిజానికి ఉగ్రవాదులకు మసీదుల్లో ఆశ్రయం కలి్పంచింది పాకిస్తానే. మసీదులను రక్షణగా వాడుకోవడం నిజం కాదా? ఆపరేషన్ సిందూర్‌లో మరణించిన ఉగ్రవాదులకు పాక్ ప్రభుత్వం అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించడం దారుణం. పహల్గాంలో పర్యాటకుల మతం అడిగి మరీ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భారత్‌లో పాక్ ఆటలు సాగవు. ఇక్కడ మతం పేరిట రెచ్చగొట్టాలని చూస్తే ఎవరూ రెచ్చిపోరు. పహల్గాంలో ఉగ్రదాడిని మతాలకు అతీతంగా భారతీయులంతా ఖండించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని నీలం–జీలం ప్రాజెక్టును ఇండియా టార్గెట్ చేసిందంటూ పాకిస్తాన్ చేసిన ఆరోపణలను ఖండిస్తున్నాం. ఈ సాకుతో ఇండియాలోని మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తే జరగబోయే పరిణామాలకు పాకిస్తానే బాధ్యత వహించాలి’’అని విక్రం మిస్రీ స్పష్టంచేశారు.

మా సహనాన్ని పరీక్షించొద్దు
న్యూఢిల్లీ: భారత్ సహనాన్ని పరీక్షించవద్దని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్తాన్‌ను తీవ్రంగా హెచ్చరించారు. రెచ్చగొడితే తగు రీతిలో సమాధానం ఇచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. ఆపరేషన్ సిందూర్‌కు బదులుగా భారత్‌లోని 15 సైనిక లక్ష్యాలపై పాక్ దాడికి యత్నించడం బదులుగా గురువారం పాక్ వ్యాప్తంగా ఉన్న మిలటరీ రాడార్లతోపాటు లాహోర్‌లోని రాడార్ వ్యవస్థను భారత వైమానిక దళం ధ్వంసం చేసిన నేపథ్యంలో రాజ్‌నాథ్ పైవిధంగా స్పందించారు. నేషనల్ క్వాలిటీ కాంక్లేవ్‌లో ఆయన మాట్లాడుతూ..‘మనం ఎల్లప్పుడూ బాధ్యతాయుతంగా, ఎంతో సంయమనంతో వ్యవహరిస్తూ వచ్చాం. చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలనే నమ్ముతున్నాం. దీనిని అలుసుగా తీసుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం దీటుగా బదులిస్తాం’అని ఆయన స్పష్టం చేశారు. పాక్‌తోపాటు పీవోకేలోని ఉగ్ర స్థావరాలను నామరూపాలు లేకుండా చేసిన వీర సైనికులను ఆయన అభినందించారు. దాడుల సమయంలో సామాన్యులకు హాని వాటిల్లకుండా అనితర సాధ్యమైన కచ్చితత్వంతో దాడులు జరిపామన్నారు. దేశ సార్వ¿ౌమత్వాన్ని పరిరక్షించుకునే విషయంలో ఏ శక్తీ ఆపజాలదన్నారు. పాక్, పీవోకేల్లోని ఉగ్ర స్థావరాలపై జరిగిన దాడుల్లో పెద్ద సంఖ్యలో ముష్కరులు హతమయ్యారని వెల్లడించారు.

నిరంతరం అప్రమత్తంగా ఉండండి: ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్, తదనంతర పరిస్థితుల నేపథ్యంలో నిత్యం అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల మధ్య స్పష్టమైన సమాచార వ్యవస్థ, సంసిద్ధత అత్యంత కీలకమని స్పష్టం చేశారు. జాతీయ భద్రత పట్ల ప్రభుత్వం పూర్తి అంకితభావంతో ఉందని పునరుద్ఘాటించారు. గురువారం వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల కార్యదర్శులతో ప్రధానమంత్రి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. కేబినెట్ కార్యదర్శి, ప్రధానమంత్రి కార్యాలయ సీనియర్ అధికారులు, రక్షణ, హోం, విదేశాంగ వ్యవహారాలు, సమాచార, విద్యుత్, ఆరోగ్యం, టెలికమ్యూనికేషన్స్ వంటి కీలక మంత్రిత్వ శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు. జాతీయ భద్రత, మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం వంటి అంశాలను ప్రధాని మోదీ సమీక్షించారు. పాకిస్తాన్‌తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వ శాఖల సన్నాహాలు, ప్రణాళికలను ఆరా తీశారు. కార్యదర్శులు తమ మంత్రిత్వ శాఖల కార్యకలాపాలను సమగ్రంగా సమీక్షించాలని పేర్కొన్నారు. అత్యవసర ప్రతిస్పందన, కమ్యూనికేషన్ ప్రొటోకాల్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆదేశించారు. పౌర రక్షణ యంత్రాంగాన్ని బలోపేతం చేయడంతోపాటు తప్పుడు సమాచారం, నకిలీ వార్తల వ్యాప్తిని సమర్థంగా నియంత్రించేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. రాష్ట్రాల అధికారులతో పాటు క్షేత్రస్ధాయి సంస్థలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని ప్రధానమంత్రి స్పష్టంచేశారు. ఎలాంటి విపత్కర పరిణామాలు ఎదురైనా తగిన రీతిలో ప్రతిస్పందించేందుకు సిద్ధంగా ఉన్నామని పలువురు కార్యదర్శులు చెప్పారు.

Rajnath Singh: ‘ఆపరేషన్ సిందూర్’ ఆగలేదు
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌లో కనీసం 100 మంది కరడుగట్టిన పాకిస్తాన్ ఉగ్రవాదులు, వారి మద్దతుదారులు హతమయ్యారని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టంచేశారు. ఈ ఆపరేషన్ ఆగిపోలేదని, ఇంకా కొనసాగుతూనే ఉందని వెల్లడించారు. భారత్ ఘర్షణలు కోరుకోవడం లేదని, పాకిస్తాన్ దాడి చేస్తే మాత్రం గట్టిగా బుద్ధిచెప్పడం ఖాయమని అన్నారు. రెచ్చగొడితే ఎదురుదాడి చేయక తప్పదని తేల్చిచెప్పారు. రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన గురువారం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది. కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, ఎస్.జైశంకర్, బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డా, కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సహా వివిధ పార్టీల నాయకులు హాజరయ్యారు. పాకిస్తాన్‌పై భారత్ చేపట్టిన సైనిక చర్యకు పారీ్టలకు అతీతంగా వారంతా మద్దతు పలికారు. ఇది రాజకీయాలకు సమయం కాదని, మనమంతా ఐక్యంగా ఉండాలని నిర్ణయానికొచ్చారు. భారత సైనిక దళాల పరాక్రమాన్ని ప్రశంసించారు. అన్ని పారీ్టల నాయకులు ఏకగ్రీవంగా అభినందనలు తెలియజేశారు. పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉంటామని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ గురించి రాజ్‌నాథ్ సింగ్ వివరించారు. విపక్ష నేతలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ ఆపరేషన్ ద్వారా ఇప్పటిదాకా అనుకున్న లక్ష్యాలు సాధించినట్లు తెలిపారు. ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది కాబట్టి పూర్తి వివరాలు వెల్లడించడం సాధ్యం కాదని అన్నారు. సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజల భద్రత కోసం చేపట్టిన చర్యలను అఖిలపక్ష భేటీలో రాజ్‌నాథ్ వెల్లడించారు. టీఆర్ఎఫ్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి జాతీయ భద్రత విషయంలో ప్రభుత్వానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, బీజేడీ, జేడీ(యూ), ఎంఐఎం, సీపీఎం తదితర నేతలు ప్రకటించారు. లష్కరే తోయిబా ముసుగు సంస్థ ద రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) అరాచకాలను అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లాలని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవెసీ సూచించారు. టీఆర్ఎఫ్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి విజ్ఞప్తి చేశారు. పహల్గాం ఉగ్రదాడిలో మృతిచెందిన వినయ్ నర్వాల్ భార్య హిమాన్షి నర్వాల్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుండడం పట్ల ఒవైసీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో మత సామరస్యం కోసం అందరూ కలసికట్టుగా కృషి చేయాలని విపక్ష నేతలు పిలుపునిచ్చారు. భారత వైమానికి దళానికి చెందిన ఐదు యుద్ధ విమానాలు కూల్చివేసినట్లు పాకిస్తాన్ చెబుతోందని, ఈ తప్పుడు ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలని పలువురు నాయకులు కేంద్రాన్ని కోరారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని, దేశమంతా ఐక్యంగా ఉందన్న సందేశాన్ని ప్రపంచానికి అందించాలని సూచించారు. అఖిలపక్ష సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కాకపోవడం పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అసంతృప్తి వ్యక్తంచేశారు.
ఎన్ఆర్ఐ

వైట్‌హౌస్‌లో కోనసీమ వాసికి కీలక బాధ్యత
ఐ.పోలవరం: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ కేంద్రంగా పనిచేసే సైబర్ సెక్యూరిటీ, మౌలిక సదుపాయాల భద్రతా సంస్థకు డిప్యూటీ డైరెక్టర్ (డీడీ)గా తెలుగు వ్యక్తి డాక్టర్ గొట్టుముక్కల మధు (Gottumukkala Madhu) నియమితులయ్యారు. మధు తల్లిదండ్రులు గొట్టుముక్కల వెంకట సూర్య సత్యనారాయణరాజు (కొండరాజు), సత్యవాణి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం కేశనకుర్రు (Kesanakurru) గ్రామానికి చెందినవారు. మధు కాకినాడలో ఇంటర్ చదువుకొని ఏలూరులో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అమెరికాలోని టెక్సాస్‌లో ఎంఎస్, ఎంబీఏ చేశారు. మోటోరోలా, శాంసంగ్ కంపెనీల్లో పనిచేశారు. ప్రస్తుతం అమెరికన్ సైబర్ సెక్యూరిటీ విభాగం (CISA)లో డిప్యూటీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.చదవండి: అమరావతి ఐకానిక్.. అమాంతం పెరిగిన ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయం

సలహా కమిటీ అడుగులు ముందుకు..
మోర్తాడ్ (బాల్కొండ): తెలంగాణ ప్రవాసీ విధానం (ఎన్ఆర్ఐ పాలసీ) రూపకల్పన, గల్ఫ్ బోర్డు ఏర్పాటు కోసం నిర్దేశించిన గల్ఫ్ సలహా కమిటీ అడుగులు ముందుకు పడ్డాయి. సలహా కమిటీ బాధ్యతలను స్వీకరించిన వారం రోజులలోనే యూఏఈలో ఒక దుర్ఘటన చోటు చేసుకోవడం, ఈ అంశంలో కమిటీ సభ్యులు వేగంగా స్పందించి మృతదేహాలను స్వదేశానికి తెప్పించడంతో బాధిత కుటుంబాలకు ఊరట లభించింది.యూఏఈలోని ఆల్‌కూజ్ ప్రాంతంలోని బేకరీలో పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి చేతిలో నిర్మల్ జిల్లా సోన్‌కు చెందిన ప్రేమ్‌సాగర్, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమన్నపేట్‌కు చెందిన స్వర్గం శ్రీనివాస్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈనెల 11న వీరు హత్యకు గురి కాగా వారం రోజుల వ్యవధిలోనే మృతదేహాలను స్వదేశానికి తెప్పించారు. ఇందులో సలహా కమిటీ కీలకపాత్ర పోషించింది. గల్ఫ్ సలహా కమిటీ చైర్మన్ వినోద్‌కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, ఇతర సభ్యులు ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారులతో యూఏఈ ఘటనపై చర్చించారు. సీఎంవో నుంచి కేంద్ర ప్రభుత్వానికి, విదేశాంగ శాఖకు సమాచారం అందించడంతో వారం రోజులలోనే మృతదేహాలను స్వదేశానికి తీసుకురాగలిగారు. గతంలో గల్ఫ్‌లో ఎవరైనా మరణిస్తే మృతదేహం ఇంటికి రావడానికి నెల రోజుల వరకు సమయం పట్టేది. బాధిత కుటుంబాలకు భరోసా యూఏఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. సలహా కమిటీ విజ్ఞప్తి మేరకు బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. హత్యకు గురైన వ్యక్తుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ విధానంలో ఏదైనా ప్రభుత్వ శాఖలో ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. గల్ఫ్ భరోసా కింద రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.అంత్యక్రియలకు ప్రభుత్వ సాయం స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు జగిత్యాల జిల్లా కలెక్టర్ రూ.15 వేల ఆర్థికసాయం మంజూరుచేశారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా మరణిస్తే వారి అంతిమ సంస్కారాలకు మాత్రమే ప్రభుత్వ సాయం అందుతుంది. గల్ఫ్‌లో హత్యకు గురైన ఘటనను మానవతా దృక్పథంతో పరిగణనలోకి తీసుకున్న జగిత్యాల జిల్లా (Jagtial District) కలెక్టర్ సత్యప్రసాద్ తన విచక్షణాధికారాలను ఉపయోగించుకుని స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించారు.చదవండి: స్మిత సబర్వాల్ ధిక్కార స్వరం!శనివారం జరిగిన శ్రీనివాస్ అంతిమ యాత్రలో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పాల్గొని పాడె మోశారు. ఆయన కూడా సొంతంగా రూ.10 వేల సాయం అందించారు. ఇద్దరు మృతుల ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రకటించారు. సలహా కమిటీ ఏర్పడిన వెంటనే గల్ఫ్ ప్రవాసులకు ప్రయోజనం కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంపై గల్ఫ్ కార్మిక కుటుంబాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాయి.

టంపాలో నాట్స్ సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లు
ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అమెరికాలో అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల నిర్వహణ కోసం కసరత్తు ముమ్మరంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లను టంపాలో నాట్స్ నిర్వహించింది. మొత్తం 12 వాలీబాల్ జట్లు, 5 మహిళా త్రోబాల్ జట్లు, 350 మందికిప గా తెలుగు క్రీడాకారులు ఈ టోర్నమెంట్లతో తమ ప్రతిభను చాటేందుకు పోటీ పడ్డారు. క్రీడాకారులను ప్రోత్సాహించేందుకు వారి కుటుంబ సభ్యులు కూడా రావడంతో క్రీడా ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. మహిళల త్రోబాల్ టోర్నమెంట్లో మొదటి బహుమతిని సన్‌షైనర్స్ జట్టు కైవసం చేసుకుంది. పురుషుల వాలీబాల్ టోర్నమెంట్ ఛాంపియన్లుగా డైనమిక్ రచ్చ జట్టుగా నిలిచింది. టోర్నమెంట్ విజేతలకు బహుమతులు జూలై 4 నుండి 6 వరకు జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో బహుమతులు పంపిణి చేయనున్నారు. నాట్స్ కమ్యూనిటీ సేవల బృందం నుండి రంజిత్ పాలెంపాటి అవిశ్రాంత కృషి ఈ టోర్నమెంట్లు దిగ్విజయంగా జరగడంలో కీలక పాత్ర పోషించింది.నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కోసం జరుగుతున్న ఏర్పాట్లను నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది తెలిపారు. క్రీడాకారులు టోర్నమెంట్లో చూపిన క్రీడాస్ఫూర్తిని మల్లాది ప్రశంసించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, మాధవి యార్లగడ్డ, అపర్ణ కొడాలి, కార్తీక్ తుమ్మటి, శ్రీకాంత్ పాత్ర, శ్యామల, విజయ్ చిన్నం తదితరులు ఈ టోర్నమెంట్ల నిర్వహణకు తమ మద్దతును, సహకారాన్ని అందించారు. జూలైలో జరిగే అమెరికా తెలుగు సంబరాలకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చేలా ఇదే క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించేందుకు వివిధ రకాల క్రీడా పోటీలను నాట్స్ టంపాలో నిర్వహించనుంది. నాట్స్ సంబరాల కమిటి, నాట్స్ క్రీడా కమిటీలు ఈ పోటీల నిర్వహణకు తగిన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగనుంది. నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి లు విజేతలకు శుభాకాంక్షలు తెలియచేసారు. అందరూ టంపా తెలుగు సంబరాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

NATS శాండియాగో లో నాట్స్ చాప్టర్ ప్రారంభం
శాండియాగో : ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన విభాగాలను ప్రారంభిస్తూ తెలుగు వారికి మరింత చేరువ అవుతోంది. ఈ క్రమంలోనే శాండియాగోలో నాట్స్ విభాగాన్ని ప్రారంభించింది. నాట్స్ శాండియాగో చాప్టర్ సమన్వయకర్తగా ప్రశాంతి ఊడిమూడి, మహిళా సాధికార సలహా మండలి సమన్వయకర్తగా హైమ గొల్లమూడికి బాధ్యతలు అప్పగించారు. శాండియాగో నాట్స్ సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్తగా కామ్య శిష్ట్లా, సోషల్ మీడియా సమన్వయ కర్త గా తేజస్వి కలశిపూడి, సేవా కార్యక్రమాల సమన్వయకర్త గా రామచంద్ర రాజు ఊడిమూడి, క్రీడా స్ఫూర్తి సమన్వయ కర్తగా సత్య హరిరామ్, ఆది మోపిదేవి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. శ్రీరామనవమి నాడు శాండియాగో లో నాట్స్ విభాగం ప్రారంభం కావడం ఆనందంగా ఉందని శాండియాగో నాట్స్ సమన్వయకర్త ప్రశాంతి ఊడిమూడి అన్నారు. శాండియాగో లో నాట్స్ తెలుగు వారికి శ్రీరామరక్షలా మారేలా తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. చాప్టర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. తనుష్ భగవత్ ,వీణ-ఋత్వ ఊడిమూడి గానామృతం, వయోలిన్‌తో ధ్రువ గౌరిశెట్టి ,పియానోతో విహాన్ మండపాక అందరిని అలరించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి,నాట్స్ సెక్రటరీ మధు బోడపాటి, జోనల్ వైస్ ప్రెసిడెంట్ మనోహర్ మద్దినేని పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా లాస్ ఏంజెలెస్ చాప్టర్ నుండి నాట్స్ ప్రోగ్రామ్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిలుకూరి,జాతీయ మహిళా సాధికారత సమన్వయ కర్త రాజ్యలక్ష్మి చిలుకూరి,లాస్ ఏంజెలెస్ చాప్టర్ సమన్వయ కర్త మురళి ముద్దన, హెల్ప్ లైన్ సమన్వయ కర్త శంకర్ సింగం శెట్టి పాల్గొన్నారు. నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి ఆధ్వర్యంలో నూతన చాప్టర్ సభ్యులను మనోహర్ మద్దినేని సభకు పరిచయం చేశారు. నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, ప్రెసిడెంట్ (ఎలెక్ట్) శ్రీహరి మందాడి తమ అభినందనలు సందేశం ద్వారా పంపారు. భవిష్యత్తులో శాండియాగో నాట్స్ విభాగం చేపట్టే ప్రతి కార్యక్రమానికి జాతీయ నాయకత్వం మద్దతు ఉంటుందని నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి భరోసా ఇచ్చారు. అమెరికాలో తెలుగు సమాజ అభివృద్ధి దిశగా నాట్స్ జాతీయ వ్యాప్తంగా ఎంతో కృషి చేస్తుందన్నారు. అమెరికాతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న సేవ కార్యక్రమాల గురించి మదన్ పాములపాటి వివరించారు. శాండియాగో చాప్టర్ ఏర్పాటులో నాట్స్ జాతీయ మీడియా కో ఆర్డినేటర్ కిషోర్ నారే కీలక పాత్ర పోషించడం అభినందనీయమని అన్నారు. శాండియాగోలో ఇక నుంచి తెలుగువారికి నాట్స్ అండగా ఉందనే భరోసాను కల్పించే దిశగా శాండియాగో నాట్స్ సభ్యులు కృషి చేయాలని కోరారు.
క్రైమ్

ఐదేళ్లుగా వివాహేతర సంబంధం.. చివరికి..!
మహబూబ్‌నగర్ క్రైం: వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళతో డబ్బుల విషయంలో ఏర్పడిన గొడవలో ఓ వ్యక్తి సదరు మహిళను గొంతు నులిమి హత్య చేశాడు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ హత్య తాజాగా వెలుగులోకి వచ్చింది. రూరల్ ఎస్ఐ విజయ్‌కుమార్ కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని దొడ్డలోనిపల్లికి చెందిన శాంతమ్మ (35) ఒంటరిగా జీవనం సాగించేది. ఈ క్రమంలో ఆమెకు నవాబ్‌పేట మండలం తీగలపల్లికి చెందిన కృష్ణయ్యతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఐదేళ్లుగా ఇద్దరు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. అయితే డబ్బుల వ్యవహారంలో గత కొన్ని రోజులుగా ఇద్దరు గొడవ పడేవారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం కూడా గొడవ జరగగా కృష్ణయ్య, శాంతమ్మను గొంతు నులిమి హత్య చేసి పారిపోయాడు. ఇంట్లో మంచంపై పడి ఉన్న శాంతమ్మ మృతదేహన్ని స్థానికులు బుధవారం గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని ఏఎస్పీ రాములు, డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ గాం«దీనాయక్ పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.

అంతుచూసిన అనుమానం..!
శ్రీకాకుళం: కోటబొమ్మాళిలో బ్యూటీపార్లర్, లేడీస్ కార్నర్ షాపు నిర్వహిస్తున్న మహిళ తన భర్త చేతిలో దారుణ హత్యకు గురైన సంఘటన బుధవారం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. సంతబొమ్మాళి మండలం నర్సాపురం గ్రామానికి చెందిన నర్సిపురం లక్ష్మి (30) తన భర్త తిరుపతిరావుతో కలిసి కోటబొమ్మాళి విద్యుత్‌నగర్‌లో నివాసముంటోంది. లక్ష్మి స్థానికంగా హర్షిణి పేరుతో బ్యూటీ పార్లర్, లేడీస్ కార్నర్ నిర్వహిస్తోంది. తిరుపతిరావు కేబుల్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. భార్యపై అనుమానంతో ఇద్దరికీ తరచూ గొడవలు జరుగుతుండేవి. గతంలో పలుమార్లు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన దాఖలాలు ఉన్నాయి. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో భార్య లక్ష్మిని భర్త తిరుపతిరావు దారుణంగా గొంతు కోశాడు. దీంతో లక్ష్మి తీవ్ర రక్తస్రావంతో విగత జీవిగా పడిపోయింది. అనంతరం తిరుపతిరావు మద్యం షాపునకు వెళ్లిపోయాడు. సమాచారం తెలుసుకున్న కోటబొమ్మాళి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రక్తపు మడుగులో ఉన్న లక్ష్మిని పరిశీలించగా అప్పటికే మృతి చెందింది. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు మద్యం షాపు వద్ద ఉన్న తిరుపతిరావును అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. భార్యపై అనుమానంతోనే ఈ హత్య చేసినట్లు స్థానికులు భావిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి క్లూస్ టీం చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతురాలికి భర్తతో పాటు కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఇన్చార్జి సీఐ విజయకుమార్, ఎస్ఐ సత్యనారాయణ, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలంలో దర్యాప్తు నిర్వహించి కేసు నమోదు చేశారు.

ఏసీకి షార్ట్ సర్క్యూట్..కొరియోగ్రాఫర్ మృతి
మణికొండ(హైదరాబాద్): గాఢ నిద్రలో ఉన్న ఓ కొరియోగ్రాఫర్ గదిలోని ఏసీకి షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చెలరేగి, దట్టమైన పొగ పీల్చటంతో మృతి చెందిన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్, పుప్పాలగూడ శ్రీరాంనగర్ కాలనీలో బుధవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది.ఎస్ మునీందర్ తెలిపిన వివరాల ప్రకారం..వరంగల్ జిల్లాకు చెందిన పోరేటి వీరేందర్‌రెడ్డి (38) కొన్ని సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. శ్రీరాంనగర్ కాలనీలోని కుతుబ్ ఆర్కేడ్ అపార్ట్మెంట్లోని 301 ప్లాట్‌లో నివాసం ఉంటున్నారు. రోజు మాదిరిగానే మంగళవారం రాత్రి తన గదిలో వీరేందర్‌రెడ్డి నిద్రకు ఉపక్రమించాడు. అర్ధరాత్రి దాటాక 2.30 గంటల సమయంలో అతని గదిలోని ఏసీకి షార్ట్ సర్క్యూట్ కావటంతో మంటలు చెలరేగాయి. దుస్తులు, ఫర్నిచర్ కాలిపోయి పొగలు వ్యాపించాయి.గమనించిన చుట్టు పక్కల వారు డయల్ 100 ద్వారా పోలీసు, అగ్నిమాపక శాఖ వారికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మంటలార్పి గదిలోకి వెళ్లగా వీరేందర్‌రెడ్డి అపస్మారక స్థితిలో కనిపించాడు. సీపీఆర్ చేసినా అప్పటికే దట్టమైన పొగను పీల్చటంతో మృతి చెందినట్టు 108 సిబ్బంది ధ్రువీకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించామని, షార్ట్ సర్క్యూట్ కారణాలను తెలపాలని విద్యుత్ శాఖకు లేఖ రాశామని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.

బావ మా అక్క మరో పెళ్లి చేసుకుంటుంది..!
బంజారాహిల్స్(హైదరాబాద్): భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం కారణంగా..భర్తకు దూరంగా ఉంటున్న భార్య మరొకరిని పెళ్లి చేసుకోవడాన్ని ప్రశ్నించగా..అతనిపై రోకలితో దాడికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నేపాల్ దేశం బరాండ్కు చెందిన కృష్ణదమత్ బతుకుదెరువు కోసం నగరానికి వలసవచ్చాడు. 2013లో సునీత అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో హౌస్‌కీపింగ్‌గా విధులు నిర్వర్తిస్తూ కుటుంబంతో కలిసి అక్కడే ఉంటున్నాడు. 2024 అక్టోబర్‌లో కుటుంబాన్ని తన గ్రామానికి పంపించేందుకు స్నేహితుడి నుంచి రూ.1.5 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఇదే విషయమై సునీతకు, కృష్ణకు గొడవలు జరిగాయి. ఇదే క్రమంలో జనవరి 3న మద్యం మత్తులో ఇంటికి వచ్చిన కృష్ణకు భార్యతో మరోసారి గొడవ జరిగింది. దీంతో సునీతను ఇంటి నుంచి పంపించివేశాడు. అప్పటి నుంచి భార్యతో ఎలాంటి సంప్రదింపులు చేయలేదు. ఇదిలా ఉండగా మంగళవారం సునీత సోదరుడు దీపక్..కృష్ణదమత్కు ఫోన్‌చేసి తన సోదరి అమర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందని చెప్పాడు. దీంతో కృష్ణదమత్ వెంటనే నందినగర్‌లోని సునీత ఉండే నివాసానికి వెళ్లి నిలదీశాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా సునీత అల్యుమినియం రోకలితో భర్తపై దాడికి పాల్పడింది. ఈ ఘటనలో కుడికంటి వద్ద తీవ్రంగా గాయమై రక్తస్రావం జరిగింది. ఆమెతో పాటు అమర్ కూడా కృష్ణదమత్పై దాడి చేయగా బాధితుడు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వీడియోలు


కరాచీ పోర్టుపైనే.. దాడి ఎందుకు చేశారంటే?


వాళ్ళ పేర్లు చెబితేనే నిన్ను విడిచిపెడతాం అంటూ... పాలేటి కృష్ణవేణి సంచలన నిజాలు


భారత్ దెబ్బ.. బంకర్ లో దాక్కున్న పాక్ ప్రధాని


అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ కామెంట్స్ వైరల్


మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన పోలీసుల పేర్లు రాసి పెట్టుకోండి!


S-400 మిస్సైల్ ఎలా పనిచేస్తుందో.. LIVEలో చూపించిన యాంకర్


ఆ 24గంటలు.. ఏం జరిగింది?


ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాలు అప్రమత్తం


పరారీలో పాక్ ప్రధాని?


తోక జాడించిన పాక్.. తాట తీసిన భారత్