విజయేంద్ర సరస్వతి స్వామి (ఫైల్ ఫోటో)
సాక్షి, చెన్నై: కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామిపై తమిళ సంఘాల ఆగ్రహం చల్లారడం లేదు. తమిళతల్లి గీతాన్నీ ఆయన అవమానించారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కంచిలోని శంకరమఠం ఒక ప్రకటన విడుదల చేసింది. తమిళతల్లి గీతం ఆలాపిస్తున్నప్పుడు విజయేంద్ర సరస్వతి ధ్యానంలో ఉండి నిలబడలేకపోయారని, అది తమిళ భాషను అవమానించినట్టుగా భావించవద్దని శంకరమఠం కోరింది.
కానీ జాతీయగీతం ఆలాపన సమయంలో గౌరవంగా లేచి నిలబడిన విజయేంద్ర సరస్వతి.. తమిళతల్లి గీతాన్ని ఆలాపిస్తున్నప్పుడు లేచినిలడకపోవడం.. అవమానించడమేనని పలు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కాంచీపురంలోని శంకరమఠం ముట్టడికి తమిళ విద్యార్థి సంఘాలు ఆదివారం ప్రయత్నించాయి. ముందస్తు సమాచారం లేకుండా విద్యార్థి సంఘాలు మఠం ముందు గుమికూడటంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు ఆందోళనకారుల నడుమ తోపులాట జరిగింది. ఆధ్యాత్మికతకు నిలయమైన శంకరమఠం ముట్టడికి ప్రయత్నించడం చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment