mumbai attack case
-
ముంబై దాడుల కేసులో కొనసాగుతున్న తహవ్వుర్ రాణా విచారణ
-
ఎన్ఐఏ విచారణలో రాణా మూడు డిమాండ్లు
న్యూఢిల్లీ: మహానగరం ముంబై 26/11 దాడులకు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(National Investigation Agency)(ఎన్ఐఏ) ప్రస్తుతం తమ కస్టడీలో ఉన్న కెనడా-పాకిస్తానీ పౌరుడు తహవ్వూర్ హుస్సేన్ రాణాను విచారిస్తోంది. ఈ నేపధ్యంలో పలు విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇంతలో తహవ్వూర్ హుస్సేన్ రాణా ఎన్ఐఏ ముందు కొన్ని డిమాండ్లు ఉంచినట్లు తెలుస్తోంది. ఇది అతని మానసిక స్థితిని తెలియజేసేదిగా ఉందని ఎన్ఐఏ పేర్కొంది.వివరాల్లోకి వెళితే ఎన్ఐఏ విచారణలో ఉన్న తహవ్వూర్ రాణా(Tahawwur Rana) ఎన్ఐఏ ముందు ఉంచిన డిమాండ్ పలు చర్చలకు దారితీస్తున్నాయి. కస్టడీలో ఉన్న రాణా తనకు ఖురాన్ (ఇస్లామిక్ పవిత్ర గ్రంథం), ఒక పెన్ను, 26/11 దాడుల గురించి అధికారికంగా ప్రశ్నించే అవకాశాన్ని కోరాడు. ఇవి అతని మానసిక స్థితిని, మతపరమైన నమ్మకాన్ని, ఈ కేసులో అతని పాత్ర గురించిన అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. రాణా ఖురాన్‌ను అడగడం అతని మతపరమైన అభిరుచులను సూచిస్తుండగా, పెన్ను కావాలనడం ఏదైనా ముఖ్యమైన రాతపూర్వక ప్రకటన లేదా నోట్స్ తీసుకుంటాడని తెలుస్తోంది. ఇక ముడవది.. అతి ముఖ్యమైనది 26/11 దాడుల(26/11 attacks) గురించి ప్రశ్నించే అవకాశం కోరడం.. దీనిని చూస్తుంటే రాణా ఈ ఘటనలో తన పాత్రను వివరించాలనుకుంటున్నాడో లేక మరేదైనా సమాచారాన్ని బహిర్గతం చేయాలనుకుంటున్నాడో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాణా పాకిస్తాన్ ఆధారిత టెరరిస్ట్ సంస్థ లష్కర్-ఎ-తోయిబా (ఎల్ఈటీ)తో సంబంధం కలిగి ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 2008లో 166 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్న 26/11 ముంబై దాడులలో అతని పాత్రను తెలుసుకునేందుకు ఎన్ఐఏ కఠినమైన విచారణ కొనసాగిస్తున్నది. ఇది భారత్-పాకిస్తాన్ టెరరిజం, అంతర్జాతీయ క్రిమినల్ న్యాయ వ్యవస్థకు సంబంధించిన సంక్లిష్టమైన కేసుగా మారింది. అలాగే ఈ కేసు భారత్.. ఉగ్రవాదంపై సాగిస్తున్న పోరాటంలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలిచింది. ఎన్ఐఏ విచారణలో తహవ్వూర్ రాణా 26/11 ముంబై దాడులకు సంబంధించి ఏఏ విషయాలు వెల్లడించనున్నాడనేది ఆసక్తికరంగా మారింది.ఇది కూడా చదవండి: ఈ ఇద్దరు అధికారులే.. తహవ్వూర్ రాణా విచారణ సారధులు -
ఈ ఇద్దరు అధికారులే.. తహవ్వూర్ రాణా విచారణ సారధులు
ముంబై: ముంబై ఉగ్రదాడులలో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న తహవ్వూర్ హుస్సేన్ రాణా(Tahawwur Rana)ను అమెరికా నుంచి భారత్‌కు రప్పించాక నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అతనిని విచారిస్తోంది. ఈ అత్యంత సున్నితమైన విచారణను కొనసాగిస్తున్న బృందానికి ఇద్దరు సీనియర్ అధికారులు నాయకత్వం వహిస్తున్నారు వారే.. అశిష్ బాత్రా(ఎన్ఐఏ ఇన్స్పెక్టర్ జనరల్, జార్ఖండ్ మాజీ జాగ్వార్ ఫోర్స్ హెడ్) జయ రాయ్(ఎన్ఐఏ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్) వీరిద్దరూ రాణా ఎక్స్ట్రాడిషన్ (ఒక దేశం వేరొక దేశానికి ఒక వ్యక్తిని బదిలీ చేయమని అభ్యర్థించే చట్టపరమైన ప్రక్రియ)నడిపించారు. ఇప్పుడు తహవ్వూర్ హుస్సేన్ రాణా విచారణ సారధ్య బాధ్యతలను నిర్వహిస్తున్నారు. దాడులలో పాకిస్తాన్ ఐఎస్ఐ పాత్ర, రాణాకు గల అంతర్జాతీయ నెట్వర్క్ మొదలైనవాటిని వెలికితీసే లక్ష్యంతో ఈ విచారణ కొనసాగుతోంది.తహవ్వూర్ రాణా 26/11 ముంబై ఉగ్రదాడులలో కీలక సహకారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. 2009లో అమెరికాలో అరెస్టయిన రాణా 2013లో లష్కర్-ఎ-తొయిబా(Lashkar-e-Taiba) (ఎల్ఈటీ)కి మద్దతు ఇచ్చినందుకు 14 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాడు. 2025, ఏప్రిల్ 10న అమెరికా నుంచి భారత్‌కు వచ్చాడు. ప్రస్తుతం ఎన్ఐఏ కస్టడీలో ఉన్నాడు. రాణా విచారణకు సారధ్యం వహిస్తున్న ఇద్దరు అధికారులో ఒకరైన అశిష్ బాత్రా 1997 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారి. జార్ఖండ్ క్యాడర్‌కు చెందినవారు. ప్రస్తుతం ఎన్ఐఏలో ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ)గా విధులు నిర్వహిస్తున్నారు.ఈయన జార్ఖండ్ పోలీస్ విభాగానికి చెందిన ఎలైట్ యాంటీ-మావోయిస్ట్ యూనిట్ ‘జాగ్వార్ ఫోర్స్’కు మాజీ హెడ్. ఈ యూనిట్ మావోయిస్టుల తిరుగుబాటును అణచివేయడంలో కీలక పాత్ర పోషించింది. రాణా విచారణలో కీలకంగా వ్యవహరిస్తున్న జయ రాయ్ 2011 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. జార్ఖండ్ క్యాడర్(Jharkhand Cadre)కు చెందినవారు. ప్రస్తుతం ఎన్ఐఏలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ)గా విధులు నిర్వహిస్తున్నారు. జయ రాయ్ జార్ఖండ్‌లోని జామ్తారాలో సైబర్‌క్రైమ్‌లను అరికట్టడంలో కీలకపాత్ర పోషించారు. 2019లో ఎన్ఐఏలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా చేరిన రాయ్.. రాణా కేసులో ఛీఫ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. రాణాకు సంబంధించి ఈ మెయిల్లు, ఆర్థిక లావాదేవీలు మొదలైనవాటిని విశ్లేషించడంలో కీలక పాత్ర పోషించారు. రాణాని విచారించి, ముంబై దాడులలో పాకిస్తాన్ గూఢచార సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ప్రమేయాన్ని వెలికితీసేందుకు ఎన్ఐఏ ప్రయత్నిస్తోంది.ఇది కూడా చదవండి: 26/11 దాడుల్లో ‘దుబాయ్ వ్యక్తి’? : ఎన్ఐఏ ఆరా -
26/11 దాడుల్లో ‘దుబాయ్ వ్యక్తి’? : ఎన్ఐఏ ఆరా
న్యూఢిల్లీ: మహానగరం ముంబైలో చోటుచేసుకున్న 26/11 ఉగ్రదాడుల్లో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న తహవ్వూర్ హుస్సేన్ రాణా(Tahawwur Rana)ను అమెరికా నుంచి భారత్‌కు రప్పించాక, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అతనిని విచారిస్తోంది. ఈ నేపధ్యంలో ఆశ్చర్యకరమైన విషయమొకటి బయటపడింది. దుబాయ్‌లో ఉంటున్న ఒక వ్యక్తికి 2008 ముంబై దాడుల గురించి ముందే తెలిసి ఉండవచ్చుననే ఆధారాలు లభించాయి. అయితే ఈ వ్యక్తి గుర్తింపు ఇంకా స్పష్టం కాలేదు. కానీ రాణాతో అతనికున్న సంబంధం వెల్లడైతే దాడులకు సంబంధించిన మరిన్ని కీలక ఆధారాలు వెలుగుచూసే అవకాశం ఉందని ఎన్డీటీవీ తన కథనంలో పేర్కొంది. తహవ్వూర్ హుస్సేన్ రాణా విచారణ ముంబై దాడుల కుట్రను బయటపెట్టడంలో ఒక ముఖ్యమైన అడుగుగా నిపుణులు చెబుతున్నారు.తహవ్వూర్ రాణా(64)కెనడియన్ పౌరుడు. పాకిస్తాన్ సైన్యంలో మాజీ క్యాడెట్. వైద్య నిపుణునిగానూ పనిచేశాడు. 26/11 ముంబై ఉగ్రదాడులలో కీలక సహకారిగా తహవ్వూర్ రాణా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈయన డేవిడ్ కోల్మన్ హెడ్లీ (దాడులలో మరో కీలక నిందితుడు)కి సన్నిహితుడు. రాణా..హెడ్లీకి ముంబైలో దాడుల ప్రాంతాలను సర్వే చేయడానికి సహకారించాడనే ఆరోపణలున్నాయి. రాణా 2009లో అమెరికాలో అరెస్టయ్యాడు. డానిష్ వార్తాపత్రికపై దాడి పథకం కేసులో అతని అరెస్టు జరిగింది. 2013లో అతను లష్కర్-ఎ-తొయిబా(Lashkar-e-Taiba) (ఎల్ఈటీ)కు మద్దతు ఇచ్చినందుకు 14 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాడు.రాణాను అమెరికా నుంచి భారత్‌కు రప్పించిన తర్వాత, ఎన్ఐఏ అతనిని 18 రోజుల కస్టడీకి తీసుకుంది. ఈ విచారణలో దుబాయ్‌లో నివసిస్తున్న ఒక వ్యక్తి గురించిన సమాచారం బయటపడింది. అతను 26/11 దాడుల గురించి ముందే తెలుసుకొని ఉండవచ్చని ఎన్ఐఏ అనుమానిస్తోంది. ఈ దుబాయ్ వ్యక్తికి ఎల్ఈటీ లేదా ఇతర ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉండవచ్చని, లేదా దాడులకు సంబంధించిన ఆర్థిక లేదా లాజిస్టికల్ సహాయం అందించి ఉండవచ్చని ఎన్ఐఏ అధికారులు(NIA officials) అనుమానిస్తున్నారు.ఎన్ఐఏ రాణాను పలు ప్రధాన అంశాలపై విచారిస్తోంది. ముంబై దాడులలో పాకిస్తాన్ గూఢచార సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) పాత్రను లోతుగా తవ్వితీసే ప్రయత్నం చేస్తోంది. అలాగే లష్కర్-ఎ-తొయిబాతో అతనికి గల సంబంధాల గురించి ఆరాతీస్తోంది. రాణా ఎల్ఈటీతో ఎలాంటి సంబంధాలు కలిగి ఉన్నాడు? దాడుల పథకంలో అతని నిర్దిష్ట పాత్ర ఏమిటనేదానిపై విచారణ కొనసాగిస్తోంది. ఇందుకోసం ఎన్ఐఏ అధికారులు రాణాను దేశంలోని వివిధ నగరాలకు తీసుకెళ్లి, ముంబై దాడుల తరహాలో ఇతర నగరాలలో కూడా ఉగ్రవాద దాడులకు సంబంధించిన పథకాలేమైనా రూపొందించారా అనేదానిపై విచారణ చేయనుంది.ఇది కూడా చదవండి: గంట ప్రయాణం నిమిషంలో.. ప్రపంచంలోనే ఎత్తైన వంతెన -
ముంబై దాడుల కేసులో తహవ్వుర్ రాణాను విచారిస్తున్న NIA
-
NIA అదుపులో తహవూర్ రాణా
-
Tahawwur Rana: తహవూర్ రాణా దారులన్నీ మూసుకుపోయాయి.. ఇక
ఢిల్లీ: ముంబై 26/11 ఉగ్రదాడి కేసు ప్రధాన నిందితుడు తహవూర్ హుస్సేన్ రాణాను (Tahawwur Rana) భారత్‌కు తరలించారు. అమెరికా నుంచి అతడిని తీసుకువచ్చిన విమానం గురువారం సాయంత్రం ఢిల్లీ విమానాశ్రయంలో దిగింది. ఢిల్లీ విమానాశ్రయంలోనే రాణాను ఎన్ఏఐ(National Investigation Agency) అరెస్ట్ చేసింది. అనంతరం తీహార్ జైలుకు తరలించింది. తీహార్ జైల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్ఐఏ విచారణ చేపట్టనుంది. ఈ సందర్భంగా తహవూర్ రాణా గురించి ఎన్ఐఏ అధికారిక ప్రకటన చేసింది.ముంబై ఉగ్రదాడుల మాస్టర్ మైండ్ తహవర్ రాణాను భారత్‌కు తీసుకురావడంలో ఎన్ఐఏ విజయవంతమైంది. ముంబై దాడులకు పడిన పాల్పడిన కుట్ర దారున్ని న్యాయస్థానాల ముందు నిలబెడుతున్నాం. అమెరికాలో రాణాకు అన్ని న్యాయపరమైన దారులు మూసుకు పోయాయి. 2023 మే 16న భారత్‌కు అప్పగించేందుకు అమెరికా స్థానిక కోర్టు ఆదేశాలు ఇచ్చింది. pic.twitter.com/nS7dA58W55— NIA India (@NIA_India) April 10, 2025 రాణా ఫైల్ చేసిన అన్ని పిటిషన్లు అమెరికా సుప్రీంకోర్టు సహా న్యాయస్థానాలు కొట్టివేశాయి. అమెరికా భారత్‌లోని కీలక సంస్థల సమన్వయంతో రాణాను భారత్‌కు తీసుకు రాగలిగాం. ముంబై ఉగ్రదాడుల కుట్ర దారు రాణా. డేవిడ్ హెడ్లితో కలిసి ముంబై దాడులకు కుట్ర పన్నాడు. లష్కర్ ఈ తోయిబా, హుజీ ఉగ్ర సంస్థలు, పాకిస్తాన్ కుట్ర దారులు ఇందులో భాగస్వాములు. ముంబై ఉగ్రదాడులో 166 మంది చనిపోయారు 238 మంది గాయపడ్డారు’అంటూ అధికారిక నోట్‌ను విడుదల చేసింది. -
‘సందీప్ 26/11 బాధితుడు కాదు.. కర్తవ్యాన్ని నెరవేర్చాడు’
ముంబై: మహానగరం ముంబైలో 2008 నవంబర్ 26 నుంచి 29 వరకు జరిగిన 26/11 ఉగ్రదాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల్లో లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదులు తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌తోపాటు పలు ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దాడుల్లో తహవ్వుర్ హుస్సేన్ రాణా కీలక పాత్ర పోషించాడనే ఆరోపణలు ఉన్నాయి. 2025 ఏప్రిల్ 10న రాణాను భారత్‌కు అమెరికా అప్పగించింది. ఈ దాడుల సమయంలో జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తాజ్ హోటల్లో ఉగ్రవాదులతో పోరాడుతూ వీరమరణం పొందారు. అతని ధైర్యం, తెగువ, త్యాగం దేశానికి స్ఫూర్తిగా నిలిచాయి. ఉగ్రవాది తహవ్వుర్ హుస్సేన్ రాణా భారత్‌కు రానున్నాడనే సంగతి తెలుసుకున్న మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తండ్రి కె. ఉన్నికృష్ణన్, ఎన్డీటీవీతో మాట్లాడుతూ ‘సందీప్ 26/11 బాధితుడు కాదు, అతను తన కర్తవ్యం నిర్వర్తించాడు’ అని అన్నారు. రాణా లాంటి ఉగ్రవాదులు ఈ దాడులకు కారణమని, అలాంటివారు భారత న్యాయవ్యవస్థలో శిక్షను ఎదుర్కోవాలని, న్యాయం కోసం ఎదురుచూస్తున్న బాధితులందరికీ ఇది ఒక ఆశాకిరణం’ అని ఆయన పేర్కొన్నారు. తహవ్వుర్ రాణా భారత్‌కు అప్పగించిన కారణంగా 26/11 దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు, పాకిస్తాన్‌లోని ఉగ్రవాద సంస్థలతో అతనికి గల సంబంధాలు బయటపడే అవకాశం ఉంది.ఇది కూడా చదవండి: 26/11 టార్గెట్‌లో జల వాయు విహార్.. తహవ్వుర్ రాణా కీలక పాత్ర? -
26/11 మాస్టర్‌మైండ్ తహవ్వూర్ రానా రాక.. ఢిల్లీ, ముంబై జైళ్లలో ఏర్పాట్లు?
న్యూఢిల్లీ: మహానగరం ముంబైలో 2008లో జరిగిన 26/11 ఉగ్రదాడిలో కీలకంగా వ్యవహరించిన మాస్టర్‌మైండ్ తహవ్వూర్ రానా(Mastermind Tahavvoor Rana) నేడు (ఏప్రిల్ 9) భారత్‌కు చేరుకోనున్నాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ, ముంబైలోని జైళ్లలో రహస్యంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.‘టైమ్స్ ఆఫ్ ఇండియా’లో పేర్కొన్న వివరాల ప్రకారం అమెరికా న్యాయ వ్యవస్థ సిఫారసులకు అనుగుణంగా ఢిల్లీ, ముంబైలోని జైళ్లలో ఏర్పాట్లు చేయాలని అధికారులు సూచించారని సమాచారం. తహవ్వూర్ రానా తొలుత కొన్ని వారాలపాటు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(National Investigation Agency) (ఎన్ఐఏ) అదుపులో ఉండే అవకాశం ఉంది. ఈ ఏజెన్సీ కార్యకలాపాలను జాతీయ భద్రతా సలహాదారు ఎ.కె. దోవల్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆయన హోం మంత్రిత్వ శాఖ అధికారులతో కలిసి ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. తహవ్వూర్ రానా పాకిస్తానీ-కెనడియన్ వ్యక్తి. లష్కర్-ఎ-తోయిబా (ఎల్ఈటీ) సంస్థలో చురుకైన సభ్యుడు.తహవ్వూర్ రానా తన సహచర ఉగ్రవాది, పాకిస్తానీ-అమెరికన్ డేవిడ్ కోల్మన్ హెడ్లీ (అలియాస్ దావూద్ గిలానీ)కి పాస్‌పోర్ట్‌లు సమకూర్చాడు. హెడ్లీ భారత్‌లో తమ లక్ష్యాలను ఎంచుకునేందుకు ఈ పాస్‌పోర్ట్‌లను ఉపయోగించి దేశంలోకి ప్రవేశించాడు. 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన ఈ దాడులపై రానా సంతోషం వ్యక్తం చేస్తూ, ఈ దాడులకు కారకులైన ఉగ్రవాదులకు వారి మరణానంతరం పాకిస్తాన్ అత్యున్నత సైనిక గౌరవాన్ని ఇవ్వాలని పేర్కొన్నాడు.26/11 దాడుల్లో పాల్గొన్న లష్కర్ ఉగ్రవాది అజ్మల్ కసబ్(Ajmal Kasab)ను విచారణ అనంతరం 2012లో ఉరిశిక్ష అమలు చేశారు. గత ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఉగ్రవాది తహవ్వూర్ రానా భారత్‌కు అప్పగింతను ధృవీకరించారు. ఈ అప్పగింత 2019 నుండి మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల ఫలితంగా జరిగింది. 2019 డిసెంబర్లో భారత్.. అమెరికాను తహవ్వూర్ రానా అప్పగింత కోరింది. దీనితో అతని అప్పగింతకు మార్గం సుగమం అయింది. తహవ్వూర్ రానా భారత్‌కు చేరుకున్న తర్వాత అతనిని తీహార్ జైలులో ఉంచే అవకాశం ఉందని, అక్కడ ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నాయని కూడా తెలుస్తోంది. ఇది కూడా చదవండి: ట్రంప్ సుంకాలపై భారత్- చైనా కలసి పోరాడాలి: చైనా పిలుపు -
భారత్ కస్టడికి ముంబై దాడుల సూత్రధారి తహవూర్ రాణా..
-
‘ముంబై’ దోషులకు శిక్ష పడాల్సిందే
అప్పటిదాకా భారత్ సంతృప్తి చెందదు: ఆంటోనీ 26/11కు ఐదేళ్లు న్యూఢిల్లీ/రాంచీ: ముంబై దాడుల దోషులకు గరిష్ట శిక్ష పడేంత వరకు భారత్ సంతృప్తి చెందదని రక్షణమంత్రి ఏకే ఆంటోనీ పాకిస్థాన్‌కు స్పష్టంచేశారు. దాడులకు పాల్పడ్డవారి వివరాలు, ఆ కుట్ర మూలాలకు సంబంధించిన సమాచారాన్ని పాక్‌కు గతంలోనే ఇచ్చినట్లు చెప్పారు. ముంబైలో పాక్ ముష్కరుల దాడులకు ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. పొరుగు దేశం నుంచి ఏమి ఆశిస్తున్నారని పాత్రికేయులు ప్రశ్నించగా.. ‘‘దోషులను చట్టం ముందు నిలబెట్టాలని వారికి (పాక్‌కు) అనేకమార్లు చెప్పాం. దాడికి కారకులైనవారిని తీవ్రంగా శిక్షించనంత వరకు భారత్ సంతృప్తి చెందదు’’ అని చెప్పారు. 2008, నవంబర్ 26న పాక్ నుంచి సముద్రతీరం గుండా వచ్చిన 10 మంది ఉగ్రవాదులు ముంబైలో నరమేధం సృష్టించి 160 మంది ప్రాణాలను బలిగొన్న సంగతి తెలిసిందే. ఈ దాడికి ముందు తీర గస్తీ బలహీనంగా ఉండేదని, కానీ ఇప్పుడు భద్రతను కట్టుదిట్టం చేసినట్లు ఆంటోనీ చెప్పారు. దారి తప్పినవారిని క్షమిస్తాం: షిండే దారి తప్పి హింసామార్గాన్ని ఎంచుకున్నవారిని క్షమించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని హోంమంత్రి షిండే అన్నారు. మావోయిస్టులను ఉద్దేశించి ఆయన రాంచీలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘హింస దేనికీ పరిష్కారం కాదు. మనలో కొందరు యువకులు దారి తప్పి హింసామార్గాన్ని ఎంచుకున్నారు. వారు మనలో ఒకరే. హింసను వీడి జనస్రవంతిలోకి వస్తామంటే వారిని క్షమించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది’ అని అన్నారు. -
పాక్‌కు 26/11 కేసు పత్రాలు
న్యూఢిల్లీ: ముంబై దాడుల కేసు సాక్ష్యాలకు సంబంధించిన ఐదు కీలకమైన పత్రాలను భారత ప్రభుత్వం పాకిస్థాన్ హై కమిషన్‌కు అందజేసింది. లష్కరే తోయిబా కమాండర్ జకీవుర్ రెహ్మన్ లక్వీతో పాటు ఏడుగురు కీలక నిందితులకు సంబంధించిన 600 పేజీల విచారణ పత్రాలు తదుపరి విచారణ కోసం పాక్ చేతికిచ్చింది. ఈ డాక్యుమెంట్లలో సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ప్రతులు, అప్పటి కాల్పుల్లో మరణించిన తొమ్మిది మంది టైస్టుల పోస్టుమార్టం రిపోర్టులు, ఈ కేసును విచారించిన చీఫ్ ఇన్వెస్టిగేటింగ్ అధికారి సాక్షులకు జారీ చేసిన సమన్లతో పాటు గతనెలలో ముంబైలో పర్యటించిన పాక్ జ్యుడీషియల్ కమిషన్ విచారణకు సంబంధించి డాక్యుమెంట్లు ఉన్నాయని సమాచారం.