
నేడు పాడేరు ఐటీడీఏ పాలకవర్గ సమావేశం
సాక్షి, పాడేరు: పాడేరు ఐటీడీఏ 74వ పాలకవర్గ సమావేశం ఈనెల 21వ తేదీ సోమవారం ఉదయం 11గంటలకు జరగనుంది.ఐటీడీఏ చైర్మన్,కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ అధ్యక్షతన జరిగే పాడేరు ఐటీడీఏ పాలకవర్గ సమావేశానికి జిల్లా ఇన్‌చార్జి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి హాజరుకానున్నారు. సమావేశానికి హాజరుకావాలని అరకు ఎంపీ డాక్టర్ తనూజరాణి, ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర,పాడేరు,అరకు ఎమ్మెల్యేలు మత్స్యరాస విశ్వేశ్వరరాజు, రేగం మత్స్యలింగం,ఎమ్మెల్సీలు కుంభా రవిబాబు,గాదే శ్రీనివాసులునాయుడు,ఎంపీపీలు,జెడ్పీటీసీల కు ఆహ్వానం పంపినట్టు జేసీ,ఇన్‌చార్జి ఐటీడీఏ పీవో ఎం.జె.అభిషేక్‌గౌడ ఓ ప్రకటనలో తెలి పారు. అన్నిశాఖల అధికారులు తమ శాఖల సమగ్ర వివరాలతో నిర్దేఽశిత సమయానికి పాల కవర్గ సమావేశానికి హాజరు కావాలని పేర్కొన్నారు.