jyothi rao pule
-
‘ఏపీలో పూలే ఆశయాలతో కాదు.. రెడ్‌బుక్‌తో పాలన’
సాక్షి, విజయవాడ: మహాత్మ జ్యోతిరావు పూలే, వైఎస్సార్ బాటలో నడిచిన వ్యక్తి వైఎస్ జగన్ అని వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. మహిళలకు పథకాలు, రాజకీయాల్లోనూ సముచిత స్థానం కల్పించిన వ్యక్తి వైఎస్ జగన్ అని చెప్పుకొచ్చారు. పూలే సిద్ధాంతాలను అమలు చేసింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే అని అన్నారు.ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు శైలజారెడ్డి, బెల్లందుర్గ, పీఏసీ సభ్యులు షేక్ ఆసిఫ్, పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి.ఈ సందర్బంగా మేయర్ , రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ..‘విద్యతోనే అభివృద్ధి అని నమ్మిన మహనీయులు జ్యోతిరావు పూలే. ఆశయాలను పుణికిపుచ్చుకున్న వ్యక్తి వైఎస్ జగన్. అందులో భాగంగానే వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తున్నారు. పూలే, వైఎస్సార్ బాటలో నడిచిన వ్యక్తి వైఎస్ జగన్. నేను మేయర్‌గా ఉన్నానంటే అందుకు కారణం జగన్.ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ..‘పూలే స్పూర్తితో పాలన చేసిన ఏకైక నాయకుడు జగన్. పూలే స్పూర్తితో మహిళల్లో చైతన్యం తెచ్చారు. మహిళలకు పథకాలు, రాజకీయాల్లోనూ సముచిత స్థానం కల్పించారు. కూటమి పది నెలల పాలన పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. జగన్ పాలన మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ..‘సామాజిక విప్లవం తెచ్చిన గొప్ప వ్యక్తి పూలే. వారి సిద్ధాంతాలను అమలు చేసింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. కూటమి ప్రభుత్వం విద్యను సర్వనాశనం చేసింది. ఎన్నికల్లో అధికారం కోసం వైఎస్సార్సీపీ కంటే ఎక్కువ పథకాలు ఇస్తామని చెప్పారు. జగన్ ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు లేవని బోర్డులు పెట్టేవారు. ఇప్పుడు స్కూల్లో డ్రాప్ అవుట్ లు పెరిగిపోయాయి. పత్రికలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. ఓ వ్యక్తి పెన్షన్ కోసం పక్క రాష్ట్రం నుంచి ఏపీకి వచ్చి హత్యకు గురయ్యాడు. ఆ వార్తను రాసినందుకు పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించేలా కేసులు పెడుతున్నారు. పోలీసుల దమనకాండపై వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ హాయంలో పూలే ఆశయాలు తూచా తప్పకుండా అమలయ్యాయి. మహిళలను రాజకీయంగా ఉన్నత స్థానాలకు తెచ్చిన ఘనత వైఎస్ జగన్. పూలే , అంబేద్కర్ ఆశయాలను కూటమి ప్రభుత్వం పక్కనపెట్టేసింది. రెడ్ బుక్ రాజ్యాంగం.. రెడ్ బుక్ ఆశయాలే ఏపీలో కొనసాగుతున్నాయి. ఏపీలో అవినీతి పాలన సాగుతోంది. సూపర్ సిక్స్ ను పక్కన పెట్టి పీ-4 పేరుతో మరోమారు చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
మహాత్మా జ్యోతిరావు పూలేకు వైఎస్ జగన్ నివాళులు
-
జ్యోతిరావు పూలే జయంతి.. వైఎస్ జగన్ నివాళులు
సాక్షి, తాడేపల్లి: నేడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి. ఈ సందర్భంగా పూలేకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అందించారు.ఈ క్రమంలో వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘సామాజిక సమానత్వానికి, మహిళా విద్యకు మార్గదర్శకులు జ్యోతిరావు పూలేగారు. అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం జీవితాంతం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త ఆయన. నేడు జ్యోతిరావు పూలేగారి జయంతి సందర్భంగా నివాళులు’ అని చెప్పుకొచ్చారు. సామాజిక సమానత్వానికి, మహిళా విద్యకు మార్గదర్శకులు జ్యోతిరావు పూలేగారు. అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం జీవితాంతం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త ఆయన. నేడు జ్యోతిరావు పూలేగారి జయంతి సందర్భంగా నివాళులు. pic.twitter.com/33mnLmWHid— YS Jagan Mohan Reddy (@ysjagan) April 11, 2025 ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి జోగి రమేష్, మాజీ ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్సీలు భరత్, లేళ్ల అప్పిరెడ్డి, ఆర్ రమేష్ యాదవ్, మొండితోక అరుణ్ కుమార్, కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, వైఎస్సార్సీపీ నేతలు దేవినేని అవినాష్, ఉప్పాల రాము తదితరులు హాజరయ్యారు. -
జ్యోతిరావు పూలేకు వైఎస్ జగన్ నివాళి
-
జ్యోతిరావు పూలేకు సీఎం జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయంలో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగర పాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి మోహనరావు పాల్గొన్నారు. చదవండి: AP Cabinet 2022 Live Updates: ఏపీ నూతన మంత్రుల పదవీ ప్రమాణ స్వీకారోత్సవం -
జ్యోతిరావు పూలేకు సీఎం జగన్ నివాళి
-
ప్రతి ఒక్కరు జ్యోతిరావు పూలే అడుగు జాడలలో నడవాలి : ఆళ్ల రామకృష్ణరెడ్డి
-
జ్యోతిరావు పూలేకు సీఎం జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, వైఎస్సార్ సీపీ బీసీ సెల్ కన్వీనర్ జంగా కృష్ణమూర్తి, ఎంపీ మిథున్ రెడ్డి, సీఎం ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, ఎమ్మెల్యే జోగి రమేష్ పాల్గొన్నారు. ఆయన చూపిన బాటలో నడుస్తూ.. అణగారిన వర్గాల ఆశాజ్యోతి, స్త్రీ విద్యకు బాటలు వేసిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే అని సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల సంక్షేమం కోసం పనిచేసిన నాయకుడని కొనియాడారు. ‘‘ఆయన చూపిన బాటలో నడుస్తూ.. అందరి సంక్షేమమే లక్ష్యంగా పాలన చేస్తున్నామని’’ సీఎం ట్విట్టర్లో పేర్కొన్నారు. విశాఖలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు.. విశాఖపట్నం: ప్రముఖ సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు విశాఖలో ఘనంగా జరిగాయి. నగరంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో బీసీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్‌తో పాటు విశాఖ నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే.. బీసీలకు, బడుగు వర్గాలకు చేసిన సేవలు మరువలేనివని మంత్రి అవంతి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. అంబేద్కర్, జ్యోతిరావు పూలే వంటి నేతల ఆశయాల సాధనలో రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. విశాఖ నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి మాట్లాడుతూ, బీసీల అభ్యున్నతికి జ్యోతిరావు పూలే చేసిన కృషి భావితరాలకు ఆదర్శమన్నారు. చదవండి: ‘హోదాపై సమాధానం చెప్పాల్సింది బీజేపీయే’ టీడీపీ నేత దాష్టీకం: తన్ని.. మెడపట్టి గెంటి.. -
మహారాష్ట్రలో రైతు రుణమాఫీ
నాగ్‌పూర్: మహారాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర రైతులకు తీపి కబురు అందించింది. రూ. 2 లక్షల వరకూ ఉన్న రైతు రుణాలను మాఫీ చేస్తున్నట్లు సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. 2019 సెప్టెంబర్ 30 వరకూ ఉన్న రుణాలు మాఫీ చేయనున్నట్లు చెప్పారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాల చివరి రోజైన శనివారం ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ రుణమాఫీకి ‘మహాత్మా జ్యోతిరావ్ ఫూలే’ పథకంగా పేరుపెట్టారు. మాఫీకి అర్హత పొందేందుకు కొన్ని పత్రాలు అవసరమవుతాయని చెప్పారు. దీని వల్ల రూ. 40 వేల కోట్ల భారం ప్రభుత్వంపై పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. లోన్ల మాఫీ కోసం గత ప్రభుత్వంలో మాదిరి గంటల తరబడి వరుసల్లో నిలబడాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి జయంత్ పాటిల్ చెప్పారు. కేవలం ఆధార్ కార్డుతో బ్యాంకుకు వెళితే సరిపోతుందని చెప్పారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉద్యోగులు ఈ పథకానికి అనర్హులని చెప్పారు. రుణమాఫీకి రూ. 2 లక్షల పరిమితి పెట్టడంపై బీజేపీ మండిపడింది. రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పి ఉద్ధవ్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ ఆరోపించారు. దీనిపై తాము రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని చెప్పారు. అకాల వర్షం కారణంగా అక్టోబర్ నెలలో పంట నష్టంతో దెబ్బ తిన్న రైతులను ఆదుకోవడంలో కూడా ప్రభుత్వం విఫలమైందన్నారు. 2017లో అప్పటి బీజేపీ–శివసేన ప్రభుత్వం 50 లక్షల మంది రైతులకు చెందిన రూ. 19 వేల కోట్ల రుణాలను చెల్లించింది. -
సమసమాజ స్ఫూర్తిప్రదాత పూలే: బత్తుల
సాక్షి, హైదరాబాద్ : సమసమాజ స్ఫూర్తి ప్రదాత మహాత్మా జ్యోతిరావు పూలే అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో, విజయవాడలోని రాష్ట్ర కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ... ఆ రోజుల్లోనే అసమానతలు, అంటరానితనం, మహిళాహక్కుల కోసం జ్యోతిరావు పూలే పోరాడారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి నారాయణ మూర్తి, నాయకులు చల్లా మధుసూదన్ రెడ్డి, కాకమాను రాజశేఖర్, విజయ్ చందర్, డాక్టర్ ప్రఫుల్లారెడ్డి, కె.శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
దేశవ్యాప్తంగా పూలే విగ్రహాలు ఏర్పాటు చేయాలి
హైదరాబాద్ : మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచనలను భారతరత్న బి.ఆర్. అంబేద్కర్ అమలు చేశారని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు (విహెచ్) తెలిపారు. అయితే అంబేద్కర్‌కి ఇస్తున్న గౌరవం పూలేకు ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం గాంధీభవన్‌లో జ్యోతిరావు పూలే వర్ధంతి ఘనం జరిగింది. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ... పూలే జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే దేశవ్యాప్తంగా ప్రతిరాష్ట్రంలో పూలే విగ్రహాలను ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వీహెచ్ విజ్ఞప్తి చేశారు.