
ప్రిన్సిపాల్ తీరుపై ధ్వజం
ముంచంగిపుట్టు: స్థానిక నేతాజీ ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో ఫీజు చెల్లించలేదని విద్యార్థులకు పరీక్షలు రాయకుండా చేసిన ప్రిన్సిపాల్ విజయదాస్ తీరు సరికాదని వైస్ ఎంపీపీ పి.సత్యనారాయణ, గిరిజన సంఘం మండల నేతలు అన్నారు. నేతాజీ స్కూల్ ఘటనపై గురువారం గిరిజన సంఘం నేతలు సమావేశం నిర్వహించి ఖండించారు. వైస్ ఎంపీపీ సత్యనారాయణ మాట్లాడుతూ ఫీజుతో ముడిపెట్టి విద్యార్థుల పరీక్షలు రాయకుండా అడ్డుకున్న ప్రిన్సిపాల్ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రిన్సిపాల్‌పై విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేతలు శ్రీను, నర్సయ్య, గాసిరాందొర, బాలన్న తదితరులు పాల్గొన్నారు.