అప్పుల బాధ తాళలేక ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కుంతాల మండలం రాజాపూర్ తండాలో జరిగింది.
అప్పుల బాధ తాళలేక ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కుంతాల మండలం రాజాపూర్ తండాలో జరిగింది. రాజాపూర్ తండాకు చెందిన ఆడి రవి (45) తనకున్న రెండున్నర ఎకరాల్లో రెండు సార్లు బోరు బావి తవ్వించినా నీళ్లు పడలేదు. దీనికి తోడు ఈ ఏడాది మరో మూడు ఎకరాలు కౌలుకి తీసుకుని పంట వేశాడు. వర్షాలు లేక పంటలు ఎండిపోయి, అప్పులు మిగిలాయి.
రవికి ఆరుగురు కుమార్తెలు. పెద్ద అమ్మయికి పెళ్ళి చేశాడు. రెండో అమ్మాయికి దీపావళి తరువాతన పెళ్చి చేసేందుకు నిశ్చితార్ధం చేశాడు. ఈ నేపథ్యంలో వేసిన పంట ఎండిపోవడం, చేసిన అప్పులు, పిల్ల పెళ్ళి రవిని కుంగదీశాయి. దీంతో మనస్థాపం చెందిన అతను తన పొలానికి వెళ్లి అక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
పొలానికి వెళ్లిన వ్యక్తి ఎంతకీ ఇంటికి రాకపోవడంతో రవి తండ్రి తన పొలానికి వెళ్లి చూడగా.. అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే రవిని భైంసా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొంతుదూ అతడు బుధవారం మరణించాడు.