Vijayendra Saraswathi
-
విజయేంద్ర సరస్వతి స్వామి వారి అనుభాషణం..!
-
ధర్మ ప్రచార కేంద్రంగా ‘అరసవల్లి’
అరసవల్లి: హిందూ ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, అటు విశాఖ నుంచి ఇటు ఒడిశా వరకు అరసవల్లి సూర్య క్షేత్రం ధర్మ ప్రచార కేంద్రంగా విరాజిల్లే అవకాశముందని కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి అన్నారు. ఆయన ఆదివారం పీఠాధిపతి హోదాలో తొలిసారి శ్రీకాకుళంలోని అరసవల్లి ఆదిత్యుడిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈవో వి.హరిసూర్యప్రకాష్, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ సంప్రదాయబద్ధంగా ఆహ్వానం పలికారు. అనంతరం గర్భాలయంలో ఆదిత్యుడికి శంకర విజయేంద్ర సరస్వతి పూజలు నిర్వహించారు. తర్వాత అనివెట్టి మండపంలో భక్తులను ఉద్దేశించి అనుగ్రహభాషణం చేశారు. శనివారం నారాయణుడిని (శ్రీకూర్మం), ఆదివారం సప్తమి నాడు సూర్యనారాయణుడిని దర్శించుకోవడం అదృష్టమని వ్యాఖ్యానించారు. నేపాల్ యాత్రలో భాగంగా 1985లో నాటి కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతితో కలిసి అరసవల్లికి తొలిసారిగా వచ్చానని, అయితే అప్పటికీ ఇప్పటికీ ఆలయంలో అద్భుత మార్పులు వచ్చాయని చెప్పారు. ఈ కళింగ ప్రాంతంలో ధర్మ ప్రచారం దీక్షగా చేయాలని, ఇలాంటి క్షేత్రాన్ని ధర్మ ప్రచార కేంద్రంగా అభివృద్ధి చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఇప్పిలి నగేష్ కాశ్యప శర్మ, రంజిత్ శర్మ, ఫణీంద్ర శర్మ, షణ్ముఖ శర్మ తదితరులు పాల్గొన్నారు. పాలక మండలి సభ్యులు మండవల్లి రవి, డాక్టర్ కొంచాడ సోమేశ్వరరావు, ఎన్.కోటేశ్వర చౌదరి, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. -
చల్లారని తమిళ సంఘాల ఆగ్రహం!
సాక్షి, చెన్నై: కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామిపై తమిళ సంఘాల ఆగ్రహం చల్లారడం లేదు. తమిళతల్లి గీతాన్నీ ఆయన అవమానించారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కంచిలోని శంకరమఠం ఒక ప్రకటన విడుదల చేసింది. తమిళతల్లి గీతం ఆలాపిస్తున్నప్పుడు విజయేంద్ర సరస్వతి ధ్యానంలో ఉండి నిలబడలేకపోయారని, అది తమిళ భాషను అవమానించినట్టుగా భావించవద్దని శంకరమఠం కోరింది. కానీ జాతీయగీతం ఆలాపన సమయంలో గౌరవంగా లేచి నిలబడిన విజయేంద్ర సరస్వతి.. తమిళతల్లి గీతాన్ని ఆలాపిస్తున్నప్పుడు లేచినిలడకపోవడం.. అవమానించడమేనని పలు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కాంచీపురంలోని శంకరమఠం ముట్టడికి తమిళ విద్యార్థి సంఘాలు ఆదివారం ప్రయత్నించాయి. ముందస్తు సమాచారం లేకుండా విద్యార్థి సంఘాలు మఠం ముందు గుమికూడటంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు ఆందోళనకారుల నడుమ తోపులాట జరిగింది. ఆధ్యాత్మికతకు నిలయమైన శంకరమఠం ముట్టడికి ప్రయత్నించడం చర్చనీయాంశంగా మారింది. -
సారీ చెబుతారా స్వామి?
సాక్షి ప్రతినిధి, చెన్నై: అనేక వివాదాలకు నిలయమైన కాంచీపురం మఠం చుట్టూ మరో వివాదం ముసురుకుంది. తమిళులు అత్యంత గౌరవంగా భావించే ‘తమిళ్‌తాయ్ వాళ్తు’(త మిళతల్లిని కీర్తిస్తూ ప్రార్దన)ను కాంచీపురం పీఠం శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి అగౌరవపరిచారనే ఆరోపణలు రాష్ట్రంలో ఆందోళనలకు దారితీసాయి. స్వామిపై పోలీసులకు ఫిర్యాదు, తమిళులకు స్వామి క్షమాపణ చెప్పితీరాలనే డిమాండ్‌తో ప్రజలు, భాషాభిమాన సంఘాల వారు స్వామి చిత్రపటాలను ప్రదర్శిస్తూ గురువారం ఆందోళనలు నిర్వహించారు. కాంచీపురం మఠం మేనేజర్ శంకరరామన్ హత్య, ఇందులో కిరాయి గూండాల ప్రేమయం, అందులో జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి పాత్ర, చెన్నై మందవల్లిలోని ఒక వ్యక్తి ఇంటిపై కిరాయిగూండాల దాడి ఇలా అనేక వివాదాలు మఠాన్ని చుట్టుముట్టాయి. ఇద్దరు స్వాములను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లోకూడా పెట్టారు. సంవత్సరాల తరబడి సాగిన ఈ కేసులో స్వాములిద్దరూ నిర్దోషులుగా బైటపడ్డారు. ఇదిలా ఉండగా, తమిళుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా చోటుచేసుకున్న ఒక సంఘటన తాజా వివాదానికి కారణమైంది. అసలు విషయం ఏమిటంటే...బీజేపీ సీనియర్ నేత హెచ్ రాజా తండ్రి రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమం ఈనెల 23వ తేదీ చెన్నైలో జరిగింది. తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్, రాష్ట్ర మంత్రులతోపాటూ విజయేంద్ర సరస్వతి స్వామి సైతం పాల్గొన్నారు. తమిళనాడు ఆనవాయితీ ప్రకారం నిర్వాహకులు సభా కార్యక్రమ ప్రారంభంలో తమిళ్‌తాయ్ వాళ్తు గీతాన్ని ఆలపించారు. ఈ సమయంలో అందరూ లేచినిలబడగా స్వామి మాత్రం కళ్లుమూసుకుని కూర్చుండిపోయారు. ఆ తరువాత జనగణమణ జాతీయ గీతాన్ని ఆలపించినపుడు స్వామి లేచినిలబడ్డారు. దీంతో తమిళ్‌తాయ్ వాళ్తును స్వామి అవమానించారంటూ అదేరోజున విమర్శలు వచ్చాయి. డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షులు స్టాలిన్ సహా పలు రాజకీయ పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. కొందరు భాషాభిమానులు స్వామిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా రాయపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ వివాదం చిలికి చిలికి గాలీవానగా మారగూడదన్న ఉద్దేశంతో శంకరమఠం నిర్వాహకులు బుధవారం వివరణ ఇచ్చారు. కార్యక్రమాల ప్రారంభంలో దైవప్రార్థ నాగీతాలను ఆలపించినపుడు స్వామి ధ్యానముద్రలో ఉండటం ఆనవాయితీఅని, జాతీయగీతం సమయంలో దేశభక్తికి కట్టుబడి స్వామి లేచి నిలుచున్నారని తెలిపారు. తమిళ్‌తాయ్ వాళ్తును సైతం దైవ ప్రార్థనగా స్వామి భావించడం వల్లనే ధాన్యంలో కూర్చుండిపోయారేగానీ తమిళతల్లిని కించపరిచే ఆలోచన కాదని వివరించారు. అయితే ఈ వివరణకు శాంతించని ఆందోళనకారులు స్వామి క్షమాపణ చెప్పాల్సిందేనని గురువారం రాష్ట్రవ్యాప్తంగా అనే జిల్లాల్లో పోరాటాలు చేశారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో కాంచీపురంలోని శంకరమఠంను పలు రాజకీయ పార్టీలు, పలు ప్రజా సంఘాలకు చెందిన మహిళలు ముట్టడించారు. స్వామికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మఠంలోకి జొరబడే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకుని సుమారు వంద మందిని అరెస్ట్ చేశారు. తమిళర్ దేశీయ మున్నని, తమిళర్నల పేరియక్కం, తమిళ్ పులిగళ్ తదితర పార్టీల వారు గురువారం ఉదయం 9.30 గంటలకు రామేశ్వరంలోని కంచికామకోటి శంకరమఠాన్ని ముట్టడించారు. స్వామికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో మఠం నిర్వాహకులు ఆందోళనకారులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయేంద్ర సరస్వతిపై క్రమశిక్షణ చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తంజావూరులోని అన్ని విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు నిరసన ప్రదర్శన చేశారు. అలాగే కోయంబత్తూరులో పవర్ హౌస్ వద్ద స్వామికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. జాతీయగీతానికి లేచినిలబడిన స్వామి తమళ్తాయ్ వాళ్తుకు కూర్చునే ఉండిపోవడం తమిళనాడు ప్రభుత్వాన్ని, తమిళ భాషను అవమానించడమేనని విమర్శలు చేశారు. తమిళభాషను కంచి స్వామి అవమానించినందుకు మీ రక్తం ఉడికిపోవడం లేదా అంటూ ప్రముఖ సినీదర్శకులు భారతిరాజా గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రజలను ప్రశ్నించారు. ఈ గొడవలు ఇలా జరుగుతుండగానే జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి స్వాములు కంచిలోని వస్పీతనర్ మఠంలో కూర్చుని భక్తులను ఆశీర్వదించారు. ఇదిలా ఉండగా, కొందరు వ్యక్తులు ఉద్దేశ్యపూర్వకంగా కంచిస్వామికి వ్యతిరేకంగా పోరాటాలకు రెచ్చగొడుతున్నారని కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ ఆరోపించారు. కాంచీపురం మఠం వారు తమిళాన్ని కించపరిచే చర్యలకు ఎంతమాత్రం పాల్పడరని అన్నారు. కంచిమఠం వారు వివరణ ఇచ్చినా రెచ్చగొడుతున్నది ఎవరో ప్రజలకు తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, కంచి స్వామి చర్యలను రాష్ట్ర మంత్రులు సెల్లూరు రాజూ, పాండియరాజన్ సమర్థించగా కడంబూరు రాజా ఖండించారు. స్వామి పట్ల కొందరు సానుకూలంగా స్పందిస్తుండగా మరికొందరు పంతం పడుతున్నారు. దర్శకులు భారతిరాజా మరింత పరుషమైన వ్యాఖ్యలతో ప్రజలను ప్రశ్నించడం గమనార్హం. అయితే స్వామి ఇంతవరకు నోరుమెదపలేదు. ఇంతకూ స్వామి క్షమాపణలు చెబుతారా లేకుంటే వివాదం ఎలా సమసిపోతుందనే ప్రశ్న తలెత్తింది. -
హైందవ ధర్మ పరిరక్షణకు పాటుపడాలి
శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ మండపేట : హైందవ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారి శంకర విజయేంద్ర సరస్వతీ స్వామీజీ అన్నారు. స్థానిక వైఎస్ రాజశేఖరరెడ్డి మున్సిపల్ మెమోరియల్ పార్కు వద్ద నూతనంగా నిర్మిస్తున్న మహాగణపతి, మహాలక్ష్మి అమ్మవారు, రామాలయం, సాయిబాబా ఆలయాలను స్వామీజీ గురువారం సందర్శించారు. ఆలయ పనులను పరిశీలించి కమిటీ సభ్యులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. సంప్రదాయాలను ప్రతిబింబించేవిధంగా ఆలయ నిర్మాణాలు చేయడం అభినందనీయమన్నారు. మండపాల ప్రాధాన్యాన్ని గురించి భక్తులకు వివరించారు. వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. తొలుత ఆలయ కమిటీ సభ్యులు మల్లిపూడి గణేశ్వరరావు, కొనగళ్ల సత్యనారాయణ, వేగుళ్ల పుష్పరాజు, పెనుమర్తి సుబ్బారావు తదితరులు స్వామీజీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దారి పొడవునా విద్యార్థులు స్వామీజీ పాదాల చెంత పూలు చల్లుతూ స్వాగతించారు. ప్రముఖ సిద్ధాంతి చంద్రాభట్ల చింతామణి గణపతిశాస్త్రి, మాజీ ఎమ్మెల్యేలు బిక్కిన కృష్ణార్జున చౌదరి, వల్లూరి రామకృష్ణచౌదరి, వల్లూరి నారాయణరావు, మున్సిపల్ చైర్మ¯ŒS చుండ్రు శ్రీవరప్రకాష్, వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ (రాజుబాబు), టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వి.సాయికుమార్, ఆలయ కమిటీ సభ్యులు బోడా రామం, పసల కొండ తదితరులు పాల్గొన్నారు. -
హిందూ సంప్రదాయాలు ప్రపంచానికే ఆదర్శం
కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారి శంకరవిజయేంద్ర సరస్వతి కోలంక (కాజులూరు) : హిందూ దేశ సంప్రదాయాలు ప్రపంచానికే ఆదర్శప్రాయమైనవని కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారి శంకర విజయేంద్ర సరస్వతీ స్వామీజీ అన్నారు. గ్రామానికి చెందిన విశాఖపట్నం గాయత్రీ విద్యా పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు పులగుర్త వ్యాఘ్రేశ్వరశర్మ దంపతుల ఆహ్వానం మేరకు మంగళవారం ఆయన కోలంక వచ్చారు. స్వామీజీకి స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా పార్వతీ సమేత ఉమాసోమేశ్వరస్వామి ఆలయంలో స్వామీజీ పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. ప్రతి ఒక్కరూ హిందూ సంప్రదాయాలను పరిరక్షిస్తూ భావితరాలకు అందించాలన్నారు. అష్ట సోమేశ్వరాలయాల్లో ద్రాక్షారామ భీమేశ్వరాలయానికి తూర్పున ఉన్న కోలంక పార్వతీ సమేత ఉమాసోమేశ్వరస్వామి ఆలయానికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. కార్యక్రమంలో స్థానిక ఆలయాల పురోహితులు వింజరపు సత్యనారాయణాచార్యులు, ఖండవిల్లి శ్రీనివాసాచార్యులు, కొత్తలంక సుబ్రహ్మణ్యశర్మ, మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వరదా శేషారావు, పీఏసీఎస్ అధ్యక్షుడు డీవీ నరసింహరాజు తదితరులు పాల్గొన్నారు. -
వెంకన్న సేవలో కీరవాణి
తిరుమల: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభదర్శన సమయంలో కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి, సినీ సంగీత దర్శకుడు కీరవాణి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం టీటీడీ అధికారులు వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. -
14 ఉదయం పుష్కరాలు ప్రారంభించనున్న సీఎం
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ప్రారంభమయ్యే గోదావరి పుష్కరాలను రాజమండ్రిలో ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రానికి సీఎం రాజమండ్రికి చేరుకుంటారని సమాచారం. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి కూడా వెళ్లనున్నారు. పుష్కరాలను రాజమండ్రిలో సీఎం ప్రారంభిస్తే.. విజయేంద్ర సరస్వతి కొవ్వూరులో ప్రారంభిస్తారని సమాచారం. -
జయేంద్ర సరస్వతి నిర్దోషి
సాక్షి, చెన్నై: తొమ్మిదేళ్ల కిందట సంచలనం సృష్టించిన శంకరరామన్ హత్య కేసు నుంచి కంచి మఠాధిపతులు జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతికి ఎట్టకేలకు విముక్తి లభించింది. సరైన సాక్ష్యాలు లేని కారణంగా ఈ కేసులో వీరితోపాటు మిగతా 21 మంది నిందితులను పుదుచ్చేరిలోని ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. బుధవారమిక్కడి సెషన్స్ కోర్టు జడ్జి సీఎస్ మురుగన్ ఈ మేరకు తీర్పు వెలువరించారు. కేసులో ప్రాసిక్యూషన్ సరైన సాక్ష్యాలు చూపించనందున మొత్తం 23 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తున్నట్లు జడ్జి తెలిపారు. చార్జిషీటులో పేర్కొన్న అభియోగాలను నిరూపించడంలో పోలీసులు విఫలమైనందున సంశయ లబ్ధి (బెనిఫిట్ ఆఫ్ డౌట్) కింద నిందితులను విడిచిపెడుతూ కేసును కొట్టివేస్తున్నట్లు పేర్కొన్నారు. 2004, సెప్టెంబర్ 3న కాంచీపురంలోని శ్రీవరదరాజపెరుమాళ్ ఆలయ మేనేజర్ శంకరరామన్ గుడి ప్రాంగణంలోనే హత్యకు గురి కావడం పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ హత్య వెనుక కంచి పీఠాధిపతి ప్రమేయం ఉందన్న ఆరోపణలపై అదే ఏడాది దీపావళి రోజున మహబూబ్‌నగర్‌లో జయేంద్ర సరస్వతిని పోలీసులు అరెస్టు చేశారు. కేసులో మొత్తం 24 మంది నిందితులు ఉండగా వారిలో కదివరన్ అనే వ్యక్తి ఈ ఏడాది చెన్నైలో అనూహ్య పరిస్థితుల మధ్య హత్యకు గురయ్యారు. 2004 నుంచి అనేక మలుపులు తిరిగిన ఈ కేసులో చివరికి ఎవ రూ దోషులుగా తేలకపోవడం గమనార్హం. కోర్టు తీర్పుపై శంకరరామన్ కుటుంబీకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తీర్పుపై అప్పీలు చేసే దిశగా ఆలోచిస్తున్నట్లు శంకరరామన్ తనయుడు ఆనంద్ శర్మ తెలిపారు. ఎవరూ దోషులు కాకుంటే తన తండ్రిని ఎవరు చంపినట్టు అని ఆయన ప్రశ్నించారు. జడ్జి తీర్పు వెలువరిస్తున్న సమయంలో కోర్టు హాలు కిక్కిరిసిపోయింది. కంచి మఠం సిబ్బంది, భక్తులు, నిందితుల బంధుగణం, జాతీయ, రాష్ట్ర మీడియా ప్రతినిధులతో కోర్టు ప్రాంగణం కిటకిటలాడింది. జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతితోపాటు నిందితులంతా కోర్టు హాలులోనే ఉన్నారు. తీర్పు అనంతరం ఏమీ మాట్లాడకుండానేనే కంచి స్వాములు.. వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం తిరుపతికి కారులో బయల్దేరి వెళ్లారు. దర్యాప్తు సరిగ్గా సాగలేదు.. ఉదయం 10.50 గంటలకు జడ్జి మురుగన్ కేసు విచారణను ప్రారంభించి మధ్యాహ్నం 12 గంటలకు తీర్పు వెలువరించారు. శంకరరామన్ హత్య కేసులో దర్యాప్తు ఆసాంతం సరైన మార్గంలో సాగలేదని ఆయన స్పష్టంచేశారు. కేసు దర్యాప్తులో అప్పటి కాంచీపురం ఎస్పీ ప్రేమ్‌కుమార్ అత్యుత్సాహం ప్రదర్శించారని తప్పుపట్టారు. జయేంద్ర సరస్వతికి బెయిల్ మం జూరు చేసిన సందర్భంగా సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని చెప్పినట్లు గుర్తుచేశారు. ప్రేమ్‌కుమార్ మితిమీరిన జోక్యం చేసుకోవడంతో దర్యాప్తు గతి తప్పిందని, కేసు దర్యాప్తు ప్రధాన అధికారి(సీఐవో) స్వతంత్రంగా వ్యవహరించలేదని వ్యాఖ్యానించారు. హత్య అని నిరూపించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని, అంతేగాక శంకరరామన్ భార్య పద్మ, కుమారుడు ఆనంద్‌శర్మ ప్రాసిక్యూషన్‌ను బలపరిచే విధంగా వ్యవహరించలేదన్నారు. హత్య కేసులో ప్రధాన కుట్రదారులుగా అభియోగాన్ని ఎదుర్కొన్న అప్పు, కదిరవన్ (ఆ తర్వాత హత్యకు గురయ్యాడు)లు తాము ఆ సమయంలో సంఘటన ప్రదేశంలో లేమని నిరూపించుకున్నారని వివరించారు. ఫిర్యాది గణేశన్‌తోపాటు కుప్పుస్వామి, దురైకన్ను తదితర సాక్షులు సైతం ప్రాసిక్యూషన్ వాదనను బలపరిచేలా వ్యవహరించలేదని పేర్కొన్నారు. హత్యకు పాల్పడిన వారిని గుర్తించడంలో శంకరరామన్ కుటుంబీకులు విఫలమయ్యారన్నారు. పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టిన డాక్యుమెంట్లు నిందితుల నేరాన్ని రుజువు చేయలేకపోయాయని చెప్పారు. దర్యాప్తు అధికారులు సాక్షులను బెదిరించి సంతకాలు తీసుకోవడం, కన్నయ్య అనే ఎస్సైని బెదిరించి విధులకు దూరంగా ఉంచడం వంటి తప్పిదాలకు పాల్పడ్డారని వ్యాఖ్యానించారు. ఏ కోణంలో చూసినా నిందితులపై మోపిన అభియోగాలపై బలమైన సాక్ష్యాలు లేవని తెలిపారు. అందువల్ల వారిని నిర్దోషులుగా భావిస్తున్నట్లు చెప్పారు. కేసు నేపథ్యం ఇదీ.. కంచి మంఠంలో నిధుల దుర్వినియోగం జరుగుతోందని పేర్కొంటూ ఆ మఠం ఆధీనంలో ఉన్న శ్రీవరదరాజపెరుమాళ్ ఆలయ మేనేజర్ శంకరరామన్ ప్రభుత్వానికి ఉత్తరాలపై ఉత్తరాలు రాశారు. ఈ నేపథ్యంలో 2004లో ఆయన ఆలయ ఆలయ ప్రాంగణంలోనే దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యకు సంబంధించి పోలీసులు కంచి మఠాధిపతులు జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి సహా పలువురిని నిందితులుగా చేర్చి అరెస్టు చేశారు. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడానికి ముందు జయేంద్ర సరస్వతి 61 రోజులపాటు జైలు జీవితం గడిపారు. పోలీసులు మొత్తం 1873 పేజీల చార్జిషీటును దాఖలు చేసి 712 డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించారు. 370 మందిని సాక్షులుగా చేర్చారు. వీరిలో 187 మందిని కోర్టు విచారించింది. ఎప్పుడేం జరిగింది? 2004, సెప్టెంబర్ 3: కాంచీపురంలోని శ్రీవరదరాజపెరుమాళ్ ఆలయ మేనేజర్ శంకరరామన్ హత్య 2004, నవంబర్ 11: దీపావళి రోజున మహబూబ్‌నగర్‌లో జయేంద్ర సరస్వతి అరెస్టు నవంబర్ 12: జయేంద్ర సరస్వతికి జ్యుడిషియల్ కస్టడీ విధించిన కోర్టు 2005, జనవరి 10: జయేంద్ర సరస్వతికి బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు. విజయేంద్ర సరస్వతి అరెస్టు జనవరి 21: నిందితులపై చార్జిషీటు దాఖలు చేసిన తమిళనాడు సిట్ పోలీసులు ఫిబ్రవరి 10: విజయేంద్ర సరస్వతికి బెయిల్ మంజూరు చేసిన మద్రాస్ హైకోర్టు మార్చి 6: కేసు విచారణను వేరే రాష్ట్రానికి మార్చాలంటూ జయేంద్ర సరస్వతి పిటిషన్.. తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు అక్టోబర్ 26: శంకరరామన్ హత్య కేసుపై విచారణను పుదుచ్చేరిలోని కోర్టుకు బదిలీ చేసిన సుప్రీం 2006, మార్చి 28: 24 మంది నిందితులపై అభియోగాలు నమోదు 2009, ఏప్రిల్ 2: పుదుచ్చేరిలోని ప్రధాన సెషన్స్ కోర్టులో విచారణ మొదలు 2010, జనవరి 21: కోర్టులో రవి సుబ్రహ్మణ్యం ఎదురు సాక్ష్యం 2013, మార్చి 21: కేసులో నిందితుడు కదిరవన్ చెన్నైలో హత్య. 23కు చేరిన నిందితుల సంఖ్య నవంబర్ 12: నవంబర్ 27న తీర్పు వెలువరించనున్నట్లు పుదుచ్చేరి లోని కోర్టు వెల్లడి నవంబర్ 27: జయేంద్ర సరస్వతితోపాటు నిందితులందరినీ నిర్దోషులుగా తేల్చిన కోర్టు -
కంచి స్వాములు నిర్దోషులు..
-
శంకర్ రామన్ హత్య కేసులో కంచి పీఠాధిపతులకు ఊరట
చెన్నై : కాంచీపురంలోని వరదారాజ పెరుమాళ్ ఆలయం మేనేజర్ శంకర్రామన్ హత్య కేసులో కంచి కామకోటి పీఠాధిపతులకు ఊరట లభించింది. జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి నిర్దోషులని పుదుచ్చేరి జిల్లా కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో స్వాముల ప్రమేయంపై దర్యాప్తు బృందం ఆధారాలు చూపలేకపోయారని కోర్టు అభిప్రాయపడింది. స్వాములతో పాటు మిగిలిన నిందితులపైనా అభియోగాలు నిరూపించడంలో దర్యాప్తు బృందం విఫలమవడంతో అందరినీ నిర్దోషులుగా న్యాయస్థానం ప్రకటించింది. 2004లో సెప్టెంబర్3న కాంచీపురంలోని వరదాజ పెరుమాళ్ ఆలయం మేనేజర్ శంకర్రామన్ ఆలయ ప్రాంగణంలో అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. దాంతో ఆ హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఆ హత్యలో కంచి పీఠాధిపతులు పాత్ర ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో కంచి పీఠాధిపతులు జయేంద్ర, విజయేంద్ర సరస్వతులతోపాటు పలువురిపై వివిధ సెక్షన్ల కింద నిందితులుగా కేసులు నమోదుయ్యాయి. ఈ కేసుకు సంబంధించి పుదుచ్చేరి కోర్టు 9 సంవత్సరాల పాటు 189 మంది సాక్షులను విచారించింది.