‘తల్లిదండ్రులను వేధించి ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు’ | Ap: Minister Adimulapu Suresh Meeting With Officials On Education | Sakshi
Sakshi News home page

‘తల్లిదండ్రులను వేధించి ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు’

Published Thu, Sep 23 2021 5:23 PM | Last Updated on Thu, Sep 23 2021 5:57 PM

Ap: Minister Adimulapu Suresh Meeting With Officials On Education - Sakshi

సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. పరిషత్‌ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. డిసెంబర్‌ నుంచి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సచివాలయాలను తనిఖీ చేస్తారన్నారు.

వైఎస్‌ఆర్‌: రాష్ట్రంలో అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. పరిషత్‌ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. డిసెంబర్‌ నుంచి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సచివాలయాలను తనిఖీ చేస్తారన్నారు.

పెన్షన్లపై ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు విద్యార్థుల పట్ల  నిర్లక్ష్యం వహించినా, తల్లిదండ్రులను వేధించి ఫీజులు వసూలు చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. నీరు చెట్టు కార్యక్రమంలో గత ప్రభుత్వం కోట్ల రూపాయల దోపిడీ పాల్పడిందని విమర్శించారు. విద్యార్థులు కరోనా బారిన పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం ఆయన తెలిపారు.

చదవండి: స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోపై సీఎం జగన్‌ సమీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement