Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Pope Francis Passed Away Vatican says in video statement1
Pope Francis: పోప్‌ ఫ్రాన్సిస్‌ కన్నుమూత

వాటికన్‌ సిటీ: క్రైస్తవ మతపెద్ద పోప్‌ ఫ్రాన్సిస్‌(88) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతి చెందినట్లు వాటికన్‌ సిటీ వర్గాలు ప్రకటించాయి. ఈస్టర్‌ సందర్భంగా నిన్న ఆయన పేరిట సందేశం వెలువడగా.. కొన్ని గంటలకే ఆయన మృతి చెందారని వీడియో సందేశం విడుదల చేయడం గమనార్హం.పోప్ ఫ్రాన్సిస్(Pope Francis) అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్‌లో 1936 డిసెంబర్ 17న ఈయన జన్మించారు. 2013లో నాటి పోప్‌ బెనెడిక్ట్‌-16 రాజీనామా చేయడంతో ఫ్రాన్సిస్‌ కేథలిక్‌ చర్చి అధిపతి అయ్యారు. ఆ ఏడాది మార్చి 13న 266వ పోప్‌గా ఎన్నికయ్యారు. అమెరికా ఖండం నుంచి ఎన్నికైక తొలి పోప్‌గా ఈయనకంటూ ఓ గుర్తింపు ఉంది. Pope Francis died on Easter Monday, April 21, 2025, at the age of 88 at his residence in the Vatican's Casa Santa Marta. pic.twitter.com/jUIkbplVi2— Vatican News (@VaticanNews) April 21, 2025పోప్‌ ఫ్రాన్సిస్‌ తరచూ సమకాలీన సామాజిక అంశాలపై వ్యాఖ్యలు చేస్తుండేవారు. వలసదారులు, శరణార్థుల పట్ల మానవత్వంతో మెలగాలని ప్రపంచ దేశాలకు పిలుపు ఇచ్చిన ఈయన.. అదాయ అసమానతలు, వాతావరణ మార్పులు, మరణ శిక్షలకు వ్యతిరేకంగా పోరాడారు కూడా. 2016లో రోమ్‌ బయట ఇతర మతానికి చెందిన శరణార్థుల పాదాలు కడగడం తీవ్ర చర్చనీయాంశమైంది. మొన్నటి అమెరికా అధ్యక్ష ఎన్నికల టైంలోనూ.. అటు ట్రంప్‌, ఇటు కమలా హారిస్‌ వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు కూడా. తాజాగా ఈస్టర్‌ సందర్భంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌(JD Vance) పోప్‌ను కలుసుకున్నారు కూడా. గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలు, డబుల్‌ న్యూమోనియా, కిడ్నీ సమస్యలతో తీవ్రంగా బాధపడ్డ పోప్‌ ఫ్రాన్సిస్‌.. కొన్నాళ్లపాటు ఆస్పత్రిలో చికిత్స కూడా పొందారు. వాటికన్‌ సిటీలోని కాసా శాంటా మార్టా (Casa Santa Marta) నివాసంలో సోమవారం కన్నుమూసినట్లు తెలుస్తోంది. పోప్‌ మృతి పట్ల పలు దేశాల అధినేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Supreme Court Reacts On BJP leaders Criticism2
ఇప్పటికే అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నాం

న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థపై ఉపరాష్ట్రపతి సహా పలువురు బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది. ప్రస్తుతం తాము కార్య నిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామనే ఆరోపణలు ఎదుర్కొంటున్నామంటూ సోమవారం వ్యాఖ్యానించింది.ముర్షిదాబాద్‌ అల్లర్ల కేసు నేపథ్యంతో.. పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన(Bengal President Rule) విధించాలని కోరుతూ విష్ణు శంకర్‌ జైన్‌ అనే న్యాయవాది సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ క్రమంలో జస్టిస్‌ గవాయ్‌ పిటిషన్‌ను పరిశీలిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘మేం ఇప్పటికే కార్య నిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాం. ఇలాంటి తరుణంలో.. బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని, సైన్యాన్ని మోహరింపజేయాలని మాండమస్‌ రిట్‌ ప్రకారం రాష్ట్రపతికి ఆదేశాలు ఇవ్వాలా?’’ అని పిటిషనర్‌ లాయర్‌ను ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో పిటిషనర్‌ కోరిన ఆదేశాలు జారీ చేయడానికి బెంచ్‌ నిరాకరించింది. ఇదిలా ఉంటే.. రాష్ట్రాలు రూపొందించే బిల్లుల విషయంలో గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరును సుప్రీం కోర్టు తప్పుబడుతూ సంచలన తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో గవర్నర్‌, రాష్ట్రపతికి సైతం కాలపరిమితి విధించింది. ఈ వ్యవహారంలో రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక అధికారాలు పని చేయబోవని.. ఒకవేళ ఆ కాలపరిమితిని ఉల్లంఘిస్తే కోర్టులను ఆశ్రయించొచ్చని రాష్ట్రాలకు సూచించింది. అదే సమయంలో వక్ఫ్‌ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లనూ విచారిస్తూ.. స్టే ఆదేశాలు జారీ చేసింది కూడా. అయితే ఈ రెండు పరిణామాలపై బీజేపీ నేతలు కొందరు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే సుప్రీం కోర్టుపై చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి. ఒకవేళ సుప్రీంకోర్టు చట్టాలు చేస్తే గనుక.. పార్లమెంట్‌ భవనాన్ని మూసివేయాలి’’ అని ఎంపీ వ్యాఖ్యానించారు. మరో బీజేపీ నేత దినేశ్‌ శర్మ సైతం సుప్రీం కోర్టుపై విమర్శలు గుప్పించారు. ఆఖరికి ఉపరాష్ట్రపతి జగదీప్‌ దన్‌ఖడ్‌ కూడా సుప్రీం కోర్టు తీర్పును తప్పుబట్టారు. ‘రాష్ట్రపతికి గడువు నిర్దేశించేలా న్యాయవ్యవస్థ వ్యవహరించడం తగదు. అది ప్రజాస్వామ్యశక్తులపై అణుక్షిపణిని ప్రయోగించడమే అవుతుంది. ఇప్పుడు.. శాసనాలు చేయగలిగే జడ్జీలు మనకు ఉన్నారు! కార్యనిర్వాహక విధులూ వారే నిర్వర్తించేస్తారు. సూపర్‌ పార్లమెంటులా వ్యవహరిస్తారు. వారికి మాత్రం ఎలాంటి జవాబుదారీతనం ఉండదు. ఎందుకంటే దేశ చట్టాలు వారికి వర్తించవు’’ అని అన్నారు. ఢిల్లీ హైకోర్టు జడ్జి నోట్ల కట్టల వ్యవహారంపై స్పందిస్తూ దన్‌ఖడ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.ఇక బీజేపీ నేతల వ్యాఖ్యలను వ్యతిగతం అని పేర్కొంటూ అధిష్టానం దూరంగా ఉంటున్నట్లు ప్రకటించింది. అయినప్పటికీ ప్రతిపక్షాలు ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాయి.ప్రస్తుతం సీజేఐగా ఉన్న సంజీవ్‌ ఖన్నా పదవీ కాలం త్వరలో ముగియనుంది. ఆ స్థానంలో బీఆర్‌ గవాయ్‌(BR Gavai) బాధ్యతలు స్వీకరించబోతున్నారు. కీలకమైన వక్ఫ్‌ పిటిషన్లపై ఈయనే విచారణ జరపబోతున్నారు. ఈ క్రమంలో.. ఆయన కార్య నిర్వాహక వ్యవస్థపై వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే.. వక్ఫ్‌ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఏప్రిల్‌ 8-12 తేదీల మధ్య షంషేర్‌గంజ్‌, సూటి, ధులియాన్‌, జంగిపూర్‌ ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. ముగ్గురు మరణించగా.. వందల మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వక్ఫ్‌ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన 73 పిటిషన్లనువిచారించే క్రమంలోనూ ఈ అల్లర్లను సీజేఐ సంజీవ్‌ ఖన్నా ధర్మాసనం ప్రస్తావించింది. మే 5వ తేదీన ఈ పిటిషన్లపై విచారణ జరగనుంది.

IPL 2025, MI VS CSK: ROHIT SHARMA Becomes The First Indian To Complete 20 POTM Awards In IPL History3
MI VS CSK: చరిత్ర సృష్టించిన రోహిత్‌ శర్మ

ఐపీఎల్‌ 2025లో ముంబై ఇండియన్స్‌ స్టార్‌ ఆటగాడు రోహిత్‌ శర్మ చరిత్ర సృష్టించాడు. నిన్న (ఏప్రిల్‌ 20) సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్న హిట్‌మ్యాన్‌.. ఐపీఎల్‌లో 20 ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు అందుకున్న తొలి భారత క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్‌, విరాట్‌ కోహ్లి తలో 19 ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలిచి భారత్‌ తరఫున అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలిచిన ఆటగాళ్లుగా ఉన్నారు.విరాట్‌ నిన్ననే పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలిచి రోహిత్‌ రికార్డును సమం చేశాడు. అయితే గంటల వ్యవధిలోనే రోహిత్‌ విరాట్‌ను వెనక్కు నెట్టి హోల్‌ అండ్‌ సోల్‌గా భారత్‌ తరఫున అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు (ఐపీఎల్‌) గెలుచుకున్న ఆటగాడిగా అవతరించాడు.ఓవరాల్‌గా ఐపీఎల్‌లో అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో రోహిత్‌ మూడో స్థానానికి ఎగబాకాడు. ఐపీఎల్‌లో అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలుచుకున్న రికార్డు ఏబీ డివిలియర్స్‌ పేరిట ఉంది. ఏబీడీ ఐపీఎల్‌లో 25 ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలుచుకున్నాడు. ఏబీడీ తర్వాత క్రిస్‌ గేల్‌ (22), రోహిత్‌ (20) వరుస స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో విరాట్‌ నాలుగో స్థానంలో ఉన్నాడు.ఐపీఎల్‌లో అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలుచుకున్న భారత ఆటగాళ్లు (టాప్‌-5)20 - రోహిత్ శర్మ (264 మ్యాచ్‌లు)19 - విరాట్ కోహ్లీ (260 మ్యాచ్‌లు)18 - ఎంఎస్ ధోని (272 మ్యాచ్‌లు)16 - యూసుఫ్ పఠాన్ (174 మ్యాచ్‌లు)16 - రవీంద్ర జడేజా (248 మ్యాచ్‌లు)ఐపీఎల్‌లో అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్లు (టాప్‌-5)25- ఏబీ డివిలియర్స్‌ (184 మ్యాచ్‌లు)22- క్రిస్‌ గేల్‌ (142 మ్యాచ్‌లు)20 - రోహిత్ శర్మ (264 మ్యాచ్‌లు)19 - విరాట్ కోహ్లీ (260 మ్యాచ్‌లు)18 - ఎంఎస్ ధోని (272 మ్యాచ్‌లు)నిన్నటి మ్యాచ్‌లో రోహిత్‌ మరో రికార్డు కూడా సాధించాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో శిఖర్‌ ధవన్‌కు వెనక్కు నెట్టాడు. ఈ జాబితాలో విరాట్‌ టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడు.ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు (టాప్‌-5)8326 - విరాట్ కోహ్లీ6786 - రోహిత్ శర్మ*6769 - శిఖర్ ధావన్6565 - డేవిడ్ వార్నర్5528 - సురేష్ రైనామ్యాచ్‌ విషయానికొస్తే.. నిన్న రాత్రి వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్‌ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే.. శివమ్‌ దూబే (32 బంతుల్లో 50; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రవీంద్ర జడేజా (35 బంతుల్లో 53 నాటౌట్‌; 4 ఫోర్లు,2 సిక్సర్లు) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.సీఎస్‌కే ఇన్నింగ్స్‌లో అరంగేట్రం ఆటగాడు ఆయుశ్ మాత్రే (15 బంతుల్లో 32; 4 ఫోర్లు,2 సిక్సర్లు) కూడా సత్తా చాటాడు. ముంబై బౌలర్లలో బుమ్రా అద్భుతంగా బౌలింగ్‌ చేసి 2 వికెట్లు తీయగా.. దీపక్‌ చాహర్‌, అశ్వనీ కుమార్‌, సాంట్నర్‌ తలో వికెట్‌ పడగొట్టారు.అనంతరం​ ఛేదనకు దిగిన ముంబై రోహిత్‌ శర్మ (45 బంతుల్లో 76 నాటౌట్‌; 4 ఫోర్లు, 6 సిక్సర్లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (30 బంతుల్లో 68 నాటౌట్‌; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో 15.4 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్‌ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది.

Congress Rahul Gandhi Sensational Allegations On EC At  Boston4
Boston: ఈసీపై రాహుల్‌ గాంధీ సంచలన ఆరోపణలు

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వ్యవస్థ రాజీ పడినట్లు కనిపిస్తోందని, ఆ వ్యవస్థలోనే ఏదో తప్పు ఉందంటూ వ్యాఖ్యానించారాయన. ఈ క్రమంలో మహారాష్ట్ర ఎన్నికల ప్రస్తావననూ ఆయన తీసుకొచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్‌ గాంధీ(Rahul Gandhi).. ఆదివారం బోస్టన్‌లో ప్రవాస భారతీయులు పాల్గొన్న ఓ కార్యక్రమంలో ప్రసంగించారు. ‘‘ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో(Maharashtra Election Fraud) 5.30 గంటల నుంచి 7.30 గంటల మధ్య 65 లక్షల మంది ఓటు వేసినట్లు ఎన్నికల సంఘం చెప్పింది. ఒక్కో ఓటర్‌ ఓటు వేయడానికి 3 నిమిషాల సమయం పడుతుంది. అలాంటప్పుడు అంత తక్కువ వ్యవధిలో అంతమంది ఎలా ఓటు వేయగలరు?. అక్కడ ఏదో తప్పు జరిగిందని స్పష్టంగా తెలుస్తోంది’’ అని రాహుల్‌ అన్నారు.बोस्टन : चुनाव आयोग ने हमें शाम 5:30 बजे तक के मतदान के आंकड़े दिए और शाम 5:30 बजे से 7:30 बजे के बीच 65 लाख मतदाताओं ने मतदान किया. ऐसा होना शारीरिक रूप से असंभव है :राहुल गांधी #RahulGandhi #MaharashtraElection #ElectionCommission #RahulGandhiUSA #Boston pic.twitter.com/8kSVOhZ6BU— Sumit Kumar (@skphotography68) April 21, 2025‘‘ఎన్నికల సంఘం(Election Commission) రాజీ పడినట్లు ఇక్కడే అర్థమవుతోంది. ఆ వ్యవస్థలోనే ఏదో తప్పిదం ఉంది. ఇదే విషయాన్ని నేను చాలాసార్లు ప్రస్తావించాను. మహా ఎన్నికలకు సంబంధించిన వీడియోలు చూపించాలని మేం అడిగాం. అందుకు ఈసీ తిరస్కరించింది. ఇప్పుడు అలా అడగడానికి వీలు లేదంటూ చట్టాన్ని కూడా మార్చేశారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే వేదికగా ఆయన అమెరికా భారత్‌ మధ్య సంబంధాల గురించి కూడా మాట్లాడారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్‌.. సోమవారం బ్రౌన్‌ యూనివర్సిటీలో ప్రసంగించనున్నారు. ఇదిలా ఉంటే.. రాహుల్‌ గాంధీ ఈసీపై ఈ తరహా ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి కాదు. అయితే.. రాహుల్‌ సహా పలువురు ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలను ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా ఈవీఎంలను మేనేజ్‌ చేయొచ్చనే ఆరోపణలను కూడా తోసిపుచ్చుతూ వస్తోంది. అయినప్పటికీ వరుసగా ఆయా రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, ఓటర్ల జాబితాల ఆధారంగా ప్రతిపక్షాలు ఈసీపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి.

Meet Khushboo Patani Dishas Sister once worked Indian Army5
వాడికి భయపడి పబ్లిక్‌ టాయ్‌లెట్‌లో దాక్కుంది..కట్‌ చేస్తే ఆర్మీ మేజర్‌!

బాలీవుడ్ నటి దిశా పటానీ అక్క ఖుష్బూ పఠానీ ఒక పసికందును రక్షించి ఇంటర్నెట్ హృదయాన్ని గెలుచుకుంది. ఆమె ప్రదర్శించిన కరుణ , ధైర్యసాహసాలు నెట్టింట ప్రశంసలు దక్కించుకున్నాయి. ఇంతకీ ఎవరీ ఖుష్బూ పటానీ? సోదరి దిశా గ్లామర్‌ ప్రపంచాన్ని ఏలుతోంటే.. ఖుష్బూ దేశానికి సేవ చేసే ఆర్మీ ఆఫీసర్‌ ఎలా అయింది? మాజీ ఆర్మీ అధికారిణి ఖుష్బూ పటానీ ఇంట్రస్టింగ్‌ జర్నీ గురించి తెలుసుకుందామా.అద్భుతనటిగా, ఫిట్‌నెస్ ప్రియురాలిగా పేరు తెచ్చుకున్న దిశా పటానీతో పాటు, ఆమె అక్క ఖుష్బూ పటానీ పేరు కూడా పాపులరే. భారతీయ ఆర్మీలో పనిచేసి రిటైర్‌ అయిన ఖుష్బూ ఇప్పుడు బహుళ పాత్రల్లో నిమగ్నమై ఉంది. వదిలివేయబడిన బిడ్డను రక్షించిన తర్వాత ఖుష్బూ ఇటీవల చాలా మంది దృష్టిని ఆకర్షించింది. తన సోదరి దిశాతో సమానంగా అద్భుతమైన ఇపుడు బరేలీలో పాపను రక్షించి వార్తల్లో నిలిచింది.1991 నవంబర్‌లో ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జన్మించింది ఖుష్బూ. బిబిఎల్ పబ్లిక్ స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేసి, తరువాత DIT స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో చేరింది. ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఖుష్బూ పటానీ తెలివైన విద్యార్థి. కానీ కాలేజీ చదువుకొనే రోజుల్లో వేధింపులకు గురైంది. కొంతమంది అబ్బాయిలు ఆమెను కారులో వెంబడించి వేధించారు. ఒక ప్రాజెక్ట్ పని తర్వాత తన స్నేహితుడితో కలిసి రాత్రి ఆలస్యంగా తన హాస్టల్‌కు వచ్చేది. ఆ సమయంలో కారులో ఒకడు పిచ్చిగా వెంటబడి, వేధించేవాడు. ఒక సందర్భంగా ఖుష్బూ ఒక మహిళల పబ్లిక్ వాష్‌రూమ్‌లో దాక్కుని తనను తాను రక్షించుకుంది. ఈ సమయంలో చాలా భయపడేపోయేదట. దీంతో ఆమె ఒంటరిగా వెళ్లడం మానేసింది. పట్టుదలగా చదువుకు పూర్తి చేసి ఎంఎన్‌సీలో జాబ్‌ సంపాదించింది కానీ ఆ ఉద్యోగం ఖుష్బూ​​కి సంతొషాన్నివ్వలేదు. కాలేజీ రోజుల నాటి భయంకరమైన అనుభవం వెంటాడేది. ఆ భయంనుంచి వచ్చిన ఆలోచనే సైన్యంలో చేరడానికి ప్రేరేపించింది. అప్పటి వరకు, ఆమెకు సైన్యంలో చేరాలనే ఆలోచన లేదు.భారత సైన్యంలో చేరాలని నిర్ణయించుకున్నాక, తన వేధింపుల గురించి తన తండ్రితో చెప్పుకుంది. SSB ప్రవేశ పరీక్షకు సిద్ధమైంది. తొలి ప్రయత్నంలోనే పరీక్షలో ఉత్తీర్ణురాలై లెఫ్టినెంట్‌గా ఆర్మీలో చేరింది. నిజమైన దేశభక్తురాలిగా దేశానికి సేవ చేసింది. ఖుష్బూ పటానీ 34 సంవత్సరాల వయసులో మేజర్ హోదాలో సైన్యం నుండి పదవీ విరమణ చేసి వెల్‌నెస్ కోచ్‌గా ఉంది. అంతేకాదు ఆమె TEDx స్పీకర్‌ కూడాసోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా అభమానులకు స్ఫూర్తినిస్తోంది. ఖుష్బూ టారో కార్డ్ రీడర్ కూడా, కెరీర్, వ్యాపారం, డబ్బు, అనేక ఇతర విషయాలలో సూచనలిస్తుంది.

Karnataka EX DGP Om Prakash Case: Schizophrenic Pallavi Really Did This6
Bengaluru: 12 ఏళ్లుగా.. భయం భయంగానే?

కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్‌ హత్య కేసు దర్యాప్తు లోతుకు వెళ్లే కొద్దీ షాకింగ్‌ విషయాలు వెలుగు చూస్తున్నాయి. భార్య పల్లవి ఆయనపై ఓ బాటిల్‌తో దాడి చేసి.. ఆపై కారం పొడి చల్లి కట్టేసి మరీ కడతేర్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు ప్రాణం పోతున్న టైంలో పోలీసులకు సమాచారం అందించిన ఆమె.. భర్త ముఖం మీద గుడ్డ కప్పి తాపీగా కుర్చీలో కూర్చుని చూస్తున్నట్లు తేలింది.బెంగళూరు: కర్ణాటక మాజీ డీజీపీ ఓం​ ప్రకాశ్‌(Ex DGP Om Prakash) తనయుడు కార్తీక్‌ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఓం ప్రకాశ్‌ భార్య పల్లవి, కూతురు క్రుతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత 12 ఏళ్లుగా స్కిజోఫ్రెనియా(Schizophrenia)తో బాధపడుతోంది. నగరంలోని ఓ ప్రముఖ వైద్యుడి దగ్గర ఆమె చికిత్స కూడా తీసుకుంటోంది. ఈ క్రమంలో గత కొంతకాలంగా భర్తపైనా ఆమె సంచలన ఆరోపణలు చేస్తూ వస్తోంది. తన ప్రాణాలకు తన భర్త నుంచి ముప్పు పొంచి ఉందని.. తుపాకీతో పలుమార్లు బెదిరించడాన్ని ఫ్యామిలీకి చెందిన ఐపీఎస్‌ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపులో మెసేజ్‌లు పెడుతూ వచ్చింది. అయితే ఆమె మానసిక స్థితి గురించి తెలిసిన ఓం ప్రకాశ్‌.. ఆ చేష్టలను తేలికగా తీసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో.. ఈ మధ్య ఆస్తి తగాదాలు మొదలయ్యాయి. ఈ కారణాలతోనే ఆమె భర్తను హత్య చేసి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా ఓ అంచనాకి వచ్చినట్లు ఇండియా టుడే ఓ కథనం ప్రచురించింది.‌ ఆదివారం సాయంత్రం నుంచి పల్లవి(Pallavi)ని, క్రుతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే పోస్టుమార్టం నివేదిక వచ్చాకే ఈ కేసులో అరె‍స్టులు చేస్తామని బెంగళూరు కమిషనర్‌ బీ దయానంద్‌ చెబుతున్నారు. ఈ ఘటనను దురదృష్టకరమైందిగా అభివర్ణించిన హోం మంత్రి పరమేశ్వర.. ఓం ప్రకాశ్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, ఈ కేసులో సమగ్ర దర్యాప్తు జరుగుతుందని పేర్కొన్నారు. 1981 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన ఓం ప్రకాశ్‌ స్వస్థలం బిహార్‌లోని చంపారన్‌. 2015 మార్చి 1న కర్ణాటక డీజీపీగా బాధ్యతలు చేపట్టి, 2017లో పదవీ విరమణ పొందారు. ఆపై కుటుంబంతో బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్‌ లేఅవుట్‌లో నివసిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన భార్య పల్లవి ఇచ్చిన సమాచారంతో ఇంటికి వెళ్లిన పోలీసులు.. ఓం ప్రకాశ్‌ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించారు. చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించినా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. హత్య అనంతరం మరో మాజీ డీజీపీకి ‘ఐ హ్యావ్‌ ఫినిష్డ్‌ మాన్‌స్టర్‌’ అంటూ ఫోనులో మెసేజ్‌ పెట్టినట్లు తెలుస్తోంది. ఆయన ఛాతీలో, మెడ వద్ద, కడుపులో, చేతిలో కత్తిపోట్లు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తీవ్ర రక్త స్రావం కారణంగానే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటన జరిగిన టైంలో కూతురు క్రుృతి కూడా ఇంట్లోనే ఉంది. దీంతో ఆమె పాత్ర కూడా ఏమైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.స్కిజోఫ్రెనియా(Schizophrenia).. ఈ సమస్యతో బాధపడేవారు ఎప్పుడూ ఒక రకమైన భ్రమలో ఉంటారు. లేనిపోనివి ఊహించుకుని భయపడిపోతుంటారు. మనస్సులో ఏదో ఊహించుకుంటూ నిరంతరం ఆందోళన చెందుతూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులు వాస్తవానికి దూరంగా ఊహల్లో ఉంటారు. తమలో తాము మాట్లాడుకోవడం, నవ్వుకోవడం, ఇతరులను పట్టించుకోకుండా తన మానాన తానుండటం, నిరంతర ఆలోచనలు, నిద్రలేమి, ఎవరో పిలుస్తున్నట్టుగా, తనతో మాట్లాడుతున్నట్టుగా భావించి సమాధానం ఇవ్వడంలాంటివి వ్యాధి లక్షణాలు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సైకియాట్రిస్టును సంప్రదించాల్సి ఉంటుంది.

Wine Shops And Bars Closed In Hyderabad7
మందు బాబులకు బిగ్‌ అలర్ట్‌.. నాలుగు రోజులు వైన్స్‌ బంద్‌

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరంలో మందు బాబులకు అలర్ట్‌. హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు వైన్‌ షాపులు బంద్‌ కానున్నాయి. ఈరోజు సాయంత్రం నుండి బుధవారం సాయంత్రం ఆరు గంటల వరకు మందు షాపులు మూసి వేయనున్నారు.ఈనెల 23వ తేదీన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు మద్యం అమ్మకాలు బంద్ కానున్నాయి. వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్స్, క్లబ్‌లలో మద్యం అమ్మకాలు నిలిపివేయనున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఇక, ఈనెల 25వ తేదీన ఎన్నికల కౌంటింగ్‌ ఉంది. కౌంటింగ్‌ రోజు కూడా వైన్‌ షాపులు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లను మూసివేయాలని పోలీసులు ఆదేశాలు ఇచ్చారు.

Vehicles In Delhi That Dont Display Colour Coded Fuel Stickers To Be Penalised8
వెహికల్‌పై ఆ స్టిక్కర్లు లేకుంటే రూ.5000 జరిమానా

ఢిల్లీ మోటార్ వాహన చట్టంలోని నిబంధనల ప్రకారం.. ఇంధన రకాన్ని సూచించే కలర్ కోడెడ్ స్టిక్కర్లను తప్పకుండా అంటించాలి. ఈ నియమాన్ని అతిక్రమించిన వాహనాలపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ వెల్లడించింది.నిబంధనలు పాటించకపోతే మోటారు వాహన చట్టం కింద రూ. 5000 జరిమానా విధిస్తారు. ఈ స్టిక్కర్లు 2012-13లో ప్రవేశపెట్టబడిన హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్ (HSRP)లో భాగంగా తీసుకొచ్చారు. ఆ తరువాత 2019 నాటికి అన్ని వాహనాలను ఈ స్టిక్కర్లు తప్పనిసరి అంటూ ఢిల్లీ రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది.వాహనాలకు కలర్ కోడెడ్ స్టిక్కర్లను అతికించని వాహనదారులు జరిమానా చెల్లించడం మాత్రమే కాకుండా.. పొల్యూషన్ సర్టిఫికెట్ (PUCC) కూడా పొందలేరు. నిబంధనల ప్రకారం, డీజిల్ వాహనాలకు నారింజ రంగు స్టిక్కర్లు, పెట్రోల్ & సీఎన్‌జీ వాహనాలకు లేత నీలం రంగు స్టిక్కర్లు.. మిగిలిన అన్ని వాహనాలకు బూడిద రంగు స్టిక్కర్లు తప్పనిసరిగా అతికించాలి.

KSR Comment On Chandrababu Lies Speeches9
బాబు మాటల్లో నిజం.. నేతిబీర చందమే!

పొంతన లేని మాటలతో జనాల్ని తికమకపెట్టడంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది తిరుగులేని రికార్డు. తాజాగా కొద్ది రోజుల క్రితం జ్యోతీరావు ఫూలే జయంతి ఉత్సవాల్లో ఇది మరోసారి నిరూపితమైంది. ఎల్లోమీడియా ‘బీసీల సంక్షేమానికి రూ.48 కోట్లు’ అంటూ బాబుగారి ప్రసంగాన్ని భాజాభజంత్రీలతో కథనంగా వండి వార్చినప్పటికీ వివరాలు చూస్తే ప్రజలు ముక్కున వేలేసుకోవడం ఖాయం. ఎందుకంటే.. బాబు గారు తన ప్రసంగంలో సంక్షేమ వసతి గృహాలకు రూ.405 కోట్లు, గ్రూప్‌ పరీక్షల అభ్యర్థులకు శిక్షణ శిబిరాలు, బీసీ స్టడీ సర్కిల్స్‌ ఏర్పాటు, అమరావతిలో 500 మంది బ్యాచ్‌తో ఉచిత శిక్షణ, ఆదరణ పథకం కింద ఏటా రూ.వెయ్యికోట్లు ఖర్చు వంటివి మాత్రమే ప్రస్తావించారు. .. ఇవేవీ కొత్తవి కాకపోవడం ఒక వింతైతే.. వీటికయ్యే ఖర్చు ఏటా రెండు వేల కోట్లకు మించకపోవడం ఇంకోటి. మరి.. రూ.48 వేల కోట్లు ఎక్కడ? ఎప్పుడు? ఎలా వ్యయం చేస్తారు? ఎల్లో కథనం చదివిన వారి ఊహకే వదిలేయాలి దీన్ని. పోనీ మొత్తం ఐదేళ్లకు ఇంత మొత్తం అనుకుంటే.. ఒక ఏడాది గడచిపోయింది కాబట్టి.. మిగిలిన నాలుగేళ్లలో ఏటా రూ.12 వేల చొప్పున ఖర్చు పెట్టాలి. దీనిపై కూడా స్పష్టత లేదు. అయినా చంద్రబాబు(Chandrababu) బీసీ సంక్షేమానికి 48 వేల కోట్లు అని ఒక అంకె చెప్పడం, అదేదో మొత్తం ఇచ్చేస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చేసి బ్యానర్‌ కథనాలు రాసేసి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేయడం ఎల్లో మీడియా మార్కు జర్నలిజమై పోయింది. 👉బాబు గారు ఇంకొన్ని మాటలూ ఆడారు. ఆర్థిక అసమానతలను రూపుమాపే బ్రహ్మాస్త్రం పీ-4 అని, దీని ద్వారా లక్ష మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేస్తామని చెప్పనైతే చెప్పారు కానీ.. ఎలా అన్నది మాత్రం చెప్పడం మరిచారు!. సాధారణంగా ఏ నేత అయినా వేల కోట్ల మొత్తాలను ప్రకటించినప్పుడు దేనికెంత ఖర్చు చేస్తారు? బడ్జెట్‌ కేటాయింపులు ఎలా ఉన్నాయి? వంటి వివరాలు ఇవ్వడం జర్నలిజమ్‌ ప్రాథమిక లక్షణం. జగన్‌ ముఖ్యమంత్రిగా ఉండగా ఇలాంటి భారీ కేటాయింపులు జరిగినప్పుడు దానికి కట్టుబడి ఉన్నట్టు సమాచారం ఉండేది. అప్పటి విపక్షం టీడీపీ కూడా తప్పు పట్టే పరిస్థితి ఉండేది కాదు. పోనీలే... ఏదో ఒక రీతిన బీసీల సంక్షేమానికి రూ.48 వేల కోట్లు ఖర్చు పెడుతున్నారని సంతోషిస్తూండగానే చంద్రబాబు అన్నమాటతో నిరాశ కమ్మేసింది. 👉అప్పు చేసి సంక్షేమం అమలు చేస్తే రాష్ట్రం కష్టాలలో కూరుకుపోతుందని, సంపద సృష్టించి సంక్షేమానికి ఖర్చు చేస్తామని చంద్రబాబు ప్రకటించారని ఎల్లో మీడియా(Yellow Media)నే తెలిపింది. చంద్రబాబు అక్కడితో ఆగలేదు. కాని టీడీపీకి నష్టం అని భావించి ఎల్లో మీడియా ఆ భాగం రాయకుండా వదలి వేసింది. మిగిలిన మీడియాలో ఆ వివరాలు ఉన్నాయి. చెప్పినవన్నీ చేయాలని ఉన్నా గల్లా పెట్టే ఖాళీగా కనిపిస్తోందని, అప్పు చేద్దామన్నా ఇచ్చేందుకు ఎవరు ముందుకు రావడం లేదని అన్నారు. పరపతి లేకపోతే అప్పు ఎలా పుడుతుందని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చి పది నెలలు దాటిపోయింది. ఈ కాలంలో సంపద సృష్టించ లేకపోయానని ఆయన చెబుతున్నట్లే కదా? పైగా అప్పు పుట్టని పరిస్థితి వచ్చిందంటే చంద్రబాబే కదా దానికి బాధ్యుడు అవుతారు. పోనీ అదే నిజమనుకున్నా, ఇప్పటికే రూ.లక్ష కోట్ల అప్పు ఎలా చేశారు? దానిని ఎందుకోసం ఖర్చు పెట్టారు అన్నది ఎప్పుడైనా చెప్పారా అంటే లేదు. ఒక్క అమరావతి(Amaravati) నిర్మాణాలకే ఏభైవేల కోట్ల అప్పు ఎలా తీసుకు వస్తున్నారు? ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అంటూ, ఎన్నికల ప్రణాళిక అంటూ తెగ వాగ్దానాలు ఇచ్చేశారు కదా? బీసీలకు ఏభై ఏళ్లకే ఫించన్‌ ఇస్తానన్నారు కదా? ఇప్పుడు ప్రతి దానికి గల్లా పెట్టె ఖాళీగా ఉందని చెప్పడం ప్రజలను చీట్ చేయడమే కాదా? ఈ లెక్కన ఇప్పుడు బీసీల సంక్షేమానికి ప్రకటించిన రూ.48 వేల కోట్లు ఉత్తుత్తి ప్రకటనగానే తీసుకోవాలా? లేక దాని అమలుకు వేరే మార్గం ఏమైనా ఉందని చెబుతారా?. తల్లికి వందనం కింద త్వరలో డబ్బులు ఇస్తామని అంటారు. ఒక ఏడాది ఇప్పటికే ఎగవేసిన విషయాన్ని మాత్రం ప్రస్తావించరు. అన్నదాత సుఖీభవ కింద కేంద్రం ఇచ్చే రూ.ఆరు వేలు పోను మిగిలిన రూ.14 వేలు ఇస్తామని చెప్పారు. మరి ఈ ఏడాది ఎందుకు ఎగవేశారో వివరించాలి కదా? కేంద్రం ఇచ్చేదానితో సంబంధం లేకుండా రైతులకు సాయం చేస్తామని చెప్పి ఇప్పుడు మాట మార్చుతున్నారు. ఇవైనా ఏ మేరకు అమలు చేస్తారో తెలియదు. చంద్రబాబు మాత్రం వాటిని నివృత్తి చేయరు. తాను చెప్పదలచుకున్నది ఏదో అది ప్రజలు నమ్ముతారా? లేదా ?అనేదానితో నిమిత్తం లేకుండా ప్రచారం చేసి వెళుతుంటారు. బీసీల రక్షణ కోసం చట్టం తీసుకు వస్తామని, వారికి 34 శాతం రిజర్వేషన్లు తెస్తామని, నామినేటెడ్ పోస్టులలో 33 శాతం బీసీలకు కేటాయిస్తామని, కల్లు గీత కార్మికులకు మద్యం షాపులు కేటాయించామని.. ఇలా ఆయా విషయాలను చెప్పారు. విశేషం ఏమిటంటే కొద్ది రోజుల క్రితం సత్యసాయి జిల్లాలో బీసీ వర్గానికి చెందిన ఒక వైసీపీ నేత లింగమయ్యను టీడీపీ వారు హత్య చేస్తే వీరు కనీసం ఖండించలేదు. ఆ కేసులో ఇరవైమంది నిందితులు ఉన్నారని చెబుతున్నా ఇద్దరిపైనే కేసు నమోదు చేశారని బాధితులు ఆరోపిస్తుంటే ముఖ్యమంత్రి మాత్రం బీసీ రక్షణ చట్టం గురించి ఉపన్యాసం ఇస్తున్నారు.ఏపీలో సోషల్ మీడియా(AP Social Media) నేరస్తులకు అడ్డాగా మారిందని, వ్యక్తిత్వ హననం చేస్తే అది వారికి అదే చివరి రోజు అవుతుందని చంద్రబాబు అంటున్నారు. నిజానికి సోషల్ మీడియాను దుర్వినియోగం ఎక్కువగా చేసింది టీడీపీ వారే అనే సంగతి ఆయనకూ తెలుసు. వారిని ప్రోత్సహించింది తాను, తన కుమారుడు అన్న విషయం అందరికి విదితమే. ఈ మధ్య తప్పని స్థితిలో ఒక టీడీపీ కార్యకర్తను పోలీసులు అరెస్టు చేశారు. అతనిని విచారించి ,అతను వాగిన పిచ్చివాగుడు వెనుక ఎవరు ఉన్నారో పోలీసులు తేల్చుతారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు. సీమ రాజా అని, ఇంకేవేవో పేర్లతో వైఎస్సార్సీపీ మహిళా నేతలపై దారుణమైన నీచమైన వ్యాఖ్యలు చేసినవారంతా రాష్ట్రంలో సేఫ్‌గా తిరుగుతున్నారు. మాజీ మంత్రి రోజాను ఉద్దేశించి అసహ్యకరమైన ఆరోపణ చేసిన ఒక టీడీపీ నేతకు టిక్కెట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేసిన చరిత్ర కూడా సార్‌దే కదా! ఏదైనా చిత్తశుద్దితో చెబితే పర్వాలేదు. కాని సుద్దులు పైకి చెప్పి, టిడిపి సోషల్ మీడియా అరాచక శక్తులకు అండగా నిలబడుతున్నారన్న అపకీర్తి మూట కట్టుకుంటే ఏమి చేస్తాం. అందువల్ల నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో చంద్రబాబు మాటల్లో వాస్తవం అంత ఉంటుందని ఆయన ప్రత్యర్ధులు వ్యాఖ్యానిస్తుంటారు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Singer Pravasthi Aradhya Sensational Comments On MM Keeravani, Sunitha, Chandra Bose10
బొడ్డు కింద చీర కట్టుకోమన్నారు.. బాడీ షేమింగ్‌ చేశారు: లేడీ సింగర్‌ ఆవేదన

లెజండరీ సింగర్‌ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రారంభించిన ‘పాడుతా తీయగా’(Padutha Theeyaga) సింగింగ్‌ షో ఇప్పటికీ దిగ్విజయంగా కొనసాగుతుంది. బాలు గారి మరణానంతరం ఆయన తనయుడు ఎస్పీ చరణ్‌ ఈ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల మొదలైన ఈ షో సిల్వర్ జూబ్లీ సిరీస్‌కి ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి, పాటల రచయిత చంద్రబోస్‌, సింగర్‌ సునీత జడ్జీలుగా ఉన్నారు. సింగింగ్‌ రియాల్టీ షోలలో ముందంజలో ఉన్న ‘పాడుతా తీయగా’పై గాయని ప్రవస్తి ఆరాధ్య(Pravasthi Aradhya ) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ షో న్యాయంగా జరగడం లేదని, టాలెంట్‌ ఉన్నవాళ్లను కాకుండా నచ్చిన వాళ్లను విజేతలుగా చేస్తున్నారని ఆరోపించారు. ఈ షో నుంచి ఎలిమినేట్‌ అయిన ప్రవస్తి.. తాజాగా య్యూట్యూబ్‌లో ఓ వీడియో రిలీజ్‌ చేస్తూ..కీరవాణి(M. M. Keeravani), సునీత, చంద్రబోస్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జడ్జి సీట్లలో కూర్చొని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాదు తనను మెంటల్‌గా హింసించారని, బాడీ షేమింగ్‌ చేశారని ఆరోపించారు.‘మ్యూజిక్‌ ఫిల్డ్‌ నుంచి వెళ్లిపోవాలని డిసైడ్‌ అయ్యాకనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇందులో పెద్ద పెద్ద వాళ్ల పేర్లును ప్రస్తావించాను కాబట్టి నాకు ఎలాగో అవకాశాలు రావు. కానీ మీఅందరికి నిజం తెలియాలని ధైర్యంతో ఈ వీడియో చేశాను. పాడుతా తీయగా ప్రోగ్రామ్‌లో పాల్గొన్న నన్ను జడ్జీలు(కీరవాణి, చంద్రబోస్‌, సునీత) మెంటల్‌గా హింసించి, అన్యాయంగా ఎలిమేట్‌ చేశారు.ముందుగా సునీత(Sunitha) గురించి చెబుతా. ఫస్ట్‌ ఎపిసోడ్‌ నుంచి కూడా నేను స్టేజ్‌ మీదకు రాగానే ఆమె ముఖం అదోలా పెట్టేవారు. నా ఫ్యాన్స్‌ కూడా నన్ను అడిగారు. ఆమెతో మీకేమైనా గొడవ జరిగిందా అని మెసేజ్‌ చేశారు. కానీ నేను అది నమ్మలేదు. కానీ అంతరామమయం పాడే ముందు నేను గమనించాను. ఆమెకు నేనంటే నచ్చదు. అందుకే తప్పు లేకున్నా నెగెటివ్‌ కామెంట్స్‌ చేసేవారు. ఓ సారి మైక్‌ ఆన్‌లో లేదని అనుకొని ‘ఈ అమ్మాయికి హైపిచ్‌ రాదు కానీ మ్యానేజ్‌ చేస్తుంది చూడు’ అని కీరవాణికి చెప్పారు. నాకు ఏడుపు వచ్చింది. కానీ తట్టుకొని అంతరామమయం పాడాను. చాలా మంది మెచ్చుకున్నారు. కానీ ఆమె మాత్రం నెగెటివ్‌ కామెంట్స్‌ చేశారు. కానీ మిగతావారు పాడినప్పుడు మాత్రం తప్పులు జరిగితే సైగలు చేసేవారు.ఇక చంద్రబోస్‌(chandrabose) గారు.. లిరిక్స్‌ తప్పులు ఉంటే ఆయన చెప్పాలి. మొదటి రెండు ఎపిసోడ్స్‌ నన్ను మెచ్చుకున్నారు. లిరిక్స్‌లో తప్పులు దొరకపోవడంతో నన్ను మరోలా వేధించారు.కీరవాణి.. ఆయన నుంచి నెగెటివ్‌ కామెంట్స్‌ రాలేదు. కానీ సెట్‌లో ఎలా మాట్లాడతారో చెబుతాను. మెలోడీ పాడిన వారికి ఎక్కువ మార్కులు ఇస్తానని చెబుతారు. ఆయన కంపోజ్‌ చేసిన పాటలు పాడితే మంచి మార్కులు వేస్తారు. డబ్బుల కోసం నేను వెడ్డింగ్‌ షోస్‌ చేయాల్సి వచ్చిందని గతంలో చెప్పాను. ఈ పాయింట్‌పై కీరవాణి మాట్లాడుతూ.. ‘వెడ్డింగ్‌ షోస్‌ చేసేవాళ్లు నా దృష్టిలో సింగర్సే కాదు. వాళ్లంటే నాకు అసహ్యం’ అని అన్నారు. అది చాలా హర్టింగ్‌గా అనిపించింది. అలాగే పాడుతా తీయగాలో ఐదో ఫ్రైజ్‌ సాధించినవాళ్లను నా దగ్గరకు వచ్చి చాకిరీ చేసేవాళ్ల గ్రూప్‌లో చేర్చుకుంటానని చెప్పారు. చాకిరీ అనే పదం వాడినందుకు నాకు బాధగా అనిపించింది. జడ్జీలు వివక్ష చూపడం, నన్ను చీడ పురుగులా చూడడం, నా బాడీ మీద జోకులు చేయడం..నన్ను మెంటల్‌గా ఎఫెక్ట్‌ అయ్యేలా చేశాయి.పొడ్రక్షన్‌ వాళ్లు కూడా మమ్మల్ని అవమానించారు. చీరలు ఇచ్చి బొడ్డు కిందకు కట్టుకో, ఎక్స్‌ఫోజింగ్‌ చేయాలి అన్నట్లుగా చెప్పారు. చాలా సార్లు తిట్టారు. బాడీ షేమింగ్‌ చేశారు. ‘ఇలాంటి బాడీకి ఇంకేం ఇవ్వగలను’ అని కాస్ట్యూమ్ డిజైనర్ అన్నారు. వీళ్ల మాటల వల్ల చాలా ఇబ్బంది పడ్డాను. బాలు సార్‌ ఉన్నప్పుడు ఇలాంటివి జరిగేవి కాదు. ఎప్పుడైతే జ్ఞాపిక ప్రొడక్షన్స్‌ వచ్చిందో పాడుతా తీయగా ఇలా మారిపోయింది. డ్యాన్సులు చేయమని, కుల్లు జోకులు చేయమని చెప్పారు.ఇక నా ఎలిమినేషన్‌ రోజు ఏం జరిగిందో చెబుతాను. ఆ రోజు టాప్‌ 1 వచ్చిన అమ్మాయి చంద్రబోస్‌ గారి పాట పాడింది. లిరిక్స్‌ మరిచిపోయినా చంద్రబోస్‌ గారు కామెంట్స్‌లో అది చెప్పలేదు. ఇంకో అబ్బాయి కీరవాణి పాట పాడితే స్కోర్‌ ఎక్కువ వేశారు. ఎలిమేషన్‌ రౌండ్‌లో జరిగింది ఇది. ఎలిమినేషన్‌ జరిగినప్పుడు కీరవాణి, చంద్రబోస్‌ అక్కడ నుంచి లేచి వెళ్లిపోయారు. సునీత మాత్రం అక్కడే నవ్వుతూ కూర్చున్నారు. ఎలిమేట్‌ అయ్యాక.. నేను ఎమోషనల్‌ అయ్యాను. మా అమ్మ సునీత దగ్గరకు వచ్చి ‘ఎందుకు ఇంత అన్యాయం చేశారు’ అని అడిగితే..‘నువ్వు ఇక్కడ నుంచి వెళ్లిపో’అని సీరియస్‌గా అన్నారు. నేను చాలా షోస్‌ చేశాను కానీ ఏ జడ్జి కూడా ఇలా మాట్లాడలేదు.నేను ఈ కెరీయర్‌ వదిలేద్దామని డిసైడ్‌ అయ్యాకే ఈ వీడియో చేశాను. పెద్ద పెద్ద వాళ్ల పేర్లు బయటపెట్టాను. నాకు ఎలాగో అవకాశం రాదు. మీ అందరికి చెప్పేది ఒక్కటే ఇలాంటి ఫేక్‌ షోస్‌ చూడడం మానేయండి. నాలాగే చాలా మంది సఫర్‌ అయ్యారు. జడ్జిలు ఆ సీటులో కూర్చొని అన్యాయం చేసి సరస్వతి దేవిని అవమానించకండి. చిత్రమ్మ, మనోగారు, శైలజగారు ఉంటే చాలా బాగుంటుంది. మాలాంటి జీవితాలతో ఆడుకోకండి. నాకు ఏమైనా అయినా, నా ఫ్యామిలీకి ఏమైనా జరిగినా కీరవాణి, చంద్రబోస్‌, సునీతతో పాటు జ్ఞాపిక ప్రొడక్షన్స్‌ వాళ్లదే బాధ్యత’ అని సింగర్‌ ప్రవస్తి పేర్కొంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement