Nalgonda assembly constituency
-
సెలవుల సంతోషం మాకు దూరం : అయ్యో బిడ్డా ఎంత కష్టం!
వేసవి సెలవులొస్తున్నాయంటే విద్యార్థుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతుంటుంది. ఆటలు ఆడుకోవచ్చని, అమ్మానాన్నలు, స్నేహితులతో సరదాగా గడపొచ్చని, బంధువుల ఇళ్లకు వెళ్లవచ్చనే ఉద్దేశంతో సెలవుల కోసం ఎదురుచూస్తుంటారు. కానీ అమ్మా నాన్నలు.. ఆదరించే వారు లేని విద్యార్థుల పరిస్థితి వేరు. గురుకులాలు, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో (కేజీబీవీ) చదువుకుంటూ, హాస్టళ్లలో ఉండే వారికి వేసవి సెలవులు సమీపిస్తున్నాయంటే దిగులు మొదలవుతుంది. బుధవారం సాయంత్రం వీరికి ఇదే పరిస్థితి ఎదురయ్యింది. గురువారం నుంచి పాఠశాలలకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించడంతో ఇలాంటి బాలలంతా బాలసదన్‌లకు చేరుకున్నారు.నల్లగొండ బాలసదన్‌కు ఇద్దరు బాలికలు నల్లగొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలోని కేజీబీవీలో గోగుల మనీష 9వ తరగతి, ఆంబోతు లక్ష్మి8వ తరగతి చదువుతున్నారు. వారికి తల్లిదండ్రులు లేరు. వారిని తీసుకుపోయేందుకు ఇతరులెవరూ లేకపోవడంతో ఎప్పటిలాగే నల్లగొండలోని బాలసదన్ నిర్వాహకులు వారిని తీసుకెళ్లేందుకు వచ్చారు. బాలసదన్ ఎస్వో రాజేశ్వరికి పాఠశాల సిబ్బంది విద్యార్థినులను అప్పగించారు. తమకు అమ్మానాన్నలు లేకపోవడంతో తాము తమ ఇంటికి వెళ్లలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నాకు తల్లిదండ్రులు లేరు..సంరక్షకులు లేరు: పూజనేను చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయా. తెలిసినవారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బాలసదన్‌లో చేర్పించారు. అక్కడే పూర్వ ప్రాథమిక విద్య పూర్తి చేశా. తర్వాత ఆర్మూర్మండలంలోని పెర్కిట్ కేజీబీవీలో గతసంవత్సరం ఏడో తరగతిలో చేరాను. ప్రస్తుతం పాఠశాలకు సెలవులు వచ్చాయి. నాకు తల్లిదండ్రులతో పాటు, సంరక్షకులు కూడా ఎవరూ లేక పోవడంతో తిరిగి బాలసదన్కే వెళ్తున్నా. అక్కా, తమ్ముడు, చెల్లి.. తలోచోట...నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన ఓ మహిళ తన భర్తతో విడిపోయి కొన్నేళ్లుగా ఒంటరిగా ఉంటోంది. ఆమెకు ఇద్దరు కూతుళ్లతో పాటు ఓ కుమారుడు ఉన్నారు. ఆ మహిళ ఓ వ్యక్తితో సహజీవనం చేస్తుండగా కొద్దిరోజుల క్రితం వీరిద్దరు దొంగతనం కేసులో అరెస్టయ్యారు. దీంతో పిల్లలు దిక్కులేని వారయ్యారు. పెద్దకూతురు స్థానిక కేజీబీవీలో 8వ తరగతి చదువుతోంది. మరో కుమార్తె కుబీర్ ఆశ్రమ పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. కుమారుడు వివేకానంద ఆవాసంలో 3వ తరగతి చదువుతున్నాడు. అయితే వేసవి సెలవులు వచ్చినా ఇంటికి వెళ్లలేని పరిస్థితి ఈ ముగ్గురు పిల్లలది. ఓ బాలిక నిర్మల్ బాలసదన్‌కు వెళ్లగా, మరో బాలిక కేజీబీవీ సమ్మర్ క్యాంపు ఉండటంతో అక్కడే ఉండిపోయింది. బాలుడు తాను చదువుతున్న వివేకానంద ఆవాసంలోనే ఉంటున్నాడు. ఇలా వీరు ముగ్గురూ సెలవుల్లోనూ వేర్వేరు చోట్లే ఉండాల్సి వచ్చింది. అమ్మానాన్నలు లేక బంధువులు ఆదరించక..అమ్మా నాన్నలు చిన్నతనంలోనే వివిధ కారణాలతో చనిపోవడంతో, బంధు వులు బాలసదన్‌లో చేర్పించడంతో వారి వయసుకు అనుగుణంగా బాలిక లనైతే కేజీబీవీల్లో, బాలురను సంక్షేమ గురుకులాల్లో ప్రభుత్వం చదివిస్తోంది. సెలవుల్లో వీరంతా తాము ఎక్కడ ఏ బాలసదన్‌లో ఉంటున్నారో అక్కడికే వెళ్లిపోవాల్సి ఉంటుంది. మళ్లీ స్కూళ్లు తెరిచాకే వారు హాస్టళ్లకు తిరిగి వచ్చేందుకు వీలవుతుంది. వేసవి సెలవులు ప్రారంభమైన నేపథ్యంలో బుధవారం రాష్ట్రంలో అలాంటి విద్యార్థులంతా తమ తమ బాలసదన్‌లకు చేరుకున్నారు. ఇదీ చదవండి: ఉద్యోగం కోసం వెళ్లి, 42 ఏళ్లు అక్కడే మగ్గిపోయాడు...చివరికిఆవేదనలో అనాథ విద్యార్థులుహాస్టళ్లలో ఉన్న ఇతర పిల్లలను వారి అమ్మానాన్నలు వచ్చి తీసుకెళుతుంటే దీనంగా చూడటం ఈ అనాథ పిల్లల వంతయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లోని గురుకులాలు, కేజీబీవీల్లో ఇలాంటి దృశ్యాలు కన్పించాయి. తమ కోసం ఎవరూ లేరనే ఆవేదన కొంచెం ఎదిగిన పిల్లల్లో స్పష్టంగా కన్పించింది. అప్పటివరకు స్కూల్లో చదువుకుంటూ, హాస్టళ్లలో తోటి విద్యార్థులతో సరదాగా గడిపిన వీరంతా బిక్క మొహాలు వేయడం ఇతర పిల్లల తలిదండ్రులను కదిలించింది. ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి వారిని ఆవేదనకు గురి చేసింది. తమ పిల్లలు వారికి ఉత్సాహంగా బై బై చెబుతుంటే వారి గుండెలు బరువెక్కాయి. ఈ సందర్భంగా కొందరు అనాథ పిల్లలు కంట తడి పెట్టడంతో తోటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అక్కడి సిబ్బంది, బాలసదన్‌ల నిర్వాహకులు కూడా కంట తడి పెట్టారు. నిర్మల్ జిల్లాలో బైంసా మండల కేంద్రంలో వేర్వేరు స్కూళ్లలో చదువుతున్న ముగ్గురు పిల్లలకు సెలవులు వచ్చినా.. అమ్మా నాన్నలు లేక, తీసుకెళ్లేవారు లేక సెలవుల్లోనూ వేర్వేరు ప్రాంతాల్లో ఉండి కలుసుకోలేని పరిస్థితి కదిలించింది. అయితే తల్లిదండ్రులు లేని కొందరు విద్యార్థులను వారి సంరక్షకులుగా ఉన్న బంధువులు తీసుకెళ్లడం కన్పించింది.చదవండి: ఒక్కో బనానా రూ.565, బీర్ ధర రూ. 1,697, ఎక్కడో తెలుసా? -సాక్షి ప్రతినిధి, నల్లగొండ -
నల్గొండలో కల్తీకల్లు కలకలం.. ఏడుగురికి అస్వస్థత
సాక్షి,నల్గొండ : నల్లగొండ జిల్లాలో కల్తీ కల్లు కలకలం సృష్టిస్తోంది. శాలిగౌరారం మండలం, పెరిక కొండారం గ్రామంలో కల్తీకల్లు తాగి ఏడుగిరి పరిస్థితి విషమంగా మారింది.కల్తీ కల్లు తాగిన తర్వాత అస్వస్థతకు గురి కావడంతో అప్రమత్తమైన స్థానికులు బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం నకిరేకల్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందుతోంది. వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
నల్గొండ: గులాబీ జోష్
కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడ, నల్లగొండలో సోమవారం టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్మాత్మకంగా చేపట్టిన సభలు సక్సెస్ అయ్యాయి. ఆయా సభలకు భారీగా జనసమీకరణ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా నియోజకవర్గ సమస్యలు ప్రస్తావిస్తూనే.. హామీలు ఇచ్చారు. పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ఇక్కడికి వచ్చి అన్నీ తన పర్యవేక్షణలో.. అభివృద్ధి చేస్తానని ప్రజలకు భరోసా ఇచ్చారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేసీఆర్ సభలు విజయవంతం కావడంతో ఆ పార్టీ శ్రేణులు జోష్ మీద ఉన్నాయి. ఎన్నికలొచ్చాయంటే గాలి గాలి కావొద్దు. మిర్యాలగూడలో భాస్కర్‌రావును గెలిపిస్తే మంచి జరుగుతుంది. అధికారంలోకి వచ్చిన ఏడెనిమిది నెలల్లోనే ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తా. మిర్యాలగూడ ప్రాంతంలో సిమెంట్ పరిశ్రమలు ఉన్నందున లారీలు ఎక్కువగా ఆంధ్రాకు వెళ్తాయని, రెంటు ట్యాక్సీలు చెల్లించాల్సి వస్తుందని నా దృష్టికి వచ్చింది. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో మాట్లాడి లారీలకు సింగిల్ పర్మిట్ చేయిస్తా. – మిర్యాలగూడ సభలో సీఎం కేసీఆర్ మిర్యాలగూడకు అండగా ఉంటా:ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తాం ఐటీఐ లేదా పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు ఎత్తిపోతల పథకాల ద్వారా చివరి భూములకు నీరందిస్తా మిర్యాలగూడ : అద్భుతమైన తెలంగాణ కోసం మీ అందరి దీవెన, మద్దతు ఉండాలని.. మిర్యాలగూడకు అండదండగా ఉంటానని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ అన్నారు. సోమవారం మిర్యాలగూడలోని ఎన్ఎస్పీ క్యాంపు గ్రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు విజయం కోసం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని మాట్లాడారు. ఎన్నికలు వచ్చాయంటే గాలి గాలి కావద్దని, మిర్యాలగూడలో భాస్కర్‌రావును గెలిపిస్తే మంచి జరుగుతుందన్నారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో ఉన్న దామరచర్ల మండలంలోని కాలువ చివరి భూముల్లో ఎత్తిపోతల పథకాలు నిర్మించి సాగునీరందిస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడెనిమిది నెలల్లోనే ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తానన్నారు. అదే విధంగా మిర్యాలగూడ ప్రాంతంలో సిమెంట్ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నందున లారీలు ఎక్కువగా ఆంధ్రాకు వెళ్తాయని, అందుకు రెంటు ట్యాక్సీలు చెల్లించాల్సి వస్తుందని తనదృష్టికి వచ్చిందన్నారు. కాగా అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిలో మాట్లాడి లారీలకు సింగిల్ పర్మిట్ చేయిస్తానని హామీ ఇచ్చారు. మిర్యాలగూడ : ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడుతున్న ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ చిత్రంలో టీఆర్ఎస్ అభ్యర్థి నలమోతు భాస్కర్‌రావు మిర్యాలగూడలో మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తానని, అదే విధంగా ఐటీఐ కళాశాల లేదా పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేస్తానని అన్నారు. సభలో టీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, నల్లగొండ ఎంపీ, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు రామచంద్రనాయక్, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ తిరునగరు నాగలక్ష్మిభార్గవ్, నాయకులు తిరునగరు భార్గవ్, చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, నారాయణరెడ్డి, చిర్ర మల్లయ్యయాదవ్, మోసిన్‌అలీ, మార్కెట్ కమిటీ చైర్మన్ చిట్టిబాబునాయక్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎడవెల్లి శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల వైస్ చైర్మన్ మగ్దూమ్‌పాష, జెడ్పీటీసీ నాగలక్ష్మి, పద్మ, ఎంపీపీలు రవీనా కరుణాకర్‌రెడ్డి, నూకల సరళ, అన్నభీమోజు నాగార్జునచారి, పెద్ది శ్రీనివాస్‌గౌడ్, నామిరెడ్డి యాదగిరిరెడ్డి, గార్లపాటి నిరంజన్‌రెడ్డి, మట్లపల్లి సైదయ్యయాదవ్, నామిరెడ్డి కరుణాకర్‌రెడ్డి, నవీన్‌రెడ్డి, ఖాసీం పాల్గొన్నారు. మిర్యాలగూడకు ఉద్యమ చరిత్ర : మిర్యాలగూడకు తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉంది. మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి తండ్రి తిప్పన కిష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తెలంగాణ ఉద్యమం భారీగాసాగింది. జైలుకు కూడా వెళ్లారు. మర్రి చెన్నారెడ్డితో కలిసి ఒకసారి తిప్పన కృష్ణారెడ్డి మా ఇంటికి వచ్చిండు. ఆ తర్వాత కూడా తెలంగాణ ఉద్యమంలో మిర్యాలగూడకు చరిత్ర ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. మీ అవసరాలన్నీ స్వయంగా చూస్తా: హుజుర్నగర్ : ‘పోయిన సారి మీరు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. మళ్లీ 100 శాతం టీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తది. టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తేనే మీకు లాభం జరుగుతుంది. కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే మళ్లీ పాత పాట..లాభం జరగదు. అధికార పార్టీ అభ్యర్థి సైదిరెడ్డిని గెలిపించాలి. ఇంత పెద్ద సంఖ్యలో వచ్చారంటే సైదిరెడ్డి గెలుపు ఖామమైంది. ఇందులో అనుమానమే లేదు. గత టర్మ్‌లో రాష్ట్రం కొత్తగా వచ్చింది.. ఆర్థిక ప్రాతిపదిక లేదు.. వాటన్నింటినీ కూర్పు చేయడంతో నా సమయం రాజధానిలోనే ఎ క్కువ గడిచింది. ఈ ఎన్నికల తర్వాత నేనే స్వయంగా హుజుర్నగర్ వచ్చి ఒక రోజు అంతా ఉండి మీ అవసరాలు.. స్థానిక పరిస్థితులు మొత్తం నేనే బేరీజు వేస్తా. అవసరమైన ఆర్డర్లు ఇక్కడే ఇచ్చి అన్ని రకాలుగా.. చేస్తా. యువకుడు సైదిరెడ్డి నా ఇంట్లో మనిషిగా లాగా ఉంటాడు. నాకు వ్యక్తి గతంగా చాలా దగ్గరి సన్నిహితుడు. అందుకే అతన్ని గెలిపించండి. అతని నాయకత్వంలో హుజుర్‌నగర్‌కు కావాల్సిన పనులన్నీ నేనే స్వయంగా వచ్చి చేసి పెడతా’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ హుజుర్నగర్ ప్రజా ఆశీర్వాద సభలో సైదిరెడ్డి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. సైదిరెడ్డి నా సన్నిహితుడు..ఆయనను గెలిపించండి : సీఎం కేసీఆర్ సభలో హుజుర్నగర్ గురించి కేసీఆర్ చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే.. హుజుర్నగర్లో సైది రెడ్డి గాలి బాగుంది. మీరందరూ నిఖార్సుగా హుజుర్నగర్ వాసులే. ఎందుకంటే అటు వైపు మిర్యాలగూడ, ఇటు వైపు కోదాడలో సభ ఉంది. ఇంత పెద్దగా వచ్చారంటే సైదిరెడ్డి విజయం సాధించినట్లే. హుజుర్నగర్ సభ, మీ ఉత్సాహం చూసిన తర్వాత నాకు సంపూర్ణ విశ్వాసం కలిగింది. ప్రజాస్వాయ్యంలో చాలా సందర్భాల్లో చాలా ఎన్నికలు జరుగుతాయి. పార్టీలు.. అనేక మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తారు. నిజమైన ప్రజాస్వామ్యంలో గెలవాల్సింది.. పార్టీల అభ్యర్థులు కాదు.. ప్రజల అభిప్రాయం గెలవాలి. లేదంటే గాలిగాలి గందరగోళం ఉం టుంది. మనం అనుకున్న పనులు జరగవు. మనం నిందిస్తాం.. తిడతాం కానీ లాభం జరగదు. ఒక్క సారి చేయి జారితే, మన చేతుల్లో ఏమీ ఉండదు. ఓటు వేసే ముందు ఆలోచించి వివేచనతో.. ప్రజ లకు ఏది మంచి అయితే అది చేయాలి.. ఏమోషన్లో చేయవద్దు. ఈ ఎన్నికల్లో మీ కు పెద్ద కన్ఫ్యూజన్ లేదు. 58 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, టీడీపీ కూటమి ఒక వైపు.. 15 ఏళ్లు కొట్లాడి తెలంగాణ సాధి ం చి.. గతంలో మీ ఆశీస్సులతో గెలిచి నా లుగేళ్లు పాలించిన టీఆర్ఎస్ ఒక వైపు ఉం ది. ఎవ్వరూ దీంట్లో కొత్త వాళ్లులేరు.. అంతా పాత వాళ్లే. మీకు కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ కొత్తకాదు. ఓటు వేసే ముందు ఆలోచించండి. మిర్యాలగూడ, హుజుర్నగర్ ప్రాంతా ల్లో ఉద్యమ జెండాలు ఎగుర వేశాం. మీరందరూ వాస్తవాలు గమనించి ఓటు వేయాలి. పథకాల అమలులో దేశానికే ఆదర్శం : బడుగుల సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. తెలంగాణ కేవలం నా లుగున్నర ఏళ్లలోనే సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ వైపు పరుగులు పెట్టించాడన్నారు స్థానికుడైన శానంపూడి సైదిరెడ్డిని గెలిపించేందుకు నియోజకవర్గ ప్రజలంతా ఇప్పటికే సిద్ధమయ్యారని ఆయన నామినేషన్ దాఖలు చేసిన రోజే తేలిపోయిందన్నారు. మట్టికి పోయినా ఇంటి వాడు కావాలి .. మట్టికి పోయినా ఇంటి వాడుకావాలి అనే నానుడిని నిజం చేస్తూ స్థానికుడైన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిని గెలిపించాలని మునిసిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సభలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామా భరత్‌కుమార్, జిన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి, చిలకరాజు నర్సయ్య, నర్సింగ్ వెంకటేశ్వర్లు, ముడెం గోపిరెడ్డి, ఆదెర్ల శ్రీనివాసరెడ్డి, రామనర్సింహరెడ్డి, యామిని వీరయ్య, కస్తాల కోటమ్మరామయ్య, గీతారాంచందర్నాయక్,సుంకర క్రాంతికుమార్, జక్కుల నాగేశ్వరరావు,రాజారావు, బెల్లంకొండ అమర్, కోతిసం పత్రెడ్డి, గుండా బ్రహ్మారెడ్డి, గెల్లి రవికుమార్, రామకృష్ణ పాల్గొన్నారు. మీ బిడ్డగా.. ఆశీర్వదించాలి : సైదిరెడ్డి మీ బిడ్డగ ముందుకు వచ్చా ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసి చూపిస్తానని ఎమ్మెల్యే అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు. అశేష ప్రజానీకాన్ని చూశాక తన గెలుపు ఖాయమైందన్నారు. నియోజకవర్గంలో రాజకీయాలను అపవిత్రం చేసిన మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్‌రెడ్డిని సాగనంపేందుకు ప్రజలంతా సిద్ధమయ్యారన్నారు. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన నేటి వరకు ప్రజలకు అందుబాటులో లేకుండా చుట్టం చూపుగా వచ్చి పోతున్నారన్నారు. ఎ మ్మెల్యేగా గెలిపిస్తే మరో సిద్దిపేటలాగా అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చాడు. తన గెలుపునకు కృషి చేస్తున్న టీఆర్ఎస్ పార్టీతో పాటు తనకు మద్దతు తెలుపుతున్న వైఎస్సార్సీపీ, జనసేన, ఎంఐఎం పార్టీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
టీడీపీలో చేరిక
నల్లగొండ : పట్టణానికి చెందిన సుమారు 50 మంది జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నల్లగొండ టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ మాదగోని శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో తెలంగాణ విద్యార్థి జేఏసీ నాయకుడు ఏరుకొండ హరి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఆకునూరి సత్యనారాయణ, కభంపాటి రాజు, రాము, జాని, అశోక్, రవీందర్‌యాదవ్, శ్రవణ్, జానయ్య గౌడ్, నరేష్, శ్రీను, హేమంత్ , రాష్ట్ర బీపీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎల్వీ యాదయ్య, మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు ఎండీ రియాజ్ అలీ, ఇంతియాజ్ అలి, కత్తుల సందీప్ తదితరులు పాల్గొన్నారు. -
నల్లగొండ ఉపఎన్నిక.. బరిలో భూపాల్‌రెడ్డి!
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దు నిబంధనల ప్రకారమే జరిగిందా లేదా అనే చర్చ కొలిక్కిరాకముందే, ఈ వ్యవహారంపై ఈసీ నిర్ణయం తీసుకోకముందే అధికార పార్టీలో ఉప ఎన్నికల హడావిడి మొదలైంది. ‘సంపత్ కుమార్ ప్రాతినిధ్యవ వహిస్తున్న ఆలంపూర్ శాసనసభ స్థానం, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న నల్లగొండ స్థానాలు రెండూ ఖాళీ అయిన’ట్లు తెలంగాణ ప్రభుత్వం మంగళవారమే ఎన్నికల కమిషన్‌కు సమాచారం అందించింది. దీంతో ఉప ఎన్నికపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఈ వ్యవహారంపై ఈసీ ఇంకా స్పందిచనప్పటికీ టీఆర్ఎస్లో మాత్రం టికెట్ల వ్యవహారం తారాస్థాయికి చేరింది. ఆశావాహుల జాబితా రోజురోజుకూ పెరుగుతోంది. టికెట్ ఆశిస్తున్నవారిలో ఉద్యమకారుల కంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల సంఖ్యే ఎక్కువగా ఉండటం గమనార్హం. 20న ప్రకటన? : నల్లగొండ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ తరఫున కంచర్ల భూపాల్‌రెడ్డి పోటీచేస్తారని కొద్ది గంటలుగా పెద్ద ఎత్తునప్రచారం సాగుతోంది. భూపాల్‌రెడ్డి గత ఎన్నికల్లో టీడీపీ తరఫున కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(కాంగ్రెస్)పై పోటీ చేసి ఓడిపోయారు. ఆతర్వాత ఆయన గులాబీ గూటికి చేరారు. నాటి ఎన్నికల్లో భూపాల్ గణనీయంగా ఓట్లు సాధించడంతో టీఆర్ఎస్ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆయనకున్న ప్రజాదరణను బట్టి పార్టీలో చేర్చుకోవడమేకాక నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గానూ బాధ్యతలు కట్టబెట్టారు టీఆర్ఎస్ పెద్దలు. ఇప్పటికే నల్లగొండలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న టీఆర్ఎస్ ఈ నెల 20న ప్రగతి సభను నిర్వహించాలని భావిస్తున్నది. ఆ సభలోనే భూపాల్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక ఆలంపూర్ నియోజకవర్గ అభ్యర్థిపై తర్జనభర్జన నడుస్తున్నట్లు సమాచారం. ఉప ఎన్నిక, అభ్యర్థుల ఎంపికలకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికార ప్రకటనలు లేవు. -
నల్లగొంద దశ..దిశ మారుస్తా
నల్లగొండ టుటౌన్, న్యూస్‌లైన్ : నల్లగొండ పట్టణాన్ని ఊహించని విధంగా అభివృద్ధి చేసి దశ... దిశ మారుస్తానని నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి మున్సిపాలిటీ పరిధిలోని 4,5,9,10,11వ వార్డుల్లో విస్తృతం గా పర్యటించారు. ఇంటింటికీ తిరిగి తమకు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ యువతకు ఉపాధి, ఉద్యోగులకు భద్రత, వికలాంగులు, వితంతువులు, వృద్ధులకు పింఛన్లు రూ.1000కి పెంచుతామన్నారు. పానగల్ వెంకటేశ్వరస్వామి దేవాల యాన్ని 50లక్షలతో అభివృద్ధి చేశామని, పానగల్లో పురాతన చారిత్రక ఆలయాలను అభివృద్ధి చేయడంతో పాటు రిజర్వాయర్ పరిసర ప్రాంతాలను పర్యాటక కేంద్రంగా మారుస్తానని తెలిపారు. శ్రీశైలం సొరంగ మార్గానికి తాను రూ.2000 కోట్లు మంజూరు చేయించానని, తెలంగాణ రాష్ట్రంలో దాన్ని పూర్తి చేయించి రైతాంగానికి సాగునీరు, అన్ని గ్రామాల్లోని ఇంటింటికీ కృష్ణాజలాలు అంది స్తానని హామీ ఇచ్చారు. బ్రహ్మణ వెల్లంల పథకాన్ని పూర్తి చేసి జిల్లాను సస్యశామలం చేయడమే తన ముందున్న కర్తవ్యమన్నారు. జిల్లాలో జాతీయ రహదారులున్నందున వాటి వెంట పరిశ్రమలు నెలకొల్పించి ఇండస్ట్రియల్ కారిడార్‌గా మార్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తానని స్పష్టం చేశారు.నల్లగొండ నుంచి మూడుసార్లు గెలిపించిన ఓటర్లు నాల్గవసారి తనను తెలంగాణ రాష్ట్రంలో భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. నల్లగొండలో మెడికల్ కాలేజీ మంజూరు చేయిస్తానని.. దీంతో పాటు 750 పడకల అనుబంధ ఆస్పత్రి ఏర్పాటు చేయించి పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తానని తెలిపారు. నల్లగొండ పట్టణంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, ఎస్టీపీ నిర్మాణం కోసం రూ.30 కోట్లు మంజూరు చేయించి 6నెలల్లో పూర్తి చేయిస్తానని చెప్పారు. ఇప్పటికే నిధులు మంజూరయ్యాయని ఎన్నికలకోడ్ సందర్భంగా పనులు ప్రారంభించలేకపోయానని తెలిపారు. ప్రభు త్వ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగుల భద్రతకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా రుణం తీర్చుకునేందుకు హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలి పించాలన్నారు. ఈ కార్యక్రమంలో గుత్తా తనయుడు అమిత్‌రెడ్డి, నాయకులు పుల్లెంల వెంకటనారాయణగౌడ్, చింతకుంట్ల రవీందర్‌రెడ్డి, నాగరత్నం రాజు, కత్తులకోటి, బొంత వెం కన్న, వెంకట్‌రెడ్డి, కళావతి, కోమటిరెడ్డి అం జిరెడ్డి, బొడ్డుపల్లి శ్రీను, నాంపల్లి శ్రీను, బొంతరేణుక, గుండగోని యాదయ్య, సురిగి మారయ్య, యామ దయాకర్ పాశం రాంరెడ్డి, రఘువీర్, లింగస్వామి పాల్గొన్నారు. -
సోనియా రుణం తీర్చుకుందాం: కోమటిరెడ్డి
నల్లగొండ సభలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి పిలుపు సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు 60 ఏళ్లలో ఎన్నో పోరాటాలు జరిగాయి. వేలాది మంది విద్యార్థులు, యువకులు ఆత్మ బలిదానాలు చేశారు. ఈ ఆరు దశాబ్దాల్లో ఎందరో ప్రధానమంత్రులు వచ్చారు, పోయారు కానీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మాత్రం సోనియాగాంధీయే. ఇచ్చిన హామీని ఆమె నిలబెట్టుకున్నారు. ఈ ప్రాంత ప్రజల కలలను నిజం చేసిన దేవత సోనియమ్మ. ఆమె రుణాన్ని ఈ ఎన్నికల ద్వారా తీర్చుకుందాం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను భారీ మెజార్టీతో గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానిని చేద్దాం’ అని మాజీ మంత్రి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పిలుపు ఇచ్చారు. బుధవారం నల్లగొండ అసెంబ్లీ స్థానానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి , భువనగిరి లోక్‌సభా స్థానానికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. అనంతరం కోమటిరెడ్డి సోదరుల ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రె స్ జయభేరి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. సామాజిక తెలంగాణ కాంగ్రెస్‌తోనే సాకారమవుతుందని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు న్యాయం జరిగాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ, టీడీపీ, బీజేపీలది అనైతిక పొత్తు అని అన్న ఆయన, టీడీపీకి ఓటేస్తే.. మూసీ నదిలో వేసినట్టేనని వ్యాఖ్యానించారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ, రాహుల్‌ను ప్రధాని చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.