Womens Grand Prix chess tournament
-
ఎదురులేని హంపి
పుణే: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్ ఐదో అంచె చెస్ టోర్నమెంట్లో భారత స్టార్ గ్రాండ్‌మాస్టర్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కోనేరు హంపి జోరు కొనసాగుతోంది. మంగోలియాకు చెందిన అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) బత్కుయాగ్ మున్‌గున్‌తుల్‌తో ఆదివారం జరిగిన ఆరో రౌండ్ గేమ్‌లో నల్ల పావులతో ఆడిన హంపి 33 ఎత్తుల్లో గెలుపొందింది. ఈ టోర్నీలో హంపికిది మూడో విజయం కావడం విశేషం. మరో మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్న హంపి 4.5 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. భారత్‌కే చెందిన మరో స్టార్ గ్రాండ్‌మాస్టర్, హైదరాబాద్‌కు చెందిన ద్రోణవల్లి హారిక, ప్రపంచ జూనియర్ చాంపియన్ దివ్య దేశ్‌ముఖ్‌ల మధ్య జరిగిన ఆరో రౌండ్ గేమ్ ‘డ్రా’గా ముగిసింది. 27 ఎత్తులయ్యాక గేమ్‌లో ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇద్దరూ ‘డ్రా’కు అంగీకరించారు. భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ వైశాలి రమేశ్‌బాబు రెండో పరాజయాన్ని చవిచూసింది. జు జినెర్ (చైనా)తో జరిగిన ఆరో రౌండ్ గేమ్‌లో వైశాలి 41 ఎత్తుల్లో ఓడిపోయింది. మెలియా సలోమి (జార్జియా)తో జరిగిన మరో గేమ్‌లో పొలీనా షువలోవా (రష్యా) 45 ఎత్తుల్లో గెలిచింది. నుర్గుల్ సలీమోవా (బల్గేరియా), అలీనా కష్లిన్స్కాయా (పోలాండ్) మధ్య జరిగిన మరో గేమ్ 67 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. పది మంది అగ్రశ్రేణి క్రీడాకారిణుల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది. ఆరో రౌండ్ తర్వాత జు జినెర్ ఐదు పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. దివ్య దేశ్‌ముఖ్ నాలుగు పాయింట్లతో మూడో స్థానంలో, ద్రోణవల్లి హారిక మూడు పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నారు. నేడు జరిగే ఏడో రౌండ్ గేముల్లో సలోమితో సలీమోవా; అలీనాతో వైశాలి; జు జినెర్‌తో హంపి; మున్‌గున్‌తుల్‌తో దివ్య దేశ్‌ముఖ్; పొలీనాతో హారిక తలపడతారు. -
హంపి–హారిక గేమ్ ‘డ్రా’
పుణే: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్ ఐదో అంచె చెస్ టోర్నమెంట్లో భారత స్టార్ గ్రాండ్‌మాస్టర్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కోనేరు హంపి అజేయపరంపర కొనసాగుతోంది. భారత్‌కే చెందిన మరో స్టార్ గ్రాండ్‌మాస్టర్, హైదరాబాద్‌కు చెందిన ద్రోణవల్లి హారికతో శుక్రవారం జరిగిన ఐదో రౌండ్ గేమ్‌ను హంపి ‘డ్రా’గా ముగించింది. తెల్ల పావులతో ఆడిన హంపి గేమ్‌ను 19 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. ఐదో రౌండ్ తర్వాత హంపి 3.5 పాయింట్లతో ప్రపంచ జూనియర్ చాంపియన్ దివ్య దేశ్ముఖ్తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉంది. ఈ టోర్నీలో హంపి రెండు గేముల్లో గెలిచి, మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకుంది. పొలీనా షువలోవా (రష్యా)తో జరిగిన గేమ్‌ను దివ్య దేశ్‌ముఖ్ 72 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్, తమిళనాడు అమ్మాయి వైశాలి రమేశ్‌బాబు ఈ టోర్నీలో తొలి విజయాన్ని అందుకుంది. బత్కుయాగ్ మున్‌గున్‌తుల్ (మంగోలియా)తో జరిగిన గేమ్‌లో వైశాలి తెల్లపావులతో ఆడుతూ 52 ఎత్తుల్లో గెలుపొందింది. జు జినెర్ (చైనా)–నుర్గుల్ సలీమోవా (బల్గేరియా) మధ్య జరిగిన గేమ్ 71 ఎత్తుల్లో... మెలియా సలోమి (జార్జియా)–అలీనా కష్లిన్స్కాయా (పోలాండ్) మధ్య జరిగిన గేమ్ 41 ఎత్తుల్లో ‘డ్రా’ అయ్యాయి. పది మంది అగ్రశ్రేణి క్రీడాకారిణుల మధ్య తొమ్మిది రౌండ్లపాటు జరుగుతున్న ఈ టోర్నీలో ఐదో రౌండ్ తర్వాత జు జినెర్ నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. శనివారం విశ్రాంతి దినం. ఆదివారం జరిగే ఆరో రౌండ్ గేముల్లో దివ్య దేశ్ముఖ్తో ద్రోణవల్లి హారిక; బత్కుయాగ్ మున్‌గున్‌తుల్‌తో కోనేరు హంపి; జు జినెర్‌తో వైశాలి; పొలీనా షువలోవాతో మెలియా సలోమి; నుర్గుల్ సలీమోవాతో అలీనా కష్లిన్స్కాయా తలపడతారు. -
హంపి గేమ్ ‘డ్రా’... హారిక పరాజయం
పుణే: ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్ ఐదో అంచె చెస్ టోర్నమెంట్లో తొలి రోజు నలుగురు భారత క్రీడాకారిణులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, వైశాలి రమేశ్‌బాబు తమ తొలి గేమ్‌లను ‘డ్రా’ చేసుకోగా... ద్రోణవల్లి హారిక పరాజయం చవిచూసింది. ప్రపంచ జూనియర్ చాంపియన్ దివ్య దేశ్‌ముఖ్ విజయంతో శుభారంభం చేసింది. సోమవారం జరిగిన తొలి రౌండ్ గేముల్లో భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్ వైశాలితో నల్లపావులతో ఆడిన ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్ హంపి 53 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. చైనా గ్రాండ్‌మాస్టర్ జు జినెర్ 53 ఎత్తుల్లో హారికపై గెలుపొందింది. నుర్గుల్ సలీమోవా (బల్గేరియా)తో జరిగిన గేమ్‌లో నల్లపావులతో పోటీపడ్డ దివ్య దేశ్‌ముఖ్ 53 ఎత్తుల్లో నెగ్గడం విశేషం. భారత ప్లేయర్ల గేమ్‌లన్నీ 53 ఎత్తుల్లోనే ముగియడం గమనార్హం. ఇతర తొలి రౌండ్ గేముల్లో బత్కుయాగ్ మున్‌గున్‌తుల్ 85 ఎత్తుల్లో మెలియా సలోమీ (జార్జియా)పై, పొలీనా షువలోవా (రష్యా) 57 ఎత్తుల్లో అలీనా కష్లిన్స్కాయా (పోలాండ్)పై గెలుపొందారు. మొత్తం 10 మంది ప్లేయర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరగనుంది. -
రన్నరప్ హంపి
మోంటెకార్లో (మొనాకో): మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్ మూడో టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్, ఆంధ్రప్రదేశ్ స్టార్ కోనేరు హంపి రన్నరప్‌గా నిలిచింది. గురువారం మొనాకాలో ముగిసిన ఈ టోర్నీలో నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత హంపి, అలెగ్జాండ్రా గొర్యాక్చినా (రష్యా), బత్కుయాగ్ మున్‌గున్‌తుల్ (మంగోలియా) 5.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను నిర్ధారించగా... గొర్యాక్చినాకు టైటిల్ ఖరారైంది. హంపి రన్నరప్‌గా నిలిచింది. మున్గున్తుల్కు మూడో స్థానం లభించింది. చివరిదైన తొమ్మిదో రౌండ్లో హంపి 55 ఎత్తుల్లో బీబీసారా అసాబయెవా (కజకిస్తాన్)పై గెలిచింది. ఇదే టోర్నీలో ఆడిన హైదరాబాద్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక నాలుగు పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచింది. -
International Chess Federation: రన్నరప్ హంపి
మ్యూనిక్ (జర్మనీ): అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ఆధ్వర్యంలో జరిగిన మహిళలగ్రాండ్ప్రి సిరీస్ రెండో టోర్నమెంట్లో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి రన్నరప్‌గా నిలిచింది. సోమవారం ముగిసిన ఈ టోర్నీలో హంపి 7 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. తాన్ జోంగీ (చైనా)తో జరిగిన చివరిదైన 11వ రౌండ్ గేమ్‌ను హంపి 31 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. 12 మంది మేటి క్రీడాకారిణుల మధ్య 11 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో హంపి అజేయంగా నిలిచింది. ఎనిమిది గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్న హంపి మూడు గేముల్లో విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 6 పాయింట్లతో నాలుగో ర్యాంక్‌లో నిలిచింది. 11వ రౌండ్లో నానా జాగ్‌నిద్జెతో జరిగిన గేమ్‌ను హారిక 11 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. హారిక కూడా ఈ టోర్నీలో ఒక్క గేమ్‌లోనూ ఓడిపోలేదు. 10 గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్న హారిక ఒక గేమ్‌లో గెలిచింది. 7.5 పాయింట్లతో అలెగ్జాండ్రా కొస్టెనిక్ (రష్యా) విజేతగా అవతరించింది. చివరి గేమ్‌లో అలెగ్జాండ్రా కొస్టెనిక్ 64 ఎత్తుల్లో జినెల్ జు (చైనా) చేతిలో ఓడిపోయింది. నాలుగు గ్రాండ్‌ప్రి సిరీస్‌లలో భాగంగా మూడో టోర్నీ వచ్చే నెలలో భారత్‌లో జరుగుతుంది. -
విజేత కోనేరు హంపి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్, భారత మహిళల నంబర్‌వన్ చెస్ ప్లేయర్, ప్రపంచ నాలుగో ర్యాంకర్ కోనేరు హంపి అద్భుతం చేసింది. రష్యాలోని స్కోల్‌కోవోలో జరిగిన మహిళల గ్రాండ్‌ప్రి (డబ్ల్యూజీపీ) సిరీస్ 2019–2020 తొలి టోరీ్నలో ఆమె చాంపియన్‌గా అవతరించింది. ఆరేళ్ల విరామం తర్వాత హంపి డబ్ల్యూజీపీ టైటిల్ సాధించడం విశేషం. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో 32 ఏళ్ల హంపి అజేయంగా నిలిచింది. 12 మంది మేటి క్రీడాకారిణుల మధ్య 11 రౌండ్లపాటు జరిగిన ఈ టోరీ్నలో ఆమె 8 పాయింట్లతో అగ్రస్థానాన్ని అలంకరించింది. 7.5 పాయింట్లతో జు వెన్జున్ రెండో స్థానంలో నిలిచింది. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ జు వెన్జున్ (చైనా)తో జరిగిన చివరి గేమ్‌ను హంపి 35 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. ఓవరాల్‌గా ఈ టోరీ్నలో హంపి ఐదు గేముల్లో గెలిచి, ఆరింటిని ‘డ్రా’గా ముగించింది. ద్రోణవల్లి హారిక (భారత్), మేరీ సెబాగ్ (ఫ్రాన్స్), కొస్టెనిక్ (రష్యా), గొర్యాచికినా (రష్యా), కాటరీనా లాగ్నో (రష్యా), జు వెన్జున్ (చైనా)లతో గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్న హంపి... అలీనా కాష్లిన్ స్కాయ (రష్యా), పియా క్రామ్లింగ్ (స్వీడన్), స్టెఫనోవా (బల్గేరియా), ఎలిజబెత్ పెట్జ్ (జర్మనీ), వాలెంటినా గునీనా (రష్యా)లపై విజయం సాధించింది. విజేతగా నిలిచిన హంపికి 15 వేల యూరోల (రూ. 11 లక్షల 75 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 160 పాయింట్లు లభించాయి. ఇదే టోర్నీలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ హారిక ఐదు పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. ►7 హంపి కెరీర్లో నెగ్గిన గ్రాండ్‌ప్రి టైటిల్స్. తాజా టైటిల్‌కంటే ముందు ఆమె 2013లో దిలిజాన్ (అర్మేనియా), తాషె్కంట్ (ఉజ్బెకిస్తాన్); 2012లో కజాన్ (రష్యా), అంకారా (టరీ్క); 2009లో ఇస్తాంబుల్ (టరీ్క), దోహా (ఖతర్) టోరీ్నల్లో విజేతగా నిలిచింది. -
ఆధిక్యంలో హారిక
చెంగ్డూ (చైనా): ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఆరు పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలో కొనసాగుతోంది. బేలా ఖొటెనాష్విలి (జార్జియా)తో మంగళవారం జరిగిన తొమ్మిదో రౌండ్ గేమ్‌ను హారిక 30 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి 88 ఎత్తుల్లో ముజిచుక్ (ఉక్రెయిన్) చేతిలో ఓడింది. హంపి ఐదు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. హరికృష్ణ గేమ్ ‘డ్రా’: చైనాలోనే జరుగుతున్న సూపర్ గ్రాండ్‌మాస్టర్స్ టోర్నీలో హరికృష్ణ రెండో ‘డ్రా’ నమోదు చేశాడు. యు వాంగ్ (చైనా)తో జరిగిన ఐదో రౌండ్ గేమ్‌ను 46 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. -
ఆధిక్యంలో హారిక
చెంగ్డూ (చైనా): ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఒంటరిగా ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రపంచ మాజీ చాంపియన్ అంటోనెటా స్టెఫనోవా (బల్గేరియా)తో ఆదివారం జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌ను హారిక కేవలం 16 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. ఎనిమిదో రౌండ్ తర్వాత హారిక 5.5 పాయింట్లతో ఆధిక్యంలో ఉంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి నాలుగో ‘డ్రా’ నమోదు చేసింది. పియా క్రామ్లింగ్ (స్వీడన్)తో జరిగిన గేమ్‌ను హంపి 47 ఎత్తుల్లో ‘డ్రా’ చేసింది. హంపి, జూ వెన్జున్ (చైనా), స్టెఫనోవా 5 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. సోమవారం విశ్రాంతి దినం. మంగళవారం జరిగే తొమ్మిదో రౌండ్లో బేలా ఖోటెనాష్విలి (జార్జియా)తో హారిక; అనా ముజిచుక్ (ఉక్రెయిన్)తో హంపి తలపడతారు. హరికృష్ణ విజయం: చైనాలోనే జరుగుతున్న డాన్‌జూ సూపర్ గ్రాండ్‌మాస్టర్స్ టోర్నమెంట్లో హైదరాబాద్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ తొలి విజయాన్ని సాధించాడు. డింగ్ లిరెన్ (చైనా)తో ఆదివారం జరిగిన మూడో రౌండ్ గేమ్‌లో హరికృష్ణ 41 ఎత్తుల్లో గెలిచాడు. మూడో రౌండ్ తర్వాత హరికృష్ణ 1.5 పాయింట్లతో మరో ముగ్గురితో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. -
హంపిపై హారిక గెలుపు
చెంగ్డూ (చైనా): ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్ ఏడో రౌండ్లో హారిక 74 ఎత్తుల్లో హంపిపై విజయం సాధించింది. హంపిపై హారికకిదే తొలి విజయం కావడం విశేషం. తాజా గెలుపుతో హారిక ఈ టోర్నీలో 5 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ టోర్నీలో తొలి పరాజయం చవిచూసిన హంపి 4.5 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. హరికృష్ణ గేమ్ ‘డ్రా’: చైనాలోనే జరుగుతున్న డాన్‌జూ సూపర్ గ్రాండ్‌మాస్టర్స్ టోర్నీలో హరికృష్ణ తొలి ‘డ్రా’ నమోదు చేశాడు. వాసిలీ ఇవాన్చుక్ (ఉ క్రెయిన్)తో శనివారం జరిగిన రెండో రౌండ్ గేమ్‌ను హరికృష్ణ 93 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. -
హారిక, హంపి గేమ్‌లు ‘డ్రా’
చెంగ్డూ (చైనా): ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక మరో ‘డ్రా’ను నమోదు చేసుకున్నారు. శుక్రవారం జరిగిన ఆరో రౌండ్లో జూ వెన్జున్ (చైనా)తో హంపి 27 ఎత్తుల్లో... అనా ముజిచుక్ (ఉక్రెయిన్)తో హారిక 30 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నారు. ఆరో రౌండ్ తర్వాత హంపి 4.5 పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలో కొనసాగుతుండగా... హారిక నాలుగు పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉంది. హరికృష్ణకు షాక్: మరోవైపు చైనాలోనే జరుగుతున్న డాన్‌జూ సూపర్ గ్రాండ్‌మాస్టర్స్ టోర్నమెంట్లో హైదరాబాద్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణకు తొలి రౌండ్లోనే ఓటమి ఎదురైంది. బూ జియాంగ్జి (చైనా)తో శుక్రవారం జరిగిన తొలి రౌండ్లో హరికృష్ణ 57 ఎత్తుల్లో ఓడిపోయాడు. -
హంపికి తొలి విజయం
మోంటెకార్లో (మొనాకో): ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి తొలి విజయాన్ని నమోదు చేసింది. ప్రపంచ నంబర్‌వన్ హూ ఇఫాన్ (చైనా)తో జరిగిన రెండో గేమ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ హంపి 75 ఎత్తుల్లో గెలిచింది. పొగోనినా (రష్యా)తో జరిగిన తొలి రౌండ్ గేమ్‌ను హంపి 56 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. మొత్తం 11 రౌండ్లపాటు జరిగే ఈ టోర్నమెంట్ ఈనెల 15 వరకు జరుగుతుంది.