green card holders
-
శరణార్థులకు, నిరాశ్రయులకు జారీ చేసే గ్రీన్ కార్డులకు ఫుల్స్టాప్!
గత జో బైడెన్ ప్రభుత్వం చూపించిన ఉదారవాద విధానాలను స ద్వినియోగం చేసుకుని ఇప్పటికే శరణార్థి/నిరాశ్రయుల హోదా సంపాదించిన విదేశీయులకు అందజేసే గ్రీన్‌కార్డుల జారీ ప్రక్రియ హఠాత్తుగా ఆగిపోయింది. తాత్కాలికంగా ఈ గ్రీన్‌కార్డుల జారీ ప్రక్రియను నిలిపేసినట్లు అమెరికా పౌరసత్వం, శరణార్థి సేవల విభాగం తాజాగా ధ్రువీకరించింది. దీంతో అక్రమ మార్గా ల్లో అమెరికాలోకి వచ్చి ఎలాగోలా శరణార్థి హో దా పొందిన వారికి ఇక కొత్త కష్టాలు మొదలయ్యే అవకాశముంది. శరణార్థి/నిరాశ్రయుల హోదా పొందటంతో ఏవైనా అవకతవకలు జరిగాయా లేదంటే వీళ్లంతా నిజంగానే సొంతదేశాల్లో హింస, పీడనకు గురయ్యారా? అనేది తేలాల్సి ఉంది. ఇందుకోసం డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సంబంధిత పాత రికార్డులను తవ్వితీయనుందని తెలుస్తోంది. గ్రీన్‌కార్డు హోదా కోసం దరఖాస్తు చేసుకున్న వారి పూర్వాపరాలను సమీక్షించాకే వారికి గ్రీన్‌కార్డు కట్టబెట్టడంపై ముందుకెళ్లాలని ట్రంప్ యంత్రాంగం నిర్ణయించింది. దీంతో లక్షలాది మంది శరణార్థులు/నిరాశ్రయుల గ్రీన్‌కార్డు కలలపై ఒక్కసారిగా నీలినీడలు కమ్ముకున్నాయి. భారతీయుల్లో 466 శాతం ఎక్కువ రెండేళ్ల క్రితం అంటే 2023 ఏడాదిలో ఏకంగా 51,000 మందికిపైగా భారతీయులు అమెరికాకు చేరుకుని శరణార్థి హోదా కోసం దరఖాస్తు చేసుకున్నారు. గతంతో పోలిస్తే ఒకేఏడాదిలో ఇంతమంది భారతీయులు శరణార్థులుగా అగ్రరాజ్యం చెంతకు చేరడం ఇదే తొలిసారి. 2018 ఏడాదిలో కేవలం 8,000 మంది భారతీయులు ఈ తరహా దరఖాస్తు చేసుకోగా 2023 ఏడాదికి వచ్చేసరికి ఏకంగా 466 శాతం అధికంగా 51,000 మంది అప్లై చేశారని జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం విడుదలచేసిన గణాంకాల్లో వెల్లడైంది. అక్రమ మార్గాల్లో మెక్సికో, కెనడా సరిహద్దుల గుండా అమెరికా భూభాగంలోకి అడుగుపెడుతూ అమెరికా బోర్డర్ సెక్యూరిటీ పోలీసులకు చిక్కిన వేలాది మంది భారతీయులు శరణార్థి హోదా కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇందుకు అమెరికా ఇమిగ్రేషన్ సిస్టమ్ అనుమతిస్తోంది. శరణార్థి హోదా.. సుదీర్ఘ ప్రక్రియ బోర్డర్ వద్ద చిక్కిన వాళ్లకు వెంటనే శరణార్థి హోదా ఇవ్వరు. వాళ్లు చెప్పే వివరాలను అధికారులు నమోదుచేసుకుని దరఖాస్తు ప్రక్రియను మొదలుపెడతారు. వైద్య పరీక్షలతోపాటు ముఖాముఖి ఇంటర్వ్యూలు చేస్తారు. సంబంధిత శరణార్థి అధికారులు ఈ బాధ్యతలను నెరవేరుస్తారు. ఈ సందర్భంగా తాము స్వదేశాన్ని ఎందుకు వీడాల్సి వచ్చింది?. స్వదేశంలో తాము పడిన కష్టాలు, ఎదురైన సమస్యలు, సొంత సమాజంలో అణచివేతకు గురవడానికి కారణాలను వివరించాల్సి ఉంటుంది. వీళ్లు చెప్పే మాటలు, వివరాలను అధికారులు/ఇమిగ్రేషన్ న్యాయమూర్తులు నమ్మితే శరణార్థి హోదా వచ్చే అవకాశాలు మెరుగవుతాయి. కార్యనిర్వాహక ఉత్తర్వుతో అడ్డుకున్న ట్రంప్ ఎలాగోలా శరణార్థి హోదా పొందిన వారికి అమెరికాలో తాత్కాలికంగా నివసించేందుకు అవకాశం చిక్కుతోంది. ఈ అవకాశం లేకుండా చేసేందుకు రెండోదఫా అధికారంలోకి వచ్చిన ట్రంప్ వెంటనే రెండు కార్యనిర్వాహక ఉత్తర్వులను జారీచేశారు. శరణార్థులుగా వచ్చే వారిని లోపలికి రానివ్వడం ఆపేశారు. అరెస్టయి శరణార్థి శిబిరాల్లో ఉంటున్న వారు శరణార్థి హోదా దరఖాస్తు చేయకుండా నిలువరిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా–మెక్సికో సరిహద్దు వద్ద ఈ రెండు విధానాలను ట్రంప్ కఠినంగా అమలుచేస్తున్నారు. ఈ ఉత్తర్వులను ఇప్పటికే కొందరు కోర్టుల్లో సవాల్‌చేశారు. కొందరిని స్వదేశాలకు తిరిగి పంపడాన్ని ఇటీవల ఒక ఫెడరల్ జడ్జి తన ఉత్తర్వులతో అడ్డుకోవడం తెల్సిందే. హోదా సవరణపై ట్రంప్ సర్కార్ తీవ్ర అభ్యంతరం శరణార్థి హోదాతో చాన్నాళ్లుగా అమెరికాలో ఉంటున్న వాళ్లు ఇక శాశ్వత స్థిర నివాసం కోసం గ్రీన్కార్డుకి దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ దరఖాస్తుల పరిశీలనను ట్రంప్ సర్కార్ తాజాగా ఆపేసింది. హడావుడిగా వీళ్లకు గ్రీన్‌కార్డు ఇచ్చేయకుండా అసలు ఈ శరణార్థుల గతచరిత్ర స్వదేశంలో ఎలాంటిది?. భవిష్యత్తులో వీళ్లు అమెరికా జాతీయ భద్రతకు ముప్పుగా మారే ప్రమాదముందా?.. ఇలా పలు అంశాల తుది నిర్దారణకు సంబంధించి ‘స్క్రీనింగ్’విధానాలను అవలంబించాలని, అందుకోసమే అప్లికేషన్ల పరిశీలనను ఆపేశామని యూఎస్ సిటిజన్‌షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐసీ) అధికారులు స్పష్టంచేశారు. మెక్సికోలో గతంలో డ్రగ్స్ ముఠాలతో సంబంధాలున్న వ్యక్తులు/కుటుంబాలు అమెరికాలో శరణార్థులుగా ఉంటే అలాంటి వారి జాబితాను ఈ గ్రీన్‌కార్డు దరఖాస్తుల్లో వెతుకుతున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
హెచ్-1బీ, ఎఫ్-1, గ్రీన్‌కార్డు వీసాదారులపై నిరంతర నిఘా
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ భాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి దేశంలో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా యూఎస్ఏలో ఉంటున్న విదేశీయులపై ట్రంప్ సర్కారు(Trump administration) ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. గ్రీన్‌కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వత నివాసితులు కాలేరని అమెరికా దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తాజాగా వ్యాఖ్యానించారు. ఈ ప్రకటనతో భారతీయ సంతతికి చెందిన లక్షలాది మంది వలసదారులు ఆందోళన చెందుతున్నారు. గత కొన్ని వారాలుగా యూఎస్ ఇమ్మిగ్రేషన్ నియమాలను మరింత కఠినతరం చేశారు.సహనానికి పరీక్షఈ నేపధ్యంలో అమెరికాలోకి ప్రవేశించే, నిష్క్రమించే హెచ్-1బీ, ఎఫ్-1, గ్రీన్‌కార్డు వీసాదారులను(H-1B, F-1, and Green Card visa holders) అమెరికా ఏజెన్సీలు గమనిస్తున్నాయి. ఆ వీసాలతో వారి చదువు, ఉద్యోగాల వివరాలను తనిఖీ చేస్తున్నాయి. ఇది వీసాదారుల సహనానికి పరీక్షగా మారుతున్నదనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇమ్మిగ్రేషన్ అధికారులు గ్రీన్ కార్డ్, హెచ్-1బీ హోల్డర్లకు ప్రయాణ సమయంలో వారి ఆధారాలను అందుబాటులో ఉంచుకోవాని సూచించారు. యుఎస్‌లో నివసిస్తున్నలక్షలాది మంది భారతీయులు గ్రీన్ కార్డ్ లేదా హెచ్-1బి లేదా ఎఫ్-1 వీసాలను కలిగి ఉన్నారు. వీరు అమెరికాకు తిరిగి వచ్చే సమయంలో ఎంట్రీ పోర్ట్‌లో వారి ఆధారాలను చూపించాల్సి ఉంటుంది.తనిఖీలు ముమ్మరంశాశ్వత నివాసితులు, చట్టపరమైన వీసాదారులు వారి నివాస స్థితి లేదా పని చెల్లుబాటు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేనప్పటికీ, ఈ తనిఖీలు వారికి ఇబ్బందికరంగా మారాయి. ప్రపంచంలోని 43 దేశాలకు చెందిన ప్రజలు అమెరికాలోకి ప్రవేశించకుండా ఉందేందుకు లేదా వారి రాకను పరిమితం చేయడానికి డొనాల్డ్ ట్రంప్ సర్కారు ప్రణాళికలు సిద్ధం చేసిన తరువాత ఈ విధమైన తనిఖీలు ముమ్మరమయ్యాయి. అమెరికాలో చట్టాన్ని గౌరవిస్తూ, పన్ను చెల్లించే భారతీయులకు ఎటువంటి ప్రయాణ నిషేధం లేదా పరిమితులు లేనప్పటికీ వారు మరింత జాగ్రత్తగా ఉండాలని ఇమ్మిగ్రేషన్ అధికారులు సూచించారు.దరఖాస్తుల ప్రాసెస్‌లో జాప్యంగత కొన్ని వారాలుగా ఎంట్రీ పోర్ట్‌లో మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాలు(American Embassies), కాన్సులేట్లలో ముమ్మర తనిఖీల కారణంగా ప్రయాణికులకు పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎన్డీటీవీ ఒక కథనంలో పేర్కొంది. అమెరికాకు వెళ్లేవారి డాక్యుమెంటేషన్ పరిశీలన ఇప్పుడు పలు దశలుగా సాగుతోంది. దీంతో తీవ్రమైన జాప్యం జరుగుతోంది. ఫలితంగా దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి సమయాన్ని అధికారులు పొడిగిస్తున్నారు. గ్రీన్ కార్డ్ (శాశ్వత నివాసితులు), హెచ్-1B (అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులు), ఎఫ్-1 (విద్యార్థులు) వీసా హోల్డర్లు ప్రయాణ సమయంలో తమ చెక్-లిస్ట్‌ను అందుబాటులో ఉంచుకోవాలని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: చట్టం అందరికీ సమానమేనా?: స్టూడియో విధ్వంసంపై కునాల్ కమ్రా -
ఇండియన్స్ కు షాక్.. గ్రీన్ కార్డ్ ఉన్నా ఇంటికే..?
-
అమెరికన్ గ్రీన్ కార్డ్ హోల్డర్‌కు ఘోర అవమానం
వాషింగ్టన్ డీసీ: అమెరికాలో ట్రంప్ అధికారం చేపట్టాక దేశంలో పలు ఆంక్షలు అమలవుతున్నాయి. ముఖ్యంగా అమెరికాలో స్థిరపడిన విదేశీయులు ఉంటున్న తీరుతెన్నులపై ట్రంప్ సర్కారు దృష్టిసారించింది. ఈ నేపధ్యంలో అమెరికన్ గ్రీన్ కార్టు(American green card) కలిగిన ఒక వ్యక్తి విమానాశ్రయంలో అవమానానికి గురైన ఉదంతం వెలుగు చూసింది.మార్చి 7న జరిగిన ఈ ఘటనలో అమెరికా గ్రీన్ కార్డ్ హోల్డర్ ఫాబియన్ స్మిత్‌ను మసాచుసెట్స్(Massachusetts)లోని లోగాన్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. స్మిత్ తన టీనేజ్ నుంచి యునైటెడ్ స్టేట్స్లో నివసిస్తున్నారు. ప్రస్తుతం న్యూ హాంప్‌షైర్‌లో ఉంటున్నారు. అతను లక్సెంబర్గ్ పర్యటన అనంతరం తిరిగి వస్తుండగా, ఈ ఉదంతం చోటుచేసుకుంది. న్యూస్‌వీక్ తెలిపిన వివరాల ప్రకారం స్మిత్‌ను అరెస్టు చేసిన తర్వాత అతని దుస్తులను తొలగించి, విచారణకు తీసుకెళ్లారని అతని కుటుంబం ఆరోపిస్తోంది. స్మిత్ నిర్బంధానికి గల కారణాలు తమకు తెలియవని వారు పేర్కొన్నారు.స్మిత్ గతంలో తన గ్రీన్ కార్డును పునరుద్ధరించుకున్నారు. అతనిపై ఎటువంటి కోర్టు కేసులు పెండింగ్‌లో లేవు. స్మిత్ స్నేహితుడు అతనిని ఆహ్వానించేందుకు విమానాశ్రయానికి వచ్చారు. అయితే అతను ఎంతకీ రాకపోవడంతో అధికారులను సంప్రదించేందుకు నాలుగు గంటలు వేచిచూశారు. స్మిత్ తల్లి ఆస్ట్రిడ్ సీనియర్ మీడియాతో మాట్లాడుతూ తన కుమారుని గ్రీన్ కార్డ్ ఫ్లాగ్ అయ్యిందని ఇమ్మిగ్రేషన్ అధికారులు తనకు చెప్పారన్నారు. అయితే దీని వెనుక గల కారణాలను తెలియజేయలేదన్నారు. 2023లో స్మిత్ గ్రీన్ కార్డ్ చట్టబద్ధంగా తిరిగి జారీ చేశారని ఆమె తెలిపారు. దానికి చెల్లుబాటు ఉన్నప్పటికీ, స్మిత్‌ను అమెరికాలోకి రాకుండా అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు. కాగా ఎవరైనా చట్టాన్ని లేదా వీసా నిబంధనలను(Visa regulations) ఉల్లంఘిస్తే, వారిని అదుపులోకి తీసుకుని బహిష్కరించవచ్చని అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) అసిస్టెంట్ కమిషనర్ హిల్టన్ బెక్హాం న్యూస్ వీక్‌కు తెలిపారు. ఇప్పుడు స్మిత్ నిర్బంధం వివాదానికి దారితీసింది. అమెరికా వలస విధానాలపై పలు అనుమానాలను లేవనెత్తుతోంది.ఇది కూడా చదవండి: అప్పుడే మండుతున్న ఎండలు.. 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు -
గ్రీన్ కార్డు శాశ్వత నివాసానికి... హక్కు కాదు: వాన్స్
వాషింగ్టన్/న్యూఢిల్లీ: అమెరికా వలస విధానంపై ఇప్పటికే ప్రపంచ దేశాల్లో నెలకొన్న ఆందోళనలను మరింతగా పెంచే పరిణామం చోటుచేసుకుంది. డాలర్ డ్రీమ్స్‌ను నిజం చేసుకోవడానికి రాచబాటగా భావించే అమెరికా గ్రీన్‌కార్డుపై ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రీన్‌కార్డు ఉన్నంతమాత్రాన అమెరికాలో నివాసానికి, పని చేయడానికి శాశ్వత హక్కులు దఖలు పడ్డట్టు కాదని స్పష్టం చేశారు. న్యూయార్క్‌లోని ప్రఖ్యాత కొలంబియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ విద్యార్థి మహ్మద్ ఖలీల్ యూదు విద్వేష ఆరోపణలపై ఇటీవలే అరెస్టవడం తెలిసిందే. అతను గ్రీన్‌కార్డు హోల్డరే కావడాన్ని ప్రస్తావిస్తూ వాన్స్ పలు వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇదేమీ వాక్ స్వాతంత్య్రానికి సంబంధించిన అంశం కాదు. జాతీయ భద్రతకు సంబంధించిన అతి కీలకమైన విషయం. అంతకుమించి, అమెరికాలో శాశ్వత నివాసులుగా మాతోపాటు ఎవరుండాలన్న దానికి సంబంధించిన అంశం. దీన్ని నిర్ణయించేది అమెరికన్లు మాత్రమే’’ అంటూ కుండబద్దలు కొట్టారు. ఆయన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా, ముఖ్యంగా భారత్‌లో దుమారం రేపుతున్నాయి. ఏటా భారీ సంఖ్యలో అమెరికా బాట పట్టే భారత విద్యార్థులందరికీ గ్రీన్‌కార్డు ఒక బంగారు కల. అది చిక్కిందంటే అమెరికాలో శాశ్వత నివాసం దక్కినట్టేనని భావిస్తారు. వాన్స్ వ్యాఖ్యలు వారినేగాక అమెరికాలో గ్రీన్‌కార్డు హోల్డర్లయిన లక్షలాది మంది భారతీయులను కూడా కలవరపాటుకు గురిచేస్తున్నాయి. గురువారం ఫాక్స్ న్యూస్ చానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందర్భంగా వలస విధానాలకు సంబంధించి వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘కొలంబియా వర్సిటీలో హమాస్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్న విద్యార్థి ఖలీల్ కూడా గ్రీన్‌కార్డు హోల్డరే. అందుకే చెబుతున్నా, గ్రీన్‌కార్డు హోల్డర్‌కు అమెరికాలో శాశ్వతంగా ఉండిపోయే హక్కు లేదు’’ అని స్పష్టం చేశారు. గ్రీన్‌కార్డు హోల్డర్లయినా సరే, అమెరికా భద్రతకు ముప్పు కలిగించే కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్టు అనుమానిస్తున్న విద్యార్థులు తదితరులపై కఠిన చర్యలకు ట్రంప్ సర్కారు సిద్ధమవుతోందని ఉపాధ్యక్షుడు ప్రకటించారు. ‘‘వారి ఉనికి అమెరికాకు ముప్పని తేలిన పలువురిని త్వరలో తిప్పి పంపుతున్నాం. ఈ జాబితాలో విద్యార్థులతో పాటు ఇతరులు కూడా ఉన్నారు’’ అని వివరించారు. ట్రంప్ రాకతో అమెరికాలోకి అక్రమ వలసలు 95 శాతానికి పైగా తగ్గిపోయాయన్నారు.ఏమిటీ గ్రీన్‌కార్డు? పర్మనెంట్ రెసిడెంట్ (శాశ్వస నివాస) కార్డు. గ్రీన్కార్డుగా భారత్‌లో దాదాపు ఇంటింటికీ పరిచయం. ఇది విదేశీ పౌరులకు అమెరికాలో నివసించేందుకు, పని చేసుకునేందుకు హక్కు కల్పిస్తుంది. అంతేగాక కోరుకున్న కంపెనీలో పని చేయవచ్చు. సొంత వ్యాపారం వంటివీ చేసుకోవచ్చు. గ్రీన్‌కార్డు పొందిన మూడు నుంచి ఐదేళ్లకు పౌరసత్వం కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే నిజానికిది పేరుకే శాశ్వత నివాస కార్డు. వాన్స్ చెప్పినట్టుగా అమెరికాలో శాశ్వతంగా ఉండేందుకు హక్కు కల్పించదు. దీన్ని పదేళ్ల కాలపరిమితితో జారీ చేస్తారు. కొన్ని పరిస్థితుల్లో గ్రీన్‌కార్డును రద్దు చేయవచ్చు. నేర కార్యకలాపాల్లో పాల్గొన్నా, చాలాకాలం పాటు అమెరికాకు దూరంగా ఉన్నా, వలస నిబంధనలను ఉల్లంఘించినా గ్రీన్‌కార్డును కోల్పోతారు. అమెరికాలో నివసిస్తున్న భారతీయులు దశాబ్దాలుగా గ్రీన్‌కార్డుల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. వారిలో చాలామందికి కార్డు దక్కాలంటే 50 ఏళ్ల దాకా పట్టొచ్చట. కొన్ని కేటగిరీల వాళ్లకైతే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి గ్రీన్‌కార్డు రావాలంటే 134 సంవత్సరాలు పడుతుంది! 3.4 కోట్ల మందికి పైగా గ్రీన్‌కార్డు కోసం ఎదురు చూస్తుండగా వారిలో 11 లక్షల మందికి పైగా భారతీయులే! వీరిలో 4 లక్షల మంది తమ జీవితకాలంలో కార్డును కళ్లజూడలేరన్నది ఇమిగ్రేషన్ నిపుణుల మాట. అమెరికా ఏటా గరిష్టంగా 6.75 లక్షల గ్రీన్‌కార్డులు మాత్రమే జారీ చేస్తుంది. వాటిలో ఏ దేశానికీ 7 శాతానికి మించి ఇవ్వరాదన్న నిబంధన ఉంది. ఇదే భారతీయులకు పెద్ద అడ్డంకిగా మారింది. ప్రస్తుతం అమెరికాలో గ్రీన్కార్డున్న భారతీయుల సంఖ్య 3 లక్షలకు పైగా ఉంటుంది. గోల్డ్ కార్డు రాకతో... అమెరికాలో శాశ్వత నివాసానికి ట్రంప్ ఇటీవల కొత్తగా గోల్డ్ కార్డు స్కీమును ప్రకటించిన నేపథ్యంలో గ్రీన్‌కార్డు ప్రాధాన్యతను తగ్గించేలా వాన్స్ చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘‘ఇప్పటిదాకా గ్రీన్కార్డుంది. ఇకపై గోల్డ్‌కార్డు తెస్తున్నాం. గ్రీన్‌కార్డు ఇచ్చే సదుపాయాలన్నింటినీ ఇదీ ఇస్తుంది. వాటితో అదనంగా అమెరికాలో శాశ్వత నివాసానికి, పౌరసత్వానికి కూడా గోల్డ్‌కార్డు రాచమార్గం’’ అని ట్రంప్ చెప్పు కొచ్చారు. అమెరికాలోని అత్యున్నత వర్సిటీల్లో చదివే ప్రతిభావంతులు, భారతీయ విద్యా ర్థులు దేశం దాటకుండా ఆపడంలో తమ వలస విధానం విఫలమైందని ఆయన ఆక్షేపించారు. గోల్డ్కార్డుకు 50 లక్షల డాలర్లు (రూ.43.54 కోట్లు) ఫీజుగా నిర్ణయించారు. ‘‘కనీసం కోటి గోల్డ్‌కార్డులు అమ్మాలన్నది మా లక్ష్యం. తద్వారా వచ్చే ఆదాయంతో అమెరికా అప్పు తీరుస్తాం’’ అని ట్రంప్ ప్రకటించారు. 1990 నుంచి అమల్లో ఉన్న ఈబీ–5 వీసాలను గోల్డకార్డు భర్తీ చేసింది. -
గ్రీన్‌కార్డులపై బాంబు పేల్చిన జేడీ వాన్స్.. అమెరికా పౌరసత్వం కట్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అమెరికాలో అక్రమ వలసదారులను పంపించేశారు. ఇక, తాజాగా గ్రీన్‌కార్డుల(పౌరసత్వం) విషయమై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్(JD Vanse) కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రీన్‌కార్డు పొందినంత మాత్రాన వారికి అమెరికాలో ఎల్లకాలం ఉండిపోయే హక్కు లేదని బాంబు పేల్చారు. దీంతో, గ్రీన్‌కార్డు పొందిన వారికి టెన్షన్ మొదలైంది.అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అమెరికా పౌరులుగా ఎవరిని గుర్తించాలో మాకు తెలుసు. గ్రీన్‌కార్డులు పొందినంత మాత్రన వారు జీవితాంతం అమెరికాలో ఉండలేరు. వారికి అలా జీవించే హక్కు లేదు. ఇది వాక్స్వేచ్ఛకు సంబంధించిన అంశం కాదు, జాతీయ భద్రతకు సంబంధించిన విషయం. అమెరికాలో నేరాలకు పాల్పడటం, సుదీర్ఘ కాలం దేశాన్ని వీడటం, ఇమిగ్రేషన్ నిబంధనలను పాటించకపోవడం వంటివి జరిగితే.. గ్రీన్‌కార్డును రద్దు చేయవచ్చు. దీనికి గురించి అమెరికా చట్టాలు చెబుతున్నాయి’ అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, వాన్స్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకొన్నాయి.ఇక, ఇదే సమయంలో వ్యాపారులకు ఇచ్చే గోల్డ్ కార్డ్ గురించి కూడా ఆయన మాట్లాడారు. అమెరికా గోల్డ్ కార్డ్ పొందాలంటే విదేశీ పౌరులు 5 మిలియన్ల డాలర్లు(రూ.43 కోట్ల 46 లక్షలు) చెల్లించి అమెరికాలో నివసించే, పని చేసే హక్కును కల్పిస్తారని తెలిపారు. అమెరికా సమాజంలోకి ఎవరిని చేర్చుకోవాలో అమెరికన్లే నిర్ణయిస్తారని ఆయన స్పష్టం చేశారు.Vice President JD Vance on the arrest of Mahmoud Khalil:"A green card holder doesn't have an indefinite right to be in the United States. My attitude on this is this is not fundamentally about free speech." pic.twitter.com/48kfYb3brw— The American Conservative (@amconmag) March 14, 2025ఇక, ఇదే సమయంలో వ్యాపారులకు ఇచ్చే గోల్డ్ కార్డ్ గురించి కూడా ఆయన మాట్లాడారు. అమెరికా గోల్డ్ కార్డ్ పొందాలంటే విదేశీ పౌరులు 5 మిలియన్ల డాలర్లు(రూ.43 కోట్ల 46 లక్షలు) చెల్లించి అమెరికాలో నివసించే, పని చేసే హక్కును కల్పిస్తారని తెలిపారు. కాగా, అమెరికాలో అమల్లో ఉన్న ఈబీ-5 ఇమిగ్రెంట్ ఇన్వెస్టర్ వీసాను సరికొత్త గోల్డ్‌కార్డ్ భర్తీ చేయనుంది. ఇక అమెరికా వర్క్ వీసాలను అత్యధికంగా దక్కించుకొంటున్న దేశాల్లో భారత్ టాప్‌లో ఉంది. అక్టోబర్ 2022-సెప్టెంబర్ 2023 నాటికి జారీ చేసిన వర్క్ వీసాల్లో 72.3శాతం భారతీయులకే జారీ అయ్యాయి.మరోవైపు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. జన్మతః పౌరసత్వం రద్దు చేస్తూ ఫెడరల్ కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులను ఆయన గురువారం (స్థానిక కాలమానం ప్రకారం) సవాల్ చేశారు. అత్యవసర పిటిషన్‌గా విచారణ చేట్టాలన్న అభ్యర్థనకు కోర్టు అంగీకరించింది. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే(జనవరి 20వ తేదీన) విదేశీయులకు జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తూ ఉత్తర్వులపై సంతకం చేసిన సంగతి తెలిసిందే. -
గ్రీన్ కార్డ్ కి సిటిజెన్ షిప్ కి తేడా ఏంటి..?
-
ఇండియన్ కి గ్రీన్ కార్డ్ రావడానికి ఎంత టైం పడుతుంది..!
-
అమెరికాలో నిద్రలేని రాత్రుల్ని గడుపుతున్న భారతీయులు.. కారణం అదేనా?
అమెరికాలో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయుల భవిష్యత్ అగమ్య గోచరంగా మారనుందా? ఓ వైపు ఆర్ధిక మాంద్యం, మరోవైపు లేఆఫ్స్‌తో గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది భారతీయులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారా? అంటే అవుననే అంటున్నాయి తాజాగా అక్కడ నెలకొన్న పరిస్థితులు. అగ్రరాజ్యంలో శాశ్వత నివాస హోదా పొందాలంటే ‘గ్రీన్ కార్డ్’ తప్పని సరి. ఇప్పుడీ గ్రీన్ కార్డ్ పొందే విషయంలో లక్షల మంది భారతీయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు లక్ష మందికిపైగా పిల్లలు వారి తల్లిదండ్రుల్ని వదిలి ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. 18లక్షలు దాటిన సంఖ్య అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగం చేయడానికి విదేశీయులకు జారీ చేసే అనుమతి పత్రమే హెచ్1బీ వీసా. ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన వారికి వీటిని జారీ చేస్తారు. అయితే, ఇప్పుడా హెచ్1బీ వీసా దారులు అమెరికాలో శాస్వత నివాసం ఉండేందుకు గ్రీన్ కార్డ్ కావాలి. వారి సంఖ్య 18 లక్షలు దాటింది. 134ఏళ్లు ఎదురు చూడాలా? ప్రతి ఏడాది ఆయా దేశాల బట్టి అగ్రరాజ్యం గ్రీన్ కార్డ్‌లను మంజూరు చేస్తుంది. అలా భారత్‌కు ప్రతి ఏడాది 7 శాతం అంటే 65,000 గ్రీన్ కార్డ్‌లను అందిస్తుంది. అయితే గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్న 18 లక్షల మందికి వాటి (గ్రీన్ కార్డ్) ప్రాసెసింగ్‌కు పడుతున్న సమయాన్ని లెక్కలోకి తీసుకుంటే ఎదురు చూడాల్సి సమయం అక్షరాల 134 ఏళ్లు. తల్లిదండ్రుల నుంచి విడిపోవడం తప్పదా? ఉద్యోగం చేస్తూ చాలా సంవత్సరాలుగా అమెరికాలో ఉంటున్న ఇతర దేశస్థులకు పర్మినెంట్ రెసిడెన్సీ హోదాను గ్రీన్ కార్డ్ కల్పిస్తుంది. ఉద్యోగం చేస్తున్న సమయంలో హెచ్-1బీ వంటి వీసాలు ఉంటాయి. చాలా మంది ఉద్యోగం చేస్తూనే అక్కడ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటారు. వీరి పిల్లలు.. 21ఏళ్ల వయస్సు వచ్చేంతవరకు తల్లిదండ్రుల వద్ద ఉండొచ్చని హెచ్-4 వీసా నిబంధనలు చెబుతున్నాయి. ఈలోపు తల్లిదండ్రులకు గ్రీన్ కార్డ్ వస్తే మంచిదే! లేకపోతే.. పిల్లలు, సొంత దేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. హెచ్1బీ వీసా, గ్రీన్ కార్డ్ అంటే ఏంటి? అమెరికాలో గ్రీన్‌కార్డ్, సిటిజన్ షిప్ కావాలంటే హెచ్1బీ అనే వర్క్ పర్మిట్ మీద అక్కడికి వెళ్లాలి. ఆ వర్క్ పర్మిట్ రావాలంటే అమెరికాలో ఉన్న కంపెనీ మన దేశంలో ఉన్న మనకి ఈ హెచ్1బీ వీసా ఇస్తుంది. హెచ్1 బీ వీసా వచ్చింది. అమెరికాకు వెళ్లిన తర్వాత అక్కడ కనీసం 6 ఏళ్ల పని చేయాల్సి ఉంటుంది. అనంతరం గ్రీన్ కార్డ్ కోసం అప్లయ్ చేయాల్సి ఉంటుంది. అన్వేక కారణాల వల్ల నిర్ణీత సమయంలో ఆ గ్రీన్ కార్డ్‌ను పొందలేకపోతే తిరిగి స్వదేశానికి వెళ్లాలి. ఒక ఏడాది పాటు అక్కడే ఉండి హెచ్1బీ వీసా మీద అమెరికాకు వచ్చి గ్రీన్ కార్డ్ కోసం అప్లయ్ చేసుకోవచ్చు. గ్రీన్ కార్డ్ వచ్చిన 5 ఏళ్ల తర్వాత అమెరికా పౌరులుగా (american citizenship) గుర్తింపు పొందుతాం. గ్రీన్ కార్డ్‌కి, సిటిజన్ షిప్కి తేడా హెచ్1 బీ వీసాతో అమెరికాకు వెళ్లి ఉద్యోగం పోతే కొత్త ఉద్యోగం పొందాలంటే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అదే గ్రీన్ కార్డ్, లేదంటే అమెరికా సిటిజన్ షిప్ ఉంటే ఉద్యోగాలు త్వరగా వస్తాయి. జీతాలు సైతం భారీగా ఉంటాయి. భారత్‌లో ఉంటే కష్టమే భారత్‌లో ఉండి హెచ్1బీ వీసా తెచ్చుకోవడం కొంచెం కష్టమే. కాబట్టే భారతీయ విద్యార్ధులు చదువు కోసం అమెరికా వెళతారు. ఎడ్యుకేషన్ వీసాతో అమెరికా వెళ్లి 2ఏళ్ల పాటు చదివితే హెచ్1 బీ వీసా లేకపోయినా మరో 3ఏళ్లు అక్కడ ఉండే అవకాశం కలుగుతుంది. రెండేళ్లు చదువు పూర్తి చేసుకున్న అనంతరం జాబ్ చేస్తాం కాబట్టి హెచ్1 బీ వీసా వెంటనే పొందవచ్చు. మోదీ పర్యటనతో ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటన ముందు బైడెన్ సర్కార్ అమెరికాలోని భారతీయులకు మేలు కలిగించే నిర్ణయం తీసుకుంది. ఎంప్లాయిమెంట్ ఆధరైజేషన్ డాక్యుమెంట్ (ఈఏడి) కోసం కొత్త మార్గ దర్శకాలను జారీ చేసింది. దీంతో అమెరికాలో స్థిరపడాలనుకుంటున్న వేలాది మంది భారతీయులకు ప్రయోజనం కలగనుంది. అమెరికాలో శాశ్వత నివాసం కోసం జారీ చేసే గ్రీన్ కార్డ్ అర్హతలను సరళతరం చేసింది. ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ కోసం అర్హతలకు సంబంధించి కొత్త మార్గ దర్శకాలు జారీ చేసింది. అమెరికాలో స్థిరపడాలనుకుంటున్న వారి కలను సాకారం చేసుకునేందుకు ఈ నిర్ణయం దోహద పడుతుంది. ఉపాధి కోసం అగ్రరాజ్యానికి వెళ్లి అక్కడే శాస్వతంగా స్థిరపడాలనుకునే వలసదారులకు అమెరికా పర్మినెంట్ రెసిడెంట్ కార్డ్ గ్రీన్ కార్డ్ లను జారీ చేస్తారు. అమెరికా ఇమిగ్రేషన్ చట్టం ప్రకారం.. ప్రతి ఏటా లక్షా 40 వేల గ్రీన్ కార్డ్‌లను జారీ చేస్తారు. అయితే, ఒక్కో దేశానికి నిర్ణీత సంఖ్యలో మాత్రమే గ్రీన్ కార్డ్ కార్డ్‌లను జారీ చేస్తారు. ప్రస్తుతం, మొత్తం ధరఖాస్తుల్లో ఒక్కో దేశానికి కేవలం 7 శాతం మాత్రమే కేటాయిస్తున్నారు. ఈ ఏడీ అర్హతలు ఉన్నవారికి మాత్రమే గ్రీన్ కార్డ్‌లను జారీ చేస్తున్నారు. తాజాగా, ఈఏడీ నిబంధనల్ని సడలించిన నేపథ్యంలో అమెరికాలో సవాళ్లతో కూడిన పరిస్థితులు ఎదుర్కొంటున్న వారికి ఉపశమనం కలగనుంది.గ్రీన్ కార్డ్ కోసం కొత్తగా ధరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే కాకుండా రెన్యువల్ చేసుకునే వారికి కూడా ఈ నూతన మార్గదర్శకాలు వర్తింప చేయనున్నట్లు అమెరికా వెల్లడించింది. చదవండి👉మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం -
గ్రేస్ పీరియడ్: హెచ్1బీ వీసాదారులకు భారీ ఊరట!
వాషింగ్టన్: మాంద్యం దెబ్బకు అమెరికాలో వరుసపెట్టి ఉద్యోగాలు కోల్పోతున్న హెచ్-1బి ఉద్యోగులకు ఊరట. ఉద్యోగం పోయిన రెండు నెలల్లోపే కొత్త కొలువు వెతుక్కోవాలన్న నిబంధనను సడలించి గ్రేస్ పీరియడ్‌ను ఆర్నెల్లకు పెంచాలని అధ్యక్షుని సలహా సంఘం సిఫార్సు చేసింది. తద్వారా కొత్త ఉపాధి అవకాశం వెతుక్కునేందుకు వారికి తగినంత సమయం దొరుకుతుందని అభిప్రాయపడింది. దీనికి అధ్యక్షుని ఆమోదం లభిస్తే కొన్నాళ్లుగా అమెరికాలో ఉద్యోగాలు కోల్పోతున్న వేలాది భారత టెకీలకు భారీ ఊరట కలగనుంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్‌తో పాటు పలు దిగ్గజ కంపెనీలు వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత నిబంధనల మేరకు వారంతా 60 రోజుల్లోగా మరో ఉపాధి చూసుకోలేని పక్షంలో అమెరికా వీడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో గ్రేస్ పీరియడ్‌ను 180 రోజులకు పెంచాల్సిందిగా సిఫార్సు చేసినట్టు ఆసియా అమెరికన్లు తదితరులపై అధ్యక్షుని సలహా సంఘం సభ్యుడు అజన్ జైన్ భుటోరియా వెల్లడించారు. అమెరికాలో 2022 నవంబర్ నుంచి రెండు లక్షలకు పైగా ఐటీ నిపుణులు ఉద్యోగాలు కోల్పోయారు. వీరిలో ఏకంగా 80 వేల మంది భారతీయులేనని అంచనా! గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులకు ఊరట! మరోవైపు, ఈబీ-1, ఈబీ-2, ఈబీ-3 కేటగిరీల్లో ఆమోదిత ఐ-140 ఉపాధి ఆధారిత వీసా పిటిషన్లుండి, ఐదేళ్లకు పైగా గ్రీన్‌కార్డు దరఖాస్తు పెండింగ్‌లో ఉన్నవారికి ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్లు (ఈఏడీ) జారీ చేయాలని అధ్యక్షుని సలహా కమిటీ తాజాగా ప్రతిపాదించింది. ఇందుకు ఆమోదం లభిస్తే ఇమిగ్రెంట్ వారి వీసా దరఖాస్తులపై తుది నిర్ణయం వెలువడేదాకా అమెరికాలో వృత్తి, ఉద్యోగాలు కొనసాగించుకునేందుకు వీలు కలుగుతుందని కమిటీ సభ్యుడు అజన్ జైన్ భుటోరియా తెలిపారు. -
USA: ఏడేళ్లు నివాసముంటే గ్రీన్‌కార్డు!
వాషింగ్టన్: అమెరికాలో ఉంటూ ఏళ్ల తరబడి గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న 80 లక్షల మందికి శుభవార్త ఇది. వీరికి శాశ్వత నివాస హోదా కల్పించే కార్డును మంజూరు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును డెమోక్రాటిక్ పార్టీకి చెందిన నలుగురు సభ్యుల బృందం సెనేట్‌లో ప్రవేశపెట్టింది. ఇమిగ్రేషన్ చట్టంలోని కొన్ని నిబంధనలను సవరిస్తూ సెనేటర్లు అలెక్స్ పడిల్లా, ఎలిజబెత్ వారెన్, బెన్ రే లుజాన్, సెనేట్ మెజారిటీ విప్ డిక్ డర్బన్ బుధవారం ఈ బిల్లును ప్రవేశపెట్టారు. దీని ప్రకారం.. అమెరికాలో వరుసగా కనీసం ఏడేళ్లపాటు నివాసం ఉన్న వలసదారు చట్టబద్ధమైన శాశ్వత నివాస అర్హత పొందవచ్చు. ‘గతంలో సవరించిన ఇమిగ్రేషన్ విధానం ఎందరికో ఇబ్బందికరంగా మారింది. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. మా బిల్లులో గత 35 ఏళ్లలోనే మొదటిసారిగా రిజిస్ట్రీ కటాఫ్ తేదీని సవరించాం. దీనితో మరింతమంది వలసదారులు చట్టబద్ధ శాశ్వత నివాస హోదా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు’అని సెనేటర్ పడిల్లా చెప్పారు. ‘దశాబ్దాలుగా ఇక్కడే నివాసం ఉండి పనులు చేసుకుంటూ అభివృద్ధిలో తమ వంతు తోడ్పాటునందిస్తున్న లక్షలాది మంది వలసదారులు అనిశ్చితితో భయపడాల్సిన అవసరం లేకుండా ఇకపై స్వేచ్ఛగా జీవించవచ్చు’అని ఆయన అన్నారు. ‘‘ఈ బిల్లు కార్యరూపం దాలిస్తే డ్రీమర్లు, లాంగ్ టర్మ్ వీసాదారుల సంతానం, అత్యవసర సిబ్బంది, హెచ్–1బీ వీసాలు కలిగిన అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగులు తదితర 80 లక్షల మందికి ప్రయోజనం ఉంటుంది’’ అని వలసదారుల తరఫున పనిచేసే ఎఫ్‌డబ్ల్యూడీ డాట్ యుఎస్ అంచనావేసింది. ‘చట్టపరమైన అడ్డంకి వల్ల వలసదారులు గ్రీన్‌కార్డుకు నోచుకోలేకపోతున్నారని హౌస్ సబ్ కమిటీ సారథి లోఫ్గ్రెన్ అన్నారు. ఈ పరిణామాన్ని ఆశావహులు స్వాగతించారు. -
వర్క్‌పర్మిట్లపై యూఎస్ కీలక నిర్ణయం
వాషింగ్టన్: గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులు, హెచ్1బీ వీసా హోల్డర్ల జీవితభాగస్వాములు సహా కొన్ని ఇమ్మిగ్రెంట్ కేటగిరీలకు చెందినవారి వర్క్ పర్మిట్ కాలపరిమితిని 18నెలలు పొడిగిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. దీంతో యూఎస్‌లో పనిచేస్తున్న పలువురు భారతీయ ఐటీ ఉద్యోగులకు ఊరట లభించనుంది. కాలపరిమితి ముగిసిన వర్క్‌పర్మిట్లకు 18నెలల పొడిగింపు ఇచ్చే వెసులుబాటు ఈనెల 4నుంచి అమలవుతుంది. ఆయా ప్రభుత్వ శాఖల్లో ఉన్న వీరి వర్క్‌పర్మిట్ కాలపరిమితి ఆటోమేటిగ్గా 180 నుంచి 540 రోజులకు పెరుగుతుందని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ శాఖ తెలిపింది. పెండింగ్‌లో ఉన్న ఈఏడీ దరఖాస్తులతో పనిభారం పెరిగిన నేపథ్యంలో ప్రస్తుత కాలపరిమితిని పొడిగించాలని నిర్ణయించినట్లు యూఎస్సీఐఎస్ (అమెరికా ఇమ్మిగ్రేషన్ సేవల శాఖ) డైరెక్టర్ జడోయ్ చెప్పారు. ఇప్పటివరకు ఉన్న నియమాల ప్రకారం యూఎస్ పౌరులు కానివారు వర్క్‌పర్మిట్ కాలపరిమితి ముగిశాక మరో 180 రోజుల పొడిగింపు ఆటోమేటిగ్గా వస్తుంది. ఈ గడువులో వాళ్లు పర్మిట్ రెన్యువల్‌కు దరఖాస్తు చేసుకోవాలి. తాజా నిర్ణయం దాదాపు 87వేల మంది ఇమ్మిగ్రెంట్లకు ఉపయుక్తంగా ఉంటుందని అధికారులు తెలిపారు. తాజా నిర్ణయాన్ని ఇండో అమెరికన్ సంఘాలు స్వాగతించాయి. -
భారతీయ ఐటీ నిపుణులకు భారీ ఊరట
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత ఐటీ నిపుణులకు తీపి కబురు అందించారు. ఇప్పటిదాకా అమెరికాలోకి ప్రవేశించకుండా అనేకమంది గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులను అడ్డుకున్న గత ప్రభుత్వం ఆర్డర్‌ను జో బైడెన్ బుధవారం ఉపసంహరించుకున్నారు. దీంతో గ్రీన్ కార్డ్ కోరుకునేవారికి భారీ ఉపశమనం కలిగించారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద ఆర్డర్లపై బైడెన్ తీసుకున్నంటున్న సంచలన నిర్ణయాల్లో భాగంగా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వం విధించిన వీసా నిషేధం మార్చి 31తో ముగుస్తున్న నేపథ్యంలో తాజా నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది. (అదిగదిగో గ్రీన్ కార్డు) కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాలను సరళీకృతం చేస్తానంటూ డెమొక్రాటిక్ అధ్యక్షుడు బైడెన్ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. గత ఏడాది కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన అమెరికా వర్కర్ల హక్కులను కాపాడే చర్యల్లో భాగంగా ట్రంప్ ప్రభుత్వం గ్రీన్ కార్డుల జారీ వీసాలపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. అయితే ట్రంప్ అప్పటి ఆంక్షలు సరైనవి కాదంటూ తాజా ప్రకటనలో బైడెన్ స్పష్టం చేశారు. ఈ ఆంక్షలు అమెరికాలోని కుటుంబాలను తిరిగి కలవకుండా నిరోధించాయని, అమెరికా వ్యాపారాలను తీవ్రంగా దెబ్బతీశాయని బైడెన్ పేర్కొన్నారు. కాగా గత ఏడాది అక్టోబరులో ఇమ్మిగ్రెంట్స్‌పై ట్రంప్ నిషేధాన్ని ఇమ్మిగ్రేషన్ అటార్నీ కర్టిస్ మోరిసన్ తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి, లాక్డౌన్ సంక్షోభంలో వీసా ప్రాసెసింగ్‌ను మూసివేత నెలల తరబడి సాగుతున్న దరఖాస్తుల బ్యాక్‌లాగ్‌ను పరిష్కరించాల్సి ఉంటుందని మారిసన్ వ్యాఖ్యానించారు. ఈ ప్రక్రియకు సంవత్సరాలు పట్టవచ్చని కూడా ఆయన అన్నారు. “ఇది ట్రంప్ సృష్టించిన బ్యాక్లాగ్”, ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను నాశనం చేశాడంటూ మోరిసన్ మండిపడ్డారు. -
కొత్త గ్రీన్ కార్డులకు బ్రేక్
-
వలసల రద్దు ఉత్తర్వులపై ట్రంప్ సంతకం
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అనుకున్నంతా పని చేశారు. ఇటీవల డబ్ల్యూహెచ్‌వోకు నిధులు నిలిపి వేస్తున్నట్లు ప్రకటించిన కలకలం సృష్టించిన ట్రంప్...తాజాగా మరో సంచలనం నిర్ణయంపై అధికార ముద్ర వేశారు. కరోనా మారణహోమం సృష్టిస్తున్న నేపథ్యంలో అమెరికన్ల ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ...వలసలపై నిషేధ ఉత్తర్వులపై ఆయన సంతకం చేశారు. వలసదారులపై 60 రోజుల నిషేధం విధిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేయడంతో అన్ని రకాల వలసలు తాత్కాలికంగా రద్దు అయ్యాయి. ఈ వలసల తాత్కాలిక రద్దు అరవై రోజుల పాటు అమల్లో ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు. అంతేగాక గ్రీన్ కార్డుల జారీని కూడా రెండు నెలలపాటు నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు. (వలసల నిషేధంపై స్పష్టతనిచ్చిన ట్రంప్..!) రెండు నెలలపాటు తమ దేశంలోకి ఎవరినీ అడుగుపెట్టనీయమని, తమ దేశ ప్రజల ప్రయోజనాలే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. అయితే టూరిస్ట్, బిజినెస్, విదేశీ వర్కర్ల వంటి వలసేతర వీసాలపై ఎలాంటి నిషేధం వుండదని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా ఆర్థిక పరిస్థితి మెరుగైన తర్వాతే ఉత్తర్వులను సమీక్షస్తామన్నారు. ఓ అంచనా ప్రకారం భారతీయ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు..దాదాపు అయిదున్నర లక్షల మందికి పైగా గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్నారు. ట్రంప్ తాజా నిర్ణయంతో ఇక గ్రీన్ కార్డు వస్తుందా రాదా అని అమెరికాలో వున్న భారతీయులు ఆందోళనలో వున్నారు. కాగా కేవలం గ్రీన్ కార్డుల జారీని మాత్రమే తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటన చేయడంతో లక్షలది మంది హెచ్-1బీ వీసాదారులు ఊపిరి పీల్చుకున్నారు. (కొత్త గ్రీన్ కార్డులకు బ్రేక్) -
అలా అయితే గ్రీన్‌కార్డ్ రాదు!
వాషింగ్టన్: అమెరికా గ్రీన్‌కార్డ్ పొందేందుకు ఎదురుచూస్తున్న ఆశావహులకు ఆ దేశ ప్రభుత్వం చేదువార్త చెప్పింది. ఫుడ్ స్టాంప్స్(అల్పాదాయ వ్యక్తులకు ఆహారం అందించేందుకు ప్రభుత్వం చవకగా ఇచ్చే వోచర్లు), వైద్య సాయం(మెడిక్ఎయిడ్), గృహ సదుపాయం(హౌజింగ్ అసిస్టెన్స్) తదితర సౌకర్యాలు కోరుకుంటున్న వారికి గ్రీన్ కార్డ్ నిరాకరించే అవకాశముందని స్పష్టం చేసింది. గ్రీన్‌కార్డ్ పొందినవారికి అమెరికాలో శాశ్వతంగా నివసించే అవకాశంతో పాటు పలు ఇతర ప్రయోజనాలు లభిస్తాయి. అమెరికా తమ పౌరులకు ఇచ్చే ఇలాంటి ప్రభుత్వ సౌకర్యాలను తాము భవిష్యత్తులో కూడా ఆశించబోమని కాన్సులార్ ఆఫీసర్‌ను నమ్మించాల్సి ఉంటుందని పేర్కొంటూ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ తాజాగా నిబంధనలను జారీ చేసింది. అమెరికాకు రావాలనుకునే లేదా అమెరికాలో ఉండాలనుకునే విదేశీయులు తమ ఖర్చులను తామే భరించేలా, అమెరికా ప్రభుత్వం అందించే సౌకర్యాలపై ఆధారపడకుండా ఉండేలా ఈ తాజా నిబంధనలు తోడ్పడుతాయని వైట్ హౌజ్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఒక స్థాయిని మించి ప్రభుత్వ సౌకర్యాలు పొందే వ్యక్తులను ‘పబ్లిక్ చార్జ్(ప్రజలపై భారం)’గా పరిగణిస్తారు. అలా పబ్లిక్ చార్జ్‌గా మారే అవకాశమున్న వారిని దేశంలోకి అడుగుపెట్టకుండానే నిరోధిస్తారు. ఇప్పటికే దేశంలో ఉంటున్నవారైతే.. వారి ఇమిగ్రేషన్ స్థాయిని మార్చుకునే అవకాశం ఇవ్వరు. విదేశీయులపై ప్రజాధనం ఖర్చుకాకూడదనే ఈ నిబంధనలను అధ్యక్షుడు ట్రంప్ తెరపైకి తెచ్చారని వైట్‌హౌజ్ పేర్కొంది. ‘ఈ చట్టం 1996 నుంచే ఉంది కానీ కఠినంగా అమలు చేయలేదు’ అని పేర్కొంది. పన్ను చెల్లింపుదారులపై భారం పడకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా పౌర, వలస సేవల సంస్థ(యూఎస్సీఐఎస్) డైరెక్టర్ కెన్ స్పష్టం చేశారు. ఈ నిబంధనల వల్ల గ్రీన్‌కార్డ్ ఆశావహులు తమ ఆదాయాన్ని పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక వ్యాఖ్యానించింది. -
‘గ్రీన్‌కార్డు’ ఆశావహులకు ఊరట
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం ప్రతిభ ఆధారిత నూతన వలస విధానాన్ని ఆవిష్కరించారు. అత్యున్నతస్థాయి నైపుణ్యమున్న విదేశీయులకు జారీచేస్తున్న వీసాలను 12 శాతం నుంచి 57 శాతానికి పెంచుతామన్నారు. విదేశీయులకు అమెరికాలో జారీచేస్తున్న గ్రీన్‌కార్డుల స్థానంలో ‘బిల్డ్ అమెరికా’ వీసాలను తెస్తామన్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ నిర్ణయం కారణంగా భారత ఐటీ నిపుణులు గణనీయంగా లబ్ధిపొందే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచదేశాలతో పోటీ.. కెనడా సహా పలు అభివృద్ధి చెందిన దేశాల తరహాలో ఈ కొత్త వలసవిధానంలో పాయింట్లు కేటాయిస్తామని తెలిపారు. ‘ఈ విధానం కింద అభ్యర్థుల వయసు, నైపుణ్యం, ప్రతిభ, ఉద్యోగ అవకాశాలు, అమెరికా రాజ్యాంగం, ప్రభుత్వ పనితీరు, చరిత్రపై అవగాహన, ఇంగ్లిష్‌లో తప్పనిసరి ఉత్తీర్ణత ఆధారంగా పాయింట్లు కేటాయిస్తాం. ప్రస్తుతం అమెరికా వలసవిధానం లోపభూయిష్టంగా ఉంది. దీనికారణంగా ప్రపంచంలోనే అత్యుత్తమ కళాశాలల్లో మొదటిస్థానంలో నిలిచిన విద్యార్థులకు కూడా ఓ డాక్టర్‌గా, పరిశోధకుడిగా, విద్యార్థిగా మనం అవకాశం ఇవ్వలేకపోతున్నాం. కానీ ఈ కొత్తవిధానం ఓసారి ఆమోదం పొందితే నైపుణ్యవంతుల్ని ఆకర్షించే విషయంలో అమెరికా ప్రపంచ దేశాలతో పోటీపడుతుంది’ అని ట్రంప్ వెల్లడించారు. మిశ్రమ స్పందన.. ట్రంప్ ప్రకటించిన నూతన వలస విధానంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ప్రతినిధుల సభలో హోంల్యాండ్ సెక్యూరిటీ కమిటీ సభ్యుడు మైక్ రోజర్స్ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. దీనివల్ల సరిహద్దు భద్రత పటిష్టమవుతుందని అభిప్రాయపడ్డారు. అయితే ఈ కొత్త విధానం వలసలకు వ్యతిరేకమనీ, ఇది కేవలం రాజకీయ జిమ్మిక్కు తప్ప మరేమీకాదని సెనెట్‌లో మైనారిటీ నేత చక్ స్చుమెర్ విమర్శించారు. నూతన విధానంలో దూరదృష్టి కొరవడిందని ఇండో–అమెరికన్, సెనెటర్ కమలా హ్యారిస్ పెదవివిరిచారు. ఆసియా సంతతి ప్రజలు తమ కుటుంబాలతో కలిసి వలస వెళతారని హ్యారిస్ గుర్తుచేశారు. ‘గ్రీన్‌కార్డు’ ఆశావహులకు ఊరట కొత్త విధానంలో నైపుణ్యవంతులైన విదేశీ కార్మికులకు గ్రీన్‌కార్డుల్లో 57 శాతం కేటాయిస్తామని ట్రంప్ ప్రకటించడం కీలక పరిణామంగా నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం గ్రీన్‌కార్డు కోసం ఒక్కో భారతీయుడు పదేళ్ల పాటు వేచిచూడాల్సి వస్తోంది. కొత్తవిధానంలో వీరందరికీ త్వరితగతిన గ్రీన్‌కార్డులు మంజూరవుతాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. కొత్త వలసవిధానం కారణంగా లక్షలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు గ్రీన్‌కార్డు లభిస్తుందని పేర్కొన్నారు. గ్రీన్‌కార్డుల కోటాను అవసరమైతే 57 శాతానికి మించి పెంచుతామనీ, అదే సమయంలో ఏటా జారీచేస్తున్న గ్రీన్‌కార్డుల సంఖ్యను తగ్గించబోమని ట్రంప్ ప్రకటించడాన్ని వీరు స్వాగతించారు. -
హెచ్1బీ భాగస్వామి ఉద్యోగం హుళక్కే!
వాషింగ్టన్: అమెరికాలో ఉంటున్న హెచ్–1బీ వీసాదారులైన వారి జీవిత భాగస్వాముల ఉద్యోగం గాలిలో దీపంలా మారింది. వీరితోపాటు ఉద్యోగానుమతుల కోసం ఎదురుచూస్తున్న మరికొందరు తమ కెరీర్ ప్రమాదంలో పడిందనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. హెచ్1–బీ వీసాపై అమెరికాలో ఉంటూ గ్రీన్‌కార్డు కోసం ఎదురు చూస్తున్న భారతీయ వృత్తి నిపుణుల భర్త/భార్య ఉద్యోగం చేసుకునేందుకు ఒబామా హయాంలో ప్రభుత్వం చట్టం చేసింది. అయితే, ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వలసదారుల కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన అమెరికన్ల తరఫున ‘సేవ్‌జాబ్స్ యూఎస్ఏ’ అనే సంస్థ 2015లో కోర్టులో కేసు వేసింది.] అప్పటి నుంచి ఈ కేసు పెండింగ్‌లో ఉంది. అయితే, ఈ కేసుపై విచారణ చేపట్టాల్సిందిగా నెల క్రితం యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ఆదేశాలిచ్చింది. ఇందుకు సంబంధించిన వాదనలు వినిపించేందుకు.. వలస ఉద్యోగుల సమస్యలపై పోరాడుతున్న ‘ఇమిగ్రేషన్ వాయిస్’ అనే సంస్థకు కూడా అవకాశమిచ్చింది. అయితే, కోర్టు నిర్ణయం హెచ్–1బీ వీసాదారులకు అనుకూలంగా వచ్చినా తన ప్రతిపాదనలను అమలు చేయాల్సిందేనని ట్రంప్ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. -
గ్రీన్‌కార్డు ఆశావహులకు షాక్
వాషింగ్టన్: వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తూ.. వారి భవితవ్యంతో ఆడుకుంటున్న ట్రంప్ సర్కారు మరో కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆహారం, నగదు సాయం రూపంలో ప్రభుత్వ లబ్ధి పొందిన, పొందుతున్న వలసదారులకు గ్రీన్‌కార్డుల్ని నిరాకరించాలన్న ఆలోచనలో ఉంది. ఇది కార్యరూపం దాల్చితే అమెరికాలో నివసిస్తోన్న వేలాది మంది భారతీయులపై తీవ్ర ప్రతికూల ›ప్రభావం పడనుంది. ఈ ప్రతిపాదిత నిబంధనపై సెప్టెంబర్ 21న అమెరికా హోం ల్యాండ్ సెక్యూరిటీ(డీహెచ్ఎస్)కార్యదర్శి సంతకం చేశారు. ఆ శాఖ వెబ్సైట్లో వివరాల్ని అందుబాటులో ఉంచారు. కాగా అమెరికాలోని ప్రముఖ ఐటీ సంస్థలు, రాజకీయ నాయకులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాయి. 3.82 లక్షల మందిపై ప్రభావం ‘నివాస హోదా మార్పు లేదా వీసా కోరుకునేవారు.. అలాగే అమెరికాలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న వలసదారులు.. ఇంతకు ముందెన్నడూ ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి పొందలేదని నిరూపించుకోవాలి’ అని కొత్త నిబంధన పేర్కొంటోంది. భారతీయులపై ప్రభావం చూపనున్న హెచ్–4 వీసా వర్క్ పర్మిట్ల రద్దుపై 3 నెలల్లో నిర్ణయం తీసుకుంటామని ఫెడరల్ కోర్టుకు ట్రంప్ సర్కారు ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆహార సాయం, సెక్షన్ 8 కింద ఇచ్చే హౌసింగ్ వోచర్లను వాడుకుంటున్న వలసదారులకు గ్రీన్ కార్డులు నిరాకరించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఆహారం, నివాసం కోసం అమెరికాలో లక్షలాది మంది వలసదారులు ప్రభుత్వ సాయంపై ఆధారపడ్డారు. ఆ దేశంలో చట్టబద్ధంగా నివసించేందుకు, పనిచేసుకునేందుకు వీలుగా గ్రీన్ కార్డు పొందాలంటే ఇప్పుడు వారంతా ప్రభుత్వం నుంచి అందే ఆర్థిక సాయాన్ని ఆశించకూడని తప్పని పరిస్థితిని కల్పించారు. మెడికేర్ కింద తక్కువ ఖర్చుతో మందులు అందుకుంటోన్న వలసదారులకు కూడా వీసా నిరాకరించే అవకాశముంది. ఇప్పటికే గ్రీన్‌కార్డులు పొందిన వారిపై ఈ నిర్ణయం ప్రభావం ఉండదు. న్యాయబద్ధంగా నివాస హోదా సాధించుకున్న వలసదారులు ప్రభుత్వ పథకాల లబ్ధి పొందకుండా చూసేందుకే ఈ నిర్ణయమని అమెరికా న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది అమల్లోకి వస్తే ఏడాదికి 3.82 లక్షల మందిపై ప్రభావం చూపే అవకాశముంది. శాశ్వత నివాస హోదా కోరుకుంటున్న వారు, తాత్కాలిక వీసాలపై ఉంటూ శాశ్వత ఆశ్రయాన్ని ఆశిస్తున్న విద్యార్థులు, ఉద్యోగులు ఎక్కువ ప్రభావితం కానున్నారు. ఆర్థికంగా తమను తాము పోషించుకోగలమని నిరూపించుకుంటేనే గ్రీన్‌కార్డు జారీ విధానాన్ని ఇంతవరకూ అమెరికా అమలుచేస్తోంది. -
ట్రంప్ టార్గెట్ ‘ఈబీ–5’
వాషింగ్టన్: అమెరికాలో విదేశీయులకు గ్రీన్ కార్డు ఇచ్చే ‘ఈబీ–5 వీసా’ విధానాన్ని ట్రంప్ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. ఈ వీసా నిబంధనల ప్రకారం అమెరికాలో 10లక్షల డాలర్లు (దాదాపు రూ.6.78 కోట్లు) పెట్టుబడి పెట్టే వారికి (దీని ద్వారా కనీసం 10 మంది శాశ్వత ఉద్యోగాల కల్పన జరుగుతుంది) ఆ దేశం గ్రీన్ కార్డులు అందిస్తోంది. అయితే ఈ వీసా విధానాన్ని పూర్తిగా సంస్కరించడం లేదా పూర్తిగా తొలగించడంపై దృష్టిపెట్టాలని యూఎస్ కాంగ్రెస్‌ను ట్రంప్ సర్కారు కోరింది. ఈబీ–5 విధానం ద్వారా వచ్చిన గ్రీన్‌కార్డును సంపాదించిన వారు దీన్ని దుర్వినియోగం చేయడంతోపాటు మోసాలకు పాల్పడుతున్న కేసులు నమోదవుతున్న నేపథ్యంలోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది అమల్లోకి వస్తే.. ఈబీ–5 విధానంలో అమెరికాలో గ్రీన్ కార్డులు పొందుతున్న భారతీయులపైనా పెను ప్రభావం పడనుంది. ఈ జాబితాలో చైనా, వియత్నాంలు తొలి రెండు స్థానాల్లో ఉండగా.. భారత్ మూడో దేశంగా ఉంది. ఈ విధానంలో ఏటా10వేల వీసాలను విదేశీయులకు ఇస్తున్నారు. ఇందులో ఒక్కో దేశానికి గరిష్టంగా 7% పరిమితి ఉంటుంది. గతేడాది భారత్ నుంచి 500 ఈబీ–5 వీసా పిటిషన్లు దాఖలవగా.. ఈసారి ఈ సంఖ్య 700కు చేరవచ్చని భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నమోదు చేసుకున్న వారి వీసా తిరస్కరణ రేటు గరిష్టంగా 20% మాత్రమే. ఇది కూడా సమర్పించే దస్తావేజులు, నిధుల విషయంలో సమస్యలతోనే. భారత్ నుంచి ఈ వీసాలు పొందేవారిలో చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ, ముంబై, తమిళనాడు, కర్ణాటక నుంచే ఎక్కువ మంది పెట్టుబడిదారులు ఉంటారు. అమెరికా ‘గూఢచర్య’ ఆరోపణ! అమెరికా సీనియర్ చట్టసభ్యులు కూడా ఈబీ–5 ఇన్వెస్టర్స్ వీసా కార్యక్రమాన్ని మొదట్నుంచీ వ్యతిరేకిస్తున్నారు. ఈ వీసాల దుర్వినియోగం జరుగుతున్న ఘటనలను ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. ‘ఈబీ–5 విధానం ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగియనుంది. ’మనీలాండరింగ్, గూఢచర్యం చేసేందుకు కూడా కొందరు ఈ విధానాన్ని వినియోగించుకుంటున్నారు’ అని అమెరికా సిటిజన్‌షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్ డైరెక్టర్ ఎల్ ఫ్రాన్సిస్ సిస్నా ఇటీవలే.. కాంగ్రెస్ సభ్యుల విచారణలో వెల్లడించారు. 1990లో కేటగిరీ–5ను సృష్టించినపుడు.. ఉద్యోగ కల్పన, పెట్టుబడుల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందనే కాంగ్రెస్ భావించింది. రెండేళ్ల తర్వాత నిరుద్యోగం పెరగడంతో రీజనల్ సెంటర్ ప్రోగ్రామ్‌ను అమల్లోకి తెచ్చి.. దీనికి ఈబీ–5 వీసా విధానాన్ని జోడించారు. చైనీయులే మోసగిస్తున్నారు! గత ఐదేళ్లలో ఈ వీసాల ద్వారా దేశ భద్రతను ప్రశ్నించేలా 19 కేసులు నమోదయ్యాయని సిస్నా తెలిపారు. ఈబీ–5 వీసాలను దుర్వినియోగం చేస్తున్న వారిలో ఎక్కువమంది చైనీయులే ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో 120 మంది చైనీయులు తప్పుడు విధానాల్లో పెట్టుబడులు పెట్టినట్లు అంగీకరించారని అమెరికా ఇమిగ్రేషన్ అధికారి ఒకరు తెలిపారు. ఇలా వివిధ కేసులు బయటపడుతూ.. అమెరికా భద్రతకే సవాల్ విసురుతున్నందున ఈ విధానంలో మార్పులు తీసుకురావాలని డొనాల్డ్ ట్రంప్ సర్కారు భావిస్తోంది. 350 గ్రాములకు మించి పౌడర్లు తేవొద్దు! అమెరికా వచ్చే ప్రయాణికులు 350 గ్రాములకు మించి బరువున్న పొడి పదార్థాలు విమానం కేబిన్‌లోకి తీసుకురాకుండా అమెరికా నిషేధం విధించింది. జూన్ 30 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని అమెరికా రవాణా భద్రత పరిపాలన విభాగం (టీఎస్ఏ) పేర్కొంది. గతేడాది ఆస్ట్రేలియాలో ఓ గల్ఫ్ విమానంలో పౌడర్ ఎక్స్‌ప్లోజివ్స్ ద్వారా పేలుడు జరిపేందుకు విఫలయత్నం చేసిన నేపథ్యంలో టీఎస్ఏ ఈ నిర్ణయం తీసుకుంది. ‘350 గ్రాములకు మించి బరువున్న పొడి పదార్థాలను ఎక్స్‌రే స్క్రీనింగ్ చేయనున్నాం. అలాంటి పదార్థాలను చెకింగ్ బ్యాగుల్లో ఉంచితే అదనపు తనిఖీలు ఉండవు’ అని టీఎస్ఏ పేర్కొంది. పౌడర్ లాంటి పదార్థాలు తీసుకొస్తే అదనపు తనిఖీలుంటాయని, వాటిని చెకింగ్ బ్యాగుల్లో ఉంచడం ఉత్తమమని విమానయాన సంస్థలు సూచిస్తున్నాయి. వైద్యం, పిల్లలకు సంబంధించిన పౌడర్లు, చితాభస్మం, సుంకం లేని పౌడర్లను వెంట తీసుకెళ్లొచ్చని తెలిపాయి. -
హెచ్–1బీ భాగస్వాములకు ఊరట
వాషింగ్టన్: హెచ్–1బీ వీసాదారుల భాగస్వాములను ఉద్యోగాల నుంచి తొలగించే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ట్రంప్ యంత్రాగం వెల్లడించింది. దీంతో పెద్ద సంఖ్యలో అక్కడ పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులు, వారి కుటుంబాలకు తాత్కాలికంగా ఊరట లభించినట్లయ్యింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ(డీహెచ్ఎస్) ప్రకటించింది. ‘హెచ్–4 వీసాల మీద వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న హెచ్–1బీ వీసాదారుల భాగస్వాములను ఉద్యోగాల నుంచి తొలగించే అంశంపై జూన్ వరకు ఏ నిర్ణయం తీసుకోం. ఈ నిర్ణయం దేశంపై ఆర్థికంగా ఎటువంటి ప్రభావం చూపుతుందనే దాన్ని పరిశీలించాల్సి ఉంది. అప్పటి వరకు హెచ్–1బీ భాగస్వాముల ఉద్యోగాలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు’ అని డీహెచ్ఎస్ వెల్లడించింది. 2015లో అప్పటి ఒబామా ప్రభుత్వం హెచ్–1బీ వీసాదారుల భాగస్వాములు, గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూసే వారి భార్యలు/భర్తలు అమెరికాలోని వివిధ కంపెనీల్లో హెచ్–4 డిపెండెంట్ వీసాల కింద పనిచేసేందుకు అవకాశం కల్పించింది. దాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి తొలగిస్తామని ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఇప్పుడు హెచ్–4 వీసాదారుల తొలగింపుపై నిర్ణయం తీసుకోలేదని అందుకు కొద్దిగా సమయం పడుతుందని తాజాగా ట్రంప్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ విధానంలో గణనీయమైన మార్పులు చేయాలని.. వాటిని ఆర్థికపరంగా కూడా విశ్లేషించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని డీహెచ్ఎస్ పేర్కొంది. ఇందుకు మరికొన్ని వారాలు పడుతుందని తెలిపింది. -
గ్రీన్‌కార్డు ఉంటే.. నిషేధం మినహాయింపు
ఇస్లామిక్ ఉగ్రవాదులను అమెరికాలోకి ప్రవేశించకుండా అరికట్టేందుకు ఏడు ముస్లిం దేశాలపై మూడు నెలల పాటు విధించిన నిషేధానికి కొంత మినహాయింపు లభించింది. గ్రీన్ కార్డు ఉన్నవాళ్లయితే ఆ దేశాలకు చెందినవాళ్లయినా సరే నిరభ్యంతరంగా అమెరికాకు ప్రయాణం చేయొచ్చని, అందుకు ప్రత్యేక అనుమతులేవీ తీసుకోనవసరం లేదని ట్రంప్ యంత్రాంగం తెలిపింది. గ్రీన్ కార్డు ఉన్నవాళ్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు అమెరికా రావచ్చని, ఇక్కడి నుంచి వెళ్లొచ్చని వైట్‌హౌస్ అధికార ప్రతినిధిన సీన్ స్పైసర్ చెప్పారు. ఏడు ప్రధాన ముస్లిం దేశాలకు చెందిన ప్రజలు మూడు నెలల పాటు అమెరికాకు రాకుండా వారిపై ట్రావెల్ బ్యాన్ విధించాలని కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా కలకలం రేగడంతో స్పైసర్ తాజా ప్రకటన వెలువడింది. ట్రంప్ ఆదేశాలపై అంతర్జాతీయంగా తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఆదేశాలు వెలువడిన వెంటనే గ్రీన్ కార్డులు ఉన్నవారిని కూడా విదేశాలకు వెళ్లే విమానాలు ఎక్కనివ్వలేదు. లేదా విదేశాల నుంచి వచ్చిన వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పటినుంచి మాత్రం గ్రీన్‌కార్డు ఉన్నవారికి ఈ బాధలు ఉండవని అధికారులు స్పష్టం చేశారు. ఇరాన్, ఇరాక్, లిబియా, సోమాలియా, సూడాన్, సిరియా, యెమెన్ దేశాలకు చెందినవారిని మూడు నెలల పాటు అమెరికాకు ప్రయాణాలు చేయకుండా నిషేధించిన విషయం తెలిసిందే. -
గ్రీన్‌కార్డ్ హోల్డర్స్పై ట్రంప్ నిషేధ ప్రభావముందా?
వాషింగ్టన్ : ఏడు ఇస్లామిక్ దేశాల నుంచి అమెరికాలోకి వలసలను నిషేధిస్తూ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీచేసిన ఆదేశాలను ఎలా అమలు చేయాలో అర్థంకాక ఎయిర్‌పోర్టు అధికారులు, ఏజెన్సీలు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఏడు దేశాలపై విధించిన ఈ నిషేధం గ్రీన్‌కార్డు హోల్డర్స్, ద్వంద్వ పౌరసత్వం ఉన్న వారికి ఎలా వర్తింపచేయాలో తెలియక తికమక పడుతున్నారు. ఈ సందిగ్థత సమయంలోనే ట్రంప్ కార్యాలయంలోని టాప్ అధికారులు చేస్తున్న వ్యాఖ్యలు మరిన్ని అనుమానాలను జోడిస్తున్నాయి. ట్రంప్ ఆర్డర్లు గ్రీన్‌కార్డు హోల్డర్స్పై ఎలాంటి ప్రభావం చూపదంటూనే, నిషేధించిన ఇరాన్, ఇరాక్, సిరియా, సూడాన్, లిబియా, యెమెన్, సోమాలియా దేశాలకు చెందిన గ్రీన్‌కార్డు హోల్డర్స్పై ఈ ప్రభావం తప్పక ఉంటుందని వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ రైయిన్స్ ప్రీబస్ పేర్కొన్నారు. ఏడు దేశాలకు చెందిన గ్రీన్ కార్డు హోల్డర్స్‌కు ట్రంప్ ఆదేశాలను అమల్లోకి తెస్తామని మరో సీనియర్ అధికారి చెబుతున్నారు. కానీ అమెరికాకు తిరుగు ప్రయాణమై వచ్చే గ్రీన్ కార్డు హోల్డర్స్‌కు అదనపు స్క్రీనింగ్, ల్యాండింగ్ సమయంలోనే జాతీయ భద్రత తనిఖీలు నిర్వహించి దేశంలోకి అనుమతిస్తామని మరో హోమ్‌లాండ్ సెక్యురిటీ అధికారి చెబుతున్నారు. గ్రీన్ కార్డు హోల్డర్స్‌ను పరిగణలోకి తీసుకొని, ట్రంప్ తన ఆర్డర్‌ను పునఃసమీక్షిస్తారని టాప్ జీఓపీ సెనెటరే పేర్కొంటున్నారు. గ్రీన్ కార్డు హోల్డర్స్పై ఎవరూ సరియైన క్లారిటీ ఇవ్వడం లేదు. ఏడు ముస్లిం మెజారిటీ దేశాల పౌరులు అమెరికాకు రాకుండా ట్రంప్ సర్కారు తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే. మరోవైపు తను జారీచేసిన ఆదేశాలపైన తానే ఖండనలు ప్రారంభించారు ట్రంప్. అణచివేతకు గురవుతున్న వారిపై కరుణ చూపుతానని, కానీ తమ దేశంలోని పౌరులు, ఓటర్లనూ రక్షిస్తానని ట్రంప్ ఆదివారం పేర్కొన్నారు. ఇది ముస్లిం నిషేధం కాదంటూ, మీడియానే దీన్ని తప్పుడుగా చిత్రీకరిస్తుందంటూ విమర్శించారు. కానీ ట్రంప్ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని అమెరికా మీడియా తెగేసి చెప్పింది. దీనికి సంబంధించిన మరిన్ని వార్తలకై చదవండి (ఇది ముస్లింలపై నిషేధంకాదు: ట్రంప్) (ట్రంప్ ‘నిషేధం’: ఐసిస్ విజయోత్సవాలు) (ట్రంప్ చెప్పింది పచ్చి అబద్ధం!) (అమెరికాను సమర్థించిన సౌదీ, అబుదాబి) ట్రంపోనమిక్స్ మనకు నష్టమా? లాభమా? ట్రంప్‌గారు మా దేశంపై నిషేధం విధించండి! ట్రంప్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సీఈవో! వీసా హోల్డర్స్పై ట్రంప్ కొరడా 'ట్రంప్‌తో భయమొద్దు.. మేమున్నాం'