Top Stories
ప్రధాన వార్తలు

తెగువ చూపారు.. వారందరికీ సెల్యూట్: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఉప ఎన్నికలు, అవిశ్వాస తీర్మానాల సమయంలో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు తెగువ చూపారని.. వారందరికీ సెల్యూట్ చేస్తున్నానని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో గురువారం ఆయన భేటీ అయ్యారు. ముందుగా జమ్ముకశ్మీర్‌లోని ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన వారి మృతికి సంతాపంగా వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ నాయకులు కాసేపు మౌనం పాటించారు. అనంతరం సమావేశం ప్రారంభించారు. దుర్మార్గమైన రెడ్‌బుక్ పాలనలో..‘ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. యుద్ధ వాతావరణంలో ప్రజలు బతుకుతున్నారు. దుర్మార్గమైన రెడ్‌బుక్ పాలన జరుగుతోంది’’ అని వైఎస్ జగన్ మండిపడ్డారు. ప్రజావ్యతిరేకతను అణచివేయడం సాధ్యం కాదన్న ఆయన.. మేనిఫెస్టో అమలు చేయకపోతే ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్త నిలదీస్తాడని చెప్పారు. ‘‘బలం లేకపోయినా స్థానిక సంస్థల్లో టీడీపీ పోటీ చేస్తోంది. ప్రజలు ఓడించారు కాబట్టే.. చంద్రబాబు తన సొంత నియోజకవర్గం చంద్రగిరిని విడిచిపెట్టి కుప్పం వెళ్లిపోయాడు. అక్కడ బీసీలు ఉన్నారు.. వారు ఆర్థికంగా ఇతరత్రా బలంగా ఉండరు కాబట్టి, వారిని తొక్కితొక్కిపెట్టవచ్చని చంద్రబాబు కుప్పంలో పాగావేశారు’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.జై జగన్.. అన్నారని కేసులు పెట్టారు..చంద్రగిరి ఎంపీపీ ఉప ఎన్నికల్లో గెలిచాక జై జగన్, జై వైఎస్సార్సీపీ అన్నారని కేసులు పెట్టారు. గ్రామాల్లో తెలుగుదేశం నాయకులు తిరిగే ధైర్యంలేదు. తిరిగితే ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీస్తారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ విధ్వంసం. ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లడాన్ని నరకంగా మార్చేశారు. విద్యా, వైద్య రంగాలు దారుణంగా తయారయ్యాయి. చంద్రబాబుగారు అధికారంలో వచ్చాక 4 లక్షలు పెన్షన్లు తీసేశారు. అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. బెల్టుషాపులు గుడి, బడి పక్కనే కనిపిస్తున్నాయి.రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ....ప్రతి బాటిల్‌పైన రూ.20ల ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. వైఎస్సార్సీపీలో కన్నా ఇసుక రేటు రెండింతలు పెరిగింది. ఉచితం అని చెప్పి.. దోచుకుంటున్నారు. పైనుంచి కిందిదాకా ముడుపులు చెల్లిస్తేనే మైనింగ్ అయినా, పరిశ్రమ అయినా నడిచేది. అవినీతినుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి డైవర్షన్ టాపిక్స్ ఎంచుకుంటున్నారు. విశాఖపట్నంలో ఊరూపేరు లేని ఉర్సా లాంటి కంపెనీలకు రూ.3,000 కోట్లు ఖరీదు చేసే భూములిస్తున్నారు. ఒక చిన్న ఇంట్లో రెషిడెన్షియల్ అపార్ట్మెంట్ కట్టే కరెంటు బిల్లు ఆ కంపెనీ కడుతుంది. అమెరికాలో వాళ్ల ఆఫీసు చూస్తే.. అది కూడా చిన్న ఇల్లే. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ చంద్రబాబు హయాంలో ఉర్సా లాంటి ఊరూ పేరు కంపెనీకి రూ.3,000 కోట్ల డబ్బులు దోచిపెడుతున్నారు. విశాఖఫట్నంలో లూలు గ్రూపులకు, లిల్లీ గ్రూపులకు రూ.1500- 2000 వేల కోట్లు ఖరీదు చేసే భూములను.. టెండర్లు లేకుండా కట్టబెట్టారు.జగన్ చేయగలిగాడు.. బాబు ఎందుకు చేయలేకపోతున్నాడు?’..లెఫ్ట్, రైట్, సెంటర్ రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. అమరావతి నిర్మాణ పనుల్లోనూ దోపిడీ. 2018లో ఐదేళ్ల కిందట చంద్రబాబు హయాంలో టెండర్లు పిలిచినప్పుడు పనుల విలువ రూ. రూ.36,000 కోట్లు. అప్పట్లో ఇప్పటికన్నా స్టీలు, సిమెంట్లు రేట్లు ఎక్కువ. అయినా కూడా ఆ రూ.36,000 కోట్ల విలువ ఈరోజు రూ.78,000 కోట్లకు పెంచేశారు. టెండర్లు రింగ్ ఫార్మ్ చేసి వాళ్ల కాంట్రాక్టర్లకే ఇచ్చుకుంటున్నారు. మొబలైజేషన్ అడ్వాన్వులు కొత్తగా ఇవ్వడం మొదలుపెట్టాడు. 10 శాతం మొబలైజేషన్ అడ్వాన్స్‌లు ఇవ్వడం, అందులో 8శాతం కమీషన్లుగా తీసుకోవడం.. ప్రభుత్వం చేసిన అప్పులన్నీ ఎక్కడకు పోతున్నాయో తెలియడంలేదు. గతంలో ఎందుకు జగన్ చేయగలిగాడు.. చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడు?’’ అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.బాబు హయాంలో బటన్లు లేవు.. నేరుగా ఆయన జేబులోకే డబ్బులు‘‘జగన్ నేరుగా బటన్ నొక్కి అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వేసేవాడు. ఇప్పుడు చంద్రబాబు హయాంలో బటన్లు లేవు.. నేరుగా ఆయన జేబులోకే పోతున్నాయి. ఇదే విషయాన్ని ఎన్నికల సమయంలో మొత్తుకుని చెప్పాను. చంద్రబాబు నాయుడుని నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే. ఈ రోజు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. వీటికి సమాధానం చెప్పుకోలేక ప్రతిరోజూ డైవర్షనే. ఒక రోజు లడ్డూ, మరోరోజు బోటు.. ఇంకోరోజు ఐపీఎస్ ఆధికార్ల అరెస్టులు అంటూ డైవర్షన్లుఇలాంటి పాలనే రాష్ట్రంలో జరుగుతోంది....కరెంటు బిల్లులు షాక్ కొట్టేలా పెంచారు.. వీటి గురించి అడిగితే.. ఆయన చేసిన లిక్కర్ స్కాంను మరలా ఇంకొకరు మీద రుద్ది అరెస్టు చేస్తాడు. ఇలా ప్రతి రోజూ ఏదో ఒక సెన్షేషన్ క్రియేట్ చేసి దాన్నుంచి టాపిక్ డైవర్షన్ చేయడం పరిపాటిగా మారింది. రోమన్ రాజులు మీద ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా వస్తుందని గ్లాడియేటర్స్‌ను పెట్టిన గేమ్స్ ఆడించేవాళ్లు. మనుషులు చేతుల్లో కత్తులు పెట్టి, జంతువులను పెట్టి.. చనిపోయేవరకు యుద్ధాలు చేయించేవారు. వాటని ప్రజలు చూసేలా చేసి వారిని మభ్యపెట్టి డైవర్ట్ చేసేవారు. దీంతో రాజు ఎలా పరిపాలన చేస్తున్నారో చర్చించడం మాని ప్రజలు ఆ ఆటలు గురించే చర్చించేవారు. మిగిలిన విషయాలు పక్కకు పోయేవి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో పాలన జరుగుతుంది. ఎంతో మంచి చేసిన మనమే ప్రతిపక్షంలో కూర్చొన్నాం. ఇక ఏ మంచీ చేయకుండా, మోసం చేసిన చంద్రబాబు పరిస్ధితి ఎలా ఉంటుందో చెప్పక్కరలేదు..ఇంత మోసం చేసిన మనిషిని ప్రజలు సింగిల్ డిజిట్ రాని పరిస్థితుల్లోకి పరిమితం చేస్తారు.ఆ రోజు వస్తుంది. కచ్చితంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండమైన మెజార్టీతో అధికారంలోకి వస్తుంది. ప్రతి కార్యకర్తకు.. మన ప్రభుత్వంలో మీ జగన్ 2.0లో తోడుగా ఉంటాడు అని హామీ ఇస్తున్నాను. ఈ రోజు కార్యకర్త ఎంతలా ఇబ్బంది పడుతున్నాడో చూస్తున్నాను’’ అని వైఎస్ జగన్ అన్నారు.

కేంద్ర సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకున్నా ఓకే: అఖిలపక్ష భేటీలో రాహుల్
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి ఘటనపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ కీలక భేటీ జరిగింది. 2 గంటలకుపైగా సమావేశం కొనసాగింది. పహల్గామ్ మృతులకు అఖిలపక్షం నివాళులర్పించింది. నేతలు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఉగ్రదాడి అనంతరం తీసుకున్న చర్యలపై అఖిలపక్షానికి కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఉగ్రదాడుల్ని ఎదుర్కోవడంలో ఆయా పార్టీల సలహాలను కోరింది.ఉగ్ర దాడులను అఖిలపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. కశ్మీర్లో శాంతి నెలకొనాలని.. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా సమర్థిస్తామని రాహుల్ గాంధీ అన్నారు. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు జైశంకర్, నిర్మలా సీతారామన్, కిరణ్ రిజుజు, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సహా ఇతర పార్టీలకు చెందిన పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు.కశ్మీర్లో అశాంతి నెలకొల్పే శక్తులను అణచివేయాలి: మిథున్రెడ్డిఉగ్రదాడిని ఖండిస్తున్నామని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా వైఎస్సార్సీపీ మద్దతు ఉంటుంది. కశ్మీర్లో అశాంతి నెలకొల్పే శక్తులను అణచివేయాలి. భద్రతను మరింత పటిష్టం చేయాలి. త్వరగా ఉగ్రవాదులను పట్టుకుని శిక్షించాలని మిథున్‌రెడ్డి డిమాండ్ చేశారు.

ఐక్యత వర్తమాన అవసరం
ప్రపంచమంతా ఒక రకమైన అనిశ్చితిలో రోజులు వెళ్లదీస్తున్న వర్తమానంలో మరో మారణకాండకు పథకం పన్ని, అమలుచేసి కశ్మీర్ సమస్యను మళ్లీ తెరపైకి తేవాలనుకున్న పాకిస్తాన్‌కు మన దేశం నుంచి గట్టి హెచ్చరికే వెళ్లింది. సింధూ నదీజలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపేయటంతో సహా తీసుకున్న చర్యలు సహజంగానే పాకిస్తాన్‌ను ఇరకాటంలో పడేశాయి. అటారీ సరిహద్దు మూత, దౌత్యసంబంధాలకు పరిమితుల విధింపు, పాకిస్తాన్ పౌరులకు భారత్‌లో ప్రవేశం నిషేధం వంటి నిర్ణయాలు దీనికి అదనం. నిజానికి సింధూ నదీజలాల ఒప్పందం నిలిపివేతను పాకిస్తాన్ ఊహించలేదు. ఎందుకంటే ఇరు దేశాల మధ్యా యుద్ధం వచ్చిన సందర్భాల్లో... ముంబైపై ఉగ్రదాడి జరిగినప్పుడు లేదా పుల్వామాలో మన జవాన్లను ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నప్పుడు కూడా మన దేశం ఆ ఒప్పందం నిలిపివేత గురించి మాట్లాడలేదు. సింధూ నదీజలాలపై పాకిస్తాన్ సాగురంగం 80 శాతం వరకూ ఆధారపడి వుంటుంది. పైగా ప్రపంచంలో తీవ్రమైన నీటికొరతను ఎదుర్కొనే దేశాల్లో పాకిస్తాన్ ఒకటి. సింధు, జీలమ్, చీనాబ్, రావి, బియాస్, సత్లెజ్ నదులకు సంబంధించిన సమస్త సమాచారమూ కూడా ఈ ఒప్పందంలో ఇమిడివున్న వేళ మన దేశ నిర్ణయం పాకిస్తాన్‌కు శరాఘాతమే అవుతుంది. భారత్ చర్యలకు ప్రతిగా పాకిస్తాన్ సైతం చర్యలు తీసుకున్నా అది పరువు కాపాడుకోవటానికి చేసే ప్రయత్నం మాత్రమే. ఎలా చూసినా పాకిస్తాన్ ఒక రకంగా ఒంటరి బతుకు బతుకుతోంది. అమెరికాకు అఫ్గాన్ పెను సమస్యగా కనబడినంత కాలమూ అది పాకిస్తాన్ సాయం తీసుకోక తప్పేది కాదు. అందుకోసం పాక్ తరఫున మాట్లాడటం, అది ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నదన్న ఆరోపణలొస్తున్నా అమాయ కత్వం నటించటం అప్పట్లో అమెరికాకు అలవాటు. ఉగ్రవాదులకు అండదండలందిస్తున్నట్టు ఆధారాలున్నా ఏనాడూ పాక్‌కు ఆర్థిక సాయం ఆగకుండా చూసిన ఘనత అమెరికాది. 2021లో అఫ్గాన్ నుంచి బతుకుజీవుడా అనుకుంటూ నిష్క్రమించాక అమెరికాకు పాకిస్తాన్‌పై మునుపటి ప్రేమ, వాత్సల్యాలు తగ్గుముఖం పట్టాయి. పర్యవసానంగా అప్పు దొరక్క పాక్ ఇబ్బంది పడుతోంది. గల్ఫ్ దేశాలు కూడా గతంలో మాదిరి కాసుల వర్షం కురిపించటం లేదు. చైనా సరేసరి. అదెంతో ఆర్భాటంగా తీసుకొచ్చిన బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్ఐ) పాకిస్తాన్లో నత్తనడ కన సాగటం, నిర్మాణ పనులకు ఎదురవుతున్న ఆటంకాలు చైనాకు ఆగ్రహం కలిగిస్తున్నాయి. గత కొన్నే ళ్లుగా కశ్మీర్ విషయంలో పాక్‌ను సమర్థించటం మొదలెట్టిన తుర్కియే హఠాత్తుగా గత ఏడాది స్వరం మార్చింది. గల్ఫ్ దేశాలు సైతం పాకిస్తాన్ తీరు మారనంత కాలమూ తాము మద్దతు నీయటం కష్టమేనని భావిస్తున్నాయి. ఆర్థికంగా, రాజకీయంగా ఇలా ఏకాకిగా మారుతున్న సమ యంలో పహల్గామ్లో బరితెగించి ఉన్మాదులను ప్రోత్సహించటం వల్ల మరింతగా నష్టపోతానని పాకిస్తాన్ గ్రహించలేకపోయింది. అంతర్జాతీయంగా ఏర్పడిన ఉద్రిక్తతలు చివరకు యుద్ధానికి దారి తీయొచ్చని చాలామంది జోస్యం చెబుతుండగా నిజంగా ఆ పరిస్థితే వస్తే భౌగోళికంగా తమ అవసరాల కోసమైనా అమెరికా, చైనాలు తన కోసం అర్రులు చాస్తాయన్న అభిప్రాయం పాకిస్తాన్‌కు ఏదోమూల వున్నట్టు కనబడుతోంది. అందుకే పహల్గామ్ దుస్సాహసానికి పూనుకుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పహల్గామ్కు ప్రతీకారం ఉండి తీరుతుందని ప్రకటిస్తున్నారు. 2016లో ఉరిలో ఉగ్రవాదుల మారణకాండ తర్వాత, 2019లో పుల్వామాలో జవాన్లపై ఉగ్రదాడి అనంతరం మన దళాలు పాకిస్తాన్‌లోని ఉగ్రశిబిరాలపై సర్జికల్ దాడులను నిర్వహించాయి. అందు వల్ల వచ్చిన లాభనష్టాలేమిటన్న మాట అలావుంచి ఉగ్రదాడులు తగ్గివుండొచ్చుగానీ ఆగింది లేదు. పౌరుల్లో ఆత్మస్థైర్యం నింపటానికి ప్రతి చర్యలు అవసరమే. అవి కొనసాగవలసిందే. కానీ అక్కడితో అంతా అయిందనుకోవటంలోనే వుంది సమస్యంతా! ఒకప్పుడు కశ్మీర్లో అధికార గణాంకాల ప్రకారం 7,000 మంది ఉగ్రవాదులుండేవారు. కానీ వారి సంఖ్య ప్రస్తుతం 76 మాత్రమేనని గత నెలలో విడుదలైన గణాంకాలు చెబుతున్నాయి. అందులో 59 మంది బయటివారు కాగా, కేవలం 17 మంది మాత్రమే స్థానికులు. ఉగ్రదాడుల్లో మృతుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. కశ్మీర్‌ను గత 35 యేళ్లుగా ఉగ్రవాద భూతం పట్టిపీడిస్తోంది. తొలినాళ్లలో ఏడాదికి ఇంచుమించు వేయిమంది బలయ్యేవారు. 2001 సంవత్సరంలో ఉగ్రవాదులు ఏకంగా 4,011 మందిని పొట్టన బెట్టుకున్నారు. కానీ నిరుడు ఆ సంఖ్య 127. కొందరు ప్రతీకారేచ్ఛను ప్రదర్శిస్తున్నారు. కానీ ప్రభుత్వం ఒక చర్య తీసుకునే ముందు ఎన్నో బేరీజు వేసుకోవాల్సి వుంటుంది. అది యుద్ధంగా మారిన పక్షంలో... మనవైపు గట్టిగా నిలబడే వారెవరు, వ్యూహాత్మకంగా ఎదురయ్యే సమస్యలేమిటి, దళాల సంసిద్ధత, సాంకేతిక సామర్థ్యాల్లో మన స్థానం ఏమిటి అనేవి చూసుకోవాలి. ఇదే అదనుగా కొన్ని రాష్ట్రాల్లో కశ్మీరీ విద్యార్థులపై దాడులు, బెదిరింపులు మొదలయ్యాయి. మొన్నటికి మొన్న పహల్గామ్లో కశ్మీరీ పౌరులు ప్రాణాలకు తెగించి అనేకమందిని కాపాడిన వైనం ఇలాంటి వారికి తెలిసి వుండక పోవచ్చు. ఉగ్రవాద బెడద తగ్గటంలో స్థానికులు అందిస్తున్న సహకారమేమిటో వారికి అర్థంకాకపోయి వుండొచ్చు. మన పౌరుల్ని మనమే మతం పేరుతోనో, ప్రాంతం పేరుతోనో దూరం చేసుకుంటే ఉగ్రవాదుల అభిమతం నెరవేర్చినట్టే అవుతుంది. నిజానికి వారు కోరుకునేది ఈ విద్వేషాన్నే! ఒకపక్క ఉగ్రవాదం అంతానికి దేశమంతా ఒక్కటై నిలబడాలని ప్రధాని పిలుపునిస్తుంటే తద్భిన్నంగా ప్రవర్తించటం విజ్ఞత అనిపించుకోదు.

చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
ఐపీఎల్-2025లో టీమిండియా స్టార్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ విరాట్ కోహ్లి తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో కింగ్ కోహ్లి హాఫ్ సెంచరీతో చెలరేగాడు. రాజస్తాన్ బౌలర్లను విరాట్ ఊతికారేశాడు. ఫిల్ సాల్ట్, పడిక్కల్‌తో కలిసి కీలక భాగస్వామ్యాలను నెలకొల్పాడు. విరాట్ 42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 70 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీలతో చెలరేగిన విరాట్ కోహ్లి పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.కోహ్లి సాధించిన రికార్డులు ఇవే..👉టీ20 క్రికెట్లో ఒకే వేదికపై 3500 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా విరాట్ చరిత్ర సృష్టించాడు. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో 105 టీ20 ఇన్నింగ్స్‌లలో కోహ్లి 3500 పరుగులు చేశాడు.టీ20ల్లో ఒకే స్టేడియంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..3500 - బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో విరాట్ కోహ్లీ(భారత్)3373 - షేర్-ఎ-బంగ్లా స్టేడియం, మీర్పూర్లో ముష్ఫికర్ రహీమ్(బంగ్లాదేశ్)3253 - రోజ్ బౌల్, సౌతాంప్టన్‌లో జేమ్స్ విన్స్ (ఇంగ్లండ్)3241 - ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగ్‌హామ్‌లో అలెక్స్ హేల్స్ (ఇంగ్లండ్)3238 - షేర్-ఎ-బంగ్లా స్టేడియం, మీర్పూర్లో తమీమ్ ఇక్బాల్ (బంగ్లాదేశ్)👉అదేవిధంగా టీ20 క్రికెట్లో మొదట బ్యాటింగ్ చేసిన సందర్బాల్లో అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ప్లేయర్‌గా విరాట్ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు కోహ్లి తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు 62 సార్లు ఏభై పైగా పరుగులు సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్ స్టార్ బాబర్(61) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో బాబర్ రికార్డును కింగ్ బ్రేక్ చేశాడు.👉ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి.. 392 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు.టీ20ల్లో తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాళ్లు వీరే..62 - విరాట్ కోహ్లీ*61 - బాబర్ అజామ్57 - క్రిస్ గేల్55 - డేవిడ్ వార్నర్52 - జోస్ బట్లర్52 - ఫాఫ్ డు ప్లెసిస్

పాక్ సైన్యం చేతిలో బందీగా బీఎస్ఎఫ్ జవాన్
న్యూఢిల్లీ: పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ తో భారత్ తెగతెంపులు చేసుకోవడానికి సిద్ధమైన తరుణంలో బీఎస్ఎఫ్ జవాన్ ఒకరు పాక్ సైన్యం చేతిలో బందీ అయ్యారు. అనుకోకుండా పంజాబ్‌లోని ఫెరోజ్‌పూర్ బోర్డర్ దాటిన క్రమంలో పీకే సింగ్ అనే జవాన్ ను పాక్ సైన్యం అదుపులోకి తీసుకుంది. దీనిపై పాకిస్తాన్ సైన్యంతో భారత్ సైన్యం చర్చలు జరుపుతుంది.పాక్ చేతిలో బందీగా మారిన భారత్ జవాన్ ను సురక్షితంగా విడిచిపెట్టాలని బీఎస్ఎఫ్ అధికారులు.. పాక్ బోర్డర్ సెక్యూరిటీ అధికారిని కోరారు. అది యాధృచ్ఛికంగా జరిగిన ఘటనేనని, సదరు జవాన్ కావాలని పాక్ బోర్డర్ లో అడుగుపెట్టలేదనే విషయాన్ని తెలిపినట్లు భారత్ కు చెందిన బీఎస్ఎఫ్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

‘పహల్గాం బాధిత కుటుంబ సభ్యులకు ఉద్యోగాలిస్తాం’
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు పాలసీబజార్ మాతృసంస్థ పీబీ ఫిన్‌టెక్ కట్టుబడి ఉందని తెలిపింది. ఇందులో భాగంగా ప్రత్యేక నియామక కార్యక్రమాన్ని ప్రకటించింది. సామాజిక బాధ్యత పట్ల సంస్థ నిబద్ధతను తెలియజేస్తూ, బాధిత కుటుంబ సభ్యులకు ఉద్యోగావకాశాలు కల్పించడంతో పాటు వారి పిల్లల చదువులకు సాయం చేయనుందని చెప్పింది.దేశంలోని పీబీ ఫిన్‌టెక్ కార్యాలయాల్లో ఈమేరకు అవకాశాలు కల్పిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. ఈ కష్ట కాలంలో ఆయా కుటుంబాలకు దీర్ఘకాలిక సాయాన్ని అందించేందుకు సంస్థ నిబద్ధతతో ఉందని తెలిపింది. ఈ సందర్భంగా కంపెనీ సహ వ్యవస్థాపకులు, ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ అలోక్ బన్సాల్ మాట్లాడుతూ.. ‘కంపెనీ అందిస్తున్న సాయం కేవలం పౌరులకే కాకుండా దాడిలో ప్రభావితమైన పోలీసు సిబ్బంది, పారామిలటరీ దళాలు, సాయుధ దళాల కుటుంబాలకు కూడా వర్తిస్తుంది. వారి అపారమైన త్యాగాలను గుర్తించి, ఈ కుటుంబాలకు సామాజిక భద్రతను కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉంది’ అని చెప్పారు.ఇదీ చదవండి: బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయమన్నా పోయరు!‘భాదిత కుటుంబాలకు కుచ్‌తో కర్నా హై(ఏదో ఒకటి చేయాలి) అనే భావనతో ఈ సాయం చేయాలని భావిస్తున్నాం. ఆ కుటుంబాలు కోల్పోయిన తమ ఆత్మీయులను తిరిగి తీసుకురాలేము. కానీ వారి బాధను కొంతైనా పంచుకునే అవకాశం ఉంది. మనం ఇప్పుడు వారికి సాయం చేయకపోతే ఎవరూ ముందుకురారు. బాధితులు ఎప్పటికీ ఒంటరికాదు. మేమంతా ఉన్నాం’ అని వారిలో ధైర్యం నింపారు.

అప్పుల కోసం చంద్రబాబు సర్కార్ కొత్త మార్గం!
సాక్షి, విజయవాడ: సంపద సృష్టించి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానన్న చంద్రబాబు.. అప్పులు చేయడంలో రికార్డు సృష్టిస్తున్నారు. అప్పులు చేయడంతో సరికొత్త మార్గాలను వెతుకుతున్నారు. ఈ క్రమంలో అప్పుల కోసం చంద్రబాబు సర్కార్ కొత్త మార్గం ఎంచుకుంది. ఏపీ ఎండీసీ ద్వారా 9 వేల కోట్లు బాండ్లు జారీ చేయాలని నిర్ణయించింది. రాజ్యాంగ విరుద్ధమని విమర్శలొస్తున్నా వెనక్కి తగ్గని ప్రభుత్వం.. 436 మైనర్ మినరల్ ప్రాజెక్టులపై ఏపీఎండీసీకి హక్కులు ఇచ్చేసింది. క్వారీ లీజు హోల్డ్ హక్కులు ఏపీ ఎండీసీకి బదలాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.మైనింగ్ హక్కులు కూడా ఏపీఎండీసీకి కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వాటిని చూపించి ఏపీఎండీసీ బాండ్లు జారీ చేయనుంది. రాష్ట్ర ఖజానాను తాకట్టుపెడుతున్నారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు వ్యక్తులకు నేరుగా రాష్ట్ర ఖజానా నుండి వెసులుబాటు కల్పించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారాయన.సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్ర ఆదాయం తిరోగమనంలో ఉందని కాగ్ తేల్చేసిన సంగతి తెలిసిందే. ఒక వైపు రెవెన్యూ రాబడి తగ్గిపోతుండగా.. మరోవైపు అప్పులు భారీగా పెరిగిపోతున్నాయని స్పష్టం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు బడ్జెట్ రాబడులు, వ్యయాలకు సంబంధించిన గణాంకాలను కాగ్ వెల్లడించింది. చంద్రబాబు ప్రభుత్వం.. పది నెలల కాలంలో రూ.90 వేల కోట్లు అప్పులు చేసిందని పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

టూరిస్టులతో టెర్రరిస్ట్.. ‘మా పిల్లలు బాధపడుతుంటే.. మీరు సెలవులు ఎంజాయ్ చేస్తారా?’
సాక్షి,బెంగళూరు: ‘నాబిడ్డకు ఇంకా మూడేళ్లే నన్ను వదిలేయండి ప్లీజ్ అని ప్రాధేయపడినా కనికరించలేదు. ఉగ్రవాది మనసు కరగలేదు. భార్య ముందే తలపై తుపాకీ ఎక్కుపెట్టి మెషిన్ గన్నుతో కాల్పులు జరిపాడు. జమ్మూకశ్మీర్‌లోని మిని స్విట్జర్లాండ్ పహల్గాంను వీక్షించేందుకు వచ్చిన సామాన్యుల్ని పొట్టన పెట్టుకున్నారు. వారిలో భరత్ భూషణ్(35)ఒకరు.వేసవి సెలవులు కావడంతో భరత్ భూషణ్ తన భార్య డాక్టర్ సుజాత భూషణ్, మూడేళ్ల కొడుకుతో కలిసి పహల్గాంకు వచ్చారు. అప్పటి వరకు వందల సంఖ్యలో పర్యాటకలతో కళకళలాడుతున్న పహల్గాంలో సైనిక దుస్తులు ధరించిన ముష్కరులు పర్యాటకులపై విరుచుకు పడ్డారు. ఐడీకార్డులను చెక్ చేసి మరి కాల్చి చంపారు.అలా ముష్కరుల తూటాలకు భరత్ భూషణ్ ప్రాణాలు కోల్పోయినట్లు బాధితుడి భార్య డాక్టర్ సుజాత భూషణ్ కన్నీరు మున్నీగా విలపిస్తున్నారు. కుమారుడి భవిష్యత్ గురించి ప్రాధేయపడ్డ ఉగ్రవాదులు కనికరించకుండా ప్రాణాలు తీశారని గుండెలవిసేలా రోధిస్తున్నారు. పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన తీరును కళ్లకు కట్టినట్లు వివరించారు.మృతదేహానికి సీఎం సీఎం సిద్ధరామయ్య నివాళిపహల్గాంలో ఉగ్రవాదుల తూటాలకు బలైన భరత్ భూషణ్ మృతదేహాం ఆయన స్వస్తలం బెంగళూరుకు చేరుకుంది. భరత్ భూషణ్ మృతదేహానికి నివాళులర్పించేందుకు సీఎం సిద్ధరామయ్య భరత్ ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా తన భర్త భరత్ భూషణ్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిగిన తీరు,దారుణానికి ముందు పహల్గాం ఎలా ఉందో తెలిపారు.పహల్గాంలో కాల్పుల మోత‘వేసవి సెలవులు కావడంతో ఏప్రిల్ 18న మేం పహల్గాంకు వెళ్లాం. అదే రోజు మేం బైసరీన్ వ్యాలీ వరకు గుర్రాల మీద వెళ్లాం. అక్కడికి చేరాక గుడారాలు వేసుకున్నాం. అనంతరం కశ్మీరీ వేషధారణలతో నా భర్త, మూడేళ్ల కుమారుడితో కలిసి సెల్ఫీలు దిగాం. పచ్చిక బయళ్లు,పైన్ చెట్లతో విశాలంగా విశాలవంతమైన ఆ ప్రాంతాన్ని కలియతిరుగుతున్నాం. పలువురు పర్యాటకు గుడారాలు వేసుకొని సందడి చేస్తున్నారు.ఐడీకార్డులు అడిగిసరిగ్గా అప్పుడే అకస్మాత్తుగా బుల్లెట్ శబ్ధం వినిపించింది. అడవి జంతువుల నుంచి సంరక్షణ కోసం అటవీశాఖ అధికారులు ఫైరింగ్ చేశారేమోనని అనుకున్నాం. కానీ ఆ శబ్ధం అంతటితో ఆగలేదు. కొనసాగుతూనే ఉంది. అప్పుడే ఘటన జరిగిన (ఏప్రిల్22) రోజు మధ్యాహ్నం 2.30 తర్వాత ఉగ్రవాదులు టూరిస్టులపై కాల్పులకు తెగబడ్డారు. టూరిస్టులను వారి ఐడీకార్డులను అడుగుతున్నారు. అనంతరం కాల్పులు జరిపి ప్రాణాలు తీస్తున్నారు.మా పిల్లలు బాధపడుతుంటే.. మీరు సెలవులు ఎంజాయ్ చేస్తారా?బైసరీన్ గురించి మీకు తెలుసు కదా.పెద్ద మైదానం. ఎటు చూసినా ఓపెన్ స్పేస్. ఆ సమయంలో నేను, నాభర్త, నాకుమారుడికి (మూడేళ్లు) ఏ దిక్కు చూసినా తప్పించుకునే మార్గం కనిపించలేదు. వెంటనే అక్కడే ఉన్న ఓ కశ్మీర్ టెంట్ వెనక దాక్కున్నాం. మా ముందే ఓ ఉగ్రవాది ఓ టెంట్ లోపలికి వెళ్లాడు. టెంట్‌లోపల ఉన్న టూరిస్టులను బయటకు లాక్కొచ్చాడు. అతనితో ఏదో మాట్లాడాడు. అనంతరం, బాధితుడి తలపైకి గురి పెట్టి కాల్చి చంపాడు. అలా వరుసగా బాధితుల్ని కాల్చుతూ వస్తున్నాడు. మాముందే ఓ టూరిస్టుతో టెర్రరిస్టు మా పిల్లలు బాధపడుతుంటే.. మీరు సెలవులు ఎంజాయ్ చేస్తారా? అని అంటూ కాల్పులకు తెగబడ్డాడు.ఇదంతా చూస్తూ మేం భయంతో మేం దాక్కునే ప్రయత్నం చేస్తున్నాం. అప్పుడే మా దగ్గరికి ఓ టెర్రరిస్టు వచ్చాడు. అప్పటికే నాభర్త ఆ టెర్రరిస్టును నా బిడ్డకు ఇంకా మూడేళ్లే దయచేసి నన్ను వదిలేయండి’అని వేడుకున్నాడు. కానీ ఉగ్రవాది కనికరించలేదు’ అని అన్నటి పర్యంతరమయ్యారు.

ఇక భారత్ విడిచి వెళ్లాల్సిందే.. పాక్ పౌరులకు హెచ్చరిక
న్యూఢిల్లీ : భారత్‌లోని పాక్ పౌరులకు కేంద్ర మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో ఉన్న పాక్ దేశస్తులు భారత్‌ను విడిచి వెళ్లిపోవాలని సూచించింది. జమ్మూకశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిని భారత్ తీవ్రంగా ఖండిస్తోంది. పహల్గాం ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉందని, సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాది దేశంపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో బుధవారం సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ తీసుకున్న ఐదు సంచలన నిర్ణయాల అమలుకు భారత్ వడివడిగా అడుగువేస్తోంది. వేగంగా చర్యలు తీసుకునే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.ఇందులో భాగంగా గురువారం పాక్ పౌరులకు జారీ చేసిన అన్నీ వీసాలను భారత్ రద్దు చేసింది. వాటిలో వైద్య వీసాలు కూడా ఉన్నాయి. పాకిస్తానీలకు వీసా సేవలను నిలిపివేసింది.కొద్ది సేపటిక్రితం విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. పాక్ పౌరులకు చెల్లుబాటయ్యే అన్నీ వీసాలను ఏప్రిల్ 27 రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఆ దేశ పౌరులకు జారీ చేసిన అన్నీ వైద్య వీసాలు ఏప్రిల్ 29 మంగళవారం వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. సవరించిన సమయపాలన ఆధారంగా ప్రస్తుతం భారతదేశంలో ఉన్న అన్ని పాకిస్తానీలు వారి వీసాల గడువు ముగిసేలోపు వెళ్లిపోవాలని పేర్కొంది.

రామాయణ.. సాయిపల్లవి కంటే ముందు నాకే ఛాన్స్..: శ్రీనిధి
రామాయణ సినిమాలో సాయిపల్లవి కంటే ముందు కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty)కే సీతగా నటించే ఛాన్స్ వచ్చిందని అప్పట్లో రూమర్స్ వచ్చాయి. తాజాగా ఈ పుకార్లపై స్పందించిన శ్రీనిధి అవి నిజమేనంటోంది. హిట్ 3 సినిమా ప్రమోషన్స్‌లో శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ.. రామాయణ సినిమా షూటింగ్ ఆల్రెడీ మొదలైంది కాబట్టి ఇప్పుడీ విషయం చెప్పొచ్చనే అనుకుంటున్నాను.స్క్రీన్ టెస్ట్ పూర్తిరామాయణ సినిమా (Ramayana Movie)లో మొదట నన్నే సీతగా అనుకున్నారు. స్క్రీన్ టెస్ట్ కూడా చేశారు. మూడు సన్నివేశాల కోసం నేను ప్రాక్టీస్ కూడా చేశాను. నా యాక్టింగ్‌కు మంచి స్పందనే వచ్చింది. అందరూ నా నటనను చూసి మెచ్చుకున్నారు. యష్ కూడా ఈ సినిమాలో భాగమవుతున్నాడని తెలిసింది. సరిగ్గా అప్పుడే కేజీఎఫ్ 2 రిలీజైంది. మా జోడీ జనాలకు బాగా నచ్చేసింది. అలాంటప్పుడు ఈ మూవీలో యష్ రావణుడిగా.. నేను సీతగా నటిస్తే జనాలు ఎలా స్వీకరిస్తారని ఆలోచించాను. అవకాశం చేజారిందంటే..కచ్చితంగా వాళ్లు మమ్మల్నిలా చూసి జీర్ణించుకోలేరేమో అనిపించింది. ఈ సినిమా మాకు వర్కవుట్ అవొచ్చు, కాకపోవచ్చు అనుకున్నాను. ఏదేమైనా సీత పాత్రకు సాయిపల్లవి (Sai Pallavi) పూర్తి న్యాయం చేయగలదు. తనను సీతగా చూసేందుకు ఎదురుచూస్తున్నాను. మనకు ఏదైనా కలిసొచ్చిందంటే (అవకాశం వచ్చిందంటే) సంతోషపడాలి.. అది చేజారిందంటే.. ఇంకోచోట మనకోసం ఏదో అవకాశం వేచి ఉందని అనుకోవాలి. ఈ సిద్ధాంతాన్ని నేను బాగా నమ్ముతాను అని చెప్పుకొచ్చింది.సినిమాశ్రీనిధి శెట్టి.. కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 సినిమాలతో బ్లాక్‌బస్టర్ విజయాల్ని అందుకుంది. ఈ బ్యూటీ హిట్: ద థర్డ్ కేస్‌తో టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనుంది. నాని హీరోగా, శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ మూవీ మే 1న విడుదల కానుంది.చదవండి: బిగ్‌బాస్ షో హోస్ట్‌గా మళ్లీ..? నాని ఆన్సర్ ఇదే!
ఐక్యత వర్తమాన అవసరం
IPL 2025 RCB vs RR: గెలిచే మ్యాచ్‌లో ఓడిన రాజస్తాన్..
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
బీచ్‌లో చిల్ అవుతోన్న సుప్రీత.. తేనే కళ్లతో కవ్విస్తోన్న బిగ్‌బాస్ దివి!
ఉగ్రదాడి ఘటనపై నోరు జారిన ఎమ్మెల్యే అరెస్ట్
ఫెమా పెనాల్టీ ఫ్రేమ్‌వర్క్‌ను సడలించిన ఆర్బీఐ
పంజాగుట్ట కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్ట్
నాని హిట్-3.. సెన్సార్ బోర్డ్ కట్స్ ఇవే!
కేంద్ర సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకున్నా ఓకే: అఖిలపక్ష భేటీలో రాహుల్
ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 11,09,588 ప్రమాదాలు
ఉగ్రదాడిపై సాయి పల్లవి ట్వీట్.. మండిపడ్డ నెటిజన్స్!
పాకిస్తాన్‌కు వెళ్లిపోయిన కేన్ మామ
ప్రతిచర్యకు సిద్ధమైన పాక్.. సిమ్లా ట్రీటీకి టాటా?
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
సింధు జలాలను ఆపడమంటే యుద్ధం ప్రకటించడమే: పాక్
మళ్లీ ఉగ్ర కాండ!
మోస్ట్ పవర్ ఫుల్ ఆర్మీ కల్గిన దేశాలు ఇవే..
ఉగ్రదాడి ఘటనపై నోరు జారిన ఎమ్మెల్యే అరెస్ట్
బీచ్‌లో చిల్ అవుతోన్న సుప్రీత.. తేనే కళ్లతో కవ్విస్తోన్న బిగ్‌బాస్ దివి!
బీరప్పా.. నువ్వు గ్రేటప్పా!
సునీత మేడం.. వీటికి సమాధానం చెప్పండి: ప్రవస్తి
IND vs PAK: బీసీసీఐ కీలక నిర్ణయం
పాక్ సైన్యం చేతిలో బందీగా బీఎస్ఎఫ్ జవాన్
బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయమన్నా పోయరు!
ఐపీఎల్ క్రికెటర్ ని పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్
అతడొక అద్భుతం.. రెండేళ్లలో టీమిండియాకు ఆడుతాడు: శాంసన్
వివాహేతర సంబంధం: భార్యను పోలీసులకు అప్పగించిన భర్త
చిరంజీవి సినిమాలో విలన్‌గా టాలీవుడ్ యంగ్ హీరో!
ఉగ్రదాడిలో మీ హస్తం లేకపోతే ఎందుకు ఖండించలేదు.. పాక్ ప్రధానిని నిలదీసిన ఆ దేశ మాజీ క్రికెటర్
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
‘నువ్వు’ కాదు ‘మీరు’.. విజయశాంతి రిక్వెస్ట్
కేంద్ర సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకున్నా ఓకే: అఖిలపక్ష భేటీలో రాహుల్
నేనేమీ మాట్లాడలేను.. ఒంటరిగా వదిలేయండి:
ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
RRRలో నటించా.. జెప్టో యాడ్‌లో కూడా నేనే.. : ఎన్టీఆర్ డూప్
వాళ్లిద్దరి వల్లే ఈ మాత్రం.. ఇంకా కొన్ని మ్యాచ్‌లే ఉన్నాయి: కమిన్స్
‘అలా చేస్తే అర్జున్ టెండుల్కర్ మరో క్రిస్‌గేల్ అవుతాడు’
టూరిస్టులతో టెర్రరిస్ట్.. ‘మా పిల్లలు బాధపడుతుంటే.. మీరు సెలవులు ఎంజాయ్ చేస్తారా?’
ధోని.. ఆ పేరు అలాంటిది మరి!: సహచర క్రికెటర్‌కు సెహ్వాగ్ కౌంటర్
పహల్గాం ఉగ్ర దాడి.. హైదరాబాద్‌లో హైఅలర్ట్
తిరుపతిలో రోడ్డు ప్రమాదం, బస్సు బోల్తా
రామాయణ.. సాయిపల్లవి కంటే ముందు నాకే ఛాన్స్..: శ్రీనిధి
నెవ్వర్.. ఆ ఇద్దరితో విజయశాంతి నటించే ఛాన్స్ లేదు
ఎవరి జీవితాలు వారివే.. ఇక మమ్మల్ని కలపాలని చూడొద్దు: నిఖిల్
కీరవాణి దగ్గర చాకిరీ.. సింగర్స్ అందరికీ ఇష్టమే: లిప్సిక
బాబు పాలన.. మద్యం కొనుగోళ్లలో అక్రమాలు!
48 గంటల్లో మారిన కశ్మీర్ సీన్.. ‘వాళ్లేం తప్పు చేశారు?’
పంజాగుట్ట కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్ట్
చాహల్ మాజీ భార్య టాలీవుడ్ ఎంట్రీ.. ఏ సినిమానో తెలుసా?
IPL: కోట్లలో జీతాలు.. అత్యధిక మొత్తం అందుకున్న కామెంటేటర్ ఎవరో తెలుసా?
నాని హిట్-3.. సెన్సార్ బోర్డ్ కట్స్ ఇవే!
పడిపోయినా ఈ పరుగు ఆగదు.. సునీత పోస్ట్
అఘోరీకి షాక్ ఇచ్చిన సంగారెడ్డి జైలు అధికారులు
‘పహల్గాం బాధిత కుటుంబ సభ్యులకు ఉద్యోగాలిస్తాం’
తెగువ చూపారు.. వారందరికీ సెల్యూట్: వైఎస్ జగన్
యాహూ! ఎట్టకేలకు భారతీయురాలిగా..! వీడియో వైరల్
"గౌతమ్ గంభీర్‌ను చంపేస్తాం".. ఐసిస్ బెదిరింపులు
జగిత్యాలకు రెడ్ అలర్ట్
IPL 2025: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్..
ఏథర్ ఐపీవో: ఒక్కో షేర్ ధర ఎంతంటే..
పాకిస్తాన్ అధికారుల ఓవరాక్షన్.. పహల్గాం దాడిపై ఢిల్లీలో పాక్ సంబరాలు?
పండక్కి ఫ్యామిలీతో ఇండియాకు.. ఉగ్రదాడిలో టెకీ దుర్మరణం
అప్పుల కోసం చంద్రబాబు సర్కార్ కొత్త మార్గం!
సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
ఇషాన్ కిషన్‌పై దుమ్మెత్తిపోస్తున్న ఎస్ఆర్హెచ్ అభిమానులు.. అమ్ముడుపోయాడంటూ కామెంట్లు
భయానక అనుభవం.. ఉగ్ర దాడి నుంచి ఆ బృందం ఎలా తప్పించుకుందంటే?
భారీ ట్విస్ట్‌లతో థ్రిల్లర్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం
బాలకృష్ణ, నాగార్జున, బన్నీ..అందరికీ అదే పిచ్చి!
మళ్లీ పెళ్లి చేసుకున్న టాలీవుడ్ సింగర్
ఇక భారత్ విడిచి వెళ్లాల్సిందే.. పాక్ పౌరులకు హెచ్చరిక
బ్యాంకులకు ఏప్రిల్‌లో ఇంకా 4 సెలవులు..
నెత్తురోడిన కాశ్మీరం-పర్యాటకులపై ఉగ్రదాడి 26 మంది బలి
BCCI: ఫిక్సింగ్ యత్నం.. బీసీసీఐ ఆగ్రహం.. అతడిపై నిషేధం
మేఘా ఇంజనీరింగ్‌కు భారీ కాంట్రాక్టు
పాకిస్తాన్ సైన్యంలో ఫౌజీ హీరోయిన్ తండ్రి? క్లారిటీ ఇచ్చిన ఇమాన్వి
గన్నవరం విమానాశ్రయం రికార్డు
పహల్గాం ఉగ్రదాడి.. తృటిలో తప్పించుకున్న నటి..నెటిజన్స్ ఫైర్!
గద్వాలకు.. ప్రత్యేక సం‘స్థానం’
కేసీఆర్ సభ సక్సెస్ అవుతుందనుకుంటున్నా: దానం నాగేందర్
7.39 లక్షల మందికి కొత్తగా ఈపీఎఫ్
IPL 2025 RCB vs RR: గెలిచే మ్యాచ్‌లో ఓడిన రాజస్తాన్..
ఏమిటీ సింధూ నదీ జలాల ఒప్పందం?
నా వీడియో చూపించడం కరెక్ట్ కాదు: సింగర్ హారిక
బంగారం డిమాండ్‌కు ‘ధరా’ఘాతం!
ఆ ఊళ్లో అల్లుడే పెద్దకొడుకు
ఆలయాల్లో పూజలు అందుకుంటున్న సినీతారలు వీరే...
'మీ బాడీకి ఏ డ్రెస్సూ సరిపోదు'.. ప్రవస్తి ఆరోపణలకు నిర్మాత క్లారిటీ
పాక్ ఆటగాడిని వారి సొంత అడ్డాలోనే నిర్భయంగా నిలదీసిన న్యూజిలాండ్ ఆటగాడు
ఓటీటీలోకి వచ్చిన హిట్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసిన 'హన్సిక' సినిమా
కుమారుల కోసం ధీరూభాయ్ అంబానీ వదిలివెళ్లిన ఆస్తి ఎంతంటే..
ఆ వీడియోలు లీక్ చేస్తా.. ఎమ్మెల్యేను బెదిరించిన యూట్యూబర్ అరెస్ట్
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సిరీస్
పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. బిన్ లాడెన్ ఒక్కటే.. అమెరికా అధికారి సంచలన వ్యాఖ్యలు
విశ్వసనీయ మిత్రదేశం
బంగారం ధరల్లో మళ్లీ మార్పు
తిరుపతిలో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా..
IPL 2025: రాజస్తాన్‌పై ఆర్సీబీ విజయం..
పహల్గాం హీరో అతడే.. ఉగ్రవాదులతో పోరాడిన పోనీవాలా
కుటుంబ సమేతంగా పెళ్లి వేడుకలో అల్లు అర్జున్ సందడి
స్విట్జర్లాండ్ వెళ్లి ఉంటే..ప్రాణాలతో..నావీ అధికారి చివరి వీడియో వైరల్
పహల్గామ్ ఘటనపై స్పందించిన ప్రకాశ్ రాజ్.. తీవ్రమైన బాధతో రాస్తున్నా!
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నా.. నా భవిష్యత్తును ఆగం చేయొద్దు!
ప్రవస్తిది అంతా డ్రామా.. తప్పు నీవైపే.. ఇంకా లాగి ఏం సాధిస్తావ్?: సింగర్ హారిణి
ట్రాక్టర్ విక్రయాలు.. రికార్డ్!
మొన్న గ్రూప్ వన్, ఇప్పుడు సివిల్స్
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నిర్మాత ఎస్కేఎన్
393 మార్కులతో నిరాశ
తిరుమలలో హైఅలర్ట్.. భద్రత కట్టుదిట్టం
ఐక్యత వర్తమాన అవసరం
IPL 2025 RCB vs RR: గెలిచే మ్యాచ్‌లో ఓడిన రాజస్తాన్..
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
బీచ్‌లో చిల్ అవుతోన్న సుప్రీత.. తేనే కళ్లతో కవ్విస్తోన్న బిగ్‌బాస్ దివి!
ఉగ్రదాడి ఘటనపై నోరు జారిన ఎమ్మెల్యే అరెస్ట్
ఫెమా పెనాల్టీ ఫ్రేమ్‌వర్క్‌ను సడలించిన ఆర్బీఐ
పంజాగుట్ట కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్ట్
నాని హిట్-3.. సెన్సార్ బోర్డ్ కట్స్ ఇవే!
కేంద్ర సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకున్నా ఓకే: అఖిలపక్ష భేటీలో రాహుల్
ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 11,09,588 ప్రమాదాలు
ఉగ్రదాడిపై సాయి పల్లవి ట్వీట్.. మండిపడ్డ నెటిజన్స్!
పాకిస్తాన్‌కు వెళ్లిపోయిన కేన్ మామ
ప్రతిచర్యకు సిద్ధమైన పాక్.. సిమ్లా ట్రీటీకి టాటా?
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
సింధు జలాలను ఆపడమంటే యుద్ధం ప్రకటించడమే: పాక్
మళ్లీ ఉగ్ర కాండ!
మోస్ట్ పవర్ ఫుల్ ఆర్మీ కల్గిన దేశాలు ఇవే..
ఉగ్రదాడి ఘటనపై నోరు జారిన ఎమ్మెల్యే అరెస్ట్
బీచ్‌లో చిల్ అవుతోన్న సుప్రీత.. తేనే కళ్లతో కవ్విస్తోన్న బిగ్‌బాస్ దివి!
బీరప్పా.. నువ్వు గ్రేటప్పా!
సునీత మేడం.. వీటికి సమాధానం చెప్పండి: ప్రవస్తి
IND vs PAK: బీసీసీఐ కీలక నిర్ణయం
పాక్ సైన్యం చేతిలో బందీగా బీఎస్ఎఫ్ జవాన్
బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయమన్నా పోయరు!
ఐపీఎల్ క్రికెటర్ ని పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్
అతడొక అద్భుతం.. రెండేళ్లలో టీమిండియాకు ఆడుతాడు: శాంసన్
వివాహేతర సంబంధం: భార్యను పోలీసులకు అప్పగించిన భర్త
చిరంజీవి సినిమాలో విలన్‌గా టాలీవుడ్ యంగ్ హీరో!
ఉగ్రదాడిలో మీ హస్తం లేకపోతే ఎందుకు ఖండించలేదు.. పాక్ ప్రధానిని నిలదీసిన ఆ దేశ మాజీ క్రికెటర్
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
‘నువ్వు’ కాదు ‘మీరు’.. విజయశాంతి రిక్వెస్ట్
కేంద్ర సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకున్నా ఓకే: అఖిలపక్ష భేటీలో రాహుల్
నేనేమీ మాట్లాడలేను.. ఒంటరిగా వదిలేయండి:
ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
RRRలో నటించా.. జెప్టో యాడ్‌లో కూడా నేనే.. : ఎన్టీఆర్ డూప్
వాళ్లిద్దరి వల్లే ఈ మాత్రం.. ఇంకా కొన్ని మ్యాచ్‌లే ఉన్నాయి: కమిన్స్
‘అలా చేస్తే అర్జున్ టెండుల్కర్ మరో క్రిస్‌గేల్ అవుతాడు’
టూరిస్టులతో టెర్రరిస్ట్.. ‘మా పిల్లలు బాధపడుతుంటే.. మీరు సెలవులు ఎంజాయ్ చేస్తారా?’
ధోని.. ఆ పేరు అలాంటిది మరి!: సహచర క్రికెటర్‌కు సెహ్వాగ్ కౌంటర్
పహల్గాం ఉగ్ర దాడి.. హైదరాబాద్‌లో హైఅలర్ట్
తిరుపతిలో రోడ్డు ప్రమాదం, బస్సు బోల్తా
రామాయణ.. సాయిపల్లవి కంటే ముందు నాకే ఛాన్స్..: శ్రీనిధి
నెవ్వర్.. ఆ ఇద్దరితో విజయశాంతి నటించే ఛాన్స్ లేదు
ఎవరి జీవితాలు వారివే.. ఇక మమ్మల్ని కలపాలని చూడొద్దు: నిఖిల్
కీరవాణి దగ్గర చాకిరీ.. సింగర్స్ అందరికీ ఇష్టమే: లిప్సిక
బాబు పాలన.. మద్యం కొనుగోళ్లలో అక్రమాలు!
48 గంటల్లో మారిన కశ్మీర్ సీన్.. ‘వాళ్లేం తప్పు చేశారు?’
పంజాగుట్ట కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్ట్
చాహల్ మాజీ భార్య టాలీవుడ్ ఎంట్రీ.. ఏ సినిమానో తెలుసా?
IPL: కోట్లలో జీతాలు.. అత్యధిక మొత్తం అందుకున్న కామెంటేటర్ ఎవరో తెలుసా?
నాని హిట్-3.. సెన్సార్ బోర్డ్ కట్స్ ఇవే!
పడిపోయినా ఈ పరుగు ఆగదు.. సునీత పోస్ట్
అఘోరీకి షాక్ ఇచ్చిన సంగారెడ్డి జైలు అధికారులు
‘పహల్గాం బాధిత కుటుంబ సభ్యులకు ఉద్యోగాలిస్తాం’
తెగువ చూపారు.. వారందరికీ సెల్యూట్: వైఎస్ జగన్
యాహూ! ఎట్టకేలకు భారతీయురాలిగా..! వీడియో వైరల్
"గౌతమ్ గంభీర్‌ను చంపేస్తాం".. ఐసిస్ బెదిరింపులు
జగిత్యాలకు రెడ్ అలర్ట్
IPL 2025: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్..
ఏథర్ ఐపీవో: ఒక్కో షేర్ ధర ఎంతంటే..
పాకిస్తాన్ అధికారుల ఓవరాక్షన్.. పహల్గాం దాడిపై ఢిల్లీలో పాక్ సంబరాలు?
పండక్కి ఫ్యామిలీతో ఇండియాకు.. ఉగ్రదాడిలో టెకీ దుర్మరణం
అప్పుల కోసం చంద్రబాబు సర్కార్ కొత్త మార్గం!
సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
ఇషాన్ కిషన్‌పై దుమ్మెత్తిపోస్తున్న ఎస్ఆర్హెచ్ అభిమానులు.. అమ్ముడుపోయాడంటూ కామెంట్లు
భయానక అనుభవం.. ఉగ్ర దాడి నుంచి ఆ బృందం ఎలా తప్పించుకుందంటే?
భారీ ట్విస్ట్‌లతో థ్రిల్లర్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం
బాలకృష్ణ, నాగార్జున, బన్నీ..అందరికీ అదే పిచ్చి!
మళ్లీ పెళ్లి చేసుకున్న టాలీవుడ్ సింగర్
ఇక భారత్ విడిచి వెళ్లాల్సిందే.. పాక్ పౌరులకు హెచ్చరిక
బ్యాంకులకు ఏప్రిల్‌లో ఇంకా 4 సెలవులు..
నెత్తురోడిన కాశ్మీరం-పర్యాటకులపై ఉగ్రదాడి 26 మంది బలి
BCCI: ఫిక్సింగ్ యత్నం.. బీసీసీఐ ఆగ్రహం.. అతడిపై నిషేధం
మేఘా ఇంజనీరింగ్‌కు భారీ కాంట్రాక్టు
పాకిస్తాన్ సైన్యంలో ఫౌజీ హీరోయిన్ తండ్రి? క్లారిటీ ఇచ్చిన ఇమాన్వి
గన్నవరం విమానాశ్రయం రికార్డు
పహల్గాం ఉగ్రదాడి.. తృటిలో తప్పించుకున్న నటి..నెటిజన్స్ ఫైర్!
గద్వాలకు.. ప్రత్యేక సం‘స్థానం’
కేసీఆర్ సభ సక్సెస్ అవుతుందనుకుంటున్నా: దానం నాగేందర్
7.39 లక్షల మందికి కొత్తగా ఈపీఎఫ్
IPL 2025 RCB vs RR: గెలిచే మ్యాచ్‌లో ఓడిన రాజస్తాన్..
ఏమిటీ సింధూ నదీ జలాల ఒప్పందం?
నా వీడియో చూపించడం కరెక్ట్ కాదు: సింగర్ హారిక
బంగారం డిమాండ్‌కు ‘ధరా’ఘాతం!
ఆ ఊళ్లో అల్లుడే పెద్దకొడుకు
ఆలయాల్లో పూజలు అందుకుంటున్న సినీతారలు వీరే...
'మీ బాడీకి ఏ డ్రెస్సూ సరిపోదు'.. ప్రవస్తి ఆరోపణలకు నిర్మాత క్లారిటీ
పాక్ ఆటగాడిని వారి సొంత అడ్డాలోనే నిర్భయంగా నిలదీసిన న్యూజిలాండ్ ఆటగాడు
ఓటీటీలోకి వచ్చిన హిట్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసిన 'హన్సిక' సినిమా
కుమారుల కోసం ధీరూభాయ్ అంబానీ వదిలివెళ్లిన ఆస్తి ఎంతంటే..
ఆ వీడియోలు లీక్ చేస్తా.. ఎమ్మెల్యేను బెదిరించిన యూట్యూబర్ అరెస్ట్
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సిరీస్
పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. బిన్ లాడెన్ ఒక్కటే.. అమెరికా అధికారి సంచలన వ్యాఖ్యలు
విశ్వసనీయ మిత్రదేశం
బంగారం ధరల్లో మళ్లీ మార్పు
తిరుపతిలో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా..
IPL 2025: రాజస్తాన్‌పై ఆర్సీబీ విజయం..
పహల్గాం హీరో అతడే.. ఉగ్రవాదులతో పోరాడిన పోనీవాలా
కుటుంబ సమేతంగా పెళ్లి వేడుకలో అల్లు అర్జున్ సందడి
స్విట్జర్లాండ్ వెళ్లి ఉంటే..ప్రాణాలతో..నావీ అధికారి చివరి వీడియో వైరల్
పహల్గామ్ ఘటనపై స్పందించిన ప్రకాశ్ రాజ్.. తీవ్రమైన బాధతో రాస్తున్నా!
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నా.. నా భవిష్యత్తును ఆగం చేయొద్దు!
ప్రవస్తిది అంతా డ్రామా.. తప్పు నీవైపే.. ఇంకా లాగి ఏం సాధిస్తావ్?: సింగర్ హారిణి
ట్రాక్టర్ విక్రయాలు.. రికార్డ్!
మొన్న గ్రూప్ వన్, ఇప్పుడు సివిల్స్
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నిర్మాత ఎస్కేఎన్
393 మార్కులతో నిరాశ
తిరుమలలో హైఅలర్ట్.. భద్రత కట్టుదిట్టం
సినిమా

చాహల్ మాజీ భార్య టాలీవుడ్ ఎంట్రీ.. ఏ సినిమానో తెలుసా?
ధనశ్రీ వర్మ పేరు దాదాపు అందరికీ సుపరిచితమైన పేరు. ఇటీవలే భారత క్రికెటర్ చాహల్‌తో విడాకులు తీసుకుంది. 2020లో చాహల్‌ను పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగమ్మ ఐదేళ్లకే తమ వివాహా బంధానికి గుడ్ బై చెప్పేసింది. అయితే కెరియర్ పరంగా ధనశ్రీ వర్మ కొరియోగ్రాఫర్‌గా రాణిస్తున్నారు. ఆమె త్వరలోనే ఓ తెలుగు సినిమాలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇంతకీ ఆ సంగతులేంటో చూసేద్దాం.ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కొరియోగ్రాఫర్ యష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఆకాశం దాటి వస్తావా’. శశి కుమార్ ముతులూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మలయాళ నటి కార్తీక మురళీధరన్ హీరోయిన్గా నటిస్తోంది. దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్లో బలగం తర్వాత హర్షిత్, హన్షిత ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ ద్వారానే ధనశ్రీ వర్మ తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ సెట్స్‌లో ధనశ్రీ వర్మ కనిపించింది. ఈ సినిమాలో చాహల్ మాజీ భార్య కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.కాగా.. ముంబయిలో పుట్టి పెరిగిన ధనశ్రీ డెంటిస్ట్‌గా వైద్య రంగంలో వృత్తిని కొనసాగించారు. నృత్యంపై తనకున్న అభిరుచితో లెజెండరీ కొరియోగ్రాఫర్ షియామాక్ దావర్ వద్ద శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత తానే సొంతంగా డ్యాన్స్ అకాడమీని స్థాపించారు. ధనశ్రీ వర్మ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో తన డ్యాన్స్ వీడియోల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ఇక వ్యక్తిగత జీవిత విషయానికొస్తే ధనశ్రీ డిసెంబర్ 22, 2020న భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌ను వివాహం చేసుకుంది. వీరి మధ్య మనస్పర్థలు రావడంతో ఇటీవలే విడాకులు తీసుకున్నారు.

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నా.. నా భవిష్యత్తును ఆగం చేయొద్దు!
పవిత్ర లక్ష్మి (Pavithralakshmi).. ఈ తమిళమ్మాయి ఓ కాదల్ కణ్మని (2015) సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ మూవీలో అతడి కొలీగ్‌గా చిన్న పాత్రలో కనిపించింది. అదే ఏడాది ఈమె మిస్ మద్రాస్ కిరీటాన్ని సైతం గెల్చుకుంది. కూకు విత్ కోమలి అనే కుకింగ్ షోలో పాల్గొని ఎక్కువ ఫేమస్ అయింది. దీంతో ఒక్క ఏడాదిలోనే నాయి శేఖర్ (తమిళ చిత్రం), ఉల్లాసం (మలయాళం), అదృశ్యం(తమిళ, మలయాళం) అనే సినిమాలు చేసింది. జిగిరీ దోస్తు, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ మద్రాస్ చిత్రాల్లోనూ తళుక్కుమని మెరిసింది.ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదుఅయితే ఈ బ్యూటీ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందంటూ ఈ మధ్య పుకార్లు వైరల్‌గా అయ్యాయి. ఈ రూమర్లపై పవిత్ర లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసింది. నా లుక్ మారడం, బరువు పెరగడంతో నా గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుకుంటున్నారు. చాలాసార్లు వాటికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాను. అయినప్పటికీ నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నానంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కొన్ని కామెంట్లు అయితే చెప్పడానికి కూడా వీలు లేనంత దారుణంగా ఉన్నాయి.నా భవిష్యత్తు ఆగం చేయొద్దుఅందుకే మీ అందరికీ మరోసారి చెప్తున్నా.. నేను తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాను. దానికోసం చికిత్స తీసుకుంటున్నాను. ప్రస్తుతం క్షేమంగా ఉన్నాను. దయచేసి మీ వినోదం కోసం నా గురించి లేనిపోని వార్తలు రాయొద్దు. నాపై రూమర్లు సృష్టించకండి. నాకంటూ ఓ జీవితం ఉంది.. దయచేసి నా పేరు చెడగొట్టకండి.. నా భవిష్యత్తును ఆగం చేయకండి. కొంత ప్రేమ, మరికొంత గౌరవం.. మీనుంచి ఈ రెండే కోరుకుంటున్నా.. మీరెప్పుడూ నాపై ప్రేమాభిమానాలే చూపించేవారు. దాన్ని అలాగే కొనసాగించండి. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో మీ ముందుకు వస్తాను అని పవిత్ర ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. View this post on Instagram A post shared by Pavithralakshmi (@pavithralakshmioffl) చదవండి: బిగ్‌బాస్ షో హోస్ట్‌గా మళ్లీ..? నాని ఆన్సర్ ఇదే!

కుటుంబ సమేతంగా పెళ్లి వేడుకలో అల్లు అర్జున్ సందడి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 మూవీతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను తిరగరాసింది. సుకుమార్- బన్నీ కాంబోలో వచ్చిన పుష్పకు సీక్వెల్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం బన్నీ జవాన్ డైరెక్టర్ అట్లీతో జతకట్టనున్నారు. వీరిద్దరి కాంబోలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.తాజాగా ఓ పెళ్లి వేడుకలో అల్లు అర్జున్ సందడి చేశారు. తన కజిన్ పెళ్లికి ఆయన హాజరయ్యారు. ఈ పెళ్లికి అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి తమ ఇద్దరు పిల్లలతో కలిసి వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలను టీమ్ అల్లు అర్జున్ ట్విటర్లో షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. Bunny anna : Yesesaava 😳🤣@alluarjun #AA22 pic.twitter.com/6MWEZ36JjK— Allu Babloo AADHF (@allubabloo) April 24, 2025 Icon Star @alluarjun attended his cousin’s wedding, joining the family in the special celebration. ✨#AlluArjun pic.twitter.com/HFR29rUZp1— Team Allu Arjun (@TeamAAOfficial) April 23, 2025

దసరా విలన్‌పై మరో నటి ఆరోపణలు.. సెట్లో చాలా అసభ్యంగా!
దసరా విలన్ షైన్ టామ్ చాకో పేరు మలయాళ ఇండస్ట్రీలో మార్మోగిపోతోంది. ఇటీవల ఆయనపై నటి విన్సీ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. అంతేకాకుండా డ్రగ్స్ తీసుకుంటున్నారని చాకో ఉంటున్న హోటల్‌పై రైడ్ చేశారు. అయితే పోలీసులకు రాకముందే హోటల్ నుంచి తప్పించుకున్నాడు. ఇలా రోజుకో వివాదంతో టామ్ చాకో పేరు మాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. విన్సీ ఆరోపణలపై ఇప్పటికే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. ఈ వివాదంపై విచారణ కొనసాగుతున్న వేళ.. మరో నటి టామ్ చాకోపై విమర్శలు చేసింది. తనతో కూడా అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు చేసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న మలయాళ నటి అపర్ణా జాన్ ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టామ్ చాకో ప్రవర్తించిన తీరుపై మాట్లాడింది. విన్సీ అలోషియస్ చేసిన ఆరోపణలు వందశాతం నిజమేనని మద్దతుగా నిలిచింది. షైన్ టామ్ చాకో సినిమా సెట్స్‌లో చాలా అసభ్యంగా ప్రవర్తిస్తాడని చెప్పుకొచ్చింది. సెట్లో మహిళకు మానసిక క్షోభ కలిగించేలా షైన్ ప్రవర్తించాడని పేర్కొంది. అతను మాట్లాడుతున్నప్పుడు నోటి నుంచి తెల్లటి పొడి రాలుతుండేదని.. అది మాదకద్రవ్యమో? కాదో తనకు తెలియదని అపర్ణ చెప్పింది. అతని మాటలన్నీ డబుల్ మీనింగ్ అర్థం వచ్చేలా ఉంటాయని తెలిపింది.(ఇది చదవండి: దసరా నటుడు అరెస్ట్)కాగా.. ఇటీవల నటి విన్సీ ఆరోపణల తర్వాత చాకోను అరెస్టు చేసి బెయిల్‌పై విడుదల చేశారు. విన్సీ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయనప్పటికీ, అతనిపై డ్రగ్ ఆరోపణలు రావడంతో చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. టామ్ చాకో చివరిసారిగా అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించారు. తెలుగులో దసరా మూవీతో గుర్తింపు తెచ్చుకున్నారు.
న్యూస్ పాడ్‌కాస్ట్

పాకిస్తాన్‌కు భారత్ పంచ్. పహల్గాం దాడిపై కేంద్రం సీరియస్. దౌత్య సంబంధాలకు కత్తెర. సింధూ ఒప్పందం సస్పెన్షన్. ఐదు కీలక నిర్ణయాలు తీసుకున్న భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ

జమ్మూకశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రవాద దాడి... కాల్పులకు 26 మంది బలి, మరో 20 మందికి పైగా గాయాలు.. మృతుల్లో ఇద్దరు విదేశీయులు

బాబోయ్ బంగారం. దేశంలో తొలిసారి లక్ష రూపాయల మార్కును దాటేసిన పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం

ఆంధ్రప్రదేశ్‌లో డొల్ల కంపెనీకి ఎకరం 99 పైసల చొప్పున అత్యంత ఖరీదైన భూమిని కేటాయించిన కూటమి ప్రభుత్వం...3 వేల కోట్ల రూపాయల ఖరీదైన భూమిని కొట్టేసే ఎత్తుగ

అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగానే దర్యాప్తు... ఎంపీ మిథున్‌రెడ్డి విచారణలో సిట్ బాగోతం బట్టబయలు

వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసు... దర్యాప్తు ముసుగులో సిట్ అరాచకాలు

సుదీర్ఘ కాలంగా వక్ఫ్ అధీనంలో ఉన్న ఆస్తులను ఇకపై కూడా వక్ఫ్ ఆస్తులుగానే పరిగణించాలని భావిస్తున్నాం... ఈ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలనుకుంటున్నాం... సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ

ఆంధ్రప్రదేశ్‌లో ఫీజుల షెడ్యూల్‌కు చెల్లుచీటి... కూటమి పాలనలో గతితప్పిన ఫీజు రీయింబర్స్మెంట్... ఊసేలేని వసతి దీవెన

వక్ఫ్(సవరణ) చట్టంపై వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం.. చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్

ఆంధ్రప్రదేశ్‌లోని కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటం. 8 మంది సజీవ దహనం. 8 మందికి తీవ్ర గాయాలు
క్రీడలు

అతడొక అద్భుతం.. రెండేళ్లలో టీమిండియాకు ఆడుతాడు: శాంసన్
బీహార్‌కు చెందిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 14 ఏళ్ల వయస్సులోనే ఐపీఎల్ అరంగేట్రం చేసి సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ తరపున సూర్యవంశీ డెబ్యూ చేశాడు.ఈ యువ ఆటగాడు తొలి మ్యాచ్‌లోనే 34 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అందరిని ఆకట్టుకున్నాడు. తన ఐపీఎల్ కెరీర్లో ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు అందరి కళ్లు ఈ యువ ఆటగాడిపైనే ఉన్నాయి. గురువారం బెంగళూరు వేదికగా ఆర్సీబీతో రాజస్తాన్ రాయల్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో వైభవ్ ఎలా ఆడుతాడో అని అభిమానులు వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో సూర్యవంశీపై రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ప్రశంసల వర్షం కురిపించాడు. సూర్యవంశీ అతి త్వరలో టీమిండియా తరఫున అరంగేట్రం చేయబోతున్నాడని శాంసన్ జోస్యం చెప్పాడు."అతడు చాలా కాన్ఫిడెంట్‌గా కన్పిస్తున్నాడు. అతడిలో చాలా పవర్ ఉంది. మా క్రికెట్ ఆకాడమీలో గ్రౌండ్ బయటకు సిక్సర్లు కొట్టేవాడు. ఇంత చిన్న వయస్సులో అతడు భారీ సిక్సర్లు ఎలా కొడుతున్నాడని అందరూ మాట్లాడుకుంటున్నారు. వైభవ్ అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు సిద్దంగా ఉన్నట్లు కనిపిస్తున్నాడు.అతడు నాకు తమ్ముడు లాంటి వాడు. సూర్యవంశీ ఒకట్రెండు సంవత్సరాలలో భారత్ తరపున ఆడే అవకాశం ఉందని" శాంసన్ పేర్కొన్నాడు. కాగా సూర్యవంశీ అండర్-14, అండర్-16 స్థాయిలలో అద్భుతంగా రాణించాడు. ఈ క్రమంలోనే గతేడాది జరిగిన వేలంలో వైభవ్‌ను రూ. 1.1 కోట్లకు రాజస్తాన్ కొనుగోలు చేసింది.చదవండి: IPL: కోట్లలో జీతాలు.. అత్యధిక మొత్తం అందుకున్న కామెంటేటర్ ఎవరో తెలుసా?

‘అలా చేస్తే అర్జున్ టెండుల్కర్ మరో క్రిస్‌గేల్ అవుతాడు’
తండ్రి దిగ్గజ క్రికెటర్.. అంతర్జాతీయ స్థాయిలో వంద శతకాలు సాధించిన ఏకైక ఆటగాడు.. భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక పుటలు లిఖించుకున్న లెజెండ్.. కానీ ఆయన కుమారుడు మాత్రం క్రికెటర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ఇంకా తంటాలు పడుతూనే ఉన్నాడు.ఆ తండ్రి స్పెషలిస్టు బ్యాటర్.. అయితే, కుమారుడు మాత్రం ఆల్‌రౌండర్. ఇప్పటికే ఆ తండ్రీకుమారులు ఎవరో అర్థమైపోయి ఉంటుంది...! అవును సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar)- అర్జున్ టెండుల్కర్ (Arjun Tendulkar) గురించే ఈ పరిచయ వ్యాఖ్యాలు. సచిన్ తనయుడిగా మాత్రమే లోకానికి సుపరిచితమైన అర్జున్.. మేటి క్రికెటర్‌గా ఎదగాలంటే ఒక్కటే మార్గం ఉందంటున్నాడు యోగ్రాజ్ సింగ్.రాసి పెట్టుకోండి..‘‘అర్జున్ బౌలింగ్‌పై తక్కువగా బ్యాటింగ్‌పై ఎక్కువగా దృష్టి సారించాలి. సచిన్, యువరాజ్ సింగ్ మధ్య మంచి అనుబంధం ఉంది. ఇదైతే రాసి పెట్టుకోండి.. ఒకవేళ యువీ గనుక సచిన్ కుమారుడిని తన వద్దకు రప్పించుకుని.. మూడు నెలల పాటు శిక్షణ ఇస్తే.. అర్జున్ మరో క్రిస్ గేల్ అవుతాడు.ఫాస్ట్ బౌలర్‌గా ఉన్న అర్జున్ ఒకవేళ తీవ్రంగా గాయపడితే కెరీర్‌కు ప్రమాదం. ముందుగా చెప్పినట్లు అర్జున్ ఒక్కసారి యువరాజ్ దగ్గర శిక్షణ తీసుకుంటే మాత్రం అతడు ఎంతో ఎత్తుకు ఎదుగుతాడు’’ అని యోగ్రాజ్ సింగ్ క్రిక్‌నెక్ట్స్ తో పేర్కొన్నాడు. కాగా అర్జున్ ఒకప్పుడు తన దగ్గర శిక్షణ తీసుకున్నట్లు యోగ్రాజ్ గతంలో వెల్లడించిన విషయం తెలిసిందే.బౌలింగ్ ఆల్‌రౌండర్‌కాగా 25 ఏళ్ల అర్జున్ టెండుల్కర్ బౌలింగ్ ఆల్‌రౌండర్. లెఫ్టార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్ అయిన అతడు.. ఎడమచేతి వాటం బ్యాటర్. దేశవాళీ క్రికెట్లో గోవాకు ఆడుతున్న ఈ ముంబై కుర్రాడు.. 2024-25 సీజన్లో పూర్తిగా నిరాశపరిచాడు.దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ తాజా ఎడిషన్‌లో రెండు ఇన్నింగ్స్ ఆడి కేవలం 40 పరుగులు చేశాడు. అదే విధంగా మూడు మ్యాచ్‌లలో కలిపి నాలుగు వికెట్లు తీశాడు. ఇక రంజీ ట్రోఫీలో మూడు ఇన్నింగ్స్‌లో కలిపి 51 పరుగులు చేసిన అర్జున్.. బౌలర్‌గా మాత్రం ఆకట్టుకున్నాడు. నాలుగు మ్యాచ్‌లు ఆడి పదహారు వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒక ఐదు వికెట్ల ప్రదర్శన కూడా ఉండటం విశేషం.ఇక దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 2024-25 సీజన్లో రెండు మ్యాచ్‌లు ఆడి 21 పరుగులు చేసిన అర్జున్.. ఒక వికెట్ తీశాడు. ప్రస్తుతం అతడు ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ జట్టుతో ఉన్నాడు. మెగా వేలం-2025లో అర్జున్ను ముంబై రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది. చదవండి: IPL: కోట్లలో జీతాలు.. అత్యధిక మొత్తం అందుకున్న కామెంటేటర్ ఎవరో తెలుసా?

టీమిండియా దిగ్గజం బర్త్‌డే.. సారా టెండుల్కర్ పోస్ట్ వైరల్
టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) పుట్టినరోజు నేడు (ఏప్రిల్ 24). ఈరోజు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ 52వ వసంతంలో అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా బీసీసీఐ (BCCI) ఈ లెజెండరీ బ్యాటర్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది.శతక శతకాలు సాధించిన ఏకైక క్రికెటర్‘‘664 అంతర్జాతీయ మ్యాచ్‌లు.. 34,357 పరుగులు.. 201 అంతర్జాతీయ వికెట్లు.. 2011 వన్డే వరల్డ్‌కప్ విజేత.. కల్నల్ సీకే నాయుడు జీవనసాఫల్య పురస్కారం అందుకున్న విజేత..అంతర్జాతీయ క్రికెట్లో శతక శతకాలు సాధించిన ఏకైక క్రికెటర్.. దిగ్గజ, స్ఫూర్తిదాయక ఆటగాడికి పుట్టినరోజు శుభాకాంక్షలు’’ అని ఎక్స్ వేదికగా విషెస్ చెప్పింది. మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, వీరేందర్ సెహ్వాగ్, సురేశ్ రైనా, ఏబీ డివిలియర్స్ తదితరులు సచిన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.హ్యాపీ బర్త్‌డే బాబాఇక సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్ తండ్రి బర్త్‌డే సందర్భంగా తాను అమూల్యంగా భావించే ఫొటోలను పంచుకుంది. అంతేకాదు తన తండ్రి గొప్పదనాన్ని వివరిస్తూ.. ‘‘ఎవరికీ భయపడొద్దు.. అయితే, ప్రతి ఒక్కరిని గౌరవించాలి అని నేర్పించిన వ్యక్తికి...ఫ్రాక్చర్ అయిన తన భుజంపై నన్ను మోసుకువెళ్లిన దృఢమైన సారథికి.. నా ఫొటోషూట్లను మరింత ప్రత్యేకంగా మార్చే వ్యక్తికి.. అన్నిటికంటే ముఖ్యంగా జీవితాన్ని ఆస్వాదిస్తూ నవ్వులతో ప్రయాణాన్ని కొనసాగించాలని చెప్పే వ్యక్తికి హ్యాపీ బర్త్‌డే బాబా’’ అంటూ సారా క్యాప్షన్ జత చేయగా.. ఆమె పోస్ట్ వైరల్‌గా మారింది.కాగా 1989లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన సచిన్ టెండుల్కర్ లిటిల్ మాస్టర్ నుంచి క్రికెట్ దేవుడిగా ఎదిగాడు. తన ఇరవై రెండేళ్ల కెరీర్లో లెక్కలు మిక్కిలి రికార్డులు సాధించిన మాస్టర్ బ్లాస్టర్.. తన కెరీర్లో అంతర్జాతీయ స్థాయిలో ఏకైక టీ20 ఆడాడు.సచిన్ కెరీర్లో టాప్-9 రికార్డ్స్ ఇవే👉టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్- 15,921👉వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్- 18,426👉అత్యధిక వన్డేలు ఆడిన ప్లేయర్- 463👉అత్యధిక టెస్టులు ఆడిన ప్లేయర్- 200👉వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ చేసిన క్రికెటర్👉అంతర్జాతీయ క్రికెట్లో వంద సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్👉దేశవాళీ క్రికెట్లో ఇరానీ ట్రోఫీ, రంజీ ట్రోఫీ, దులిప్ ట్రోఫీ అరంగేట్రంలోనే శతక్కొట్టిన వీరుల జాబితాలో తొలి స్థానం👉టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్- 51👉వరల్డ్‌కప్ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్- 2278.చదవండి: IND Vs PAK: బీసీసీఐ కీలక నిర్ణయం

IPL: కోట్లలో జీతాలు.. అత్యధిక మొత్తం అందుకున్న కామెంటేటర్ ఎవరో తెలుసా?
ఐపీఎల్ అంటే ఫోర్లు, భారీ సిక్సర్లే కాదు.. వాటిని బాదిన ఆటగాళ్లు, వారు ఆడిన షాట్లను విశ్లేషిస్తూ.. వారి ఆట కట్టించేందుకు బౌలర్లు రచించే వ్యూహాలు.. ఇలా ఒక్కటేమిటి.. మ్యాచ్ ఆసాంతం తమ అద్భుతమైన గొంతుతో ఆటను కళ్లకు గట్టినట్లు చూపుతున్నారే అనేలా వ్యాఖ్యానం చేసే కామెంటేటర్లు కూడా ఇందులో భాగమే!భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్‌కు చెందిన ఎంతో మంది దిగ్గజాలు ఐపీఎల్లో వ్యాఖ్యాతలుగా అలరిస్తున్నారు. మరి.. వాళ్లకు ఇచ్చే పారితోషికం ఎంత? అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే కామెంటేటర్ ఎవరు?.. హిందీ, ఇంగ్లిష్, ప్రాంతీయ భాషల్లో కామెంట్రీ చేసే సీనియర్, జూనియర్ల జీతాలు ఎంత? తదితర విషయాలు గమనిద్దామా?టీమిండియా దిగ్గజాలు సునిల్ గావస్కర్, అనిల్ కుంబ్లే, రవిశాస్త్రి నుంచి ఆకాశ్ చోప్రా, హర్షా భోగ్లే, ఇయాన్ బిషప్ వరకు అత్యధిక పారితోషికం అందుకునే కామెంటేటర్ల జాబితాలో ఉన్నారు. వీరిలో సునిల్ గావస్కర్ అత్యధికంగా ఇంగ్లిష్ కామెంట్రీకి రూ. 4.17 కోట్ల వరకు అందుకుంటున్నట్లు సమాచారం.ఐపీఎల్-2024కు గానూ అత్యధిక పారితోషికం అందుకున్న టాప్-10 కామెంటేటర్లు 1. సునిల్ గావస్కర్ (భారత్)- ఇంగ్లిష్- రూ. 4.17 కోట్లు2. మాథ్యూ హెడెన్ (ఆస్ట్రేలియా)- ఇంగ్లిష్- రూ. 4.17 కోట్లు3. కెవిన్ పీటర్సన్ (ఇంగ్లండ్)- ఇంగ్లిష్- రూ. 4.17 కోట్లు4. ఇయాన్ బిషప్ (వెస్టిండీస్)- ఇంగ్లిష్- రూ. 4.17 కోట్లు5. హర్షా భోగ్లే (భారత్)- ఇంగ్లిష్- రూ. 4.1 కోట్లు6. రవిశాస్త్రి (భారత్)- ఇంగ్లిష్- రూ. 4 కోట్లు7. ఆకాశ్ చోప్రా (భారత్)- హిందీ- రూ. 2.92 కోట్లు8. సంజయ్ మంజ్రేకర్ (భారత్)- హిందీ- రూ. 2.8 కోట్లు9. సురేశ్ రైనా (భారత్)- హిందీ- రూ. 2.5 కోట్లు10. హర్భజన్ సింగ్ (భారత్)- హిందీ- రూ. 1.5 కోట్లు11. జతిన్ సప్రూ (భారత్)- హిందీ- ఒక్కో మ్యాచ్‌కు రూ. 1.5 లక్షల చొప్పునటాప్ టైర్, జూనియర్ కామెంటేటర్ల జీతాల మధ్య భారీ వ్యత్యాసం (ఒక్కో మ్యాచ్‌కు)ఇంగ్లిష్- టాప్ టైర్ కామెంటేటర్లకు రూ. 6- 10 లక్షలు- జూనియర్లకు రూ. 35 వేల చొప్పునహిందీ- టాప్ టైర్ కామెంటేటర్లకు రూ. 6- 10 లక్షలు- జూనియర్లకు రూ. 35 వేల చొప్పునతమిళ్ లేదా ఇతర ప్రాంతీయ భాషలు- టాప్ టైర్ కామెంటేటర్లకు రూ. 6- 10 లక్షలు- జూనియర్లకు రూ. 35 వేల చొప్పునఆటగాళ్లతో పాటు కామెంటేటర్లపైనా కనక వర్షం కురిపించేదే ఐపీఎల్. మరి క్యాష్ రిచ్ లీగ్ అంటే ఆ మాత్రం ఉంటుంది కదా! అంటారా?!చదవండి: IND Vs PAK: బీసీసీఐ కీలక నిర్ణయం
బిజినెస్

వరుస లాభాలకు బ్రేక్..
దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 82 పాయింట్లు నష్టపోయి 24,246 వద్దకు చేరింది. సెన్సెక్స్ 315 పాయింట్లు దిగజారి 79,801 వద్దకు చేరింది. ఇటీవల వరుసగా పెరిగిన మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లోకి చేరుకున్నాయి.సెన్సెక్స్ 30 సూచీలో ఇండస్ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా మోటార్స్, సన్‌ఫార్మా, టైటాన్, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్ స్టాక్‌లు లాభాల్లో ముగిశాయి. హెచ్‌యూఎల్, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, జొమాటో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎం అండ్ ఎం, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, ఇన్ఫోసిస్, నెస్లే, టీసీఎస్ స్టాక్‌లు నష్టపోయాయి.ఇదీ చదవండి: ప్రభుత్వ బాధ్యతల నుంచి మస్క్ వెనక్కిఈ రోజు మార్కెట్ల ఒడిదొడుకులకుగల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇన్వెస్టర్లు ఇటీవలి లాభాలను స్వీకరించేందుకు పూనుకున్నారు. ఇది అమ్మకాల ఒత్తిడికి దారితీసింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

ప్రభుత్వ బాధ్యతల నుంచి మస్క్ వెనక్కి
ప్రపంచ కుబేరుడు, దిగ్గజ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనలో చేపట్టిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ(డోజ్)లో తన ప్రమేయాన్ని గణనీయంగా తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. డోజ్‌కు కేటాయిస్తున్న సమయాన్ని వచ్చే నెల నుంచి తగ్గించబోతున్నట్లు చెప్పారు. టెస్లాపై దృష్టి సారించాలనే ఉద్దేశంతో వారానికి ఒకటి నుంచి రెండు రోజులు మాత్రమే డోజ్‌కు సమయం కేటాయిస్తానని మస్క్ పేర్కొన్నారు.టెస్లాపై దృష్టి సారిస్తూ అధిక సమయం దానికే కేటాయించబోతున్నట్లు మస్క్ తీసుకున్న నిర్ణయంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఎలాన్ మస్క్ డోజ్ బాధ్యతలకు అధిక సమయం కేటాయించనప్పటికీ ట్రంప్ మస్క్‌పై ప్రశంసలు కురిపించారు. ఈమేరకు అమెరికాలోని ఓవల్ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేసిన సందర్భంగా మస్క్ తెలివితేటలు, దేశభక్తిని కొనియాడారు. ఫెడరల్ సంస్కరణల్లో ఆయన చేసిన కృషిని సమర్థించారు.నిజమైన దేశభక్తుడు..మస్క్ తన ప్రభుత్వ పాత్ర కంటే టెస్లా వ్యాపారానికే అధిక ప్రాధాన్యత ఇస్తారని అందరికీ తెలుసునని ట్రంప్ అన్నారు. డోజ్‌లో మస్క్ పాత్ర వివాదాన్ని రేకెత్తించినప్పటికీ టెక్నాలజీలో తాను ఎంతో కృషి చేశారని చెప్పారు. రాజకీయ విభేదాల వల్ల తన ఆవిష్కరణల ప్రాధాన్యతను తగ్గించకూడదన్నారు. తాను నిజమైన దేశభక్తుడన్నారు. స్పేస్ఎక్స్తో మస్క్ ఏరోస్పేస్ విభాగంలో చేసిన ఆవిష్కరణలను గుర్తు చేసుకున్నారు. స్పేస్ఎక్స్ రాకెట్లు నింగిలో దూసుకెళ్లి, తిరిగి క్షేమంగా ల్యాండ్ అవ్వడం ఒక అద్భుతం అన్నారు. ఇది కేవలం మస్క్‌తోనే సాధ్యమైందని చెప్పారు. తిరిగి తాను త్వరలోనే డోజ్‌కు అధిక సమయం కేటాయించాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: 7.39 లక్షల మందికి కొత్తగా ఈపీఎఫ్2025 మొదటి త్రైమాసికంలో టెస్లా లాభాలు 71% క్షీణించాయి. మస్క్ సంపద తగ్గడానికి తాన వ్యాపారాల్లో పెరుగుతున్న రాజకీయ ప్రమేయమే కారణమని తెలుస్తోంది. ట్రంప్ ఎన్నికల ప్రచారానికి మస్క్ భారీగా ఖర్చు చేశారు. దీంతో అమెరికా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత.. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ (DOGE) అధిపతిగా బాధ్యతలు స్వీకరించారు.

7.39 లక్షల మందికి కొత్తగా ఈపీఎఫ్
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) సామాజిక భద్రతా పథకం కిందకు ఫిబ్రవరి నెలలో నికరంగా రూ.16.10 లక్షల మంది సభ్యులు చేరారు. 2024 ఫిబ్రవరి నెలలో సభ్యుల నికర చేరికతో పోల్చితే 4 శాతం ఎక్కువ మందికి ఉపాధి లభించినట్టు ఈపీఎఫ్‌వో పేరోల్ గణంకాలు తెలియజేస్తున్నాయి. ఇందులో 7.39 లక్షల మంది కొత్తగా చేరారు. పెరుగుతున్న ఉపాధి అవకాశాలు, ఉద్యోగుల ప్రయోజనాలపై విస్తృతమవుతున్న అవగాహన, ఈపీఎఫ్‌వో అవగాహన కార్యక్రమాలు కొత్త సభ్యుల చేరిక పెరిగేందుకు కారణమని కార్మిక శాఖ తన ప్రకటనలో పేర్కొంది.కొత్త సభ్యుల్లో 4.27 లక్షల మంది 18–25 ఏళ్ల వయసు నుంచి ఉన్నారు. మొత్తం కొత్త సభ్యుల్లో వీరి వాటాయే 58 శాతంగా ఉంది. అంటే సంఘటిత రంగంలో వీరు మొదటిసారి ఉపాధి పొందినట్టు తెలుస్తోంది. సుమారుగా 13.18 లక్షల మంది సభ్యులు ఒక సంస్థను వీడి మరో సంస్థలో చేరిపోయారు. గతేడాది ఇదే నెలలో పోల్చి చూస్తే 12 శాతం పెరుగుదల నమోదైంది. పాత ఖాతాను మూసివేయకుండా, కొత్త సంస్థకు బదిలీ చేసుకున్నారు.3.37 లక్షల మంది మహిళలు.. ఫిబ్రవరిలో ఈపీఎఫ్‌వోలో నికరంగా చేరిన సభ్యుల్లో 3.37 లక్షల మంది మహిళలు కావడం గమనార్హం. 2024 ఫిబ్రవరి గణాంకాలతో పోల్చి చూస్తే 9.23 శాతం పెరుగుదల నమోదైంది. ఇందులో 2.08 లక్షల మంది కొత్తగా చేరారు. 2024 ఫిబ్రవరితో పోల్చి చూస్తే కేవలం 1.26 శాతమే పెరిగింది. అత్యధికంగా మహారాష్ట్ర నుంచి ఫిబ్రవరిలో 20.90 శాతం సభ్యులు నికరంగా చేరారు. ఆ తర్వాత తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, హర్యాన, ఢిల్లీ, తెలంగాణ, యూపీ నుంచి 5 శాతానికి పైన సభ్యులు నమోదయ్యారు. ఫిష్ ప్రాసెసింగ్, నాన్ వెజిటేరియన్ ఆహార కేంద్రాలు, సొసైటలు, క్లబ్‌లు, స్వీపింగ్ సేవల్లో సభ్యుల చేరిక పెరిగింది. ఎగుమతి సేవల్లో సభ్యుల చేరిక 41.72 శాతంగా ఉంది.

ఫ్రెషర్లకు జాబ్స్ జాతర.. 4 లక్షల ఉద్యోగాలు
ముంబై: దేశీయంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) ఫ్రెషర్లకు భారీగా కొలువులు రానున్నాయి. 2030 నాటికి 4 లక్షల పైచిలుకు ఉద్యోగాల కల్పన జరగనుంది. హెచ్ఆర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫాం ఫస్ట్‌మెరీడియన్ ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. డిజిటల్ సామర్థ్యాలున్న నిపుణుల లభ్యత, వ్యయాలపరంగా అనుకూల పరిస్థితులు తదితర అంశాల కారణంగా భారత్‌లో జీసీసీ వ్యవస్థ వేగంగా ఎదుగుతోంది. 2030 నాటికి ఇది 110 బిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయని ఫస్ట్‌మెరీడియన్ బిజినెస్ సర్వీసెస్ సీఈవో సునీల్ నెహ్రా తెలిపారు.ఈ వృద్ధితో 2030 నాటికి జీసీసీల్లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 30 లక్షలకు చేరుతుందని పేర్కొన్నారు. ఇందులో సుమారు ఎంట్రీ స్థాయి ఉద్యోగాలు గణనీయంగా ఉంటాయని వివరించారు. జీసీసీ సిబ్బందిలో మహిళల వాటా 40 శాతానికి చేరవచ్చని పేర్కొన్నారు.
ఫ్యామిలీ

Vaisakha Masam పర్వదినాల వైశాఖ : ఎన్ని విశేషాలో!
28, సోమవారం నుంచి మే 27, మంగళవారం వరకు వైశాఖమాసంసంవత్సరంలోని అన్ని మాసాలూ విశిష్టమైనవే అని చాటి చెప్పే గొప్ప సంస్కృతి మనది. శ్రీమన్నారాయణునికి అత్యంత ప్రీతికరమైన వైశాఖమాసంలో స్నానానికి, దానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ వైశాఖమాసంలో ప్రతిరోజూ పుణ్యతీర్థాల్లో స్నానం చేయటం విశేష ఫలితాన్నిస్తుందని పద్మపురాణం చెబుతోంది. నెలంతా స్నానం చేయలేనివారు కనీసం శుక్లపక్ష త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ తిథుల్లో స్నానం చేసినా సకలపాపాల్ని నివృత్తి అవుతాయి. స్నానం తర్వాత త్రికరణశుద్ధిగా విష్ణుపూజ చేయాలి. అట్లాగే యథాశక్తి ఏకభుక్తం, నక్తం ఆచరించేవారికి కోరిన కోరికలన్నీ సిద్ధిస్తాయని వైశాఖ పురాణం చెబుతోంది. పాలిచ్చే ఆవును, పాదుకలు, చెప్పులు, గొడుగు, విసనకర్ర, అన్ని సౌకర్యాలతో కూడిన శయ్య, దీపం, అద్దం– ఇవన్నీ గురువుకి దానంగా ఇవ్వాలి. అశక్తులైనవారు చలివేంద్రాలు నిర్వహించటం, పరమశివునికి నిరంతరాయంగా అభిషేకం జరిగే ఏర్పాట్లు చేయడం, పితృదేవతల తృప్తి కోసం చెప్పులు, గొడుగు, పల్చని వస్త్రాలు, చందనం, పూలు, పండ్లు, ఇంకా నీటితో నింపిన కుండని దానం చేయటం అన్ని విధాలా మేలుని కలిగిస్తుంది.ఈ మాసం ఈ పర్వదినాలు... అక్షయతృతీయ...వైశాఖ శుద్ధ తృతీయను అక్షయ తృతీయ అంటారు. ఈరోజున చేసే పూజలు, హోమం, దానం, పితృ తర్పణం అక్షయమైన పుణ్యఫలాన్ని ఇస్తాయి కాబట్టే దీనికా పేరొచ్చింది. ఈ పర్వదినాన నీటితో నింపిన కుండ, గోధుమలు, శనగలు ధాన్యాలు, పెరుగన్నం దానం చేయటం వల్ల శాశ్వతంగా శివ సాయుజ్యాన్ని పొందవచ్చని పురాణోక్తి. అదేవిధంగా గొడుగు, ΄ాదరక్షలు, గోవు, భూమి, బంగారం, వస్త్రాలను దానం చేయటం ఎంతో పుణ్యప్రదం.పరశురామ జయంతి...శ్రీమహావిష్ణువు పరశురామునిగా అవతరించిన వైశాఖ శుద్ధ తదియ పరశురామ జయంతిగా చెప్పబడుతోంది. వైశాఖ శుక్ల తృతీయ నాడు పునర్వసు నక్షత్రంలో రాత్రి సమయంలో సాక్షాత్తూ ఆ హరియే పరశురాముడిగా రేణుకా గర్భం నుండి స్వయంగా అవతరించాడు. అంతటి మహా తపశ్శాలి జయంతిని మనం యుగయుగాలుగా జరుపుకుంటున్నాం. ఈరోజు ఉపవాసం చేసి ప్రదోషకాలంలో పరశురాముని షోడశోపచారాలతో పూజించిన వారికి శత్రు పీడ ఉండదని వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. గంగోత్పత్తి...గంగోత్పత్తి అంటే గంగాదేవి ఆవిర్భవించటం లేదా అవతరించటం. వైశాఖ శుక్ల సప్తమిన గంగోత్పత్తి అని పృథ్వీచంద్రోదయ గ్రంథం చెబుతోంది. వైశాఖ శుక్ల సప్తమిన జహ్ను మహర్షి కోపంతో గంగను తాగాడు. తన కోపం చల్లారాక మళ్ళీ కుడిచెవి నుండి వదిలిపెట్టాడు. ఈ కారణంగా ఈ రోజున గంగానదిలో స్నానం చేయటం చెప్పలేనంత ఫలితాన్ని ఇస్తుంది. కనీసం గంగాదేవిని స్మరిస్తూ పుణ్య నదుల్లో పవిత్ర స్నానం చేస్తే కూడా మంచి ఫలితాన్ని పొందవచ్చు. అదీ వీలు కానప్పుడు చెరువు వద్ద లేదా కాలువ వద్ద గంగను ధ్యానిస్తూ స్నానాలాచరించవచ్చు. హనుమజ్జయంతి...శ్రీరామ భక్తాగ్రేసరుడైన హనుమంతుడు – చైత్ర పౌర్ణమినాడు జన్మించినట్లు పలు గ్రంథాలు చెబుతున్నాయి. కాగా పరాశర సంహిత వైశాఖ బహుళ దశమిని ఆంజనేయుడి జన్మదినంగా పేర్కొంటోంది. అందుకే దక్షిణ భారతదేశంలో వైశాఖ బహుళ దశమినాడు హనుమజ్జయంతి జరుపుకుంటూ ఉండగా, ఉత్తర భారతదేశంలో చైత్ర పౌర్ణమిని హనుమజ్జయంతిగా భావించి వేడుకలు జరుపుతారు. ఈరోజున ఆంజనేయస్వామిని పూజించటం వలన గ్రహ దోషాలు నివారించబడతాయి. ఇంకా భూత, ప్రేత, పిశాచాల పీడలు తొలగి, గాలి చేష్టలు వంటి మానసిక రుగ్మతలు కూడా తొలగిపోతాయి. హనుమజ్జయంతినాడు సుందరకాండ, హనుమాన్ చాలీసాపారాయణ చేయడం మంచిది. ఈ రోజు శ్రీ సీతారామచంద్రులను పూజించడం వల్ల హనుమంతుని అనుగ్రహాన్ని శీఘ్రంగా పొందవచ్చు. నృసింహ జయంతి...వైశాఖ శుద్ధ చతుర్దశినాటి సాయంకాలం నరసింహమూర్తి హిరణ్యకశిపుని వధించేందుకు ఆవిర్భవించాడని పురాణాలు చెబుతున్నాయి. నృసింహ జయంతినాడు బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేసి స్వామికి షోడశోపచార పూజ జరిపి, శ్రీ నృసింహస్తోత్రం–శ్రీ నృసింహ సహస్ర నామ జపం చేసిపానకం–వడపప్పు, చక్ర పొంగలి–దద్ధ్యోదనం నివేదిస్తే స్వామి వారి అనుగ్రహంతో సర్వసంపదలు లభిస్తాయని ప్రతీతి. వైశాఖ పూర్ణిమ– బుద్ధ పూర్ణిమ...లోకంలోని ప్రజల దుఃఖ నివారణకోసం, శాంతిని నెలకొల్పటం కోసం గౌతముడు శుద్ధోదన చక్రవర్తికి, మహామాయకు జన్మించిన వైశాఖ శుద్ధ పూర్ణిమకే బుద్ధజయంతి అని పేరు. గౌతముడు బుద్ధుడిగా పరివర్తన చెందిన ఈ రోజుకే బుద్ధపూర్ణిమ అని కూడా పేరు.వైశాఖ శుద్ధ దశమి – శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి... తెలుగు రాష్ట్రాల్లోని హిందువులకు మరీ ముఖ్యంగా ఆర్యవైశ్యులకు వారి కులదైవం అయిన వాసవీ మాత ఎంతో ముఖ్యం. అలాంటి వాసవి జయంతి వైశాఖ శుద్ధదశమి నాడు, సాక్షాత్తు ఆ పరమేశ్వరి అవతారమైన వాసవీదేవి సుమారు వెయ్యేండ్ల క్రితం పెనుగొండలో ‘కుసుమ శ్రేష్టి’, కుసుమాంబ పుణ్యదంపతులకు వైశాఖ శుద్ధ దశమి, శుక్రవారం నాడు జన్మించింది.వైశాఖ శుద్ధ ఏకాదశి – మోహినీ ఏకాదశి...ఈ మాసంలో వచ్చే ఏకాదశినే మోహిని ఏకాదశి అని అంటారు. ఈ రోజు ఏకాదశి వ్రతం ఆచరించినవారికి మహావిష్ణువు అక్షయంగా సంపదలు ఇస్తాడని, వారు ఇహలోక ఆనందాన్ని అనుభవించిన పిమ్మట వారికి విష్ణు లోక ప్రవేశం కలుగుతుందని పురాణ వచనం.వైశాఖ పూర్ణిమ – మహావైశాఖి...వైశాఖ పూర్ణిమకి మహావైశాఖి అని పేరు. దశావతారాల్లో ద్వితీయ అవతారమైన కూర్మరూపాన్ని శ్రీమహావిష్ణువు ఈనాడే ధరించాడు. ఈ వేళ శ్రీకూర్మరూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువును పూజించడం సత్ఫలితాలనిస్తుంది.వైశాఖ శుద్ధ పూర్ణిమన్నమయ్య జయంతి...తెలుగులో తొలి వాగ్గేయకారుడు, సంకీర్తనాచార్యుడు, కలియుగదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి 32 వేల కవితలతో సంకీర్తనలు సమర్పించిన పద కవితా పితామహుడు తాళ్ల΄ాక అన్నమాచార్యుడు సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు నందక ఖడ్గం అంశగా నారాయణసూరి, లక్కమాంబ దంపతులకు జన్మించిన పర్వదినం వైశాఖ శుద్ధ పౌర్ణమినాడు తిరుమల తిరుపతి దేవస్థానంలో పెద్ద ఎత్తున అన్నమయ్య జయంతి వేడుకలను అత్యంత వైభవంగా జరుపుతారు.శంకర జయంతి... రామానుజ జయంతి...వైశాఖ శుద్ధ పంచమి జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు, రామానుజాచార్యుల వారు జన్మించిన అత్యంత విశిష్టమైన తిథి. ఈ రోజున వైష్ణవులు తప్పనిసరిగా రామానుజుల జయంతిని వైభవంగా జరుపుకుంటే, వైదిక మతానుసారులు శంకర జయంతిని చాలా నిష్ఠగా జరుపుకుంటారు. వైశాఖ బహుశ విదియ– నారద జయంతి...బ్రహ్మ మానస పుత్రుడు, పరమ భాగవతోత్తముడు, సకల శాస్త్ర పారంగతుడు, సంగీత కోవిదుడు, అనుక్షణం నారాయణ నామస్మరణతో ఆనంద పారవశ్యుడయ్యే నారదుడు పుట్టిన ఈ పర్వదినాన ఆయన పేరు మీదుగాపాత్రికేయులకు పురస్కారాలు ప్రదానం చేయడం ప్రతీతి. నారాయణ లోక కల్యాణం కోసం కలహ భోజనుడిగా పేరు తెచ్చుకున్న నారద మహర్షిని స్మరించు కోవడం చాలా మంచిది.వైశాఖ బహుళ ఏకాదశి– నిర్జల ఏకాదశి...ఈరోజు చుక్క నీటిని కూడా తాగకుండా ఉపవసించిన వారి పట్ల ప్రసన్నుడై శ్రీ మహావిష్ణువు సకల సంపదలు కలిగించి, అంతిమాన మోక్షం ప్రసాదిస్తాడని ప్రతీతి. వైశాఖ శుద్ధ దశమి– అన్నవరం సత్యదేవుని కల్యాణ మహోత్సవం...తిరుమల తరువాత అంతటి మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం, కోరిన వరాలిచ్చే సత్యదేవుడు కొలువైన దివ్యక్షేత్రం అన్నవరం. శ్రీ అనంతలక్ష్మీ రమాదేవి అమ్మవార్లతో కలిసి రత్నగిరిపై (అన్నవరం కొండ)పై శ్రీ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి కొలువైన ఈ పుణ్య స్థలంలో వెశాఖ శుద్ధ దశమినాడు సీతారాములే పెళ్లిపెద్దలుగా సత్యదేవుని వివాహం కన్నుల పండువగా జరుగుతుంది.

Sperm Race ఇది రొటీన్ రేస్ కాదు! సమ్‌థింగ్ స్పెషల్!
ఈ నెల 25న ప్రపంచంలోనే తొలిసారిగా లాస్ ఏంజిల్స్‌లో ‘లైవ్ స్పెర్మ్ రేస్’ జరగనుంది. జీవనశైలిలో మార్పులు... మొదలైన వాటివల్ల పురుషుల్లో పెరుగుతున్న సంతాన లేమి అనే క్లిష్టమైన సమస్యపై ఈ రేస్ దృష్టి సారిస్తుంది.‘ఎవరి స్పెర్మ్ హెల్తీయెస్ట్? ఫాస్టెస్ట్?’ అనే దానిపై జరిగేపోటీ ఇది. పోటీ ఎలా ఉంటుంది? అనే విషయానికి వస్తే... నిజమైన స్పెర్మ్‌తో కూడిన రేస్ ఇది. మానవ ప్రత్యుత్పత్తి మార్గాన్ని అనుసరించేలా మైక్రోస్కోపిక్ రేస్ ట్రాక్ రూపొందించారు. సింక్రనైజ్డ్ స్టార్టర్లతో రసాయన సంకేతాలు, ఫ్లూయిడ్ డైనమిక్స్ కోర్సు ద్వారా స్పెర్మ్ నమూనాలు ఈత కొట్టేలా చేస్తారు. ఈపోటీని యాక్షన్ హై–రిజల్యూషన్ కెమెరాతో రికార్డ్ చేస్తారు. విజేతను నిర్ణయించడానికి మూడు రేసులు జరుగుతాయి. ప్లే–బై–ప్లే కామెంటరీ అలరిస్తుంది.ఇన్స్టంట్ రీప్లే, కామెంటరీ, గణంకాలు, లీడర్ బోర్డ్‌లు, ప్రెస్ కాన్ఫరెన్స్‌లను అభిమానులు ఆస్వాదించేలా చేస్తుంది.ఈ రేస్‌లో బెట్టింగ్ కూడా ఉంటుంది!అత్యంత వేగంగా ఈత కొట్టే స్పెర్మ్‌పై అభిమానులు పందెం కట్టవచ్చు. ‘ఏ లాఫ్ విత్ ఏ డీపర్ పర్పస్’ నినాదంతో ఈ రేస్‌కు శ్రీకారం చుట్టారు. యువ మిలియనీర్ల బృందం ఈ విచిత్ర పోటీని నిర్వహిస్తోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే హెల్త్, టెక్, ఎంటర్టైన్మెంట్లను మిళితం చేసి రూపొందించిన రేస్ ఇది. ‘ఎవరూ టచ్ చేయని అంశాన్ని తీసుకొని ఆసక్తికరంగా ఈ రేస్‌ను రూపొందించాం. ఇది పురుషుల సంతానలేమి గురించి ప్రజలు నిస్సంకోచంగా మాట్లాడుకునేలా చేస్తుంది’ అంటున్నారు పోటీ నిర్వాహకులు.రేస్ ఎలా ఉండబోతుందో తెలియజేయడానికి ‘ఎక్స్’లో ‘ది స్పెర్మ్ ట్రాక్: నాట్ యువర్ యావరేజ్ రేస్’ టైటిల్‌తో ట్రైలర్ విడుదల చేశారు. ఈ రేస్‌లో పాల్గొనే టీమ్‌లను కూడా పరిచయం చేశారు. రేస్ ఉద్దేశం గురించి ‘స్పెర్మ్ రేసింగ్ మేనిఫెస్టో’ కూడా విడుదల చేశారు. ఈ మైక్రోస్కోపిక్ బ్యాటిల్లో వీర్య విజేత ఎవరో వేచి చూద్దాం.ఇది చదవండి: స్విట్జర్లాండ్ వెళ్లి ఉంటే..ప్రాణాలతో..నావీ అధికారి చివరి వీడియో వైరల్

Divorce: అక్కడ విడాకులంటే మహిళలకు పండగే పండగ!
సాధారణంగా విడాకులను (Divorce) ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఒక ఫెయిల్యూర్‌గానే పరిగణిస్తున్నారు. కాలమెంత మారినా విడాకులు తీసుకున్న మహిళను చిన్నచూపు చూసే ధోరణి మాత్రం పోలేదు. డైవోర్స్‌ని ఓ అవమానంగా, పరువు ప్రతిష్ఠలకు భంగంగా భావించే పరిస్థితే ఇంకా! అయితే వాయవ్య ఆఫ్రికా దేశమైన మారిటానియా (Mauritania) తీరు ఇందుకు భిన్నం. అక్కడ విడాకులు అంటే ఒక వేడుక. ఆ దేశంలోని మారి తెగలోని మాతృస్వామ్య పద్ధతులే ఇందుకు కారణం అంటారు పరిశీలకులు, విశ్లేషకులు. మారిటానియాలో ఒక వివాహిత ఎన్నిసార్లయినా విడాకులు తీసుకోవచ్చు. ఆ విడాకుల సందర్భాన్ని ఒక మెహెందీ, పాటలు, డాన్సులు, విందుతో ఒక సెలబ్రేషన్‌గా నిర్వహిస్తారు. దాని ఉద్దేశం.. ఆ అమ్మాయి మళ్లీ పెళ్లికి సిద్ధంగా ఉందని తెలియజెప్పడమేనట. అమ్మాయిలైతే విడాకులను తమకు దొరికిన స్వేచ్ఛలా భావిస్తారట. విడాకులు తీసుకున్న యువతులు తమ అభిరుచుల్లో ప్రావీణ్యాన్నిపెంపొందించుకునే ప్రయత్నం చేస్తారట. కొంతమంది పైచదువులు చదువుకుంటారు, కొంతమంది రాజకీయాల వైపు మళ్లుతారు, ఇంకొంతమంది ఆర్టిస్ట్‌లు అవుతారు.. ఇలా తమకు నచ్చిన రంగాన్ని ఎంచు కుంటారు. పిల్లలుంటే వాళ్ల సంరక్షణ తల్లి చాయిసే! చదవండి: స్విట్జర్లాండ్ వెళ్లి ఉంటే..ప్రాణాలతో..నావీ అధికారి చివరి వీడియో వైరల్ఇంకో విషయం ఏంటంటే.. విడాకులు తీసుకున్న ఆడవాళ్లందరికీ ఒక మార్కెట్ ఉంటుంది. అందులో వాళ్లింటి సామాన్లన్నిటినీ అమ్మేస్తారు. ఒకరకంగా ఈ మార్కెట్‌ను వాళ్లు తమ స్వేచ్ఛకు ప్రతీకగా భావిస్తారు. పాత భారాన్నంతా దింపేసుకుని కొత్త జీవితానికి సిద్ధంగా ఉన్నామనే సూచననిస్తున్నట్టన్నమాట. ఇంకో ముఖ్యమైన విషయం.. మారిటానియాలో కొత్త పెళ్లికొడుకులు డైవోర్స్ అయిన మహిళలను చేసుకోవడానికే మొగ్గు చూపుతారు. ఎందుకంటే సంసారంలో వాళ్లు అనుభవజ్ఞులని. అందుకే పెళ్లికి అక్కడ విడాకుల వనితలకే డిమాండ్ ఎక్కువ. మరో ముఖ్యమైన సంగతేంటంటే.. విడాకుల వనితలు మాత్రం విడాకులు పొందిన పురుషులను చేసుకోరు. కొత్త పెళ్లికొడుకులనే చూస్తారు. విడాకులు పొందిన మగవాళ్లను ఫెయిల్యూర్ హజ్బెండ్స్గా పరిగణిస్తారట.

స్విట్జర్లాండ్ వెళ్లి ఉంటే..ప్రాణాలతో..నావీ అధికారి చివరి వీడియో వైరల్
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో ఉగ్రమూకల పైశాచికత్వం అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. 26 మంది అమాయకులు అసువులు బాసారు. పహల్గామ్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో భారత నావికాదళ అధికారి, సెలవులో ఉన్న లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ (26) ఒకరు. హర్యానాకు చెందిన వినయ్ వివాహం ఏప్రిల్ 16న హిమాన్షితో జరిగింది. హనీమూన్ కోసమని 'మినీ స్విట్జర్లాండ్' వచ్చారు. ఇంతలోనే ఇంత ఘోరం జరిగిపోయింది. వినయ్ ఉగ్రవాదుల చేతిలో మరణించాడు.లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ , అతని భార్య హనీమూన్ కోసం ముందు స్విట్జర్లాండ్ వెళ్లాలని అనుకున్నారట. కానీ వీసా రిజెక్ట్ కావడంతో మినీ స్విట్జర్లాండ్ ,సుందరమైన బైసరన్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రిసెప్షన్ పార్టీ తర్వాత రెండు రోజుల తర్వాత పెళ్లైన ఆరు రోజులకు పహల్గాం వెళ్లారని అదే తన మనవడి జీవితానికి శాపంలా తగిలిందని వినయ్ తాత , హర్యానా రిటైర్డ్ పోలీసు అధికారి హవా సింగ్ తెలిపారు. , తన మనవడికి స్విస్ వీసా మంజూరు అయి ఉండే తన మనవడు ప్రాణాలతో ఉండావాడని కన్నీటి పర్యంతమయ్యారు.చదవండి: పండక్కి ఫ్యామిలీతో ఇండియాకు.. ఉగ్రదాడిలో టెకీ దుర్మరణం दुःखद नेवी ऑफिसर लेफ्टिनेंट विनय नरवाल की मौत से पहले का आखिरी वीडियो#PahalgamTerroristAttack pic.twitter.com/kIlP6mJc5E— Manish Yadav लालू (Journalist) (@ManishMedia9) April 23, 2025 ; మరోవైపు వినయ్ నర్వాల్ భార్యతో కలిసి ఆనందంగా గడుపుడుతున్న క్షణాలకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. భర్తతో హిమాన్షి రీల్ వీడియోను షూట్ చేస్తూ సరదాగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఈ దృశ్యాలు చూసి నెటిజన్లు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అలాగే తన భర్తను ఉగ్రవాదులు కాల్చి చంపిన తరువాత, ఆయన శవపేటికను కౌగిలించుకుని గుండెలవిసేలా రోదించిన దృశ్యాలు కలచివేశాయి. "జై హింద్" అంటే తన భర్తకు కన్నీటి నివాళులర్పించింది. చదవండి: Pahalgam : ఈ దుఃఖాన్ని ఆపడం ఎవ్వరి తరము? గుండెల్నిపిండేసే వీడియోలు VIDEO | Karnal: Navy officer Lt. Vinay Narwal, who lost his life in the Pahalgam terror attack, was cremated with state honours.(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/xUirNpooUC— Press Trust of India (@PTI_News) April 23, 2025 సోదరి చేతుల మీదుగా అంత్యక్రియలువినయ్ అంత్యక్రియలు బుధవారం సాయంత్రం కర్నాల్‌లోని అతని స్వగ్రామంలో అన్ని గౌరవ లాంఛనాలతో జరిగాయి. నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ సోదరి కర్నాల్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. హర్యానా ఎమ్మెల్యే జగ్మోహన్ ఆనంద్ సహా, పలువురు ఆర్మీ , నేవీ అధికారులు కూడా అంతిమ నివాళులు అర్పించారు.
ఫొటోలు


తిరుపతిలో హీరోయిన్ మీనాక్షిచౌదరి సందడి (ఫొటోలు)


తిరుమలలో భద్రతా దళాల మాక్ డ్రిల్ (ఫొటోలు)


ఐపీఎల్ క్రికెటర్‌ను పెళ్లాడిన హీరోయిన్ అర్చన (ఫొటోలు)


సతీసమేతంగా పెళ్లికి హాజరైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (ఫొటోలు)


వేతన జీవులకు కనీస పెన్షన్ రూ.7,500? (ఫొటోలు)


సచిన్ టెండుల్కర్ బర్త్‌డే.. అరుదైన ఫొటోలు చూశారా? (ఫోటోలు)


వైఎస్సార్సీపీ స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశం (ఫొటోలు)


పహల్గాం ఉగ్రదాడి ప్రాంతంలో షూటింగ్స్ జరుకున్న చిత్రాలివే


#DakshaNagarkar : హీరోయిన్ దక్ష నాగర్కర్ కిల్లింగ్ లుక్స్


హార్దిక్ పాండ్యాతో ఫొటో..SRHvsMI మ్యాచ్‌లో నటి కుషిత కల్లపు (ఫొటోలు)
అంతర్జాతీయం

వాణిజ్య ఒప్పందంపై రోడ్‌మ్యాప్ సిద్ధం
జైపూర్: భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా నానాటికీ పెరుగుతోందని, ఆయనను చూస్తే అసూయగా ఉందని అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ చెప్పారు. మోదీ ప్రభుత్వాన్ని కొందరు విమర్శిస్తున్నప్పటికీ ఆయన పేరు ప్రతిష్టలు మరింత ఇనుమడిస్తున్నాయే తప్ప ఎక్కడా తగ్గడం లేదన్నారు. అంతర్జాతీయంగా మోదీకి లభిస్తున్న అప్రూవల్ రేటింగ్స్ తనకు అసూయ కలిగిస్తున్నాయని, ఈ విషయం సోమవారం నేరుగా మోదీకే చెప్పానని వెల్లడించారు.‘మోదీ స్పెషల్ పర్సన్’ అని ప్రశంసించారు. మంగళవారం రాజస్తాన్ రాజధాని జైపూర్‌లో రాజస్తాన్ ఇంటర్నేషనల్ సెంటర్లో ఓ సదస్సులో వాన్స్ ప్రసంగించారు. ప్రధానంగా ఇండియా–అమెరికా సంబంధాలపై మాట్లాడారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం విషయంలో తుది ఒప్పందంపై రోడ్‌మ్యాప్ సిద్ధమైందని ప్రకటించారు. రోడ్‌మ్యాప్‌పై విధివిధానాలను ఇరు దేశాలు అధికారికంగా ఖరారు చేశాయని వెల్లడించారు. భారతదేశ ఉత్పత్తులపై విధించిన 26 శాతం ప్రతీకార సుంకాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 90 రోజులపాటు నిలిపివేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాల మధ్య విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. వాణిజ్య ఒప్పందంపై రోడ్‌మ్యాప్ సిద్ధం కావడం డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీల విజన్ వాస్తవరూపం దాల్చే విషయంలో ఒక కీలకమైన ముందడుగు అని వాన్స్ అభివర్ణించారు. భారత్–అమెరికా సంయుక్తంగా ప్రగతి సాధించాలని ట్రంప్ కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రధాని మోదీ ‘కొరుకుడుపడని కఠినమైన సంధానకర్త’ అని అభివర్ణించారు. ఆయనతో బేరం తేల్చడం అంత సులభం కాదన్నారు. అందుకే ఆమెరికా ఆయనను గౌరవిస్తోందని వ్యాఖ్యానించారు. మిత్రుడిగా వచ్చా.. తాను ఇండియాకు నీతిబోధలు చేయడానికి రాలేదని, ఒక భాగస్వామిగా, మిత్రుడిగానే వచ్చానని జె.డి.వాన్స్ అన్నారు. ఏ పని ఎలా చేయాలో ఇండియాకు నేర్పే ఉద్దేశం తనకు లేదన్నారు. గతంలో అమెరికా ప్రభుత్వాలు భారత్‌కు నీతి పాఠాలు బోధించేందుకు ప్రయత్నించేవని, భారత్‌ను చౌకగా కార్మిక శక్తి లభించే దేశంగానే చూసేవారని చెప్పారు . ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయిందని పేర్కొన్నారు. అమెరికా ఉత్పత్తులను మరింత అధికంగా కొనుగోలు చేయాలని భారత్‌కు విజ్ఞప్తిచేశారు.అమెరికా ఇంధన, రక్షణ ఉత్పత్తులు, పరికరాలను ఎక్కువగా కొనుగోలు చేయాలన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడాలని ఆకాంక్షించారు. టెక్నాలజీ, రక్షణ, వాణిజ్యం, ఇంధనం వంటి వేర్వేరు కీలక రంగాల్లో భారత్, అమెరికా కలిసికట్టుగా పనిచేస్తే అద్భుత విజయాలు సాధించవచ్చని పిలుపునిచ్చారు. ఉమ్మడి ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా ‘ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం’పై ఇరుదేశాలు చర్చలు కొనసాగిస్తున్నాయని తెలిపారు.ఇవాన్ ఇండియాలోనే ఉంటానన్నాడు ప్రధాని మోదీ తమకు చక్కటి ఆతిథ్యం ఇచ్చారని జె.డి.వాన్స్ ఆనందం వ్యక్తంచేశారు. మోదీ ప్రేమానురాగాలు తమ కుటుంబాన్ని ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పారు. ముఖ్యంగా తమ ముగ్గురు పిల్లలకు మోదీ ఎంతో ఆత్మీయులయ్యారని తెలిపారు. మోదీ ఇచ్చిన విందు తన కుమారుడు ఇవాన్‌కు ఎంతోగానో నచ్చిందని, ఇండియాలోనే ఉండిపోవాలని కోరుకుంటున్నట్లు ఇవాన్ తనతో చెప్పాడని అన్నారు. తన పిల్లలకు డొనాల్డ్ ట్రంప్‌తో ఏర్పడిన అనుబంధం ఇప్పుడు మోదీతోనూ ఏర్పడిందని వ్యాఖ్యానించారు. ఇండియాలో తన కంటే తన భార్య ఉషా చిలుకూరికే గొప్ప ఆదరణ లభిస్తోందని వాన్స్ చమత్కరించారు.అంబర్ కోట సందర్శనవాన్స్ తన భార్య ఉషా చిలుకూరి, ముగ్గురు పిల్లలతో కలిసి మంగళవారం ఉదయం రాజస్తాన్‌లోని చరిత్రాత్మక అంబర్ కోటను సందర్శించారు. వాన్స్ కుటుంబానికి రాజస్తాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ, ఉప ముఖ్యమంత్రి దియా కుమారీతోపాటు అధికారులు సంప్రదాయ రీతిలో ఘన స్వాగతం పలికారు. చక్కగా అలంకరించిన ఏనుగులు, తీర్చిదిద్దిన రంగవల్లులు, జానపద నృత్యాలతో అమెరికా ఉపాధ్యక్షుడికి ఆత్నియ స్వాగతం లభించింది. చందా, మాలా అనే రెండు ఏనుగులు తొండాలు ఎత్తి వాన్స్ కుటుంబానికి స్వాగతం పలికాయి. రాజస్తానీ సంప్రదాయ జానపద నృత్యాలు అలరించాయి.

పోప్ ఫ్రాన్సిస్ చివరి కోరిక
చారిత్రకంగా చూస్తే... పోప్స్ మృతదేహాలను వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బాసిలికా నేలమాళిగల్లో ఖననం చేయడం రివాజు. ఈ సంప్రదాయాన్ని కాదని 1903లో పోప్ లియో-13 మృతదేహాన్ని ఆయన కోరిక మేరకు సెయింట్ జాన్ లేటరన్ బాసిలికాలో పూడ్చిపెట్టారు. ప్రస్తుత పోప్ ఫ్రాన్సిస్(Pope Francis) ఆఖరి కోరిక ఏంటో తెలుసా? తన భౌతిక కాయాన్ని వాటికన్ వెలుపల సెయింట్ మేరీ మేజర్ బాసిలికా చర్చి(రోమ్)లో ఖననం చేయాలనేది ఆయన మనోవాంఛ. 2023 డిసెంబరు 12న మెక్సికన్ వార్తా సంస్థ ‘ఎన్+’కు కు ఇంటర్వ్యూ ఇస్తూ ఫ్రాన్సిస్ తన అంత్యక్రియలకు సంబంధించి మనసులోని మాట బయటపెట్టారు. అంత్యక్రియల ఏర్పాట్ల గురించి ఆర్చ్ బిషప్ డీగో జియోవని రవేలీతో అంతకుముందే చర్చించినట్టు తెలిపారు. సెయింట్ మేరీ మేజర్ బాసిలికా చర్చి విషయానికొస్తే... ఆరుగురు పోప్స్ మృతదేహాలను అక్కడ ఖననం చేశారు. చివరిసారిగా 1669లో పోప్ క్లెమెంట్-9 అంత్యక్రియలు అక్కడ నిర్వహించారు. శిశువైన జీసస్ ను కన్య మేరీ ఎత్తుకున్న ‘సేలస్ పోపులి రోమని’ (రోమ్ ప్రజలకు రక్షణ) పెయింటింగ్ ఆ చర్చిలో ఉంది. ఆ చిత్రంతో పోప్ ఫ్రాన్సిస్ ది ప్రత్యేక అనుబంధం. పోప్ హోదాలో పర్యటనలు చేసి తిరిగొచ్చాక ఆయన దాని ఎదుట ప్రార్థనలు చేసేవారు.:::జమ్ముల శ్రీకాంత్(Source: AmoMama.com. Photo Credit: The Catholic Weekly).

ట్రంప్ యాక్షన్.. హార్వర్డ్ యూనివర్సిటీ రియాక్షన్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలకు.. హార్వర్డ్ యూనివర్సిటీ(Harvard University) తగ్గేదే లే అంటోంది. విశ్వవిద్యాలయానికి అందించే ఫెడరల్ నిధులకు ట్రంప్ సర్కార్ కత్తెర వేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో కత్తెరకు సిద్ధపడుతున్న తరుణంలో విశ్వవిద్యాలయం అనూహ్యంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.ఫెడరల్ నిధులను నిలిపివేయడం ద్వారా.. విద్యాపరమైన నిర్ణయాలపై నియంత్రణ సాధించడానికి ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ మసాచుసెట్స్ (massachusetts) కోర్టులో దావా వేసింది. అంతేకాదు పలు యూనివర్సిటీలను కూడా ట్రంప్ లక్ష్యంగా చేసుకున్నారంటూ దావాలో ప్రస్తావించింది. ట్రంప్ చర్యలు ఏకపక్షంగా ఉన్నాయని.. ఫెడరల్ చట్టాలను, నిబంధలను ఉల్లంఘించేలా ఉన్నాయని పేర్కొంది. నిధులను స్తంభింపజేయడం, ఫెడరల్ సమాఖ్య గ్రాంట్లపై విధించిన షరతులను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని, హార్వర్డ్ ఖర్చులను చెల్లించేలా ట్రంప్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని దావాలో హార్వర్డ్ యూనివర్సిటీ కోరింది.హార్వర్డ్ యూనివర్సిటీకి వైట్‌హౌస్(White House) పలు నిబంధనలు జారీ చేసిన విషయం తెలిసిందే. విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లో యూదు వ్యతిరేక నిరసనల కట్టడికి సంబంధించినవి అవి. అయితే, వాటిని వ్యతిరేకిస్తున్నట్లు విశ్వవిద్యాలయం ప్రెసిడెంట్ అలాన్ గార్బర్ పేర్కొన్నారు. ఇక్కడి నుంచి అసలు వ్యవహారం మొదలైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్వర్డ్ యూనివర్సిటీకి అందించే 2.2 బిలియన్ డాలర్ల ఫెడరల్ నిధులకు కత్తెర వేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో 1 బిలియన్ డాలర్ల కోతకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వైద్య పరిశోధనల కోసం యూనివర్సిటీకి ఇచ్చే ఫెడరల్ గ్రాంట్లు, కాంట్రాక్టుల నుంచి 1 బిలియన్ డాలర్లను తగ్గించాలని ట్రంప్ యంత్రాంగం ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వాల్‌స్ట్రీట్ జర్నల్ తాజాగా ఓ కథనం ప్రచురించింది.అయితే.. వైట్‌హౌజ్ జారీ చేసిన డిమాండ్లకు ఏ మాత్రం తలొగ్గేది లేదని హార్వర్డ్ అధ్యక్షుడు అలాన్ గార్బర్(Alan Garber) స్పష్టం చేస్తున్నారు. వాటిని బహిరంగంగా తిరస్కరిస్తున్నారు కూడా. ఈ నేపథ్యంలోనే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కొత్త బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. గార్బర్ చర్యలపై ట్రంప్ యంత్రాంగం సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. విదేశీ విద్యార్థుల అక్రమ, హింసాత్మక కార్యకలాపాల రికార్డులను సమర్పిస్తేనే కొత్తగా విదేశీయులను చేర్చుకునేందుకు అనుమతిస్తామని హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ట్రంప్ ప్రభుత్వం స్పష్టంచేసింది. రికార్డులను సమర్పించకపోతే వర్సిటీకున్న ప్రవేశాల అర్హతను రద్దు చేస్తామని హెచ్చరించింది. విద్యార్థుల రికార్డులను అందించాలని ఆదేశిస్తూ హోంలాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టీ నోయెమ్ వర్సిటీకి ఇప్పటికే ఓ లేఖ రాశారు. ఈ నెల 30వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని అందులో కోరారు. ఒకవేళ వర్సిటీ స్పందించకపోతే.. విద్యార్థులు, ఎక్స్ఛేంజ్ విజిటర్ కార్యక్రమం (ఎస్ఈవీపీ) ధ్రువీకరణ రద్దవుతుందని పేర్కొన్నారు. కానీ, ఈ పరిణామాలను హార్వర్డ్ తేలికగా తీసుకుంటోంది. ‘ఆ లేఖ మా దృష్టికీ వచ్చింది. గతంలో మేం చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నాం. మా స్వాతంత్య్రం, రాజ్యాంగ హక్కుల విషయంలో మేం రాజీ పడలేం. మేం చట్ట ప్రకారమే నడుచుకుంటాం. ప్రభుత్వ యంత్రాంగం కూడా వాటికి అనుగుణంగానే వ్యవహరించాలని ఆశిస్తున్నాం’ అని వర్సిటీ ప్రతినిధి స్పష్టంచేశారు.తమ డిమాండ్లను రహస్యంగా ఉంచాలని ప్రభుత్వం కోరినప్పటికీ.. హార్వర్డ్ యూనివర్సిటీ వ్యవహరించిన తీరుతోనే వైట్‌హౌస్ ఈ విషయంలో మరింత దూకుడుగా వెళ్లడానికి ఒక కారణమని వాల్‌స్ట్రీట్ జర్నల్ తన నివేదికలో పేర్కొంది.ట్రంప్ యంత్రాంగంతో ఘర్షణ వైఖరి కారణంగా హార్వర్డ్ యూనివర్సిటీ.. ఫెడరల్ నిధుల నుంచి దాదాపుగా 9 బిలియన్ డాలర్లను కోల్పేయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు కోర్టుకు చేరడంతో ఏం జరగబోతోందా? అనే ఆసక్తి నెలకొంది.

నష్టం కలిగిస్తే ప్రతీకారం తప్పదు
బీజింగ్: టారిఫ్‌ల నుంచి తప్పించుకునే క్రమంలో అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునే దేశాలకు చైనా హెచ్చరికలు చేసింది. ఆ ఒప్పందాలతో తమకు నష్టం వాటిల్లే పక్షంలో ప్రతీకార చర్యలు తప్పవని ఆయా దేశాలకు తేల్చి చెప్పింది. ఇటువంటి ఒప్పందాలకు తాము పూర్తిగా వ్యతిరేకమని చైనా వాణిజ్య శాఖ ప్రతినిధి స్పష్టం చేశారు. అత్యధిక సుంకాల నుంచి మినహాయించినందుకు ప్రతిఫలంగా చైనాతో వాణిజ్య సంబంధాలను పరిమితం చేయాలంటూ ఇతర దేశాలపై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా సిద్ధమవుతోందన్న వార్తల నేపథ్యంలో వాణిజ్య శాఖ ప్రతినిధి ఈ ప్రకటన చేశారని అధికార జిన్హువా వార్తా సంస్థ పేర్కొంది. ‘ఒక వేళ అటువంటి పరిస్థితే ఏర్పడితే చైనా ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోదు. తీవ్ర ప్రతీకార చర్యలు తీసుకుంటుంది. తాత్కాలిక లాభం కోసం ఇతరుల ప్రయోజనాలను ఫణంగా పెట్టాలని చూడటం పులి చర్మం కోసం దానితో బేరమాడటం వంటిదే. ఎదురుదెబ్బ తప్పదు’అని ఆ ప్రతినిధి వ్యాఖ్యానించారు. తమతో లాభదాయకమైన వ్యాపార సంబంధాలు కలిగిన పలు దేశాలు సుంకాల మినహాయింపులు పొందడానికి అమెరికాతో ప్రత్యేక వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోకుండా నిరోధించడానికే చైనా ప్రభుత్వం ఈ ప్రకటన చేసినట్లుగా భావిస్తున్నారు. జపాన్, ఈయూ, ఆసియాన్‌లోని పలు దేశాలు అమెరికాతోపాటు చైనాతోనూ విస్తృత వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్నాయి. భారత్ కూడా అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయతి్నస్తోంది. చైనా వస్తువులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 245 శాతం టారిఫ్‌లు ప్రకటించగా, చైనా సైతం అమెరికా వస్తువులపై 125 శాతం టారిఫ్‌లు విధించింది. ఎక్కువగా ఎగుమతులపైనే ఆధారపడిన చైనా ఆర్థిక వ్యవస్థపై అమెరికాతో ఆసియాన్ లాంటి భాగస్వాములు కుదుర్చుకునే ఒప్పందాలతో ప్రతికూల ప్రభావం చూపుతుంది.
జాతీయం

పాకిస్తాన్ అధికారుల ఓవరాక్షన్.. పహల్గాం దాడిపై ఢిల్లీలో పాక్ సంబరాలు?
సాక్షి, ఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడికి దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న వేళ పాకిస్తాన్ అధికారులు మాత్రం పండుగ చేసుకుంటున్నారు. ఢిల్లీలో పాక్ హైకమిషన్ ఆఫీసులో సంబురాలు జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగానే కేక్ కట్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, పహల్గాం ఉగ్రదాడికి పాక్ సంబరాలు చేసుకుంటా? అంటే అవుననే ఆధారాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లోకి అక్కడ పనిచేసే ఓ కేక్ తీసుకెళ్లాడు. ఈ క్రమంలో మీడియా ప్రతినిధులు అతడిని ప్రశ్నించారు. కేక్ ఎందుకు అని ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా సదరు వ్యక్తి తప్పించుకుని లోపలికి వెళ్లిపోయాడు. కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఉగ్రదాడికి పాకిస్తాన్ ప్రతినిధులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.This footage shows someone delivering a cake to the Pakistani High Commission in Delhi.What Pakistan’s high commission is celebrating?? TERRORISTS! pic.twitter.com/3lGnIRPcnz— BALA (@erbmjha) April 24, 2025మరోవైపు.. ఈ ఘటనలో మృతిచెందిన వారి కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. తమ కుటుంబ సభ్యులను కోల్పోవడంతో బోరున విలపిస్తున్నారు. దీంతో, పాకిస్తాన్‌కు తగిన గుణపాఠం చెప్పాలని భారతీయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ హై కమిషన్ వద్ద నిరసన ప్రదర్శనలు చేపట్టారు. పాకిస్తాన్ నశించాలి అంటూ నిరసనకారులు నినాదాలు చేస్తున్నారు. ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్‌ను నామరూపాలు లేకుండా చేయాలని డిమాండ్ వినిపిస్తున్నారు. సర్జికల్ స్ట్రైక్స్ తరహాలో పాకిస్తాన్ కు తగిన గుణపాఠం చెప్పాలని కోరుతున్నారు. దీంతో, పాకిస్తాన్ హైకమిషన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ నిరసనల్లో బీజేపీ ఎమ్మెల్యేలు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. #WATCH | During the BJP protest against Pakistan following the Pahalgam terror attack, BJP MLA Satish Upadhyay says, "There is anger in the hearts of people of India. Pakistan could not tolerate how Kashmir joined the mainstream...Yesterday, the Modi government conducted a… pic.twitter.com/Dk61hNA5VM— ANI (@ANI) April 24, 2025ఇదిలా ఉండగా.. పాకిస్తానీ పౌరులు వెంటనే భారత్‌ను విడిచి వెళ్లాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్తానీలు తమ దేశానికి తిరిగి వెళ్తున్నారు. వారంతా అట్టారి-వాఘా సరిహద్దుకు చేరుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.VIDEO | Amritsar, Punjab: Pakistani national reach Attari-Wagah border to return to their country after India suspended the SAARC visa exemption scheme (SVES) asking Pakistani citizens in India under SVES visa to leave the country within 48 hours. The decision was taken the… pic.twitter.com/0CVYTaJcBU— Press Trust of India (@PTI_News) April 24, 2025

పహల్గాం ఉగ్రదాడి.. కాసేపట్లో అఖిలపక్ష సమావేశం
జమ్ము కశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లా పహల్గాం బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడిపై భారత్ రలిగిపోతోంది. అమాయకులైన పర్యాటకుల ప్రాణాలను బలిగొన్నందుకు పాక్‌పై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని నినదిస్తోంది. ఈ క్రమంలో.. త్వరలోనే దీటైన ప్రతీకారం తప్పదని భారత ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు.. దౌత్యపరమైన ఆంక్షలతో పాక్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. కాసేపట్లో అఖిలపక్ష సమావేశంకాసేపట్లో అఖిలపక్ష సమావేశంరక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలో సమావేశంఅన్నీ రాజకీయ పార్టీలను ఆహ్వానించిన కేంద్ర ప్రభుత్వంపహల్గాం ఉగ్రదాడితో తీసుకున్న చర్యలను అఖిల పక్ష పార్టీలకు వివరించనున్న కేంద్రంవైఎస్సార్సీపీ తరుఫున హాజరుకానున్న పెద్దిరెడ్డి మిథున్రెడ్డిరాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కేంద్ర మంత్రుల భేటీరాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కేంద్రమంత్రి అమిత్‌షా,జైశంకర్‌లు భేటీఉగ్రదాడి,భారత్ చర్యలను వివరించిన కేంద్ర మంత్రులుదేశభద్రత,పాక్‌పై దౌత్యపరమైన చర్యలపై కీలక చర్చవిదేశీ దౌత్యవేత్తలతో భారత విదేశాంగ శాఖ అధికారులు భేటీవిదేశీ దౌత్యవేత్తలతో భారత విదేశాంగ శాఖ అధికారులు భేటీజర్మనీ,జపాన్,బ్రిటన్,రష్యా దౌత్యవేత్తలతో భేటీఉగ్రదాడి ఘటనను విదేశీ దౌత్యవేత్తలకు వివరించిన అధికారులు ఉగ్రదాడిని ఖండించిన సీడబ్ల్యూసీపహల్గాం ఉగ్రదాడిని ఖండించిన కాంగ్రెస్ సీడబ్ల్యూసీనిఘా వ్యవస్థ వైఫల్యంగా తీర్మానించిన సీడబ్ల్యూసీఉగ్రదాడికి నిరసనగా దేశవ్యాప్తంగా రేపు కొవ్వొత్తుల ర్యాలీ దేశవ్యాప్తంగా రేపు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని ఏఐసీసీ పిలుపు ఏఐసీసీ పిలుపు నేపథ్యంలో హైదరాబాద్‌లో ఈరోజు జరగనున్న కొవ్వొత్తుల ర్యాలీ రేపటికి వాయిదా ఉగ్రవాదులకు ప్రధాని మోదీ ఘాటుహెచ్చరికపహల్గాం ఉగ్రదాడిపై పబ్లిక్ మీటింగ్‌లో స్పందించిన ప్రధాని మోదీగురువారం బీహార్ పాట్నాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మోదీపహల్గాం మృతులకు నివాళి అర్పిస్తూ.. రెండు నిమిషాలు మౌనం పాటించిన ప్రధాని ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని విధంగా కఠిన శిక్ష విధిస్తాం: ప్రధాని మోదీ ఇది పర్యాటకులపై జరిగిన దాడి కాదు భారత్ ఆత్మపై జరిగిన దాడిఅమాయకులను ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారుబాధితుల్లో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారువాళ్లందరినీ సంఘీభావం తెలపాల్పిన అవసరం ఉందిఉగ్రవాదులకు తగిన గుణపాఠం నేర్పుతాంఉగ్రదాడికి పాల్పడిన వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే Listen at your own risk....🔊🔊This is very clear warning to everyone....🔥🔥#ModiSangMithila #PahalgamTerroristAttack #PanchayatiRajDiwas #Modi #BJP #NarendraModi pic.twitter.com/JXBHAyukyI— Bhavya Mishra (Modi ka Parivaar) (@bhavyamishra108) April 24, 2025 పహల్గాంలో ఆ 10 నిమిషాలు మారణహోమంపహల్గాంలో పది నిమిషాలపాటు మారణహోమం ఐడీ కార్డులు అడిగి మరీ కాల్చి చంపిన ఉగ్రవాదులు ఏప్రిల్ 22వ తేదీ మధ్యాహ్నాం 2గం. దాకా కొనసాగిన కాల్పులు హెల్మెట్లకు ఉన్న కెమెరాలతో ఆ ఘోరాన్ని చిత్రీకరించిన టెర్రరిస్టులు 2.30గం. కశ్మీర్ పోలీసులకు ఘటనపై సమాచారం ఆ తర్వాత ఘటనాస్థలానికి వచ్చిన ఆర్మీ సైనికులకు చూసి వణికిపోయిన టూరిస్టులు ఆర్మీ దుస్తుల్లోనే కాల్పులు జరిపిన ఉగ్రవాదులు టెర్రరిస్టుల కాల్పుల్లో మరణించిన 26 మంది పర్యాటకులుపురుషులనే టార్గెట్ చేసుకున్న ఉగ్రవాదులుచనిపోయిన వాళ్లలో ఐబీ, నేవీ, ప్రభుత్వాధికారులే అధికం తెలంగాణ టూరిస్టులు సురక్షితంఉగ్రదాడి తర్వాత.. నిన్నంతా హోటల్‌కే పరిమితమైన తెలంగాణ పర్యాటకులుఏం జరుగుతుందో అర్థంకాక బంధువుల్లో ఆందోళనఇవాళ బయటకు వచ్చి జరిగిన దాడిని మీడియాతో పంచుకున్న పలువురుహెల్ప్ లైన్ నెంబర్ల ద్వారా సురక్షితంగా ఉన్నట్లు బంధువులకు సమాచారం హోం శాఖ హైలెవల్ మీటింగ్కొనసాగుతున్న కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉన్నతస్థాయి సమావేశంపహల్గాం ఉగ్రదాడి ఘటనపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మీటింగ్సమావేశంలో పాల్గొన్న హోంశాఖ కార్యదర్శి, ఐబీ డైరెక్టర్, ‘రా’ చీఫ్ఖర్గే అధ్యక్షతన సీడబ్ల్యూసీ భేటీ పహల్గాం ఉగ్రదాడిపై సీడబ్ల్యూసీ చర్చసమావేశానికి హాజరైన ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక, జైరాం రమేష్అమెరికా పర్యటన ముగించుకుని అర్ధాంతరంగా వచ్చిన రాహుల్ఉగ్రదాడిపై అమిత్ షాతో ఇప్పటికే ఫోన్లో మాట్లాడిన రాహుల్ గాంధీసాయంత్రం అఖిలపక్ష భేటీకి హాజరయ్యే అవకాశంకశ్మీర్లో చిక్కుకున్న తెలంగాణ వాళ్ల కోసం హెల్ప్‌లైన్ నెంబర్లుకశ్మీర్లో చిక్కుకున్న తెలంగాణ పర్యాటకుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు9440816071, 9010659333, 040 23450368కశ్మీర్లో చిక్కుకున్న తెలంగాణ వాసులను స్వస్థలాలకు రప్పించేందుకు చర్యలు: జూపల్లి కృష్ణారావుఇటీవల జమ్మూకశ్మీర్ వెళ్లినవారి వివరాలు ఇవ్వాలని టూర్ ఆపరేటర్లకు ఆదేశాలు పాక్ మిలిటరీ దౌత్యవేత్తకు భారత్ సమన్లుపాక్ మిలిటరీ దౌత్యవేత్తలకు ‘పర్సోనా నాన్ గ్రాటా’ జారీఈ నోటీసుల ప్రకారం ఒక వారంలో వారు దేశాన్ని వీడాల్సి ఉంటుందని తెలిపిన భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీఢిల్లీలో పాక్ హైకమిషన్ వద్ద ఉద్రిక్తతఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ వద్ద నిరసన ప్రదర్శనలతో ఉద్రిక్తతహిందూ సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసనలుపాకిస్తాన్ నశించాలి అంటూ నినాదాలు ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్ ను నామరూపాలు లేకుండా చేయాలని డిమాండ్సర్జికల్ స్ట్రైక్స్ తరహాలో పాకిస్తాన్ కు తగిన గుణపాఠం చెప్పాలని డిమాండ్ వక్రబుద్ధి బయటపెట్టిన పాక్పహల్గాం ఉగ్రదాడిపై సంబురాలు చేసుకున్న పాక్?ఢిల్లీలోని పాక్ హైకమిషన్ కార్యాలయంలోకి కేక్ తీసుకెళ్లిన పాక్ ప్రతినిధిఎందుకు అని ప్రశ్నించిన మీడియాకు సమాధానం చెప్పని వైనం పీవోకేలో భారత ఆర్మీ వ్యూహరచనపీవోకే వెంట 42 చోట్ల ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్లుపీవోకేలోని ఉగ్ర శిబిరాలపై భారత ఆర్మీ దృష్టివ్యూహ రచనను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌కు వివరించిన ఆర్మీ పాక్ ఎక్స్ ఖాతా నిలిపివేతఉగ్రదాడి నేపథ్యంలో పాక్ ప్రభుత్వ ఎక్స్ ఖాతా నిలిపివేసిన భారత్దౌత్యపరమైన ఆంక్షల్లో భాగంగానే ఈ చర్య భద్రతా వలయంలో పహల్గాంమంగళవారం పహల్గాం బైసరన్ వ్యాలీ పిక్నిక్ స్పాట్లో ఉగ్రదాడిసైనిక దుస్తుల్లో వచ్చిన గుర్తింపు తనిఖీలు చేసి మరీ పర్యాటకులను కాల్చి చంపిన టెర్రరిస్టులు26 మంది స్పాట్లో.. మరో ఇద్దరు ఆస్పత్రిలో మృతితీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న మరికొందరుప్రశాంత లోయలో ఉగ్రదాడితో ఉలిక్కి పడ్డ భారత్నాటి నుంచి భద్రతా వలయంలో పహల్గాంహోటల్స్, లాడ్జిలను, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న భద్రతా బలగాలుపాక్ హైకమిషనర్‌కు కేంద్రం సమన్లువారంలోగా భారత్ విడిచిపోవాలని అల్టిమేటందౌత్యవేత్త అహ్మద్ వారైజ్తో పాటు పలువురు సిబ్బందికి కేంద్ర నోటీసులు జారీహైకమిషనరేట్ కార్యాలయం ముందు బారికేడ్లను తొలగించిన సిబ్బందిఆఫీస్లోని సామాగ్రి సైతం తీసుకెళ్తున్న సిబ్బందిక్షిపణి పరీక్షలకు సిద్ధమైన పాక్కరాచీ తీరంలో క్షిపణి పరీక్షలు నిర్వహణకు పాక్ ప్రభుత్వ ఆదేశాలుపాక్ చర్యలను నిశితంగా పరిశీలిస్తున్న భారత్ఉదమ్పూర్ ఉగ్రవాదుల దుశ్చర్యఉదమ్పూర్లో భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులుఆర్మీ జవాను మృతి చెందినట్లు ప్రకటించిన భారత సైన్యంకొనసాగుతున్న ఎదురు కాల్పులు

బీరప్పా.. నువ్వు గ్రేటప్పా!
‘‘నా కొడుకు ఏం పరీక్షలు రాశాడో? ఏం ఘనత సాధించాడో నాకైతే తెల్వదు. ఆర్మీలో చేరాలని వాడి కల. అది నెరవేరకపోయేసరికి బాధపడేవాడు. కానీ, ఇప్పడు వాడు పెద్ద పోలీస్ ఆఫీసర్ అవుతాడని అంతా అంటుంటే గర్వంగా ఉంది. వాడూ సంతోషంగా ఉన్నాడు.. అది చాలు’’ అంటున్నాడు సివిల్స్ విజేత బీరప్ప సిద్ధప్ప డోని తండ్రి సిద్ధప్ప డోని.మహారాష్ట్ర అమగె గ్రామానికి చెందిన బీరప్ప సిద్ధప్ప డోని.. కర్ణాటక బెలగావి నానవాడి గ్రామంలోకి చుట్టాల ఇంటికి వచ్చాడు. బీరప్పది గొర్రెలు కాచుకునే కుటుంబం. అయినా అతని తండ్రి బిడ్డలను మంచి చదువులే చదివించాడు. ఆ పిల్లలు కూడా తండ్రి కష్టాన్ని గుర్తించి బాగా చదివారు. బీరప్ప పెద్దన్న ఆర్మీలో ఉద్యోగం. అన్నలాగే సైన్యంలో చేరాలని బీరప్ప కలలు కన్నాడు. కానీ, రకరకాల కారణాలతో ఆ కలకు దూరమయ్యాడు. బీటెక్ పూర్తి చేసి.. చివరకు పోస్టల్ జాబ్ కొట్టాడు.ఐపీఎస్ కావాలనే కలతో.. సివిల్స్ వైపు లక్ష్యాన్ని మల్చుకుని పోస్టల్ జాబ్‌ను వదిలి ప్రిపేర్ అయ్యాడు. ఈ ఏడాది మూడో అటెంప్ట్ చేశాడు. మొన్న ఏప్రిల్ 22వ తేదీ విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో బీరప్పకు 551వ ర్యాంకు వచ్చింది. ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులు సంతోషించాడు. తమకు కూడు పెట్టిన గొర్రెల కొట్టాల మధ్యలోనే బీరప్పకు తమదైన సంప్రదాయంలో ఘనంగా సన్మానం చేశారు.దేశంలోనే పెద్ద పరీక్షలు రాసి తన మేనల్లుడు సర్కారీ కొలువు కొట్టేసరికి యెల్లప్ప గద్ది సంతోషంతో ఉబ్బి తబ్బిబి అయిపోతున్నాడు. ఊరంతా స్వీట్లు పంచి మురిసిపోయాడు. మేనల్లుడు మంచి ఆఫీసర్ అయ్యి తమలాంటి పేదోలకు సాయం చస్తే చాలంటున్నాడు. బీరప్ప స్ఫూర్తితో తమ జాతిలో మరికొందరు ముందుకు వచ్చి సదువుకుంటే చాలని కోరుకుంటున్నాడాయన.Belagavi village erupts in joy as youth from the shepherding community clear UPSC🎥Special Arrangementhttps://t.co/QlwXlz3pWW pic.twitter.com/ISrBQEOoHd— The Hindu (@the_hindu) April 23, 2025 Source: The Hindu

ములుగులో ఆపరేషన్ కగార్.. భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి?
ములుగు, సాక్షి: చత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులో ములుగు కర్రెగుట్టల అడవుల్లో ఆపరేషన్ కగార్(Operation Kagar) మూడో రోజు కొనసాగుతోంది. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కేంద్ర బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. ధర్మతాళ్లగూడెం వద్ద అర్ధరాత్రి నుంచి జరుగుతున్న ఎదురు కాల్పుల్లో ఇప్పటిదాకా.. ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారని సమాచారం. ఇద్దరు జవాన్లు గాయపడగా.. బీజాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరోవైపు.. గత మూడు రోజులుగా కొనసాగుతున్న భారీ సెర్చ్ ఆపరేషన్ ఆధారంగా మావోయిస్టులు భారీ సంఖ్యలో మృతి చెంది ఉండొచ్చనే అనుమానాలు కలుగుతున్నాయి. గాలింపు చర్యల్లో డీఆర్జీ బస్తర్ ఫైటర్ కోబ్రా, సీఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్ సైనికులు, మూడు రాష్ట్రాల పోలీసులు పాల్గొంటున్నారు. ఐదు వేల మంది మాత్రమే కర్రెలగుట్టను రౌండప్ చేశారని పోలీస్ అధికారులు చెబుతున్నారు. కానీ, పలు ఆంగ్ల మీడియా ఛానెల్స్ మాత్రం ఆ సంఖ్య పదివేల దాకా ఉండొచ్చని చెబుతోంది. సుమారు 2,500 మంది మావోయిస్టులు దాగి ఉన్న సమాచారంతో.. వేలమంది పోలీస్, కేంద్ర భద్రతా బలగాల సిబ్బంది కర్రిగుట్టలను చట్టుముట్టిట్లు తెలుస్తోంది. గత మూడు రోజులుగా మూడు హెలికాప్టర్లు, పదుల సంఖ్యలో డ్రోన్ల ద్వారా ములుగు అటవీ ప్రాంతం(Mulugu Forest)లో కూంబింగ్ కొనసాగుతోంది. మాకేం సంబంధం లేదుకర్రిగుట్టలో జరుగుతున్న సెర్చ్ ఆపరేషన్.. కూంబింగ్‌కు తమకు సంబంధం లేదని తెలంగాణ పోలీసులు ప్రకటించారు. ఈ వ్యవహారాన్ని పూర్తిగా ఛత్తీస్‌గఢ్- కేంద్ర బలగాలు చూసుకుంటున్నాయని, తమకు ఎలాంటి సమాచారం కూడా లేదని ఐజీ చంద్ర శేఖర్ రెడ్డి ప్రకటించారు. కూబింగ్‌లో పాల్గొంటున్న కేంద్ర భద్రత బలగాలకు మంచినీరు, ఆహారం, తుపాకులు, మందు గుండు సామాగ్రిని పోలీసులు చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుండడంతో.. కర్రిగుట్టల అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరగవచ్చని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.మరోవైపు.. ఛత్తీస్గడ్ వైపు నుంచి ఊసూర్ బ్లాక్‌లోని కర్రెగుట్టల(Karreguttalu) సమీపంలో మంగళవారం కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. కానీ, కాల్పులను పోలీసులు ధృవీకరించలేదు. కేవలం సెర్చింగ్ ఆపరేషన్ మాత్రమే చేస్తున్నామని చెబుతున్నారు.కర్రెగుట్ట అటు ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా ఊసూర్ బ్లాక్ పరిధిలో.. ఇటు ములుగు వాజేడు మండలం పరిధిలో విస్తరించి ఉన్నాయి. ఇటీవల మావోయిస్టుల నుండి కర్రెగుట్టల్లో బాంబులు అమర్చామని.. గుట్టల్లోకి ఎవరు రావొద్దంటూ లేఖ విడుదల చేశారు. ఈ లేఖపై ములుగు ఎస్పీ శబరీష్(SP Shabarish) స్పందించారు. అడవి ఉత్పత్తులపై ఆధారపడి ఆదివాసులు బతుకుతున్నారని, బాంబుల పేరుతో వారిని బెదిరించడం సమంజసం కాదన్నారు. చట్టవిరుద్ధ పనులు చేస్తున్న మావోయిస్టులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు..మావోయిస్టుల లేఖతో అప్రమత్తమైన కేంద్ర బలగాలు కర్రెగుట్టల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. మరీ ముఖ్యంగా.. మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ మడవి హిడ్మా, హీడ్మా దళం కర్రెగుట్టల్లో సంచరిస్తున్నట్లుగా కేంద్ర సాయుద బలగాలకు ఉప్పందించనట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ముమ్మరంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.కూంబింగ్ సరికాదుఇదిలా ఉంటే.. కేంద్రం, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్ ప్రభుత్వాలు వెంటనే కాల్పుల విరమణను పాటించి, మావోయిస్టులతో శాంతి చర్చలకు సానుకూల వాతావరణాన్ని కల్పించాలని పీస్ డైలాగ్ కమిటీ(పీడీసీ) చైర్మన్ జస్టిస్ బి.చంద్రకుమార్ విజ్ఞప్తి చేశారు. మరోవైపు.. కర్రెగుట్టలకు సంబంధించి పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ వెంటనే కాల్పులు ఆపాలని డిమాండ్ చేశారు. ఓ వైపు శాంతి చర్చల ప్రతిపాదన తెస్తూనే ఇటువంటి హత్యకాండకు ప్రభుత్వాలు తెగబడటం దుర్మార్గమన్నారు. ఈ ముసుగులో సాధారణ ప్రజానీకం మరణించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారాయన. ప్రభుత్వం నుంచి ముందుగా శాంతి చర్చల అడుగులు పడాలని, ఆ ప్రతిపాదన మావోయిస్టుల నుంచి కూడా వచ్చిందని గుర్తు చేశారు. శాంతి చర్చలకు అడుగులు పడుతున్నాయని భావిస్తున్న తరుణంలో భద్రతా బలగాలను ఉసిగొల్పి మావోయిస్టులను పూర్తిస్థాయిలో అంతమొందించాలని చూడటంతో ఒక దుర్మార్గమైన చర్య అంటూ హరగోపాల్ వ్యాఖ్యానించారు.
ఎన్ఆర్ఐ

పిట్స్‌బర్గ్‌లో నాట్స్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
అమెరికాలో తెలుగు వారిని కలిపే అనేక కార్యక్రమాలను చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా పిట్స్బర్గ్ లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించింది. తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని నాట్స్ పిట్స్బర్గ్ చాప్టర్ నిర్వహించిన ఉగాది వేడుకలకు స్థానిక తెలుగు వారి నుంచి మంచి స్పందన లభించింది. కూచిపూడి, భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో పాటు, జానపద నృత్యాలు, శాస్త్రీయ సంగీత గీతాలు, నాటక ప్రదర్శనలు, తదితర వినోద కార్యక్రమాలు అందరినీ అలరించాయి. సంస్కృతి డాన్స్ స్కూల్ శాస్త్రీయ నృత్య ప్రదర్శనలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఉగాది వేడుకల్లో భాగంగానే తెలుగు శ్లోక, తెలుగు వచనం, గణితం, చిత్రలేఖనం, లెగో డిజైన్, చెస్ పోటీలు పిల్లల కోసం నిర్వహించగా, ప్రత్యేకంగా విజేతలకు బహుమతులు అందించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానం సాధించిన పిల్లలకు ప్రత్యేకంగా గుర్తింపు, పురస్కారాలను అందజేశారు. ఈ పోటీలు పిల్లలలో సృజనాత్మకతను, విజ్ఞానాన్ని, పోటీ భావనను పెంపొందించేందుకు ఒక గొప్ప వేదికగా నిలిచాయి ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించడంలో నాట్స్ పిట్స్బర్గ్ చాప్టర్ కోఆర్డినేటర్ రవి కొండపి, నాట్స్ వెబ్ సెక్రటరీ రవికిరణ్ తుమ్మల కీలక పాత్ర పోషించారు. వారి నాయకత్వం, అంకితభావం వల్లే ఈ వేడుకలు దిగ్విజయంగా జరిగాయని స్థానిక తెలుగు వారి నుంచి ప్రశంసలు లభించాయి. ఈ వేడుకలకు వ్యాఖ్యాతలుగా శిల్పా శెట్టి, అర్చనా కొండపి, మోనికాలు వ్యవహారించారు. ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించిన సంస్కృతి డ్యాన్స్ స్కూల్‌కి నాట్స్ ధన్యవాదాలు తెలిపింది. ఇక విందు భోజనాన్ని పిట్స్బర్గ్ తత్వా ఇండియన్ క్యూసిన్ అందింయింది., సంప్రదాయ తెలుగు విందు భోజనంతో అందరి చేత ఆహా అనిపించారు.ఉగాది వేడుకలకు సహకరించిన వారికి, వేడుకల కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ పిట్స్ బర్గ్ టీం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. తెలుగు వారి కోసం ఉగాది వేడుకలను దిగ్విజయంగా నిర్వహించిన పిట్స్బర్గ్ టీంకి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

అందాల బొమ్మ.. ఈ గోదావరి భామ
వీరవాసరం: పుట్టింది పల్లెటూరులో.. పెరిగింది పట్నంలో.. ఆపై ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లిన తెలుగమ్మాయి అక్కడ అందాల పోటీల్లో ఫైనల్‌కు చేరింది. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయకుదురు గ్రామ శివారు నడపనవారి పాలెం గ్రామానికి చెందిన కొత్తపల్లి రాంబాబు కుమార్తె కొత్తపల్లి చూర్ణిక ప్రియ (Churnika Priya Kothapalli). అమెరికాలో ఎంఎస్ చదువుతున్న ఆమె తెలుగు సంఘం ఆధ్వర్యంలో డల్లాస్‌లో నిర్వహించిన మిస్ తెలుగు యూఎస్ఏ–2025 పోటీల్లో పాల్గొంది. సుమారు 5 వేల మంది పాల్గొన్న పోటీల్లో ఆమె సత్తాచాటి ఫైనల్–20 జాబితాలో చోటు సంపాదించింది. గోదావరి (Godavari) కీర్తిని చాటింది.అమెరికాలోని డల్లాస్ (Dallas) ఐర్వింగ్ ఆర్ట్ సెంటర్ వేదికగా వచ్చే మే 25న గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ పోటీలో గెలుపొందేందుకు ప్రపంచంలోని తెలుగు ప్రజల ఓట్లే కీలకం. అమెరికాలోని తెలుగు యువతులకు మాత్రమే పరిమితమైన ఈ పోటీల్లో చూర్ణిక ప్రియ అద్భుతమైన ప్రతిభను చాటుతుండటం విశేషం. బీటెక్ పూర్తి చేసిన ఈమె క్లాసికల్ డ్యాన్సర్ గానూ ప్రతిభ చాటింది.చదవండి: టాలెంట్‌ను ట్రంప్ కూడా ఆపలేడు

స్కాట్లాండ్లో ఘనంగా ఉగాది సంబరాలు
స్కాట్లాండ్లోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ (TAS) ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది సంబరాలు నిర్వహించారు. ఇవి తెలుగు సంస్కృతిక ఐక్యతకు ప్రతిబింబంగా నిలిచాయి. ఈ ఉగాది సంబరాలు స్కాట్లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 5న మిడ్లాథియన్‌లోని డాల్కీత్ స్కూల్ కమ్యూనిటీ వద్ద నిర్వహించారు.శ్రీ విశ్వావసు నామ సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, సంఘం ఐక్యతను ప్రతిబింబించేలా ఈ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్కాట్లాండ్లో ఉన్న వందలాది తెలుగు కుటుంబాలు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు కూడా ఆకర్షణగా నిలిచారు. వందకి పైగా కళాకారులు తమ ప్రతిభ, ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ వేడుక ప్రస్తుత, మాజీ కమిటీ సభ్యులతో జ్యోతి ప్రజ్వలన మొదలవ్వగా, అనంతరం “మా తెలుగు తల్లికి” గేయంతో సాంస్కృతిక కార్యక్రమంతో ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా భారత కాన్సులేట్ అధికారి ఆజాద్ సింగ్, లోథియన్ ప్రాంతానికి చెందిన MSP ఫోయిల్ చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని, ఇతర సంఘాల ప్రతినిధులను చైర్మన్ శివ చింపిరి, అధ్యక్షుడు ఉదయ్ కుమార్ కుచాడి, హానరరీ చైర్పర్సన్ మైథిలి కెంబూరి తదితరులు ఘనంగా సత్కరించారు.. సాంస్కృతిక కార్యదర్శి పండరి జైన్ కుమార్ పొలిశెట్టి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, కళాకారులు, ప్రేక్షకులు, స్పాన్సర్లు, వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్య ఆకర్షణగా “మనబడి” పిల్లలు ప్రదర్శించిన “పరమానందయ్య శిష్యుల కథ” నాటకం, భాషా నేర్పరితో పాటు సాంస్కృతిక విలువలను చక్కగా చాటింది. ఈ ఉగాది సంబరాలు 2025 తెలుగు వారసత్వాన్ని ముందుకెళ్లలా, సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడేలా నిర్వహించడం తోపాటు.. TAS సంఘం ఐక్యత, సేవా ధోరణిని ప్రతిబింభించేలా నిలిచాయి.(చదవండి: న్యూజిలాండ్‌లో ఘనంగా ఉగాది సంబరాలు)

న్యూజిలాండ్‌లో ఘనంగా ఉగాది సంబరాలు
ఆక్లాండ్ నగరంలో తెలంగాణా అసోసియేషన్ అఫ్ న్యూజిలాండ్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్త సంవత్సరాది విశ్వవాసు సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ వేడుకలను నిర్వహించుకున్నారుఈ కార్యక్రమం లో తెలుగుతనం, తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా పంచాంగ శ్రవణంతో రాశి ఫలితాలను స్థితిగతులను విని ఆనందించారు. ఆ తర్వాత చిన్నారులు పెద్దలు వివిధ తెలుగు సాంప్రదాయ పాటలు, నృత్యాలతో అలరించడమే కాకుండా సాంప్రదాయ పిండి వంటలతో సామూహిక భోజనాలు చేశారు. కార్యక్రమానికి ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించిన టే అటటు డెంటల్ క్లినిక్ మోనిక శ్రీకాంత్ తోపాటు సామజికసేవాలో ముందున్న తెలుగు ప్రతినిధులను ఉగాది పురస్కారాలతో గౌరవంగా సన్మానించుకోవడం తోపాటు చిన్నారులకు నృత్యకారులకు బహుమతులని అందజేయడం జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడు కోడూరి చంద్రశేఖర్ అద్యేక్షతన జరిగిన ఈ వేడుకలో ప్రముఖ వ్యాపారవేత్త శివ కిలారి, రవి సంకర్ అల్ల, సత్యనారాయణ తట్టల, అసోసియేషన్ మాజీ అధ్యక్షలు పట్లోళ్ల నరేందర్ రెడ్డి, మేకల ప్రసన్న కుమార్,శైలందర్ రెడ్డి, విశ్వనాధు బాల, విజేత యాచమనేని, మధు ఎర్ర, శైలజ బాలకుల్ల, లింగం గుండెల్లి, శశికాంత్ గున్నాల, కావ్య, వర్ష పట్లోళ్ల, మేకల స్వాతి,కిరణ్మయి, విశ్వనాథ్ అవిటి, సలీం, ప్రమోద్, విజయ్ శ్రీరామ్, చంద్రకిరణ్,రమేష్ రామిండ్ల, మనోహర్ కన్నం, హరీష్, రమేష్ ఆడెపు, పవన్, అనిల్ మెరుగు తదితరులతో పాటు పెద్ద ఎత్తున ప్రవాస తెలంగాణ వాసులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.(చదవండి: హాంగ్‌కాంగ్‌లో ఘనంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలు)
క్రైమ్

భార్య, అత్తపై అల్లుడి దాడి
మియాపూర్(హైదరాబాద్): భార్యా భర్తల మధ్య ఏర్పడిన వివాదం దాడికి దారి తీసింది. భార్యపై భర్త కత్తితో దాడి చేయగా..అడ్డుగా వచ్చిన అత్తను సైతం కత్తితో పొడవడంతో తీవ్రంగా గాయపడింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన వివరాలు..సీఐ క్రాంతి కుమార్ తెలిపిన ప్రకారం..కాకినాడకు చెందిన బండారులంక మహేష్ మియాపూర్ జనప్రియనగర్ రోడ్డు నెం.5 శ్రీ వెంకట నిలయంలో భార్య శ్రీదేవి, రెండేళ్ల కుమార్తెతో కలిసి ఉంటూ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా మహేష్ తన సంపాదనను ఇంటి ఖర్చులకు ఇవ్వకుండా..మద్యం తాగేందుకు ఖర్చుచేస్తున్నాడు. ఈ విషయంలో భార్య శ్రీదేవితో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం శ్రీదేవి చందానగర్ హుడాకాలనీలో ఉంటున్న తల్లి మంగ ఇంటికి వెళ్లింది. సోమవారం మధ్యాహ్నం శ్రీదేవికి ఫోన్‌చేసి ఇంటికి తిరిగి రమ్మని మహేష్ కోరగా..ఆమె మధ్యాహ్నం ఒంటి గంటకు కుమార్తెతో కలిసి వచ్చింది. అదేరోజు సాయంత్రం మహేష్ తన సోదరుడు సాయికుమార్ పుట్టిన రోజు ఉందని, జనప్రియ కాలనీలో ఉంటున్న తమ తల్లిదండ్రుల ఇంటికి వెళ్దామని చెప్పాడు. దీనికి శ్రీదేవి నిరాకరించడంతో ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఈ విషయాన్ని శ్రీదేవి తల్లి మంగకు ఫోన్ చేసి చెప్పగా ఆమెకూడా ఇక్కడికి వచ్చింది. దాడిని ప్రశ్నించడంతో ఆవేశానికి లోనైన మహేష్ వంటగదిలోకి వెళ్లి కూరగాయలు కోసే కత్తి తీసుకుని వచ్చి మొదట శ్రీదేవిపై దాడి చేశాడు. వారించేందుకు వెళ్లిన అత్త మంగను విచక్షణారహితంగా కత్తితో పొడవడంతో ఆమె తీవ్రంగా గాయపడగా..స్థానికులు గమనించి ఇద్దర్నీ సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరతించారు. ఘటనపై శ్రీదేవి భర్త మహేష్‌పై మియాపూర్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిందితుడు మహేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ‘అమ్మానాన్నా.. నన్ను క్షమించండి. నేను ఇల్లు వదిలి వెళ్లిపోతున్నా’.. అంటూ ఒక మహిళా పంచాయతీ కార్యదర్శి లేఖ రాసి అదృశ్యమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి గ్రామ పంచాయతీలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. బద్దెనల్లిలో రెండేళ్లుగా పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న ప్రియాంక.. కాంగ్రెస్ నేతల వేధింపులు భరించలేకపోతున్నానంటూ.. లేఖ రాసి సోమవారం అదృశ్యమైంది. డీపీఓకు రాజీనామా లేఖ వాట్సాప్ ద్వారా పంపినట్లు తెలిసింది. కాంగ్రెస్ నేత క్రీదాది మల్లేశ్బాబుతోపాటు మరికొందరు పెట్టే బాధల వల్ల మానసిక వేదన భరించలేకపోతున్నానని ఆమె లేఖలో పేర్కొంది. కాగా, తమ కూతురు కనిపించడం లేదని ప్రియాంక తల్లిదండ్రులు సిరిసిల్ల డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆమె తిరుపతిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కూతురి కోసం తల్లిదండ్రులు మంగళవారం తిరుపతికి బయలుదేరారు.

యువ ప్రేమజంట ఆత్మహత్య!
సాక్షి, బళ్లారి: ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. వారం రోజుల క్రితం కనిపించకుండా పోయిన ప్రేమికులు శవాలై తేలారు. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది. ఉమ్మడి బళ్లారి జిల్లాలోని హరపనహళ్లి తాలూకా బిట్టినకట్టి గ్రామానికి చెందిన మద్దనస్వామి (18), బండ్రి గ్రామానికి చెందిన దీపిక (18) అనే ఇద్దరు ప్రేమించుకున్నారు. పీయూసీలో ఇద్దరు ప్రథమ శ్రేణిలో పాసయ్యారు. అయితే వారం రోజుల క్రితం ఏమైందో కాని ఇరువురు కనబడకుండా వెళ్లిపోయారు. దీనిపై పోలీసు స్టేషన్లో కూడా తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు, కుటుంబ సభ్యులు గాలిస్తున్న నేపథ్యంలో హరపనహళ్లి పట్టణ శివారులోని ఐటీఐ కళాశాల సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉరి వేసుకున్న స్థితిలో శవాలై తేలారు. స్థానిక పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అక్కడి ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు. గ్రామంలో తీవ్ర విషాదం అలముకొంది.

హత్యాయత్నం నిజమా.. నాటకమా?
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): మాజీ మాఫియా డాన్ దివంగత ముత్తప్ప రై చిన్న కుమారుడు రిక్కీ రై పై కాల్పులు జరిగిన కేసులో బిడది పోలీసులు అతని గన్‌మ్యాన్ మన్నప్ప విఠల్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. రిక్కీ రై తానే కాల్చుకుని హత్యాయత్నం డ్రామా ఆడుతున్నాడని పోలీసులు తాజాగా అనుమానిస్తున్నారు. రిక్కీ రైకి ఉన్న ముగ్గురు గన్ మ్యాన్లు ఒక్కొక్కరు ఒక్కో వాంగ్మూలం ఇస్తుండడంతో పోలీసుల అనుమానాలు బలపడుతున్నాయి. తన పిన్ని అనురాధ, రాకేశ్ మల్లి, మరో ఇద్దరిపై ఆరోపణలు చేసి రిక్కీ కేసును పక్కదారి పట్టిస్తున్నారా అని సందేహిస్తున్నారు. కాల్పులు జరగడానికి ముందు కుక్కలు అరవడంతో గాల్లోకి కాల్పులు జరిపామని గన్ మ్యాన్లు చెప్పిన మాటల్లో నిజం లేదని గుర్తించారు. హత్యాయత్నం ఆరోపణలు ఎదుర్కొంటున్న రాకేశ్ మల్లి తన లాయర్లతో కలిసి రామనగర ఎస్పీ కార్యాలయానికి వచ్చాడు. ఎస్పీ శ్రీనివాసగౌడ అతనిని విచారించారు. పిన్ని అనురాధకు ఊరట ఈ కేసులో ఏ2గా ఉన్న రిక్కి రై పిన్ని అనురాధకు హైకోర్టులో ఊరట దక్కింది. కేసులో నుంచి తన పేరు తొలగించాలని ఆమె హైకోర్టును ఆశ్రయించగా, ఆమెపై తొందరపాటు చర్యలు, బలవంతపు చర్యలు తీసుకోరాదని కోర్టు పోలీసులను ఆదేశించింది. అనురాధకు 14వ తేదీన యూరోప్‌కు వెళ్లిపోయిందని, 6 నెలల క్రితమే ఆస్తి గొడవలపై రాజీ చేసుకున్నారని ఆమె లాయర్ వాదించారు. నాపై హత్యాయత్నం చేసింది పిన్ని అనురాధ..?
వీడియోలు


Botsa: నమ్మించి మోసం చేశారు.. 11 నెలల పదవి కోసం ఇన్ని దారుణాలా


Pahalgam Attack: సంచలన నిర్ణయాలు తీసుకున్న మోదీ సర్కార్


కార్యకర్తలే తోలు తీస్తారు జాగ్రత్త.. బాబుకు జగన్ మాస్ వార్నింగ్


మీ తెగువకు నా సెల్యూట్: YS Jagan


చంద్రబాబు మాత్రం 21 ఎకరాలు ఇస్తాడు: YS Jagan


Pahalgam Attack: రాజకీయ ఏకాభిప్రాయం కోసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు


రాష్ట్రంలో వ్యవస్థలన్నీ విధ్వంసం: YS జగన్


Telugu Movies 2026: నెవర్ బిఫోర్ బ్లాస్టింగ్


భారత్‌లో పాక్ సినిమాలు, నటులపై నిషేధం


LIVE: జీవితంలో మొదటిసారి ఇలాంటి దుర్మార్గాలు చూస్తున్నా: YS Jagan