Surya pet
-
‘ఎస్ఎల్బీసీ టన్నెల్ స్టార్టింగ్.. ఎండింగ్ ఎక్కడ ఉందో తెలుసా?’
సాక్షి, సూర్యాపేట జిల్లా: కేటీఆర్ ఓ పిలగాడంటూ వ్యాఖ్యానించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. పదేళ్లు దక్షిణ తెలంగాణను కేసీఆర్ ముంచాడని.. కేటీఆర్‌కు జిల్లాకు వచ్చే హక్కే లేదంటూ వ్యాఖ్యానించారు. పాలకవీడు మండలం జానపహాడ్ లో మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి మీడియా సమావేశంలో నిర్వహించారు.ఈ సమావేశంలో కోమటిరెడ్డి మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ టన్నెల్ స్టార్టింగ్.. ఎండింగ్ పాయింట్ ఎక్కడ ఉందో జగదీష్ రెడ్డికి తెలుసా అంటూ ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడు జిల్లా పరిషత్‌లను గెలుస్తాం. ఎస్ఎల్బీసీ సొరంగాన్ని వైఎస్సార్ చొరవతో ప్రారంభించుకున్నాం. ఎస్ఎల్బీసీ సొరంగం కూలిపోవడం బాధాకరం. ఎస్ఎల్బీసీ సొరంగంపై రేపు(సోమవారం) సీఎం సమీక్షించనున్నారు. 85 శాతం పూర్తయిన బ్రాహ్మణ వెల్లంలను కేసీఆర్ పూర్తి చేయలేదు’’ అని కోమటిరెడ్డి పేర్కొన్నారు.ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 30న ఉగాది నుంచి రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఇస్తున్నామని.. సీఎం చేతుల మీదుగా హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి పథకాన్ని ప్రారంభించబోతున్నామని వెల్లడించారు. 80 శాతం ప్రజలు రేషన్ బియ్యాన్ని తినడం లేదు. రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులు అమ్ముకుంటున్నారు. తెలంగాణలో 84 శాతానికి సన్నబియ్యం ఉచితంగా ఇవ్వబోతున్నాం’’ అని ఉత్తమ్ తెలిపారు. -
మంత్రి ఉత్తమ్ కాన్వాయ్‌లో ప్రమాదం
సూర్యాపేట్ : జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి క్వానాయ్‌లో అపశృతి చోటు చేసుకుంది. అదుపు తప్పి ఉత్తమ్ కుమార్‌రెడ్డి కాన్వాయ్‌లో ఆరు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. శుక్రవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి జాన్ పహాడ్ ఉర్సు ఉత్సవాలకు వెళ్తున్నారు. ఆ సమయంలో మండల కేంద్రమైన గరిడేపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో కాంగ్రెస్ కార్యకర్తలకు అభివాదం చేసేందుకు ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రయాణిస్తున్న కారును డ్రైవర్ ఆపారు. దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయాణిస్తున్న క్వాన్వాయ్ వెనుక ఉన్న ఆరు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. కార్యకర్తలకు అభివాదం చేసిన అనంతరం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉరుసు ఉత్సవాలకు బయల్దేరి వెళ్లారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. -
ట్రాన్స్ఫార్మర్పై మరమ్మతులు చేస్తూ.. కరెంట్ షాక్‌తో విద్యుత్ ఆపరేటర్ మృతి
సాక్షి, సూర్యాపేట, నడిగూడెం: ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై విద్యుత్ ఆపరేటర్ మృతిచెందాడు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం తెల్లబల్లి గ్రామ పరిధిలో గురువారం జరిగిన ఈ సంఘటనపై గ్రామస్తులు తెలిపిన వివరాలివి. తెల్లబల్లి గ్రామానికి చెందిన నెమ్మాది సుధాకర్ (40) మునగాల మండలం రేపాల విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. సుధాకర్ గురువారం విధులకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా.. తెల్లబల్లి గ్రామానికి చెందిన పలువురు రైతులు రత్నవరం రహదారిలోని ట్రాన్స్ఫార్మర్ పనిచేయడం లేదని అతన్ని తీసుకెళ్లారు. ఆ ట్రాన్స్ఫార్మర్ మునగాల మండలం ఆకుపాముల విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో ఉందనుకొని అక్కడి నుంచి సుధాకర్ ఎల్సీ తీసుకున్నాడు. కానీ ఆ ట్రాన్స్ఫార్మర్ నడిగూడెం విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో ఉంది. ఈ విషయం తెలియకపోవడంతో సుధాకర్ ట్రాన్స్ఫార్మర్ ఎక్కి మరమ్మతులు చేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. కాగా ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
సీఎం కేసీఆర్‌కు భట్టి విక్రమార్క సవాల్
సాక్షి, సూర్యాపేట : కాళేశ్వరం నీళ్లు, తెచ్చిన అప్పులపై రాష్ట్రంలో ఎక్కడైనా సరే చర్చకు సిద్ధమా అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యుత్ శాఖా మంత్రి జగదీష్ రెడ్డికి సవాల్ విసిరారు. రైతులతో ముఖాముఖిలో భాగంగా శనివారం సూర్యాపేటలో జరిగిన సమావేశంలో ప్రసంగించారు. ఇక్కడ జరుగుతున్నది రాజకీయ సమాశం కాదు.. ఎన్నికల సమావేశం అంతకన్నాకాదని చెప్పారు. కేంద్రం తీసుకువచ్చిన నల్ల చట్టాలు అమల్లోకి వస్తే.. కోట్లాది రైతాంగ సోదరులు జీవితాలు దుర్భరంగా మారతాయని భట్టి చెప్పారు. ఐకేపీ సెంటర్లు, కొనుగోలు కేంద్రాలు కొనసాగాలని కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తున్నట్లు భట్టి విక్రమార్క మల్లు చెప్పారు. రైతాంగ సోదరులు పడుతున్న బాధను శాసనసభలో మీ గొంతుగా వినిపంచాలనే రైతులతో ముఖాముఖీగా మాట్లాడుందుకు ఇక్కడకు వచ్చానని భట్టి చెప్నారు. రైతులతో ముఖాముఖీ అనేది విమర్శలు చేసే వేదికకాదు.. కేవలం వాస్తవాలు, రైతుల కష్టాలు చర్చించుకునే సమావేశం మాత్రమేనని భట్టి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ సభలో మాట్లాడుతూ.. పొలం బ్రహ్మండంగా ఉంది.. రైతులు బాగున్నారు అంటున్నారు.. నిజంగా పొలం బాగుంటే చందుపట్ల గ్రామంలో ఎండిపోయిన వరిపంటను చూపిస్తూ.. రైతు కన్నీళ్లు పెట్టాల్సిన అవసరం ఏమోచ్చిందని భట్టి ఆగ్రహంగా అన్నారు. ఈ ప్రాంతానికి రాంరెడ్డి దామోదర్ రెడ్డి శ్రమ ఫలితమే.. ఎస్సారెస్పా కాలువ వచ్చిందని చెప్పారు. గాలివాటపు గెలుపుతో వచ్చిన మంత్రి పదవితో స్థానికమంత్రి జగదీశ్వర్ రెడ్డి అబద్దాలు మాట్లాడుతున్నారని భట్టి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మంత్రి చెబుతున్నట్లు ఇవి కాళేశ్వరం నీళ్లు కావు.. నాడు కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టించిన శ్రీరాంసాగర్ ఎస్సారెస్పీ.. డిండీ ప్రాజెక్టుల వల్ల వచ్చిన నీళ్లని భట్టి ప్రజలకు వివరించారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడకు తీసుకువచ్చిన నీటి చుక్కకూడా లేదని.. లెక్కలతో సహా వివరించేందుకు సిద్ధమని భట్టి తీవ్రస్థాయిలో చెప్పారు. ఎస్సారెస్పీ కాలువ ద్వారా వచ్చిన నీళ్లను.. కాళేశ్వరం నీళ్లని ప్రజలకు, రైతులకు అబద్దాలు చెబుతారా? అని భట్టి ఆగ్రహంగా ప్రశ్నించారు. ఎస్సారెస్పీ ఫేజ్ 2 కాలువ తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వాలని భట్టి వివరించారు. ఇక్కడకు వచ్చే నీళ్లు.. మొదట శ్రీరామ్ సాగర్/కడెం ప్రాజెక్టుల నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి... అక్కడనుంచి మిడ్ మానేరుకు అక్కడనుంచి లోయర్ మానేరుకు.. చివరగా ఇక్కడకు నీళ్లు పారుతున్నాయని భట్టి చెప్పారు. ఈ ఏడేళ్లుగా కేసీఆర్ కొత్తగా కట్టిన ఒక్క ప్రాజెక్ట కూడా లేదన్నారు. రాత్రిపూటో.. పగలో మత్తులో మాట్లాడే మాటలు ప్రజలు నమ్మరని భట్టి చెప్పారు. ప్రతిపక్ష నాయకుడిగా ఈ ముఖ్యమంత్రికి సవాల్ విసురుతున్నా.. కాళేశ్వరం లెక్కలు.. అప్పులు.. పారిన నీళ్లపై రాష్ట్రంలో మీరు ఎక్కడ చర్చకు పెట్టినా నేను సిద్ధమే వచ్చి వివరిస్తా.. అని భట్టి ఛాలెంజ్ చేశారు. స్థానిక మంత్రి నోరుతెరిస్తే.. చెప్పేవన్నీ అబద్దాలని భట్టి అన్నారు. మంత్రి.. ముఖ్యమంత్రి కలిసి రాష్ట్రాన్ని దోచేస్తున్నారని చెప్పారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన ఏడేళ్లలో కొత్తగా ఒక్క విద్యుత్ ప్రాజెక్టు అయినా పూర్తి చేశారా?? అని ప్రశ్నించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక.. 2015లో మొదలు పెట్టిన భద్రాద్రి ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదని అన్నారు. అందులోనూ.. ఈ ప్రాజెక్టులో వాడుతున్న సబ్ క్రిటికల్ టెక్నాలజిని 2018లో నాటి ప్రభుత్వం మూసేసిందని చెప్పారు. ఇందులోనూ దాదాపు రూ. 10 వేల కోట్ల అవినీతి జరిగిందని చెప్పారు. దీనివల్ల రాష్ట్ర ప్రజలపై అదనపు భారం పడుతోందని అన్నారు. సబ్ క్రిటికల్ టెక్నాలజీపైనా.. రూ. 10 కోట్ల అవినీతినైనా.. చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందా..? నేను లెక్కలతో సహా వివరిస్తా.. అని భట్టి చెప్పారు. ఈ అవినీతి సొమ్ములు నీకు (మంత్రి జగదీష్ రెడ్డి) చెందుతున్నాయా..? మీ ముఖ్యమంత్రికి చెందుతున్నాయా? అని భట్టి ప్రశ్నించారు. రాష్ట్రాన్ని, ప్రజలను ప్రయివేటు బ్యాంకులకు తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులు.. రూ. 3 లక్షల కోట్ల అప్పలు తెచ్చారని అన్నారు. ఆ అప్పులు కట్టలేక.. పేదవాళ్లు తాగే మద్యం, డీజిల్ పై పన్నులు పెంచుతున్నారని అన్నారు. కేసీఆర్ తెచ్చిన అప్పులు కట్టాల్సింది పేద ప్రజలే అని భట్టి చెప్పారు. ఈ ఏడాది మద్యం మీద రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ. 30 వేల కోట్ల రూపాయాలు పన్నుల రూపంలో వసూలు చేసిందన్నారు. ఇదిలావుండగా.. కేంద్రం తెచ్చిన నల్ల చట్టాలు వెనక్కు తీసుకోవాలని... ఐకేపీ సెంటర్లు, కొనుగోలు కేంద్రాలు ఉండాలని భట్టి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క మల్లుతో పాటు.. మాజీ ఎంపీ మధు మాష్కీ గౌడ్, మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, మాజీ ఎంపీ హనుమంతరావు, ఎమ్మెల్యే పొడెం వీరయ్య, కిసాన్ కాంగ్రెస్ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, ఎన్.ఎస్.యూ.ఐ అద్యక్షుడు బల్మూరి వెంకట్ స్థానిక నేతలు పాల్గొన్నారు. మధుమాష్కీ గౌడ్ పవర్ లేని పవర్ మంత్రి జగదీష్ రెడ్డి. రాజకీయమంటే ప్రజలనే కుటుంబ సభ్యులుగా చూసుకోవాలి. నమ్మకంతో ఇటు టీఆర్ఎస్ ను, అటు బీజేపీని అధికారం ఇస్తే.. ప్రజలను నట్టేట ముంచారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మేల్యలు దోపిడీ దారులుగా మారుతున్నారు. రాంరెడ్డి దామోదర్ రెడ్డి, మాజీ మంత్రి మరోరెండు సంవత్సరాల్లో మా ప్రభుత్వం వస్తోంది. రైతులకు వ్యతిరేకంగా న్రవర్తించిన ఏ ఒక్కరిని వదిలి పెట్టం. వీ. హనుమంత రావు నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోంది. అప్పులు తెచ్చి రైతులు సన్నబియ్యం వేసి.. నష్టపోతున్నారు. -
సివిల్స్‌లో మెరిసిన తెలుగు తేజాలు
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి– భువనగిరి జిల్లాకు చెందిన పి.ధాత్రిరెడ్డి సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో అల్ ఇండియా 46వ ర్యాంకు సాధించి భేష్ అనిపించుకున్నారు. ధాత్రిరెడ్డి గతంలో సివిల్స్ రాసి 283 ర్యాంకు సాధించారు. ప్రస్తుతం ఐపీఎస్ శిక్షణలో ఉన్న ఆమె మళ్లీ పట్టుదలతో సివిల్స్ రాసి ఐఏఎస్‌లో 46వ ర్యాంకును సాధించారు. యూపీఎస్సీ మంగళవారం వెల్లడించిన సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు ప్రతిభ చాటారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అధికసంఖ్యలో ఎంపికై సివిల్స్‌లో తమ సత్తా చాటారు. ప్రతిష్టాత్మకమైన ఇండియన్ సివిల్ సర్వీసెస్‌కు 829 మంది ఎంపిక కాగా అందులో 50 మందికి పైగా తెలుగు విద్యార్థులు ఉన్నారు. సివిల్ సర్వీసెస్– 2019కు సంబంధించిన తుది ఫలితాలు మంగళవారం యూపీఎస్సీ విడుదల చేసింది. ఇందులో 829 మంది అభ్యర్థులను సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక చేసినట్లు ప్రకటించింది. సివిల్స్‌కు ఎంపికైన వారిలో 304 మంది జనరల్ కేటగిరీలో ఎంపికయ్యారు. కొత్తగా అమల్లోకి తెచ్చిన ఎకనమికల్లీ వీకర్ సెక్షన్ (ఈడబ్ల్యూ ఎస్) కోటాలో 78 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఓబీసీ కేటగిరీలో 251, ఎస్సీ 129, ఎస్టీ కేటగిరీలో 67 మంది ఉద్యోగాలు సాధించారు. ఈ ఫలితాల్లో హరియాణాకు చెందిన ప్రదీప్‌సింగ్ ఆల్ ఇండియా టాపర్‌గా నిలిచారు. ఇక జతిన్ కిషోర్ రెండో ర్యాంకు, ప్రతిభా వర్మ మూడో ర్యాంకు సాధించారు. అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి మల్లవరపు సూర్య తేజ 76వ ర్యాంకు, కట్టా రవితేజ 77వ ర్యాంకు, సింగారెడ్డి రిషికేశ్ రెడ్డి 95వ ర్యాంకు సాధించి టాప్ 100లో నిలిచారు. టాప్ 100 నుంచి 200లోపు ర్యాంకుల్లో మరో ఐదుగురు తెలుగు అభ్యర్థులు ఉండటం విశేషం. ఇక 200 నుంచి 300 ర్యాంకుల్లోపు మరో పది మంది సాధించారు. -
సూర్యాపేట జిల్లాలో భూకంపం
-
ఇరువర్గాల మధ్య ఘర్షణ: నలుగురికి తీవ్రగాయాలు
సూర్యాపేట (నల్గొండ జిల్లా) : సూర్యాపేట మండలంలోని గాంధీనగర్‌లో బుధవారం రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కత్తులు, గొడ్డళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో నలుగురికి తీవ్రగాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. భూమి విషయంలో తలెత్తిన వివాదమే ఈ సమస్య కారణంగా తెలుస్తోంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులను సూర్యాపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.