మరోసారి పోలీసులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం | Ap High Court Is Once Again Angry On The Police | Sakshi
Sakshi News home page

మరోసారి పోలీసులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

Published Wed, Feb 12 2025 9:59 PM | Last Updated on Wed, Feb 12 2025 10:04 PM

Ap High Court Is Once Again Angry On The Police

మరోసారి పోలీసులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు తన భర్త రమణను పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ

సాక్షి, విజయవాడ: మరోసారి పోలీసులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు తన భర్త రమణను పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ భార్య లక్ష్మి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా పోలీసులపై ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ఆదేశాలను పోలీసులు బేఖాతరు చేస్తున్నారంటూ సీరియస్‌ అయ్యింది. 

‘‘రాష్ట్రంలో పరిస్థితులు ఇలాగేనా ఉండాల్సింది..?. తమ ముందున్న కేసుల్లో పోలీసులు పరిధి దాటి వ్యవహరిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. పోలీసుల చర్యలపై డీజీపీని పిలిపించి వివరణ కోరతాం’’ అని పేర్కొన్న హైకోర్టు.. రమణను అరెస్టు చేసిన పోలీసులు అతన్ని చట్ట ప్రకారం మేజిస్ట్రేట్  ముందు హాజరు పరచకుండానే విడుదల చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది.

ఈ కేసులో పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని ప్రకాశం జిల్లా ఎస్పీ, విశాఖపట్నం పోలీస్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈనెల 18కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి: మరో వీడియో విడుదల చేసిన కిరణ్‌ రాయల్‌ బాధితురాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement