
సారా బట్టీలపై దాడి–ఇద్దరి అరెస్టు
● 1600 లీటర్ల బెల్లపు పులుపు ధ్వంసం
అడ్డతీగల: మండలం కిమ్మూరు సమీపాన సారా బట్టీపై గురువారం దాడులు నిర్వహించి 1600 లీటర్లు బెల్లపు పులుపుని ధ్వంసం చేసినట్టు ఎకై ్సజ్ సిఐ శ్రీధర్ తెలిపారు. దాడిలో సంఘటనా స్థలం నుంచి 30 లీటర్లు సారా స్వాధీనం చేసుకొని, ఇద్దరు సారా తయారీదారులను అరెస్ట్ చేశామన్నారు. వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కి తరలించామన్నారు. సారా తయారీ, క్రయ,విక్రయాలు జరిపినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీధర్ హెచ్చరించారు. సారాపై ఎటువంటి సమాచారం ఇచ్చినా గోప్యంగా ఉంచి నిరోధానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు.