
రూ.లక్షలు కట్టమంటున్నారు
నా భర్త బాలకృష్ణతో కలసి నేను వ్యవసాయ కూలి పనులకు వెళుతూ ఇద్దరు కుమార్తెలను పోషించుకుంటున్నాం. ఓ రోజు రాధమ్మ మాటలు నమ్మి నా భర్తకు తెలియకుండా బ్యాంకు బుక్, ఆధార్, ఏటీఎం కార్డు తీసుకెళ్లి ఇచ్చాను. తర్వాత ఫైనాన్స్ కంపెనీ వారు వచ్చారంటూ కబురు పెట్టడంతో వెళ్లి వారిచ్చిన కాగితాలపై సంతకాలు చేసి, ఫొటో దిగి వచ్చాను. అయితే రుణం డబ్బు మాత్రం చేతికి అందలేదు. అడిగితే రిజెక్ట్ అయిందని చెప్పింది. రాధమ్మ ఊరు విడిచి వెళ్లిపోయిన తర్వాత ఫైనాన్స్ కంపెనీ వారు వచ్చి నా పేరుపై రూ.1.25 లక్షల రుణం ఉందని, డబ్బు కట్టాలని ఒత్తిడి చేస్తున్నారు. ఆ డబ్బు ఎలా కట్టాలో దిక్కుతోచడం లేదు.
– భవాని, జి.కొట్టాల, గుంతకల్లు మండలం