'వీసీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు'
నియంత్రణ లేదు కనుక వీసీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, అందుకే యూనివర్సిటీలలో విచ్చలవిడితనం వచ్చిందని తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. సమైక్య రాష్ట్రంలో అటానమీ పేరిట ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ)కు ఇచ్చిన భూమి ఎంత, ఇప్పుడు ఉన్న భూమెంత అని సభలో మంగళవారం ఆయన ప్రశ్నించారు. ఓయూ విషయంపై మరిన్ని అంశాలను ప్రస్తావించారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా ఒకప్పటి ఓయూ విద్యార్ధి అని కేసీఆర్ అన్నారు.
ప్రభుత్వ నియంత్రణ లేదు కాబట్టి యూనివర్సిటీలకు స్వయం ప్రతిపత్తి ఇచ్చిందని పేర్కొన్నారు. అందుకే వర్సిటీకి కేటాయించిన భూమిలో వందల ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయని విచారణ వ్యక్తంచేశారు. యూనివర్సిటీలకు ఇచ్చిన స్వయం ప్రతిపత్తి దుర్వినియోగం అయిందని గుర్తించాలన్నారు. యూనివర్సిటీలకు పూర్వ వైభవం తెచ్చేందుకే నియామకాల కోసం వేసే కమిటీలో ప్రతిపక్ష సభ్యుడు కచ్చితంగా ఉండేలా చూస్తామని తమ ప్రభుత్వ నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించారు.