Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Ys Jagan Tweet On Chandrababu Cheap Politics1
బాబు దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం ఇది: వైఎస్‌ జగన్‌

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు అరాచకాలను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలదీశారు. ‘‘చంద్రబాబు.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారని.. ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ, గూండాయిజం చేస్తూ, ప్రలోభాలు, బెదిరింపులకు దిగి విశాఖపట్నం మేయర్‌గా ఉన్న బీసీ మహిళను పదవినుంచి దించేయడం, మీరు చేస్తున్న దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం’’ అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.‘‘ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం 98 డివిజన్లు ఉన్న విశాఖపట్నం కార్పొరేషన్‌లో వైఎస్సార్‌సీపీ గుర్తుపై పోటీచేసి 58 స్థానాలను మా పార్టీవాళ్లు గెలుచుకోగా, టీడీపీ కేవలం 30 సీట్లు మాత్రమే గెలిచింది. మరి మీకు మేయర్‌ పదవి ఏరకంగా వస్తుంది?..బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ యాదవకులానికి చెందిన మహిళను మేం మేయర్‌ పదవిలో కూర్చోబెడితే, మీరు అధికార దుర్వినియోగం చేస్తూ, కోట్లాది రూపాయలతో ప్రలోభపెట్టి, పోలీసులను దుర్వినియోగం చేస్తూ, బెదిరిస్తూ, అప్పటికీ లొంగకపోతే మా పార్టీ కార్పొరేటర్లు విడిది చేసిన హోటల్‌పై మీ నాయకులతోనూ, పోలీసులతోనూ దాడులు చేయించారు. దీనికి సంబంధించిన సీసీ కెమెరా వీడియోలు ఇప్పుడు ప్రజల ముందే ఉన్నాయి. మరి దీన్ని ప్రజాస్వామ్యం అంటారా? అవిశ్వాసం ప్రక్రియ స్వేచ్ఛగా జరిగిందని అనుకోవాలని అంటారా? అధికార దుర్వినియోగం కాదా ఇది?’’ అంటూ వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు.‘‘మరో ఏడాది గడిస్తే ఇప్పుడున్న కౌన్సిల్‌ పదవీకాలం పూర్తవుతుందని తెలిసీ, మళ్లీ ఎన్నికలు వస్తాయని తెలిసి కూడా, ప్రజలకు ఫలానా మంచి చేశాను అని చెప్పి ఓట్లు అడిగే ధైర్యం చంద్రబాబూ.. మీకులేదు. అందుకే అన్యాయమైన రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని సమాధి చేస్తున్నారు. మీ అప్రజాస్వామిక విధానాలకు దేవుడు, ప్రజలే గుణపాఠం చెప్తారు.ఇన్ని ప్రలోభాలు పెట్టినా, బెదిరింపులకు గురిచేసినా తలొగ్గక పార్టీవైపు, ప్రజలవైపు నీతి, నిజాయితీగా నిలబడి చిత్తశుద్ధి చాటుకున్న వైయస్సార్‌సీపీ కార్పొరేటర్లను, అలాగే వామపక్షాలకు చెందిన కార్పొరేటర్లను అభినందిస్తున్నాను.రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో తమకు అధికారం లేకపోయినా అధికార దుర్వినియోగం, కండబలంతో వాటిని చేజిక్కించుకోవడానికి చంద్రబాబుగారి కుటిల ప్రయత్నాలను దీటుగా ఎదుర్కొని నిలబడుతున్న మా పార్టీ నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు మరోసారి హ్యాట్సాప్‌ చెప్తున్నా’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. .@ncbn గారు.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారు. ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ, గూండాయిజం చేస్తూ, ప్రలోభాలు, బెదిరింపులకు దిగి విశాఖపట్నం మేయర్‌గా ఉన్న బీసీ మహిళను పదవినుంచి దించేయడం, మీరు చేస్తున్న దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం.ప్రజలు ఇచ్చిన…— YS Jagan Mohan Reddy (@ysjagan) April 19, 2025

IPL 2025: Lucknow Super Giants Beat Rajasthan Royals By 2 Runs2
గెలుపు వాకిట బోర్లా పడిన రాయల్స్‌.. ఉత్కంఠ పోరులో లక్నోను గెలిపించిన ఆవేశ్‌ ఖాన్‌

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 19) రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌పై లక్నో సూపర్‌ జెయింట్స్‌ 2 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేయగా.. రాయల్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులకే పరిమితమైంది. చివరి ఓవర్‌లో రాయల్స్‌ గెలుపుకు 9 పరుగులు అవసరం కాగా.. ఆవేశ్‌ ఖాన్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి కేవలం 6 పరుగులే ఇచ్చాడు. లక్నో ఇన్నింగ్స్‌లో మార్క్రమ్‌ 66, ఆయుశ్‌ బదోని 50 పరుగులు చేయగా.. ఆఖర్లో అబ్దుల్‌ సమద్‌ 10 బంతుల్లో 30 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిచెల్‌ మార్ష్‌ (4), పంత్‌ (3) విఫలమయ్యారు. రాజస్థాన్‌ బౌలర్లలో హసరంగ 2 వికెట్లు పడగొట్టగా.. జోఫ్రా ఆర్చర్‌, సందీప్‌ శర్మ, తుషార్‌ దేశ్‌పాండే తలో వికెట్‌ దక్కించుకున్నారు.ఛేదనలో యశస్వి జైస్వాల్‌ (74), వైభవ్‌ సూర్యవంశీ (34), రియాన్‌ పరాగ్‌ (39) అద్భుతంగా ఆడినప్పటికీ.. రాయల్స్‌ ఒత్తిడికి చిత్తై గెలుపు వాకిట బోర్లా పడింది. రాయల్స్‌ ఈ సీజన్‌లో ఇలా ఓడటం ఇది రెండో సారి. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లోనూ రాయల్స్‌ గెలుస్తుందనుకుంటే సూపర్‌ వరకు వెళ్లి ఓటమిపాలైంది. ఆవేశ్‌ ఖాన్‌ (4-0-37-3) ఒంటిచేత్తో రాయల్స్‌ నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు.

RR VS LSG: Youngest IPL Debutant Vaibhav Suryavanshi Smashes First Ball Six3
కెరీర్‌లో తొలి బంతికే సిక్సర్‌.. చరిత్రపుటల్లోకెక్కిన 14 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ

14 ఏళ్ల 23 రోజుల వయసులోనే ఐపీఎల్‌ అరంగేట్రం చేసి లీగ్‌లో అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించిన రాజస్థాన్‌ ఆటగాడు వైభవ్‌ సూర్యవంశీ.. ఐపీఎల్‌ కెరీర్‌లో తానెదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచి మరో రికార్డు నెలకొల్పాడు. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో తొలి బంతికే (కెరీర్‌లో) సిక్సర్‌ బాదిన 10వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.ఐపీఎల్‌ కెరీర్‌లో తొలి బంతికే సిక్సర్‌ బాదిన ఆటగాళ్లు..రాబ్ క్వినీ (RR)కెవోన్ కూపర్ (RR)ఆండ్రీ రస్సెల్ (KKR)కార్లోస్ బ్రాత్‌వైట్ (DD)అనికేత్ చౌదరి (RCB)జావోన్ సియర్ల్స్ (KKR)సిద్దేష్ లాడ్ (MI)మహేష్ తీక్షణ (CSK)సమీర్ రిజ్వీ (CSK)వైభవ్‌ సూర్యవంశీ (RR)A VIDEO TO REMEMBER IN IPL HISTORY 👑- ITS VAIBHAV SURYAVANSHI..!!!! pic.twitter.com/ZuKskRWyI7— Johns. (@CricCrazyJohns) April 19, 2025ఐపీఎల్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కులైన ఆటగాళ్లు..14y 23d - వైభవ్ సూర్యవంశీ (RR) vs LSG, 2025*16y 157d - ప్రయాస్ రే బర్మన్ (RCB) vs SRH, 201917y 11d - ముజీబ్ ఉర్ రెహ్మాన్ (PBKS) vs DC, 201817y 152d - రియాన్ పరాగ్ (RR) vs CSK, 201917y 179d - ప్రదీప్ సాంగ్వాన్ (DC) vs CSK, 2008మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. లక్నో ఇన్నింగ్స్‌లో మార్క్రమ్‌ 66, ఆయుశ్‌ బదోని 50 పరుగులు చేయగా.. ఆఖర్లో అబ్దుల్‌ సమద్‌ 10 బంతుల్లో 30 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిచెల్‌ మార్ష్‌ (4), పంత్‌ (3) విఫలమయ్యారు. రాజస్థాన్‌ బౌలర్లలో హసరంగ 2 వికెట్లు పడగొట్టగా.. జోఫ్రా ఆర్చర్‌, సందీప్‌ శర్మ, తుషార్‌ దేశ్‌పాండే తలో వికెట్‌ దక్కించుకున్నారు.అనంతరం ఛేదనకు దిగిన రాయల్స్‌ ఆది నుంచే దూకుడుగా ఆడుతుంది. తొలి బంతికే సిక్సర్‌ కొట్టిన సూర్యవంశీ 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 34 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో ఆవేశ్‌ ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చి నితీశ్‌ రాణా (8) ఔటయ్యాడు. 10 ఓవర్ల తర్వాత రాయల్స్‌ స్కోర్‌ 94/2గా ఉంది. యశస్వి జైస్వాల్‌ (52), రియాన్‌ పరాగ్‌ క్రీజ్‌లో ఉన్నారు.

YV Subba Reddy Strong Counter To Vijaysai Reddy Comments4
అధికారంలో ఉన్నప్పుడు విజయసాయే చక్రం తిప్పింది

విజయవాడ, సాక్షి: లిక్కర్‌ కేసు విచారణ సందర్భంగా రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వైఎస్సార్‌సీపీ కోటరీ వ్యాఖ్యలకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ పడింది. అసలు అలాంటి కోటరీ ఒకటి ఉందో లేదో ఆయనకే తెలియాలి అంటూ వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విజయసాయికి చురకలు అంటించారు. శనివారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘విజయసాయిరెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోయాక ఏదోరకంగా అభియోగాలు మోపాలని చూస్తున్నారు. ఆయన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు. పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లు ఆయనే కదా ప్రధానంగా చక్రం తిప్పింది. అలాంటప్పుడు పార్టీలో కోటరీ ఉందో? లేదో?.. కోటరీ నడిపిందెవరో ఆయనకు తెలియదా?. ఇప్పుడేమో నెంబర్‌ 2 నుంచి 2 వేల స్థానానికి పడిపోయానని ఆయనే చెప్పుకుంటున్నాడు. .. మేం అధికారంలో ఉన్నప్పుడు మా అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నాయకులతో, అధికారులతో చర్చించాకే నిర్ణయాలు తీసుకునేవారు. మా పార్టీలో నెంబర్ 2 స్థానం అనేది ఎప్పుడూ లేదు.. రాబోయే రోజుల్లో కూడా ఉండదు. మా పార్టీలో నెంబర్‌ వన్‌ నుంచి 100 వరకూ అన్నీ జగన్ మోహన్ రెడ్డే’’ అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ‘‘మా హయాంలో ఎలాంటి స్కాములు జరగలేదు. కూటమి అధికారంలోకి వచ్చాక వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారు. లిక్కర్ స్కామ్ అంటూ భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. భయపెట్టి కొంతమందిని లొంగదీసుకునే కార్యక్రమం చేస్తున్నారు. అన్నింటి పైనా న్యాయపోరాటం చేస్తాం’’ అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

Upcoming Visual Experience Movies Updates in Tollywood5
మరో ప్రపంచం పిలుస్తోంది... రండి!

వెండితెరపై ఆడియన్స్‌కు అద్భుతమైన విజువల్‌ ఎక్స్‌పీరియన్స్, సినిమాటిక్‌ టెక్నాలజీని చూపించేందుకు మన తెలుగు హీరోలు, దర్శక–నిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇందుకోసం కథల్లో సరికొత్త ప్రపంచాలను, ప్రాంతాలను క్రియేట్‌ చేసి, ఆడియన్స్‌ను ఆహ్వానించేందుకు రెడీ అవుతున్నారు. ఇలా ‘మరో ప్రపంచం పిలుస్తోంది... రండి’ అంటూ ఆడియన్స్‌ను థియేటర్స్‌కు తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్న కొన్ని చిత్రాలపై కథనం.విశ్వంభర వరల్డ్‌ఫాంటసీ జానర్‌లో చిరంజీవి హీరోగా ‘అంజి, జగదేకవీరుడు అతిలోక సుందరి’ వంటి సినిమాలొచ్చాయి. కొంత గ్యాప్‌ తర్వాత చిరంజీవి మళ్లీ ఈ జానర్‌లో ‘విశ్వంభర’ మూవీ చేస్తున్నారు. ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ‘బింబిసార’ సినిమాలో కొంత భాగం కథ 500బీసీ టైమ్‌లో సాగుతుంది. ఈ సీక్వెన్స్‌లో వచ్చే సన్నివేశాలు సిల్వర్‌ స్క్రీన్‌పై ఆడియన్స్‌కు మంచి విజువల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చాయి. కాగా మరోసారి తన విజువల్‌ విజన్‌ను ‘విశ్వంభర’ సినిమాలోనూ చూపించనున్నారు వశిష్ఠ. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్‌లో సరికొత్త విజువల్స్‌ కనిపిస్తున్నాయి.పంచభూతాలైన గాలి, నీరు, ఆకాశం, నిప్పు, భూమి ఈ సినిమా కథలో కీలకంగా ఉంటాయనే ప్రచారం సాగుతోంది. ఇలా ‘విశ్వంభర’ సినిమాలోని కొంత భాగం ఆడియన్స్‌ను మరో ప్రపంచానికి తీసుకువెళ్తుందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. ఒక స్పెషల్‌ సాంగ్‌ మినహా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిందని తెలిసింది. పోస్ట్‌ ప్రోడక్షన్‌ వర్క్స్‌ శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ మూవీ రిలీజ్‌ డేట్‌పై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.ఇక ఈ మూవీలో ఆంజనేయ స్వామి భక్తుడు భీమవరం దొరబాబు పాత్రలో చిరంజీవి కనిపిస్తారని తెలిసింది. త్రిషా, ఆషికా రంగనాథ్‌ ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా నటించగా, చిరంజీవి చెల్లెలి పాత్రల్లో ఇషా చావ్లా, పసుపులేటి రమ్య కనిపిస్తారని సమాచారం. యూవీ క్రియేషన్స్‌పై వంశీ, ప్రమోద్, విక్రమ్‌ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.నాలుగో ప్రపంచం కూడా ఉందా? కురుక్షేత్ర యుద్ధానికి ఆరువేల సంవత్సరాల తర్వాత ప్రపంచం ఎలా ఉండబోతోందో ఊహించి, దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తీసిన సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ప్రభాస్‌ హీరోగా, అమితాబ్‌ బచ్చన్, దీపికా పదుకోన్‌ ఇతర కీలక పాత్రల్లో నటించిన చిత్రం ఇది. ఈ మూవీలో 2898 ఏడీ సమయంలో కాశీ నగరం ఎలా ఉంటుందో ఊహాత్మకంగా, కల్పితంగా స్క్రీన్‌పై ఆడియన్స్‌కు చూపించారు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. అలాగే ఇదే చిత్రంలో కాంప్లెక్స్, శంభాల అనే మరో రెండు కొత్త ప్రపంచాలను కూడా చూపించారు.అయితే నాలుగో ప్రపంచం కూడా ఉందని, ఇది ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్‌ ‘కల్కి 2898 ఏడీ పార్ట్‌ 2’లో కనిపిస్తుందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. ఇక ప్రస్తుతం ‘కల్కి 2898 ఏడీ’ సినిమా సీక్వెల్‌ ప్రీప్రోడక్షన్‌ వర్క్స్‌తో బిజీగా ఉన్నారు నాగ్‌ అశ్విన్‌. తొలి భాగం చిత్రీకరణ సమయంలోనే సీక్వెల్‌ని కూడా కొంత భాగం చిత్రీకరించారట. అయితే సీక్వెల్‌ చిత్రీకరణ 2026లో పూర్తి స్థాయిలో ప్రారంభం కావొచ్చని, 2028ప్రారంభంలో ఈ మూవీ రిలీజ్‌ అవుతుందనే టాక్‌ ప్రచారంలో ఉంది. ఇక ఈ మూవీని భారీ బడ్జెట్‌తో వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి.అశ్వనీదత్‌ నిర్మించనున్నారు.అలాగే ప్రభాస్‌ హీరోగా ‘హను–మాన్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో ‘బ్రహ్మరాక్షస’ అనే మూవీ రానుందని, ఈ మూవీ కోసం ప్రశాంత్‌ వర్మ ఓ అద్భుతమైన ప్రపంచాన్ని రెడీ చేస్తున్నారని ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇంకా ప్రభాస్‌ మరో మూవీ ‘సలార్‌’ కోసం ఖాన్సార్‌ అనే ఓ కొత్తప్రాంతాన్ని సృష్టించారు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. ఈ ఖాన్సార్‌ గురించి మరింతగా ‘సలార్‌’ రెండో భాగం ‘సలార్‌: శౌర్యాంగపర్వం’లో ఉండనున్నట్లుగా తెలిసింది.సైన్స్‌ లోకం ఆడియన్స్‌ను ఓ సరికొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లనున్నారు హీరో అల్లు అర్జున్‌. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా ఓ మూవీ రానుంది. ఈ మూవీ కోసం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించనున్నారట అట్లీ. ఇందుకోసమే ప్రస్తుతం అట్లీ విదేశీ వీఎఫ్‌ఎక్స్‌ నిపుణులతో కలిసి ఈ సినిమా ప్రీప్రోడక్షన్‌ వర్క్స్‌ చేస్తున్నారు. ఈ ప్రీప్రోడక్షన్‌ వర్క్స్‌ శరవేగంగా జరుగుతున్నాయి. వెండితెరపై అట్లీ చూపించనున్న ఈ సరికొత్త సైన్స్‌ ఫిక్షన్‌ మూవీలో కొన్ని కొత్త రకాల జంతువులు కూడా కనిపిస్తాయనే ప్రచారం సాగుతోంది.అంతేకాదు... ఈ మూవీలో అల్లు అర్జున్‌ త్రిపాత్రాభినయం చేస్తారని, హీరోయిన్స్‌గా జాన్వీ కపూర్, దిశా పటానీ, శ్రద్ధా కపూర్‌ల పేర్లను మేకర్స్‌ పరిశీలిస్తున్నారని సమాచారం. ఈ ఏడాది చివర్లో చిత్రీకరణనుప్రారంభించనున్నారు. కళానిధి మారన్‌ సమర్పణలో సన్‌పిక్చర్స్‌ సంస్థ ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది. 2027లో ఈ మూవీ రిలీజ్‌ అయ్యేలా సినిమా షూటింగ్‌ను ప్లాన్‌ చేస్తున్నారట.మరోవైపు దర్శకుడు త్రివిక్రమ్‌తో అల్లు అర్జున్‌ ఓ మూవీ అంగీకరించిన సంగతి తెలిసిందే. మైథలాజికల్‌ ఫిల్మ్‌ ఇది. భారతీయ ఇతిహాసాల నుంచి ఇప్పటివరకు రాని ఓ సరికొత్త పాయింట్‌తో త్రివిక్రమ్‌ ఈ మూవీ చేయనున్నారని, ఇందుకోసం స్క్రీన్‌పై కొత్త ప్రపంచాన్ని టీమ్‌ రూపొందించనుందని సమాచారం. హారిక అండ్‌ హాసినీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్‌ పతాకాలపై సూర్యదేవర రాధాకృష్ణ, అల్లు అరవింద్‌ ఈ సినిమా నిర్మించనున్నారు.అంజనాద్రిలో జై హనుమాన్‌బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘హను–మాన్‌’లో దర్శకుడు ప్రశాంత్‌ వర్మ అంజనాద్రి అనే ఊరుని చూపించారు. తేజా సజ్జా హీరోగా నటించిన చిత్రం ఇది. నిరంజన్‌ రెడ్డి, చైతన్యా రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. కాగా ‘హను–మాన్‌’ సినిమాకు సీక్వెల్‌గా ‘జై హనుమాన్‌’ మూవీ రానుంది. ప్రశాంత్‌ వర్మయే ఈ సినిమాకూ దర్శకత్వం వహిస్తున్నారు. ‘కాంతార’ ఫేమ్‌ రిషబ్‌ శెట్టి ఈ మూవీలో హీరోగా చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ‘జై హను మాన్‌’ సినిమా ప్రీప్రోడక్షన్‌ వర్క్స్‌ శరవేగంగా జరుగుతున్నాయి.ఈ ఏడాది చివర్లో ‘జై హనుమాన్‌’ చిత్రీకరణలో పాల్గొంటారట రిషబ్‌ శెట్టి. కాగా... ‘జై హనుమాన్‌’ మూవీలో రాముడు, లక్ష్మణుడి పాత్రల ప్రస్తావన కూడా ఉంటుందని, ‘హను–మాన్‌’ సినిమా క్లిప్‌ హ్యాంగర్‌ వీడియోను చూసినవారికి అర్థమయ్యే ఉంటుంది. సో... ‘జై హనుమాన్‌’ సినిమా మరింత పెద్ద స్పాన్‌తో రూపొందనుందని తెలుస్తోంది. సో... ఆటోమేటిక్‌గా ‘అంజనాద్రి’ స్పాన్స్‌ కూడా పెరుగుతుందని ఊహించవచ్చు. ఇలా... అంజనాద్రిలో ‘జై హనుమాన్‌’ సాహసాలు, విన్యాసాలు చూసేందుకు మాత్రం చాలా సమయం ఉంది.2027లో మూవీ రిలీజ్‌ కావొచ్చు. ఇంకా హను–మాన్‌లో నటించిన తేజా సజ్జా ఈ సినిమా సీక్వెల్‌ ‘జై హనుమాన్‌’లోనూ ఉంటారని తెలిసింది. అలాగే తేజా సజ్జా హీరోగా ‘మిరాయ్‌’ అనే సైన్స్‌ ఫిక్షన్‌ అండ్‌ మైథలాజికల్‌ మూవీ రానుంది. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మంచు మనోజ్‌ విలన్‌గా కనిపిస్తారు. ఈ చిత్రం ఆగస్టు 1న విడుదల కానుంది.మిస్టిక్‌ థ్రిల్లర్‌ ‘విరూపాక్ష’ సినిమాలో రుద్రవనం అనే కల్పిత విలేజ్‌లో జరిగే సంఘటనలు ఆడియన్స్‌ను అలరించాయి. సాయిదుర్గా తేజ్‌ హీరోగా కార్తీక్‌ దండు దర్శకత్వం వహించిన ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ తర్వాత హీరో నాగచైతన్యతో దర్శకుడు కార్తీక్‌ దండు మరో మిస్టిక్‌ థ్రిల్లర్‌ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మిస్టిక్‌ థ్రిల్లర్‌ మూవీ చిత్రీకరణ ఆల్రెడీప్రారంభమైంది. కాగా ఈ చిత్రం కోసం ‘రుద్రవనం’ మాదిరి మరోప్రాంతాన్ని సృష్టిస్తున్నారట కార్తీక్‌ దండు.ఆల్రెడీ రిలీజ్‌ చేసిన ఈ సినిమా కాన్సెప్ట్‌ పోస్టర్‌ ఆకట్టుకునేలా ఉంది. ఓ పక్షి కన్నులో ఓ పెద్ద పర్వతంపై నాగచైతన్య ఉన్నట్లుగా ఈ సినిమాలో కనిపిస్తుంది. అలాగే ఈ మూవీలో నాగచైతన్య ఓ స్టైలిష్‌ లుక్‌లో కనిపిస్తారని తెలిసింది. ఇక ఈ మూవీలో నాగచైతన్య సరసన మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారని తెలిసింది. సుకుమార్, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్‌ కావొచ్చు.వెయ్యేళ్ల క్రితంఆధ్యాత్మిక ప్రపంచం ‘శంబాల’కు ఆడియన్స్‌ను తీసుకువెళ్లనున్నారు హీరో ఆది సాయికుమార్‌. జియో సైంటిస్ట్‌గా ఆది సాయికుమార్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘శంబాల’. కాల్పనిక ప్రపంచం శంబాల నేపథ్యంలో యుగంధర్‌ ముని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పదివేల సంవత్సరాల క్రితం, వెయ్యి సంత్సరాల క్రితం, 1980... ఇలా మూడు కాలమానాల్లో ఈ సినిమా కథనం సాగుతుందని చిత్రయూనిట్‌ పేర్కొంది. అర్చనా అయ్యర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో శ్వాసిక మరో లీడ్‌ రోల్‌లో యాక్ట్‌ చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా కోసం ఓ భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌ను తీశారు మేకర్స్‌. త్వరలోనే టీజర్, ట్రైలర్, రిలీజ్‌ డేట్‌లపై స్పష్టత ఇవ్వనున్నట్లుగా మేకర్స్‌ ఇటీవల తెలిపారు.ప్యారడైజ్‌‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘ప్యారడైజ్‌’. ఈ పీరియాడికల్‌ ఫిల్మ్‌లో నాని సరికొత్తగా కనిపిస్తున్నారు. 1980 నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. ఈ సినిమాలో సికింద్రాబాద్‌ కుర్రాడిలా నాని నటిస్తారని తెలిసింది. ఈ మూవీ ఆడియన్స్‌కు సరికొత్త విజువల్‌ ఎక్స్‌పీరియన్స్‌ను ఇవ్వనుంది. అప్పటి కాలాన్ని రీ–క్రియేట్‌ చేసే పనిలో ఉన్నారు దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల.ఓ తెగ నాయకుడిగా నాని కనిపిస్తారని, గుర్తింపుకోసం పోరాడే ఓ తెగ నేపథ్యంలో ఈ మూవీ సాగుతుందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. ‘దసరా’ సినిమాను నిర్మించిన సుధాకర్‌ చెరికూరియే ఈ సినిమానూ నిర్మించనున్నారు. ప్రస్తుతం ‘హిట్‌ 3’ సినిమా ప్రమోషన్స్‌తో నాని బిజీగా ఉన్నారు. మే 1న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. ఇక మే రెండో వారం నుంచి ‘ప్యారడైజ్‌’ సినిమా చిత్రీకరణలో నాని పాల్గొంటారని తెలిసింది. ‘ప్యారడైజ్‌’ సినిమాను వచ్చే ఏడాది మార్చి 26న రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.కిష్కింధపురి!ఆడియన్స్‌ కోసం ‘కిష్కింధపురి’ అనే హారర్‌ అండ్‌ మిస్టీరియస్‌ వరల్డ్‌ను క్రియేట్‌ చేస్తున్నారట బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌. కౌశిక్‌ పెగళ్లపాడి దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మాణంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ ఈ మూవీ చేస్తున్నారు. ఈ హారర్‌ అండ్‌ మిస్టిక్‌ థ్రిల్లర్‌ మూవీకి ‘కిష్కింధపురి’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారట మేకర్స్‌. హారర్‌ ఎలిమెంట్స్, ప్రేతాత్మల ప్రస్తావన, ఆధ్యాత్మిక అంశాలతో ఈ మూవీ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉంటుందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. అతి త్వరలోనే ఈ మూవీకి చెందిన మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి.ఇలా ఈ తరహాలో ఆడియన్స్‌ను మరో కొత్త ప్రపంచానికి లేదా కొత్తప్రాంతానికి తీసుకుని వెళ్లే హీరోలు, దర్శక–నిర్మాతలు మరి కొంతమంది ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు

Story of Resurrection of Jesus special story6
మరణమా నీ ముల్లెక్కడ?

దేవుని విమోచన కార్యక్రమంలో అత్యంత శకిమంతమైనది క్రీస్తు పునరుత్థాన శక్తే. మానవునికి మరణం తోనే జీవితం అంతం కాదని పునరుత్థానం తెలియజేసింది. ప్రతి మనిషి సదాకాలము దేవునితో కలిసి జీవించవచ్చన్న గొప్ప నిరీక్షణ కలిగింది. ఎందుకంటే యేసు అంటున్నాడు ‘పునరుత్థానం జీవం నేనే. నా యందు విశ్వాసముంచు వాడు చనిపోయినను బ్రతుకును. బతికి నాయందు విశ్వాసముంచు వాడు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు’.శుక్రవారం సిలువ వేయబడిన యేసును తలచుకొని యూదా మతపెద్దలు యేసు ఇక శాశ్వతంగా మట్టిలో కలిసి పోయాడని సంబర పడ్డారు. వారిలో ఆ దుష్ట తలంపు పెట్టిన అపవాదియైన సాతాను దేవునిపై విజయం సాధించానని ఇక ఈ లోకం అంతా తన చెప్పు చేతల్లో ఉండిపోతుందని భ్రమ పడ్డాడు. అయినా ఎందుకైనా మంచిదని క్రీస్తును ప్రత్యేకంగా అరిమత్తయి ఏర్పాటు చేసిన సమాధి చుట్టూ ఎవరు తొలగించలేని పెద్ద రాతిని ఏర్పాటు చేశారు. బలమైన రోమా సైనికులను సమాధికి కాపలాగా పెట్టారు. క్రీస్తు మూడవ దినమున లేస్తానని చెప్పిన మాట నెరవేరకుండా శతవిధాలుగా తమ ప్రయత్నం వారు చేశారు. ఇక ఏసు చరిత్ర శాశ్వతంగా ఖననం చేశామని ఇక ఎప్పటికీ తామే మతపెద్దలుగా యూదా ప్రజలను తమ అధీనంలోనే వుంచుకోవచ్చని రోమా అధికారులకు లంచం కడుతూ తమ పబ్బం గడుపుకోవచ్చని కలలుగంటూ శనివారం అంతా హాయిగా నిద్రపోయారు. మరోపక్క యేసు చేసిన అద్భుత సూచక క్రియలు చూసి ఆయన పరలోక దివ్య వాక్కులు విన్న ప్రజలు యేసు సిలువ మరణాన్ని జీర్ణించు కోలేని స్థితిలో వుండిపోయారు. యూదా గలిలయా సమరియ ప్రాంతాల్లో క్రీస్తు ద్వారా స్వస్థత పొందిన గుడ్డి, కుంటి, మూగ, చెవిటి వారు, కుష్టు రోగులు మరణించి క్రీస్తుతో బతికింపబడినవారు, క్రీస్తును అభిమానించేవారు, వివిధ అద్భుతాలను చూసినవారు యేసు మరణంతో శోకసంద్రంలో మునిగిపోయారు. చివరకు యేసుతో మూడున్నర సంవత్సరాలు తిరిగిన ఆయన శిష్యులు యూదా మతపెద్దలకు భయపడి యెరూషలేము పట్టణంలో ఓ గదిలో దాక్కుండి పోయారు. అయినా దేవుని ప్రవచనాలు నెరవేరక తప్పవు కదా! భూమి పునాదులు వేయక ముందే ఆయన ఏర్పాటు చేసిన రక్షణ ప్రణాళిక అనాది సంకల్పం నెరవేరక తప్పదు కదా!తొలగింపబడిన రాయిఆదివారం ఉదయమే ఇంకా తెల్లవారకముందు యేసుద్వారా స్వస్థత పొందిన మగ్ధలేని మరియ, కొంతమంది ధైర్యవంతులైన స్త్రీలు సుగంధ ద్రవ్యాలను తీసుకొని యేసును సమాధి చేసిన చోటుకు చేరుకున్నారు. రోమా అధికారక ముద్రతో వేయబడ్డ ఆ పెద్ద రాయి ఎవరు తొలగిస్తారన్న ఆలోచన ఆ మహిళకు కలిగింది. తీరా సమాధి వద్దకు వచ్చి చూస్తే వారి జీవితంలో ఎన్నడు కలుగనంత విభ్రాంతికి లోనయ్యారు. అప్పటికే సమాధి మీద రాయి తొలగించబడింది. అంతకు క్రితమే యేసు సమాధిమీద ఉన్నరాయి పరలోకం నుండి ప్రభువుదూత దొర్లించినట్లు లేఖనాలలో రాయబడింది. ఆప్రాంతంలో భూకంపం వచ్చింది. అక్కడ కావలి వున్న రోమా సైనికులు భయపడి చచ్చినవారిలా పరుండిపోయారు. స్త్రీలు అక్కడికి వచ్చినప్పుడు రాయి దొర్లించబడి ఉండటం చూశారు. సమాధి లోపల యేసు దేహం వారికి కనిపించలేదు. అప్పుడు దూత ప్రత్యక్షమై ‘‘సజీవుడైన క్రీస్తును మృతులలో ఎందుకు వెదుకుచున్నారు? ఆయన ముందుగా చెప్పిన విధంగా లేచి యున్నాడు. ఈ శుభవర్తమానం శిష్యులకు తెలియ జేయండి’’ అని చెప్పడంతో స్త్రీలు మహానందంతో వెనుకకు తిరిగారు.పునరుత్థానుడైన క్రీస్తుయేసు చెప్పిన విధంగానే చనిపోయిన మూడవరోజు మృత్యుంజయుడై లేచాడు. దానితో ప్రపంచ చరిత్రలో మరణాన్ని గెలిచి లేచిన చారిత్రాత్మిక పురుషుడిగా నిలిచి పోయాడు. ప్రపంచ చరిత్ర క్రీస్తుపూర్వం క్రీస్తు శకంగా చీలిపోయింది. పునరుత్థానుడైన యేసు ముందుగా తనను వెదకడానికి వచ్చిన స్త్రీలకు కన్పించి వారికి శుభమని చెప్పి ముందు మీరు వెళ్ళి నా శిష్యులకు గలిలయ వెళ్ళమని చెప్పి అక్కడ వారిని కలుస్తానని చెప్పాడు.ఈలోగా సమాధికి కాపలాగా ఉన్న రోమా సైనికులు ప్రధాన యాజకుల వద్దకు పోయి యేసు మరణం నుండి లేచిన సంగతి వివరించారు. వారు రోమా సైనికులకు లంచం ఇచ్చి ఈ విషయం ఎవ్వరికీ చెప్పవద్దని చెబుతూ మేము రాత్రివేళ నిద్దుర పోతుంటే యేసు శిష్యులు వచ్చి యేసు శరీరాన్ని ఎత్తుకు వెళ్ళారని అబద్ధం చెప్పండి ఒకవేళ అధికారులు ఏమన్నా హడావుడి చేస్తే వారిని మేము చూసుకుంటామని నచ్చచెప్పి పంపించి వేశారు. అయితే యేసు చెప్పిన విధంగానే గలిలయ శిష్యులకు దర్శనం ఇచ్చాడు. ఈ ఈస్టర్‌ పండుగ సమయంలో యేసు పునరుత్థాన శక్తి ప్రతి ఒక్కరం పొందుదం గాక! ఆమేన్‌!!యేసు పునరుత్థాన శక్తియేసు తన శరీరంలో సిలువ ద్వారా పాపానికి శిక్ష విధించి బలి అర్పణగా శరీరాన్ని సమర్పించడం ద్వారా మరణంపై సాతానుకున్న అధికారాన్ని నాశనం చేశాడు. మనుషుల్లో మరణం పట్ల ఉన్న భయాన్ని పునరుత్థాన శక్తితో తీసివేయడం ద్వారా దేవునితో ధైర్యంగా విశ్వాసంతో ముందుకు కొనసాగడానికి బాటలు వేశాడు. ప్రథమ మానవుడైన ఆదామును సాతాను లోబరుచుకొని మరణానికి ΄ాత్రుడుగా చేశాడు. ఫలితంగా పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పని పరిస్థితి నెలకొంది. అయితే కడపటి ఆదాముగా వచ్చిన యేసు పునరుత్థానం ద్వారా ఆ శాపం పూర్తిగా తొలగించబడింది. అంటే మనుష్యుని ద్వారా ఎలా మరణం వచ్చిందో మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానం కలిగింది. ఈ ప్రక్రియ ద్వారా క్రీస్తులా ప్రతి ఒక్కరూ పునరుత్థానం పొందే అవకాశం లభించింది.– మన్య జ్యోత్స్న రావు

Central govt sources are giving a false signal that only Muslims are opposing the new Waqf Act7
ప్రభుత్వ ప్రాయోజిత మత పక్షపాతం

కొత్త వక్ఫ్‌ చట్టాన్ని ముస్లింలు మాత్రమే వ్యతిరేకిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఒక తప్పుడు సంకే తాన్ని ఇస్తున్నాయి. ముస్లిం ధర్మాదాయ దేవాదాయ వ్యవహారాలను వక్ఫ్‌అంటారు. 1995 నాటి వక్ఫ్‌ చట్టం ఇప్పటి వరకు అమలులో వుంది. ఇప్పుడు దీన్ని ‘యునైటెడ్‌ వక్ఫ్‌ మేనే జ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియెన్సీ అండ్‌ డెవలప్మెంట్‌ యాక్ట్‌–2025 (యూడబ్ల్యూఎమ్‌ఈఈడీఏ)గా మార్చారు. వక్ఫ్‌ సవరణ బిల్లు ఏప్రిల్‌ 3న లోక్‌సభలో 288 – 232 ఓట్ల తేడాతో గెలిచింది. రాజ్యసభలో ఏప్రిల్‌ 4న 128 – 95 ఓట్ల తేడాతో గెలిచింది. ఆ వెంటనే రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా పడిపోయింది. ఇక్కడ ఒక విశేషం ఉంది. 543 మంది సభ్యు లున్న లోక్‌ సభలో ముస్లింలు 24 మంది మాత్రమే. 232 మంది సభ్యులు బిల్లును వ్యతిరేకించారు.అంటే 208 మంది ముస్లిమే తర సభ్యులు ముస్లింల పక్షాన నిలిచారు. అలాగే 245 మంది సభ్యులున్న రాజ్య సభలో ముస్లింలు 15గురు మాత్రమే. 95 మంది సభ్యులు బిల్లును వ్యతిరేకించారు. అంటే 80 మంది ముస్లిమేతర సభ్యులు ముస్లింల పక్షాన నిలిచారు. రెండు సభల్లోనూ కలిపి ముస్లింల సంఖ్య 39 మాత్రమే. వాళ్ల పక్షాన నిలిచిన ముస్లిమేతరులు 288 మంది. కొత్త చట్టం రాజ్యాంగ ఆదర్శాలకు, హామీలకు విరుద్ధంగా ఉందనీ, దాన్ని పునఃసమీక్షించాలని కొన్ని సంఘాలు, కొన్ని రాజకీయపార్టీలు సుప్రీంకోర్టులో 70కు పైగా పిటీషన్లు వేశాయి. ఈ విషయంలోనూ ముస్లింల సంఖ్య చాలా తక్కువ. ముస్లిమేతరుల సంఖ్య చాలా ఎక్కువ. మన దేశంలో వర్ధిల్లుతున్న మతసామరస్యానికి ఇది తాజా ఉదాహరణ. దీనికి విరుద్ధంగా బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త చట్టానికి మద్దతు ప్రకటించాయి. ఒక బిల్లు ఉభయ సభల్లో మెజారిటీ సాధించి రాష్ట్రపతి ఆమోద ముద్రపడి చట్టంగా మారాక కూడ సుప్రీం కోర్టుకు చేరడం విశేషం. చీఫ్‌ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌ కుమార్, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఏప్రిల్‌ 16న ఈ పిటిషన్లపై విచారణ ప్రారంభించింది. కొత్త చట్టంలో వివాదాంశాలు అనేకం ఉన్నాయి. ఇందులో నాలుగు అంశాలు మరింత తీవ్రమైనవి. వక్ఫ్‌ బోర్డులో, సెంట్రల్‌ వక్ఫ్‌ కౌన్సిల్‌లో కొత్తగా ముస్లిమేతరులను అనుమతించడం తీవ్రమైన వివాదంగా మారింది. వక్ఫ్‌ భూముల్లో ‘వక్ఫ్‌ బై యూజర్‌’ సౌలభ్యాన్ని తొలగించి అది వక్ఫ్‌గా కొనసాగాలంటే రిజిస్ట్రేషన్‌ దస్తావేజులు చూపాలనడం ఇంకో వివాదాంశం. వక్ఫ్‌ ఆస్తి అవునో కాదో తేల్చడానికి జిల్లా కలెక్టర్లకు విశేషాధికారాలు కల్పించడం, కనీసం ఐదేళ్ళుగా ఇస్లామిక్‌ ధార్మిక ఆచరణను కొనసాగిస్తున్నవారు మాత్రమే వక్ఫ్‌ దానం చేయడానికి అర్హులు అనడం కూడా వివాదంగా మారింది. వక్ఫ్‌ భూములకు దస్తావేజులు చూపడం అసాధ్యమైన విషయం. 19వ శతాబ్దం ఆరంభం వరకు మన దేశంలో అసలు దస్తావేజులు, రిజిస్ట్రేషన్ల సంప్రదాయమే లేదు. లార్డ్‌ కార్న్‌ వాలిస్‌ 1793లో తొలిసారిగా శాశ్వత భూమిపన్ను విధానాన్ని తెచ్చాడు. అది కూడా ఇప్పటి బెంగాల్, బిహార్, ఒడిశాప్రాంతంలో మాత్రమే. ఆ తరువాత థామస్‌ మన్రో మద్రాసు, బొంబాయి ప్రెసిడెన్సీల్లో రైత్వారీ విధానాలను తెచ్చాడు. భారత దేశంలో 8వ శతాబ్దం నాటికే ఇస్లాం ప్రవేశించింది. ఇస్లాం ప్రవేశించిన వెయ్యేళ్ళ తరువాత మనకు దస్తావేజులు, రిజిస్ట్రేషన్‌ విధానాలు వచ్చాయి. అత్యున్నత న్యాయస్థానపు ధర్మాసనం సరిగ్గా ఈ అంశాన్నే పట్టించుకుంది. ‘మనం చరిత్రను తిరగరాయలేం’ అని భారత ప్రధాన న్యాయమూర్తి సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాకు గుర్తుచేశారు. వక్ఫ్‌ వ్యవహారాల్లో పారదర్శకతను ప్రదర్శించడమేగాక, రెండు మత సమూహాల సహవాసాన్ని కొత్త చట్టం ప్రోత్సహిస్తుందని, ముస్లింల గుత్తాధిపత్యాన్ని తొలగిస్తున్నదని సొలిసిటర్‌ జనరల్‌ ధర్మాసనానికి వివరించే ప్రయత్నం చేశారు. ఇలా రెండు మతసమూహాల కలయిక ఒక ఆదర్శం అని కేంద్ర ప్రభుత్వం నిజంగానే నమ్ముతోందా? నమ్మితే హిందూ ధర్మాదాయ కమిటీల్లోనూ హిందూయేతరులకు స్థానం కల్పించాలిగా? సరిగ్గా ఈ ప్రశ్ననే భారత ప్రధాన న్యాయమూర్తి వేశారు. తాము స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేవరకు వక్ఫ్‌ భూములు వేటినీ డీ–నోటిఫై చేయరాదని ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.కేంద్ర ప్రభుత్వ వాదనను వినిపించడానికి ఒక వారం రోజులు గడువు ఇవ్వాలని సొలిసిటర్‌ జనరల్‌ ధర్మాసనాన్ని కోరారు. ఇందులో ఒక కిటుకు ఉంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఖన్నా మరో మూడు వారాల్లో, మే 13న పదవీ విరమణ చేయనున్నారు. ఎలాగోలా ఈ సమయాన్ని సాగదీస్తే అనుకూ లమైన తీర్పు తెచ్చుకోవచ్చు అనేది కేంద్ర ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది.- వ్యాసకర్త సమాజ విశ్లేషకులు ‘ 90107 57776'- డానీ

Sakshi Editorial On land allocated to it companies by Vardhelli Murali8
పైసా తక్కువ రూపాయ్‌!

‘‘కాసులతో ప్రలోభపెట్టారు. వినకపోతే కేసులతో భయ పెట్టారు. 27 మంది విశాఖ కార్పొరేటర్లను కూటమి నేతలు ఈ విధంగా లొంగదీసుకున్నారు. సొంత బలం లేకున్నా మేయర్‌పై అవిశ్వాసాన్ని నెగ్గించుకున్నారు. ఈ అప్రజాస్వామిక చర్యకు కూటమి నేతలు పెట్టుకున్న ముద్దుపేరు ‘ధర్మ విజయం’.’’ నూరు ఎలుకల్ని తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయిందట! (ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుత రాజకీయ చిత్రమిది)‘‘విశాఖపట్నం నుంచి విజయవాడకు విమానంలో వెళ్లాలంటే హైదరాబాద్‌కు వెళ్లి రావాల్సి వస్తున్నది. ఇదీ మనపరిస్థితని టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ట్వీట్‌ చేశారు. దీన్ని బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజు సమర్థించారు. అభివృద్ధికిబ్రాండ్‌ అంబాసిడర్‌నంటూ తన ఆటోబయోగ్రఫీని ప్రణాళికా సంఘం సభ్యులకు చంద్రబాబు వినిపించిన మరునాడే ఈపరిణామం.’’ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కిందట! (ఇదీ ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి ముఖచిత్రం)‘‘ఐటీకి ప్రోత్సాహం పేరుతో పైసా తక్కువ రూపాయ్‌ పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రారంభించింది. ముందుగా ప్రముఖ కంపెనీ టీసీఎస్‌కు 21 ఎకరాలు కేటాయించారు. ఆ వెంటనే ఊరూపేరూ లేని కంపెనీలు ఈ స్కీములో లైను కట్టాయి. ఐఎమ్‌జీ భారత్‌కు అయ్యలాంటి స్కెచ్‌.’’‘లూటీ’ కోసం కోటి విద్యలు’! (ఇది కొత్తపుంతలు తొక్కుతున్న అవినీతి చంద్రిక)‘‘మద్యాన్ని ఏరులై పారిస్తే లోకకల్యాణార్థమట. దాన్ని నియంత్రిస్తే మహా పాతకమట!’’వినేవాడు వెర్రివాడైతే, చెప్పేవాడు... ... ! (ఇదీ ఆంధ్రప్రదేశ్‌ సమాచార స్రవంతి)రూపాయంటే నూరు పైసలు. ఒక్క పైసా తక్కువైనా అది రూపాయి కాదు. ఆ విలువ రాదు. మాటలైనా అంతే! ఆచరణకు నోచుకోకపోతే విలువుండదు. ఆచరణయోగ్యం కాని వాగ్దానాలు చేయడం, ఎగవేయడంలో ఇప్పటికే చంద్రబాబుది ఆలిండియా రికార్డు. మాటలతో మభ్యపెట్టి పబ్బం గడుపుకోవడంలో కూడా ఆయనకే వీరతాడు వేయాలి. మంచినీళ్లడిగితే మబ్బులవంక చూపెట్టి, ‘అదిగదిగో’ అన్న చందంగా కూటమి ప్రజాపాలన సాగుతున్నది. మరోపక్కన కాంట్రాక్టుల పేరుతో కమీషన్లు, కంపెనీల పేరుతో స్వీయ కైంకర్యాల కార్యక్రమం య«థేచ్ఛగా జరుగుతున్నది.రాజధాని నిర్మాణం పేరుతో పిలిచిన 40 వేల కోట్ల రూపాయల విలువైన టెండర్లలో తొమ్మిదివేల కోట్లు ‘మూల విరాట్టు’ హుండీలోకి చేరుకునేవిధంగా మంత్రాంగం నడిచిందని ‘సాక్షి’ ఒక కథనంలో నిరూపించింది. దీనిపై వివరణ ఇచ్చే ప్రయత్నం గానీ, ఖండించే సాహసం గానీ ప్రభుత్వం చేయ లేదు. చేయదు. నవ్విపోదురుగాక, నాకేటి సిగ్గు అనే ధోరణి. రాజధాని కాంట్రాక్టుల్లో ఈ లెక్కన ఇరవై రెండున్నర శాతం హుండీ ఖాతాకు చేరాలన్నమాట. ఇటీవల ప్రణాళికా సంఘం ప్రతినిధులకు ముఖ్యమంత్రి చెప్పిన వివరాలను బట్టి ఇంకో 37 వేల కోట్ల రూపాయలకు టెండర్లను పిలవాల్సి ఉన్నది.అమరావతి పేరుతో జరుగుతున్న ఈ తతంగంలో కాంట్రాక్టర్లు చేసే సంతర్పణ కంటే అక్కడ జరిగిన, జరుగుతున్న భూభాగోత లబ్ధి చాలా ఎక్కువని ఇప్పటికే పలు ఆరోపణలు, విమర్శలు వెలువడ్డాయి. అందుబాటులో ఉన్న 55 వేల ఎక రాలకు తోడు మరో 45 వేల ఎకరాలతో అమరావతి పార్ట్‌–2ను త్వరలో విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. దీనిపైనా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. రాజధాని కోసం ప్రభుత్వమే లక్ష ఎకరాలను సేకరించడం ఎందుకని విజ్ఞులూ, తటస్థ రాజ కీయవేత్తలూ ప్రశ్నిస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఈ ప్రతిపాదిత వైశాల్యం సుమారు మూడింట రెండొంతులు. అక్కడ కోటీ ఇరవై లక్షలమంది నివసిస్తున్నారు. దాని ప్రకారం ఆలోచిస్తే మొత్తం విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి – తాడేపల్లి నగరాలను పూర్తిగా ఖాళీ చేసి ఇక్కడ నింపేసినా ఇంకా సగం స్థలం ఖాళీగానే ఉంటుంది.రాజధాని నిర్మాణానికి సంబంధించి నిన్ననే ‘ఈనాడు’ పత్రిక ఒక ఆకర్షణీయమైన కథనాన్ని అచ్చేసింది. సరికొత్త సచి వాలయ టవర్ల నిర్మాణం కోసం రూ.4,688 కోట్ల అంచనా వ్యయంతో సీఆర్‌డీఏ టెండర్లను పిలిచిందట! ఇందులో ఐదు ఐకానిక్‌ టవర్లుంటాయని ఆ గ్రాఫిక్‌ బొమ్మను కూడా అచ్చేశారు. రాబోయే వంద సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని నిర్మించిన కొత్త పార్లమెంటు భవనాన్ని కూడా వెయ్యి కోట్ల లోపు వ్యయంతోనే పూర్తి చేశారు. ఈమధ్యనే కట్టిన తెలంగాణా సెక్రటే రియట్‌కయిన ఖర్చు కూడా వెయ్యి కోట్ల లోపే! అమరావతిలో మాత్రం ఎంత భారీ ఖర్చయితే అంత ప్రయోజనం అను కున్నారేమో గాని ఐదు ఐకానిక్‌ టవర్లను నిర్మించే పనిలో పడ్డారు. ‘ఈనాడు’ రాసిన ఈ కథనంలోనే ఇంకో గమనించదగ్గ విషయం కూడా ఉన్నది.ఈ గ్రాండ్‌ సెక్రటేరియట్‌ నిర్మాణానికి 60 వేల టన్నుల స్టీల్‌ అవసరమవుతుందట! దీనికోసం సీఆర్‌డీఏ అధికారులు రాయ గఢలోని ఫ్యాక్టరీని పరిశీలించి వచ్చారట! ఇక్కడ స్టీల్‌ కొనుగోలు చేసి బళ్లారి, తిరుచిరాల్లి వర్క్‌షాపుల్లో ఫ్యాబ్రికేట్‌ చేయించాలని నిర్ణయించారట! ఈ విషయం తెలిసిన తర్వాత విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులు భగ్గుమంటున్నారు. మెడ మీద ప్రైవేటీకరణ కత్తి వేలాడుతున్న విశాఖ ఫ్యాక్టరీకి ప్రభుత్వ ఆర్డర్లను అప్పగిస్తే ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఉండేది కదా అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ ఉక్కును ఆంధ్రుల హక్కుగా నిలబెట్టడంలో ప్రభుత్వ చిత్తశుద్ధి ఏపాటిదో ఈ వ్యవహారంతో తేలిపోయిందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.విశాఖ ఉక్కు సంగతే కాదు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా చంద్రబాబు సర్కార్‌ ఏపీ ప్రజలను మోస గిస్తున్నది. 45.72 మీటర్ల ఎత్తు వరకు నీళ్లు నిలబెట్టుకునేందుకు పోలవరం ప్రాజెక్టుకు గోదావరి ట్రిబ్యునల్‌ అనుమతి ఉన్నది. తెలుగుదేశం పార్టీ భాగస్వామిగా ఉన్న ఎన్డీఏ కేబినెట్‌ ఇటీవల దాని ఎత్తును 41.5 మీటర్లకు కుదిస్తూ ఆ మేరకు నిధులనుఅందజేయాలని నిర్ణయించింది. చంద్రబాబు సర్కార్‌ తలూపింది. ‘పోలవరం ఆంధ్రుల జీవనాడి’ అని బాబు మాట్లాడు తూంటారు. ఇప్పుడా నాడి స్పందన కోల్పోయినట్టే! 35 మీటర్ల ఎత్తునకు పైన లభ్యత ఉంటేనే జలాలు కుడి, ఎడమ కాల్వలకు పారుతాయి. ఇప్పుడా లభ్యత 45.72 మీటర్లకు బదులుగా 41.5 మీటర్లకు మాత్రమే పరిమితం కానున్నది. నిల్వ సామర్థ్యం 194 టీఎమ్‌సీల నుంచి 115 టీఎమ్‌సీలకు తగ్గిపోతుంది. ఈ కారణం వల్ల ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, కృష్ణా ద్వారా పెన్నాతో అను సంధానం వంటి మాటలన్నీ కాకమ్మ కబుర్లు కాబోతున్నాయి.ఈ విషయాన్ని దాచేసి ప్రజలను మభ్యపెట్టడానికి ‘గోదా వరి – బనకచర్ల అనుసంధానం’ అనే పాటను చంద్రబాబు పదేపదే ఆలపిస్తున్నారు. పోలవరం ఆయకట్టుకే సరిపోనివిధంగా కుదించిన ప్రాజెక్టుతో ఈ అనుసంధానం ఎట్లా సాధ్య మవుతుందో ప్రభుత్వ ఇరిగేషన్‌ అధికారులైనా ప్రజలకు వివరించాలి. ఎన్నికలకు ముందు చెప్పిన ‘సూపర్‌ సిక్స్‌’ హామీలను అటకెక్కించిన సంగతి తెలిసిందే. ఇప్పుడాయన ‘అభివృద్ధికి ఆరు మెట్లు’ అనే కొత్త సిద్ధాంతాన్ని ప్రవచిస్తున్నారు. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన ప్రణాళికా సంఘం బృందానికి కూడా తన ఆరు మెట్ల సిద్ధాంతాన్ని వివరించినట్టు ‘ఈనాడు’ రాసింది.‘ఆరు మెట్ల’ అభివృద్ధిలో మొదటి మెట్టుగా పోలవరం – బనకచర్ల అనుసంధానాన్నే ఆయన ప్రస్తావించారు. ఇదెంత బోగస్‌ వ్యవహారమో పోలవరం ఎత్తు కుదింపుతోనే తేలిపో యింది. ఇక రెండో అభివృద్ధి మెట్టు – తాగునీటి ప్రాజెక్టట! ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు వెల్లడించిన గణాంకాలనే తీసుకుందాము. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాల్లో 2019 ఆగస్టు 15 నాటికి 30 లక్షల 74 వేల గృహాలకు మాత్రమే కుళాయిల ద్వారా నీటి సరఫరా జరిగేది. 2019 ఆగస్టు 15 – 2025 మే మధ్యకాలంలోనే, అంటే జగన్‌మోహన్‌ రెడ్డి పరిపాలనా కాలంలోనే అదనంగా 39 లక్షల 34 వేల గృహాలకు తాగునీటి కుళాయిలు అందుబాటులోకి వచ్చాయి.మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనవరి చివరి నాటికి 36 వేల గృహాలకు మాత్రమే కొత్తగా నీటి కుళాయిలు బిగించారు. తాగునీటి రంగంలో అభివృద్ధి మెట్టును వేసిందెవరో ఈ గణాంకాలు చెప్పడం లేదా?అభివృద్ధి మూడో మెట్టుగా పర్యాటక హబ్‌ల ఏర్పాటు, నాలుగో మెట్టుగా నాలెడ్జి ఎకానమీ, క్వాంటమ్‌ వ్యాలీ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వగైరాలుంటాయట! ఐదో మెట్టుగా నౌకా శ్రయాలు, ఫిషింగ్‌ హార్బర్లు, మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్కులు తదితరాలు. ఆరో మెట్టు – అమరావతి, తిరుపతి, విశాఖపట్నం గ్రోత్‌ సెంటర్లు. తిరుపతి, విశాఖ, అరకు వంటి ప్రాంతాల్లో జరిగిన పర్యాటకాభివృద్ధిపై ఆచరణే గీటురాయిగా ఎవరి హయాంలో ఏమి జరిగిందో చర్చకు పూనుకోవచ్చు. నాలెడ్జి ఎకానమీ, క్వాంటమ్‌ వ్యాలీ వంటి ‘నేమ్‌ డ్రాపింగ్‌’ వాగాడంబరం చంద్రబాబుకు పరిపాటే! మంత్రదండం చేతబూని ‘ఓపెన్‌ ససేమ్‌’ అనగానే పుట్టుకొచ్చేవి కావవి. అదొక సేంద్రియ అభివృద్ధి. అందుకు అనువైన పరిస్థితులు పూర్తిగా ఏర్పడేందుకు ఐదేళ్లు పట్టవచ్చు. పదేళ్లు పట్టవచ్చు. కానీ బాబు మాత్రం తన ఆలోచనలోకి రావడమే అమల్లోకి వచ్చినట్టుగా భావిస్తారు. అనుబంధ మీడియా తాళం వేస్తుంది. అనుయాయులు వీరతాళ్లు వేస్తారు.ఇక ఐదో మెట్టుగా నౌకాశ్రయాలు, ఫిషింగ్‌ హార్బర్లు, రవాణా సదుపాయాల పెంపుతో 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నిలబెట్టాలట! కేవలం ఐదేళ్ల పదవీకాలంలోనే నాలుగు నౌకాశ్రయాలను, పది ఫిషింగ్‌ హార్బర్లను, ఆరు ఫిష్‌ ల్యాండర్ల నిర్మాణాన్ని ప్రారంభించి కొన్నిటిని పూర్తిచేసిన జగన్‌మోహన్‌రెడ్డి ఆచరణ ఎక్కడ? ఇంకో ఇరవై రెండేళ్లలో వాటిని నిర్మించాలనుకుంటున్న చంద్రబాబు ఆలోచన ఎక్కడ? మిడిమిడి జ్ఞానపు, మీడియా జ్ఞానపు మేధావులంతా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆరో అభివృద్ధి మెట్టుగా గ్రోత్‌సెంటర్లుగా అమరావతి, విశాఖ, తిరుపతిలను అభివృద్ధి చేయాలని పెట్టుకున్నారు. దీనిపై కూడా ఆచరణే గీటురాయిగా విస్తృత చర్చ జరగవలసిన అవసరం ఉన్నది.ఈమధ్య రాష్ట్ర ప్రభుత్వం కంపెనీల ఏర్పాటు పేరుతో పైసా తక్కువ రూపాయి పథకాన్ని ప్రారంభించింది. టీసీఎస్‌ ఆఫీసు ఏర్పాటు కోసం విశాఖలో విలువైన 21 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. టీసీఎస్‌ అనేది పేరున్న సంస్థ కనుక ఆ కంపెనీ ఏర్పాటయితే మన నిరుద్యోగులకు ఉద్యోగా లొస్తాయనే ఆశ ఉండవచ్చు. కాకపోతే ప్రభుత్వ ఐటీ పాలసీలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలనే షరతు లేకపోవడంఆందోళన కలిగించే విషయం. టీసీఎస్‌కు భూకేటాయింపు జరిగిన వెంటనే అసలైన అవినీతి కథ మొదలైంది. ‘ఉర్సా’ అనే ఊరూపేరూ లేని, రెండు మాసాల వయసున్న ఓ కంపెనీకి విశాఖలోనే ఖరీదైన 60 ఎకరాల స్థలాన్ని ఎకరా 99 పైసలకే కట్టబెట్టారు. ఇలాంటి కంపెనీలు పైప్‌లైన్లో ఇంకా చాలా ఉన్నాయట!కాంట్రాక్టుల్లో కమీషన్లు, భూకేటాయింపుల్లో చేతివాటంతో అగ్రనేతలు చెలరేగుతుంటే గ్రాస్‌ రూట్స్‌ నాయకులు గడ్డి మేయకుండా ఉంటారా? అవినీతి గబ్బు ఆంధ్రావనిని అతలా కుతలం చేస్తున్నదని వార్తలు వస్తున్నాయి. వాగ్దాన భంగం కారణంగా జనంలో తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకత బాహాటంగానే వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలోనే అభివృద్ధిని మబ్బుల్లో చూపడం, అవినీతిని గత ప్రభుత్వంలో చూపడమనే కార్య క్రమాన్ని కూటమి సర్కార్‌ తలకెత్తుకున్నది. అందులో భాగంగా గత ప్రభుత్వ హయాంలో లిక్కర్‌ స్కామ్‌ పేరుతో ఓ నిత్యాగ్నిహోత్రాన్ని నిరంతరం మండించే పనిలో పడ్డారు. అసలు స్కామ్‌ అంటే ఏమిటి? ఎటువంటి ప్రభుత్వ విధానం వల్ల స్కామ్‌ జరిగే అవకాశం ఉంటుంది అనే మౌలికమైన ప్రశ్నల జోలికి వెళ్లకుండా జాగ్రత్తపడుతున్నారు.మద్యం తయారీదారులకు ఉపయోగపడేలా మద్యం ఉత్పత్తులకు ఊతమిచ్చి, అమ్మకందారులు లబ్ధిపొందేలా ప్రవా హాలను ప్రోత్సహించే పాలసీలో స్కామ్‌ ఉంటుంది. ఆంధ్ర ప్రదేశ్‌కు మద్యం సరఫరా చేసిన డిస్టిలరీలలో సింహభాగం గతంలో చంద్రబాబు ప్రభుత్వం అనుమతులతో పుట్టినవేనని చెబుతున్నారు. మునుపటి చంద్రబాబు పాలనా కాలంలో ఊరూవాడల్ని మద్యం ముంచెత్తింది. గజానికో బెల్టు షాపు, పది గజాలకో పర్మిట్‌ రూమ్‌తో మహమ్మారి విలయతాండవంచేసింది. జగన్‌ సర్కార్‌ మద్య నియంత్రణను తన పాలసీగా ప్రకటించింది. కొత్తగా డిస్టిలరీలకు అనుమతులివ్వలేదు. 43 వేల బెల్టు షాపులను ఎత్తేసింది. పర్మిట్‌ రూమ్‌లను అనుమతించలేదు. షాపుల సంఖ్యను సగానికి సగం కుదించింది. అమ్మకం ద్వారా లాభాలను గడించే ప్రైవేట్‌ వ్యాపార వర్గాన్ని పూర్తిగా తొలగించింది. ప్రభుత్వ యాజమాన్యంలోనే నిర్ణీత వేళల్లోనే అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకున్నది. ఒకే ఒక్క ప్రశ్న: ‘మా ప్రభుత్వంలో తమ్ముళ్లకు బాగా తాపిస్తా’ అని చెప్పిన ప్రభుత్వంలో స్కామ్‌ ఉంటుందా? ‘మద్యం ముట్టుకుంటే షాక్‌ కొట్టాల్సిందే’నని హెచ్చరించిన ప్రభుత్వంలో స్కామ్‌ ఉంటుందా? బుద్ధిజీవులే నిర్ణయించాలి!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

Number of toppers reduced in JEE Main 2025 results9
ర్యాంకర్లూ కటాఫ్‌!

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రీయ విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్‌ యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్‌–2025 అర్హత పరీక్ష ఫలితాల్లో దాదాపు అన్ని కేటగిరీల్లో కటాఫ్‌ పర్సంటైల్‌ గతేడాదితో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. అలాగే జనరల్, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీల్లో అర్హుల సంఖ్యలోనూ స్వల్పంగా తగ్గుదల కనిపించింది. మరోవైపు గతేడాదితో పోలిస్తే 100 పర్సంటైల్‌ సాధించిన విద్యార్థుల సంఖ్య కూడా సగానికి పడిపోయింది.గతేడాది జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో 100 పర్సంటైల్‌ సాధించిన విద్యార్థులు 56 మంది ఉండగా ఈసారి కేవలం 24 మందే 100 పర్సంటైల్‌ సాధించారు. తెలుగు రాష్ట్రాల నుంచి ర్యాంకర్లు సైతం భారీగా తగ్గిపోయారు. గతేడాది జేఈఈ మెయిన్‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 21 మంది విద్యార్థులు 100 పర్సంటైల్‌ సాధించగా తాజాగా ఆ జాబితాలో నలుగురు (హర్షి ఎ. గుప్తా, వంగల అజయ్‌రెడ్డి, బణిబ్రత మజీ, గుత్తికొండ సాయి మనోజ్ఞ) మాత్రమే ఉండటం గమనార్హం. సాయి మనోజ్ఞ మహిళల కేటగిరీలో టాపర్‌గా నిలవగా అజయ్‌రెడ్డి ఈడబ్ల్యూఎస్‌ విభాగంలోనూ టాపర్‌గా నిలిచాడు. భారీగా దరఖాస్తులు... జేఈఈ మెయిన్‌–2025 కోసం విద్యార్థులు భారీగానే పోటీ పడ్డారు. జనవరి, ఏప్రిల్‌ రెండు సెషన్లకు కలిపి 15,39,848 మంది దరఖాస్తు చేసుకోగా 14,75,103 మంది హాజరయ్యారు. తుది ఫలితాల్లో నిర్దేశించిన కటాఫ్‌ పర్సంటైల్‌ సాధించి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు 2,50,236 మంది అర్హత సాధించారు. ఈ ఏడాది జేఈఈ మెయిన్‌లో కటాఫ్‌ మార్కులు స్వల్పంగా తగ్గాయి. ఓపెన్‌ కేటగిరీలో 93.102 పర్సంటైల్‌గా కటాఫ్‌ను నిర్ణయించగా గతేడాది ఇది 93.236గా నమోదైంది.ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో కటాఫ్‌ను 80.383గా నిర్ణయించగా గతేడాది 81.326గా నమోదైంది. ఓబీసీ కేటగిరీలో గతేడాది 79.675 పర్సంటైల్‌ ఉండగా ఈ ఏడాది 79.431గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీల్లో మాత్రం కటాఫ్‌ పర్సంటైల్‌ స్వల్పంగా పెరిగింది. మరోవైపు పరీక్షల్లో అక్రమాలకు పాల్పడ్డ 110 మంది విద్యార్థుల ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిలిపేసింది. ఈ నెల 23 నుంచి ‘అడ్వాన్స్‌డ్‌’కు రిజిస్ట్రేషన్ జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో 2,50,236 మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించడంతో అందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 23 నుంచి ప్రారంభం కానుంది. మే 2 వరకు దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు ఉంది. మే 18న రెండు పేపర్లుగా అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు జరగనున్నాయి. అడ్వాన్స్‌డ్‌ ఫలితాలను జూన్‌ 2న ప్రకటించనున్నట్లు ఐఐటీ కాన్పూర్‌ ప్రాథమికంగా వెల్లడించింది. అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఫలితాల ఆధారంగా ఐఐటీల్లోని 17 వేలకుపైగా సీట్లను భర్తీ చేయనున్నారు. అలాగే జేఈఈ మెయిన్‌ ద్వారా ప్రవేశం కల్పించే ఎన్‌ఐటీల్లో దాదాపు 24 వేలు, ట్రిపుల్‌ ఐటీల్లో 8,500, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇతర విద్యాసంస్థల్లో దాదాపు 9 వేల సీట్లు అందుబాటులో ఉంటాయి.

Lucknow Super Giants surprisingly beat Rajasthan Royals by 2 runs10
లక్నో ‘సూపర్‌’ విక్టరీ

జైపూర్‌: ఆఖరి ఓవర్‌... ఆఖరి బంతిదాకా ఇరు జట్లతోనూ దోబూచులాడిన విజయం చివరకు లక్నో సూపర్‌జెయింట్స్‌ను వరించింది. రాజస్తాన్‌ రాయల్స్‌ 6 బంతుల్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా... లక్నో బౌలర్‌ అవేశ్‌ ఖాన్‌ అద్భుతం చేశాడు. 6 పరుగులే ఇచ్చి ప్రమాదకర హిట్టర్‌ హెట్‌మైర్‌ను అవుట్‌ చేశాడు. దీంతో ఉత్కంఠ రేపిన పోరులో సూపర్‌జెయింట్స్‌ 2 పరుగులతో అనూహ్యంగా రాయల్స్‌పై గెలిచింది. తొలుత లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. మార్క్‌రమ్‌ (45 బంతుల్లో 66; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఆయుశ్‌ బదోని (34 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించగా, ఆఖరి ఓవర్లో సమద్‌ (10 బంతుల్లో 30 నాటౌట్‌; 4 సిక్స్‌లు) చెలరేగాడు. హసరంగకు 2 వికెట్లు దక్కాయి. తర్వాత రాజస్తాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసి ఓడింది. యశస్వి జైస్వాల్‌ (52 బంతుల్లో 74; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), రియాన్‌ పరాగ్‌ (26 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించారు. మార్క్‌రమ్, బదోని ఫిఫ్టీ–ఫిఫ్టీ పవర్‌ప్లే ముగియక ముందే హిట్టర్లు మార్ష్ (4), పూరన్‌ (11), పవర్‌ ప్లే తర్వాత కెపె్టన్‌ రిషభ్‌ పంత్‌ (3) అవుటవడంతో లక్నో 54 పరుగుల వద్ద కీలకమైన మూడు వికెట్లను కోల్పోయింది. ఈ దశలో క్రీజులో ఉన్న ఓపెనర్‌ మార్క్‌రమ్, ఆయుశ్‌ బదోని సూపర్‌జెయింట్స్‌ స్కోరు భారాన్ని మోశారు. ఇద్దరు వేగంగా ఆడటంతో జట్టు పరుగుల జోరందుకుంది. 31 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకున్న మార్క్‌రమ్‌ నాలుగో వికెట్‌కు 76 పరుగులు జోడించాక అవుటయ్యాడు. కాసేపటికి బదోని 33 బంతుల్లో బదోని అర్ధ సెంచరీ చేసిన వెంటనే నిష్క్రమించాడు. సమద్‌ 4 సిక్సర్లతో... 19 ఓవర్లలో 153/5 వద్ద ఓ మోస్తరు స్కోరు చేసిన లక్నో శిబిరంలో ఆఖరి ఓవర్‌ ఆనందం నింపింది. సందీప్‌ వేసిన 20వ ఓవర్లో మిల్లర్‌ (7 నాటౌట్‌) సింగిల్‌ తీసివ్వగా తర్వాత సమద్‌ 6, 6, 2, 6, 6లతో మొత్తం 27 పరుగులు వచ్చాయి. దీంతో సూపర్‌జెయింట్స్‌ స్కోరు 180కి చేరింది. జైస్వాల్‌ శ్రమించినా... యశస్వి జైస్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించిన కొత్త కుర్రాడు వైభవ్‌ సూర్యవంశీ (20 బంతుల్లో 34; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆకట్టుకున్నాడు. ఇద్దరి ఓపెనర్ల వేగం రాజస్తాన్‌ను లక్ష్యం వైపు నడిపించింది. తొలి వికెట్‌కు 85 పరుగులు జోడించాక వైభవ్‌ ఆటను మార్క్‌రమ్‌ ముగించగా, నితీశ్‌ రాణా (8)ను శార్దుల్‌ పెవిలియన్‌ చేర్చాడు.తర్వాత జైస్వాల్‌కు జతయిన కెపె్టన్‌ రియాన్‌ పరాగ్‌ రన్‌రేట్‌ తగ్గకుండా ఇన్నింగ్స్‌ను నడిపించారు. 31 బంతుల్లో ఫిఫ్టీ సాధించిన జైస్వాల్‌ దూకుడు పెంచాడు. లక్ష్యానికి చేరువైన దశలో 18వ ఓవర్లో జైస్వాల్, పరాగ్‌లను అవుట్‌ చేసిన అవేశ్‌...ఆఖరి ఓవర్లో హెట్‌మైర్‌ (12)కు చెక్‌ పెట్టాడు.స్కోరు వివరాలు లక్నో సూపర్‌జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: మార్ష్ (సి) హెట్‌మైర్‌ (బి) ఆర్చర్‌ 4; మార్క్‌రమ్‌ (సి) పరాగ్‌ (బి) హసరంగ 66; నికోలస్‌ పూరన్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) సందీప్‌ 11; రిషభ్‌ పంత్‌ (సి) జురేల్‌ (బి) హసరంగ 3; ఆయుశ్‌ బదోని (సి) దూబే (బి) తుషార్‌ 50; మిల్లర్‌ నాటౌట్‌ 7; సమద్‌ నాటౌట్‌ 30; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 180. వికెట్ల పతనం: 1–16, 2–46, 3–54, 4–130, 5–143. బౌలింగ్‌: జోఫ్రా ఆర్చర్‌ 4–0–32–1, తీక్షణ 4–0–32–0, సందీప్‌ శర్మ 4–0–55–1, తుషార్‌ దేశ్‌పాండే 4–0–26–1,హసరంగ 4–0–31–2. రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (బి) అవేశ్‌ 74; వైభవ్‌ (స్టంప్డ్‌) పంత్‌ (బి) మార్క్‌రమ్‌ 34; నితీశ్‌ రాణా (సి) అవేశ్‌ (బి) శార్దుల్‌ 8; రియాన్‌ పరాగ్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) అవేశ్‌ 39; జురేల్‌ నాటౌట్‌ 6; హెట్‌మైర్‌ (సి) శార్దుల్‌ (బి) అవేశ్‌ 12; శుభమ్‌ నాటౌట్‌ 3 ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 178. వికెట్ల పతనం: 1–85, 2–94, 3–156, 4–161, 5–175. బౌలింగ్‌: శార్దుల్‌ 3–0–34–1, అవేశ్‌ ఖాన్‌ 4–0–37–3, దిగ్వేశ్‌ రాఠి 4–0–30–0, మార్క్‌రమ్‌ 2–0–18–1, ప్రిన్స్‌ 4–0–39–0, రవి బిష్ణోయ్‌ 3–0–19–0. 14 ఏళ్ల 23 రోజుల వయసులో... ఐపీఎల్‌ వేలం సమయంలోనే అందరి దృష్టినీ ఆకర్షించిన కుర్రాడు వైభవ్‌ సూర్యవంశీ ఎట్టకేలకు తన తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడాడు. లీగ్‌ బరిలోకి దిగిన అత్యంత పిన్న వయస్కుడిగా గుర్తింపు తెచ్చుకున్న వైభవ్‌ తన తొలి బంతికే సిక్స్‌ బాది సంచలన రీతిలో మొదలు పెట్టాడు. ఎక్స్‌ట్రా కవర్‌ దిశగా ఆ షాట్‌ను అద్భుతంగా ఆడిన అతని సాహసానికి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే. చెలరేగిపోతున్న దశలో అనూహ్యంగా స్టంపౌట్‌ కావడంతో వైభవ్‌ తట్టుకోలేకపోయినట్లున్నాడు. కన్నీళ్లతో అతను నిష్క్రమించాడు! బిహార్‌కు చెందిన ఈ ప్రతిభాశాలి ఇప్పటికే భారత అండర్‌–19 జట్టు తరఫున ఆడటంతో పాటు 5 రంజీ మ్యాచ్‌లలో కూడా బరిలోకి దిగాడు. వేలంలో వైభవ్‌ను రాజస్తాన్‌ రూ.1.10 కోట్లకు తీసుకుంది. ఐపీఎల్‌లో నేడుపంజాబ్‌ X బెంగళూరువేదిక: ముల్లాన్‌పూర్‌ ,మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి ముంబై X చెన్నై వేదిక: ముంబై రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement