
కక్ష పూరిత దాడులు చేస్తున్నారు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాలకులు సూపర్ సిక్స్ పథకాల అమలు పక్కన పెట్టి.. ‘సాక్షి’పై కక్షపూరితంగా దాడులు చేస్తున్నారు. ఏలూరులో సాక్షి కార్యాలయంపై చింతమనేని, ఆయన అనుచరులు దాడి సిగ్గుచేటు. ఈ అంశాన్ని మేధావులు, ప్రజాప్రతినిధులు అందరూ ఖండించాలి. తక్షణమే చింతమనేని బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి. లేదంటే ఆయన కార్యాలయం ముట్టడికి మా విలేకరులు వెనుకాడరు. వ్యతిరేక వార్తలు రాస్తే ఖండన రాయమని కోరవచ్చు. స్వేచ్ఛ గురించి మాట్లాడిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ వారి నాయకులను అదుపులో పెట్టుకోవాలి. లేదంటే వారి ఇళ్లను ముట్టడిస్తాం. ఈ ఉద్యమం ఇంతటో ఆగదు.
– కె.అనిల్‌కుమార్ రెడ్డి, జాప్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు