
భూభారతితో రైతుల సమస్యలు పరిష్కారం
● కలెక్టర్ రాజర్షిషా
ఇంద్రవెల్లి: రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకే ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకొచ్చిందని కలెక్టర్ రాజ ర్షిషా, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అ న్నారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నూతన చట్టంపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు హాజరై మాట్లాడారు. ఆధార్‌కార్డు మాదిరిగా రైతులకు భూధార్ కార్డు పంపిణీకి ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. జూన్ 2 నుంచి పోర్టల్ పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తుందన్నారు. అనంతరం కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ముందుగా డిప్యూటీ తహశీల్దార్ రమేశ్ ఆధ్వర్యంలో భూ భారతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఉట్నూర్ సబ్‌కలెక్టర్ యువరాజ్ మర్మాట్, ఆర్డీవో రాథోడ్ రవీందర్, ఏఎంసీ చైర్మన్ ముఖడే ఉత్తం, ఏపీసీఎస్ చైర్మన్ మారుతి డొంగ్రె, తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్,ఎంపీడీవో జీవన్‌రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.
తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు
గట్టెపల్లి పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. గ్రామంలో అడుగంటిన బావి, చేతిపంపుతో పాటు ఇటీవల తవ్విన బావిని పరిశీలించి స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. అలాగే మండలకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జొన్న పంట కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు.
ఉట్నూర్‌రూరల్: ఉట్నూర్ కేబీ ప్రాంగణంలోని పీఎంఆర్సీ సమావేశ మందిరంలో భూభారతిపై అ వగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ రాజర్షి షా,ఎమ్మెల్యే బొజ్జు హాజరయ్యారు. పలువురు రైతు లు తమ సమస్యలను కలెక్టర్‌కు వివరించారు. ఇందులో తహసీల్దార్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్‌కు సన్మానం
కై లాస్‌నగర్: నార్నూర్ మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ఇటీవల జాతీయ పురస్కారం అందుకున్న కలెక్టర్ రాజర్షి షాను సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో వేద పండితుల ఆశీర్వచనాల నడుమ సమితి అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రీ కలెక్టర్‌ను సత్కరించారు. పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఇందులో సమితి ప్రతినిధులు మాధవ్, సూర్యకాంత్, రవీందర్, నర్సింలు, వేణు, సంజీవ్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.