ఇప్పటినుంచి ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడటంలో భాగంగా విశిష్ట గుర్తింపు ఉన్నవారిని మాత్రమే వీసీలుగా నియమిస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. విద్యావ్యవస్థను పటిష్ట పరిచేందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. గవర్నర్ పై తమ ప్రభుత్వానికి అపార నమ్మకం, గౌరవం ఉందని పేర్కొన్నారు.
సమయభావ పరిస్థితుల వల్ల యూనివర్సిటీల పాలన అనుకున్నట్లుగా జరగడం లేదని అంగీకరించారు. పరిపాలన సౌలభ్యం కోసం మాత్రమే సవరణలు తెస్తున్నామన్నారు. ఇకనుంచి అన్నీ పారదర్శకంగానే ఉంటాయి.. ఆయా రంగాల్లో నిపుణులుగా ఉన్నవారిని, విశిష్ట గుర్తింపు ఉన్నవారిని మాత్రమే వీసీలుగా పెడతామని చెప్పారు.