నల్లగొంద దశ..దిశ మారుస్తా
నల్లగొండ టుటౌన్, న్యూస్‌లైన్ : నల్లగొండ పట్టణాన్ని ఊహించని విధంగా అభివృద్ధి చేసి దశ... దిశ మారుస్తానని నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి మున్సిపాలిటీ పరిధిలోని 4,5,9,10,11వ వార్డుల్లో విస్తృతం గా పర్యటించారు. ఇంటింటికీ తిరిగి తమకు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ యువతకు ఉపాధి, ఉద్యోగులకు భద్రత, వికలాంగులు, వితంతువులు, వృద్ధులకు పింఛన్లు రూ.1000కి పెంచుతామన్నారు.
పానగల్ వెంకటేశ్వరస్వామి దేవాల యాన్ని 50లక్షలతో అభివృద్ధి చేశామని, పానగల్‌లో పురాతన చారిత్రక ఆలయాలను అభివృద్ధి చేయడంతో పాటు రిజర్వాయర్ పరిసర ప్రాంతాలను పర్యాటక కేంద్రంగా మారుస్తానని తెలిపారు. శ్రీశైలం సొరంగ మార్గానికి తాను రూ.2000 కోట్లు మంజూరు చేయించానని, తెలంగాణ రాష్ట్రంలో దాన్ని పూర్తి చేయించి రైతాంగానికి సాగునీరు, అన్ని గ్రామాల్లోని ఇంటింటికీ కృష్ణాజలాలు అంది స్తానని హామీ ఇచ్చారు.
బ్రహ్మణ వెల్లంల పథకాన్ని పూర్తి చేసి జిల్లాను సస్యశామలం చేయడమే తన ముందున్న కర్తవ్యమన్నారు. జిల్లాలో జాతీయ రహదారులున్నందున వాటి వెంట పరిశ్రమలు నెలకొల్పించి ఇండస్ట్రియల్ కారిడార్‌గా మార్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తానని స్పష్టం చేశారు.నల్లగొండ నుంచి మూడుసార్లు గెలిపించిన ఓటర్లు నాల్గవసారి తనను తెలంగాణ రాష్ట్రంలో భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. నల్లగొండలో మెడికల్ కాలేజీ మంజూరు చేయిస్తానని.. దీంతో పాటు 750 పడకల అనుబంధ ఆస్పత్రి ఏర్పాటు చేయించి పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తానని తెలిపారు. నల్లగొండ పట్టణంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, ఎస్టీపీ నిర్మాణం కోసం రూ.30 కోట్లు మంజూరు చేయించి 6నెలల్లో పూర్తి చేయిస్తానని చెప్పారు.
ఇప్పటికే నిధులు మంజూరయ్యాయని ఎన్నికలకోడ్ సందర్భంగా పనులు ప్రారంభించలేకపోయానని తెలిపారు. ప్రభు త్వ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగుల భద్రతకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా రుణం తీర్చుకునేందుకు హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలి పించాలన్నారు. ఈ కార్యక్రమంలో గుత్తా తనయుడు అమిత్‌రెడ్డి, నాయకులు పుల్లెంల వెంకటనారాయణగౌడ్, చింతకుంట్ల రవీందర్‌రెడ్డి, నాగరత్నం రాజు, కత్తులకోటి, బొంత వెం కన్న, వెంకట్‌రెడ్డి, కళావతి, కోమటిరెడ్డి అం జిరెడ్డి, బొడ్డుపల్లి శ్రీను, నాంపల్లి శ్రీను, బొంతరేణుక, గుండగోని యాదయ్య, సురిగి మారయ్య, యామ దయాకర్ పాశం రాంరెడ్డి, రఘువీర్, లింగస్వామి పాల్గొన్నారు.