Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YSRCP Chief YS Jagan Fires On Chandrababu Govt1
బిహార్‌ను మించి భయోత్పాతం: వైఎస్‌ జగన్‌

చంద్రబాబు మెప్పు కోసం కొందరు పోలీసులు తమ టోపీపై ఉన్న మూడు సింహాలకు సెల్యూట్‌ చేయకుండా ఆయనకు వాచ్‌మెన్‌ల మాదిరిగా పని చేస్తున్నారు. వారికి ఒకటే చెబుతున్నా..! ఎల్లకాలం చంద్రబాబు నాయుడు పరిపాలనే ఉండదు. అలా వ్యవహరించిన పోలీసుల బట్టలూడదీసి ప్రజల ముందు, చట్టం ముందు దోషులుగా నిలబెడతామని హెచ్చరిస్తున్నా. మీ యూనిఫామ్‌ తీయించి ఉద్యోగాలు ఊడగొడతామని చెబుతున్నా. మీరు చేసిన ప్రతి పనికీ వడ్డీతో సహా లెక్కేసి మిమ్మల్ని దోషులుగా నిలబెడతాం -వైఎస్‌ జగన్‌ సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘రాష్ట్రం మొత్తం రెడ్‌బుక్‌ పాలన సాగిస్తున్నారు.. సూపర్‌ సిక్స్‌ హామీలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రజలు ప్రశ్నిస్తుండటంతో.. రెడ్‌బుక్‌ పాలనతో దాడులు కొనసాగిస్తున్నారు. పోలీసులను ఉపయోగించుకుని రాష్ట్రవ్యాప్తంగా తెగబడుతున్న దౌర్జన్య కాండను ప్రజలంతా చూస్తున్నారు. కచ్చితంగా దీనికి బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయి..’ అని వైఎస్సార్‌సీపీ(YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) హెచ్చరించారు. గత నెల 30వ తేదీన టీడీపీ గూండాల పాశవిక దాడిలో మృతిచెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబాన్ని మంగళవారం శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో పరామర్శించిన అనంతరం వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడారు. గతంలో బిహార్‌.. ఇప్పుడు ఏపీ!! రాప్తాడు నియోజకవర్గంలో ఈ ఘటన ఎందుకు జరిగింది? రాష్ట్రంలో పరిస్థితులు ఇలా ఎందుకు ఉన్నాయి..? అనేది ఇవాళ ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. భర్తను కోల్పోయిన లింగమయ్య భార్య దిక్కు తోచక తల్లడిల్లిపోతోంది. గతంలో బిహార్‌ గురించి మాట్లాడుకునేవారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్‌ పరువును చంద్రబాబు రోడ్డున పడేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా దిగజారాయి. ఇటీవల 57 చోట్ల స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు జరిగితే ఏడు చోట్ల చంద్రబాబు పార్టీ గెలిచే పరిస్థితి లేదని గ్రహించడంతో పోస్ట్‌పోన్‌ చేయించారు. అనివార్యం కావడంతో 50 చోట్ల ఎన్నికలు జరిగాయి. చంద్రబాబు ఎంత భయపెట్టినా, ప్రలోభ పెట్టినా.. 39 చోట్ల వైఎస్సార్‌సీపీ గెలిచింది. అసలు ఆ 57 చోట్ల చంద్రబాబుకు సంఖ్యా బలమే లేదు. అక్కడ గెలిచిన వారంతా వైఎస్సార్‌సీపీ సభ్యులే. మా పార్టీ గుర్తు మీద గెలుపొందిన వారే. చంద్రబాబు తమకు ఏమాత్రం సంఖ్యా బలం లేదని తెలిసి కూడా భయపెడుతూ, పోలీసులను తన దగ్గర పనిచేసే వాచ్‌మెన్‌ల కంటే కూడా హీనంగా వాడుకుంటూ దిగజారిన రాజకీయాలు చేస్తున్నారు. ఒక ఎంపీపీ పోతే ఏమవుతుంది బాబూ? చంద్రబాబు ఇవాళ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి! ఒకచోట ఎంపీపీ పోతే ఏమవుతుంది? ఒకచోట జెడ్పీ చైర్మన్, ఉప సర్పంచ్‌ పదవి పోతే ఏమవుతుంది? ఆయన సీఎం కాబట్టి.. అధికారంలో ఉన్నారు కాబట్టి.. బలం లేకపోయినా.. తాను ముఖ్యమంత్రినన్న అహంకారంతో ఏ పదవైనా తమకే దక్కాలనే దురుద్దేశంతో శాంతిభద్రతలను పూర్తిగా నాశనం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి రహదారిలో అశేష జనవాహినికి అభివాదం చేస్తున్న వైఎస్‌ జగన్‌ రామగిరిలో రాక్షసత్వం.. రామగిరి మండలంలో పది మంది ఎంపీటీసీలు ఉంటే వైఎస్సార్‌సీపీకి చెందిన 9 మంది సభ్యులు గెలిచారు. కేవలం ఒకటి మాత్రమే టీడీపీది. మరి ఇక్కడ ఎంపీపీ పదవికి నోటిఫికేషన్‌ జారీ అయితే 9 మంది సభ్యులున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి పదవి దక్కాలా? లేక ఒకే ఒక సభ్యుడున్న టీడీపీకి రావాలా? తొమ్మిది మంది సభ్యులు చంద్రబాబు ప్రలోభాలకు వ్యతిరేకంగా కోర్టుకెళ్లి తమకు ప్రాణహాని ఉందని, ఎంపీపీ పదవికి పోటీ చేయాలంటే పోలీసు రక్షణ కల్పించాలని కోరారు. కోర్టు ఆదేశాలతో సభ్యులను తీసుకొస్తుంటే.. ప్రొటెక్షన్‌ ఇవ్వాల్సిన పోలీసులు మధ్యలో రామగిరి ఎస్‌ఐ సుధాకర్‌ అనే వ్యక్తిని వీళ్ల కాన్వాయ్‌లోకి ఎక్కించారు. వీళ్లందరికి ఎమ్మెల్యే, ఎమ్మెల్యే కుమారుడితో వీడియో కాల్‌ చేయించారు. నువ్వు ఓటు వేయకుంటే మీ అమ్మనాన్న ఇంటికి రారని భారతమ్మ అనే ఎంపీటీసీని వీడియో కాల్‌ చేయించి బెదిరించారు. వీటికి లొంగకపోవడంతో కోరం లేదని ఎన్నికలు వాయిదా వేశారు. ఆ తరువాత ఇదే ఎస్‌ఐ పెనుకొండకు తీసుకెళ్లి ఎంపీటీసీ సభ్యులను బైండోవర్‌ చేశారు. దీంతో ప్రకాష్‌రెడ్డి (రాప్తాడు మాజీ ఎమ్మెల్యే), ఉషశ్రీ (పార్టీ జిల్లా అధ్యక్షురాలు) మా పార్టీకి చెందిన ఎంపీటీసీలకు మద్దతుగా వెళ్లడంతో వారిద్దరిపై కేసులు పెట్టారు. అసలు వీళ్లిద్దరు ఏం తప్పు చేశారని కేసులు పెట్టారు? వాళ్లు టీడీపీ ఎంపీటీసీలనేమైనా తెచ్చారా? మా పార్టీ సభ్యుల కిడ్నాప్‌ను అడ్డుకునేందుకు వెళ్లి ధర్నా చేసినందుకు వాళ్ల మీద కేసులు బనాయించారు. భయోత్పాతం సృష్టించారు.. ఈ ఎన్నికల ప్రక్రియ జరగకూడదన్న దురుద్దేశంతో పాపిరెడ్డిపల్లిలో మా పార్టీకి చెందిన జయచంద్రారెడ్డిపై దాడి చేశారు. 28న మళ్లీ దాడి చేశారు. లింగమయ్య అన్న ఈ దాడిని అడ్డుకుని పోలీసులకు కంప్లయింట్‌ చేశారు. తమపై దాడులను అరికట్టాలని వేడుకుంటే పోలీసులు కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ క్రమంలో మార్చి 30న కురుబ లింగమయ్య కుమారుడు బైక్‌పై వెళ్తుంటే రాళ్లతో దాడి చేశారు. కుమారుడు ఈ విషయాన్ని లింగమయ్యకు చెప్పడంతో.. 20 మందికిపైగా టీడీపీ మూకలు మరోసారి లింగమయ్య ఇంటికి వెళ్లి బేస్‌బాల్‌ బ్యాట్, మచ్చుకత్తులు, కర్రలతో దాడి చేసి హింసించడంతో లింగమయ్య చనిపోయారు. రాష్ట్రం ఈ రోజు బిహార్‌ కన్నా అధ్వానంగా ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో సిగ్గుతో తల వంచుకునేలా వ్యవహరిస్తున్నారు. 20 మంది దాడి చేస్తే.. ఇద్దరిపై కేసులా? లింగమయ్యపై 20 మంది దాడి చేస్తే కేసులు ఇద్దరి మీదే పెట్టారు. ఇందులో క్రియాశీలకంగా వ్యవహరించిన రమేష్‌నాయుడుపై ఎందుకు కేసు పెట్టలేదు? మిగిలిన వారిని ఎందుకు వదిలేశారు? నిందితులంతా ఇదే నియోజకవర్గ ఎమ్మెల్యే బంధువులు. ఎమ్మెల్యే కుమారుడు మార్చి 27న ఆ గ్రామానికి వెళ్లి రెచ్చగొడితే ఆయన మీద కేసు ఎందుకు పెట్టలేదు? ఈ హత్యను ప్రోత్సహించిన ఎమ్మెల్యేపై గానీ, ఆమె కుమారుడిపైగానీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఎస్‌ఐ సుధాకర్‌ భయపెడుతుంటే అతడిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? లింగమయ్య కుమారుడు శ్రీనివాస్‌పై కూడా దాడి జరిగింది. కానీ కంప్లయింట్‌ లింగమయ్య కుమారుడితో కాకుండా.. పోలీసులే ఒక ఫిర్యాదు రాసుకుని వచ్చి నిరక్షరాస్యురాలైన లింగమయ్య భార్యతో బలవంతంగా వేలిముద్రలు వేయించుకుని వెళ్లారు. వాళ్లు ఏం రాసుకున్నారో తెలియదు..! నిందితులనే సాక్షులుగా చేర్చి.. లింగమయ్యను చంపాలనే ఉద్దేశంతోనే బేస్‌బాల్‌ బ్యాట్‌తో దాడి చేశారు. పోలీసులు నమోదు చేసిన ఫిర్యాదులో బేస్‌బాల్‌ బ్యాట్‌ ఉన్నట్లు రాయలేదు. చిన్న చిన్న కర్రలతో దాడి చేసినట్లు వక్రీకరించారు. పోలీసులు విచారించిన 8 మందిలో ఐదుగురు మాత్రమే లింగమయ్య కుటుంబీకులు. మిగిలిన ముగ్గురూ టీడీపీకి చెందినవారు. నిందితులనే సాక్షులుగా చేర్చారంటే పోలీసు వ్యవస్థ ఏ స్థాయికి దిగజారిపోయిందో ఇంతకంటే వేరే చెప్పాల్సిన అవసరం లేదు. సాక్షులను కూడా వీళ్లకు కావాల్సిన వాళ్లను పెట్టుకున్నారు. వీళ్లే తప్పుడు సాక్ష్యాలు సృష్టించడం చూస్తే.. పోలీసు వ్యవస్థ ఇంతకన్నా దారుణంగా ప్రపంచంలో ఎక్కడా ఉండదు. మీ కుటుంబానికి అండగా ఉంటాం⇒ లింగమయ్య హత్యను మానవ హక్కుల సంఘానికి నివేదిస్తాం⇒ పాపిరెడ్డిపల్లిలో బాధిత కుటుంబాన్ని ఓదార్చిన వైఎస్‌ జగన్‌ టీడీపీ గూండాల చేతిలో దారుణ హత్యకు గురైన తమ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబానికి పూర్తి అండగా ఉంటామని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ నెల 30న శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో టీడీపీ గూండాల దాడిలో లింగమయ్య మృతి చెందిన విషయం తెలిసిందే. కురుబ లింగమయ్య కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లింగమయ్య కుటుంబాన్ని పరామ­ర్శించేందుకు వైఎస్‌ జగన్‌ వస్తున్నట్లు తెలియడంతో పల్లెలకు పల్లెలు పాపిరెడ్డిపల్లికి తరలివచ్చాయి. హెలిప్యాడ్‌ నుంచి జగన్‌ నేరుగా లింగమయ్య ఇంటికి చేరుకుని తొలుత చిత్ర పటానికి నివాళులర్పించారు. అనంతరం కింద కూర్చుని లింగమయ్య భార్య, కుమారులు, కుమార్తెతో చాలాసేపు మాట్లాడి ఓదార్చారు. లింగమయ్య కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని, పార్టీ తరఫున న్యాయం చేస్తానని జగన్‌ హామీ ఇచ్చారు. లింగమయ్య పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటామన్నారు. లింగమయ్య అన్న హత్య అత్యంత కిరాతకమన్నారు. టీడీపీ మూకల దుర్మార్గాలను రాష్ట్రవ్యాప్తంగా తెలియచెప్పేందుకు వచ్చామ­న్నారు. ఈ కేసును మానవ హక్కుల సంఘానికి నివేదిస్తామని ప్రకటించారు. టీడీపీ వాళ్లు మా నాన్నను చంపేశారన్నా..జగన్‌ పరామర్శిస్తున్న సమయంలో లింగమయ్య కుమార్తె కన్నీటి పర్యంతమైంది. అన్నా..! మా నాన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త.. అందుకే 20 మందితో వచ్చి దాడి చేసి చంపారన్నా..! టీడీపీ వాళ్లు మా నాన్నను చంపేశారన్నా..! అంటూ రోదించింది. మా అమ్మ, తమ్ముళ్లకు ఏమీ తెలియదన్నా..! మీరే అండగా నిలవాలన్నా..! గ్రామంలో టీడీపీ దుర్మార్గాలను తట్టుకో­లేక­పోతు­న్నామన్నా..! పండుగలు కూడా చేసుకోలేని పరిస్థితులు ఉన్నాయన్నా..! అంటూ ఆవేదన వ్యక్తంచేసింది. ‘వైఎస్సార్‌సీపీ హయాంలో ఎలాంటి గొడవలూ లేవన్నా..! ఇప్పుడు ఎప్పుడేం జరుగుతుందోనని భయంగా ఉందన్నా..’ అంటూ కొందరు మహిళలు ఆందోళన వ్యక్తం చేయగా.. ధైర్యంగా ఉండాలని, తాను అండగా ఉంటానని వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు. రాష్ట్రమంతా.. రెడ్‌బుక్‌ దొంగ సాక్ష్యాలను సృష్టిస్తూ.. కేసుల్లో ఇరికించి జైళ్లకు పంపిస్తున్నారు: జగన్‌ ‘రామగిరిలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా వీళ్లు చేస్తున్న అన్యాయాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు. రాష్ట్రం మొత్తం రెడ్‌బుక్‌ పాలన సాగిస్తున్నారు’ అని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో ఏం జరుగుతోందంటే.. ‘దొంగ సాక్ష్యాలను వీళ్లే సృష్టిస్తున్నారు. నచ్చని నేతలను కేసుల్లో ఇరి­కించి జైళ్లకు పంపిస్తున్నారు’ అని ధ్వజమెత్తారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ⇒ తిరుపతిలో డిప్యూటీ మేయర్‌ ఉప ఎన్నిక జరిగితే బస్సులో ఉన్న కార్పొరేటర్లు, ఎమ్మెల్సీని ఏకంగా పోలీసులే కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారు. చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని రామకుప్పం ఎంపీపీ ఉప ఎన్నిక కూడా దౌర్జన్యంగా జరిపించారు. పశి్చమ గోదావరి జిల్లా అత్తిలిలో కూడా ఇలాగే దౌర్జన్యం చేశారు. ఎక్కడా వీళ్లకు సంఖ్యా బలం లేదు. విశాఖలో 98 మంది సభ్యుల్లో 56 మంది వైఎస్సార్‌సీపీ గుర్తుపై గెలిచారు. అక్కడ కూడా భయపెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇందూరి ప్రతాప్‌రెడ్డిపై హత్యాయత్నంరాష్ట్రంలో హత్యా రాజకీయాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయంటే.. ఈ నెల 6న ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని శిరివెళ్లలో ఇందూరి ప్రతాప్‌రెడ్డిపై హత్యాయత్నం చేశారు. ఇదే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రతాప్‌రెడ్డి గుడికి వెళ్లి పూజ చేస్తుండగా ఆయన అన్నను చంపేశారు. మా ప్రభుత్వంలో ప్రతాప్‌రెడ్డికి గన్‌మెన్‌ సౌకర్యం కల్పిస్తే చంద్రబాబు వచ్చాక తొలగించారు. పసుపులేటి సుబ్బరాయుడును చంపారు.. గతేడాది ఆగస్ట్‌ 3న శ్రీశైలం నియోజకవర్గం మహానందిలోని సీతారాంపురంలో పసుపులేటి సుబ్బరాయుడిని చంపేశారు. నేను ఆ ఊరికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించా. నంద్యాల హెడ్‌ క్వార్టర్‌కు కూతవేటు దూరంలో మర్డర్‌ జరిగినా పోలీసులు స్పందించలేదు. అక్కడే ఎస్పీ ఆఫీసు ఉన్నా ఎలాంటి చర్యలు లేవు. సాంబిరెడ్డిపై దారుణంగా దాడి.. గతేడాది జులై 23న పల్నాడు జిల్లా పెదకూరపాడులో ఈద సాంబిరెడ్డిని ఇనుప రాడ్‌లతో కొట్టి కారుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. చనిపోయాడని భావించి వెళ్లిపోయారు. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో గతేడాది జూలై 17న వైఎస్సార్‌సీపీకి చెందిన రషీద్‌ అనే యువకుడిని దారుణంగా నరికి చంపారు. ఏడేళ్ల తర్వాత పోసానిపై కేసులు సినీ నటుడు పోసాని కృష్ణమురళి చేసిన తప్పేమిటంటే... ఆయనకు నంది అవార్డు ఇస్తే తీసుకోకపోవడం! కుల వివక్ష పాటిస్తున్నారని ఆయన 2017లో స్టేట్‌మెంట్‌ ఇస్తే ఇప్పుడు ఆయనపై 18 కేసులు బనాయించి అరెస్టు చేసి నెల రోజులకుపైగా జైల్లో పెట్టించారు. 145 రోజులకుపైగా జైలులో నందిగం సురేష్‌.. మాదిగ సామాజిక వర్గానికి చెందిన మా మాజీ ఎంపీ నందిగం సురేష్‌పై తప్పుడు కేసులు మోపి 145 రోజులకుపైగా జైల్లో పెట్టారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కుట్రపూరితంగా తప్పుడు కేసులు పెట్టి 55 రోజులు జైల్లో పెట్టారు. దాడులు చేసేది టీడీపీ వాళ్లయితే.. జైళ్లలో పెట్టేది మాత్రం వైఎస్సార్‌సీపీ నాయకులను!! వంశీపై అన్యాయంగా కేసులు.. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ.. టీడీపీ ఆఫీస్‌పై దాడి ఘటనలో లేరని ఆ పార్టీకి చెందిన వ్యక్తే కోర్టుకు వచ్చి చెప్పారు. అసలు అక్కడ వంశీ లేడని చెప్పినా.. అన్యాయంగా కేసులో ఇరికించి.. 50 రోజులుగా జైల్లో పెట్టారు.అడుగడుగునా భద్రతా వైఫల్యంరామగిరి మండలంలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన సందర్భంగా పోలీసుల భద్రతా వైఫల్యం మరోసారి బహిర్గతమైంది. ఓ మాజీ సీఎం వచ్చినప్పుడు పోలీ­సులు కనీస భద్రత చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవు­తోంది. మంగళవారం వైఎస్‌ జగన్‌ పర్యటనలో అడుగ­డుగునా భద్రతా లోపాలు కనిపించాయి. వైఎస్‌ జగన్‌ను చూసేందుకు హెలికాప్టర్‌ను చుట్టుముట్టిన భారీ జనసందోహం పాపిరెడ్డిపల్లికి వచ్చే రహదా­రుల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులను అడ్డుకు­నేందుకు ఇచ్చిన ప్రాధాన్యతను పోలీసులు.. జగన్‌ భద్రత విషయంలో చూపకపో­వడం గమనార్హం. హెలిప్యాడ్‌ వద్ద చోటు చేసుకున్న ఘటనే దీనికి నిదర్శనం. తమ అభిమాన నేతను చూసేందుకు వేలాది­మంది హెలిప్యాడ్‌ వద్దకు పోటెత్తారు. జగన్‌ ప్రయాణిస్తున్న హెలి­కా­ప్టర్‌ అక్కడికి చేరుకోగానే జనం తాకిడి అంతకంతకు ఎక్కువైంది. అక్కడ నామమాత్రంగా ఉన్న పోలీసులు వారిని అదుపు చేయలేక చేతులెత్తేశారు. హెలికాప్టర్‌ చుట్టూ జన సందోహం గుమిగూడటంతో చాలాసేపు జగన్‌ బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. అభి­మా­నుల తాకిడితో హెలికాప్టర్‌ విండ్‌ షీల్డ్‌ దెబ్బతింది. దీంతో వీఐపీ భద్రతా కారణాల రీత్యా తిరుగు ప్రయాణంలో ఆయన్ను తీసుకెళ్లలేమని పైలెట్లు స్పష్టం చేశారు. కొద్దిసేపటికి హెలికాప్టర్‌ తిరిగి వెళ్లిపోయింది. జగన్‌ రోడ్డు మార్గంలో బయలుదేరి వెళ్లారు. జగన్‌ పర్యటనల సమయంలో అరకొర పోలీసు భద్రతపై పార్టీ శ్రేణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలు ఉద్దేశపూరితంగానే ఇలా వ్యవహరిస్తున్నారని పేర్కొంటున్నారు.

Dominican Republic Nightclub Roof Collapses2
Dominican Republic: నైట్‌ క్లబ్‌ పైకప్పు కూలి 79 మంది మృతి.. 160 మందికి గాయాలు

సంతో డొమింగో: డొమినికన్ రిపబ్లిక్ రాజధాని సంతో డొమింగోలోని ప్రముఖ జెట్ సెట్ నైట్‌క్లబ్‌(Jet Set Nightclub)లో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. సంగీత కచేరీ జరుగుతుండగా నైట్‌క్లబ్ పైకప్పు అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో 79 మంది వరకు మరణించారని, 160 మందికి పైగా జనం గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ సంగీత కచేరీని వీక్షించేందుకు సుమారు 600 మంది హాజరైనట్లు తెలుస్తోంది.స్థానిక రెస్క్యూ బృందాలు(Rescue teams) అగ్నిమాపక సిబ్బంది, వైద్య బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఘటనలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నదని వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో మరణించిన వారిలో డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన మాజీ బేస్‌బాల్ ఆటగాళ్లు ఎమిలియో బోనిఫాసియో, లూయిస్ రామిరెజ్ కూడా ఉన్నారు. అలాగే ఒక ప్రావిన్స్ గవర్నర్ కూడా ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఈ సంగీత కచేరీకి హాజరైన వారిలో ప్రముఖులు, స్థానిక నేతలు ఉన్నట్లు సమాచారం. 🚨🇩🇴13 DEAD, 93 INJURED IN NIGHTCLUB ROOF COLLAPSE IN THE DOMINICAN REPUBLICThis comes after the roof of the Jet Set nightclub in Santo Domingo, Dominican Republic, collapsed earlier this morning.The national police confirmed the death toll and said search and rescue… pic.twitter.com/yAdkTqw8yX— Mario Nawfal (@MarioNawfal) April 8, 2025నైట్‌ క్లబ్‌ పైకప్పు కూలిపోవడానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. అధిక జనసమూహం కారణంగా భవనంపై ఒత్తిడి పెరిగి పైకప్పు కూలివుండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అధికారులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. నైట్‌క్లబ్ యాజమాన్యంతో పాటు స్థానిక నిర్మాణ అధికారులను ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా(Social media)లో వైరల్ అవుతున్న ఒక వీడియోలో కచేరీ జరుగుతున్న సమయంలో పైకప్పు కూలిన దృశ్యం స్పష్టంగా కనిపిస్తున్నది.ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పైకప్పు కుప్పకూలడం ఆ వీడియోలో రికార్డ్ అయింది. ఈ దృశ్యాలు చూసిన వారు ఘటన తీవ్రతను అర్థం చేసుకోగలుగుతారు. డొమినికన్ రిపబ్లిక్ ప్రభుత్వం ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపింది. ఈ దుర్ఘటన సందర్భంగా దేశవ్యాప్తంగా సంతాప దినం ప్రకటించారు. బాధితులకు సహాయం చేయడానికి అత్యవసర నిధులను కేటాయించారు. ఈ ఘటన అంతర్జాతీయంగానూ చర్చనీయాంశంగా మారింది.ఇది కూడా చదవండి: ఏఐ చేతుల్లో పిల్లల ఎదుగుదల.. ఒడిశాలో శ్రీకారం

China Reacted To Donald Trump 104 tariffs3
ట్రంప్‌ పన్నుల బాదుడు.. చైనా అదిరిపోయే కౌంటర్‌

బీజింగ్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ టారిఫ్‌ చర్యల కారణంగా పలు దేశాల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా చైనా, అమెరికా మధ్య టారిఫ్‌ల యుద్ధమే నడుస్తోంది. అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేసిన బీజింగ్‌పై ట్రంప్‌ ఏకంగా 104శాతం టారిఫ్‌లు విధించారు. దీంతో, ట్రంప్‌ చర్యలపై చైనా ఘాటుగా స్పందించింది.ఈ క్రమంలో అమెరికా విధిస్తున్న పన్నులపై చైనా ప్రీమియర్‌ లీ కియాంగ్‌ తాజాగా స్పందించారు. తాజాగా లీ కియాంగ్ మాట్లాడుతూ..‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పన్నుల పేరుతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారు. ట్రంప్‌ తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలు.. అమెరికా ఏకపక్షవాదం, రక్షణవాదం, ఆర్థికపరంగా బలవంతపు చర్యలకు అద్దం పడుతున్నాయి. దీనిపై మేం చివరివరకు పోరాడతాం. సొంత ప్రయోజనాల కోసమే కాకుండా.. అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను కాపాడేందుకు ప్రయత్నిస్తాం. దీనికి మేం తప్పకుండా ప్రతిస్పందిస్తాం. ఎలాంటి అనిశ్చితులనైనా తట్టుకునేలా మా ఆర్థిక విధానాలను రూపొందించాం. వాణిజ్య భాగస్వాములందరిపైనా ఇలాంటి చర్యలు తీసుకోవడం అమానుషం. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని, తగినవిధంగా బదులిచ్చేందుకు విధానపరంగా అన్ని ఆయుధాలు మా వద్ద ఉన్నాయి’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.ఇదిలా ఉండగా.. ట్రంప్‌ అన్నంత పనీ చేశారు. చైనాపై మరో 50 శాతం అదనపు సుంకాలు విధించారు. అమెరికాపై చైనా 34 శాతం ప్రతీకార సుంకాలపై సోమవారం ఆయన మండిపడటం, మంగళవారం మధ్యాహ్నం లోపు వాటిని వెనక్కు తీసుకోవాలని అల్టీమేటం జారీ చేయడం తెలిసిందే. కానీ మంగళవారం డెడ్‌లైన్‌ ముగిసినా చైనా నుంచి అలాంటి సూచనలేవీ రాకపోవడంతో వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రెటరీ కరోలిన్‌ లెవిట్‌ మీడియా ముందుకొచ్చారు. ‘‘చైనాపై 50 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నాం. ఈ నిర్ణయం బుధవారం నుంచే అమల్లోకి వస్తుంది’’ అని ప్రకటించారు! దాంతో అగ్ర రాజ్యాల టారిఫ్‌ పోరు ముదురు పాకాన పడింది. చైనాపై మార్చిలోనే అమెరికా 20 శాతం సుంకాలు విధించడం, గత వారమే ట్రంప్‌ మరో 34 శాతం బాదడం తెలిసిందే. తాజా 50 శాతంతో కలిపి చైనాపై అమెరికా మొత్తం సుంకాలు ఏకంగా 104 శాతానికి చేరాయి! టారిఫ్‌లపై చైనాతో చర్చలకు చాన్సే లేదని సోమవారమే ట్రంప్‌ బెదిరించిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య పూర్తిస్థాయి వాణిజ్య యుద్ధం తప్పేలా లేదు.

He Was Struggling With Ball: Rahane After LSG Defeat KKR By 4 Runs4
గొప్పగా బ్యాటింగ్‌ చేశాం.. కానీ మా బౌలర్లలో ఆ ఇద్దరు మాత్రం...

ఐపీఎల్‌-2025 (IPL 2025)లో డిఫెండింగ్‌ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR)కు మరో పరాజయం ఎదురైంది. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో నాలుగు పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. సొంత మైదానం ఈడెన్‌ గార్డెన్స్‌లో ఎదురైన ఈ చేదు అనుభవం పట్ల కేకేఆర్‌ కెప్టెన్‌ అజింక్య రహానే (Ajinkya Rahane) తీవ్ర విచారం వ్యక్తం చేశాడు.గొప్పగా బ్యాటింగ్‌ చేశాం..లక్నో చేతిలో ఓటమి అనంతరం స్పందిస్తూ.. ‘‘టాస్‌ సమయంలో నేను చెప్పినట్లుగానే.. ఈ వికెట్‌ 40 ఓవర్లపాటు బ్యాటర్లకు అనుకూలించింది. మేము కూడా మా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాం. ఇదొక గొప్ప మ్యాచ్‌.కానీ చివర్లో విజయానికి మేము కేవలం నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయాం. 230 పరుగులకి పైగా స్కోరును ఛేదించే క్రమంలో కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడం ప్రభావం చూపింది. నిజంగా బ్యాటింగ్‌కు ఇది అత్యుత్తమ పిచ్‌.కానీ మా బౌలర్లలో ఆ ఇద్దరు మాత్రం...నిలదొక్కుకునేందుకు మా బ్యాటర్లు కాస్త ఇబ్బందిపడినా.. తర్వాత కుదురుకున్నారు. మధ్య ఓవర్లలో మా బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేయడంలో సఫలమయ్యారని చెప్పవచ్చు. అయితే, సునిల్‌ నరైన్ బౌలింగ్‌ చేసే సమయంలో ఇబ్బంది పడ్డాడు. నిజానికి మిడిల్‌ ఓవర్లలో సునిల్‌, వరుణ్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేస్తారు. కానీ ఈరోజు మా బౌలర్లకు ఏదీ పెద్దగా కలిసి రాలేదు’’ అని అజింక్య రహానే పేర్కొన్నాడు. బౌలర్లు ఇంకాస్త మెరుగ్గా రాణించి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డాడు.పూరన్‌ వీరంగంకాగా ఈడెన్‌ గార్డెన్స్‌లో మంగళవారం మధ్యాహ్నం నాటి మ్యాచ్‌లో టాస్‌ ఓడిన లక్నో తొలుత బ్యాటింగ్‌ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ నికోలస్‌ పూరన్‌ (36 బంతుల్లో 87 నాటౌట్‌; 7 ఫోర్లు, 8 సిక్స్‌లు), మిచెల్‌ మార్ష్‌ (48 బంతుల్లో 81; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధశతకాలతో చెలరేగారు.మరోవైపు.. మార్క్‌రమ్‌ (28 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం లక్ష్యఛేదనలో కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 234 పరుగులు చేసింది. కేకేఆర్‌ బౌలర్లలో పేసర్‌ హర్షిత్‌ రాణా రెండు, రసెల్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నారు.స్పిన్నర్లు వరుణ్‌ చక్రవర్తి, సునిల్‌ నరైన్‌ మాత్రం ఈసారి పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. వరుణ్‌ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 31 పరుగులు ఇచ్చి వికెట్‌ తీయలేకపోయాడు. మరోవైపు.. నరైన్‌ మూడు ఓవర్ల బౌలింగ్‌లో 38 పరుగులు ఇచ్చుకున్నాడు.కేకేఆర్‌ మెరుపులు సరిపోలేదుఇక లక్ష్య ఛేదనలో కెప్టెన్‌ అజింక్య రహానే (35 బంతుల్లో 61; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్‌ సెంచరీతో మెరవగా... వెంకటేశ్‌ అయ్యర్‌ (29 బంతుల్లో 45; 6 ఫోర్లు, 1 సిక్స్‌), సునీల్‌ నరైన్‌ (13 బంతుల్లో 30; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), రింకూ సింగ్‌ (15 బంతుల్లో 38 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాడినా ఫలితం లేకుండా పోయింది.చదవండి: IPL 2025: ప్రియాన్ష్ విధ్వంస‌క‌ర సెంచ‌రీ.. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే తొలి ప్లేయ‌ర్‌గా GAME ON, courtesy of the skipper 👊🫡Ajinkya Rahane notches up his 2️⃣nd 5️⃣0️⃣ of #TATAIPL 2025! 🙌#KKR need 90 runs in 8 overs.Updates ▶ https://t.co/3bQPKnwPTU#KKRvLSG | @KKRiders | @ajinkyarahane88 pic.twitter.com/1556wwfFfg— IndianPremierLeague (@IPL) April 8, 2025

Ram Charan Peddi Movie AI Video Latest5
రామ్ చరణ్ వీడియో.. ఏది నిజమో తెలియట్లేదు!

రామ్ చరణ్(Ram Charan) ప్రస్తుతం పెద్ది సినిమా చేస్తున్నాడు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకుడు. ఈ మధ్య శ్రీరామనవమి సందర్భంగా సినిమా గ్లింప్స్ రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా బ్యాట్ తో ఉన్న చివరి షాట్.. అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది.సరే ఇదంతా పక్కనబెడితే తాజాగా పెద్ది(Peddi Movie) డైలాగ్ చెబుతున్న చరణ్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఎవరో చెప్పేంతవరకు అది ఏఐ వీడియో అని కనిపెట్టలేం. అంత ఫెర్ఫెక్ట్ గా ఉంది మరి. (ఇదీ చదవండి: అల్లు అర్జున్ కోసం 20 ఏళ్ల కుర్రాడు.. ఎవరీ సాయి?)బ్లాక్ డ్రస్సులో ఉన్న చరణ్.. 'ఒక పని సెసేనాకి.. ఒకే నాక బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడ సేసెయ్యాల.. పుడతామా యేటి మళ్లీ' ‍అని డైలాగ్ చెబుతున్నాడు. చూస్తుంటే ఒరిజినల్ వీడియోలా ఉన్న ఈ ఏఐ వీడియోని చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.చరణ్ సరసన జాన్వీ కపూర్(Janhvi Kapoor) నటిస్తున్న పీరియాడికల్ డ్రామా పెద్ది. వచ్చే మార్చి 27న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేస్తుండటం విశేషం.(ఇదీ చదవండి: దర్శకుడి భార్య బర్త్ డే పార్టీలో ఎన్టీఆర్)AI Mass 🔥🔥#PEDDI pic.twitter.com/KOK3QOzAUW— Mr© 🔥 (@CharanTheLEO) April 8, 2025

India China Should Stand Together Against us Tariffs6
ట్రంప్‌ సుంకాలపై భారత్‌- చైనా కలసి పోరాడాలి: చైనా పిలుపు

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కారు చేపట్టిన సుంకాల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు భారత్‌- చైనా(India-China)లు కలిసి పోరాడాలని భారతదేశంలోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యూ జింగ్ పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం ‘ఎక్స్‌’లో తెలియజేశారు. ‘చైనా-భారత్‌ల ఆర్థిక, వాణిజ్య సంబంధాలు పరస్పర ప్రయోజనాలపై(Mutual benefits) ఆధారపడి ఉన్నాయి. తాజాగా అమెరికా అనుసరిస్తున్న సుంకాల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు ప్రపంచంలోని రెండు అతిపెద్ద, అభివృద్ధి చెందుతున్న దేశాలు(భారత్‌-చైనా) కలిసి పోరాడాలని, ఈ కష్టాలను అధిగమించాలని అని యూ జింగ్ పేర్కొన్నారు. చైనా నుంచి వచ్చిన ఈ పిలుపు అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో రావడం విశేషం.అమెరికా అధ్యక్షుడు ట్రంప్(US President Trump) ఏప్రిల్ 7న చైనాపై 104 శాతం సుంకాలను విధిస్తామని ప్రకటించారు. ఇవి ఏప్రిల్ 9 నుండి అమలులోకి రానున్నాయి. దీనికి ప్రతిగా చైనా కూడా అమెరికా వస్తువులపై 34 శాతం అదనపు సుంకాలను విధించింది. ఈ సుంకాల యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా తాజాగా చైనా.. భారత్‌కు ఈ ప్రతిపాదన చేయడానికి కారణం భారతదేశం- చైనా రెండూ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా విధిస్తున్న ఏకపక్ష సుంకాల నుండి రక్షణ పొందేందుకు పరస్పర సహకారాన్ని ఆశిస్తూ చైనా ఈ విజ్ఞప్తి చేసివుండవచ్చు.అయితే భారత్‌.. చైనా పిలుపుపై ఇంకా అధికారికంగా స్పందించలేదు. భారతదేశం ప్రస్తుతం అమెరికాతో వాణిజ్య ఒప్పంద చర్చల్లో ఉంది. ట్రంప్ విధించిన 26 శాతం సుంకాలకు ప్రతీకార సుంకాలు విధించకూడదని నిర్ణయించిందని తెలుస్తోంది. అలాగే భారతదేశం అమెరికా నుండి వచ్చే 23 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులపై సుంకాలను తగ్గించే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. అయితే చైనా.. భారతదేశాన్ని తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు, సరిహద్దు వివాదాలు ఉన్నప్పటికీ, ఈ సుంకాల సమస్యపై సహకారం ఇరు దేశాలకూ ప్రయోజనం చేకూర్చవచ్చని చైనా వాదిస్తోంది. ఒకవేళ భారత్‌ ఈ ప్రతిపాదన దిశగా యోచిస్తే, అది ప్రపంచ వాణిజ్య రాజకీయాల్లో కొత్త మలుపు తీసుకురావచ్చు.ఇది ‍కూడా చదవండి: Dominican Republic: నైట్‌ క్లబ్‌ పైకప్పు కూలి 79 మంది మృతి.. 160 మందికి గాయాలు

India mobile phone exports crossing Rs 2 lakh cr7
మొబైల్‌ ఎగుమతులు రూ.2 లక్షల కోట్లు.. అధిక వాటా ఈ బ్రాండ్‌దే..

గత ఆర్థిక సంవత్సరంలో మొబైల్‌ ఫోన్ల ఎగుమతులు రూ.2 లక్షల కోట్ల మార్కును దాటాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. ఇందులో రూ.1.5 లక్షల కోట్ల వాటా యాపిల్‌ ఐఫోన్లదే ఉన్నట్లు వివరించారు. 2023–24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు 54 శాతం పెరిగినట్లు వివరించారు.గత పదేళ్లలో దేశీయంగా ఎల్రక్టానిక్స్‌ తయారీ అయిదు రెట్లు, ఎగుమతులు ఆరు రెట్లు పెరిగినట్లు వైష్ణవ్‌ చెప్పారు. వివిధ పరికరాలు తయారు చేసే చిన్నా, పెద్ద సంస్థలన్నీ కలిపి 400 పైగా ప్రొడక్షన్‌ యూనిట్లు ఉన్నట్లు వివరించారు. ఎల్రక్టానిక్‌ కాంపోనెంట్‌ మాన్యుఫాక్చరింగ్‌ స్కీమ్‌ను ఆయన ఆవిష్కరించారు. దీని కింద ఏప్రిల్‌ 1 నుంచి ఆరేళ్ల పాటు ప్రోత్సాహకాలు లభిస్తాయని వైష్ణవ్‌ తెలిపారు. టర్నోవరు ఆధారిత ప్రోత్సాహకాల లెక్కింపునకు 2024–25 ఆర్థిక సంవత్సరం బేస్‌ ఇయర్‌గా ఉంటుందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: నాలుగు ఐపీవోలకు సెబీ ఓకేకన్జూమర్‌ ఎల్రక్టానిక్స్, మెడికల్‌ ఎల్రక్టానిక్స్, పవర్‌ ఎల్రక్టానిక్స్, ఆటోమొబైల్స్‌ తదితర ప్రతి టెక్నాలజీ ప్రోడక్టుల్లో ఉపయోగించే ఎల్రక్టానిక్‌ పరికరాలన్నింటికి ఈ పథకం వర్తిస్తుందన్నారు. రెసిస్టర్లు, కెపాసిటర్లు, ఫెరైట్లు, స్పెషాలిటీ సెరామిక్స్, కాయిల్స్‌ మొదలైనవి ఈ జాబితాలో ఉంటాయి. టర్నోవరు ఆధారిత ప్రోత్సాహకాల కోసం కంపెనీలు రూ. 10 కోట్ల నుంచి రూ. 1,000 కోట్ల వరకు ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. ప్రోత్సాహకాలు 1 నుంచి 10 శాతం వరకు ఉంటుంది.

Indian Shruti Chaturvedi Detained At Alaska Airport8
అమెరికాలో భారతీయురాలికి చేదు అనుభవం

వాషింగ్టన్‌: విదేశీ పర్యాటకులతో తరచూ అనుమాన, అవమానకర రీతిలో ప్రవర్తించిన అమెరికా దర్యాప్తు అధికారులు మరోమారు తమ బుద్ధిచూపించారు. వ్యాపార, వ్యక్తిగత పర్యటన నిమిత్తం అమెరికాలో పర్యటిస్తున్న భారతీయ యువపారిశ్రామికవేత్త శ్రుతి చతుర్వేది పట్ల అలాస్కాలోని యాంకరేజ్‌ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు, ఎఫ్‌బీఐ అధికారులు అనుచితంగా ప్రవర్తించారు. మహిళ అని కూడా చూడకుండా పురుష ఆఫీసర్‌తో ‘వ్యక్తిగత’తనిఖీలు చేయించారు. చలివాతా వరణంలో వెచ్చదనం కోసం ధరించిన అదన పు దుస్తులను విప్పించారు. కనీసం బాత్రూమ్‌కు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఏకధాటిగా 8 గంటలపాటు తమ అ«దీనంలో నిర్బంధించి పలురకాల ప్రశ్నలతో వేధించారు. కనీసం సాయంకోసం ఎవరికీ ఫోన్‌చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. ఎయిర్‌పోర్ట్‌లో తనకు జరిగిన అవమానాన్ని శ్రుతి తర్వాత భారత్‌కు చేరుకున్నాక ‘ఎక్స్‌’సామాజిక మాధ్యమంలోని తన ఖాతాలో పోస్ట్‌చేశారు.పవర్‌ బ్యాంక్‌పై అనుమానంతో.. ‘‘ఎయిర్‌పోర్ట్‌కు వచ్చినప్పుడు నా హ్యాండ్‌బ్యాగ్‌లో స్మార్ట్‌ఫోన్‌ పవర్‌బ్యాంక్‌ ఉంది. అదేదో కొత్తరకం వస్తువు అన్నట్లు దానిని పోలీసులు అనుమానంగా చూశారు. వెంటనే ఎఫ్‌బీఐ అధికారులను రప్పించి తనిఖీలు చేయించారు. తర్వాత నన్ను ఇష్టమొచ్చినట్లు, అర్థంపర్థంలేని ప్రశ్నలతో వేధించారు. వాస్తవానికి మహిళా ఆఫీసర్‌కు తనిఖీలు చేయాల్సిఉన్నా ఒక పురుష అధికారి వచ్చి నన్ను తనిఖీలు చేశాడు. విపరీతమైన చలికారణంగా ధరించిన వెచ్చటి దుస్తులను విప్పించాడు. ఏకధాటిగా 8 గంటలపాటు ఎటూ వెళ్లనివ్వలేదు. కనీసం బాత్రూమ్‌కు కూడా పోనివ్వలేదు. సాయం కోసం ఎవరికైనా ఫోన్‌ చేసుకోవడానికి వీల్లేకుండా ఫోన్, మనీ పర్సు లాక్కున్నారు. అన్ని రకాల తనిఖీలు చేసి చివరకు ఏమీ లేవని నిర్ధారించుకుని వదిలేశారు. నా ఖరీదైన లగేజీ బ్యాగ్‌ను వాళ్లే అట్టిపెట్టుకున్నారు. నా వస్తువులను బయటకుతీసి నాసిరకం వేరే బ్యాగులో కుక్కి ఇచ్చారు. భారత్‌కు ఆవల ఉన్నప్పుడు భారతీయులు శక్తిహీనులు అన్నట్లు అమెరికా పోలీసులు, ఎఫ్‌బీఐ అధికారులు ప్రవర్తించారు’’అని శ్రుతి ఆ పోస్ట్‌లో రాసుకొచ్చారు. తన పోస్ట్‌ను భారత విదేశాంగ మంత్రి జైశంకర్, విదేశాంగ శాఖకు ట్యాగ్‌ చేశారు. ‘ఇండియా యాక్షన్‌ ప్రాజెక్ట్‌’, చర్చా వేదిక అయిన ‘ఛాయ్‌పానీ’లను శ్రుతి స్థాపించారు. మహిళను గంటల తరబడి అమెరికా అధికారులు వేధించడంపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. 🛑 Shruti Chaturvedi, an entrepreneur from India🇮🇳, was held for eight hours at a US airport because of a power bank in her luggage that was deemed suspicious.#Ukraine #ShrutiChaturvedi #USA #Entrepreneur pic.twitter.com/2lrKWXRzPR— Dainik Shamtak Samachar (@DainikShaamTak) April 8, 2025

Telangana SOT Police Raids On Moinabad Farm House9
HYD: ఫామ్‌ హౌస్‌లో ముజ్రా పార్టీ.. ఏడుగురు అమ్మాయిలతో..

సాక్షి, రంగారెడ్డి: మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ముజ్రా పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఈ దాడుల సందర్భంగా ఫామ్‌ హౌస్‌లో ఏడుగురు యువతులు, 14 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసుల తెలిపారు.వివరాల ప్రకారం.. మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ముజ్రా పార్టీ జరుగుతుందన్న సమాచారంతో ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేశారు.ఏతబర్ పల్లి గ్రామ శివారులోని హాలీడే ఫార్మ్ హౌస్‌లో పుట్టినరోజు వేడుకల పేరుతో ముజ్రా పార్టీ జరిపారు. పార్టీ కోసం నిర్వాహకుడు ముంబై నుంచి యువతులను ఇక్కడికి తీసుకు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులు కూడా ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలో దాడుల్లో భాగంగా.. ఏడుగురు యువతులు, 14 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి నుంచి భారీగా మద్యం, హుక్కా, గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

Donlad Trump administration food aid cuts millions at risk10
ట్రంప్‌ సంచలన నిర్ణయం.. లక్షలాది మందికి మరణశాసనం

రోమ్‌: లక్షలాది మందికి ఆహార సాయాన్ని నిలిపేస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రాం (డబ్ల్యూఎఫ్‌పీ) తీవ్రంగా తప్పుబట్టింది. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆకలితో అలమటిస్తున్న లక్షలాది మంది పాలిన మరణశాసనంగా అభివర్ణించింది. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సోమవారం విజ్ఞప్తి చేసింది. ప్రాణాలను కాపాడే కార్యక్రమాలకు నిరంతరం మద్దతివ్వాలని కోరేందుకు ట్రంప్‌ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు వెల్లడించింది.అఫ్గానిస్తాన్, సిరియా, యెమన్, మరో 11 పేద దేశాల్లో లక్షలాది మంది అన్నార్తులకు సాయపడే యూఎస్‌ వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రాం అత్యవసర కార్యక్రమాలకు ట్రంప్‌ ప్రభుత్వం నిధులను నిలిపేయడం తెలిసిందే. ఎలాన్‌ మస్క్‌ డోజ్‌లో టాప్‌ లెఫ్టినెంట్‌ జెరెమీ లెవిన్‌ ఆదేశాల మేరకు వాటికి నిధుల కేటాయింపును రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. అత్యవసర ఆహార కార్యక్రమాలకు సాయాన్ని కోతల నుంచి మినహాయిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఇతర ఉన్నతాధికారులు హామీ ఇచ్చినా లాభం లేకపోయింది.ట్రంప్‌ టార్గెట్‌ చేసిన కార్యక్రమాలు 13 ఏళ్ల అంతర్యుద్ధం, ఇస్లామిక్‌ స్టేట్‌ గ్రూపు తిరుగుబాటు తర్వాత సిరియా పేదరికం, ఆకలి, అభద్రతతో సతమతమవుతోంది. ఆ దేశానికి తాజాగా 23 కోట్ల డాలర్ల ఒప్పందాలను అమెరికా రద్దు చేసింది. ఇక ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన మానవీయ విపత్తును ఎదుర్కొంటున్న యెమన్‌లో డబ్ల్యూఎఫ్‌పీ ఆహార కార్యక్రమాలకు సాయం నిలిపేసింది. సిరియా శరణార్థులు తీవ్రంగా ప్రభావితమయ్యే లెబనాన్, జోర్డాన్లలో కార్యక్రమాలూ పడకేశాయి.సోమాలియా, అఫ్గాన్, జింబాబ్వేల్లో యుద్ధాలతో నిరాశ్రయులైన వారికి జలకు ఆహారం, నీరు, వైద్య సంరక్షణ, ఆశ్రయం వంటి కార్యక్రమాలు కూడా ప్రభావితమయ్యాయి. అఫ్గాన్‌కు మానవతా సహాయంలో అమెరికా 56 కోట్ల డాలర్లు కోత పెట్టింది. తాలిబన్‌ ఆంక్షల వల్ల విదేశాల్లో చదువుతున్న అఫ్గాన్‌ యువతులకు అందించే సాయాన్ని శుక్రవారం నిలిపేసింది. అమెరికా కోతలతో ప్రపంచవ్యాప్తంగా ఇలా సుమారు 1,000కి పైగా కార్యక్రమాలు నిలిచిపోయాయి. 5,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించారు. డబ్ల్యూఎఫ్‌పీకి గతేడాది అందిన 980 కోట్ల డాలర్ల విరాళాల్లో 450 కోట్లు అమెరికా ఇచ్చినవే! 🚨 US emergency food aid cuts by the Trump administration threaten millions in 14 countries, warns the UN. Despite earlier pledges to protect aid, these cuts put vulnerable communities at risk. 🔵 Calls for urgent action to restore funding. #UN #FoodAid #GlobalCrisis pic.twitter.com/EGLNbz8D8n— Thomas MORE (@ThomaMore) April 8, 2025వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ​్‌(డబ్ల్యూఎఫ్‌పీ) 2025 లెక్కల ప్రకారం పలు దేశాల సాయం ఇలా ఉంది. అమెరికా.. మూడు బిలియన్ డాలర్లు కాగా, జర్మనీ.. ఒక్క బిలియన్‌ డాలర్లు. యూకే, యూరోపియన్‌ కమిషన్‌, ప్రైవేటు డోనార్స్‌ ఉన్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement