బహిరంగ క్షమాపణ చెప్పాలి | - | Sakshi
Sakshi News home page

బహిరంగ క్షమాపణ చెప్పాలి

Published Thu, Apr 24 2025 8:23 AM | Last Updated on Thu, Apr 24 2025 8:23 AM

బహిరంగ క్షమాపణ చెప్పాలి

బహిరంగ క్షమాపణ చెప్పాలి

ఏలూరులో సాక్షి కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. చింతమనేని, ఆయన అనుచరులు సాక్షి కార్యాలయంపై చేసిన దాడిని యావత్‌ రాష్ట్ర ప్రజలు గమనించారు. ఇది అత్యంత దుర్మార్గమైన చర్యగా పరిగణిస్తున్నారు. ఈ రోజు ఈ పత్రికకు జరగొచ్చు. రేపు ఇంకో పత్రికకు జరగొచ్చు. విలేకరులందరూ కలిసికట్టుగా కూటమి ప్రభుత్వ ఆగడాలను ఎండగట్టకపోతే భవిష్యత్తులో ఏ జర్నలిస్టూ పనిచేయలేని పరిస్థితి వస్తుంది. చింతమనేని బహిరంగ క్షమాపణలు చెప్పాలి. పూర్తిగా నేరచరిత్ర కలిగిన చింతమనేనిని చంద్రబాబు ప్రోత్సహించడం మంచిది కాదు. శాంతి స్థాపన అనే పవన్‌కళ్యాణ్‌ కూడా ఈ విషయంపై స్పందించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పోరాటం ఇంతటితో ఆగదు. శాంతియుతంగానే ఆయన ఇంటిని ముట్టడిస్తాం. ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం బాధితుడి వాంగ్మూలం మేరకే రాశారనే విషయం చింతమనేని గుర్తుంచుకోవాలి.

– గుండం రామచంద్రారెడ్డి (ఆర్‌సీఆర్‌), బ్యూరో ఇన్‌చార్జ్‌, అనంతపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement