university VCs
-
న్యాక్‌కు దరఖాస్తు చేస్తే రూ.లక్ష
సాక్షి, హైదరాబాద్: నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) గుర్తింపు కోసం దరఖాస్తు చేసేలా విద్యా సంస్థలను ప్రోత్సహించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. అందుకు ముందుకొచ్చే కాలేజీలు, విశ్వవిద్యాలయాలకు రూ.లక్ష పారితోషికం ఇస్తామని ప్రకటించింది. ఈ అంశంపై సాంకేతిక విద్య కమిషనర్ దేవసేన, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి గురువారం రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వైస్‌చాన్స్‌లర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఉన్నత విద్యలో జాతీయ స్థాయి గుర్తింపు పొందేందుకు న్యాక్ గుర్తింపు అవసరమని, ఈ విషయాన్ని అన్ని సంస్థలకు అర్థమయ్యేలా చెప్పాలని వీసీలను కోరారు. త్వరలో ప్రతీ జిల్లాలోనూ కాలేజీలను గుర్తించి, న్యాక్‌కు దరఖాస్తు చేసేలా ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించాలని నిర్ణయించారు. ముందుకు రాని సంస్థలు విద్యా ప్రమాణాలను అంచనా వేసేందుకు న్యాక్ గుర్తింపును జాతీయ స్థాయిలో కొలమానంగా తీసుకుంటున్నారు. మౌలిక వసతులు, నిపుణులైన అధ్యాపకులు, సొంత భవనాలు, లే»ొరేటరీలు, లైబ్రరీ, ఆ విద్యా సంస్థలో చదివిన విద్యార్థులకు లభిస్తున్న ఉద్యోగాలు, జాతీయ స్థాయిలో వారి ప్రతిభ మొదలైన అంశాలను పరిగణనలోనికి తీసుకొని న్యాక్ గుర్తింపు ఇస్తారు. అయితే, న్యాక్ గుర్తింపుపై రాష్ట్ర విద్యా సంస్థలు ఆసక్తి చూడం లేదు.ప్రస్తుతం దేశవ్యాప్తంగా 362 వర్సిటీలు, 6,176 కళాశాలలకు న్యాక్ గుర్తింపు ఉంది. 695 వర్సిటీలు, 34,734 కళాశాలలకు గుర్తింపు లేదు. తెలంగాణలో 11,055 డిగ్రీ కాలేజీలు, 173 ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. 15 యూనివర్సిటీలు 293 కాలేజీలు కలిపి 298 ఉన్నత విద్యా సంస్థలకు న్యాక్ అక్రెడిటేషన్ ఉంది. అందులో 90 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. పునఃసమీక్ష చేసిన ప్రతీసారి మౌలిక వసతుల కల్పన, ఫ్యాకల్టీ కొరత కారణంగా న్యాక్ గుర్తింపు సంఖ్య తగ్గుతోంది. న్యాక్ తప్పనిసరి కాబోతోందా? న్యాక్ గుర్తింపును తప్పనిసరి చేయాలని యూజీసీ, అఖిల భారత సాంకేతిక విద్యా మండలి భావిస్తున్నాయి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలోనూ దీన్ని చేర్చారు. న్యాక్ గుర్తింపు విధానంలోనూ అనేక మార్పులు తేవాలని నిర్ణయించారు. ఏ, బీ, సీ, డీ గ్రేడ్ల స్థానంలో 1 నుంచి 5 అంచెలుగా గ్రేడ్లు ఇవ్వనున్నారు. 1 నుంచి 4 వరకు ’లెవల్’ పొందిన సంస్థలను జాతీయ విశిష్ట విద్యా కేంద్రాలుగా పేర్కొంటారు.విద్య, పరిశోధనలో అంతర్జాతీయ స్థాయి సామర్థ్యమున్న సంస్థలకు ‘ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ గ్లోబల్ ఎక్సలెన్స్ ఫర్ మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్’పేరుతో ఐదో లెవెల్ గుర్తింపు ఇస్తారు. ఈ కొత్త విధానంపై యూజీసీ రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతోంది. అక్రెడిటెడ్ విద్యాసంస్థలకు మెచ్యూరిటీ బేస్డ్ గ్రేడెడ్ అక్రెడిటేషన్ (ఎంబీజీఏ) పేరిట 1 నుంచి 5 గ్రేడ్లు ఇస్తారు. -
యూనివర్సిటీ వీసీలకు నారా లోకేష్ బెదిరింపు
-
తెలంగాణలో వీసీల పంచాయితీ
-
విశాఖ: దక్షిణ భారతదేశ వీసీల సదస్సు ప్రారంభం
సాక్షి, విశాఖపట్నం: నగరంలోని ఏయూ కన్వెన్షన్ హాల్లో దక్షిణ భారతదేశ వీసీల సదస్సు ప్రారంభం అయ్యింది. మంగళవారం ఉదయం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ సదస్సును ప్రారంభించారు. సదస్సుకు ఏడు రాష్ట్రాల వైస్ ఛాన్సలర్లు హాజరయ్యారు. రీసెర్చ్ అండ్ ఎక్సలెన్స్ ట్రాన్స్ఫర్ మెటీవ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అనే అంశంపై జరగనుంది ఈ సదస్సు. మరోవైపు ఈ సదస్సుకు 140 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతుండడం విశేషం. -
కేరళ: విజయన్ సర్కార్‌కు ఎదురు దెబ్బ
తిరువనంతపురం: కేరళలో గవర్నర్ వర్సెస్ ప్రభుత్వ వ్యవహారం మరో మలుపు తిరిగింది. హైకోర్టులో పినరయి విజయన్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. ఫిషరీస్ మరియు ఓషన్ స్టడీస్ యూనివర్సిటీకి వీసీని నియమించడాన్ని తప్పుబడుతూ ప్రభుత్వ ఆదేశాలను సోమవారం పక్కపెట్టింది ఉన్నత న్యాయస్థానం. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) రెగ్యులేషన్స్ 2018 ను ఉల్లంఘించేదిగా ఆ నియామకం ఉందన్న హైకోర్టు డివిజన్ బెంచ్.. ఈ మేరకు యూజీసీ మార్గదర్శకాల ప్రకారం కొత్త వీసీని నియమించాలని ఛాన్స్లర్ ఆఫ్ వర్సిటీస్ అయిన గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్‌ను ఆదేశించింది. కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ మరియు ఓషన్ స్టడీస్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌గా ఈమధ్యే డాక్టర్ రిజీని నియమించింది కేరళ ప్రభుత్వం. అయితే ఆ నియామకం చెల్లుబాటు కాదని, యూజీసీ మార్గదర్శకాలను ఉల్లంఘించేదిగా ఉందని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ మణికుమార్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. ఇక.. ఏపీజే అబ్దుల్ కలాం టెక్నాలజీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ నియామకాన్ని సైతం సుప్రీంకోర్టు తన దేశాలతో రద్దు చేసింది. యూజీసీ రూల్స్ ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వ కమిటీ మూడు పేర్లను గవర్నర్‌కు ప్రతిపాదనగా పంపాల్సి ఉంటుంది. అయితే కలాం యూనివర్సిటీకి మాత్రం ఒకే ఒక్క పేరు ప్రతిపాదించింది కేరళ ప్రభుత్వం. ఆపై తొమ్మిది యూనివర్సిటీల వీసీలను తప్పుకోవాలని గవర్నర్ ఆరిఫ్ ఖాన్ ఆదేశించడం.. కేరళ ప్రభుత్వంతో జరుగుతున్న జగడం తెలిసిందే. ఈ నెల ప్రారంభంలో, గవర్నర్‌ను విశ్వవిద్యాలయాల ఛాన్సలర్‌గా తొలగించడానికి ఆర్డినెన్స్ తీసుకురావడానికి కేరళ రాష్ట్ర కేబినెట్ ఓటు వేసింది. -
‘రాజీనామాకు సిద్ధమా?’.. కేరళ సీఎంకు గవర్నర్ సవాల్
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర గవర్నర్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఇటవలే విశవిద్యాలయాల వీసీల రాజీనామాలపై వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. సీఎం, గవర్నర్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు సవాల్ విసిరారు గవర్నర్ ఆరీఫ్ మహ్మద్ ఖాన్. యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్ల నియామకంలో రాజకీయ జోక్యం ఉందని ముఖ్యమంత్రి ఒక్క ఉదాహరణ చూపిస్తే తాను తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. రాజకీయ జోక్యం అంటూ సీఎం చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. ‘ఆర్ఎస్ఎస్కు చెందిన వారిని తీసుకొచ్చేందుకే ఈ పని చేస్తున్నానని వారు తరుచుగా చెబుతున్నారు. ఆర్ఎస్ఎస్ కాకుండా, ఏ వ్యక్తినైనా నా అధికారంతో నామినేట్ చేసినట్లయితే నేను రాజీనామా చేస్తా. దానిని నిరూపించకపోతే ఆయన(సీఎం విజయన్) రాజీనామా చేసేందుకు సిద్ధమేనా? నేను సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నానని సీఎం చెబుతున్నారు. వారు విద్యారంగాన్ని మెరుగుపరుస్తున్నట్లు చెబుతున్నారు. సరైన అర్హత లేని, అనర్హులైన సీపీఎం లీడర్ల బంధువులతో నియామకాలు చేపట్టి ఎలా సాధిస్తారు?’ అని సీఎంపై విమర్శలు గుప్పించారు గవర్నర్ ఆరిఫ్ ఖాన్. కొద్ది రోజుల క్రితం సంచలనంగా మారిన బంగారం స్మగ్లింగ్ కుంభకోణంపైనా విమర్శలు గుప్పించారు గవర్నర్. స్మగ్లింగ్ కార్యకలాపాలను ముఖ్యమంత్రి కార్యాలయం ప్రోత్సహిస్తున్నట్లు గమనిస్తున్నానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కార్యాలయం, సీఎంకి సన్నిహితులైన వారు స్మగ్లింగ్ చేస్తే తాను జోక్యం చేసుకునేందుకు కారణాలు ఉన్నాయని స్పష్టం చశారు. ఇద చదవండి: ముదురుతున్న వివాదం.. కేరళలో గవర్నర్ వర్సెస్ సీఎం -
'అందుకే గవర్నర్ పట్టించుకోవడం లేదు'
హైదరాబాద్: విశ్వవిద్యాలయాలు ఆధునిక దేవాలయాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. ప్రభుత్వం ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని విశ్వవిద్యాలయాల చట్టాల పునర్నిర్మాణం అవసరమని భావించి కొన్ని మార్పులు సూచిస్తుందని చెప్పారు. అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ చట్ట సవరణ బిల్లును తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మంగళవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో ఆ సవరణ బిల్లుకు మద్దతు తెలుపుతూ రసమయి ఈ విధంగా మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు వర్సిటీల విషయంలో మంచి పరిజ్ఞానం ఉందని పేర్కొన్నారు. ఒకప్పుడు మేధావులను అందించిన వర్సిటీలు సమైక్య పాలనలో దెబ్బతిన్నాయని చెప్పారు. గవర్నర్ కు తక్కు వ సమయం ఉన్నందు వల్ల వర్సిటీలను పూర్తి స్థాయిలో పట్టించుకునే తీరిక లేకుండా పోయిందని వివరణ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్ లో కూడా వీసీల నియామకం ప్రభుత్వం చేతిలో ఉందని గుర్తుచేశారు. -
'వీసీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు'
నియంత్రణ లేదు కనుక వీసీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, అందుకే యూనివర్సిటీలలో విచ్చలవిడితనం వచ్చిందని తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. సమైక్య రాష్ట్రంలో అటానమీ పేరిట ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ)కు ఇచ్చిన భూమి ఎంత, ఇప్పుడు ఉన్న భూమెంత అని సభలో మంగళవారం ఆయన ప్రశ్నించారు. ఓయూ విషయంపై మరిన్ని అంశాలను ప్రస్తావించారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా ఒకప్పటి ఓయూ విద్యార్ధి అని కేసీఆర్ అన్నారు. ప్రభుత్వ నియంత్రణ లేదు కాబట్టి యూనివర్సిటీలకు స్వయం ప్రతిపత్తి ఇచ్చిందని పేర్కొన్నారు. అందుకే వర్సిటీకి కేటాయించిన భూమిలో వందల ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయని విచారణ వ్యక్తంచేశారు. యూనివర్సిటీలకు ఇచ్చిన స్వయం ప్రతిపత్తి దుర్వినియోగం అయిందని గుర్తించాలన్నారు. యూనివర్సిటీలకు పూర్వ వైభవం తెచ్చేందుకే నియామకాల కోసం వేసే కమిటీలో ప్రతిపక్ష సభ్యుడు కచ్చితంగా ఉండేలా చూస్తామని తమ ప్రభుత్వ నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించారు. -
'విశిష్ట గుర్తింపు ఉన్నవారిని వీసీగా నియమిస్తాం'
ఇప్పటినుంచి ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడటంలో భాగంగా విశిష్ట గుర్తింపు ఉన్నవారిని మాత్రమే వీసీలుగా నియమిస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. విద్యావ్యవస్థను పటిష్ట పరిచేందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. గవర్నర్ పై తమ ప్రభుత్వానికి అపార నమ్మకం, గౌరవం ఉందని పేర్కొన్నారు. సమయభావ పరిస్థితుల వల్ల యూనివర్సిటీల పాలన అనుకున్నట్లుగా జరగడం లేదని అంగీకరించారు. పరిపాలన సౌలభ్యం కోసం మాత్రమే సవరణలు తెస్తున్నామన్నారు. ఇకనుంచి అన్నీ పారదర్శకంగానే ఉంటాయి.. ఆయా రంగాల్లో నిపుణులుగా ఉన్నవారిని, విశిష్ట గుర్తింపు ఉన్నవారిని మాత్రమే వీసీలుగా పెడతామని చెప్పారు. -
'మీరిలా చేస్తే తప్పుడు సంకేతాలు వెళతాయి'
హైదరాబాద్: అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ చట్ట సవరణ బిల్లు తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి శాసన సభలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా చాలా రాష్ట్రాల్లో వైస్ ఛాన్సలర్లను రాష్ట్ర ప్రభుత్వాలే నియమిస్తున్నాయని చెప్పారు. కాగా, ఈ బిల్లుపై ప్రతిపక్షాల సభ్యులు మాట్లాడుతూ దీనిపై పునరాలోచన చేయాలని అన్నారు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలు జోక్యం చేసుకోకుండా యూనివర్సిటీలను చక్కబెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. వైఎస్ ఛాన్సలర్లును ప్రభుత్వమే నియమిస్తే తప్పుడు సంకేతాలు వెళతాయని పలువురు అన్నారు. -
అది అంత ఆషామాషీ నిర్ణయం కాదు: కేసీఆర్
హైదరాబాద్: గవర్నర్ వేరు, ప్రభుత్వం వేరుకాదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. విశ్వవిద్యాలయాల్లో గత అనుభవాలు బాధాకరంగా ఉన్నాయని చెప్పారు. అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ చట్ట సవరణ బిల్లు తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మంగళవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. గతంలో వీసీలు సాయంత్రం పదవి నుంచి దిగిపోతుండగా 300, 370 మందిని నియమించిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కాకతీయ, తెలంగాణ, ఉస్మానియా విశ్వవిద్యాలయాల వీసీల తీరు బాధాకరంగా ఉందని సాయంత్రం దిగిపోయే ముందు భారీ ఎత్తున నియామకాలు జరిగాయని అన్నారు. ఫలితంగా రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. వీసీల నియామకం ఆషామాషీగా తీసుకునే నిర్ణయం కాదని అన్నారు. ఈ నియామకాల్లో తమకు దురుద్దేశం ఏమీ లేదని వివరణ ఇచ్చారు.