సాక్షి,నల్గొండ : నల్లగొండ జిల్లాలో కల్తీ కల్లు కలకలం సృష్టిస్తోంది. శాలిగౌరారం మండలం, పెరిక కొండారం గ్రామంలో కల్తీకల్లు తాగి ఏడుగిరి పరిస్థితి విషమంగా మారింది.కల్తీ కల్లు తాగిన తర్వాత అస్వస్థతకు గురి కావడంతో అప్రమత్తమైన స్థానికులు బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం నకిరేకల్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందుతోంది. వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment