Group-2 results
-
సాఫ్ట్వేర్ ఉద్యోగం వదులుకొని.. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా..
ఉద్యోగపరంగా పబ్లిక్ సర్వీస్ చేయాలనే లక్ష్యంతో గ్రూపు పరీక్షలకు సన్నద్ధమై రాశానని, గ్రూపు–2 స్టేట్ 11వ ర్యాంకర్ యాదాద్రి భువనగిరి జిల్లా (yadadri bhuvanagiri district) మోత్కూరుకు చెందిన గుర్రం సాయికృష్ణారెడ్డి తన మనోగతాన్ని వెల్లడించారు. మోత్కూరుకు చెందిన గుర్రం మోహన్‌రెడ్డి స్వరాజ్యం దంపతులకు సాయికృష్ణారెడ్డి, సాయి సుప్రియ సంతానం. సామాన్య రైతు కుటుంబం. మోత్కూరులో కిరాణం దుకాణం నిర్వహిస్తున్నారు.మోత్కూరులోని సేక్రెడ్ హార్ట్ హైస్కూల్లో పదవ తరగతి వరకు, హైదరాబాద్ (Hyderabad) కొత్తపేట నారాయణ కళాశాలలో ఇంటర్మీడియట్లో ఎంపీసీ పూర్తి చేశారు. అనురాగ్ యూనివర్సిటీలో బీటెక్, సీఈసీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. గ్రూప్–2 ఫలితాల్లో 600 మార్కులకు గాను 422.91 ర్యాంకు సాధించి స్టేట్ లెవల్ 11వ ర్యాంకు పొందారు.సాయి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘డిప్యూటీ తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ పోస్టులు సాధించాలన్నదే నా లక్ష్యం. హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో 4 సంవత్సరాలు హాస్టల్లో ఉంటూ స్టడీ హాల్‌కు వెళ్లి ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా సొంతంగా గ్రూపు పరీక్షలకు సిద్ధమై రాశాను. మా పెద్ద తాత మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా పని చేసి ప్రజాసేవ చేసిన గుర్రం యాదగిరిరెడ్డి (Gurram Yadagiri Reddy) స్ఫూర్తితో నేను రాజకీయాలు కాకుండా ఉద్యోగం ద్వారా పబ్లిక్ సేవ చేయాలనే లక్ష్యంతో గ్రూపు పరీక్షలు రాస్తున్నాను. రూ.4 లక్షల ప్యాకేజీ జీతం సాఫ్ట్వేర్ ఉద్యోగం వదులుకొని ప్రభుత్వ ఉద్యోగం కోసం వచ్చాను. ఇందులో ప్రధానంగా నా తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంది. ప్రభుత్వ ఉద్యోగమే చేయాలని అమ్మానాన్న పట్టుబట్టారు.చదవండి: అలా.. ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాగ్రూప్–4 ఫలితాల్లో జిల్లా మొదటి ర్యాంకు సాధించాను. ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో రెవెన్యూ జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. మొదటి ప్రయత్నంలోనే ఈ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉంది. గ్రూప్–3 పరీక్ష కూడా రాశాను. త్వరలో ఆ ఫలితాలు కూడా రానున్నాయి. మా చెల్లెలు సాయి సుప్రియ గ్రూపు–4 లో ర్యాంకు సాధించి మోత్కూరు మున్సిపల్ కార్యాలయంలో వార్డు ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తోంది’అని తెలిపారు. -
అలా.. ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించా
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ‘తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత మారుమూల ప్రాంతమైన సిర్గాపూర్ మండలంలోని ఉజ్జంపాడ్ గ్రామం మాది. ప్రభుత్వ ఉద్యోగాల పట్ల మా ప్రాంతంలో అవగాహన అంతంతే. నీళ్లు, నిధులు, నియామకాల అంశంపై సాగిన తెలంగాణ (Telangana) ఉద్యమంతో మాకు ప్రభుత్వ ఉద్యోగాలపై కొంత అవగాహన వచ్చింది.. కష్టపడి చదివితే ప్రభుత్వ ఉద్యోగాలు (Govt Jobs) సాధించొచ్చనే నమ్మకంతో ప్రిపరేషన్ మొదలుపెట్టి ఆరు ఉద్యోగాలు సాధించాను. పక్కా ప్రణాళికతో చదివితే ఉన్నత ఉద్యోగాలను సాధించొచ్చు’ అని అంటున్నారు ఇటీవల విడుదలైన గ్రూప్– 2 ఫలితాల్లో మూడో ర్యాంక్ (Third Rank) సాధించిన బీర్‌దార్ మనోహర్‌రావు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే...కుటుంబ నేపథ్యం.. విద్యాభ్యాసం మాది వ్యవసాయ కుటుంబం. నాన్న పండరినాథ్ కీర్తనకారుడు. పండరిపూర్ విఠలేశ్వరుని కీర్తనలు, ప్రవచనాలు బోధిస్తారు. మా ఉజ్జంపహాడ్ గ్రామం కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉటుంది. నా భార్య మనీష గృహిణి. కూతురు మనస్విని 3వ తరగతి, కొడుకు మహేశ్వర్ ఒకటో తరగతి చదువుతున్నారు. కుటుంబమంతా ఆధ్యాత్మిక బాటలో నడుస్తున్నారు. నేను నిత్యం హనుమాన్‌చాలీసా చదువుతాను. ప్రస్తుతం మెదక్ జిల్లా కుల్చారం మండలం అంసాన్పల్లి ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాను. ఎకనామిక్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీఈడీ పూర్తి చేశాను. ఒక దాని తర్వాత మరోటి ఇప్పటివరకు నాకు గవర్నమెంట్ కొలువులు ఆరు వచ్చాయి. గురుకుల పాఠశాలలకు సంబంధించి పీజీటీలో రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు టీజీటీలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు (State First Rank) వచ్చింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్‌లో రెండో ర్యాంకు, 2016 గ్రూప్–2లో రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు సాధించి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగంలో చేరా. కరోనా సమయంలో అనారోగ్య సమస్యలతో ఆ ఉద్యోగం మానేశా. తిరిగి స్కూల్ అసిస్టెంట్‌గా విధుల్లో చేరా. జూనియర్ లెక్చరర్ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు, తాజా గ్రూప్–2 ఫలితాల్లో రాష్ట్ర స్థాయి 3వ ర్యాంకు వచ్చింది. బుధవారం రవీంద్రభారతిలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా జూనియర్ లెక్చరర్ ఉద్యోగ నియమక పత్రం అందుకున్నా. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ లెక్చరర్‌గా ఉద్యోగంలో చేరాను.డిప్యూటీ కలెక్టర్ కావాలని ఉంది రాష్ట్ర ప్రభుత్వ నియామకాల్లో అత్యున్నతమైనది గ్రూప్–1. డిప్యూటీ కలెక్టర్‌గా ఉద్యోగం సాధించడమే నా ముందున్న లక్ష్యం. గ్రూప్–1 పరీక్షలు కూడా రాశాను. 430 మార్కులు వచ్చాయి. త్వరలోనే ఈ ఫలితాలు వెలువడితే గ్రూప్–1 ఉద్యోగం కూడా వచ్చే అవకాశాలున్నాయి. చదవండి: గ్రూప్– 2 టాపర్ హరవర్ధన్రెడ్డిసిలబస్లో లేని అంశాలు చదివితే ఫలితముండదు నోటిఫికేషన్ వచ్చాకే ప్రిపేర్ అవుతానంటే కష్టం. సంబంధిత సబ్జెక్టు మరిచిపోకుండా కనీసం రెండు గంటలైనా చదవాలి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు ముఖ్యంగా నాలుగు అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. సిలబస్‌పై పూర్తి అవగాహన ఉండాలి. సిలబస్‌లో లేని అంశాలు చదివితే ఫలితం ఉండదు. పాత ప్రశ్నపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. ప్రశ్నలు ఎలా వస్తున్నాయనే దానిపై అవగాహన పెంపొందించుకోవాలి. సమయం వృథా చేసుకోవద్దు. ముఖ్యంగా సోషల్ మీడియాకు ఎంత దూరం ఉంటే అంత సమయం కలిసొస్తుంది. కనీసం 8 గంటలు చదవాలి. -
గ్రూప్–2కు తొలగిన అడ్డంకులు
సాక్షి, హైదరాబాద్ : గ్రూప్–2 రాత పరీక్షల్లో బబ్లింగ్, వైట్నర్ వాడకం వివాదంపై హైకోర్టు ధర్మాసనం సోమవారం కీలక తీర్పు వెలువరించింది. రెండుసార్లు బబ్లింగ్‌కు పాల్పడిన అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోరాదన్న సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేసింది. బబ్లింగ్ జరిగింది వ్యక్తిగత వివరాల నమోదులో మాత్రమేనని, ప్రశ్నలకు అభ్యర్థులు ఎంచుకున్న జవాబులకు కాదని ధర్మాసనం తేల్చిచెప్పింది. దీనివల్ల ప్రతిభపై ఎలాంటి ప్రభావం ఉండబోదని, కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్–బీఎం విజయకుమార్ల మధ్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇక్కడ వర్తించదని ధర్మాసనం ఉదహరించింది. ఇన్విజిలేటర్లకు సరైన అవగాహన లేకపోవడం వల్లే అభ్యర్థులు రెండుసార్లు బబ్లింగ్‌కు పాల్పడ్డారన్న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) వాదనతో ఏకీభవించింది. వ్యక్తిగత వివరాల నమోదులో పొరపాట్లు జరిగిన కారణంగానే వైట్నర్ వినియోగించాల్సి వచ్చిందని పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నియమించిన సాంకేతిక కమిటీ, సబ్ కమిటీల సిఫార్సుల మేరకు నియామక ప్రక్రియను కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ పి.కేశవరావులతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. కమిటీ ఏర్పాటులో పక్షపాతం లేదు... టీఎస్పీఎస్సీ నియమించిన సాంకేతిక కమిటీలో టీఎస్పీఎస్సీ ప్రతినిధులు ఎవరూ లేకపోవడాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. కమిటీలో ఓయూ, జేఎన్టీయూ, నేషనల్ బ్యాంకింగ్ సర్వీస్‌కు చెందిన వారున్నారని గుర్తించాలని పేర్కొంది. ఈ కమిటీ ఏర్పాటులో ఏమాత్రం పక్షపాతం కనబడలేదని తేల్చింది. కమిటీతో సమస్య జటిలమైంది... ‘ఇన్విజిలేర్ల పొరపాటు కూడా ఉంది. వ్యక్తిగత వివరాల నమోదులో బబ్లింగ్‌ను పరిగణనలోకి తీసుకోవాలి. సాంకేతిక కమిటీ సిఫార్సులకు లోబడి టీఎస్పీఎస్సీ సబ్ కమిటీ వేసింది. సాంకేతిక కమిటీ సూచనల్ని అమలు చేయాలని సబ్ కమిటీ సిఫార్సు చేసింది. ఈ కారణంగా టీఎస్పీఎస్సీ తీసుకున్న నిర్ణయం సమర్ధనీయమే. అయితే సింగిల్ జడ్జి... సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా సాంకేతిక వ్యవహారాలపై ముగ్గురు సీనియర్ న్యాయవాదులతో కమిటీని ఏర్పాటు చేయడం తగదు. పైగా న్యాయవాదుల కమిటీ సమస్యను మరింత జటిలం చేసింది. సింగిల్ జడ్జి నియమించిన న్యాయవాదుల కమిటీ కారణంగా రోగికి ఉన్న జబ్బు కంటే చికిత్స దారుణంగా మారినట్లు అయింది’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. -
2,437 పోస్టులు..15 నోటిఫికేషన్లు
-
కొలువుల జాతర
2,437 పోస్టులు..15 నోటిఫికేషన్లు 6వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు: టీఎస్పీఎస్సీ ♦ గ్రూప్–1, గ్రూప్–2 ఫలితాలు విడుదల.. నేడు వెబ్సైట్లో జాబితాలు ♦ వారంలో గ్రూప్–1 సర్టిఫికెట్ల వెరిఫికేషన్ షురూ.. తరువాత గ్రూప్–2కు.. ♦ 29, 30 తేదీల్లో పీజీటీలకు మెయిన్ పరీక్ష.. టీజీటీలకు వచ్చే నెల 4, 5, 6 తేదీల్లో ♦ స్పెషల్ టీచర్లకు జూలై 30న రాతపరీక్షలు ♦ టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి వెల్లడి సాక్షి, హైదరాబాద్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేళ నిరుద్యోగులకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) శుభవార్త అందించింది. వివిధ కేటగిరీల్లో 2,437 పోస్టులకు సంబంధించి 15 రకాల నోటిఫికేషన్లను గురువారం విడుదల చేసింది. శుక్రవారం నుంచి ఈ నోటిఫికేషన్లు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో (tspsc.gov.in) అందుబాటులో ఉంటాయని తెలిపింది. గురువారం కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి హైదరాబాద్‌లో ఈ వివరాలను వెల్లడించారు. అన్ని కేటగిరీల పోస్టులకు ఈ నెల 6వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఈ పోస్టుల్లో గురుకుల డిగ్రీ లెక్చరర్లు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు, నీటి పారుదల శాఖ, ఆర్అండ్బీ, ట్రైబల్ వెల్ఫేర్ తదితర శాఖల్లో సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు, ములుగులోని ఫారెస్ట్ కాలేజీలో ప్రొఫెసర్, లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి. గురుకుల డిగ్రీ కాలేజీల లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్, గురుకుల జూనియర్ కాలేజీల ఫిజికల్ డైరెక్టర్, జూనియర్ లెక్చరర్, లైబ్రేరియన్, గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్ పోస్టులకు స్క్రీనింగ్ టెస్టు, మెయిన్ పరీక్ష విధానం ఉంటుంది. గురుకుల డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాల్ పోస్టులకు ఇంటర్వూ్య మాత్రమే ఉంటుంది. ఫారెస్టు కాలేజీలో ప్రొఫెసర్స్, లైబ్రేరియన్లను ఆగస్టు మొదటి వారంలో నిర్వహించే ఇంటర్వూ్యల ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తుల చివరి గడువు, పరీక్ష తేదీలను తాత్కాలికంగా నిర్ణయించారు. కచ్చితమైన తేదీలను నోటిఫికేషన్లో వెల్లడించనున్నారు. గ్రూప్–1, గ్రూప్–2 ఫలితాలు విడుదల 128 పోస్టుల భర్తీకి నిర్వహించిన 2011 గ్రూప్–1.. 1,032 గ్రూప్–2 పోస్టుల ఫలితాలను విడుదల చేస్తున్నట్లు ఘంటా చక్రపాణి వెల్లడించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాలను శుక్రవారం నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామన్నారు. గ్రూప్–1కు 1:2 నిష్పత్తిలో 256 మందికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తామని, వారంలో వెరిఫికేషన్ ప్రారంభమవుతుందని చెప్పారు. అనంతరం గ్రూప్–2 సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తామని, దీనికి 1:3 నిష్పత్తిలో 3,096 మందికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తామని.. ఇంటర్వూ్యకు మాత్రం 1:2 రేషియోలో అభ్యర్థులను పిలుస్తామని చెప్పారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థులు చెక్ లిస్టులను చూసుకొని ఆయా సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాలని చక్రపాణి సూచించారు. సర్టిఫికెట్ల విషయంలో ఎలాంటి మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు. మధ్య దళారులను నమ్మొద్దు... ఇప్పటివరకు వివిధ పోస్టుల నియామకాలను పారదర్శకంగా నిర్వహించామని, భవిష్యత్‌లో మరింత పారదర్శకంగా ప్రక్రియ కొనసాగిస్తామని చక్రపాణి చెప్పారు. మధ్య దళారులు, వదంతులను అభ్యర్థులు నమ్మొద్దన్నారు. నియామకాల కోసం ప్రభుత్వం అప్పగించిన అన్ని ఇండెంట్లు పూర్తి చేశామని, ప్రస్తుతం ఎలాంటి ఇండెంట్లు æపెండింగ్‌లో లేవన్నారు. ఇప్పటికే 6 వేల పోస్టులను భర్తీ చేశామని, 4,432 మంది విధుల్లో చేరారని చెప్పారు. మరో 2 వేల పోస్టుల భర్తీకి ప్రక్రియ కొనసాగుతందని, 7,306 గురుకుల పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామని వివరించారు. మొత్తంగా ఇప్పటివరకు 15 వేలకు పైగా పోస్టుల భర్తీకి ప్రక్రియ చేపట్టామన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించిన నిబంధనల ఉత్తర్వులు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని చక్రపాణి చెప్పారు. ఆ తరువాత విద్యా శాఖ నుంచి జిల్లాల వారీగా పోస్టుల వివరాలతో కూడిన ఇండెంట్లు రావాలని, అవి వచ్చాకే నోటిఫికేషన్‌కు చర్యలు చేపడతామన్నారు. గురుకులాల టీచర్ల, పాఠశాలల టీచర్ల పరీక్ష స్కీం వేరుగా ఉండే అవకాశం ఉందని చెప్పారు. త్వరలోనే ఎక్సైజ్ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల చేస్తామని పేర్కొన్నారు. 29, 30 తేదీల్లో పీజీటీ పోస్టులకు మెయిన్ పరీక్షలు మే 31న రాత పరీక్ష నిర్వహించిన పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) పోస్టుల ‘కీ’లను ఒకటీ రెండు రోజుల్లో విడుదల చేస్తామని, ఫలితాలను వీలైనంత త్వరగా ప్రకటిస్తామని టీఎస్పీఎస్సీ చైర్మన్ వెల్లడించారు. పీజీటీలకు మెయిన్ పరీక్షలను ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహిస్తామని, టీజీటీలకు వచ్చే నెల 4, 5, 6 తేదీల్లో నిర్వహించేలా తాత్కాలిక షెడ్యూలు రూపొందించామని చెప్పారు. మొత్తానికి వచ్చే నెల 15 లోగా పరీక్ష నిర్వహిస్తామని, కచ్చితమైన పరీక్ష తేదీల షెడ్యూలును త్వరలోనే వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు. అలాగే ఆర్ట్, క్రాఫ్ట్ తదితర స్పెషల్ టీచర్ పోస్టులకు రాత పరీక్షలను వచ్చే నెల 30న నిర్వహిస్తామని వెల్లడించారు. టీజీటీ, పీజీటీ పోస్టులకు మెయిన్ పరీక్ష షెడ్యూలు.. 29–6–2017, 30–6–2017: పీజీటీ గణితం, ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ 12–7–2017, 13–7–2017: పీజీటీ లాంగ్వేజెస్ (తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్) 4–7–2017, 5–7–2017, 6–7–2017: టీజీటీ గణితం, ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్, సైన్స్, సోషల్ స్టడీస్ 14–7–2017, 15–7–2017: టీజీటీ లాంగ్వేజెస్ (తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్, సంస్కృతం) 30–7–2017: ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, స్పెషల్ టీచర్స్ (ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్, లైబ్రేరియన్) స్టాఫ్ నర్సు పోస్టులకు రాత పరీక్ష -
నెలాఖర్లో గ్రూప్–2 ఫలితాలు!
- జూన్ తొలి, రెండో వారంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ - జూలైలో ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశం - వచ్చే నెలలోనే గ్రూప్–1 ఇంటర్వ్యూలు - ఆ తర్వాత గురుకుల టీచర్ల పరీక్షలు సాక్షి, హైదరాబాద్: లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న గ్రూప్–2 ఫలితాల వెల్లడికి టీఎస్పీఎస్సీ కసరత్తు వేగవంతం చేసింది. పోస్టులు, రిజర్వేషన్లు, రోస్టర్ వారీగా, అర్హతల వారీగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు అర్హుల జాబితాలను సిద్ధం చేస్తోంది. దాదాపు నెల రోజులుగా కొనసాగుతున్న ఈ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. దీంతో ఈ నెలాఖరులోగానే ఫలితాలు విడుదల చేసి, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను ప్రకటించాలని శుక్రవారం నిర్వహించిన సమావేశంలో నిర్ణయానికి వచ్చింది. లేదంటే జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఫలితాలు ప్రకటించాలని భావిస్తోంది. మొత్తంగా జూన్ మొదటి లేదా రెండో వారంలో అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టేలా టీఎస్పీఎస్సీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. వచ్చే నెలంతా బిజీ బిజీ.. గ్రూప్–2 సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌తోపాటు 2011 గ్రూప్–1 ఇంటర్వ్యూలను కూడా జూన్‌లోనే నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. వీటికి సంబంధించిన ఫైలుపై సీఎం కేసీఆర్ ఇటీవలే సంతకం చేశారు. దీంతో పంచాయతీరాజ్ విభాగంలో సృష్టించే సూపర్ న్యూమరరీ పోస్టులపై ఉత్తర్వులు త్వరలోనే వెలువడుతాయని కమిషన్ వర్గాలు భావిస్తున్నాయి. ఆ ఉత్తర్వులు రాగానే రోస్టర్ పాయింట్ల ఆధారంగా మెరిట్ జాబితాలను ప్రకటించి... జూన్‌లోనే ఇంటర్వూ్యలు నిర్వహించాలని యోచిస్తున్నారు. మరోవైపు జూన్‌లోనే గురుకుల టీచర్ పోస్టుల భర్తీకి రాత పరీక్షలు నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. ఇక గ్రూప్–2 సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయిన అభ్యర్థులకు జూలైలో ఇంటర్వ్యూను నిర్వహించనుంది. ఎట్టకేలకు కొలిక్కి వచ్చిన ప్రక్రియ రెండు నోటిఫికేషన్ల ద్వారా 1,032 గ్రూప్–2 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. 2015 డిసెంబర్ 30న ఇచ్చిన తొలి నోటిఫికేషన్లో 439 పోస్టు లను ఇవ్వగా.. మరిన్ని పోస్టులు ఇవ్వాలంటూ నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో మరో 593 పోస్టులతో 2016 సెప్టెంబర్ 1న మరో నోటిఫికేషన్ ఇచ్చారు. వాటికి గతేడాది నవంబర్లోనే రాత పరీక్షలు నిర్వహించినా.. పలువురు అభ్యర్థులు కొన్ని అభ్యంతరాలతో కోర్టును ఆశ్రయించడంతో ఫలితాల ప్రక్రియ నిలిచిపోయింది. అయితే కోర్టు గత నెల 24న టీఎస్పీఎస్సీకి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో టీఎస్పీఎస్సీ ఫలితాల ప్రక్రియను చేపట్టింది.