Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Simhachalam Temple Wall Collapsed incident Updates1
సింహాచలం విషాదం.. గోడ నిర్మాణం వద్దని వైదికులు, అర్చకులు వారించినా..

విశాఖ: సింహాచలం చందనోత్సవంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందిన ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిషన్‌ విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.సింహాచలం గోడ నిర్మాణంలో ఎలాంటి టెండర్‌ లేదు. నోటి మాటతో నిర్మాణం జరిగింది. దీంతో పాటు వైదిక నిబంధనలను ఉల్లంఘించినట్లు సింహాచలం చందనోత్సవంలో జరిగిన దుర్ఘటనపై త్రిసభ్య కమిటీ చేపట్టిన రెండో రోజు విచారణలో తేలింది. విచారణలో భాగంగా త్రిసభ్య కమిషన్‌ విషాదానికి సంబంధించి ఆలయ అర్చకులు, వైదికుల నుంచి కీలక సమాచారాన్ని సేకరించింది. సింహగిరిలో కూలిన గోడపై త్రిసభ్య కమిటీ సభ్యుల విచారణలో.. దేవాలయంలో నోటి మాటతో గోడ నిర్మాణం చేపట్టారని, అనుమతులు, ప్రొసీజర్‌ ఫాలోకాలేదని స్పష్టమైంది. పైగా వైదిక నిబంధనలు సైతం ఉల్లంఘించారని.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిషన్‌కు సింహాచలం ఆలయ అర్చకులు వివరించారు. ‘మాస్టర్ ప్లాన్‌ డ్రాఫ్ట్‌కు విరుద్ధంగా నిర్మాణం చేపట్టొద్దని ముందే చెప్పాం. అయినా మా మాట వినకుండా గోడ నిర్మాణం చేపట్టారని’ సింహాచలం వైదికులు, అర్చకులు వివరించారు. అర్చకులు, వైదికులు ఇచ్చిన సమాచారాన్ని, వివరణలను ఇవాళ ఏపీ ప్రభుత్వానికి సమర్పించే నివేదికలో త్రిసభ్య కమిషన్‌ పొందుపరచనుంది.

Minister Zameer Ahmed Khan Sensational comments On Pakistan2
మోదీ.. నాకు ఆత్మాహుతి బాంబు ఇవ్వండి.. పాక్‌పై దాడి చేస్తా: కర్ణాటక మంత్రి

బెంగళూరు: పహ‍ల్గాం ఘటన నేపథ్యంలో భారత్‌-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఉగ్రదాడికి భారత్‌ ప్రతీకారం తీర్చుకోవాలని దేశ ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో కర్ణాటక మంత్రి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పాకిస్తాన్‌పై యుద్ధం చేసేందుకు తనకొక సూసైడ్ బాంబ్ (Suicide Bomb) ఇవ్వాలన్నారు. తాను ఆ బాంబును పాకిస్తాన్‌పై వేస్తానని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి.కర్ణాటక మంత్రి, కాంగ్రెస్‌ నాయకుడు బీజడ్‌ జమీర్ అహ్మద్‌ఖాన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘పహల్గాం దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. అమాయక ప్రజలపై జరిగిన అమానవీయ చర్య ఇది. పాకిస్తాన్‌ (Pakistan) ఎప్పటికీ భారత్‌కు శత్రు దేశమే. ఆ దేశంతో మనకు ఎలాంటి సంబంధాలు లేవు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా అంగీకరిస్తే.. ఆ దేశంపై యుద్ధాన్ని ప్రారంభించేందుకు నేను సిద్ధం. ఆత్మాహుతికి నాకొక బాంబు ఇవ్వండి. బాంబ్ ఇస్తే దానిని తీసుకుని పాక్‌పై దాడి చేస్తాను. ఇలాంటి సమయంలో ప్రతీ భారతీయుడు ఐక్యంగా నిలబడాలని, జాతి భద్రతకు సంబంధించి కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నాను’ అంటూ కామెంట్స్‌ చేశారు. అలాగే, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేందుకు మనమంతా ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక, ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. #WATCH | Karnataka Minister BZ Zameer Ahmed Khan says, "...We are Indians, we are Hindustanis. Pakistan never had any relations with us. Pakistan has always been our enemy...If Modi, Amit Shah and the Central government let me, I am ready to go to battle. (02.05.2025) pic.twitter.com/HdYiZcYBIC— ANI (@ANI) May 3, 2025ఇదిలా ఉండగా.. పహల్గాం దాడి ఉద్రిక్తతల నేపథ్యంలో గురువారం నాటి పాకిస్తాన్‌ సైనిక విన్యాసాలకు భారత సైన్యం ధీటుగా బదులిచ్చింది. నడిరోడ్డుపైనా యుద్ధవిమానాల ల్యాండింగ్, టేకాఫ్‌ జరిపి వాయుసేన సత్తా చాటింది. అత్యంత అధునాతన శత్రు భీకర రఫేల్‌తో పాటు సుఖోయ్‌–30, ఎంకేఐ, మిరాజ్‌–2000, మిగ్‌–29, జాగ్వార్, సీ–130జే సూపర్‌ హెర్క్యులస్, ఏఎన్‌–32 విమానాలతో పాటు ఎంఐ–17 వీ5 హెలికాప్టర్లను కూడా ఈ అధునాతన ఎయిర్ర్‌స్టిప్‌పై ల్యాండింగ్, టేకాఫ్‌ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌ జిల్లాలోని గంగా ఎక్స్‌ప్రెస్‌వే ఈ ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలకు వేదికైంది.📍Shahjahanpur: The Indian Air Force (IAF) is conducting take-off and landing exercises on the Ganga Expressway in Uttar Pradesh — even at night #GangaExpressway #aircraft #AirForce #IndiaPakistan #ind pic.twitter.com/nN8EyzpNQl— Geopolitics news (@rat92553) May 3, 2025పగటి పూటే గాక అవసరమైతే కారుచీకట్లోనూ నిర్భీతిగా యుద్ధవిమానాలను రోడ్లపై కూడా దింపగలమని వాయుసేన నిరూపించింది. 594 కిలోమీటర్ల పొడవైన గంగా ఎక్స్‌ప్రెస్‌ వేలో జలాలాబాద్‌ సమీపంలోని పిరూ గ్రామం వద్ద నిర్మించిన 3.5 కిలోమీటర్ల పొడవైన ఎయిర్‌స్టిప్‌పై శుక్రవారం రాత్రి ఎయిర్‌ఫోర్స్‌ యుద్ధవిమానాలు ఇలా ల్యాండై అలా టేకాఫ్‌ తీసుకున్నాయి. తద్వారా దేశంలో పగలు, రాత్రి తేడా లేకుండా అన్నివేళలా ఫైటర్‌జెట్ల ల్యాండింగ్, టేకాఫ్‌కు అనువైన తొలి ఎక్స్‌ప్రెస్‌వే గా ఈ మార్గం నిలిచింది. అందుకు క్యాట్‌–2 ఇన్‌స్ట్రుమెంట్‌ ల్యాండింగ్‌ సిస్టమ్‌ సాంకేతికతను వినియోగించారు. మంచు, వర్షం, పొగమంచు, తక్కువ దృగ్గోచరత వంటి సందర్భాల్లోనూ ల్యాండింగ్, టేకాఫ్‌ సాధ్యమయ్యేలా ఎక్స్‌ప్రెస్‌ వేలో ఎత్తయిన, అనువైన ప్రదేశంలోనే స్ట్రిప్‌ను నిర్మించారు. వరదలు, భూకంపం వంటి విపత్తుల వేళ సైన్యాన్ని వెంటనే రంగంలోకి దించడానికీ ఈ స్ట్రిప్‌ ఉపయోగపడనుంది. అత్యంత తక్కువ ఎత్తులో దూసుకొస్తూ ల్యాండింగ్‌నూ పరీక్షించారు.उत्तर प्रदेश: शाहजहांपुर (Indian Air Force)शाहजहांपुर Ganga Expressway पर भारत वायु सेना की Exercise जारी है।यहाँ राफेल जैसे युद्धक विमानों की भीड़ है। pic.twitter.com/khEHUDrCzD— Shubhangi Pandit (@Babymishra_) May 3, 2025

Major Tragedy At Shirgao Jatra in Goa3
Goa: దేవాలయంలో తొక్కిసలాట.. ఆరుగురు భక్తులు మృతి

ఢిల్లీ: గోవాలో విషాదం చోటు చేసుకుంది. శిర్గావ్‌ ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ విషాదంలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. 30 మందికి పైగా త్రీవ గాయాలయ్యాయి. గాయపడ్డ బాధితుల్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. Goa Congress is deeply saddened by the stampede at Jatrotsav of Shree Lairai Devi,Shirgao. We condemn this tragic incident and offer heartfelt condolences to the families who lost their loved ones. Wishing a speedy recovery to all those injured. 🙏@DrAnjaliTai @ViriatoFern pic.twitter.com/7kL6uNkBEi— Goa Congress (@INCGoa) May 3, 2025ఉత్తర గోవాలోని బిచ్లిమ్ జిల్లా తాలూకా శిర్గావ్ గ్రామంలో ప్రతీ ఏడాది మే 2న ఘనంగా నిర్వహించే పార్వతి దేవి(Shri Lairai Zatra) జాతర ఈ ఏడాది విషాదాన్ని నింపింది. ఈ శుక్రవారం (మే2) జాతర జరిగే సమయంలో తొక్కిసలాట ఆరుగు భక్తుల ప్రాణాల్ని తీసింది. పోలీసుల సమాచారం మేరకు శుక్రవారం జాతరను నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ఈ జాతరలో పాల్గొని, అమ్మవారికి మొక్కులు తీర్చుకునేందుకు సమారు 50వేల నుంచి 70 వేల మంది భక్తులు హాజరయ్యారు. జాతర ప్రారంభమైంది. సరిగ్గా జాతర జరిగే మార్గంలో ఎతైన ప్రదేశంలో ఉన్న భక్తులు ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చారు. అదుపు తప్పి భక్తులు ఒకరిపై ఒకరు మీద పడ్డారు. దీంతో ఊపిరాడక ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. 30 మందికి తీవ్రగాయాలయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు గోవా మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.(బాధితుల్ని పరామర్శిస్తున్న గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌)ప్రమాదంపై సమాచారం అందుకున్న గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించారు. ఘటన జరిగిన ప్రదేశంలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

I Was As Guilty As: Pat Cummins Reacts On SRH Loss To GT IPL 20254
అతడి బ్యాటింగ్‌ అద్భుతం.. మా ఓటమికి కారణాలు ఇవే.. మరో మూడేళ్లు..

ఐపీఎల్‌లో గతేడాది రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH) ఈసారి చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది. గుజరాత్‌ టైటాన్స్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లో కమిన్స్‌ బృందం 38 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తద్వారా ఐపీఎల్‌-2025 (IPL 2025)లో రైజర్స్‌ ప్లే ఆఫ్స్‌ అవకాశాలు దాదాపుగా ముగిసిపోయాయి.ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ (Pat Cummins) ఓటమి అనంతరం తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. ఇటు బౌలింగ్‌లో.. అటు బ్యాటింగ్‌లోనూ విఫలమయ్యామని పేర్కొన్నాడు. ఈ ఘోర ఓటమికి తానూ బాధ్యత వహిస్తున్నానని తెలిపాడు.పవర్‌ ప్లేలో మేము విఫలం‘‘పవర్‌ ప్లేలో మా ఇన్నింగ్స్‌ అంత గొప్పగా ఏమీ సాగలేదు. అందరిలాగే నేనూ ఈ పరాజయానికి బాధ్యుడిని. నాకు తెలిసి.. మేము 20-30 అదనపు పరుగులు సమర్పించుకున్నాం. అంతేకాదు.. రెండు- మూడు క్యాచ్‌లు మిస్‌ చేసుకున్నాం.అక్కడ కూడా నా తప్పు ఉందనే చెప్పాలి. ఇక 200కు పైగా పరుగుల ఛేదన అంత కష్టమేమీ కాదు. కానీ ఈరోజు మేము అందులో సఫలం కాలేకపోయాం. ఆ జట్టులో క్లాస్‌ బ్యాటర్లు ఉన్నారు.మా బౌలింగ్‌ అత్యంత చెత్తగా సాగిందిచెత్త బంతులు పడితే కచ్చితంగా బాదేస్తారు. ఈరోజు అదే జరిగింది. నిజంగా మా బౌలింగ్‌ అత్యంత చెత్తగా సాగింది. వికెట్‌ బాగున్నా మేము దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాం.ఇక అభిషేక్‌ శర్మ ఈరోజు అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. నితీశ్‌ ఆఖర్లో పోరాడాడు. అయితే, అప్పటికే ఆలస్యమైపోయింది. పరిస్థితి మా చేయిదాటి పోయింది. వేలంలో మేము సరైన నిర్ణయాలే తీసుకున్నాం అనుకుంటున్నాం. మూడేళ్ల పాటుఈ కోర్‌ గ్రూప్‌ మూడేళ్ల పాటు కొనసాగుతుంది. ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది’’ అని ప్యాట్‌ కమిన్స్‌ చెప్పుకొచ్చాడు. కాగా అహ్మదాబాద్‌లో టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ తొలుత బౌలింగ్‌ చేసింది.ధారాళంగా పరుగులు సమర్పించుకునిఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన టైటాన్స్‌ సొంత మైదానంలో దుమ్మురేపింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఏకంగా 224 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. సన్‌రైజర్స్‌ బౌలర్లలో మహ్మద్‌ షమీ (3 ఓవర్లలో 48), హర్షల్‌ పటేల్‌ (3 ఓవర్లలో 41)ధారాళంగా పరుగులు సమర్పించుకుని ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయారు.మిగతా వాళ్లలో జీషన్‌ అన్సారీ తన బౌలింగ్‌ కోటాలో 42 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ తీయగా.. జయదేవ్‌ ఉనాద్కట్‌ నాలుగు ఓవర్లలో 35 రన్స్‌ మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు కూల్చాడు. కెప్టెన్‌ కమిన్స్‌ నాలుగు ఓవర్లలో 40 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్‌ పడగొట్టాడు.బ్యాటర్లు కూడా చెత్తగా ఆడిబౌలర్ల సంగతి ఇలా ఉంటే... లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్‌ బ్యాటర్లు కూడా చెత్త ప్రదర్శన కనబరిచారు. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (41 బంతుల్లో 74) ఒక్కడే అర్ధ శతకంతో రాణించగా.. ట్రవిస్‌ హెడ్‌ (20), ఇషాన్‌ కిషన్‌ (13), హెన్రిచ్‌ క్లాసెన్‌ (23), అనికేత్‌ వర్మ (3) విఫలమయ్యారు. ఆఖర్లో నితీశ్‌ రెడ్డి 10 బంతుల్లో 21 పరుగులతో నాటౌట్‌గా నిలిచినా ఫలితం లేకపోయింది. 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 186 పరుగుల వద్ద నిలిచిపోయిన రైజర్స్‌.. 38 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.చదవండి: Shubman Gill: అంపైర్‌తో గొడవపడి.. అభిషేక్‌ను కాలితో తన్ని! That's what you call a complete team performance 🤝@gujarat_titans climb to No.2⃣ in the points table after a convincing 3⃣8⃣-run win over #SRH 👏Scorecard ▶ https://t.co/u5fH4jPU3a#TATAIPL | #GTvSRH pic.twitter.com/EEc0v13pT2— IndianPremierLeague (@IPL) May 2, 2025

Trust Board Under Ashok Gajapathi Raju Silent on Simhachalam Tragedy5
సింహాచలం ఘటనపై అశోక్ నోరిప్పలేదేం

సింహాద్రి అప్పన్న చందనోత్సవం సందర్భంగా భారీ ఎత్తున భక్తులు వచ్చిన తరుణంలో ఏర్పాట్లు... భద్రత వంటి చర్యలను గాలికి వదిలేసిన ప్రభుత్వం ఏడుగురు భక్తుల ప్రాణాలను గాలిలో కలిపేసింది. దీనికి సంబంధించి ఇప్పుడు బయటపడుతున్న పలు లోపాలు చూస్తూ భక్తులు విష్టి పోతున్నారు. అతి తక్కువ సమయంలో గోడ నిర్మించలేనని కాంట్రాక్టర్ చెప్పినప్పటికీ పరవాలేదు మేము చూసుకుంటాం ఏదోలా పూర్తిచేసేయ్ అంటూ దేవాలయ యాజమాన్యం మంత్రులు తనపై ఒత్తిడి చేసి తూతూ మంత్రంగా పనులు పూర్తి చేయించారని కాంట్రాక్టర్ అంగీకరించారు. ఇదిలా ఉండగా ఉత్సవానికి ముందు పలువురు మంత్రులు సింహాచలాన్ని సందర్శించి ఏర్పాట్లు పర్యవేక్షించినట్లు పరిశీలించినట్లు సూచనలు సలహాలు ఇచ్చినట్లు పత్రికల్లో కథనాలు ఫోటోలు అయితే వేయించుకున్నారు కానీ వారు ఎక్కడ ఏమి చూసినట్లు లేదు. అలా వచ్చి మామూలుగా అధికారులతో సమావేశమై జ్యూస్ తాగి స్నాక్స్ తిని వెళ్లిపోయారు అన్నది ఈ సంఘటన తర్వాత అర్థమవుతుంది. ఇదంతా ఎలా ఉండగా సింహాచలం దేవస్థానానికి సంబంధించి అనువంశిక ధర్మకర్త ట్రస్ట్ బోర్డు చైర్మన్ అశోక్ గజపతిరాజు ఈ అంశంపై ఇంతవరకు కిక్కురుమనలేదు. గతంలో ఆయన ధర్మకర్తృత్వం లోని రామతీర్థం గుట్టపై శ్రీరాముని విగ్రహాన్ని కొంతమంది దుండగులు ధ్వంసం చేసిన ఘటన కు సంబంధించి ఆయన స్పందన విపరీతంగా ఉండేది. కళ్ళు ఎగరేస్తూ గాలిలో చేతులు తిప్పుతూ నాటి వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని తూలనాడారు. చైర్మన్ అయిన తనకు కూడా ఏమాత్రం సమాచారం లేదని బాధ్యత వహిస్తే పరిస్థితి వేరుగా ఉండేది అన్నట్లుగా ఆయన మాట్లాడారు. నాటి సంఘటనకు వైఎస్ జగన్ ప్రభుత్వం పూర్తి బాధ్యత అని దుమ్మెత్తి పోశారు.నేడు సౌండ్ లేదేం అశోక్ రాజానేడు సింహాచలం అప్పన్న స్వామికి చందనోత్సవం సందర్భంగా తొలి దర్శనం చేసుకుని పట్టు వస్త్రాలు సమర్పించేది కూడా విజయనగరం పూసపాటి కుటుంబీకులే. గతంలో ఆనందగజపతి రాజు ఈ సాంప్రదాయం పాటించగా నేడు అశోక్ గజపతి అప్పన్నకు చైర్మన్ హోదాలో పట్టు వస్త్రాలు సమర్పిస్తూ వస్తున్నారు. మరి దేవాలయ చైర్మన్గా ఆయనకు ఈ దుర్ఘటనతో సంబంధం లేదా..? బాధ్యత లేదా ? అంత పెద్ద ప్రమాదం జరిగి ఏడుగురు ప్రాణాలు కోల్పోయి మరికొందరు ఆసుపత్రిపాలవగా ఆయన మాత్రం ఏ మాత్రం నోరు విప్పడం లేదు. ఉత్సవాలకు ముందు మంత్రులతో పాటు ఆయన కూడా సమీక్షలో పాల్గొని ఆహా ఓహో అది చేశాను ఇది చేశాం అంటూ ఫోటోలు ప్రకటనలు ఇచ్చి ఇంటికి వచ్చారు తప్ప ప్రమాదం జరిగి ఇన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోయిన ఆయన ఏమాత్రం స్పందించడం గాని.. దేవాలయ ట్రస్ట్ బోర్డు తరఫున ఓ ప్రకటన కానీ ఇవ్వలేదు.. అసలు ఆ సంఘటన జరిగినట్లే ఆయన గుర్తించినట్లు కనిపించలేదు. ఎందుకంటే తాను కొనసాగుతూ వస్తున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఏ ఆలయంలో ఏం జరిగినా ఆయనకు కనిపించదు.. వినిపించదు. అదే వైయస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా చిత్ర విచిత్రమైన అభినయాలతో అశోక్ గజపతి మీడియా ముందుకు వచ్చేస్తారు.. ఇప్పుడు ఈ సంఘటన జరిగినప్పుడు కూడా ఆయన నోరు విప్పితే తన హుందాతనానికి మరింత గౌరవం వచ్చేదని ప్రజలు అంటున్నారు::సిమ్మాదిరప్పన్న

Congress MP Charanjit Singh Channi Demands Surgical Strike Proof6
పాక్‌పై భారత్‌ దాడికి సాక్ష్యం ఏది?.. కాంగ్రెస్‌ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్‌, పాకిస్తాన్‌ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇలాంటి తరుణంలో 2016లో పాకిస్తాన్‌పై నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్‌ విషయమై కాంగ్రెస్‌ ఎంపీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. సర్జికల్ స్ట్రైక్‌కు సంబంధించి రుజువు చూపించాలని అడగటం తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌ నేతకు మరోసారి బీజేపీ కౌంటరిచ్చింది.వివరాల ప్రకారం.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం తర్వాత పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ ఎంపీ చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ మీడియాతో మాట్లాడుతూ..‘పహల్గాం దాడి తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలకు మేము కట్టుబడి ఉన్నాం. ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాం. దాడి వెనుక ఉన్న వారిని శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఒకవేళ పాకిస్తాన్‌ హస్తం ఉంటే వారికి తగిన బుద్ది చెప్పాలని కోరుతున్నాం. కానీ, 2016లో పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రైక్‌, 2019 బాలాకోట్ వైమానిక దాడులకు సంబంధించి మాత్రం మాకు అనుమానాలు ఉన్నాయి. ఈ దాడుల విషయంలో గందరగోళం కనిపిస్తోంది. మన దేశంపై బాంబు వేస్తే మనకు తెలియదా?. పాకిస్తాన్‌లో సర్జికల్ స్ట్రైక్ నిర్వహించామని వారు అంటున్నారు. కానీ, అక్కడ ఇలాంటిదేమీ జరగలేదు. ఎవరూ దీని గురించి మాట్లాడలేదు. సర్జికల్ స్ట్రైక్‌కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు. దీనిపై నేను మొదటి నుండి డిమాండ్ చేస్తున్నాను. మన దేశ ప్రజలకు అన్ని విషయాలు తెలియాలి’ అని కామెంట్స్‌ చేశారు.SICK!Rahul Gandhi's Congress continues to defend Pakistani terror!Now Charanjeet Singh Channi questions our forces.Why is Congress demoralising our forces at this critical time.Congress is taking orders directly from Pakistan!#PehalgamTerroristAttack pic.twitter.com/b2MIexdAQA— Pradeep Bhandari(प्रदीप भंडारी)🇮🇳 (@pradip103) May 2, 2025ఇక, కాంగ్రెస్‌ ఎంపీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తూ కౌంటరిచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ నేతలు మన దేశ సాయుధ దళాల పనితీరును ప్రశ్నిస్తున్నారని ఆరోపించింది. ఆయన వ్యాఖ్యలపై ఢిల్లీ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా స్పందిస్తూ..‘కాంగ్రెస్ మళ్లీ మన దేశ సైన్యాన్ని మరియు వైమానిక దళాన్ని ప్రశ్నించింది. సర్జికల్ స్ట్రైక్ జరిగిందని తాను నమ్మడం లేదని.. తనకు రుజువు కావాలని చన్నీ అన్నారు. కాంగ్రెస్, గాంధీ కుటుంబం ఎలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉందో ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాలి. వారు భారత సైన్యం, వైమానిక దళం అబద్ధాలు చెబుతున్నారని, పాకిస్తాన్ నిజం చెబుతోందని పదే పదే ఆరోపిస్తున్నారు. పాకిస్తాన్ స్వయంగా సర్జికల్ స్ట్రైక్ నిర్వహించిందని చెప్పినప్పటికీ వీరు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు. సర్జికల్ స్ట్రైక్‌పై మీకు నిజంగా రుజువు కావాలంటే.. రాహుల్‌ గాంధీతో కలిసి చన్నీ.. పాకిస్తాన్‌ సందర్శించి దాడి ఎక్కడ జరిగిందో తనిఖీ చేయండి అంటూ కౌంటరిచ్చారు.మరోవైపు.. సదరు కాంగ్రెస్‌ ఎంపీ చన్నీకి బీజేపీ నుంచి కౌంటర్‌ రావడంతో ఆయన మాట మార్చారు. తాను సర్జికల్‌ దాడుల గురించి ఆధారాలు అడగలేదని మాట మార్చారు. అనంతరం, పాకిస్తాన్‌ విషయంలో భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా మద్దతు ఇస్తానని ప్రకటించారు. అయితే, ఆయన వ్యాఖ్యల కారణంగా కాంగ్రెస్‌ జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది.

​how Impact of AI on the Cinema Industry7
కథన రంగంలో ఏఐ చిందులు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అన్ని రంగాల్లోనూ ప్రవేశించింది. ఏఐ సినిమా పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. చిత్ర నిర్మాణంలోని ప్రతి అంశాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దుతుండడంతోపాటు సినిమాపై ప్రేక్షకుల అంచనాలను పెంచుతోంది. సృజనాత్మక ప్రక్రియలను మెరుగుపరచడం, వర్క్‌ఫ్లోలను ఆప్టిమైజ్ చేయడం, వీక్షకుల అనుభవాలను విశ్లేషించడం ద్వారా ఏఐ ఒక శక్తివంతమైన సాధనంగా మారుతోంది. కృత్రిమ మేధ సినిమా ప్రీ-ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, ఆడియన్స్ ఇంటరాక్షన్‌ను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం.ప్రీ ప్రొడక్షన్స్క్రిప్ట్ రైటింగ్, కాస్టింగ్, స్టోరీబోర్డింగ్‌.. వంటి ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో ఏఐ సాయం చేస్తోంది. స్క్రిప్ట్‌బుక్‌, ప్లాటగాన్ వంటి సాధనాలు స్క్రిప్ట్‌ను విశ్లేషించడానికి, బాక్సాఫీస్ పనితీరును అంచనా వేయడానికి, భావోద్వేగ అంశాలు, సంభాషణ ఆధారంగా కథలో మెరుగుదలను సూచించడానికి నేచురల్‌ ల్యాంగ్వేజ్‌ ప్రాసెసింగ్ (ఎన్ఎల్‌పీ)ను ఉపయోగిస్తున్నాయి. ఇది సినీ రచయితలు తమ కథలను మెరుగుపరచడానికి, నిర్మాతలు బడ్జెట్లను సమర్థవంతంగా కేటాయించడానికి సహాయపడుతుంది.కాస్టింగ్‌.ఏఐ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్‌లు దర్శకులు ఎంచుకున్న పాత్రలకు వర్చువల్‌గా నటులను గుర్తించేందుకు వారి ముఖాల కవళికలను విశ్లేషిస్తుంది. స్టోరీబోర్డర్ వంటి ఏఐ ఆధారిత సాధనాలు స్క్రిప్ట్‌లను విశ్లేషించి విజువల్ డ్రాఫ్ట్‌లను అందిస్తాయి. ఇది దర్శకులు సన్నివేశాలను ముందుగానే విజువలైజ్ చేయడానికి, సినిమాను త్వరగా చిత్రీకరించడానికి సాయం చేస్తుంది.ప్రొడక్షన్ప్రొడక్షన్ సమయంలో విజువల్ ఎఫెక్ట్స్ (వీఎఫ్ఎక్స్), సినిమాటోగ్రఫీ, సెట్ డిజైన్లను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మారుస్తోంది. డాల్‌.ఈ, మిడ్‌జర్నీ వంటి జనరేటివ్ ఏఐ మోడల్స్ సినిమాలోని సన్నివేశాలకు అనుగుణంగా వర్చువల్‌గా వాస్తవికతను జోడిస్తున్నాయి. వీఎఫ్‌ఎక్స్‌లో ఏఐ రోటోస్కోపింగ్, మోషన్ క్యాప్చర్, డీ-ఏజింగ్(నటుల వయసు తగ్గినట్టు చూపడం) వంటి పనులను సులభతరం చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరా కదలికలను ఆటోమేట్ చేస్తుంది. సీన్ ఆధారంగా లైటింగ్ సెటప్‌లను సూచించడం ద్వారా సినిమాటోగ్రఫీని మెరుగుపరుస్తుంది.పోస్ట్ ప్రొడక్షన్ఎడిటింగ్, కలర్ గ్రేడింగ్, సౌండ్ డిజైన్లను ఆటోమేట్ చేయడం ద్వారా ఏఐ పోస్ట్ ప్రొడక్షన్‌ను క్రమబద్ధీకరిస్తుంది. అడోబ్ ప్రీమియర్ ప్రో ఆటో రిఫ్రేమ్ వంటి సాధనాలు ఇందుకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. కృత్రిమ మేధ సాధనాలు రా-ఫుటేజీని విశ్లేషిస్తాయి. కీలక దృశ్యాలను గుర్తిస్తాయి. సరైన విధంగా ఎడిట్‌ చేస్తాయి. ఐజోటోప్ ఆర్ఎక్స్ వంటి ఏఐ సాధనాలు బ్యాగ్రౌండ్‌ సౌండ్‌ను తొలగిస్తాయి. వాస్తవిక సౌండ్‌ ఎఫెక్ట్స్‌ను క్రియేట్‌ చేస్తాయి. వాయిస్ఓవర్లను మెరుగుపరుస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డబ్బింగ్ ప్లాట్‌ఫామ్‌లు సహజసిద్ధమైన ట్రాన్స్‌లేషన్‌లను అందిస్తాయి. ఇది ప్రపంచంలోని ప్రేక్షకులకు సినిమాను మరింత అందుబాటులోకి తెస్తున్నాయి.డిస్ట్రిబ్యూషన్ అండ్ మార్కెటింగ్సినిమాను ఎలా మార్కెటింగ్ చేయాలి.. ఎలా డిస్ట్రిబ్యూషన్ చేయలనే అంశాలను ఏఐ పునర్నిర్మిస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైమ్ వంటి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ల్లో వ్యూయర్‌షిప్‌ను విశ్లేషించడానికి ఏఐ అల్గారిథమ్‌లు ఉపయోగపడుతున్నాయి. వ్యక్తిగత వినియోగదారుల కోసం తగిన ట్రైలర్లు, పోస్టర్లను సృష్టిస్తున్నాయి. ప్రమోషన్‌లో భాగంగా జానర్ ప్రాధాన్యతలు లేదా ఇష్టమైన నటుల ఆధారంగా నిర్దిష్ట ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. డిస్ట్రిబ్యూషన్‌లో భాగంగా ఏఐ టూల్స్ మార్కెట్ పోకడలు, సోషల్ మీడియా సెంటిమెంట్, చారిత్రాత్మక డేటాను విశ్లేషించి విడుదల తేదీలను సూచిస్తున్నాయి. దీంతోపాటు పైరసీని ఎదుర్కోవటానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయపడుతుంది.ఆడియన్స్ ఎంగేజ్‌మెంట్‌ఇంటరాక్టివ్ ఫార్మాట్లను రూపొందించడం ద్వారా సినిమాపై ప్రేక్షకుల అభిప్రాయాలు తెలుసుకునే వీలుంటుంది. ఏఐ ఆధారిత వర్చువల్ రియాలిటీ (వీఆర్), ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్) వంటివి ప్రేక్షకులను సినిమాకు మరింత దగ్గర చేస్తున్నాయి. ఏఐ సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకుల ఫీడ్ బ్యాక్‌ను విశ్లేషిస్తుంది. మార్కెటింగ్ వ్యూహాలను మెరుగుపరచడంలో స్టూడియోలకు సహాయపడుతుంది.ఇదీ చదవండి: భారత్‌–అమెరికా మధ్య డీల్‌..?సవాళ్లు లేవా..?ఏఐ సినిమాకు అపారమైన సామర్థ్యాన్ని అందిస్తుండగా, నైతిక, సృజనాత్మక ఆందోళనలను కూడా లేవనెత్తుతుంది. డీప్‌ఫేక్‌ టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో అనుమతి లేకుండా నటుల పోలికలు లేదా స్వరాలను కాపీ కొట్టేలా కృత్రిమ మేధను ఉపయోగిస్తున్నారు. సినిమా పరిశ్రమలోని క్రియేటివ్‌ ఉద్యోగులకు ఏఐ ముప్పుగా మారుతోంది. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్, ఎడిటింగ్‌లో ఎంట్రీ లెవల్ ఆర్టిస్టులపై దీని ప్రభావం తీవ్రంగా ఉంది. ఏఐ ఆటోమేటెడ్ ఎడిటింగ్ వల్ల సన్నివేశాల్లోని భావోద్వేగాలు కోల్పేయే ప్రమాదం కూడా ఉంది. ఏదేమైనా ఏఐ చాలా వరకు సినీ ప్రపంచంలో ఇప్పటికీ పాగా వేసింది. ఏ రంగంలోనైనా ఏఐ ప్రభావం కొంత వరకే ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. క్రియేటివ్‌ పరిశ్రమలో నిత్యం చేసే పనులను మాత్రమే ఏఐతో ఆటోమేట్‌ చేయవచ్చని చెబుతున్నారు. సృజనాత్మకంగా ఆలోచించి, మంచి సన్నివేశాలకు ప్రాధాన్యత ఇస్తూ కళామతల్లిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఏఐ కంటే మానవులపైనే అధికంగా ఉందంటున్నారు.

Manju Warrier Irritated With Fans At Shopping Mall8
మంజు వారియర్‌పై ఇష్టం వచ్చినట్లు చేతులు.. వీడియో వైరల్‌

మలయాళ భామ మంజు వారియర్‌(Manju Warrier)కు ఓ చేదు అనుభవం ఎదురైంది. బెంగళూరులోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్లిన ఆమె కార్యక్రమం ముగిసిన తర్వాత తిరిగి వెళ్తున్న సమయంలో అభిమానులు ఆమెను చుట్టుముట్టారు. అప్పటికే కారులో ఉన్న అభిమానుల కోసం మళ్లీ బయటకు వచ్చింది. దీంతో ఆమెకు షేక్ హ్యాండ్‌ ఇచ్చేందుకు చాలామంది ఎగబడ్డారు. ఆమెపై అసభ్యకరంగా చేతులు వేసేందుకు కొందరు ప్రయత్నించారు. దానిని గమనించిన ఆమె సున్నితంగానే అక్కడి నుంచి తప్పుకుంది. ఓ వ్యక్తికి సెల్ఫీ ఇచ్చి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.లూసిఫర్‌2 సినిమాతో రీసెంట్‌గా మంచి విజయాన్ని అందుకున్న మంజు వారియర్‌కు వరసు సినిమా అవకాశాలు వస్తున్నాయి. సోషల్‌మీడియాలో ఆమెకు భారీగా పాపులారటి పెరిగింది. దీంతో ఆమెకు పలు షాపింగ్‌ మాల్స్‌ ఓపెనింగ్స్‌ కోసం ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆమె బెంగళూరులోని మాల్ ఓపెనింగ్‌కు వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్‌ పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. కార్యక్రమం ముగిసి వెళ్తున్న సమయంలో అభిమానులు చుట్టుముట్టడంతో కారులోంచి దిగి ఆపై వారిని పలకరించే ప్రయత్నం చేసింది. దీంతో ఓ వ్యక్తి ఆమె నడుమును పట్టుకుని లాగాడు. మరోకరు ఆమెను టచ్‌ చేసేందుకు ప్రయత్నించాడు. దీనిని గమనించిన మంజు వారియర్ కొంతమందితో సెల్ఫీలు దిగి అక్కడినుంచి వెళ్లిపోయింది.సినిమా వాళ్లు అంటే పబ్లిక్ ప్రాపర్టీ అనేలా చాలామందిలో అభిప్రాయం ఉంటుంది. అందుకే ఇలా ఎగబడిపోతారు. ఆ సమయంలో వారికి ఎదురయ్యే ఇబ్బందులు ఏంటి అనేది కనీసం ఆలోచించరు. ఒకవేళ ఫోటోల విషయంలో వారు తిరష్కరిస్తే ఎంత పొగరు అంటూ సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తారు. ఫ్యాన్సే కదా అని సెల్ఫీలు ఇస్తే ఇలాంటి చెత్త పనులకు రెడీగా ఉంటారు అంటూ కొందరు నెటిజన్లు చెప్పుకొస్తున్నారు.People 😡🙏 #ManjuWarrierpic.twitter.com/b2nfTau96B— Prince in Exile || దారి తప్పిన బాటసారి.. .. .. (@ExilePrince_555) May 2, 2025

Women selected for Telangana High Court junior civil judge posts9
న్యాయపీఠంపై మహిళా తేజం

‘నాన్న జడ్జి. చెల్లి కూడా జడ్జే. వారే నాకు స్ఫూర్తి’ అంటుంది నిఖిషా. జడ్జి కావాలనేది కీర్తన హైస్కూల్‌ నాటి కల. ‘మా కుటుంబం, బంధువులలో న్యాయవాదులు, జడ్జీలు ఎవరూ లేరు. అందుకే జడ్జి కావాలనుకున్నాను’ అంటుంది మధులిక. ‘పట్టుదల గట్టిగా ఉంటే తొలి ప్రయత్నంలోనే బ్రహ్మాండంగా విజయం సాధించవచ్చు’ అంటుంది సాహితి....తెలంగాణ హైకోర్టు జూనియర్‌ సివిల్‌ జడ్జి పోస్ట్‌లకు ఎంపికైన విజేతలు వీరు. న్యాయమూర్తి కావాలనుకోవడానికి వారికి స్ఫూర్తి వేర్వేరుగా ఉండవచ్చు. అయితే పడిన కష్టం మాత్రం ఒక్కటే. ‘న్యాయవ్యవస్థలో ఉన్నత స్థానాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలి’ అని జాతీయ స్థాయిలో నివేదికలు నొక్కి చెబుతున్న నేపథ్యంలో ఈ మహిళల విజయం... ఆశా కిరణం – అరవింద్‌ గండ్రాతి, ‘సాక్షి’ నెట్‌వర్క్‌1. ఎన్నో సవాళ్లు... అయినా సరే...న్యాయవాది కావాలనేది నా చిన్నప్పటి కల. జూనియర్‌ సివిల్‌ జడ్జి పోస్టుకు ఎంపికైనందుకు సంతోషంగా ఉంది. మధ్యతరగతి కుటుంబాల్లో ప్రత్యేకంగా స్టడీ రూమ్స్‌ లేకపోవడం ఇబ్బందిగా ఉంటుంది. ఏకాంతంగా చదువుకునే అవకాశం ఉండదు. లైబ్రరీలలో రాత్రి ΄÷ద్దుపోయే వరకు చదువుకునే వీలు అమ్మాయిలకు ఉండదు. మెటీరియల్‌ కలెక్ట్‌ చేసుకోవడం నుంచి ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రిపేర్‌ కావడం వరకు...పేద, మధ్యతరగతి అమ్మాయిలకు ఎన్నో సమస్యలు ఉంటాయి. అయితే లక్ష్యాన్ని మాత్రమే చూస్తే ఆ సమస్యలు కనిపించవు. – గంగిశెట్టి ప్రసీద, వరంగల్‌ సిటీ2. పుట్టెడు దుఃఖంతో... తిరుగులేని పట్టుదలతో...తెలంగాణ ఉద్యమంలో నర్సంపేట పట్టణం నుండి ముందు వరుసలో ఉండి ఉద్యమాన్ని నడిపించారు నాన్న. 2020లో నాన్న హత్యకు గురయ్యారు. నా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. నా కాళ్లపై నేను నిలబడి అమ్మకు అండగా ఉండాలనుకున్నాను. నాన్న ఆలోచనలకు అనుగుణంగా ఎల్‌ఎల్‌బీలో చేరినప్పటి నుంచి జడ్జి కావాలనే పట్టుదలతో చదివాను. మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించడం సంతోషంగా ఉంది. – అంబటి ప్రణయ, నర్సంపేట, వరంగల్‌3. తొలి ప్రయత్నంలోనే... ‘లక్ష్యం ఏర్పర్చుకున్నప్పుడు ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురొచ్చినా పట్టుదలను వదలవద్దు. జూనియర్‌ సివిల్‌ జడ్జి పరీక్షల కోసం ప్రిపేర్‌ అయ్యేవారు సొంత నోట్స్‌ తయారు చేసుకోవడమే ఉత్తమం. ఇది ఒక హ్యాపీ మూమెంట్‌. నా పేరెంట్స్‌కు ఒక గిఫ్ట్‌.– సాహితి, నంగనూరు, సిద్దిపేట జిల్లా (తొలి ప్రయత్నంలోనే, 26 ఏళ్ల వయసులో జూనియర్‌ సివిల్‌ జడ్జి పోస్ట్‌కు ఎంపికైంది)ఇదీ చదవండి: నా డ్రీమ్స్‌.. కరియర్‌ : ఇపుడు కొత్తగా, ప్రతీక్షణం ఆస్వాదిస్తున్నా4.ఉద్యోగం కాదు... బాధ్యతమా కుటుంబంలో ఎవరూ న్యాయవాదులు, జడ్జిలు లేరు. అదే నన్ను న్యాయమూర్తి కావాలనే లక్ష్యం వైపు నడిపించింది. కొంతకాలం న్యాయవాదిగా చేసిన అనుభవం జేసీజే పరీక్షలో తోడ్పడింది. జడ్జి పోస్ట్‌ అనేది ఉద్యోగం కాదు. విలువైన బాధ్యత. – డాకన్నగారి మధులిక తేజ, హైదరాబాద్‌5. చిన్ననాటి కల... తొలి ప్రయత్నంలోనే చిన్ననాటి నుంచి జడ్జి అవ్వాలనేది నా కల. నా కల నెరవేరినందుకు సంతోషంగా ఉంది. హైకోర్టు, కరీంనగర్‌ కోర్టుల్లో న్యాయవాదిగా పలు కేసులు వాదించాను. రెండేళ్ల క్రితం నుంచి జేసీజే పరీక్షలకు సిద్ధమయ్యాను. ఎలాంటి కోచింగ్‌ తీసుకోకుండా క్రమపద్ధతిలో పరీక్షల కోసం ప్రిపేర్‌ అయ్యాను. – కట్ట కీర్తన, ఆరెపల్లి, కరీంనగర్‌జడ్జిల కుటుంబం...తండ్రి కె. ఖుషా హైదరాబాద్‌ సిటీ స్మాల్‌ కాజెస్‌ కోర్టు చీఫ్‌ జడ్జి. చెల్లి భావన మహబూబ్‌నగర్‌లో 4వ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి. తాజాగా అక్క నిఖీషా జూనియర్‌ సివిల్‌ జడ్జి పోస్ట్‌కు ఎంపికైంది. తండ్రి, ఇద్దరు కూతుళ్లతో వారిది జడ్జిల కుటుంబంగా మారింది. ఐటీ ఉద్యోగం వచ్చినా చట్టంపై అవగాహన ఉండాలని న్యాయమూర్తి కె. ఖుషా తన కూతుళ్లను న్యాయ విద్య చదివించారు.అసలైన లక్ష్యం అదే...కోవిడ్‌ లాక్‌డౌన్ సమయంలో నిఖీషా వర్క్‌ ఫ్రం హోమ్‌ ఉద్యోగంలో చేరింది. ఐటీ రంగంలో అనుభవం కోసం ఉద్యోగంలో చేరింది. అయితే ఆ ఉద్యోగం ఆశించిన స్థాయిలో సంతృప్తి ఇవ్వలేదు. ఆ సమయంలోనే ‘నేను చేయాల్సిన ఉద్యోగం ఇది కాదు’ అనుకుంది. ‘నాన్నలాగే న్యాయమూర్తి కావాలి’ అని తనలో నిద్రాణంగా ఉన్న లక్ష్యంపై దృష్టి పెట్టింది.మానసిక స్థైర్యం... హరే కృష్ణ మంత్రంమెయిన్స్ ఎగ్జామ్స్‌ సమయంలో నిఖీషా తల్లి సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. ఇంటర్వ్యూకు ముందు నాన్నకు బై΄ాస్‌ సర్జరీ జరిగింది. కవలబిడ్డలకు అప్పటికి సంవత్సరం కూడా నిండలేదు. ఇలా ఎన్నో ఒడిదొడుకులు వచ్చినా మానసికంగా కుంగిపోకుండా లక్ష్యాన్ని పదేపదే గుర్తు తెచ్చుకునేది. ‘హరే కృష్ణ మంత్రం జపిస్తూ మానసిక స్థైర్యాన్ని పొందాను. విజయం సాధించాను. మా కుటుంబం నుంచి నేను కూడా న్యాయమూర్తిగా అడుగుపెడుతున్నందుకు ఎంతో గర్వం ఉంది’ అంటుంది నిఖీషా. చదవండి : నిశ్చితార్థం రద్దు, ప్రేమ వివాహం, డైమండ్స్‌ షూస్‌ : ఎవరీ అందాల రాణి?

ALM Fazlur Rahman Says Bangladesh will Occupy India northeast10
‘పాక్‌పై భారత్‌ దాడి చేస్తే ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమిస్తాం’

ఢాకా/న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు పాకిస్తాన్‌పై భారత్‌ దాడి చేసిన పక్షంలో చైనా సాయంతో ఏడు ఈశాన్య రాష్ట్రాలను స్వాధీనం చేసుకుంటామని బంగ్లాదేశ్‌ తాత్కాలిక అధ్యక్షుడు యూనుస్‌ సలహాదారు ఏఎల్‌ఎం ఫజ్రుల్‌ రెహ్మన్‌ బెదిరింపులకు దిగారు. ఈ మేరకు ఆయన తన ఫేస్‌బుక్‌ ఖాతాలో మంగళవారం బెంగాలీలో రాసుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.ఈ సందర్భంగా ఏఎల్‌ఎం ఫజ్రుల్‌ రెహ్మన్‌..‘భారత ఈశాన్య రాష్ట్రాల ఆక్రమణకు సంయుక్త సైనిక ఏర్పాట్ల కోసం చైనాతో చర్చలు జరపాల్సిన అవసరం చాలా ఉందని అందులో సూచించారు. ఇక, బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు మహ్మద్‌ యూనస్‌కు రహ్మాన్‌ అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం. అయితే, ఈ వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని విదేశాంగ శాఖ తెలిపింది. ఇటువంటి వాటిని తాము ప్రోత్సహించం, బలపరచం అని స్పష్టం చేసింది. వ్యక్తిగత అభిప్రాయాలను ప్రభుత్వంతో ముడిపెట్టవద్దని కూడా కోరింది. పొరుగుదేశాలతో శాంతియుత సంబంధాలను కొనసాగించాలన్నదే తమ అభిమతమని వివరించింది.ఇదిలా ఉండగా.. భారత్‌ విషయంలో పాకిస్తాన్‌ మరో స్టాండ్‌ తీసుకున్న‍ట్టు సమాచారం. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు భారత్‌ ప్రకటించడాన్ని నిరసిస్తూ ఢిల్లీకి లాంఛనంగా దౌత్య నోటీసు ఇవ్వాలని పాకిస్తాన్‌ యోచిస్తోంది. ఈ మేరకు శుక్రవారం ఎక్స్‌ప్రెస్‌ న్యూస్‌ వార్తా కథనం వెల్లడించింది. పాక్‌ విదేశీ, న్యాయ, జలవనరుల మంత్రిత్వశాఖల మధ్య జరిగిన ప్రాథమిక చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపింది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement