హిందూ సంప్రదాయాలు ప్రపంచానికే ఆదర్శం | hindu treditional inspiration .. vijayendra saraswathi | Sakshi
Sakshi News home page

హిందూ సంప్రదాయాలు ప్రపంచానికే ఆదర్శం

Published Tue, Nov 29 2016 10:50 PM | Last Updated on Mon, Sep 4 2017 9:27 PM

హిందూ దేశ సంప్రదాయాలు ప్రపంచానికే ఆదర్శప్రాయమైనవని కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారి శంకర విజయేంద్ర సరస్వతీ స్వామీజీ అన్నారు. గ్రామానికి చెందిన విశాఖపట్నం గాయత్రీ విద్యా పరిషత్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు పులగుర్త వ్యాఘ్రేశ్వరశర్మ దంపతుల

  • కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారి శంకరవిజయేంద్ర సరస్వతి
  • కోలంక (కాజులూరు) :
    హిందూ దేశ సంప్రదాయాలు ప్రపంచానికే ఆదర్శప్రాయమైనవని కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారి శంకర విజయేంద్ర సరస్వతీ స్వామీజీ అన్నారు. గ్రామానికి చెందిన విశాఖపట్నం గాయత్రీ విద్యా పరిషత్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు పులగుర్త వ్యాఘ్రేశ్వరశర్మ దంపతుల ఆహ్వానం మేరకు మంగళవారం ఆయన కోలంక వచ్చారు. స్వామీజీకి స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా పార్వతీ సమేత ఉమాసోమేశ్వరస్వామి ఆలయంలో స్వామీజీ పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. ప్రతి ఒక్కరూ హిందూ సంప్రదాయాలను పరిరక్షిస్తూ భావితరాలకు అందించాలన్నారు. అష్ట సోమేశ్వరాలయాల్లో ద్రాక్షారామ భీమేశ్వరాలయానికి తూర్పున ఉన్న కోలంక పార్వతీ సమేత ఉమాసోమేశ్వరస్వామి ఆలయానికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. కార్యక్రమంలో స్థానిక ఆలయాల పురోహితులు వింజరపు సత్యనారాయణాచార్యులు, ఖండవిల్లి శ్రీనివాసాచార్యులు, కొత్తలంక సుబ్రహ్మణ్యశర్మ, మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వరదా శేషారావు, పీఏసీఎస్‌ అధ్యక్షుడు డీవీ నరసింహరాజు తదితరులు పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement