ప్రైవేట్‌ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు ఉండాలి. వైద్య సదుపాయాలు, వైద్యుల అందుబాటులో ఉండాలి, శానిటేషన్‌, రోగులకు కల్పించే సదుపాయాల్లో లోటు ఉండకూడదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అడుగు పెట్టగానే.. కార్పొరేట్‌ ఆస్పత్రికి వచ్చామా అన్న భావన ప్రజలకు రావాలి, ఆ | - | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు ఉండాలి. వైద్య సదుపాయాలు, వైద్యుల అందుబాటులో ఉండాలి, శానిటేషన్‌, రోగులకు కల్పించే సదుపాయాల్లో లోటు ఉండకూడదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అడుగు పెట్టగానే.. కార్పొరేట్‌ ఆస్పత్రికి వచ్చామా అన్న భావన ప్రజలకు రావాలి, ఆ

Published Sun, Apr 20 2025 2:04 AM | Last Updated on Sun, Apr 20 2025 2:04 AM

ప్రైవ

ప్రైవేట్‌ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు ఉండాలి

ఎన్‌క్యూఏఎస్‌ బృందంగుర్తించిన అంశాలు

● ఆస్పత్రిలో ప్రత్యేకంగా మూడు

వేస్ట్‌ డస్ట్‌ బిన్‌ల ఏర్పాటు

● పూర్తి స్థాయి పరికరాలతో లేబర్‌ రూమ్‌

● మందుల పంపిణీకి ప్రత్యేక గది

● ఆస్పత్రి ఆవరణలో ప్రత్యేక గదిలో

బ్రెస్ట్‌ ఫీడింగ్‌ రూమ్‌

● రెండు వైద్యుల గదుల ఆధునికీకరణ

● పురుషులు, మహిళలకు వేర్వేరు వార్డులు, ప్రత్యేకంగా వాష్‌ రూమ్‌లు, కామన్‌ వాష్‌ రూమ్‌

● లేబొరేటరీ

● బర్త్‌ వెయిటింగ్‌ రూమ్‌

● రోగుల సౌకర్యార్థం ఆర్‌వో ప్లాంట్‌

● ఆస్పత్రిలో ముఖ ద్వారం వద్ద

ఆర్చ్‌ నిర్మాణం

ఆస్పత్రిలో 24 గంటలవైద్య సేవలు

● పీహెచ్‌సీలో 24గంటలు అందుబాటు లో ఉంటూ సేవలందిస్తున్న డాక్టర్‌,వైద్య సిబ్బంది.

● ఆస్పత్రి ఆవరణను రోజూమూడు సార్లు శుభ్రంచేస్తున్న పారిశుధ్య సిబ్బంది.

● పీహెచ్‌సీలో ప్రతి రోజు ఓపీ 75 నుంచి 80 వరకు ఉంటుంది.

● సోమవారం సంత రోజు 150కు పైగా ఓపీ ఉంటుంది.

● ప్రతి నెల పీహెచ్‌సీలో 15 నుంచి 20 కాన్పులు జరుగుతున్నాయి.

● మందులు పుష్కలంగా ఉన్నాయి. పీహెచ్‌సీలో లేని మందులు బయట నుంచి కొనుగోలు చేసి పంపిణీ చేస్తున్నారు.

● ఆస్పత్రిలో ఒక అంబులెన్స్‌తోపాటు ఒక తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ అందుబాటులో ఉంది.

ఆనందంగా ఉంది

అనంతగిరి పీహెచ్‌సీని ఎన్‌క్యూఏఎస్‌ బృందం సభ్యులు గత నెల 24, 25 తేదీల్లో పరిశీలించారు. ఆస్పత్రిలోని అన్ని విభాగాలను, రోగులకు వైద్యు లు అందిస్తున్న సేవలను ప్రత్యక్షంగా చూశారు. వైద్య సిబ్బంది సేవలు సైతం గుర్తించారు. పీహెచ్‌సీకి గుర్తింపు లభించడం చాలా ఆనందంగా ఉంది. పీహెచ్‌సీని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలుతీసుకుంటున్నాం.

– జ్ఞానేశ్వరి, డాక్టర్‌, అనంతగిరి పీహెచ్‌సీ

అనంతగిరి(అరకులోయటౌన్‌): గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సమకూర్చిన సౌకర్యాలతో ప్రజారోగ్య సదుపాయల కల్పనలో రాష్ట్రంలోనే మేటి పీహెచ్‌సీగా అనంతగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. రాష్ట్రంలో మూడు పీహెచ్‌సీలు.. తూర్పుగోదావరి జిల్లా సారంగధర మెట్ట, అనంతపురం జిల్లా శ్రీనివాసనగర్‌, అల్లూరి జిల్లా అనంతగిరి పీహెచ్‌సీలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందగా అందులో అనంతగిరి పీహెచ్‌సీ 91.64 శాతంతో ప్రథమ స్థానంలో నిలిచింది. గత నెల 24, 25 తేదీల్లో నేషనల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ స్టాండర్డ్స్‌(ఎన్‌క్యూఏస్‌) బృందం ప్రతినిధులు మనీషా, షణ్మఖవేల్‌ పీహెచ్‌సీలో రోగులకు అందిస్తున్న సేవలు, ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు,పరిసరాలు, పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. రోగులకు వైద్యులు, సిబ్బంది మెరుగైన సేవలందిస్తున్నట్టు గుర్తించిన ఎన్‌క్యూఏఎస్‌ బృందం ఈనెల 16వ తేదీన జాతీయ స్థాయి గుర్తింపు పత్రాన్ని వాట్సప్‌ ద్వారా అందించారని డాక్టర్‌ జ్ఞానేశ్వరి తెలిపారు.

గుర్తింపు ప్రక్రియ ఇలా..

పీహెచ్‌సీ, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ (సీహెచ్‌సీ), ఏరియా ఆస్పత్రి, జిల్లా ఆస్పత్రులకు ఎన్‌క్యూఏఎస్‌ గుర్తింపు ఇస్తారు. ఆస్పత్రిని బట్టి గుర్తింపు లభించడానికి ప్రమాణాలు మారుతాయి. పీహెచ్‌సీల్లో ఆరు డిపార్ట్‌మెంట్లలో అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఏరియా ఆస్పత్రుల్లో 18 అంశాలను పరిశీలిస్తారు. సంబంధింత ఆస్పత్రికి గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకుంటే కేంద్ర వైద్య,ఆరోగ్యశాఖ నుంచి ప్రత్యేక బృందం వచ్చి ఆస్పత్రిలో ప్రమాణాలన్నింటినీ పరిశీలించి, అనంతరం గుర్తింపు ఇస్తుంది. ఔట్‌ పేషెంట్లు, ఇన్‌పేషెంట్లు, డయాగ్నొస్టిక్‌ సేవలు, మందుల లభ్యత, ఆపరేషన్‌ థియేటర్‌, లేబర్‌ రూమ్‌, ఆస్పత్రి అడ్మినిస్ట్రేషన్‌, రోగులకు సమకూర్చిన సౌకర్యాలు, పరిశుభ్రత, వైద్యులు, సిబ్బంది సంఖ్య తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.

నాడు – నేడుతోనే...

చాలా ఏళ్ల పాటు శిథిలభవనంలో కొనసాగిన అనంతగిరి పీహెచ్‌సీ రూపురేఖలు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో పూర్తిగా మారాయి. నాడు–నేడు కార్యక్రమంలో రూ.45 లక్షలతో పూర్తిగా ఆధునికీకరించడతో పాటు అన్ని సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోనే అగ్రస్థానంలో అనంతగిరి నిలవగలిగింది.

నంతగిరి..

నాడు–నేడు నిధులురూ. 45 లక్షలతో ఆస్పత్రి ఆధునికీకరణ, ఇతర సౌకర్యాల కల్పన

రూ.3 లక్షల మండల పరిషత్‌, హెచ్‌డీఎస్‌నిధులతో మెట్లు,రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం

సేవలు బాగున్నాయి.

అనంతగిరి పీహెచ్‌సీలో వైద్యులు, వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలు చాలా బాగున్నాయి. 24 గంటలూ వైద్యులు అందుబాటులో ఉంటున్నారు. రోగులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తున్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లవలసిన పని లేదు.

– పంచాడి అప్పన్న, గిరిజనుడు,

షాడ గ్రామం, అనంతగిరి మండలం

ఈనెల 16న వాట్సప్‌ద్వారా గుర్తింపు పత్రం అందజేత

పూర్తి సహకారం

పీహెచ్‌సీలో ఎటువంటి సమస్య లేకుండా మండల పరిషత్‌ నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నాం. ఆస్పత్రిలో మెట్ల మార్గం, ప్రహరీ నిర్మాణానికి మండల పరిషత్‌ నుంచి రూ. రెండు లక్షలు, ఆస్పత్రి అభివృద్ధి నిధులు రూ.లక్ష కేటాయించాం. గిరిజన రోగులకు మెరుగైన వసతులు కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తున్నాం.

– శెట్టి నీలవేణి, ఎంపీపీ, అనంతగిరి మండలం

ప్రైవేట్‌ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు ఉండాలి1
1/8

ప్రైవేట్‌ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు ఉండాలి

ప్రైవేట్‌ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు ఉండాలి2
2/8

ప్రైవేట్‌ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు ఉండాలి

ప్రైవేట్‌ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు ఉండాలి3
3/8

ప్రైవేట్‌ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు ఉండాలి

ప్రైవేట్‌ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు ఉండాలి4
4/8

ప్రైవేట్‌ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు ఉండాలి

ప్రైవేట్‌ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు ఉండాలి5
5/8

ప్రైవేట్‌ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు ఉండాలి

ప్రైవేట్‌ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు ఉండాలి6
6/8

ప్రైవేట్‌ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు ఉండాలి

ప్రైవేట్‌ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు ఉండాలి7
7/8

ప్రైవేట్‌ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు ఉండాలి

ప్రైవేట్‌ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు ఉండాలి8
8/8

ప్రైవేట్‌ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు ఉండాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement