జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించాలకున్న నేతలకు, ప్రజలకు తిరుపతి పోలీసులు షాక్ ఇచ్చారు.
తిరుపతి: జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించాలకున్న నేతలకు, ప్రజలకు తిరుపతి పోలీసులు షాక్ ఇచ్చారు. తిరుపతి పట్టణంలోని గాంధీ విగ్రహానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాళులర్పించిన తర్వాతే.. మిగతా నేతలకు అనుమతి ఇస్తామని పోలీసులు తేల్చిచెప్పారు. పోలీసుల తీరుతో వివిధ పార్టీల నాయకులు విస్తుపోయారు.
జాతిపితకు నివాళులర్పించకుండా అడ్డుపడుతున్న పోలీసుల తీరుపై వివిధ పార్టీల నేతలు నిరసనకు దిగారు. దీంతో తిరుపతిలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీఎం చంద్రబాబు ఆదివారం తిరుపతి పర్యటన సందర్భంగా పోలీసులు ఇలా ఓవరాక్షన్ చేస్తుండటంపై నేతలు అసహనం వ్యక్తం చేశారు.