
సాక్షి, హైదరాబాద్: నగరంలో గురువారం సాయంత్రం పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, ఉరుములతో కూడిన వర్షం పడింది. దీంతో పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కూకట్ పల్లి మెట్రో స్టేషన్ వద్ద గాలి దుమారానికి ప్లెక్సీలు చిరిగి పట్టాలపై పడడంతో మెట్రో ట్రైన్ అరగంట పాటు ఆగాల్సి వచ్చింది. అమీర్‌పేట నుంచి మియాపూర్ వెళ్లే మార్గంలో హోర్డింగ్ ప్లెక్సీ ఊడిపోయి వచ్చి మెట్రో విద్యుత్ తీగలపై పడింది. వెంటనే స్పందించిన మెట్రో సిబ్బంది ట్రైన్‌ను అరగంట వరకు నిలుపుదల చేశారు. అనంతరం మెట్రో సిబ్బంది ప్లైక్సీలను తొలగించి మెట్రో సేవలను పునరుద్దరించారు.