నల్గొండ: గులాబీ జోష్‌ | CM KCR Meeting In Nalgonda Constituency | Sakshi
Sakshi News home page

నల్గొండ: గులాబీ జోష్‌

Published Tue, Dec 4 2018 8:34 AM | Last Updated on Tue, Dec 4 2018 8:36 AM

CM KCR Meeting In Nalgonda Constituency - Sakshi

ఉమ్మడి జిల్లాలో నాలుగు సభల్లో కేసీఆర్‌ ప్రసంగం

కోదాడ, హుజూర్‌నగర్, మిర్యాలగూడ, నల్లగొండలో సోమవారం టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రతిష్మాత్మకంగా చేపట్టిన సభలు సక్సెస్‌ అయ్యాయి. ఆయా సభలకు భారీగా జనసమీకరణ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేకంగా నియోజకవర్గ సమస్యలు ప్రస్తావిస్తూనే.. హామీలు ఇచ్చారు. పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ఇక్కడికి వచ్చి అన్నీ తన పర్యవేక్షణలో.. అభివృద్ధి చేస్తానని ప్రజలకు భరోసా ఇచ్చారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేసీఆర్‌ సభలు విజయవంతం కావడంతో ఆ పార్టీ శ్రేణులు జోష్‌ మీద ఉన్నాయి

ఎన్నికలొచ్చాయంటే గాలి గాలి కావొద్దు. మిర్యాలగూడలో భాస్కర్‌రావును గెలిపిస్తే మంచి జరుగుతుంది. అధికారంలోకి వచ్చిన ఏడెనిమిది నెలల్లోనే ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తా. మిర్యాలగూడ ప్రాంతంలో సిమెంట్‌ పరిశ్రమలు ఉన్నందున లారీలు ఎక్కువగా ఆంధ్రాకు వెళ్తాయని, రెంటు ట్యాక్సీలు చెల్లించాల్సి వస్తుందని నా దృష్టికి వచ్చింది. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రితో మాట్లాడి లారీలకు సింగిల్‌ పర్మిట్‌ చేయిస్తా.

– మిర్యాలగూడ సభలో సీఎం కేసీఆర్‌ 

మిర్యాలగూడకు అండగా ఉంటా:ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌

  • మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తాం 
  • ఐటీఐ లేదా పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటు 
  • ఎత్తిపోతల పథకాల ద్వారా చివరి భూములకు నీరందిస్తా 

మిర్యాలగూడ : అద్భుతమైన తెలంగాణ కోసం మీ అందరి దీవెన, మద్దతు ఉండాలని.. మిర్యాలగూడకు అండదండగా ఉంటానని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ అన్నారు. సోమవారం మిర్యాలగూడలోని ఎన్‌ఎస్పీ క్యాంపు గ్రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు విజయం కోసం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని మాట్లాడారు. ఎన్నికలు వచ్చాయంటే గాలి గాలి కావద్దని, మిర్యాలగూడలో భాస్కర్‌రావును గెలిపిస్తే మంచి జరుగుతుందన్నారు. నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో ఉన్న దామరచర్ల మండలంలోని కాలువ చివరి భూముల్లో ఎత్తిపోతల పథకాలు నిర్మించి సాగునీరందిస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడెనిమిది నెలల్లోనే ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తానన్నారు. అదే విధంగా మిర్యాలగూడ ప్రాంతంలో సిమెంట్‌ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నందున లారీలు ఎక్కువగా ఆంధ్రాకు వెళ్తాయని, అందుకు రెంటు ట్యాక్సీలు చెల్లించాల్సి వస్తుందని తనదృష్టికి వచ్చిందన్నారు. కాగా అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిలో మాట్లాడి లారీలకు సింగిల్‌ పర్మిట్‌ చేయిస్తానని హామీ ఇచ్చారు.

మిర్యాలగూడ : ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడుతున్న ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ చిత్రంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నలమోతు భాస్కర్‌రావు 
మిర్యాలగూడలో మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తానని, అదే విధంగా ఐటీఐ కళాశాల లేదా పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటు చేస్తానని అన్నారు.  సభలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, నల్లగొండ ఎంపీ, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు రామచంద్రనాయక్, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తిరునగరు నాగలక్ష్మిభార్గవ్,  నాయకులు తిరునగరు భార్గవ్, చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, నారాయణరెడ్డి, చిర్ర మల్లయ్యయాదవ్, మోసిన్‌అలీ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చిట్టిబాబునాయక్, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ ఎడవెల్లి శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల వైస్‌ చైర్మన్‌ మగ్దూమ్‌పాష, జెడ్పీటీసీ నాగలక్ష్మి, పద్మ, ఎంపీపీలు రవీనా కరుణాకర్‌రెడ్డి, నూకల సరళ, అన్నభీమోజు నాగార్జునచారి, పెద్ది శ్రీనివాస్‌గౌడ్, నామిరెడ్డి యాదగిరిరెడ్డి, గార్లపాటి నిరంజన్‌రెడ్డి, మట్లపల్లి సైదయ్యయాదవ్, నామిరెడ్డి కరుణాకర్‌రెడ్డి, నవీన్‌రెడ్డి, ఖాసీం పాల్గొన్నారు.  
మిర్యాలగూడకు ఉద్యమ చరిత్ర :
మిర్యాలగూడకు తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉంది.  మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి తండ్రి తిప్పన కిష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తెలంగాణ ఉద్యమం భారీగాసాగింది. జైలుకు కూడా వెళ్లారు. మర్రి చెన్నారెడ్డితో కలిసి ఒకసారి తిప్పన కృష్ణారెడ్డి మా ఇంటికి వచ్చిండు. ఆ తర్వాత కూడా తెలంగాణ ఉద్యమంలో మిర్యాలగూడకు చరిత్ర ఉందని కేసీఆర్‌ పేర్కొన్నారు.  

మీ అవసరాలన్నీ స్వయంగా చూస్తా:

హుజుర్‌నగర్‌ : ‘పోయిన సారి మీరు కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చింది. మళ్లీ 100 శాతం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే వస్తది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపిస్తేనే మీకు లాభం జరుగుతుంది. కాంగ్రెస్‌ అభ్యర్థి గెలిస్తే మళ్లీ పాత పాట..లాభం జరగదు. అధికార పార్టీ అభ్యర్థి సైదిరెడ్డిని గెలిపించాలి. ఇంత పెద్ద సంఖ్యలో వచ్చారంటే  సైదిరెడ్డి గెలుపు ఖామమైంది. ఇందులో అనుమానమే లేదు. గత టర్మ్‌లో రాష్ట్రం కొత్తగా వచ్చింది.. ఆర్థిక  ప్రాతిపదిక లేదు.. వాటన్నింటినీ కూర్పు చేయడంతో నా సమయం రాజధానిలోనే ఎ క్కువ గడిచింది. ఈ ఎన్నికల తర్వాత నేనే స్వయంగా హుజుర్‌నగర్‌ వచ్చి ఒక రోజు అంతా ఉండి మీ అవసరాలు.. స్థానిక పరిస్థితులు మొత్తం నేనే బేరీజు వేస్తా. అవసరమైన ఆర్డర్లు ఇక్కడే ఇచ్చి అన్ని రకాలుగా.. చేస్తా. యువకుడు సైదిరెడ్డి  నా ఇంట్లో మనిషిగా లాగా ఉంటాడు. నాకు వ్యక్తి గతంగా చాలా దగ్గరి సన్నిహితుడు. అందుకే అతన్ని గెలిపించండి. అతని నాయకత్వంలో హుజుర్‌నగర్‌కు కావాల్సిన పనులన్నీ నేనే స్వయంగా వచ్చి చేసి పెడతా’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ హుజుర్‌నగర్‌ ప్రజా ఆశీర్వాద సభలో సైదిరెడ్డి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

సైదిరెడ్డి నా సన్నిహితుడు..ఆయనను గెలిపించండి : సీఎం కేసీఆర్‌ 
సభలో హుజుర్‌నగర్‌ గురించి కేసీఆర్‌ చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే.. హుజుర్‌నగర్‌లో సైది రెడ్డి గాలి బాగుంది. మీరందరూ నిఖార్సుగా హుజుర్‌నగర్‌ వాసులే. ఎందుకంటే అటు వైపు మిర్యాలగూడ, ఇటు వైపు కోదాడలో సభ ఉంది. ఇంత పెద్దగా వచ్చారంటే  సైదిరెడ్డి విజయం సాధించినట్లే. హుజుర్‌నగర్‌ సభ, మీ ఉత్సాహం చూసిన తర్వాత నాకు సంపూర్ణ విశ్వాసం కలిగింది. ప్రజాస్వాయ్యంలో చాలా సందర్భాల్లో చాలా ఎన్నికలు జరుగుతాయి. పార్టీలు.. అనేక మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తారు. నిజమైన ప్రజాస్వామ్యంలో గెలవాల్సింది.. పార్టీల అభ్యర్థులు కాదు.. ప్రజల అభిప్రాయం గెలవాలి. లేదంటే గాలిగాలి గందరగోళం ఉం టుంది. మనం అనుకున్న పనులు జరగవు. మనం నిందిస్తాం.. తిడతాం కానీ లాభం జరగదు. ఒక్క సారి చేయి జారితే, మన చేతుల్లో ఏమీ ఉండదు. ఓటు వేసే ముందు ఆలోచించి వివేచనతో.. ప్రజ లకు ఏది మంచి అయితే అది చేయాలి.. ఏమోషన్‌లో చేయవద్దు. ఈ ఎన్నికల్లో మీ కు పెద్ద కన్‌ఫ్యూజన్‌ లేదు. 58 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, టీడీపీ కూటమి ఒక వైపు.. 15 ఏళ్లు కొట్లాడి తెలంగాణ సాధి ం చి.. గతంలో మీ  ఆశీస్సులతో గెలిచి నా లుగేళ్లు పాలించిన టీఆర్‌ఎస్‌ ఒక వైపు ఉం ది. ఎవ్వరూ దీంట్లో కొత్త వాళ్లులేరు.. అంతా పాత వాళ్లే. మీకు కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్‌ కొత్తకాదు. ఓటు వేసే ముందు ఆలోచించండి. మిర్యాలగూడ, హుజుర్‌నగర్‌ ప్రాంతా ల్లో ఉద్యమ జెండాలు ఎగుర వేశాం. మీరందరూ వాస్తవాలు గమనించి ఓటు వేయాలి.  
పథకాల అమలులో దేశానికే ఆదర్శం  : బడుగుల

సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌ అన్నారు.  తెలంగాణ కేవలం నా లుగున్నర ఏళ్లలోనే సీఎం కేసీఆర్‌ బంగారు తెలంగాణ వైపు పరుగులు పెట్టించాడన్నారు స్థానికుడైన శానంపూడి సైదిరెడ్డిని గెలిపించేందుకు నియోజకవర్గ ప్రజలంతా ఇప్పటికే సిద్ధమయ్యారని ఆయన  నామినేషన్‌ దాఖలు చేసిన  రోజే తేలిపోయిందన్నారు.
మట్టికి పోయినా ఇంటి వాడు కావాలి .. 
మట్టికి పోయినా ఇంటి వాడుకావాలి అనే నానుడిని నిజం చేస్తూ స్థానికుడైన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిని గెలిపించాలని మునిసిపల్‌ చైర్మన్‌ దొంతగాని శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.   సభలో టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామా భరత్‌కుమార్, జిన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి, చిలకరాజు నర్సయ్య, నర్సింగ్‌ వెంకటేశ్వర్లు, ముడెం గోపిరెడ్డి, ఆదెర్ల శ్రీనివాసరెడ్డి, రామనర్సింహరెడ్డి, యామిని వీరయ్య, కస్తాల కోటమ్మరామయ్య, గీతారాంచందర్‌నాయక్,సుంకర క్రాంతికుమార్, జక్కుల నాగేశ్వరరావు,రాజారావు, బెల్లంకొండ అమర్, కోతిసం పత్‌రెడ్డి, గుండా బ్రహ్మారెడ్డి, గెల్లి రవికుమార్, రామకృష్ణ పాల్గొన్నారు. 

మీ బిడ్డగా.. ఆశీర్వదించాలి : సైదిరెడ్డి

మీ బిడ్డగ ముందుకు వచ్చా ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసి చూపిస్తానని ఎమ్మెల్యే అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు.    అశేష ప్రజానీకాన్ని చూశాక తన గెలుపు ఖాయమైందన్నారు. నియోజకవర్గంలో రాజకీయాలను అపవిత్రం చేసిన మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిని సాగనంపేందుకు ప్రజలంతా సిద్ధమయ్యారన్నారు. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన నేటి వరకు ప్రజలకు అందుబాటులో లేకుండా చుట్టం చూపుగా వచ్చి పోతున్నారన్నారు.  ఎ మ్మెల్యేగా గెలిపిస్తే మరో సిద్దిపేటలాగా అభివృద్ధి చేసి చూపిస్తానని  హామీ ఇచ్చాడు. తన గెలుపునకు  కృషి చేస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీతో పాటు తనకు మద్దతు తెలుపుతున్న వైఎస్సార్‌సీపీ, జనసేన, ఎంఐఎం పార్టీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.   
  

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

మిర్యాలగూడ సభకు హాజరైన జనం

2
2/2

నల్లగొండ సభకు హాజరైన జనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement