Kaltikallu
-
నల్గొండలో కల్తీకల్లు కలకలం.. ఏడుగురికి అస్వస్థత
సాక్షి,నల్గొండ : నల్లగొండ జిల్లాలో కల్తీ కల్లు కలకలం సృష్టిస్తోంది. శాలిగౌరారం మండలం, పెరిక కొండారం గ్రామంలో కల్తీకల్లు తాగి ఏడుగిరి పరిస్థితి విషమంగా మారింది.కల్తీ కల్లు తాగిన తర్వాత అస్వస్థతకు గురి కావడంతో అప్రమత్తమైన స్థానికులు బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం నకిరేకల్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందుతోంది. వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
‘కల్తీ’ కల్లు కల్లోలం! మహబూబ్‌నగర్‌లో పెరుగుతున్న బాధితులు
సాక్షి, మహబూబ్‌నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో కల్తీ కల్లు కల్లోలం సృష్టిస్తోంది. కల్తీ కల్లు (మందు కల్లు) తాగి అస్వస్థతకు గురై మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి వస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నెల ఏడో తేదీ నుంచి ఇప్పటివరకు సుమారు 32 మంది రాగా.. 23 మంది వరకు అప్పటికప్పుడే చికిత్స పొంది డిశ్చార్జి అయినట్లు సమాచారం. అయితే దీనిని ఆస్పత్రి అధికారులు గానీ, ఎక్సైజ్ శాఖ గానీ ధ్రువీకరించడం లేదు. అయితే సోమవారం ఒక వ్యక్తి మరణించడం, ఇందుకు కల్తీ కల్లే కారణమనే అనుమానాలు వ్యక్తం కావడం కలకలం రేపుతోంది. కల్తీ కల్లు తాగిన మరో ఇద్దరు ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరి మృతి మహబూబ్‌నగర్ మండలం కోడూరు గ్రామానికి చెందిన హరిజన ఆశన్న (58) ఈ నెల పదో తేదీ తెల్లవారుజామున మరణించాడు. అతను ఈనెల 9న మధ్యాహ్నం దొడ్డలోనిపల్లిలోని దుకాణంలో కల్లు తాగాడని.. ఇంటికెళ్లిన తర్వాత పిచ్చిపిచ్చిగా ప్రవర్తించాడని సమాచారం. మాటలు తడబడడం, చేతులు, మూతి వంకర్లు తిరగడంతో రాత్రి 108 అంబులెన్స్‌లో బంధువులు అతడిని జిల్లా జనరల్ ఆస్పత్రిలో చేర్చారు. ఈ క్రమంలో అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఐసీయూలో చికిత్స పొందుతూ ఆశన్న తెల్లవారుజామున 1.15 గంటల ప్రాంతంలో మృతి చెందాడు. వైద్యులు సోమవారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. అతడి తమ్ముడు బెంగళూరు నుంచి వచ్చేసరికి సమయం పట్టడంతో మంగళవారం దహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ విషయాన్ని ఆస్పత్రి వర్గాలు, ఎక్సైజ్‌శాఖ గోప్యంగా ఉంచడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో ఇద్దరు ఐసీయూలో.. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఐసీయూలో మరో ఇద్దరు కల్తీ కల్లు బాధితులు చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. మహబూబ్‌నగర్ పట్టణంలోని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన విష్ణుబాబు భూత్పూర్ మండలం అమిస్తాపూర్‌లో పోస్టల్ శాఖలో ఏబీపీఎంగా చేస్తున్నాడు. ఆయనతో పాటు దొడ్డలోనిపల్లి గ్రామానికి చెందిన రేణుక ఐసీయూలో చికిత్స పొందుతోంది. విష్ణుబాబుకు వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తుండగా.. పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. దొడ్డలోనిపల్లికి చెందిన రేఖతో పాటు మరో ఆరుగురికి సాధారణ వార్డులో చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. ఆ్రల్ఫాజోలం మోతాదులో తేడా వల్లేనా.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా మందు కల్లు విక్రయాలు జోరుగా సాగుతుంటాయి. కల్లులో ప్రధానంగా నిషేధిత మత్తు పదార్థం ఆ్రల్ఫాజోలంను కలుపుతున్నారు. అయితే మోతాదులో తేడా రావడం వల్లే బాధితులు పిచి్చపిచి్చగా ప్రవర్తిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆస్పత్రిలో అడ్మిట్ అయిన అందరిలో మెడ తిమ్మిర్లు, చేతులు వణకడం, తలవెనక్కి వాలడం, నాలుక బయటకు రావడం, నత్తి, శరీరంలో చలనం లేకపోవడం వంటి లక్షణాలు కన్పిస్తున్నాయి. ఎవరూ కల్లు తాగి అడ్మిట్ కాలేదు.. కల్తీ కల్లు తాగి ఆస్పత్రిలో ఎవరూ ఆడ్మిట్ కావడం లేదు. కేవలం వింత వింత ప్రవర్తనతో పాటు ఫిట్స్ ఇతర సమస్యలతో వస్తున్నారు. ఈనెల 7 నుంచి 10వ తేదీ వరకు దాదాపు 25 మంది వరకు ఇలాంటి లక్షణాలతో ఆడ్మిట్ అయ్యారు. వీరిలో కొందరికి ఊపిరితిత్తుల సమస్యతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నట్లు నిర్ధారించాం. అందరికీ కావాల్సిన చికిత్స అందించి డిశ్చార్జి చేయడం జరుగుతుంది. – డాక్టర్ రామకిషన్, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఐదురోజులుగా ఆస్పత్రిలోనే.. మహబూబ్‌నగర్ పట్టణంలోని మోతీనగర్ ప్రాంతానికి చెందిన ఇంద్రజ ఈ నెల 7న కల్లు తాగి అస్వస్థతకు గురికావడంతో ప్రభుత్వ ఆస్పత్రిలో ఆడ్మిట్ అయింది. ఆమె మాట్లాడలేని స్థితిలో ఉంది. సపర్యలు చేస్తున్న ఆమె తల్లి మాట్లాడుతూ.. ‘ఐదు రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాం..ఇంద్రజకు కల్లు తాగే అలవాటు ఉంది.. పిచి్చపిచి్చగా ప్రవర్తించడంతో ఆస్పత్రికి తీసుకొచ్చాం..’ అని తెలిపింది. చదవండి: అదిరిపోయే ఎండలు.. -
వింతగా ప్రవర్తిస్తున్న కల్తీ కల్లు బాధితులు
-
కల్తీ కేరాఫ్.. ఆ నలుగురు!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఓ ఇద్దరు కల్లు డిపోల నిర్వాహకులు..ఓ మద్యం వ్యాపారి..ఓ నకిలీ లిక్కర్ తయారీదారు.. ఉమ్మడి పాలమూరులో కల్తీ కల్లు, నకిలీ మద్యం దందాకు కేరాఫ్ వీళ్లేననే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరికి ఓ అధికారి అండగా నిలుస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. అక్రమాలను అరికట్టాల్సిన ఓ ఎక్సైజ్ అధికారి కనుసన్నల్లో సిబ్బంది నిర్బంధ వసూళ్లకు పాల్పడుతుండగా, కల్లు డిపోల నిర్వాహకులు, మద్యం వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కల్లులో మత్తు కోసం కలిపే ఆల్ఫ్రాజోలం, సీహెచ్, డైజోఫాం.. లిక్కర్లో ఘాటు పెంచే స్పిరిట్ సరఫరా జోరుగా సాగుతోంది. మరోవైపు పేరున్న మద్యం బ్రాండ్లలో మూతలు తీసి నీరుపోసేందుకు ఓ ముఠా ఇటీవల సరిహద్దులు దాటి వచ్చి ఐదు జిల్లాల్లో కార్యకలాపాలు విస్తరించింది. అయినా విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ నిద్ర‘మత్తు’వీడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార’పార్టీ నేతల బినామీలే కల్తీ కల్లు, నకిలీ మద్యం దందా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎక్సైజ్‌శాఖ చేతులెత్తేసిందనే ఆరోపణలు విని్పస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా పరిధిలో మద్యం, కల్లు కల్తీ రాకెట్ సూత్రధారులు, పాత్రధారులపై ‘సాక్షి’ప్రత్యేక కథనం.. ఇద్దరి కీలక పాత్ర ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్, నారాయణ పేట, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లా లకు ఆ్రల్ఫాజోలం, సీహెచ్, డైజోఫాం సరఫరా చేయడంలో మహబూబ్‌నగర్‌కు చెందిన ఇద్దరు కీలకంగా వ్యవహరిస్తున్నారు. సరిహద్దు రాష్ట్రమైన కర్ణాటకతో పాటు ఢిల్లీ, హైదరాబాద్ నుంచి ఈ నిషేధిత పదార్థాలను గుట్టుచప్పుడు కాకుండా జిల్లాకు దిగుమతి చేసుకుంటున్నారు. ఎవరికి వారు జిల్లాలు, మండలాలు, ప్రాంతాల వారీగా పంచుకుని ఏజెంట్లను పెట్టుకుని కోడ్ భాష ఆధారంగా సరుకును ఆయా డిపోలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. నువ్వా? నేనా? మహబూబ్‌నగర్ పట్టణ శివారులో ఆ ఇద్దరికి సంబంధించిన కల్లు కాంపౌండ్లు దగ్గర దగ్గరగా ఉన్నాయి. అటు నిషేధిత మత్తు పదార్థాల రవాణాతో పాటు సదరు కాంపౌండ్లలో కల్లు విక్రయాల్లో కూడా ఇద్దరి మధ్య పోటీ నెలకొంది. ఇందులో ఒకరికి పట్టణ ప్రధాన కూడలిలో టైర్ల షాపు ఉంది. ఇతను తన పోటీదారుడిని, అతడి కాంపౌండ్‌లోకి కల్లు తాగేందుకు వెళ్లేవారిని బౌన్సర్లతో నిత్యం బెదిరింపులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ ముఖ్యనేత అండదండలు తనకే ఉన్నాయని సదరు వ్యక్తి దబాయిస్తుండగా, ప్రస్తుతం ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వార్ నడుస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ పంచాయితీ సదరు ముఖ్యనేత వద్దకు చేరడంతో, తాను సమస్య పరిష్కరిస్తానని, గొడవలు పడొద్దని మందలించినట్లు సమాచారం. బ్రాండెడ్ మద్యం బాటిళ్లలో నీళ్లు! ఇక ఉమ్మడి జిల్లాలో చీప్ లిక్కర్ అమ్మకాలు ఎక్కువగా సాగుతుండడంతో వాటిలో స్పిరిట్ కలుపుతూ కల్తీ చేస్తున్నారు. అంతేకాదు వైన్స్లతోపాటు బార్లలో బ్రాండెడ్ కంపెనీలకు సంబంధించిన లిక్కర్ బాటిళ్లలో 40 శాతం మేర మద్యం తీసి నీరు కలుపుతున్నట్లు తెలుస్తోంది. దీని వెనుక ఓ మద్యం వ్యాపారి హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సదరు వ్యాపారి ఆధ్వర్యంలోనే వికారాబాద్ నుంచి వచి్చన ఎవరూ కనిపెట్టని విధంగా లిక్కర్ మూతలు తీసి, పెట్టే గ్యాంగ్ పాలమూరులో కార్యకలాపాలను విస్తరించినట్లు సమాచారం. మునుగోడులో కల్తీ లిక్కర్ వెనుక గద్వాల కింగ్! నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కల్తీ లిక్కర్ ఏరులై పారింది. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో దీన్ని గుర్తించిన అధికారులు కూపీ లాగారు. అనుమతి లేకుండా డిస్టిలరీ ఏర్పాటు చేసి నకిలీ మద్యం ఉమ్మడి నల్లగొండతో పాటు రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాకు తరలించినట్లు సమాచారం. ఇందులో బాలరాజుగౌడ్ కీలకంగా వ్యవహరించగా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే గద్వాల జిల్లా పాతపాలెంకి చెందిన లిక్కర్ కింగ్ వెంకన్నగౌడ్ హస్తం కూడా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. కాగా ఇతను కర్ణాటక లిక్కర్‌ను తెలంగాణ, ఏపీకి అక్రమంగా తరలిస్తూ పలుమార్లు పోలీసులకు చిక్కగా ఇరు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. తన స్వగ్రామమైన పాతపాలెంలో నకిలీ మద్యం తయారు చేస్తూ కూడా పట్టుబడ్డాడు. గతేడాది నవంబర్‌లో రూ.10 లక్షల విలువ చేసే 750 కిలోల సీహెచ్‌ను హైదరాబాద్‌లో కొనుగోలు చేసి కర్నూలుకు తరలిస్తున్న క్రమంలో భూత్పూర్ సమీపంలో పట్టుకున్నారు. ఇటీవల ఆయనపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తారనే ప్రచారం జరిగినప్పటికీ బైండోవర్‌తో సరిపెట్టడం చర్చనీయాంశంగా మారింది. -
కల్తీకల్లు కలకలం.. ఎక్సైజ్ దాడులు
సిరిసిల్ల: కల్తీకల్లు తాగి 20 మంది అస్వస్థతకు గురైన సంఘటనతో ఎక్సైజ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. కల్తీకల్లు విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేసి రంగంలోకి దిగారు. సిరిసిల్ల జిల్లా మద్దమల్లలో గురువారం కల్తీ కల్లు బారిన పడి 20 మంది అస్వస్థతకు గురై ఎల్లారెడ్డిపేట ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. దీంతో ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం ఉదయం నుంచి దాడులు నిర్వహిస్తున్నారు. కల్లుపాకలపై దాడులు చేసి నమూనాలు సేకరిస్తున్నారు -
కళ్లు తెరిచారు.. కల్లు మానేశారు!
కోహీర్: కల్తీకల్లును పారదోలేందుకు మనియార్‌పల్లి గ్రామస్తులు సిద్ధమయ్యారు. ఇకపై కల్లు విక్రయాలు జరగనివ్వమని గాంధీ విగ్రహం ఎదుట ప్రతిజ్ఞ కూడా చేశారు. ఈ మేరకు శుక్రవారం గ్రామంలోకి వచ్చిన కల్లు లారీని తరిమికొట్టారు. ఇటీవల కల్లు రేటు విషయమై చెలరేగిన వివాదం నిషేధానికి దారితీసింది. ఇదివరకు మనియార్‌పల్లి గ్రామంలో రూ.8కు కల్లు సీసా అమ్మేవారు. గిట్టుబాటు లేక కాంట్రాక్టర్ సీసా రేటు రూ.10కి పెంచాడు. దీంతో మద్యంప్రియులు, కాంట్రాక్టరు మధ్య వివాదం చెలరేగడంతో పంచాయితీ గ్రామపెద్దల వద్దకు చేరింది. శుక్రవారం ఉదయం వారంతా సమావేశ మై.. కల్తీకల్లు వల్ల జరిగే అనర్థాలను ప్రజలకు వివరించారు. దీంతో కల్లును నిషేధించాలన్న ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ విషయాన్ని కోహీర్ పోలీసులకు తెలిపారు. ఏఎస్ఐ రాములు గ్రామానికి చేరుకొని కల్లును నిషేధంపై ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. సంపూర్ణ మద్య నిషేధం కోసం వచ్చే ఆదివారం తిరిగి సమావేశ మవుతామని గ్రామపెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఖదీర్, ఉపసర్పంచ్ ఎం.రాములు, గ్రామపెద్దలు సాయిరెడ్డి, నవాజ్ పటేల్, ఇస్మాయిల్, పాండునాయక్, నర్సిములు, అంజయ్య, మల్లప్ప, పోచయ్య, కిష్టయ్య, ఆశయ్య, గోపాల్, అనంత్రామ్, సత్యమ్మ, పోచమ్మ, నర్సమ్మ తదితరులున్నారు. గాంధీ విగ్రహం ఎదుట ప్రజల ప్రతిజ్ఞ