
ఇంటర్ ఫలితాల్లో కిలగాడ కేజీబీవీ రికార
● జిల్లాలో మొదటి స్థానం
ముంచంగిపుట్టు: మండలంలో కిలగాడ కస్తూ ర్భా గాంధీ బాలికా విద్యాలయం ఇంటర్ ఫలితాల్లో ఎన్నడూ లేనివిధంగా రికార్డు సాధించింది. జిల్లాలో 19 కేజీబీవీలుండగా వాటిలో కిలగాడ కేజీబీవి మొదటి స్థానంలో నిలిచింది. కిలగాడ కేజీబీవీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 36 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా ఒక్కరూ మినహా అందరూ ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 37 మందికి గాను అందరూ ఉత్తీర్ణులయ్యారు.ఈ సందర్భంగా కేజీబీవీ ప్రిన్సిపాల్ ఉబ్బేటి సాయిప్రసన్న మంగళవారం విలేకరులతో మాట్లాడు తూ ఫలితాలసాధనకు ఉపాధ్యాయు లు విశేష కృషి చేశారన్నారు.విద్యార్థులు ఏకగ్ర తగా చదువుపై దృష్టి పెట్టి, ఇంటర్ ఫలితాల్లో పాఠశాలకు మంచి పేరును తీసుకువచ్చారని చెప్పారు. రానున్న రోజుల్లో మరెన్నో ఉన్నత ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తామని చెప్పారు.