Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan Shocking Comments On TDP Government In PAC Meeting1
పోలీసు కేసులు ప్రజాదరణను దూరం చేయలేవు!

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఒక వ్యాఖ్య చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఏమవుతుందని ప్రశ్నించారు. జైలుకు పంపినంత మాత్రాన ప్రజా వ్యతిరేకతను అణచి వేయలేరని ఆయన స్పష్టం చేశారు. గతంలో తనను 16 నెలలు జైలులో పెట్టారని, పార్టీని నడిపే పరిస్థితి లేకుండా చేశారని, అయినా ప్రజలు ఆశీర్వదించారని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రతి గ్రామంలో పార్టీ ఉందని, ఎన్ని కేసులు పెడితే ప్రజలు అంత తీవ్రంగా స్పందిస్తారని పేర్కొన్నారు. జగన్ వ్యాఖ్యలు హేతుబద్దమైనవి. మద్యం కేసుతో పాటు సీనియర్ పోలీసు అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును అరెస్టు చేయడంపై ఆయన స్పందించారు. ఒక్కసారి గతంలోకి వెళితే 2011లో జగన్ కాంగ్రెస్ ఎంపీగా ఉండే వారు. తండ్రి మరణం తర్వాత జరిగిన పరిణామాలలో ఆయన సొంతంగా పార్టీని స్థాపించుకోవాలని నిర్ణయించుకుని పదవికి రాజీనామా చేశారు. కడప లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో 5.45 లక్షల ఓట్ల అధిక్యతతో విజయం సాధించి జగన్ సంచలనం సృష్టించారు. అప్పుడు కూడా కాంగ్రెస్, టీడీపీలు కలిసే కుట్ర చేశాయి. జగన్‌ను ప్రజా క్షేత్రంలో ఓడించాలేమన్న భయంతో చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఏపీలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై వచ్చిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వకుండా తటస్థంగా వ్యవహరించి కాంగ్రెస్‌కు అండగా నిలిచారు. ఆ తర్వాత జగన్ కంపెనీలతో సంబంధం లేని కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకరరావుతో హైకోర్టులో ఫిర్యాదు చేయించడం, దానికి టీడీపీ మద్దతివ్వడం, ఆ వెంటనే హైకోర్టు ఆ కేసును సీబీఐకి అప్పగించడం జరిగిపోయాయి.తదుపరి సీబీఐ కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు ముఖ్యంగా సోనియాగాంధీ ఆదేశాల ప్రకారం వ్యవహరించి జగన్‌ను జైలులో పెట్టింది. బెయిల్ రాకుండా కూడా అడ్డుపడ్డారు. చివరికి 16 నెలల తర్వాత బెయిల్ లభించింది. అయినా ఆయన రాజకీయంగా నిలబడ్డారు. జైలులో ఉన్నప్పుడు జరిగిన 18 ఉప ఎన్నికలలో 15 చోట్ల జగన్ పార్టీ విజయ దుంధుభి మొగించింది. ఆ అనుభవాలను మననం చేసుకుంటే సరిగ్గా అదే రీతిలో ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వైసీపీ నేతలపై, కొందరు అధికారులపై కేసులు పెడుతున్నట్లు కనిపిస్తుంది. కూటమి అధికారంలోకి రాగానే రాజకీయ ముద్ర వేసి కొందరు అధికారులను సస్పెండ్ చేయడం చేశారు. పోస్టింగులు ఇవ్వకుండా వేధించారు. ఒక మోసకారి నటిని పట్టుకు వచ్చి పోలీసు ఉన్నతాధికారిపై కేసు పెట్టించి, తదుపరి ఆయనను జైలులో పెట్టారు. మరో వైపు అనేక మంది వైసీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెడుతూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఇందు కోసం కొందరు రిటైర్డ్ పోలీసు అధికారులను కూడా ఉపయోగించుకుంటున్నారని చెబుతారు. ఆ తర్వాత తమ రెడ్‌బుక్‌ను పై స్థాయికి తీసుకు రావడానికి ప్రయత్నాలు ఆరంభించారు. దీనికి తగ్గట్లే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో కూడా ఈ కేసుపై చర్చించారని అనుకోవాలి. పైకి పోలవరం-బనకచర్ల తదితర అంశాలపై షా ను కలిసినట్లు ఎల్లో మీడియాలో వార్తలు రాయించుకున్నారు. ఆ పత్రికలలోనే జగన్‌పై మద్యం కేసు విషయంపై కూడా మాట్లాడారని తెలిపారు. అంటే గతంలో కాంగ్రెస్‌తో కుమ్మక్కై పెట్టినట్లుగానే, ఈసారి బీజేపీతో ఒప్పందమై ఇలాంటిదేదో చేయాలని చూస్తున్నట్లు ఉన్నారు.2014 టర్మ్‌లో బీజేపీతో పొత్తులో ఉన్నపుడు ప్రధాని మోడీని చంద్రబాబు కలిసినప్పుడల్లా కేవలం జగన్ కేసులపై ఏదో ఒకటి చేయాలని కోరుతుండేవారని, అప్పటి బీజేపీ అధ్యక్షుడు, ఇప్పటి టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆ రోజుల్లో పలుమార్లు చెప్పేవారు. అదే తరహాలో ఇప్పుడు కూడా బీజేపీ పెద్దలతో సంప్రదించి తన కుట్ర ప్లాన్ అమలు చేయాలని తలపెట్టినట్లు అనుమానాలు వస్తున్నాయి. జగన్ పై 2011 లో పెట్టిన కేసులు ఏమిటి? ఆయన కంపెనీలలో కొందరు పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టారని అందులో క్విడ్ ప్రోక్ జరిగిందని సీబీఐ ఆరోపించింది. అయితే ఇందుకు సంబంధించిన ఏ కంపెనీ కూడా జగన్‌పై ఫిర్యాదు చేయలేదు. అలాగే ప్రభుత్వం, మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలతో జగన్‌కు సంబంధం లేదు. అయినా తన కంపెనీలు ఏర్పాటైన మూడేళ్ల తర్వాత కక్షపూరితంగా కేసులు పెట్టారు. ఇప్పుడు కూడా అదే మోడల్ కనిపిస్తుంది. మద్యం కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని ఏ డిస్టిలరీ ఫిర్యాదు చేయలేదు. ఎవరో దారినపోయే వ్యక్తి లెటర్ రాయడం, ఆ వెంటనే దానిపై ప్రభుత్వ కార్యదర్శి ఏసీబీ విచారణకు విచారించాలని పంపడం, తదుపరి ఆగమేఘాల మీద కేసు పెట్టడం అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసు దర్యాప్తులో సిట్ అధికారులు బెవరేజెస్ కార్పొరేషన్ అధికారులను బెదిరించి వాంగ్మూలాలను తీసుకోవడం, వారు హైకోర్టును ఆశ్రయించడం, ఆ తర్వాత వేధింపులు తట్టుకోలేక పోలీసు అధికారులు కోరిన స్టేట్మెంట్ పై సంతకాలు చేశారట. తదుపరి మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డిని ఒక పావుగా వాడుకున్నట్లు అనిపిస్తుంది. ఆయన తనకేదో దీని నుంచి రక్షణ కలుగుతుందని అనుకున్నారో ,ఏమో కాని, రాజ్ కెసిరెడ్డి అన్న మాజీ ఐటి సలహాదారుపై ఆరోపణలు చేశారు.దాంతో విజయసాయిని అదుపులోకి తీసుకోకుండా సిట్ బృందం వదలి వేసింది. ఆ తర్వాత సుప్రీం కోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందిన ఎంపీ మిథున్‌ రెడ్డిని విచారించారు. ఆయన తన వాదన చాలా స్పస్టంగా వినిపించగలిగారు. ఆధారాలు ఉంటే కోర్టులో రుజువు చేయండని సవాల్ చేశారు. తమ కుటుంబంపై చంద్రబాబు కాని, ఎల్లో మీడియా కాని పగపట్టి ఇటీవలి కాలంలో ప్రచారం చేసిన ఉదంతాలను ఆయన మీడియా ముందు ప్రస్తావించి వాటిలో ఒక్కదానిని కూడా నిరూపించలేకపోయిన విషయాన్ని తెలిపారు. ఆ తర్వాత గోవా నుంచి హైదరాబాద్ వచ్చిన రాజ్ కెసిరెడ్డిని హడావుడిగా అదుపులోకి తీసుకున్నారు. ఎల్లో మీడియాలో ఆయనపై పలు కథనాలు రాయించారు. గోవా నుంచి హైదరాబాద్ వచ్చి, అక్కడ నుంచి చెన్నై ద్వారా విదేశాలకు వెళ్లాలని ఆయన ప్లాన్ చేశారని అర్థం, పర్థం లేని రాతలు రాశారు. నిజంగానే అలా వెళ్లదలిస్తే నేరుగా గోవా నుంచో, లేక దగ్గరలో ఉన్న ముంబై, లేదా చెన్నై వెళ్లి విదేశాలకు పోయి ఉండవచ్చు కదా అన్న ప్రశ్నకు జవాబు దొరకదు. కెసిరెడ్డిని విచారించిన సందర్భంలో కూడా పలు పరస్పర విరుద్దమైన అంశాలను సిట్ రిమాండ్ రిపోర్టులో కనిపించాయి. ఒకసారి ఆయన సీఎంఓ అధికారులకు మద్యం డబ్బు చేరవేసినట్లు, మరోసారి ఆయనే ఆయా కంపెనీలలో పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారట. నాలుగు డిస్టిలరీల నుంచే మద్యం ఎక్కువగా తీసుకోవడంపై రిమాండ్ రిపోర్టులో సందేహం వ్యక్తం చేశారు. మరి అదే తరహాలో చంద్రబాబు ప్రభుత్వంలోను జరిగింది కదా అన్నదానికి రిప్లై లేదు.అన్నిటికి మించి రిమాండ్ రిపోర్టుపై రాజ్ సంతకం పెట్టడానికి నిరాకరించారని కూడా సిట్ తెలియ చేసింది. అలాంటప్పుడు ఆ రిపోర్టుకు ఎంత విలువ ఉంటుంది? కేవలం ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియాలో బానర్లు పెట్టుకుని ఆనందపడడానికి తప్ప. జగన్ పేరేదో ఆయన నేరుగా చెప్పారన్నట్లుగా ప్రచారం చేసిన ఈ మీడియా దానిపై రాజ్ సంతకం లేదన్న అంశానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా జాగ్రత్తపడింది. అంటే దీనర్థం ఏదో రకంగా జగన్‌ను జనంలో పలచన చేయడం ద్వారా ప్రజలు ఆ అంశంపై చర్చించుకుంటూ, చంద్రబాబు అండ్ కో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను మర్చిపోవాలనే కదా! మరో సంగతి చెప్పాలి. విజయసాయి తననేదో వదలి వేస్తారని అనుకున్నట్లు ఉన్నారు. రాజ్ అరెస్టు కాగానే ఆయన ఒక కామెంట్ చేశారట. దొరికిన దొంగలు, దొరకని దొంగలు అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆయన కూడా నిందితుడే అయినందున ఏ తరహా కిందకు వస్తారో తేల్చుకోవాలి. ఒకటి మాత్రం వాస్తవం. ప్రజలలో కూటమి సర్కార్ పై విపరీతమైన వ్యతిరేకత కనిపిస్తోంది. అదే టైమ్‌లో జగన్ ఎక్కడకు వెళ్లిన వేల సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. అంటే భవిష్యత్తులో తన పార్టీకి, తన వారసులకు జగన్ పెద్ద బెడద అవుతారని చంద్రబాబు భయపడుతున్నారు. అందుకే ఈ రకమైన కక్ష రాజకీయాలు చేస్తున్నారు.అమిత్ షా తో కూడా ఇదే అంశంపై మాట్లాడడానికి ఢిల్లీ వెళ్లారంటే ఆయనకు ప్రజలకు ఇచ్చిన హామీలకన్నా, జగన్‌ను ఎలాగొలా ఇబ్బంది పెట్టాలన్న లక్ష్యం ఉన్నట్లు అర్థం అవుతోంది కదా! ఇవన్ని గమనించిన తర్వాత జగన్ పీఏసీ సమావేశంలో మాట్లాడినట్లు ఆయన కాని, వైసీపీ శ్రేణులు కాని అన్నిటికి సిధ్దమైనట్ల స్పష్టం అవుతోంది కదా! ఇదే చంద్రబాబుకు అతి పెద్ద సవాల్!- కొమ్మినేని శ్రీనివాస రావు సీనియర్‌ జర్నలిస్టు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Indian Forces operation kagar karreguttalu Full Details2
కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్‌.. 38 మంది మావోయిస్టులు మృతి!

సాక్షి, ములుగు: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు కర్రెగుట్టల్లో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఐదో రోజు కూంబింగ్‌లో భాగంగా మావోయిస్టులకు భారీ షాక్‌ తగిలింది. భద్రతా బలగాల ఆపరేషన్‌లో ఛత్తీస్‌గఢ్‌వైపు భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో 38 మంది మావోయిస్టులు మృతిచెందినట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు దూసుకెళ్తున్నాయి. ఐదో రోజులుగా కూంబింగ్‌ కొనసాగుతోంది. బలగాలకు దిశానిర్దేశం చేస్తూ గగనతలంలో హెలికాప్టర్లు, డ్రోన్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో శనివారం దాడుల్లో భాగంగా 38 మంది మావోయిస్టులు మృతిచెందినట్టు సమాచారం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.ఇదిలా ఉండగా.. శుక్రవారం తుపాకులు, బాంబుల శబ్దాలు మారుమోగాయి. ఉదయం ఏడు గంటల నుంచే నాలుగు వైమానిక దళ హెలికాప్టర్లు చక్కర్లు కొట్టినట్టు స్థానికులు చెబుతున్నారు. గత రాత్రి 10 గంటల వరకు భారీ కాల్పులు, బాంబు పేలుళ్ల శబ్దాలు వినిపించాయని అన్నారు. దీంతో, సమీప గ్రామాల ప్రజల్లో ఆందోళన చెందుతున్నారు.మరోవైపు.. కూంబింగ్‌లో నిమగ్నమైన జవాన్లు ఎండల బారినపడుతున్నారు. నాలుగు రోజులుగా అడవుల్లోనే మకాం వేయడంతో ఇప్పటికే 15 మంది అస్వస్థతకు గురికాగా, శుక్రవారం మరో ఐదుగురిని హెలికాప్టర్‌లో వెంకటాపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ముగ్గురిని మెరుగైన చికిత్సకు భద్రాచలం తరలించారు. ఆపరేషన్‌ కర్రెగుట్టల గాలింపుతో అభయారణ్యం పరిసర గ్రామాల్లో జవాన్లు ఆంక్షలను విధించడం చర్చనీయాంశంగా మారింది. సమీప వ్యవసాయ క్షేత్రాలు, నీటి నిల్వ ప్రాంతాలకు వెళ్లినా హెచ్చరిస్తున్నట్లు ప్రజలు పేర్కొంటున్నారు.ఇక, తెలంగాణ, చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో కొనసాగుతున్న కర్రెగుట్ట ఆపరేషన్ ను వెంటనే ఆపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మావోయిస్టులు లేఖ రాశారు. తక్షణమే ఆ ఆపరేషన్ ఆపి శాంతి చర్చలకు ముందుకు రావాలని మావోయిస్టులు విజ‍్క్షప్తి చేశారు. మావోయిస్టు బస్తర్ ఇంచార్జి రూపేష్ పేరిట ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. తెలంగాణ సరిహద్దుల్లో కొనసాగుతున్న సైనిక ఆపరేషన్ ను వెంటనే ఆపాలని ఆ లేఖలో విజ‍్క్షప్తి చేశారు.గత కొంతకాలం నుంచి మావోయిస్టుల, కేంద్ర ప్రభుత్వం మధ్య శాంతి చర్చలు జరగాలనే డిమాండ్ వినిపిస్తోంది. దీనికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి మావోయిస్టులో శాంతి చర్చలు జరపాలని ఏఐటీయూసీ కోరుతోంది. దీనిలో భాగంగా ఈనెల రెండో వారంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం, మావోయిస్టులు శాంతి చర్చలు జరుపుకోవాలని భేషరతుగా ఎదురు కాల్పులు విరమించుకోవాలని సూచించారు. అయితే తాజాగా మావోయిస్టులు.. ఈ మేరకు లేఖ రాశారు. తమతో శాంతి చర్చలు జరపడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలన్నారు.

Homes of suspected Pahalgam Terror attackers demolished in Jammu3
ఇండియన్‌ ఆర్మీ ఆన్‌ ఫైర్‌.. కశ్మీరీ ఉగ్రవాదుల ఇళ్లు నేలమట్టం

శ్రీనగర్‌: పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత భద్రతా బలగాలు ప్రతీకార చర్యలను కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో.. శుక్రవారం ఐదుగురు కశ్మీరీ ఉగ్రవాదుల ఇళ్లను అధికారులు నేలమట్టం చేశారు. సోఫియాన్‌, కుల్గాం, పుల్వామా జిల్లాల్లో.. కశ్మీరి ఎల్‌ఈటీ ఆపరేటివ్స్‌పై ఉక్కుపాదం మోపే క్రమంలోనే సైన్యం ఈ చర్యలకు ఉపక్రమించింది.పుల్వామాలో ఎసాన్‌ ఉల్ హక్‌, షోపియాన్‌లోని చోటీపోరాలోని షాహిద్‌ అహ్మద్‌ , కుల్గాంలో జకీర్‌ గని ఇళ్లు బుల్డోజర్‌, పేలుడు పదార్థాల సాయంతో నేలమట్టం చేశారు. సోషియాన్‌లో చోటిపోరా గ్రామంలో ఎల్‌టీ కమాండర్‌ షాహిద్‌ అహ్మద్‌ కుట్టే నివాసానికి బుల్డోజర్‌ సాయంతో నేలమట్టం చేసినట్లు సమాచారం. షాహిద్‌ అహ్మద్‌ గత నాలుగు ఏళ్లుగా జమ్ములో జాతి వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతున్నాడు. కుల్గాంలోని మటలం ఏరియాలో జహిద్‌ అహ్మద్‌(జకీర్‌ గని) నివాసాన్ని కూల్చేశారు. #BreakingNews : The house of LeT militant Shahid Ahmad, Kuty resident of #Chotipora #Shopian active since 2022 , was destroyed in a blast in Chotipora area of Shopian. pic.twitter.com/DT79ZJ7vxb— The Lal Chowk Journal (@LalChowkJournal) April 26, 2025పుల్వామా ముర్రాన్‌ ప్రాంతంలో ఎషన్‌ ఉల్‌ హక్‌ ఇంటిని పేలుడు పదార్థాలతో నేలమట్టం చేశారు. 2018 నుంచి పాక్‌లో ఉగ్రశిక్షణలో ఉన్న అషన్‌.. ఈ మధ్యే తిరిగి కశ్మీర్‌లో అడుగు పెట్టినట్లు నిఘా వర్గాల సమాచారం. ఎల్‌ఈటీ ఉగ్రవాది ఇషాన్‌ అహ్మద్‌ షేక్‌కు సంబంధించిన రెండంతస్తుల భవనాన్ని కూడా నేలమట్టం చేశారు. ఇక.. పుల్వామా కాచిపోరా ప్రాంతంలో హరిస్‌ అహ్మద్‌ అనే ఉగ్రవాది ఇంటిని అధికారులు పేలుడుతో కుప్పకూల్చారు.ఇదిలా ఉంటే.. అంతకుముందు జమ్ము కశ్మీర్‌ లోకల్‌ టెర్రరిస్టులు ఆసిఫ్‌ షేక్‌, అదిల్ మహమ్మద్‌ ఇళ్లను తనిఖీలు చేసిన టైంలో.. అందులో అమర్చిన పేలుడు పదార్థాల ధాటికి ఇద్దరి ఇళ్లు పాక్షికంగా నేలమట్టం అయ్యాయి. ఇది సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని ఆ ఇద్దరి చేసిన ప్లాన్‌గా భారత బలగాలు భావిస్తున్నాయి.ఇక.. అసిఫ్‌ షేక్‌ సోదరి మీడియాతో మాట్లాడుతూ.. తన సోదరుడు ముజాహుద్దీన్‌ అని వ్యాఖ్యానించారు. పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ఆసిఫ్‌ సోదరితమ ఇల్లు నేలమట్టం కావడంతో.. ప్రస్తుతం ఆమె బంధువుల ఇంట్లో ఆశ్రయం పొందుతోందట. ఇక అసిఫ​ మరో సోదరుడు ప్రస్తుతం జైలులో ఉన్నట్లు వెల్లడించింది ఆమె.

Break All Cricket Ties With Pakistan: Sourav Ganguly Blunt After Pahalgam Incident4
జోక్‌ కాదు.. పాక్‌ క్రికెట్‌తో సంబంధాలన్నీ తెంచుకోండి: గంగూలీ

పహల్గామ్‌ ఉగ్రదాడి నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ (Sourav Ganguly) కీలక వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్‌ క్రికెట్‌తో సంబంధాలన్నీ తెంచుకోవాలని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI)కి సూచించాడు. కాగా జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు మంగళవారం పాశవిక దాడికి తెగబడిన విషయం తెలిసిందే.ప్రశాంతమైన బైసరన్‌ లోయలో 26 మంది పర్యాటకులను లష్కర్‌-ఎ-తొయిబా ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ క్రమంలో భారత్‌- పాక్‌ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. 2008 తర్వాత టీమిండియా ఒక్కసారి కూడా పాకిస్తాన్‌ పర్యటనకు వెళ్లలేదన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత పాక్‌ 2013లో భారత పర్యటనకు వచ్చింది.అనంతరం దాయాది దేశాల పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు లేకపోవడంతో ఇరుజట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు నిలిచిపోయాయి. అయితే, ఐసీసీ ఈవెంట్లు, ఆసియా కప్‌ టోర్నీల్లో మాత్రం భారత్‌- పాక్‌ (Ind vs Pak) ముఖాముఖి తలపడుతున్నాయి. కానీ తాజాగా పహల్గామ్‌​ ఘటన నేపథ్యంలో సంబంధాలు పూర్తిగా తెగిపోయే పరిస్థితి వచ్చింది.సంబంధాలు తెంచుకోవాలిఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ మాట్లాడుతూ.. ‘‘అవును.. వందకు వంద శాతం పాకిస్తాన్‌తో అన్ని సంబంధాలు తెంచుకోవాలి. కఠిన చర్యలు చేపట్టాలి. ప్రతి ఏడాది ఇలాంటి ఘటనలు జరగడాన్ని తేలికగా తీసుకోవద్దు. ఇదేమీ జోక్‌ కాదు. ఉగ్రవాదాన్ని సహించకూడదు. టెర్రరిజంను తుడిచిపెట్టేయాలి’’ అని పేర్కొన్నాడు.ఇక బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా ఇప్పటికే పాక్‌తో భవిష్యత్తులోనూ ద్వైపాక్షిక సిరీస్‌లు ఉండబోవని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఐసీసీ నిబంధనలకు అనుగుణంగా ప్రస్తుతం దాయాదితో ఆడుతున్నామని.. అయితే, పరిస్థితులన్నింటినీ ఐసీసీ కూడా గమనిస్తోందని తెలిపారు. భారత ప్రభుత్వం చెప్పినట్లే తాము నడుచుకుంటామని స్పష్టం చేశారు.ముక్తకంఠంతో ఖండించిన క్రీడా లోకంకాగా పహల్గామ్‌ ఉగ్రదాడి ఘటనను భారత క్రీడా లోకం ముక్తకంఠంతో ఖండించిన విషయం తెలిసిందే. ‘‘బాధిత కుటుంబాలు ఊహించలేని కష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఈ కష్టకాలంలో భారత్‌తో పాటు యావత్‌ ప్రపంచం వారికి అండగా నిలుస్తోంది. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తేలియజేస్తున్నా. న్యాయం జరగాలని ప్రార్థిస్తున్నా’’ అని టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ అన్నాడు.ఇక విరాట్‌ కోహ్లి సైతం.. ‘‘ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు శాంతి, బలం చేకూరాలని ప్రార్థిస్తున్నా. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నా. ఇలాంటి క్రూరమైన చర్యకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నాడు.మరోవైపు.. ‘‘అమాయకులైన పర్యాటకులపై దాడి హేయమైన చర్య. దీనికి రాబోయే కాలంలో మన ధైర్యవంతమైన సైనికులు గట్టి బదులిస్తారు. జమ్మూకశ్మీర్‌లో శాంతికి భంగం కలగించాలనుకునే వారి ప్రణాళికలు ఎప్పటికీ విజయవంతం కావు’’ అని బాక్సర్‌ విజేందర్‌ సింగ్ తన స్పందన తెలియజేశాడు.భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పూసర్ల వెంకట సింధు స్పందిస్తూ.. ‘‘పహల్గామ్‌ ఉగ్ర దాడి బాధితుల కోసం నా హృదయం తపిస్తోంది. ఎలాంటి కారణమైనా.. ఇంత క్రూరత్వాన్ని సమర్థించదు. బాధితుల దుఖం మాటల్లో చెప్పలేనిది. కానీ వారు ఒంటరి వారు కాదు. వారి వెంట యావత్‌ దేశం ఉంది. క్లిష్ట సమయంలో ఒకరికొకరు అండగా నిలుద్దాం. శాంతి పునరుద్ధరణ తప్పక జరుగుతుంది’’ అని పేర్కొంది.చదవండి: PSL 2025 Live Suspended: పాకిస్తాన్‌కు భారీ షాక్‌!.. అసలే అంతంత మాత్రం.. ఇప్పుడు ఇక..

US Court Given Relief To 1200 Students Over Deportation5
ట్రంప్‌ యూటర్న్‌.. అమెరికాలో విదేశీ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కోర్టు ఆదేశాల మేరకు విదేశీ విద్యార్థుల బహిష్కరణపై ట్రంప్‌ వెనక్కి తగ్గారు. తమ వీసాలు రద్దు చేయడంతో విదేశీ విద్యార్థులు అక్కడి న్యాయస్థానాలను ఆశ్రయించారు. దీంతో, విద్యార్థులకు అనుకూలంగా తీర్పులు రావడంతో ట్రంప్‌ యూటర్న్‌ తీసుకున్నారు.వివరాల ప్రకారం.. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి బహిష్కరణ ముప్పు ఎదుర్కొంటున్న వందల మంది విద్యార్థులకు ఊరట లభించింది. అయితే, అమెరికాలో విదేశీ విద్యార్థులపై ట్రంప్‌ బహిష్కరణ వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వివిధ కారణాలతో 187 కాలేజీలకు చెందిన 1200 మందికి పైగా విదేశీ విద్యార్థుల వీసా (Student Visa) లేదా వారి చట్టబద్ధ హోదాలను ట్రంప్‌ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో తమ వీసాల రద్దుపై విద్యార్థులు న్యాయస్థానాలను ఆశ్రయించారు.అనంతరం.. కాలిఫోర్నియా, బోస్టన్‌ కోర్టుల్లో విద్యార్థులు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన ఆయా న్యాయస్థానాలు.. విద్యార్థుల వీసా రద్దును ఆపాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ట్రంప్‌ యంత్రాంగం చర్యలను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ క్రమంలోనే ఇమిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్.. ఆయా విద్యార్థుల చట్టబద్ధ హోదాను తాత్కాలికంగా పునరుద్ధరించింది. ఈమేరకు అమెరికా ప్రభుత్వానికి చెందిన ఓ న్యాయవాది తాజాగా వెల్లడించారు. దీంతో ఆయా విద్యార్థులకు చట్టబద్ధ హోదా లభిస్తుందన్నారు.ఇదిలా ఉండగా.. విదేశీ విద్యార్థులపై బహిష్కరణ వేటు కారణంగా డిపోర్టేషన్‌, నిర్బంధం ముప్పు పొంచి ఉండటంతో ఆ విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. వీరిలో కొంతమంది ఇప్పటికే అమెరికాను వీడగా.. కొందరు రహస్య ప్రదేశాల్లో తల దాచుకున్నారు. తాజాగా కోర్టు వ్యాఖ్యలతో ట్రంప్‌ (Donald Trump) సర్కారు వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Baloch Liberation Army Targets Pakistani Army Convoy6
పాకిస్తాన్‌ ఆర్మీ కాన్వాయ్‌పై దాడి.. పది మంది సైనికులు మృతి

ఢిల్లీ: పాకిస్తాన్‌ ఆర్మీకి మరోసారి బిగ్‌ షాక్‌ తగిలింది. బెలుచిస్తాన్‌లో పాక్‌ ఆర్మీపై దాడి జరిగింది. పాక్ ఆర్మీ కాన్వాయ్‌పై బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(Baloch Liberation Army-BLA)దాడి చేసింది. ఈ ఘటనలో 10 మంది పాకిస్తాన్ సైనికులు మృతిచెందినట్టు సమాచారం.వివరాల ప్రకారం.. పాకిస్తాన్‌కు చెందిన బెలూచిస్థాన్ ప్రావిన్స్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాక్ ఆర్మీ కాన్వాయ్‌పై బెలూచ్ ఫ్రీడమ్ ఫైటర్స్‌ దాడి చేశారు. ఈ దాడిలో కనీసం 10 మంది పాకిస్తాన్ సైనికులు మృతిచెందినట్టు సమాచారం. ఆర్మీ కాన్వాయ్‌లోని ఒక వాహనం పూర్తిగా ధ్వంసమైపోయింది. కాగా, ఇది బెలూచ్ విప్లవకారుల తాజా యుద్ధ ప్రకటనగా చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బీఎల్‌ఏ స్వయంగా విడుదల చేసింది. ఈ వీడియోలో పేలుళ్లు, కాల్పుల శబ్దాలు, నాశనమైన పాక్ ఆర్మీ వాహనాలు కనిపిస్తున్నాయి.🚨 The Baloch Liberation Army (BLA) has taken responsibility for an improvised explosive device (IED) attack on a Pakistani Army convoy in Margat, near Quetta, on April 25, 2025. According to BLA spokesperson Jeeyand Baloch, the attack was carried out using a remote-controlled… pic.twitter.com/9SmHRfTcyr— The Tradesman (@The_Tradesman1) April 26, 2025ఇక, ఈ దాడితో పాటు బీఎల్‌ఏ మరోసారి పాకిస్తాన్ ఆర్మీకి భారీ హెచ్చరిక జారీ చేసింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. పాక్ ఆర్మీకి ఇకపై భద్రత ఉండదు. మేం మా హక్కుల కోసం చివరి వరకు పోరాడతాం.. అంటూ వారు ప్రకటించారు. అయితే, పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పటివరకు ఈ ఘటనపై అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఈ ఘటన తర్వాత సైనిక వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. బెలూచిస్థాన్‌లో భద్రతా వ్యవస్థ మరింత కఠినంగా అమలు చేయబోతున్నట్టు సమాచారం.Always a big fan of video editing skills of Baloch Liberation Army 😉https://t.co/LFu7OiouoD— Kriti Singh (@kritiitweets) April 25, 2025ఇదిలా ఉండగా.. ఎన్నో దశాబ్దాలుగా స్వతంత్ర బెలూచిస్థాన్ కోసం బీఎల్‌ఏ పోరాడుతోంది. ఈ క్రమంలో పాక్ ప్రభుత్వం తమ హక్కులు దూరం చేస్తున్నదని ఆరోపిస్తూ వరుస దాడులకు పాల్పడుతోంది. గత కొన్ని నెలలుగా BLA కార్యకలాపాలు మరింత ఉధృతంగా మారాయి. ఈ దాడి తర్వాత పాక్‌లో పరిస్థితి అత్యంత అస్థిరంగా మారింది. తాజా దాడి నేపథ్యంలో ప్రజల్లో భయం, భద్రతా వర్గాల్లో ఆందోళన నెలకొంది.10 🐖 s gone! Well done Baloch Liberation Army #Pakistan #PahalgamTerroristAttack #TerrorAttack #Baloch #Kashmir pic.twitter.com/ZavhIoEBjx— Adri chatterjee (@stay_fit_mate) April 26, 2025

Suniel Shetty has Requested citizens to spend their next holidays in Kashmir7
'నెక్ట్స్‌ వేకేషన్‌ జమ్మూ కశ్మీర్‌లోనే'.. కేఎల్ రాహుల్ మామ సంచలన కామెంట్స్!

బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి సంచలన కామెంట్స్‌ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తన వేకేషన్‌ను జమ్మూ కశ్మీర్‌లోనే ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. కాశ్మీర్ లోయలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి.. ఉగ్రవాదంపై పోరాటానికి భారతీయులంతా ఏకం కావాలని ఆయన కోరారు. ముంబయిలో జరిగిన లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు- 2025 వేడుకకు హాజరైన ఆయన పహల్గామ్‌ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. కాశ్మీర్ ఎల్లప్పుడూ భారతదేశంలో అంతర్భాగమని.. ఇలాంటి సమయంలోనే మనం ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎవరూ కూడా భయానికి కానీ.. ద్వేషానికి కానీ లోనుకావద్దని దేశ ప్రజలను సునీల్ శెట్టి కోరారు.సునీల్ శెట్టి మాట్లాడుతూ.. "మనం మానవాళికి చేసే సేవే భగవంతుని సేవ. సర్వశక్తిమంతుడు అన్నీ చూసి ప్రతిస్పందిస్తాడు. ప్రస్తుతం మనం భారతీయులుగా ఐక్యంగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. భయం, ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్న వారి వలలో మనం పడకూడదు. ఇలాంటి సమయంలోనే మనమంతా ఐక్యంగా ఉండాలి. కశ్మీర్‌ మనదే.. ఎల్లప్పుడూ మనదే అని వాళ్లకి మనం చూపించాలి. అందుకే కాశ్మీర్‌లో తన విహారయాత్రను ప్లాన్ చేసుకుంటున్నా. మీరు కూడా కశ్మీర్‌లో పర్యటించాలని భారతీయ పౌరులను కోరుతున్నా. ఒక పౌరుడిగా మనం ఈ పని చేయాలి. మన తదుపరి వేకేషన్‌ కశ్మీర్‌లోనే ఉండాలి. ఎందుకంటే మనం భయపడలేదని.. మనకు భయం లేదని వారికి చూపించాలి' అని పిలుపునిచ్చారు.ఇ‍ప్పటికే తాను అధికారులను సంప్రదించానని.. అవసరమైతే కశ్మీర్‌లో పర్యటించేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సునీల్ పేర్కొన్నాడు. తమ సినిమాలను సైతం అక్కడే షూటింగ్‌ నిర్వహిస్తామని అధికారులకు వివరించినట్లు వెల్లడించారు. ఎందుకంటే మన కశ్మీరీలు ఎప్పటికీ మనకు తోడుగా నిలుస్తారని సునీల్ శెట్టి అన్నారు. ఉగ్రదాడి తర్వాత కశ్మీర్ ప్రాంతం నుంచి పర్యాటకులు తరలివెళ్లడంతో అక్కడి స్థానికుల ఉపాధిపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలోనే సునీల్ శెట్టి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లోని బైసారన్ లోయ వద్ద పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు.. 26 మందిని హతమార్చారు. ఈ ఘటనతో యావత్‌ భారతదేశం షాకింగ్‌కు గురైంది. View this post on Instagram A post shared by Visitkashmirtravel In (@visitkashmirtravel.in)

India Credit Card Spending Hits Record8
ఏడాదిలో రూ.21.16 లక్షల కోట్లు గీకారు!

క్రెడిట్ కార్డు వ్యయం 2025 ఆర్థిక సంవత్సరంలో అనూహ్యంగా పెరిగి రికార్డు స్థాయిలో రూ.21.16 లక్షల కోట్లకు చేరుకుంది. వినియోగదారుల డిమాండ్, డిజిటల్ లావాదేవీలకు పెరుగుతున్న ప్రాధాన్యత కారణంగా గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 15% పెరుగుదలను నమోదు చేసింది. రుణ ఆధారిత వినియోగం అధికం అవుతుండడానికిగల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.పట్టణ, డిజిటల్ పరిజ్ఞానం ఉన్న వినియోగదారులు విచక్షణా వ్యయం కోసం క్రెడిట్ కార్డులను వాడుతున్నారు. ముఖ్యంగా ఈ-కామర్స్, ట్రావెల్, డైనింగ్ వంటి రంగాల్లో దీన్ని అధికంగా ఉపయోగిస్తున్నారు.ఆన్‌లైన్‌ చెల్లింపులపై ఆసక్తి చూపడం క్రెడిట్ కార్డు వినియోగానికి ఆజ్యం పోసింది. మూడింట రెండొంతుల లావాదేవీలు డిజిటల్ రూపంలో జరుగుతున్నాయి.వ్యయాల పెరుగుదల ఆర్థిక వ్యవస్థపై స్థిరమైన విశ్వాసాన్ని సూచిస్తుంది.ఇదీ చదవండి: లేటరల్‌ ఎంట్రీ నియామకాలకు నోటిఫికేషన్‌2025 మార్చి నాటికి చలామణిలో ఉన్న క్రెడిట్ కార్డుల సంఖ్య 10.98 కోట్లకు చేరింది. ఇది ఏడాది క్రితం 10.18 కోట్లుగా ఉండేది. కొత్త కార్డుల జారీ బ్యాంకుల వారీగా భిన్నంగా ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎస్‌బీఐ కార్డ్స్ వంటి ప్రముఖ సంస్థలు గణనీయమైన పెరుగుదలను నమోదు చేయగా, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఆర్‌బీఎల్‌ బ్యాంక్ వంటి ఇతర సంస్థలు రెగ్యులేటరీ సవాళ్లు, భాగస్వామ్యాల్లో మార్పుల కారణంగా కార్డుల జారీలో క్షీణతను ఎదుర్కొన్నాయి. అన్ సెక్యూర్డ్ రుణాలకు సంబంధించిన రిస్క్‌లను తగ్గించడానికి బ్యాంకులు క్రెడిట్ క్వాలిటీకి ప్రాధాన్యత ఇస్తున్నాయి. బ్యాంకులు ఇప్పటికే ఉన్న వినియోగదారులకు ఆర్థిక ఉత్పత్తులను క్రాస్-సెల్లింగ్ చేయడంపై దృష్టి పెడుతున్నాయి.

US Donald Trump key Comments Over India And Pakistan9
భారత్‌-పాక్‌ మధ్య యుద్ధ మేఘాలు.. ట్విస్ట్‌ ఇచ్చిన ట్రంప్‌!

వాషింగ్టన్‌: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో భారత్‌, పాకిస్తాన్‌ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నో సంవత్సరాలుగా నలుగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలను ఆ రెండు దేశాలే పరిష్కరించుకుంటాయి అని ట్రంప్‌ చెప్పుకొచ్చారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా రోమ్‌ పర్యటనకు బయలుదేరారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టులో భారత్‌-పాకిస్తాన్‌ ఉద్రిక్తతపై ట్రంప్‌ను మీడియా ప్రశ్నించింది. ఈ సందర్బంగా ట్రంప్‌ మాట్లాడుతూ.. భారత్‌ అంటే నాకు ఎంతో గౌరవం. అలాగే పాకిస్తాన్‌ కూడా నాకు చాలా దగ్గర. రెండు దేశాలతో నేను సన్నిహితంగా ఉంటాను. కశ్మీర్‌ విషయంలో భారత్‌, పాక్‌ల మధ్య చాలా ఏళ్లుగా ఘర్షణలు జరుగుతున్నాయి. అయితే, ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలను ఆ రెండు దేశాలే పరిష్కరించుకుంటాయి. ఈ విషయంలో ఇంతకంటే ఎక్కువగా చేసేదేమీ లేదు. ఇక, పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి చెత్త పని. ఉగ్రవాదుల దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం విచారకరం’ అని వ్యాఖ్యలు చేశారు.#WATCH | On #PahalgamTerroristAttack, US President Donald Trump says, "I am very close to India and I'm very close to Pakistan, and they've had that fight for a thousand years in Kashmir. Kashmir has been going on for a thousand years, probably longer than that. That was a bad… pic.twitter.com/R4Bc25Ar6h— ANI (@ANI) April 25, 2025అంతకుముందు ట్రంప్‌.. కశ్మీర్‌ పహల్గాం ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌కు అమెరికా మద్దతుగా నిలుస్తుంది. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలి. ప్రధాని మోదీ, భారత ప్రజలకు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. అమెరికాలో భారత్‌ అంశంపై ప్రశ్నించిన పాక్‌ జర్నలిస్టుకు భంగపాటు ఎదురైంది. పహల్గాం ఘటన తర్వాత భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొనడంపై అమెరికా విదేశాంగ ప్రతినిధి టామ్మీ బ్రూస్‌ను ఓ పాక్‌ జర్నలిస్టు అడిగాడు. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘నేను దానిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయను. మనం ఇంకో సబ్జెక్టు మాట్లాడుకుందాం. ఇప్పటికే అధ్యక్షుడు ట్రంప్‌, మంత్రి మార్కో రూబియో మాట్లాడారు. అందుకే ఆ విషయంపై నేను మాట్లాడను. చనిపోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తాను. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తాను. ఈ హీనమైన దాడికి పాల్పడిన వారికి శిక్ష పడాలని కోరుకుంటాను. పరిస్థితులు వేగంగా మారుతున్నట్లు మనం చూస్తున్నాం. వాటిని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాం. జమ్మూకశ్మీర్‌పై ఎటువంటి పొజిషన్‌ తీసుకోలేదు’ అని పేర్కొన్నారు.

Breathing that increases mental energy10
Yoga: మానసిక శక్తిని పెంచే శ్వాస

నాసిక రంధ్రాల ద్వారా శ్వాసను లోపలికి తీసుకుంటూ, తిరిగి వదులుతూ చే సే ప్రాణామాయ పద్ధతులలో ముఖ్యమైనవి నాలుగు ఉన్నాయి. వాటిలో.. కపాలభాతి: ఈ ప్రాణాయామంలో వేగంగా ఊపిరి తీసుకోవడం, వదలడం ఉంటుంది. ఈ విధానం వల్ల జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. శ్వాసకోశ కండరాలు బలోపేతం అవుతాయి. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. మెదడుకు ఆక్సిజన్‌ సరఫరా పెరుగుతుంది. దీని వల్ల చేసే పనిపైన శ్రద్ధ, సృజనాత్మకత పెరుగుతుంది. ఒక ప్రశాంతమైన స్థలంలో సుఖాసనంలో కూర్చొని, ముక్కు ద్వారా శ్వాస పీల్చుతూ, వదులుతూ ఉండాలి. భస్త్రిక: ఈ ప్రాణాయామం ద్వారా శరీరంలో ఆక్సిజన్‌ స్థాయిని పెంచవచ్చు. నోటిద్వారా శ్వాసను తీసుకొని, నోటిద్వారా వదలాలి. ఈ ప్రక్రియను పది–పదిహేను సార్లు పదే పదే చేయాలి. భ్రామరి: ఈ ప్రాణాయామం ద్వారా మనస్సు ప్రశాంతంగా మారుతుంది. నోటితో తేనెటీగలాగ హమ్‌ చేస్తూ .. నాసిక రంధ్రాల ద్వారా గాలి పీల్చుకొని, నెమ్మదిగా వదలాలి. ఆరోగ్య సమస్యలు ఉన్న వారు వైద్యులను సంప్రదించి, నిపుణుల సలహాతో వీటిని సాధన చేయడం వల్ల మెరుగైన ఫలితాలను పొందదుతారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement