ముంబై దాడుల కేసు సాక్ష్యాలకు సంబంధించిన ఐదు కీలకమైన పత్రాలను భారత ప్రభుత్వం పాకిస్థాన్ హై కమిషన్‌కు అందజేసింది.
న్యూఢిల్లీ: ముంబై దాడుల కేసు సాక్ష్యాలకు సంబంధించిన ఐదు కీలకమైన పత్రాలను భారత ప్రభుత్వం పాకిస్థాన్ హై కమిషన్‌కు అందజేసింది. లష్కరే తోయిబా కమాండర్ జకీవుర్ రెహ్మన్ లక్వీతో పాటు ఏడుగురు కీలక నిందితులకు సంబంధించిన 600 పేజీల విచారణ పత్రాలు తదుపరి విచారణ కోసం పాక్ చేతికిచ్చింది. ఈ డాక్యుమెంట్లలో సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ప్రతులు, అప్పటి కాల్పుల్లో మరణించిన తొమ్మిది మంది టైస్టుల పోస్టుమార్టం రిపోర్టులు, ఈ కేసును విచారించిన చీఫ్ ఇన్వెస్టిగేటింగ్ అధికారి సాక్షులకు జారీ చేసిన సమన్లతో పాటు గతనెలలో ముంబైలో పర్యటించిన పాక్ జ్యుడీషియల్ కమిషన్ విచారణకు సంబంధించి డాక్యుమెంట్లు ఉన్నాయని సమాచారం.