meeting
-
భట్టితో ఉద్యోగ జేఏసీ నేతల భేటీ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలపై ఈనెల 12న మంత్రివర్గ ఉపసంఘంతో సమావేశం నిర్వహిస్తామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు తదితరులు సోమవారం భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. ఉద్యోగులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న 57 సమస్యలను లిఖితపూర్వకంగా వివరించారు.వాటి పరిష్కారం కోసం రూపొందించిన కార్యాచరణలో భాగంగా భట్టి విక్రమార్కతో సమావేశమై చర్చించారు. ఈ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘంతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరగా.. భట్టి పైవిధంగా స్పందించారు. అలాగే తహసీల్దార్ల, ఎంపీడీఓల తిరుగు బదిలీల విషయాన్ని పరిష్కరిస్తామన్నారు. మంత్రిని కలిసిన వారిలో ఉద్యోగ జేఏసీ కో చైర్మన్ వంగా రవీందర్‌రెడ్డి, టీఎన్జీఓ ప్రధాన కార్యదర్శి ముజీబ్, టీజీఓ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఫామ్ హౌస్ లో కేసీఆర్ కీలక మీటింగ్
-
అధికారం కోసం అడ్డదారులొద్దు
సాక్షి, హైదరాబాద్: ప్రజలు మెచ్చి అధికారం ఇవ్వాల్సిందే తప్ప..దాని కోసం అడ్డదారులు తొక్కాల్సిన అవసరం తమకు లేదని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. రాజకీయంగా నైతిక విలువలు పాటిస్తూ ప్రజలతో మమేకమైతే మరో మూడేళ్లలో అధికారం మళ్లీ బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు. ఏప్రిల్ 27న వరంగల్‌లో నిర్వహించే రజతోత్సవ మహాసభ ఏర్పాట్లకు సంబంధించి శుక్రవారం ఎర్రవల్లి నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ ముఖ్యనేతలతో జరిగిన ఈ భేటీలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పాల్గొన్నారు. ‘బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలతోపాటు కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ను సంప్రదిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కానీ ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం లేదు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అడ్డదారిలో ఎన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చి అధికారంలోకి వచ్చారో చాట్ జీపీటీ, గూగుల్‌లో వెతికినా తెలుస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో విఫలమైంది. కొందరు అవగాహన రాహిత్యంతో బీజేపీ మెరుగవుతుందని అనుకుంటున్నారు. కానీ ఆ పార్టీ క్రమంగా బలహీనమవుతోంది. అబద్ధాలను ప్రచారం చేసి ఎక్కువ కాలం అధికారంలో కొనసాగుతానని బీజేపీ భ్రమపడింది. వాపును చూసి బలుపు అనుకున్న బీజేపీ అసలు స్వరూపాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు’అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రతిష్టాత్మకంగా జన సమీకరణ ఏప్రిల్ 27న వరంగల్‌లో జరిగే బహిరంగ సభకు దూరాభారాన్ని దృష్టిలో పెట్టుకుంటూ జన సమీకరణపై దృష్టి పెట్టాలని పార్టీ నేతలను కేసీఆర్ ఆదేశించారు. సమావేశంలో మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్సీ లు శంభీపూర్ రాజు, నవీన్‌రావు, వాణిదేవి, దా సోజు శ్రవణ్, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్, బండారి లక్ష్మారెడ్డి, దేవిరెడ్డి సు«దీర్‌రెడ్డి, ముఠా గోపాల్, మర్రి రాజశేఖర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్‌లతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. మాజీ ఎంపీ జోగినపల్లి సంతోశ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, పార్టీ నేత కల్వకుంట్ల వంశీధర్‌రావు ఎర్రవల్లిలో జరుగుతున్న సమావేశాలను సమన్వయం చేస్తున్నారు. -
ప్రొఫెసర్లకు పునరావాస కేంద్రాలుగా మార్చొద్దు
సాక్షి, హైదరాబాద్: విశ్వవిద్యాలయాలు కొందరు ప్రొఫెసర్లకు పునరావాస కేంద్రాలుగా మారా యని సీఎం రేవంత్‌రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. వర్సిటీలను అలా చేయొద్దని సూచించారు. యూనివర్సిటీలన్నీ విద్యార్థులు కేంద్రంగా పని చేయాలే తప్ప.. కాలం చెల్లిన వారికి పునరావాసం కల్పించేందుకు కాదని స్పష్టం చేశారు. గతంలో నియమించిన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఇంకా ఉన్నారనే భావనతో పలు విశ్వ విద్యాలయాల్లో పెద్దగా ప్రాధాన్యం లేని కోర్సులను ఇప్పటికీ బోధిస్తున్నారని, వాటిని రద్దు చేసి నూతన కోర్సులను ప్రవేశపెట్టాలని సూచించారు.విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే కోర్సులు ఉండాలని, మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సుల బోధనకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. శుక్రవారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నత విద్యపై రాష్ట్రంలోని విశ్వ విద్యాలయాల వైస్‌చాన్స్‌లర్లతో సమీక్ష అనంతరం ఆయన మాట్లాడారు. కేకేతో చర్చించండి: ప్రస్తుతం వర్సిటీలకు గ్రామీణ ప్రాంతాల నుంచి, ఆర్థిక స్తోమత లేని కుటుంబాల నుంచే విద్యార్థులు వస్తున్నారని.. వారికి సరైన భవిష్యత్తు కల్పించేలా బోధన ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆర్థిక స్తోమత ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన వారు మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులను ఎంచుకుని ప్రైవేటు విశ్వ విద్యాలయాల వైపు వెళ్లిపోతున్నారని..వారితో ఎదురయ్యే పోటీని ప్రభుత్వ విశ్వ విద్యాలయాల విద్యార్థులు ఎదుర్కోవాలంటే డిమాండ్ ఉన్న కోర్సులనే బోధించాల్సి ఉందని చెప్పారు.గతంలో నియమితులైన ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు అధునాతన, డిమాండ్ ఉన్న బోధనను అందివ్వని పక్షంలో వారికి పాలనపరమైన బాధ్యతలు అప్పగించాలని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు వీసీలు తమ విశ్వ విద్యాలయాల్లో ప్రొఫెసర్ల కొరత, భవనాలు, ఇతర వసతుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో యూనివర్సిటీలకు అవసరమైన నిధులు కేటాయించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం హామీ ఇచ్చారు. వీసీలందరూ తమ ఉమ్మడి సమస్యలు, అలాగే యూనివర్సిటీల వారీగా సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావుతో సమావేశమై చర్చించాలని సూచించారు. వర్సిటీల వారీగా తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమరి్పంచాలని చెప్పారు. విద్యా వ్యవస్థలో మార్పులు చేయాలి క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టాలని విద్యాశాఖ ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. అంగన్వాడీలు, ప్రాథమిక పాఠశాల స్థాయిలో తీసుకురావాల్సిన మార్పులపై సమాజంలోని వివిధ సంఘాలు, ప్రముఖులతో చర్చించి సమగ్ర విధాన పత్రాన్ని రూపొందించాలని సూచించారు. ఇది ఆచరణకు దగ్గరగా ఉండాలని చెప్పారు.విద్యా రంగాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళేందుకు అవసరమైన నిధులు సమకూరుస్తామని భరోసా ఇచ్చారు. విద్యాశాఖ ఉన్నతాధికారులతో కూడా రేవంత్ సమీక్ష నిర్వహించారు. విద్యారంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోందని ఈ సందర్భంగా సీఎం చెప్పారు. పెద్ద ఎత్తున ఉపాధ్యాయుల నియామకం, అమ్మ ఆదర్శ పాఠశాలలకు కమిటీల ఏర్పాటు, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంల పంపిణీపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నట్టు తెలిపారు. ప్రాథమిక దశే పునాది ప్రాథమిక దశలో అందే విద్య కీలకమని, విద్యార్థికి పునాది వేసేది ఇదేనని సీఎం తెలిపారు. ప్రాథమిక విద్య బలోపేతం చేస్తే ఉన్నత విద్యలో మరింత రాణిస్తారని అన్నారు. వివిధ రాష్ట్రాలు, దేశాల్లో ప్రాథమిక విద్యలో అనుసరిస్తున్న విధానాలను విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 1960 దశకం నుంచి ఇప్పటివరకు విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన పలు సంస్కరణలు, విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి, ఆలోచన ధోరణి ఏ విధంగా క్షీణిస్తోందో ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫారŠమ్స్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జయప్రకాశ్ నారాయణ వివరించారు. విద్యా ప్రమాణాలు ఎందుకు పడిపోతున్నాయ్? విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పడిపోవడంపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ స్థాయి పరీక్ష (న్యాస్)లో విద్యార్థుల ప్రమాణాలు తగ్గిపోవడం, భాషల్లోనూ బలహీనంగా ఉండటాన్ని సీఎం ప్రస్తావించారు. అధికారుల నుంచి వివరణ కోరారు. అధికారులు దీనిపై ప్రతినెలా ఎందుకు సమీక్షించడం లేదని ప్రశ్నించారు.ఇప్పటికీ ప్రజల్లో ప్రభుత్వ స్కూళ్ళు సరిగా నడవవని, పాఠాలు సరిగా చెప్పరనే అపోహ ఉందంటూ, దీన్ని ఎలా దూరం చేస్తారో చెప్పాలన్నారు. ఈ దిశగా చపట్టబోయే చర్యలపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. ప్రైవేటు స్కూళ్ళు ప్రతి ఏటా ప్రవేశాలు పెంచుకుంటున్నాయని, ప్రభుత్వ స్కూళ్ళు మాత్రం ప్రజల్లో నమ్మకాన్ని కల్పించలేకపోవడంతో ప్రవేశాలు తగ్గుతున్నాయని సీఎం అన్నట్టు తెలిసింది. వేసవి సెలవుల్లో టీచర్లకు ప్రత్యేక శిక్షణ డిజిటల్, ఏఐ సాంకేతిక విద్యను ప్రాథమిక దశలోనే ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తున్నామని, దీనికి తగ్గట్టుగా టీచర్లూ తమ నాణ్యతను పెంచుకోవాలని సీఎం సూచించినట్టు సమాచారం. ఇలావుండగా వేసవి సెలవుల్లో ప్రభుత్వ టీచర్లకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని రేవంత్ సూచించారు. ఈ సమీక్షల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కేశవరావుతో పాటు శ్రీనివాసరాజు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి, సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ శ్రీదేవసేన, ప్రాథమిక విద్యా శాఖ డైరెక్టర్ నరసింహారెడ్డి, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, సభ్యులు ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు, చారకొండ వెంకటేష్, జ్యోత్స్న శివారెడ్డి, వీసీలు ప్రొఫెసర్ కుమార్ మొలుగారం, ప్రొఫెసర్ కె.ప్రతాప్‌రెడ్డి, డాక్టర్ టి.యాదగిరిరావు, ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్, ప్రొఫెసర్ ఉమేష్ కుమార్, ప్రొఫెసర్ సూర్య ధనుంజయ్, ప్రొఫెసర్ కిషన్‌కుమార్ రెడ్డి, ప్రొఫెసర్ టి.గంగాధర్, ప్రొఫెసర్ ఎ.గోవర్ధన్, ప్రొఫెసర్ వి.నిత్యానందరావు, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్య బంగ్లాకే మా మద్ధతు: యూనస్‌తో భారత ప్రధాని మోదీ
బ్యాంకాక్: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్(Muhammad Yunus)తో భారత ప్రధాని నరేంద్రమోదీ(Narendra Modi) భేటీ అయ్యారు. బ్యాంకాక్‌లో జరిగిన బిమ్స్టెక్ సదస్సు(BIMSTEC Summit) ఇందుకు వేదిక అయ్యింది. ప్రత్యేకంగా ఈ ఇద్దరు నేతలు భేటీ అయి పలు కీలకాంశాలపై చర్చించారు.ఈ భేటీ సారాంశాన్ని భారత విదేశాంగశాఖ ప్రతినిధి విక్రమ్ మిస్రి తెలియజేశారు. భేటీలో.. సుస్థిర, ప్రగతిశీల, ప్రజాస్వామ్య బంగ్లాదేశ్‌కు ప్రధాని మోదీ మద్దతు ఉంటుందని పునరుద్ఘాటించారు. ప్రజలే కేంద్రంగా ఉండే సంబంధాలకు భారత్ ప్రాధాన్యమిస్తుందని చెప్పారు. ఇరు దేశాలు పరస్పర సహకారంతో సుదీర్ఘకాలం ప్రజలు పొందిన ఫలాలను గుర్తు చేశారు. వాస్తవిక దృక్పథంతో సాగే సానుకూల, నిర్మాణాత్మక బంధాన్ని న్యూఢిల్లీ ఆకాంక్షిస్తోందని యూనస్‌కు వెల్లడించారు. అదే సమయంలో సరిహద్దులో అక్రమ వలసలను నియంత్రించాలని ప్రధాని కోరారు. ముఖ్యంగా సరిహద్దు భద్రత, సుస్థిరతను కాపాడేందుకు రాత్రి వేళల్లో చొరబాట్లను అడ్డుకోవాలని కోరారు’’ అని మిస్రి వివరించారు. దీంతోపాటు బంగ్లాదేశ్‌లో మైనారిటీల భద్రతపై ఆందోళనను యూనస్ దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు. తాజా భేటీ సమయంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా అక్కడే ఉన్నారు.Profsssor Muhammad Yunus is presenting a photo to Prime Minister Narendra Modi during their bilateral meeting in Bangkok on Friday. The photo is about Prime Minister Narendra Modi presenting a gold medal to Professor Yunus at the 102nd Indian Science Congress on January 3, 2015 pic.twitter.com/lsikvMOWT4— Chief Adviser of the Government of Bangladesh (@ChiefAdviserGoB) April 4, 2025ఈ భేటీ సందర్భంగా బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు యూనస్ భారత ప్రధాని మోదీకి ఓ పాత జ్ఞాపకాన్ని గుర్తుగా బహూకరించారు. 2015లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా బంగారు పతకాన్ని ప్రొఫెసర్ యూనస్ అందుకొన్నారు. ఈ ఫొటోను తాజాగా ఆయన ప్రధానికి అందజేశారు... గతేడాది ఆగస్టులో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత బంగ్లాదేశ్ సారథ్య బాధ్యతలు స్వీకరించారు యూనస్. అప్పటి నుంచి ఈ ఇరు దేశాల నేతలు కలవడం ఇదే మొదటిసారి. ఈ మధ్యలో ఈ ఇరువురి భేటీ కోసం ప్రయత్నాలు జరిగినా.. ఇరు దేశాల మధ్య కొనసాగిన విమర్శల కారణంగా అది ఫలించలేదు. అయితే బంగ్లా జాతీయ దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని స్వయంగా ఆ దేశానికి శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో బిమ్స్టెక్లో ఈ ఇరువురు భేటీ అయ్యే అవకాశం ఉందనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడులు, చైనాకు దగ్గరయ్యే ప్రయత్నాల్లో భాగంగా యూనస్ నాలుగు రోజుల పర్యటన, ఆ పర్యటనలో భారత ఈశాన్య రాష్ట్రాలపై యూనస్ చేసిన వ్యాఖ్యలు.. వీటన్నింటిని దరిమిలా ఈ ఇద్దరు నేతల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.దేశవ్యాప్త ఆందోళనలతో షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయి.. భారత్‌కు ఆశ్రయం కింద వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు సజావుగా సాగడం లేదు. ముఖ్యంగా బంగ్లాలో హిందువులపై దాడుల నేపథ్యంపై భారత్ ఆందోళన వ్యక్తం చేయగా.. అది పూర్తిగా తమ దేశ వ్యవహారమంటూ బంగ్లాదేశ్ నొక్కి చెప్పింది. మరోవైపు.. చైనా పర్యటనలో యూనస్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బంగ్లాదేశ్‌తో భూపరివేష్టితమైన భారత ఈశాన్య రాష్ట్రాలకు సముద్రానికి చేరుకోవడానికి మార్గం లేదని, ఆ ప్రాంతానికి తామే రక్షకులమంటూ యూనస్ చేసిన వ్యాఖ్యలపై భారత్ నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అవి ప్రమాదకర వ్యాఖ్యలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Sarma) మండిపడగా.. ఇలాంటి పరిస్థితుల్లో ఈశాన్యరాష్ట్రాల పరంగా కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానం ఏవిధంగా ఉండనుందని కాంగ్రెస్ ప్రశ్నించింది. -
ఉపఎన్నికల్లో మీరు చూపిన తెగువకు, ధైర్యానికి హ్యాట్సాఫ్: జగన్
-
స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశం
-
మీటింగ్‌కు రండమ్మా..! భజనే చంద్రబాబు విజన్
-
‘పీ4’.. అడ్వాన్స్డ్ ఏప్రిల్ ఫూల్!
సాక్షి, అమరావతి: నాటి ఉగాది హామీ.. వలంటీర్లను కొనసాగించి వేతనం రూ.పది వేలు చేస్తాం! నేటి ఉగాది హామీ.. రాష్ట్రంలో పేదరికాన్ని సమూలంగా రూపుమాపుతా..!! సాధారణంగా అందరూ ఏప్రిల్ 1న ఫూల్స్ డే చేసుకుంటుంటారు..! సీఎం చంద్రబాబు మాత్రం అడ్వాన్స్‌గా తెలుగు సంవత్సరాది ఉగాది రోజు ఫూల్స్ చేశారు! సరిగ్గా ఏడాది క్రితం 2.66 లక్షల మంది వలంటీర్లను వంచించిన సీఎం చంద్రబాబు ఇప్పుడు ప్రజలందరినీ మభ్యపుచ్చేందుకు సిద్ధమయ్యారు! రాజకీయాల్లో తన డైవర్షన్ పాలిటిక్స్‌ను సంక్షేమ కార్యక్రమాలకూ వర్తింపజేస్తున్నారు.నిజంగానే పేదరికాన్ని రూపుమాపాలంటే తాను హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను చంద్రబాబు అమలు చేయాలి. ఇప్పటికే ఉన్న సంక్షేమ పథకాలను యథాతథంగా కొనసాగించాలి. కానీ అవేమీ చేయకుండా బాధ్యత మరచి వ్యవహరిస్తున్నారు. పేదల జీవన ప్రమాణాలను పెంపొందిస్తూ గత ఐదేళ్లూ వైఎస్ జగన్ అమలు చేసిన పథకాలు, విప్లవాత్మక విధానాలను కక్షపూరితంగా నిలిపివేశారు. మరోపక్క విద్య, వైద్యం, వ్యవసాయం లాంటి మౌలిక రంగాలను నిర్విర్యం చేశారు. పేదలకు కూడు, గూడు, దుస్తులు సమకూర్చడం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత.దీన్ని పూర్తిగా విస్మరించిన చంద్రబాబు హామీల అమలు బాధ్యత నుంచి తప్పుకుని పీ 4 పథకం పేరుతో మరో కార్యక్రమాన్ని తెరపైకి తెచ్చారు. చంద్రబాబు ఎన్నడూ మాటపై నిలబడిన దాఖలాలు లేవని.. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నైజం ఉన్న ఆయన్ను ఎలా నమ్మాలనే చర్చ సర్వత్రా జరుగుతోంది. దీనికి భిన్నంగా వైఎస్ జగన్ అధికారంలో ఉండగా ప్రతి మాట నెరవేర్చారని.. హామీల అమలుకు మొదటి రోజు నుంచే ఆరాట పడ్డారని.. డీబీటీ ద్వారా నేరుగా రూ.2.73 లక్షల కోట్లను పేదల ఖాతాల్లో పారదర్శకంగా జమ చేశారని గుర్తు చేసుకుంటున్నారు. బాధ్యతల నుంచి పరార్... ఎన్నికల ముందు జనసేన–బీజేపీతో కూటమి కట్టిన చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తామని నమ్మబలికారు. ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, ఉచిత బస్సు అంటూ మహిళలను, అన్నదాతా సుఖీభవ పేరిట రైతులను, నిరుద్యోగ భృతి ఇస్తామని యువతకు మోసపూరిత వాగ్దానాలు చేశారు. అధికారంలోకి వచ్చాక హామీలను అమలు చేయకుండా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు పీ–4 పేరుతో మరో నాటకానికి తెరతీశారు. అన్నీ తెలిసే మోసపూరిత వాగ్దానాలు గతంలో మూడుసార్లు సీఎంగా, ఉమ్మడి రాష్ట్రంలో ఆరి్థక మంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాలుగోసారి అధికారంలోకి వచ్చేందుకు నోటికొచ్చిన వాగ్దానాలు ఇచ్చేశారు. తీరా ప్రభుత్వం ఏర్పాటయ్యాక తానిచ్చిన హామీలను చూస్తుంటే భయం వేస్తోందని, సంపద సృష్టికి మార్గాలుంటే తన చెవిలో చెప్పాలంటూ నిజ స్వరూపాన్ని చాటుకుంటున్నారు. ఎన్నికల ముందు హామీలివ్వడం.. గెలిచాక తిలోదకాలు ఇవ్వడం చంద్రబాబుకు మొదటినుంచి వెన్నతో పెట్టిన విద్య. గతంలో రైతు రుణ మాఫీ వ్యవహారమే దీనికి మచ్చు తునక. వీటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు తెరపైకి కొత్త కార్యక్రమాలు తేవడం ఆయనకు ఆలవాటే. ఇచ్చిన ప్రతి మాటా నెరవేర్చిన జగన్.. చంద్రబాబు ప్రభుత్వం పది నెలల పాలన పూర్తి చేసుకుంది. ఈ సర్కారుకు మరో నాలుగేళ్ల సమయమే మిగిలి ఉంది. అలాంటప్పుడు పీ–4తో 2029 నాటికి పేదరిక నిర్మూలన చేస్తానంటూ చంద్రబాబు ప్రకటించడం విడ్డూరంగా ఉందని సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు చంద్రబాబు తాను ఇస్తానని చెప్పినవి ఇవ్వకపోగా.. గతంలో వైఎస్ జగన్ ఇచ్చినవీ ఎగ్గొడుతున్నారని మండిపడుతున్నారు. వైఎస్ జగన్ అధికారంలో ఉండగా ప్రతి మాట నెరవేర్చారనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. డీబీటీ ద్వారా నేరుగా రూ.2.73 లక్షల కోట్లను పేదల ఖాతాల్లో పారదర్శకంగా జమ చేశారని గుర్తు చేస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్ మాదిరిగా భావించి హామీల అమలుకు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే నడుం బిగించారని పేర్కొంటున్నారు. రాష్ట్రానికి సొంత ఉపగ్రహం.. అమరావతిలో ఒలింపిక్స్.. రాజధానికి హైపర్ లూప్.. ఎండలు 2 డిగ్రీలు తగ్గింపు‘‘సాధ్యాసాధ్యాలతో పనిలేదు..! నమ్మశక్యం కాని విషయాలను నమ్మించేలా చెప్పడం..! వినేవాడుంటే చాలు.. చెప్పేవాడు చంద్రబాబు...!’’ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పోస్ట్ ఇదీ!! పీ–4 అంటూ ముఖ్యమంత్రి తెరపైకి తెచ్చిన కార్యక్రమం నేపథ్యంలో ఇలా ఎద్దేవా చేస్తున్నారు. ఏపీకి సొంతంగా ఉపగ్రహం..! అవసరమైతే రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాలకు ఉపగ్రహాలు..! అని ఇటీవల కలెక్టర్ల సదస్సులో ప్రకటించడాన్ని గుర్తు చేస్తున్నారు. వేల కిలోమీటర్ల దూరాన్ని నిమిషాల వ్యవధిలో ప్రయాణించే హైపర్ లూప్‌ను అమరావతికి తెస్తానంటూ గతంలో చంద్రబాబు ప్రకటించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. దాదాపు 10,500 మందికిపైగా క్రీడాకారులు, రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చయ్యే ఒలింపిక్స్‌ను అమరావతిలో నిర్వహిస్తామని ప్రకటనలు చేయడం.. అమరావతిలో ఎండలు రెండు డిగ్రీలు తగ్గించాలి.. నోబెల్ బహుమతి సాధించేందుకు సులభమైన మార్గం చెప్పాలనడం.. ఎవరైనా దాన్ని సాధిస్తే రూ.వంద కోట్లు ఇస్తానని జపాన్‌కు చెందిన నోబెల్ బహుమతి గ్రహీత సమక్షంలోనే చంద్రబాబు వ్యాఖ్యలు చేయటంపై చర్చ జరుగుతోంది.హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దింది తానేనని, సత్య నాదెళ్ల తనవల్లే మైక్రోసాఫ్ట్ సీఈవో అయ్యారని చంద్రబాబు తరచూ గొప్పలకు పోవడాన్ని ఎద్దేవా చేస్తున్నారు. ట్రాఫిక్ నుంచి శాంతి భద్రతల పరిరక్షణ వరకు నిరంతరం ప్రజలతో గడిపే పోలీస్‌లు ఇంటి నుంచి విధులు నిర్వహించేలా (వర్క్ ఫ్రం హోం) చర్యలు తీసుకుంటానని చెప్పటాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.నిబద్ధతతో నవరత్నాలు.. సంక్షోభంలోనూ సజావుగా పథకాలు.. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా నాడు వైఎస్ జగన్ ప్రభుత్వం నవరత్నాలను అమలు చేసింది. తొలి కేబినెట్ (10–6–2019) సమావేశంలోనే వైఎస్ జగన్ నవరత్నాలకు ఆమోదం తెలిపి నిబద్ధత చాటుకున్నారు. ఏటా సంక్షేమ క్యాలెండర్‌ను ముందుగానే ప్రకటించడమే కాకుండా కులం, మతం, ప్రాంతం, రాజకీయ పార్టీ అని తేడా చూపకుండా ప్రతి ఇంటికీ వలంటీర్లను పంపి సంక్షేమ పథకాలను అందజేసిన ఘనత వైఎస్ జగన్‌దే. క్యాలెండర్లో ప్రకటించిన తేదీల ప్రకారం నేరుగా నగదును బదిలీ చేశారు. ⇒ వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి ఖజానాలో కేవలం రూ.100 కోట్లే ఉన్నాయని, నవరత్నాలు ఎలా అమలు చేస్తారంటూ నాడు ఎల్లో మీడియా కథనాలను అచ్చు వేసింది. అయితే కోవిడ్ సంక్షోభంలో కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాలను ఆపలేదు. ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చి 10 నెలలైనా సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా కాలక్షేప సమీక్షలు నిర్వహిస్తున్నారు. పైగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టే నాటికి ఖజానాలో రూ.6 వేల కోట్లు ఉన్నాయి. అయినప్పటికీ హామీలను నెరవేర్చకుండా పబ్లిక్–ప్రైవేట్–పీపుల్ భాగస్వామ్యం కింద పీ–4 పేరుతో పేదరిక నిర్మూలన కార్యక్రమాలను అమలు చేస్తానంటూ సంక్షేమ బాధ్యతల నుంచి పూర్తిగా తప్పించుకుంటున్నారు. -
పీ-4 ప్రారంభోత్సవం అట్టర్ ప్లాప్.. చంద్రబాబుకు కట్టలు తెంచుకున్న ఆగ్రహం
సాక్షి,అమరావతి: సీఎం చంద్రబాబు నిర్వహించిన పీ-4 లాంఛింగ్ సభ అట్టర్ ప్లాపయ్యింది. ప్రారంభ సభకు టీడీపీ నాయకులు బస్సుల్లో జనాల్ని రప్పించారు. అయినా సరే మీటింగ్ జరుగుతుండగా జనం మధ్యలోనే వెళ్లిపోయారు.సమావేశం మధ్యలోనే జనం వెళ్లిపోవడంతో చంద్రబాబుకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బడుగు బలహీన వర్గాలను అవమానిస్తూ మాట్లాడారు. ఇలాంటి బడుగుల,బలహీనుల ఆలోచనలు పూట వరకే. చెప్పినా కూడా ఆలోచించరు. ఇప్పుడు వచ్చారు. సగం మంది వెళ్లిపోయారు. వాళ్ల ఆలోచన వచ్చాం. మీటింగ్ అయ్యింది. మా పని అయిపోయింది అని అనుకుంటూ ఉంటారు. నేను మిమ్మల్ని తప్పుపట్టడం లేదు మన ఆలోచనా విధానాన్ని తప్పుబడుతున్నా. మార్గదర్శకులకు ఓపిక ఉంది ... కానీ బంగారు కుటుంబాలకు ఓపిక లేదు’అని వ్యాఖ్యానించారు. అయితే, సీఎం వ్యాఖ్యల పట్ల బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఆలు లేదు.. చూలు లేదు.. డీలిమిటేషన్‌పై కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: డీలిమిటేషన్‌కు విధి విధానాలు ఇంకా ఖరారే కాలేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కొందరు తీరు ఆలు లేదు.. చూలు లేదు.. అన్నట్లుగా ఉందంటూ చెన్నైలో జరిగిన డీలిమిటేషన్ సమావేశంపై ఆయన వ్యాఖ్యానించారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో రాజ్యసభ ఎంపీ డా.లక్ష్మణ్, స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలిసి పలు అభివృద్ధి పనులకు కేంద్రమంత్రి శంకుస్థాపన చేశారు.అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దక్షిణాదికి అన్యాయం అంటూ అపోహలు సృష్టిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే అపోహలు సృష్టిస్తున్నాయని దుయ్యబట్టారు. బీజేపీపై విషం కక్కడమే వారి అజెండా అని.. దక్షిణాదిపై మోదీకి ప్రత్యేకమైన ప్రేమ ఉంది. ఏ ఒక్క రాష్ట్రానికి అన్యాయం జరగదని కిషన్‌రెడ్డి అన్నారు. డీలిమిటేషన్‌పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. అన్ని ప్రాంతాలకు, అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నా పార్టీ బీజేపీ. దక్షిణాది అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కృషి చేస్తోంది. దక్షిణ భారతదేశానికి సంబంధించి వీళ్ల సర్టిఫికెట్ అవసరం లేదు’’ అంటూ కిషన్‌రెడ్డి మండిపడ్డారు.‘‘అన్ని ప్రాంతాలకు బీజేపీ సమ న్యాయం చేస్తోంది. స్టాలిన్‌కు దురద పుడితే రేవంత్, కేటీఆర్ వెళ్లి గోకుతున్నారు. డీలిమిటేషన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే లేని పోని హడావుడి చేస్తున్నారు. తమ స్వార్థ రాజకీయాల కోసం కేంద్రం మీద బురద చల్లుతున్నారు’’ అని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. -
హైదరాబాద్ వేదికగా ‘ఢీ’లిమిటేషన్
చెన్నై: జనాభా ప్రతిపాదికన కేంద్రం నియోజక వర్గాల పునర్విభజన (Delimitation) జరపబోతోందన్న ప్రచారం దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ ఉమ్మడి కార్యాచరణలో భాగంగా ఒక్కటిగా తొలి అడుగు వేశాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) నేతృత్వంలో చెన్నైలో శనివారంనాడు దక్షిణాది రాష్ట్రాల పార్టీల సమావేశం జరిగింది. కేంద్రం చేపట్టబోయే డీలిమిటేషన్‌ను తాము వ్యతిరేకించడం లేదని.. అది న్యాయంగా ఉండాలన్నదే తమ అభిమతమని అని అక్కడ హాజరైన ప్రతినిధుల తరఫున స్టాలిన్ ప్రకటించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాలు ఏకం అయ్యాయని, ఈ ఘనత స్టాలిన్‌కే దక్కుతుందని సీఎం రేవంత్ అన్నారు. ఈ క్రమంలో తెలంగాణలోనూ డీలిమిటేషన్ మీటింగ్ పెట్టాలని ఆయన ప్రతిపాదించారు.ఆ ప్రతిపాదనకు స్టాలిన్ అంగీకారం తెలిపారు. చెన్నై మీటింగ్‌కు కొనసాగింపుగా తదుపరి జేఏసీ సమావేశం హైదరాబాద్(Hyderabad Delimitation Meeting)లో ఉండనుందని స్టాలిన్ ప్రకటించారు. సమావేశంతో పాటు బహిరంగ సభ కూడా ఉంటుందని సీఎం రేవంత్ ప్రకటించారు. ఏప్రిల్ 15వ తేదీన ఈ సమావేశం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.ఇక.. చెన్నైలో జరిగిన జేఏసీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేత కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమమార్ తదితరులు పాల్గొన్నారు. -
తమిళనాడు స్పూర్తితో కేంద్రంతో కొట్లాడుదాం డీలిమిటేషన్‌పై కేటీఆర్
-
Sunita Williams: నాటి సెల్ఫీని షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
న్యూఢిల్లీ: వ్యోమగామి సునీతా విలియమ్స్(Sunita Williams) సుదీర్ఘ నిరీక్షణ అనంతరం అంతరిక్షం నుంచి భూమికి చేరుకున్నారు. ఈ నేపధ్యంలో ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సునీతా విలియమ్స్‌ను స్వాగతిస్తూ, గతంలో తాను సునీతా విలియమ్స్‌తో దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేశారు. తోటి వ్యోమగామి బుచ్ విల్మోర్తో పాటు ఎనిమిది రోజుల అంతరిక్ష యాత్ర(Space travel)కు వెళ్లిన విలియమ్స్ స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో తలెత్తిన సాంకేతిక లోపాల కారణంగా తొమ్మిది నెలల పాటు జీరో గురుత్వాకర్షణ స్థితిలో ఉండవలసి వచ్చింది. ఇప్పుడు క్రూ-9 మిషన్ సాయంతో విలియమ్స్, విల్మోర్లు అట్లాంటిక్ మహాసముద్రంలో సురక్షితంగా దిగడం ద్వారా తమ అంతరిక్ష ప్రయాణాన్ని ముగించారు. When the SpaceX recue mission was launched, I recalled this chance encounter almost two years ago with @Astro_Suni in Washington. It was an enormous relief to see her and her colleagues’ successful splashdown back on earth a few hours ago. She is courage personified and… https://t.co/E64p9YX5t3— anand mahindra (@anandmahindra) March 19, 2025ఈ సందర్భంగా మహీంద్రా ఒక పోస్ట్‌లో సునీతా విలియమ్స్ ధైర్యానికి ప్రశంసలు కురిపిస్తూ.. ‘రెండేళ్ల క్రితం స్పేస్ ఎక్స్ రెస్క్యూ మిషన్(SpaceX rescue mission) ప్రారంభించినప్పుడు వాషింగ్టన్లో @Astro_Suniని కలుసుకున్నాను. కొన్ని గంటల క్రితం ఆమెతో పాటు ఆమె సహచరులు భూమిపైకి విజయవంతంగా తిరిగి వచ్చిన దృశ్యాన్ని చూడటంతో చాలా ఉపశమనం కలిగించింది. స్వాగతం.. సునీత’ అని రాశారు. ఆనంద్ మహీంద్రా 2023 జూలైలో వాషింగ్టన్లో సునీతతో తీసుకున్న సెల్ఫీని షేర్ చేశారు. ఈ ఫొటోలో ముఖేష్ అంబానీ, వృందా కపూర్, సునీతా విలియమ్స్‌తోపాటు ఆనంద్ మహీంద్రా ఉన్నారు.ఇది కూడా చదవండి: Sunita Williams: సునీతా విలియమ్స్‌ను స్వాగతించిన డాల్ఫిన్లు -
గులాబీ బాస్ ఆన్ డ్యూటీ!
-
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. చర్చించే కీలక అంశాలివే!
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ తెలంగాణ కేబినేట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, 42 శాతం బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం అఖిలపక్షం అధ్వర్యంలో ఢిల్లీలో నిరసనపై కేబినెట్ చర్చించనుంది. ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక సరఫరా, కొత్త రేషన్ కార్డుల జారీ వేగవంతం అంశాలపై మంత్రి వర్గం చర్చించనుంది. మెప్మాను సెర్ప్‌లో విలీనం చేసే అంశంపై కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. వేసవి కాలంలో తాగు నీటి ఇబ్బందులు రాకుండా చేపట్టవలసిన చర్యలపై కూడా కేబినెట్ చర్చించనుంది.కాగా, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేసే విషయమై నిన్న(బుధవారం).. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కీలక భేటీ జరిగింది. జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్‌గౌడ్, ఉపముఖ్యమంత్రి భట్టి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. దాదాపు రెండు గంటలపాటు సమావేశమై ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో పాటించాల్సిన మార్గదర్శకాలపై చర్చించారు.మొత్తం నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ఎంపిక చేయాలని, ఒకవేళ సీపీఐకి ఒక స్థానం ఇవ్వాలని అధిష్టానం నిర్ణయిస్తే అప్పుడు నిర్ణయం తీసుకుందామనే కోణంలో చర్చించారు. ఏ సామాజికవర్గానికి, ఏ జిల్లాకు ఎలాంటి పదవులు ఇవ్వాలి.. ఎమ్మెల్సీలుగా ఎవరిని పరిగణనలోకి తీసుకోవాలన్న అంశంపై ఓ అభిప్రాయానికి వచ్చారు. అయితే, ఎమ్మెల్సీలతోపాటు ఇతర అన్ని పదవుల భర్తీపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించేందుకుగాను ఈనెల 7వ తేదీన ఢిల్లీకి రాష్ట్ర నాయకత్వం వెళ్లనున్నట్టు సమాచారం. -
బ్రిటన్ రాజు చార్లెస్-IIIతో జెలెన్స్కీ భేటీ
లండన్: ఉక్రెయిన్ అధ్యక్షు వ్లాదిమిర్ జెలెన్స్కీ (Ukrainian President Zelensky) లండన్‌లోని సాండ్రింగ్‌హామ్ హౌస్‌లో బ్రిటన్ రాజు చార్లెస్- IIIను కలుసుకున్నారు. అంతకుముందు ఆయన బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో భేటీ అయ్యారు. దీనికి సంబంధించి రాజకుటుంబం సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో ‘ఈ రోజు సాయంత్రం బ్రిటన్ రాజు చార్లెస్- III ఉక్రెయిన్ అధ్యక్షుడు @ZelenskyyUa ను సాండ్రింగ్‌హామ్ హౌస్‌కు స్వాగతించారు’ అని పేర్కొన్నారు.సాండ్రింగ్‌హామ్ హౌస్ అనేది ఇంగ్లాండ్‌లోని నార్ఫోక్లో ఉన్న ఒక ప్రైవేట్ నివాసం. ఇది సాంప్రదాయకంగా బ్రిటిష్ రాజకుటుంబం ఆధీనంలో ఉంటుంది. ఉక్రేనియన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీని 10 డౌనింగ్ స్ట్రీట్‌కు స్వాగతించారు. ఉక్రెయిన్‌కు బ్రిటన్ మద్దతు ఉంటుందని జెలెన్స్కీకి బ్రిటన్ రాజు చార్లెస్- III (UKs King Charles iii)హామీ ఇచ్చారని అల్ జజీరా నివేదించింది. This evening, His Majesty The King received the President of Ukraine, @ZelenskyyUa, at Sandringham House. 🇺🇦 pic.twitter.com/mhGr7C0BN4— The Royal Family (@RoyalFamily) March 2, 2025అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వైట్ హౌస్‌లో జెలెన్స్కీ జరిపిన చర్చలు ఉద్రిక్తతలకు దారితీశాయి. వాషింగ్టన్ పర్యటన అనంతరం జెలెన్స్కీ బ్రిటన్ రాజు చార్లెస్- IIIని కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది కూడా చదవండి: సోమనాథుని సన్నిధిలో ప్రధాని మోదీ పూజలు -
ఆడు మగాడ్రా బుజ్జి.. వైట్ హౌస్ చరిత్రలో తొలిసారి
-
కేఆర్ఎంబీ సమావేశానికి ఏపీ గైర్హాజరు.. తెలంగాణ తీవ్ర ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: కేఆర్ఎంబీ భేటీకి ఏపీ గైర్హాజరు కావడంపై తెలంగాణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేఆర్ఎంబీపై కనీసం గౌరవం లేదా అంటూ తెలంగాణ ప్రశ్నించింది. 23 టీఎంసీలకు గత భేటీలో ఏపీ ఒప్పుకొని.. ఇప్పుడు రాకపోవడంలో ఆంతర్యం ఏంటని తెలంగాణ అధికారులు ప్రశ్నించారు.కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్ అతుల్ జైన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని జలసౌధలో కేఆర్ఎంబీ సమావేశం జరిగింది. ఈ భేటీకి తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ (ఇంజినీర్ ఇన్ చీఫ్) అనిల్ కుమార్ హాజరయ్యారు. అయితే, ఇవాళ సమావేశానికి ఏపీ నుంచి అధికారులు హాజరు కాలేదు. దీంతో రేపు(గురువారం) మరోమారు భేటీ కావాలని నిర్ణయించారు. ఏపీ నుంచి అధికారులు ఎవరూ హాజరు కాకపోవడంపై రాహుల్ బొజ్జా స్పందిస్తూ.. ఏపీ అధికారులు ఉద్దేశపూర్వకంగానే హాజరు కాలేదంటూ మండిపడ్డారు.తెలంగాణ నీటిపారుదల శాఖ నల్లగొండ సీఈ, ఏపీ జలవనరుల శాఖ ఒంగోలు సీఈలు.. శ్రీశైలం, సాగర్ జలాల వినియోగంపై రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రణాళికను సిద్ధం చేసి ఈ నెల 25లోగా సమర్పించాలని కృష్ణా బోర్డు ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు ఉండనున్న సాగునీటి, జూలై 31 వరకు ఉండనున్న తాగునీటి అవసరాల వివరాలు ఈ ప్రణాళికలో ఉండాలని కోరింది. సదరు ప్రణాళిక ఆధారంగా శ్రీశైలం, సాగర్ జలాశయాల నుంచి రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఈ నేపథ్యంలో నేడు కేటాయింపులపై కీలక సమావేశం జరగాల్సి ఉంది. అయితే, ఏపీ అధికారులు హాజరుకాకపోవడంతో రేపు మరోమారు భేటీ కావాలని కేఆర్ఎంబీ నిర్ణయించింది. -
ప్రజల పక్షాన పోరాడితే గెలుపు మనదే: వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: క్షేత్రస్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా ఉందని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి బయటికి వచ్చిన తర్వాత సోమవారం(ఫిబ్రవరి24) తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ‘మనం యుద్ధ రంగంలో ఉన్నాం, విజయం దిశగా అడుగులు వేయాలి. ప్రజా సమస్యల విషయంలో రాజీలేని పోరాటం చేయాలి. నిజాయితీ, చిత్తశుద్ధితో ప్రజల తరఫున పోరాటం చేయాలి.ప్రజలకు తోడుగా, ప్రజల్లో ఉంటే గెలుపు సాధించినట్టే. అందుకనే ప్రజాసమస్యలపై పోరాటంలో వెనుకడుగు వేయొద్దు. ఈ ప్రభుత్వాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికీ నేను భరోసా ఇస్తున్నాను, అండగా ఉంటా.ప్రతిపక్షంలో మన సమర్థతను నిరూపించుకోవడానికి ఇదొక అవకాశం. పార్టీకోసం, ప్రజలకోసం గట్టిగా పనిచేస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. కళ్లుమూసుకుని, తెరిచేలోగా ఏడాది గడిచిపోతోంది. జమిలి ఎన్నికలు అంటున్నారు. అదే జరిగితే ఎన్నికలు మరింత ముందుగా వస్తాయి. అందుకే ప్రజా సమస్యల విషయంలో ఎక్కడా రాజీ వద్దు. ప్రజల తరఫున గొంతు విప్పే విషయంలో ఎక్కడా తగ్గాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో మనం విలువలు, విశ్వసనీయత పాటిస్తున్నాం కాబట్టే ఎన్నో క్లిష్టపరిస్థితులను అధిగమించాం. ఇంత దూరం ప్రయాణం చేశాం. అసెంబ్లీలో మనం తప్ప వేరే ప్రతిపక్షం లేదు. ప్రతిపక్ష హోదా విషయంలో అధికార పార్టీ వైఖరిని ప్రజలకు తేటతెల్లం చేసేందుకే ఇవాళ అసెంబ్లీకి వెళ్లాం. ప్రతిపక్షహోదా ఇస్తే.. హక్కుగా మనకు సమయం ఇవ్వాల్సి వస్తుంది. సభా నాయకుడితో దాదాపు సమాన స్థాయిలో సమయం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకనే ప్రతిపక్ష హోదాను ఇచ్చేందుకు ముందుకు రావడంలేదు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. నేను ఏ అంశంపై మాట్లాడినా నిందలకు, దూషణలకు దూరం. ప్రతి అంశాన్నీ ఆధారాలు, రుజువులతో మాట్లాడతాను. అసెంబ్లీలో ఎలాగూ అవకాశం లేదు కాబట్టి ప్రెస్మీట్లలో ప్రజలకు వివరిస్తున్నాను. కౌన్సిల్లో మంచి మెజార్టీ ఉంది. దీన్ని వినియోగించుకోవాలి’ అని వైఎస్ జగన్ సూచించారు.అన్యాయంగా ఇళ్లపట్టాలు రద్దు చేస్తున్నారు: వైఎస్ జగన్ దృష్టికి తీసుకు వచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుమన ప్రభుత్వ హయాంలో 31 లక్షలమందికి ఇళ్లపట్టాలు ఇచ్చామని వైఎస్ జగన్ అన్నారు. ‘పార్టీలు చూడకుండా, పక్షపాతం లేకుండా ఇళ్లపట్టాలు ఇచ్చాం, ఎవరైనా ఇళ్లుకట్టుకోకపోతే ప్రభుత్వం వారికి ఇళ్లు మంజూరుచేసి ఇవ్వాలి. అంతేగాని, పేదలపై కక్ష కట్టి పట్టాలు రద్దుచేయడం ఏంటి? పట్టాలు రద్దు చేస్తే తప్పకుండా కోర్టును ఆశ్రయిస్తాం. ఎవరు ఇళ్లస్థలాలు ఇచ్చారో, ఎవరు కాలనీలు ఏర్పాటు చేశారో ప్రజలకు తెలుసు. విజయవాడలో అంబేద్కర్ స్మృతి వనాన్ని మనం నిర్మించాం. కాని పేరు తీసేయాలన్న ఉద్దేశంతో ఏకంగా అంబేద్కర్ విగ్రహంమీదే దాడికి దిగారు. ప్రభుత్వం ఆదేశాలతో ఏకంగా అధికారులే దీనికి ఒడిగట్టారు. స్మృతివనం ఎవరు కట్టారో ప్రజలకు తెలియదా?’ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. -
బీసీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
-
మళ్లీ అధికారంలోకి వస్తాం పోరాటానికి సిద్ధమవ్వండి
-
మనం చేసినవన్నీ యువతకు చెప్పండి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూనే రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి యువతకు వివరించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, పార్టీ నేతలందరూ సమష్టిగా పనిచేసి అభ్యర్థి వి.నరేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. కరీంనగర్–ఆదిలాబాద్–నిజామాబాద్–మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం రాత్రి కాంగ్రెస్ ముఖ్యనేతల జూమ్ మీటింగ్ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, సీతక్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే 55 వేల ఉద్యోగాలను భర్తీ చేయడంతోపాటు రాష్ట్రంలో స్కిల్స్, స్పోర్ట్స్ యూనివర్సిటీలను మంజూరు చేసి పనులు ప్రారంభించామని, రాష్ట్రంలోని యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చామని చెప్పారు. ఈ విషయాలను యువతకు వివరించడం ద్వారా పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని నేతలకు పిలుపునిచ్చారు. తెలంగాణ అంటే అభిమానం: మీనాక్షి రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జిగా నియమితులైన తర్వాత మీనాక్షి నటరాజన్ తొలిసారి పార్టీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ అంటే తనకు ఎంతో అభిమానమని చెప్పారు. రాష్ట్రంలోని చాలామంది పార్టీ నాయకులతో తనకు మంచి పరిచయాలు ఉన్నాయని అన్నారు. తెలంగాణను దేశానికి ఒక మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దామని, రాష్ట్రంలోని పార్టీ నాయకులందరూ కలిసికట్టుగా పనిచేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలని కోరారు. ఎన్నికలను పార్టీ కేడర్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని మీనాక్షి చెప్పారు. -
ఢిల్లీ కొత్త సీఎం ఖరారు రేపే..! రేసులో ముందున్న యువనేత
న్యూఢిల్లీ:ఢిల్లీ కొత్త సీఎం ఎవరన్నదానిపై సస్పెన్స్‌కు తెరపడనుంది. సీఎం పేరును సోమవారం(ఫిబ్రవరి17) జరిగే బీజేపీ కీలక నేతలో భేటీలో ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ సీఎంగా ఎవరిని నిర్ణయించాలన్నదానిపై బీజేపీ హైకమాండ్ ఇప్పటికే చర్చోపచర్చలు సాగిస్తోంది. దీనిపై పార్టీ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.అయితే సీఎం ఎవరన్నది బయటికి పొక్కకుండా బీజేపీ నేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఈ విషయంపై ఎవరూ నోరు విప్పకుండా అధిష్టానం స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు చెబుతున్నారు.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌పై విజయం సాధించిన పర్వేష్వర్మకే ఢిల్లీ సీఎంగా ఎక్కువ అవకాశాలున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.పర్వేష్‌వర్మతో పాటు ఢిల్లీ మాజీ ప్రతిపక్షనేత విజేందర్‌గుప్తా, ఢిల్లీ బీజేపీ మాజీ చీఫ్ సతీష్ ఉపాధ్యాయ,ఢిల్లీ బీజేపీ జనరల్ సెక్రటరీ ఆశిష్ సూద్,ఆర్ఎస్ఎస్ నేత జితేంద్ర మహాజన్ పేర్లు సీఎం రేసులో పరిశీలనలో ఉన్నాయి. కాగా, ఫిబ్రవరి 5న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీపార్టీపై బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారం చేపట్టనుంది. -
చంద్రబాబుకు చిన్నారి షాక్
సాక్షి, నెల్లూరు జిల్లా: కందుకూరు సభలో చంద్రబాబుకు చిన్నారి షాక్ ఇచ్చింది. స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర సభలో దీప్తి అనే విద్యార్థిని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇవాళ కందుకూరు సీఎం వస్తున్నారు కాబట్టే చెత్త ఎత్తేశారంటూ దీప్తి వ్యాఖ్యానించింది. రోజూ ఇలాగే కందుకూరులో వీధులు శుభ్రం చేయాలని విద్యార్థిని దీప్తి కోరింది.సిబ్బంది, అధికారులు పనితీరు ఎలా ఉందో దీప్తి మాటలు బట్టి అర్థమవుతోంది. చిన్నారి మాటలు సభికులను నిర్ఘాంత పోయేలా చేశాయి. ప్రభుత్వ పనితీరును తన ముందే ఆ చిన్నారి బయటపెట్టడంతో షాక్‌కు గురైన చంద్రబాబు.. ఆమె మాట్లాడినంత సేపు మౌనంగా ఉండిపోయారు. అంతలోనే తేరుకుని.. టాపిక్‌ను డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. -
రెండు అగ్రదేశాలు.. ఇద్దరు అగ్రనేతలు..
-
ఇసుక స్కాం, లిక్కర్ స్కాంలు చేస్తున్నారు: వైఎస్ జగన్
-
Ys Jagan: మంచిపాలన చేస్తే ప్రజలు ఆదరిస్తారు...
-
గుంటూరు YSRCP నేతలతో YS జగన్ కీలక మీటింగ్
-
ఇవాళ ఉమ్మడి గుంటూరు జిల్లా YSRCP నేతలతో వైఎస్ జగన్ భేటీ
-
చంద్రబాబు మోసాలను ప్రజల్లో మరింత ఎండగట్టాలి: వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి : ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో ఏవీ నెరవేర్చక పోవడంతో, ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత రోజురోజుకీ తీవ్రం అవుతోందని, అందువల్ల వైఎస్సార్సీపీ నాయకత్వమంతా సమష్టిగా సీఎం చంద్రబాబు మోసాలను ప్రజల్లో ఎండ గట్టాలని పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి .. సీనియర్ నేతలకు సూచించారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో, అందుబాటులో ఉన్న పార్టీ సీనియర్ నేతలతో వైఎస్ జగన్ మంగళవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు, ఇటీవల సీఎం చంద్రబాబు మాటలు, ప్రకటనలు.. తదితర అంశాలు సమావేశంలో చర్చించారు. సూపర్‌సిక్స్ హామీల అమలుపై చేతులెత్తేయడమే కాకుండా.. అందుకే ఏవేవో సాకులు చెబుతూ.. అవి ప్రజలు నమ్మేలా ప్రచారం చేస్తున్నారని వైఎస్ జగన్ గుర్తు చేశారు. వీటన్నింటి నేపథ్యంలో చంద్రబాబు వంచన, దారుణ మోసాలను మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అందు కోసం రోజూ ప్రజల్లో ఉండాలని, వారితో మరింత మమేకం కావాలని జగన్ పేర్కొన్నారు. ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని, పేర్ని కిట్టు, కొట్టు సత్యనారాయణ, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నందిగం సురేష్, ఎస్వీ మోహన్‌రెడ్డి, కైలే అనిల్‌కుమార్, కావటి మనోహర్‌నాయుడు, కె.సురేష్‌బాబు, గోరంట్ల మాధవ్, ఈపూరు గణేష్, ఆలూరు సాంబశివారెడ్డి, మజ్జి శ్రీనివాసరావు, వంకా రవీంద్రనాథ్, అదీప్‌రాజు తదితరులు పాల్గొన్నారు. -
కీలక సమీక్షకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గైర్హాజరు
-
సీఎం రేవంత్ రెడ్డి CLP మీటింగ్‌కు ఆ MLAలు దూరం
-
ఇక కార్యకర్తల కోసం ఎలా పని చేస్తానో చూపిస్తా... వైఎస్సార్సీపీ నేతలతో సమావేశంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా
-
ఈసారి జగన్ 2.0ని చూడబోతున్నారు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ‘‘ఈసారి జగన్ 2.0ని చూడబోతున్నారు.. ఈ 2.0 వేరేగా ఉంటుంది’’ అంటూ వైఎస్సార్సీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తా. తొలివిడతలో ప్రజల కోసం తాపత్రయం పడ్డాను. వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయాను. ఇప్పుడు చంద్రబాబు మిమ్మల్ని పెడుతున్న కష్టాలు, బాధలను చూశాను. ఎక్కడ ఉన్నా తీసుకువచ్చి చట్టం ముందు నిలబెడతా. అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేటు కేసులు వేస్తాం’’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.బుధవారం ఆయన తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో విజయవాడ నగరపాలక సంస్థ వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏమన్నారంటే... ఎవరికి ఏ కష్టం వచ్చినా నా కథ గుర్తుకుతెచ్చుకోండి..‘‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బెదిరిస్తారు, దొంగకేసులు పెడతారు. జైల్లో పెట్టినా భయపడాల్సిన పనిలేదు. కార్యకర్తలకు నేను అండగా నిలుస్తా. మళ్లీ అధికారంలోకి వస్తాం, 30 ఏళ్లు పరిపాలన చేస్తాం. సంపద సృష్టించి పేదలకు పంచుతానని చంద్రబాబు చెప్పారు. కానీ ఈ 9 నెలల్లో సూపర్ సిక్స్ పథకాలను కూడా అమలు చేయలేదు. చంద్రబాబు హామీలను అమలు చేయలేరని నేను ముందే చెప్పాను. చంద్రబాబును నమ్మటం అంటే చంద్రముఖిని నిద్రలేపటమే. రాష్ట్ర బడ్జెట్, చంద్రబాబు హామీల ఖర్చుల గురించి ప్రజలకు వివరంగా చెప్పాను. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలి. త్వరలోనే జమిలీ ఎన్నికలు అంటున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అఖండ మెజార్టీతో వైఎస్సార్సీపీ గెలుస్తుంది...ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతోంది. ఏ గ్రామంలో చూసినా బెల్టు షాపు నడుస్తోంది. ఒక్కో ఎమ్మెల్యే వేలంపాటలో రూ.2 లక్షలకో, 3 లక్షలకో బెల్టుషాపులు పెట్టిస్తున్నారు. ఇసుక ధర రెట్టింపు అయింది. ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు కనిపిస్తున్నాయి. ఏ పని జరగాలన్నా, ఇండస్ట్రీ నడపాలన్నా, మైనింగ్ చేసుకోవాలన్నా ముడుపులు చెల్లించే దుస్థితి వచ్చింది. ఎమ్మెల్యేల దగ్గర్నుంచి చంద్రబాబు వరకు ముడుపులను పంచుకుంటున్నారు...రాజకీయాలలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి. ఆ కష్టాలను ఎదుర్కొన్నప్పుడే మనం లీడర్ గా ఎదుగుతాం. ఒకసారి వ్యక్తిత్వాన్ని కోల్పోతే ప్రజల్లో చులకన అవుతాం. కష్టాలు ఎల్లకాలం ఉండవు. ఎవరికి ఏ కష్టం వచ్చినా నా కథ గుర్తుకుతెచ్చుకోండి. నామీద టీడీపీ, కాంగ్రెస్ కలిసి అక్రమంగా కేసులు పెట్టారు. నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు. కేవలం రాజకీయంగా ఎదుగుతున్నానన్న కారణంతోనే దొంగకేసులు బనాయించారు. కానీ ఏం జరిగింది? బయటకు వచ్చి, ప్రజల అండదండలతో ముఖ్యమంత్రి అయ్యాను’’ అని వైఎస్ జగన్ గుర్తు చేశారు.ఇదీ చదవండి: ‘ఛీ.. ఎన్టీఆర్ మాటకు తూట్లు పొడిచి మరీ!‘‘విజయవాడ కార్పొరేషన్లో 64 స్థానాలుంటే 49 స్థానాలు అప్పట్లో మనం గెలిచాం. తెలుగుదేశం పార్టీకి వచ్చిన స్థానాలు 14, కమ్యూనిస్టులు 1 గెలిచారు. వాళ్లకు కేవలం 14 స్థానాలున్నా.. ఎన్నికలు అయిపోయిన తర్వాత రోజు నుంచి రకరకాల ప్రలోభాలపెట్టో, భయపెట్టో 13 మందిని తీసుకున్నారు. అయినా ఇంకా 38 మంది నిటారుగా నిలబడ్డారు అని చెప్పడానికి గర్వపడుతున్నాను’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.‘‘కారణం ఏమిటంటే.. ఏ కార్పొరేషన్, మున్సిపాల్టీ, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఏవి తీసుకున్నా.. ఎన్నికలు అయిపోయిన మూడేళ్ల తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే అటువంటి పరిస్థితుల్లో ఇలాంటి రిజల్ట్‌తో కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే క్వీన్ స్లీప్ చేయగలిగింది’’ అని వైఎస్ జగన్ చెప్పారు. ..ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోలో 99 శాతం హామీలు అమలు చేశాం. ప్రతినెలా ఏ పథకం అమలు చేస్తామో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజే సంక్షేమానికి సంబంధించిన క్యాలెండర్ విడుదల చేసి.. క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం, ఎక్కడా ప్రజలకు నష్టం జరగకుండా, ఇబ్బందులు పడకుండా ఇచ్చిన ప్రభుత్వం దేశ చరిత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే.కాలర్ ఎగరేసుకుని గర్వంగా చెప్పకునేలా....ఆ రోజు కోవిడ్ లాంటి ఊహించని పరిణామాలు వచ్చాయి. ఇలాంటి విపత్తు ఒకటి ఉంటుందా, ఇలాంటిది వస్తే రాష్ట్రం, దేశం అతలాకుతలం అవుతుందన్న పరిస్థితులు ఎప్పుడూ ఊహకు కూడా అందిఉండవు. అలాంటిది వరుసగా రెండు సంవత్సరాలు కోవిడ్ సమస్యలతో అనుకోని ఖర్చులు పెరిగాయి. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తగ్గాయి. అయినా ఏ రోజూ కూడా మనం సాకులు చెప్పలేదు. ఏ రోజూ ప్రజలకు ఇవ్వకుండా ఉండడానికి కారణాలు వెదుక్కోలేదు. మన సమస్యలు ఎన్ని ఉన్నా ప్రజలకు ఇచ్చిన మాట ఏరోజూ తప్పలేదని వైఎస్సార్సీపీ కార్యకర్తగా గర్వంగా చెబుతున్నాను. ప్రజలకు మంచే చేశాం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విలువల కోసం నిలబడి ఉన్న పార్టీ. నా దగ్గర నుంచి గ్రామస్థాయి కార్యకర్త వరకు ఇది నా పార్టీ అని కాలర్ ఎగరేసుకుని గర్వంగా చెప్పకునేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది, నిలబడింది.ప్రజల దగ్గర మన విలువ తగ్గలేదు....ఇవాళ ఎన్నికలు పూర్తయి దాదాపు 9 నెలలు కావస్తోంది. మనం ఓడిపోయినా కూడా ఈ రోజుకు కూడా మనం గర్వంగా తలెత్తుకుని ప్రజల దగ్గరకు పోగలుగుతాం. వాళ్ల చిరునవ్వుల మధ్య నిలబడి వాళ్ల సమస్యలను వినగలుగుతాం. వాళ్లతో మమేకం కాగలుతాం. కారణం ఏ రోజూ మనం వాళ్లను మోసం చేయలేదు. వాళ్లకు ఏరోజూ అబద్దాలు చెప్పలేదు. ఏదైతే చెప్పామో అది చేసి చూపించిన తర్వాత వాళ్లకు ఓట్లు అడిగాం కాబట్టి ప్రజల దగ్గర మన విలువ తగ్గలేదు. ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు....కానీ. .ఎన్నికలు అయిన 9 నెలలు తిరక్కముందే కూటమికి చెందిన ఎమ్మెల్యే దగ్గర నుంచి.. కార్యకర్త వరకు గడప, గడప అంటూ ప్రజల దగ్గరకు వెళ్లే పరిస్థితి లేదు. కారణం ఏ గడపకు వెళ్లినా ఎన్నికలు ముందు వీళ్లు ఇచ్చిన మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ లు, సూపర్ సెవెన్లు ప్రజలు వీళ్లకు చూపించి.. ఆ ఇంట్లో నుంచి ఇద్దరున్నా ముగ్గురు పిల్లలున్నా ఇంటికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను నా రూ.రూ15వేలు ఏమైందని ప్రశ్నిస్తారు. ఆ పిల్లల తల్లులు కూడా నా రూ.18 వేలు ఏమైందని ప్రశ్నిస్తారు. 50 ఏళ్లు నిండిన ఆ తల్లుల అత్తలు, అమ్మలు నా రూ.45వేలు ఏమైందని ప్రశ్నిస్తారు...అదే ఇంట్లో 20 ఏళ్ల పిల్లవాడు నాకు నెల, నెలా రూ.3వేలు ఇస్తానన్నావ్.. నా రూ.36 వేలు ఏమైందని అడుగుతాడు. గ్రామీణ ప్రాంతాలకు వెళితే కండువా వేసుకున్న రైతులు నా రూ.20 వేలు సంగతేంటని నిలదీస్తారు. ఇలా ఏ ఇంటికి వెళ్లినా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎన్నికలప్పుడు ఆ రోజు మేం చేయకపోతే నా కాలర్ పట్టుకొండని అన్నాడు. కానీ ఈ రోజు ప్రజలు కాలర్ పట్టుకుంటారని భయపడి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారు. ఆ రోజే చెప్పా.. చంద్రబాబును నమ్మడం అంటే....ఎన్నికలు అయిపోయిన 9 నెలల తర్వాత ఇవాళ సంపద సృష్టించడం ఎట్లో నా చెవిలో చెబితే నేను తెలుసుకుంటానంటున్నాడు. ఇదే మాటను ఆ రోజే నేను ఎన్నికల ప్రచారంలో చెప్పాను. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమేనని, చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తలపెట్టడం అని చెప్పాను. మన మేనిఫెస్టోను, వాళ్ల హామీలను చూపిస్తూ.. చంద్రబాబు చెప్పినవి అమలు చేయడం సాధ్యం కాదని చెప్పాను. రాష్ట్ర బడ్జెట్ ఇది.. మనం చేస్తున్న కార్యక్రమాలు ఇవి.. వీటికింత ఖర్చవుతుంది. మరో వైపు చంద్రబాబు రూ.1.72 లక్షల కోట్లు ఖర్చయ్యే ప్రతిపాదనలు చెబుతున్నాడు. ప్రజలను మోసం చేయడం ధర్మం కాదు....సూపర్ సిక్స్ మోసం, సూపర్ సెవెన్ మోసం అని చెబుతూ.. మనం ఏం చేయగలుగుతామో అన్నది కూడా ప్రజలకు అర్థం అయ్యేటట్టు చెప్పాం. ఆ రోజు కూడా మన ప్రజాప్రతినిధులు, మన శ్రేయోభిలాషులు నా దగ్గరకు వచ్చి మనమూ సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ చెబుదామన్నారు. కానీ నేను ఒక్కటే చెప్పాను. రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలు, విశ్వసనీయత లేని రాజకీయాలు చేయడం అనవసరం అని చెప్పాను. ఏదైతే చేయగలుగుతామో అదే చెప్పాలి. చేయలేనిది చెప్పి, ప్రజలను మోసం చేయడం ధర్మం కాదని చెప్పాను.ప్రజలకు చంద్రబాబు నైజం పూర్తిగా అర్థమైంది....ఓడిపోయాం ఫర్వాలేదు. ప్రతిపక్షంలో కూర్చున్నాం అదీ ఫర్వాలేదు. మరలా అదే రోజుకు వెనక్కి తిరిగి వెళితే... ఇదే విధంగానే మరలా చెబుతాం.. కారణం రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతకు అదే అర్ధం. జమిలి అంటున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అదే విలువలు, విశ్వసనీయత అన్న పదం మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరలా అఖండ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అయితే అప్పటికి ప్రజలకు చంద్రబాబు నైజం పూర్తిగా అర్థం అవుతుంది...ఎందుకంటే ఇవాళ ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా పక్కకు వెళ్లిపోవడం ఒక అంశం అయితే... రెండో అంశం వ్యవస్ధలన్నీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. చంద్రబాబు ప్రభుత్వం రాకమునుపు మన ప్రభుత్వంలో ప్రతిదీ పకడ్బందీగా జరిగింది. ఇప్పుడు చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడనే చర్చ ఇప్పుడు ప్రతి ఇంటిలోనూ జరుగుతుంది. జగన్ ఉన్నప్పుడు స్కూళ్లు బాగుపడ్డాయి. ఇంగ్లిషు మీడియం వచ్చింది. నాడు-నేడుతో స్కూళ్లు బాగుపడ్డమే కాకుండా సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకు ప్రయాణం మొదలుపెట్టాడు. ఆరో తరగతి నుంచిప్రతి తరగతి గది డిజిటైజ్ అయింది...జగన్ ఉన్నప్పుడే 8వ తరగతి పిల్లాడి చేతిలో ట్యాబులు కనిపించేవి. మరో వైపు ప్రైవేటు బడులు ప్రభుత్వ బడులతో పోటీ పడే పరిస్ధితి రాష్ట్రం ఎప్పుడైనా చూసిందంటే.. అది కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. మొట్టమొదటిసారిగా గవర్నమెంటు బడులలో నో వేకెన్సీ బోర్డులు కేవలం వైయస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే కనిపించాయి...మన హయాంలో క్రమం తప్పకుండా తల్లులకు అమ్మఒడి ఇచ్చి, తల్లులను ప్రోత్సహిస్తూ పిల్లలను బడులకు పంపిస్తూ.. వాళ్లు ఎదగాలని, భావి ప్రపంచంతో పోటీపడాలని, ఏలాలని వాళ్ల చదువుల్లో మార్పులు తీసుకొచ్చిన రోజులు మన పాలనలో చూస్తే.. కేవలం 9 నెలల్లో ప్రభుత్వ స్కూళ్లు పరిస్థితి చూస్తే.. నాడు నేడు పాయే.. అమ్మఒడి పాయే. ఇంగ్లిషు మీడియం పాయే. ఆరోతరగతి నుంచి తరగతి గదులు డిజిటైజేషన్ కార్యక్రమమూ పాయే. ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబులకు ఇచ్చే కార్యక్రమం పాయే. మూడో తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెఫ్ట్ పాయే.వీళ్ల పాంప్లెట్ పేపర్ ఈనాడులో చూశాను. గవర్నమెంటు బడులలో 70 శాతం బడులలో 70 శాతం పిల్లలు లేరు రాశారు. అది వీళ్ల తప్పిదం వల్ల అని రాయకుండా అది కూడా మన తప్పిదం వల్లే జరిగిందని రాశారు...పేదవారికి ఆరోగ్యం బాగా లేకపోతే ఆ పేదవాడి పరిస్థితి ఇవాళ దయనీయంగా తయారయింది. నెట్ వర్క్ ఆసుపత్రులకు వెళితే పేదవాడికి ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందించే పరిస్దితి లేదు. 1000 ప్రొసీజర్స్ నుంచి 3,300 ప్రొసీజర్లు పేదవాడికి ఉచితంగా వైద్యం అందించేటట్టుగా ప్రొసీజర్లు పెంచడమే కాకుండా, రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించేలా ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచాం. 900 నుంచి 2,400 ఆసుపత్రుల వరకు నెట్ వర్క్ ఆసుపత్రులను పెంచాం. గవర్నమెంటు హాస్పటళ్లలో వైద్యులు, నర్స్‌ల కొరత అన్నది పరిపాటే అన్న సాంప్రదాయాన్ని మార్చివేశాం.మొట్టమొదటిసారిగా గవర్నమెంటు ఆసుపత్రుల రూపురేఖలను నాడు-నేడు ద్వారా మార్చివేశాం. దేశవ్యాప్తంగా స్పెషలిస్టు డాక్టర్లు కొరత 61 శాతం ఉంటే.. మన రాష్ట్రంలో దాన్ని 4 శాతానికి తీసుకొచ్చిన ఘనత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీదే. ప్రభుత్వ ఆసుపత్రులుకు వెళితే మందులు దొరకని పరిస్థితి నుంచి.. మందుల కోసం వెలితే డబ్ల్యూ హెచ్ ఓ, జీఎంపీ ప్రమాణాలున్న మందులు మాత్రమే దొరికేలా చేసిన ప్రభుత్వం కూడా వైఎస్సార్సీపీదే.మొట్టమొదటసారిగా రాష్ట్రంలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని విధంగా గ్రామాల్లో విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేశాం. అక్కడ 105 రకాల మందులు సరఫరా చేస్తూ.. 24గంటలూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎంలు అందుబాటులోకి ఉండేటట్టు.. 14 రకాల డయాగ్నోస్టిక్ టెస్టులు కూడా అక్కడే చేసేలా విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటుచేశాం. తొలిసారిగా పీహెచ్‌సీలను బలోపేతం చేసి ప్రతి పీహెచ్సీలోను ఒక డాక్టరు ఉండేలా, మరో డాక్టర్ 104 అంబులెన్స్ లో ఊర్లలో అందుబాటులో ఉండేలా చేసాం. ప్రతి మండలానికి రెండు పీహీచ్సీలను ఏర్పాటు చేశాం. ప్రతి డాక్టర్ ఏ ఊరికి వెళ్లాలో నిర్ణయించి... నెలలో కనీసం రెండు రోజులు ఆ ఊర్లకు వెళ్లేలా చేస్తూ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెఫ్ట్ ను అందుబాటులోకి వచ్చింది కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే వచ్చింది.కనీవీని ఎరుగని విధంగా..కనీవీని ఎరుగని విధంగా మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది కూడా వైఎస్సార్సీపీ హయాంలోనే అమల్లోకి వచ్చింది. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా పోయింది. విలేజ్ క్లినిక్‌లు పనిచేయడం లేదు. పీహెచ్‌సీలు కూడా పనిచేయడం లేదు. రూ.3వేల కోట్లు నెట్వర్క్ ఆసుపత్రులకు బిల్లలు చెల్లించలేదు. ప్రతి నెలా రూ.300 కోట్లు అవుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది. అంటే దాదాపుగా రూ.3వేల కోట్లు ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వైద్యం కోసం పేదవాడు ఆసుపత్రికి పోతే ఉచితంగా ఆరోగ్యశ్రీ అందించలేని పరిస్ధితి. ఇదీ మన ప్రభుత్వానికి వీళ్ల ప్రభుత్వానికి తేడా.మొట్టమొదటిసారిగా రైతులకు ఆర్బీకేలు తీసుకుని రావడం, ఇ-క్రాప్ చేయడం, దళారీ వ్యవస్థ తీసివేసి ఆర్బీకే ద్వారానే రైతులకు కనీస గిట్టుబాటు ధర లభ్యమయ్యేలా కొనుగోలు చేయడం, అక్కడే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ కూర్చుని వ్యవస్థను మార్చేలా తీసుకున్న చర్యలన్నీ నాశనం అయ్యాయి. గ్రామంలో ప్రతి సేవకు సచివాలయం ఏర్పాటు చేసి.. ఎవరెవరు ఏ సేవలు చేయాలో నిర్ణయించాం. ప్రతి 50-60 ఇళ్లకు వాలంటీర్‌ను తీసుకొచ్చి ప్రతి పథకం పారదర్శకంగా ప్రతి ఇంటికి చేర్చే కార్యక్రమాలన్నీ ఇవాళ కొలాప్స్ అయ్యాయి. కేవలం తొమ్మిది నెలల్లోనే వ్యవస్థలన్నీ నాశనమయ్యాయి.మరో వైపు ఏది చూసినా స్కామే. ఏ గ్రామంలో చూసినా బెల్టుషాపునకు రూ.2 లక్షలకో, రూ.3లక్షలకో ఎమ్మెల్యే దగ్గరుండి వేలం పాడిస్తున్నారు. పోలీసులు దగ్గరుండి మద్యం అమ్మేలా సపోర్టు చేస్తున్నారు. ఏ గ్రామంలో చూసినా మద్యమే కనిపిస్తోంది. మొట్టమొదటిసారిగా ప్రభుత్వం నడుపుతున్న మద్యం షాపులు తీసివేసి ప్రైవేటు షాపులు తీసుకొచ్చారు.ఇదీ చదవండి: దొడ్డిదారిలో ‘డిప్యూటీ’ఇసుక ఎక్కడ చూసినా రెట్టింపు ధరలకు అమ్ముతున్నారు. ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు కనిపిస్తున్నాయి. ప్రతి నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా.. ఇండస్ట్రీ నడపాలన్నీ, మైనింగ్ చేసుకోవాలన్నా.. ఏ పనికైనా నా కింత అని ఎమ్మెల్యే దగ్గర నుంచి మొదలై చంద్రబాబు వరకు పంచుకుంటున్నారు. ఇవాళ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, పార్టీ ప్రజలకు మంచి వాళ్లగా కనిపిస్తున్నారు. ఆ స్థాయిలో 9 నెలల కాలంలోనే కూటమి నేతలు దారుణంగా తయారయ్యారు.రాజకీయాలలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొండి. ఆ కష్టాలలో ఉన్నప్పుడు మనం వాటిని ఎలా ఎదుర్కొంటామో అన్నదే మనల్ని నాయకుల్ని చేస్తుంది. కష్టం వచ్చినా మనం మన వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు. ఒక్కసారి వ్యక్తిత్వాన్ని కోల్పోతే ప్రజల్లో చులకన అవుతాం. కష్టాలు ఎల్లకాలం ఉండవు. ఎవరికి ఏ కష్టం వచ్చినా నా కథ గుర్తుకుతెచ్చుకొండి.నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు. నా మీద కేసులు వేసింది కూడా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నాయకులే. కేవలం రాజకీయంగా ఎదుగుతున్నానన్న కారణంతో దొంగకేసులు బనాయించి 16 నెలలు జైల్లో పెట్టారు. కానీ ఏం జరిగింది. బయటకు వచ్చి, ప్రజల అండదండలతో ముఖ్యమంత్రి అయ్యాను. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొండి.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బెదిరిస్తారు, దొంగకేసులు పెడతారు. జైల్లో పెడతారు. అయినా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాం. మీకు మంచి చేసిన వారినీ, చెడు చేసిన వారినీ ఇద్దరినీ గుర్తుపెట్టుకొండి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది. మరో ముప్పై సంవత్సరాలు ఏలుతాం. ఒక్కటే గుర్తు పెట్టుకొండి. ఈసారి జగనన్న 2.0 వేరేగా ఉంటుంది. కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తా.. ఇది కచ్చితంగా చెబుతున్నాను. జగనన్న1.0లో కార్యకర్తలకు అంత గొప్పగా చేయలేకపోయిండవచ్చు. ప్రతి పథకం, ప్రతి విషయంలో మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకువచ్చి వారి కోసమే తాపత్రయపడ్డాను. వారి కోసమే నా టైం కేటాయించాను, ప్రజల కోసమే అడుగులు వేశాను. కానీ ఇప్పుడు చంద్రబాబు మన కార్యకర్తలను పెడుతున్న ఇబ్బందులు చూశాను. కార్యకర్తల బాధలను గమనించాను. వారి అవస్థలను చూశాను. వీళ్ల కోసం మీ జగన్ అండగా ఉంటాడు’’ అని ఆయన స్పష్టం చేశారు. -
పార్టీ మారిన ఎమ్మెల్యేల కీలక భేటీ
-
విజయవాడ వైఎస్సార్సీపీ నేతలతో వైఎస్ జగన్ సమావేశం
-
పార్టీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం
-
చంద్రబాబు మోసాలను ఎండగట్టాలి: వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ సీనియర్ నేతలతో మంగళవారం(ఫిబ్రవరి 4) భేటీ అయ్యారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణ, మేరుగ నాగార్జున, జోగి రమేష్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలు సహా పలు అంశాలపై వైఎస్ జగన్ సీనియర్ నేతలకు దిశా నిర్దేశం చేశారు.వైఎస్ జగన్ ఏమన్నారంటే..చంద్రబాబు మోసాలను మరింత ఎండగట్టాలివాటిని ఇంకా లోతుగా ప్రజలకు వివరించాలికొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు తీరని నష్టంపేదల పట్ల చంద్రబాబుకు ఉన్న కక్షను బట్టబయలు చేయాలిసూపర్సిక్స్ హామీల అమలుపై చంద్రబాబు వైఖరిని ఎండగట్టాలిఏవేవో సాకులు చెబుతూ.. అవి ప్రజలు నమ్మేలా బాబు ప్రచారం చేయడంపై మనం నిలదీయాలిసంపద సృష్టించడం తనకు తెలుసంటూ ప్రచారం చేసుకున్న బాబు.. కేవలం అప్పులతోనే కాలం వెళ్లదీస్తున్నారుచంద్రబాబు దారుణ మోసాలను మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలిబాబు మోసాలను చెప్పడం కోసం రోజూ ప్రజల్లో ఉండాలిప్రజలతో మరింత మమేకం కావాలికేంద్రం వచ్చే అయిదేళ్లలో 75వేల మెడికల్ సీట్లు అదనంగా పెంచబోతోంది.కానీ, చంద్రబాబు తమకు కొత్తగా మెడికల్ సీట్లు వద్దంటూ కేంద్రానికి లేఖ రాయడం అత్యంత దారుణంరాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల కోత, నిల్చిపోయిన పథకాలు, ఆరోగ్యశ్రీ ఆగిపోవడంపైనా జనంలోకి తీసుకెళ్లాలితొమ్మిది నెలల కూటమి పాలన, పేదల వ్యతిరేక పాలనలా మారిందిదీని వల్ల పేదలు, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారుమున్సిపల్ ఉప ఎన్నికల్లో కూటమి పార్టీల వ్యవహారం దారుణంఇలాంటి అరాచకాలు ఎక్కడా ఎప్పుడూ చూడలేదుమెజారిటీ లేని చోట, అసలు ఒక్కోచోట సభ్యులే లేని వారు కూడా గెలవడానికి ఎన్నో దారుణాలు చేశారుప్రజలు అన్నీ గమనిస్తున్నారు తగిన సమయంలో కచ్చితంగా బుద్ధి చెప్తారు -
12న ప్రధాని మోదీ అమెరికా పర్యటన.. ట్రంప్‌తో భేటీ?
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 12 నుండి రెండు రోజుల పాటు అమెరిలో పర్యటించనున్నారు. అక్కడ ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీకానున్నారు. ఈ సమాచారాన్ని అధికారిక వర్గాలు మీడియాకు సూచనప్రాయంగా తెలిపాయి. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత ప్రధాని మోదీ తొలిసారి ఆయనను కలుసుకోనున్నారు.2024 నవంబర్‌లో అమెరికాలో జరిగిన ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన ట్రంప్ 2025, జనవరి 20న రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ట్రంప్ పరిపాలన అధికారంలోకి వచ్చిన కొన్ని వారాలలోపు ద్వైపాక్షిక పర్యటన కోసం వాషింగ్టన్ డీసీని సందర్శించనున్న కొద్దిమంది విదేశీ నేతలలో మోదీ కూడా ఉన్నారు. అయితే ప్రధాని మోదీ పర్యటనపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ప్రధాని మోదీ అమెరికా పర్యటనపై వాషింగ్టన్ అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు ఇటీవల తెలిపింది. వలసలు, సుంకాలపై అమెరికా అధ్యక్షుని అభిప్రాయాలపై భారతదేశంలో ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. కెనడా, మెక్సికన్ దిగుమతులపై 25 శాతం సుంకాన్ని, చైనా వస్తువులపై అదనంగా 10 శాతం సుంకాన్ని ట్రంప్ తాజాగా ప్రకటించారు.జనవరి 27న ప్రధాని మోదీ, ట్రంప్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో వాణిజ్యం, ఇంధనం, రక్షణ రంగాలలో భారతదేశం-అమెరికాలు భాగస్వామ్యంతో పనిచేయాలనే అభిలాషను వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు ముందు భారత్ అణు బాధ్యత చట్టాన్ని సవరించడానికి, అణుశక్తి మిషన్‌ను ఏర్పాటు చేయడానికి తనముందున్న ప్రణాళికలను ప్రకటించింది. ఈ నేపధ్యంలో అమెరికా నుంచి పౌర అణు సహకారం అందుకునేందుకు ఎదురు చూస్తున్నట్లు భారత్ పేర్కొంది. ఇది కూడా చదవండి: మహాకుంభమేళాపై ఎంపీ జయాబచ్చన్ వివాదాస్పద వ్యాఖ్యలు -
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో బీసీ సంఘాలు, తెలంగాణ జాగృతి నేతల భేటీ
-
సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం
-
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
-
నేడు గిరిజన దర్బార్
సాక్షి, ఆదిలాబాద్: నాగోబా జాతర సందర్భంగా శుక్రవారం గిరిజన దర్బార్ నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఇందులో ప్రజాప్రతినిధులు పాల్గొనడం లేదు. ముందుగా నిర్ణయించిన ప్రకారం.. జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దర్బార్‌కు వస్తారని అనుకున్నప్పటికీ కోడ్ నేపథ్యంలో వారు పాల్గొనే అవకాశాలు లేవని చెపుతున్నారు. నాగోబా పూజల్లో మాత్రం మంత్రి సీతక్క పాల్గొంటారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా నాగోబా జాతరలో.. గిరిజన దర్బార్‌కు అత్యంత ప్రాముఖ్యం ఉంది. 1940 కాలంలో గిరిజన పోరాట యోధుడు కొమురంభీం వీర మరణం తర్వాత అప్పటి నైజాం సర్కార్.. గిరిజనుల్లో అసంతృప్తి, తిరుగుబాటుకు కారణం ఏమిటనే విషయంపై పరిశోధన కోసం మానవ పరిణామ శాస్త్రవేత్త, లండన్‌కు చెందిన హైమన్‌డార్ఫ్‌ను నియమించారు. ఆయన అప్పట్లో తన భార్య బెట్టి ఎలిజబెత్‌తో ఇక్కడికి వచ్చి జైనూర్ మండలం మార్లవాయిలో స్థిరపడ్డారు. ఆయన ఆదివాసీల జీవితాలపై పరిశోధించడమే కాకుండా వారి సమస్యలు తెలుసుకొని పరిష్కారంకోసం ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. గిరిజనుల కోసం విద్య, ఇతర పథకాలను అమలు చేసేలా కృషి చేశారు. ఇదిలా ఉంటే గిరిజనులు అత్యధిక సంఖ్యలో కేస్లాపూర్లో కలుస్తారని, అక్కడ గిరిజన దర్బార్ ఏర్పాటు చేయాలని 1942 ప్రాంతంలో హైమన్‌డార్ఫ్ ప్రభుత్వానికి సూచించారు. ఈ దర్బార్‌లో గిరిజనులు అధికారుల వద్ద తమ సమస్యలను చెప్పుకొనేవారు. అధికారుల ద్వారా వారి వినతులు నైజాం సర్కార్ వరకు చేరేవి. ఆ తర్వాత కూడా ప్రభుత్వాలు ఇదే పద్ధతిని కొనసాగిస్తూ వచ్చాయి. నాగోబా జాతరను అధికారికంగా నిర్వహించడమే కాకుండా ఏటా గిరిజన దర్బార్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంటారు. ఈ దర్బార్‌లో అనేక కౌంటర్లు ఏర్పాటు చేసి గిరిజనుల నుంచి సంక్షేమ పథకాలకు సంబంధించిన దరఖాస్తులు తీసుకుంటారు. ఏటా జరిగే ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున గిరిజనులు తరలి వస్తారు. -
సూపర్ సిక్స్ హామీలపై నిలదీసిన YSRCP సభ్యులు
-
Mahakumbh 2025: ప్రతి భక్తుని రక్షణ బాధ్యత మాదే: సీఎం యోగి
ప్రయాగ్‌రాజ్: మౌని అమావాస్య సందర్భంగా మహా కుంభ్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన అనంతరం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పలు జిల్లాల సీనియర్ పోలీసు అధికారులు, జిల్లా పరిపాలన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వారికి పలు సూచనలు చేశారు.ప్రతి భక్తుని రక్షణ బాధ్యత ప్రభుత్వ అధికారులదేనని సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. మహా కుంభమేళా ప్రాంతంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తుల భద్రత, సౌలభ్యం కోసం చేసిన ఏర్పాట్ల గురించి ముఖ్యమంత్రి అయోధ్య, వారణాసి, మీర్జాపూర్, చిత్రకూట్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.ప్రయాగ్‌రాజ్‌లోని అన్ని రైల్వే స్టేషన్లలో భక్తులు పెద్ద సంఖ్యలో ఉన్నారని, వారు సురక్షితంగా వారి గమ్యస్థానానికి చేరుకునేలా రైల్వే అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అయోధ్య-ప్రయాగ్‌రాజ్, కాన్పూర్-ప్రయాగ్‌రాజ్, ఫతేపూర్-ప్రయాగ్‌రాజ్, లక్నో-ప్రతాప్‌గఢ్-ప్రయాగ్‌రాజ్, వారణాసి-ప్రయాగ్‌రాజ్ తదితర మార్గాల్లో ఎక్కడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా సంబంధిత అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు.ఇది కూడా చదవండి: mahakumbh: 27 ఏళ్ల క్రితం అదృశ్యం.. నేడు అఘోరిగా ప్రత్యక్షం -
నాలుగు పథకాలపై నేడు సీఎం రేవంత్ కీలక భేటీ
-
నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్ భేటీ ఫిబ్రవరిలో?
-
ట్రంప్ 2.0..భారత్‌కు దక్కిన అరుదైన గౌరవం
వాషింగ్టన్:అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం చేయగానే భారత్,అమెరికా సంబంధాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత తొలి ప్రాధాన్యం భారత్‌కే లభించింది. అమెరికా కొత్త విదేశాంగ శాఖ మంత్రి మారో రుబియో తన తొలి భేటీ భారత విదేశాంగశాఖ మంత్రితోనే నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీలో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్జ్ కూడా పాల్గొన్నారు.సాధారంగా కొత్త అధ్యక్షుడు అధికారం చేపట్టగానే అమెరికా విదేశాంగశాఖ తొలి భేటీ పొరుగు దేశాలైన కెనడా,మెక్సికో లేదంటే నాటో కూటమిలోని ఏదో ఒక దేశంతో జరుగుతుంది. ఈసారి సంప్రదాయానికి భిన్నంగా భారత విదేశీవ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌తో తొలి భేటీ జరపడం గమనార్హం.అది కూడా అమెరికా విదేశాంగశాఖ మంత్రిగా మైక్ రుబియో పదవీ బాధ్యతలు చేపట్టిన గంటలోనే భేటీ జరగడం విశేషం. గంటపాటు జరిగిన ఈ భేటీలో అమెరికా,భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు.భేటీ ముగిసిన తర్వాత జైశంకర్,రుబియోలు మీడియా ముందుకు వచ్చి కరచాలనం చేసుకున్నారు.రుబియోతో భేటీ అవడం సంతోషంగా ఉందని జైశంకర్ తన ఎక్స్(ట్విటర్)ఖాతాలో పోస్టు చేశారు. Delighted to meet @secrubio for his first bilateral meeting after assumption of office as Secretary of State.Reviewed our extensive bilateral partnership, of which @secrubio has been a strong advocate. Also exchanged views on a wide range of regional and global issues.Look… pic.twitter.com/NVpBUEAyHK— Dr. S. Jaishankar (@DrSJaishankar) January 21, 2025 ఇదీ చదవండి: జన్మతఃపౌరసత్వం రద్దు -
AP: కలెక్టరేట్లో డీఆర్వో అలసత్వం.. ఫోన్లో గేమ్ ఆడుతూ..
సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో అధికారులు రిలాక్స్ అవుతున్నారు. తమ బాధ్యతలు మరచి.. కీలక సమావేశంలో సైతం సెల్ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఓ కీలక సమావేశంలో రెవెన్యూ అధికారి రమ్మీ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) మలోలా నిర్వాకం ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ఛైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఆధ్వర్యంలో సమావేశం జరుగుతోంది. ఈ క్రమంలో అధికారులందరూ బిజీగా ఉన్నారు. కానీ, డీఆర్వో మలోలా మాత్రం ఈ సమావేశంతో తనకు ఎలాంటి సంబంధం లేదనే విధంగా వ్యవహరించారు. కీలకమైన సమావేశంలో డీఆర్వో మలోలా తన సెల్ ఫోన్లో ఆన్లైన్ రమ్మీ ఆడుతూ ఎంజాయ్ చేశారు. ఓవైపు సమావేశం జరుగుతున్నా డీఆర్వో మాత్రం కాలక్షేపం చేశారు. అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ ఘటన వెలుగుచూసింది. దీంతో, సదరు అధికారి తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. -
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
-
ఎంఎఫ్ఐలకు ఆర్థిక సహకారం అవసరం
సూక్ష్మ రుణ సంస్థలు (MFI) ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు వీలుగా ప్రత్యేకమైన నిధి ఏర్పాటుతోపాటు ప్రభుత్వం నుంచి సహకారం అవసరమని ఈ రంగం స్పష్టం చేసింది. పేదల రుణ అవసరాలను తీర్చడంలో ముఖ్య భూమిక పోషిస్తున్న సూక్ష్మ రుణ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలను అర్థం చేసుకునేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి నాగరాజు ఒక సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశం అనంతరం సా–ధన్ ఈడీ, సీఈవో జిజి మామెన్ మీడియాతో మాట్లాడారు. అనియంత్రిత సంస్థలను ఏరిపారేయాలని, అలాంటి సంస్థలు అనుసరిస్తున్న దారుణమైన రుణ వసూళ్ల విధానాలకు చెక్ పెట్టాలని సూచించినట్టు చెప్పారు. రుణాలకు ఆధార్‌ను తప్పనిసరి డాక్యుమెంట్‌గా చేయాలని కోరినట్టు తెలిపారు. ప్రస్తుతం ఎంఎఫ్ఐలు రుణ గ్రహీతల నుంచి ఆధార్ తీసుకునేందుకు అనుమతి లేదు. పరిశ్రమకు ప్రత్యేకమైన నిధుల యంత్రాంగం ఉండాలని డిమాండ్ చేసినట్టు చెప్పారు. కరోనా సమయంలో రూ.25,000 కోట్లతో ఆర్బీఐ ప్రత్యేక విండో ప్రారంభించడాన్ని ప్రస్తావించినట్టు తెలిపారు. క్రెడిట్ గ్యారంటీని కూడా పరిశీలించాలని కోరినట్టు చెప్పారు. పెరిగిపోయిన మొండి బకాయిలు మొండి పద్దులు పెరిగిపోతుండడంతో ఎంఎఫ్ఐలు అప్రమత్త ధోరణితో వ్యవహరిస్తున్నాయి. దీంతో సెప్టెంబర్ త్రైమాసికం చివరికి సూక్ష్మ రుణ రంగంలో రుణాల అవుట్ స్టాండింగ్ (తిరిగి రావాల్సిన మొత్తం/నికర రుణ పోర్ట్‌ఫోలియో) 4.3 శాతానికి (రూ.4.14 లక్షల కోట్లు) తగ్గినట్టు క్రెడిట్ సమాచార సంస్థ ‘క్రిఫ్ హై మార్క్’ నివేదిక వెల్లడించింది. అదే సమయంలో మొండి బకాయిలు పెరిగిపోయినట్టు తెలిపింది.‘‘1–30 రోజుల వరకు చెల్లింపులు చేయని రుణాలు జూన్ త్రైమాసికం చివరికి 1.2 శాతంగా ఉంటే, సెప్టెంబర్ చివరికి 2.1 శాతానికి పెరిగాయి. 31–180 రోజుల వరకు చెల్లింపులు చేయని రుణాలు ఇదే కాలంలో 2.7 శాతం నుంచి 4.3 శాతానికి ఎగిశాయి’’అని వెల్లడించింది. బీహార్, తమిళనాడు, యూపీ, ఒడిశా రాష్ట్రాల్లో సూక్ష్మ రుణాల చెల్లింపుల నిలిపివేతలు ఎక్కువగా ఉన్నట్టు, పెరిగిన వసూలు కాని రుణాల్లో మూడింట రెండొంతులు ఈ రాష్ట్రాల నుంచే ఉన్నట్టు తెలిపింది. ఒకే రుణ గ్రహీత మూడు లేదా అంతకంటే ఎక్కువ సంస్థల నుంచి రుణాలు తీసుకోవడం తగ్గడాన్ని సానుకూలతగా పేర్కొంది. -
జగనే కరెక్ట్ అంటున్నారు.. (ఫొటోలు)
-
నెల్లూరు జిల్లా నేతలతో వైఎస్ జగన్ కీలక సమావేశం
-
నేడు నెల్లూరు జిల్లా నేతలతో వైఎస్ జగన్ భేటీ
-
రైతు భరోసాపై కొలిక్కిరాని చర్చలు
-
ఎంపీ వేమిరెడ్డి ఆగడాలు..గనుల యజమానుల రహస్య భేటీ..!
సాక్షి,నెల్లూరు:టీడీపీ ఎంపీ వేమిరెడ్డికి వ్యతిరేకంగా నెల్లూరు(Nellore)జిల్లా మైనింగ్ కంపెనీల యజమానులు సమావేశమయ్యారు. జిల్లాలో క్వార్జ్ మైనింగ్ వివాదం రోజురోజుకు ముదురుతోంది. సైదాపురంలో ఉన్న తెల్లరాయి తవ్వకం,రవాణాకు అనుమతులు దక్కించుకుని వందల కోట్ల మైనింగ్‌ను ఎంపీ వేమమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి(Vemireddy Prabhakarreddy) తన గుప్పెట్లో పెట్టుకున్నారు. తాను చెప్పిన ధరకే క్వార్ట్జ్ అమ్మాలంటూ గనుల యజమానులపై వేమిరెడ్డి ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో ఆయనకు వ్యతిరేకంగా గూడూరులోని ఓ హోటల్లో గనుల యజమానులు రహస్య సమావేశం నిర్వహించారు. వేమిరెడ్డికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకు మైనింగ్ యజమానులు ఈ సమావేశంలో తీర్మానం చేసినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: పోలీసుల ఓవరాక్షన్..వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు -
టాలీవుడ్ ప్రముఖులతో తెలంగాణ సీఎం రేవంత్, మంత్రుల సమావేశం
-
సమావేశానికి చిరంజీవి దూరం.. కారణం ఇదే!
-
KSR Live Show: జగన్ కు దండం పెడితే తప్పు.. రేవంత్ కు పెడితే తప్పు లేదా?.. ఇప్పుడెందుకు పవన్ నోరు మెదపట్లేదు?
-
నేడు సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
-
ఇందిరమ్మ ఇళ్ల సర్వేపై అధికారులతో మంత్రి పొంగులేటి భేటీ
-
కడప ముఖ్యనేతలు, కార్పొరేటర్లతో వైఎస్ జగన్ భేటీ
-
ట్రంప్‌తో చర్చలకు సిద్ధం
మాస్కో: అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. గత నాలుగేళ్లలో ఒక్కసారి కూడా ట్రంప్‌తో మాట్లాడలేదని ఆయన చెప్పారు. ట్రంప్ హయాంలో అమెరికా విధానాల్లో భారీగా మార్పులు రావొచ్చని అంచనా వేస్తున్నామన్నారు. ఉక్రెయి న్లో విజయం సాధించబోతున్నామని, సిరియాలో ఆశించిన లక్ష్యం నెరవేరిందని చెప్పుకొచ్చారు. గురు వారం దాదాపు నాలు గున్నర గంటలపాటు జరి గిన వార్షిక మీడియా సమావేశంలో ప్రజల నుంచి వచ్చిన ఫోన్‌కాల్స్‌కు కూడా పుతిన్ స్పందించారు. అనేక జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై మాట్లాడారు. ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టాక ఉక్రెయిన్‌లో యుద్ధానికి ముగింపు రావొచ్చునంటూ వార్తలు వస్తున్న వేళ పుతిన్ పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం.నాలుగేళ్లుగా మేం మాట్లాడుకో లేదుడొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం ఎప్పుడుంటుందన్న ఎన్బీసీ ప్రతినిధి కెయిర్ సిమ్మన్స్ ప్రశ్నకు..‘మా సమావేశం ఎప్పుడు ఉండొచ్చో నాకు తెలియదు. ట్రంప్ కూడా ఈ విషయం ఎన్నడూ చెప్పలేదు. దాదాపు నాలుగేళ్లుగా మేం మాట్లాడుకున్నదీ లేదు. ట్రంప్ సానుకూలంగా ఉంటే చర్చలకు ఎప్పుడైనా నేను సిద్ధమే’అని అన్నారు. ఉక్రెయిన్‌తో కొనసాగుతున్న యుద్ధం, సిరియా నుంచి రష్యా బలగాలు వైదొలగాల్సి రావడం వంటి పరిణామాలతో మీరు బలహీనపడినట్లుగా భావిస్తున్నారా అన్న ప్రశ్నకు..,గత రెండు, మూడేళ్లలో రష్యా మరింతగా బలం పుంజుకుంది. ఎందుకంటే మేం మరింత స్వతంత్రంగా మారాం. ఎవరిపైనా ఆధారపడకుండా ముందుకు సాగుతున్నాం’అన్నారు. ఉక్రెయిన్‌లో పరిస్థితులు అనూహ్యంగా మారి పోయాయి. యుద్ధక్షేత్రంలో రోజురోజుకూ చదరపు కిలోమీటర్ల కొద్దీ భూభా గాన్ని స్వాధీనం చేసుకుంటూ ముందుకు సాగు తున్నాం’అన్నారు. అయితే, సరిహద్దుల్లో కస్క్ ప్రాంతాన్ని ఉక్రెయిన్ దళాల నుంచి తిరిగి ఎప్పుడు స్వాధీనం చేసుకుంటారన్న ప్రశ్నకు ఆయన నేరుగా సమాధాన మివ్వలేదు. ‘స్వాధీనం చేసుకుని తీరుతాం. ఫలానా సమయం కల్లా అది పూర్తవుతుందని మాత్రం చెప్పలేను’అని పేర్కొనడం గమనార్హం. తాజాగా ఆర్మీ అణు విభాగం చీఫ్ కిరిల్లోవ్ హత్యను ఆయన ఉగ్రవాద చర్యగా పేర్కొన్నారు. సిరియా పదవీచ్యుత అధ్యక్షుడు అసద్ మాస్కోలోనే ఉన్నట్లు పుతిన్ ప్రకటించడం గమనార్హం. ఇప్పటి వరకు ఆయనతో సమావేశం జరగలేదని, కచ్చితంగా మాట్లాడతానని చెప్పారు. -
భారీగా అప్పుల సేకరణకు ఏపీ కేబినెట్ ఆమోదం
-
అనంతపురం YSRCP నేతలతో YS జగన్ కీలక చర్చ..
-
YSRCP నేతలతో వైఎస్ జగన్ సమావేశం
-
త్వరలో మానస సరోవర యాత్ర?.. భారత్- చైనాల మధ్య ఆరు కీలక ఒప్పందాలు?
భారతదేశంలోని హిందువుల చిరకాల వాంఛ త్వరలో నెరవేరనుంది. కైలాస మానసరోవర యాత్ర చేయాలనుకుంటున్నవారి ఆశ సాకారంకానుంది. ఇందుకు భారత్- చైనాల మధ్య చర్చలు జరగనున్నాయి. ఇదొక్కటే కాదు ఇరుదేశాల మధ్య మొత్తం ఆరు కీలక ఒప్పందాలు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.భారత్, చైనా ప్రత్యేక ప్రతినిధులు భేటీభారత సరిహద్దుల్లోని తూర్పు లడఖ్ వద్ద ఘర్షణల కారణంగా భారత్, చైనాల మధ్య దాదాపు ఐదేళ్లుగా ద్వైపాక్షిక సంబంధాలు నిలిచిపోయాయి. ఇటువంటి తరుణంలో తిరిగి సంబంధాల పునరుద్దరణకు ఇరు దేశాలూ ముందుకు వచ్చాయి. తాజాగా బీజింగ్‌లో భారత్, చైనా ప్రత్యేక ప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీకి భారత్ నుంచి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సారధ్యం వహించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో శాంతి స్థాపనకు రోడ్ మ్యాప్, ఇరు దేశాల సంబంధాల బలోపేతానికి ఆరు సూత్రాల ప్రణాళిక అమలు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. టిబెట్ మీదుగా కైలాస మానసరోవర యాత్ర పునరుద్ధరణ, నదీజలాలకు సంబంధించిన సమగ్ర వివరాలను పంచుకోవడం, పరస్పరం వాణిజ్య సహకారం మొదలైన అంశాలపై ఇరుదేశాల ప్రతినిధులు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఆరు అంశాలపై ఏకాభిప్రాయం?భారత్‌తో సానుకూల వాతావరణంలో చర్చలు సాగాయని, ఇరు దేశాలు ఆరు అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు చైనా వెల్లడించింది. దశల వారీగా రోడ్‌మ్యాప్ రూపొందించేందుకు అంగీకారానికి వచ్చామని, వివాదాస్పద అంశాలను పక్కనపెట్టి సంబంధాలను మరింత మెరుగుపరిచేందుకు కృషిచేస్తున్నామని చైనా తెలిపింది. ఇదే సమయంలో భారత్ ఈ విషయాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హం. అయితే సైనిక బలగాల ఉపసంహరణపై గతంలో జరిగిన ఒప్పందం అమలుకు అనుగుణంగా సరిహద్దుల్లో పెట్రోలింగ్ కొనసాగుతున్నదని భారత్ పేర్కొంది.శాంతికి విఘాతం కలగొద్దుకాగా పరస్పర ఆమోదయోగ్యమైన నిర్ణయాలకు, ఒప్పందాలకు ఇకపైనా కట్టుబడి ఉండాలని, శాంతికి విఘాతం కలగకుండా చూసుకోవాలని ఇరు దేశాల ప్రతినిధులు తీర్మానించారు. అలాగే ప్రత్యేక ప్రతినిధుల వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు సైనిక-దౌత్యపరమైన చర్చలను సమన్వయంతో నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు. ఇరుదేశాల ప్రతినిధుల సమావేశాన్ని వచ్చే ఏడాది భారత్‌లో నిర్వహించాలని నిర్ణయించారు.బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో నాందిభారత్, చైనా సరిహద్దు వివాదాలను పరిష్కరించుకునేందుకు ప్రత్యేక ప్రతినిధులు 2003 నుంచి ఇప్పటివరకు 22సార్లు భేటీ అయ్యారు. తాజాగా 23వ సారి సమావేశం అయ్యారు. వాస్తవాధీన రేఖ వెంబడి శాంతిని నెలకొల్పడం, ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్దరణే లక్ష్యంగా ఈ చర్చలు సాగాయి. కాగా గత అక్టోబరు 24న రష్యాలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రత్యేకంగా సమావేశమై, ఇరుదేశాల మధ్య సయోధ్యకు మార్గం సుగమం చేశారు.ఇది కూడా చదవండి: మంచు సున్నితం.. వడగళ్లు కఠినం.. ఆకాశంలో ఏం జరుగుతుంది? -
ఈ నెల 20 వరకే అసెంబ్లీ సమావేశాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈ నెల 20వ తేదీ వరకే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. క్రిస్మస్ పండుగ నేపథ్యంలో శుక్రవారంతో సమావేశాలు ముగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. కానీ ఎక్కువ రోజులు సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ పట్టుబట్టినట్టు సమాచారం. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో స్పష్టత రాలేదు. సోమవారం మధ్యాహ్నం స్పీకర్ ప్రసాద్‌కుమార్ చాంబర్లో బీఏసీ భేటీ జరిగింది.ఇందులో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్.. బీఆర్ఎస్ నుంచి హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, బీజేపీ నుంచి పాయల్ శంకర్, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ, సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభ నిర్వహణ తేదీలు, ఎజెండాపై ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది.కనీసం 15 రోజుల పాటు సభ నిర్వహించాలని కోరింది. దీనికి ప్రభుత్వం అంగీకరించకపోవడంతో భేటీ నుంచి వాకౌట్ చేసింది. మరోవైపు సభ నిర్వహణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ కూడా బీఏసీ భేటీ బయటికి వచ్చారు. బీఏసీ భేటీకి సంబంధించిన వివరాలను మంగళవారం ఉదయం అధికారికంగా వెల్లడించే అవకాశముంది. బీఏసీ అంటే బిస్కట్ అండ్ చాయ్ సమావేశం కాదు: హరీశ్‌రావు కనీసం 15 రోజులపాటు అసెంబ్లీ నడపాలని కోరా మని బీఏసీ భేటీ అనంతరం హరీశ్‌రావు చెప్పారు. ‘‘బీఏసీ అంటే బిస్కట్ అండ్ చాయ్ సమావేశం కాదు. బీఏసీలో ఏమీ తేల్చకపోవడంతో, సభ ఎన్ని రోజులు నడుపుతారో చెప్పకపోవడంతో వాకౌట్ చేశాం. లగచర్ల అంశంపై చర్చకు మంగళవారం కూ డా పట్టుబడతాం. ఒకరోజు ప్రభుత్వం, మరోరోజు విపక్షం ప్రతిపాదించే ఎజెండాకు అవకాశం ఇవ్వ డం సాంప్రదాయం. బీఏసీకి కేవలం సూచనలు చేసే అధికారం మాత్రమే ఉందని సీఎం చేసిన వ్యా ఖ్యలపై అభ్యంతరం తెలిపాం.హౌజ్ కమిటీలు ఏ ర్పాటు చేయాలి. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ)పై బీఆర్ఎస్ అభిప్రాయం తెలుసుకోకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని అడిగాం. బీఏసీలో చర్చించకుండానే సభలో బిల్లులు ప్రవేశపెట్టడం, పుట్టినరోజులు, పెళ్లిళ్లు ఉన్నందుకు సభ వాయిదా వేయడంపై అభ్యంతరం చెప్పాం. ప్రతీరోజూ జీరో అవర్‌లో బీఆర్ఎస్ సభ్యుల సంఖ్యకు అనుగుణంగా మాట్లాడే సమయం ఇవ్వాలని కోరాం’’అని హరీశ్‌రావు వెల్లడించారు. గత పదేళ్లలో చాయ్ తాగి, బిస్కెట్లు తినే వచ్చారా?: మంత్రి శ్రీధర్‌బాబు ఉమ్మడి ఏపీతోపాటు తెలంగాణ ఏర్పాటైన పదేళ్ల నుంచీ కూడా బీఏసీ సమావేశంలో చర్చించి సభ నిర్వహణపై నిర్ణయాలు తీసుకుంటున్నారని... సభ ఎన్ని రోజులు నడపాలనేది స్పీకర్ నిర్ణయమని శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. సోమవారం అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడారు. ‘‘బీఏసీ సమావేశం నుంచి వాకౌట్ చేయడం ద్వారా బీఆర్ఎస్, ఎంఐఎం స్పీకర్‌ను అవమానించాయి. బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు చెప్పినట్టు గత పదేళ్లలో కూడా బీఏసీ సమావేశంలో చాయ్ తాగి, బిస్కెట్లు తినే వచ్చారా? బీఆర్ఎస్ తీరు సరికాదు..’’అని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. -
నేడు ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమావేశం
-
ఏం చేశాం.. ఏం చేద్దాం?
-
కూటమి కొత్త స్టంట్స్
సాక్షి, అమరావతి : సహజంగా ప్రతి స్కూల్లో జరిగే పేరెంట్స్ కమిటీ సమావేశాల పేరు మార్చి, ఆ సమావేశాలేవో ఇప్పుడే జరుగుతున్నట్టుగా, వాటిని ప్రచార వేదికలుగా మార్చుకుని చంద్రబాబు కూటమి ప్రభుత్వం చేస్తున్న స్టంట్స్ చూస్తుంటే ఆశ్చర్యమేస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఎంతో కష్టపడి తీర్చిదిద్దిన ప్రభుత్వ స్కూళ్లను, విద్యా రంగాన్ని ఒకవైపు నాశనం చేస్తూ.. అమ్మకు వందనం పేరిట తల్లిదండ్రులకు సున్నం రాసి, వారిని దగాచేసి, మళ్లీ ఇప్పుడు రొటీన్‌గా జరిగే పేరెంట్స్ సమావేశాలపై పబ్లిసిటీ చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. ఈ ప్రపంచంలో ఒక్క చంద్రబాబు మాత్రమే ఇలాంటి మోసాలు చేయగలరన్నారు. ఇంతటి నటనా కౌశల్యం చంద్రబాబుకే సొంతం అంటూ వ్యంగోక్తులు విసిరారు. ఈ మేరకు ఆదివారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..టీచర్లు–విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు కొత్తేమీ కాదు. క్రమం తప్పకుండా గతంలో నుంచీ జరుగుతున్నవే. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ విద్యా రంగానికి పూర్తి జవసత్వాలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ప్రతి విప్లవాత్మక మార్పులోనూ, అమలు చేసిన ప్రతి సంస్కరణలోనూ పిల్లల తల్లిదండ్రుల ఆలోచనలు, వారి భాగస్వామ్యాన్ని తీసుకున్నాం. 15,715 పాఠశాలల్లో మొదటి విడత, 22,344 పాఠశాలల్లో మలివిడత నాడు–నేడు పనులన్నీ తల్లిదండ్రుల కమిటీల భాగస్వామ్యంతోనే జరిగాయి. అప్పట్లో పిల్లలందరికీ ఇంగ్లిష్ మీడియంలో బోధన చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా పేరెంట్స్ కమిటీలు సంపూర్ణంగా ఆమోదించి తీర్మానాలు చేశాయి. ప్రభుత్వ స్కూళ్లలో టాయిలెట్స్ మెయింటెనెన్స్ ఫండ్, స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ నిర్వహణలో తల్లిదండ్రులదే ముఖ్య భూమిక. ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లల భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దడంలో ఈ విధంగా తల్లిదండ్రులు తమ వంతు పాత్ర పోషించారు. ఇప్పుడు ఈ సమావేశాలకు కొత్త టైటిల్స్ పెట్టి, ఓవైపు విద్యా రంగాన్ని నాశనం చేస్తూ, మరోవైపు తామేదో కొత్తగా చేస్తున్నామనే భ్రమ కల్పించడానికి చంద్రబాబు, టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. మరో విశేషం ఏంటంటే.. పేరెంట్స్ కమిటీ సమావేశాలకు దాతల నుంచి చందాలు, సామగ్రిని తీసుకోవాలని ఏకంగా సర్క్యులర్ పంపడం. మేం అమ్మ ఒడి కింద ప్రతి తల్లికీ ఏడాదికి రూ.15 వేల చొప్పున, క్రమం తప్పకుండా 44.49 లక్షల మంది తల్లులకు రూ.26,067 కోట్లు ఇచ్చాం. నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అంటూ చంద్రబాబు సహా కూటమి పార్టీల నాయకులు ప్రతి ఇంటికీ వెళ్లి ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ రూ.15 వేల చొప్పున ఇస్తామన్నారు. సూపర్ సిక్స్ అంటూ ఊరూరా, ప్రతి ఇంటికీ డప్పు కొట్టారు. ఇద్దరు పిల్లుంటే రూ.30 వేలు.. ముగ్గురుఉంటే రూ.45 వేలు.. నలుగురు ఉంటే రూ.60 వేలు ఇస్తామన్నారు. ఎంత మంది పిల్లలనైనా కనాలని చంద్రబాబు పిలుపు కూడా ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయ్యింది. ఇప్పటి వరకు ఒక్క పైసా ఇవ్వలేదు కదా.. గతంలో ఉన్న అమ్మ ఒడి పథకాన్నీ ఆపేశారు. బడ్జెట్లో రూ.12,450 కోట్లు పెట్టాల్సి ఉండగా పెట్టలేదు. మరి ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తారు? ఆ హామీని అమలు చేయక పోవడంతో తల్లిదండ్రుల మీద పిల్లల ఖర్చులు, వారి భారం పడుతోంది కదా? నిన్నటి పేరెంట్స్ కమిటీ సమావేశాల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, విద్యా శాఖ మంత్రిగా లోకేష్ అసలు దీని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇది దగా చేయడం కాదా? ఒక్క మాట కూడా మాట్లాడ్డం లేదంటే తల్లిదండ్రులకు సున్నం పెడుతున్నట్టే కదా?గతంలో రోజుకో మెనూతో ఘనంగా ఉన్న మధ్యాహ్న భోజన పథకం గోరు ముద్ద కార్యక్రమం అత్యంత దారుణంగా తయారయ్యిందంటూ ఈ మీటింగ్స్‌లో పేరెంట్స్ గగ్గోలు పెట్టడం మీ చెవులకూ వినిపించిందా చంద్రబాబు గారూ? డొక్కా సీతమ్మ అనే మహా తల్లి పేరుపెట్టి చివరకు స్కూళ్లలో, హాస్టళ్లలో విద్యార్థుల డొక్క మాడుస్తున్నారు. కనీసం ఆయాలకు జీతాలు కూడా ఇవ్వడం లేదు. విద్యార్థులు అపరిశుభ్రమైన ఆహారం తిని ఆరోగ్యంపాడై ఆస్పత్రుల్లో చేరుతున్న ఘటనలు మీ ప్రభుత్వ హయాంలో కోకొల్లలు. పిల్లలు వెళ్లే గవర్నమెంటు స్కూళ్లలో టాయిలెట్ల నిర్వహణ కోసం ఇచ్చే టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్, స్కూళ్ల నిర్వహణ కోసం ఇచ్చే స్కూల్ మెయింటినెన్స్ ఫండ్ ఈ రోజు ఏమైంది? టాయిలెట్ల మెయింటెనెన్స్ గురించి గానీ, స్కూళ్ల మెయింటినెన్స్ గురించి గానీ ఎవరైనా పట్టించుకున్నారా? అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఇలా ప్రభుత్వ విద్యా రంగాన్ని దిగజార్చి, కావాలనే సమస్యలు సృష్టించి ఉద్దేశ పూర్వకంగా ప్రైవేటు బడులకు వెళ్లేలా చేసి, తల్లిదండ్రులు చదువు కొనుక్కునేలా వారిపై ఆర్థిక భారం మోపి, ఇప్పుడు అదే పిల్లల ముందుకు, తల్లిదండ్రుల ముందుకు వెళ్లి ఏమార్చే మాటలు చెప్పడానికి, వారిని మభ్యపెట్టడానికి సిగ్గేయడం లేదా?అధికారంలోకి రాగానే స్కూళ్ల బాగు కోసం వైఎస్సార్సీపీ చేసిన మంచి పనులన్నింటినీ కూడా నిలిపేశారు. మలి దశలో మిగిలిపోయిన నాడు–నేడు పనులను ఉద్దేశ పూర్వకంగా ఆపేశారు. అదనపు తరగతి గదుల నిర్మాణాలనూ పట్టించుకోలేదు. ఏ కారణంతో నిలిపేశారు? ఎందుకు నిలిపేశారు? ఎంతో కష్టపడి స్కూళ్లకు సీబీఎస్ఈ అఫిలియేషన్ తీసుకు వచ్చాం. ఇప్పుడు సీబీఎస్ఈని ఎందుకు రద్దు చేశారు? ఇంగ్లిష్ మీడియం బోధనను ఎందుకు నిరుత్సాహ పరుస్తున్నారు? ప్రపంచ స్థాయిలో గవర్నమెంటు స్కూలు పిల్లలను తయారు చేసేలా 3వ తరగతి నుంచి ప్రవేశ పెట్టిన టోఫెల్ క్లాసు, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ల విధానం, సీబీఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం, ఫ్యూచర్ టెక్నాలజీపై తరగతులు.. ఇలా ఇవన్నీ ఎందుకు ఆపేశారు? డిజిటల్ లెర్నింగ్‌లో భాగంగా 8వ తరగతి విద్యార్థులకు ఇచ్చే ట్యాబుల పంపిణీని ఎందుకు రద్దు చేశారు? 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్ల కాన్సెప్ట్‌ను ఎందుకు రద్దు చేశారు?మేం స్కూళ్లలో 6వ తరగతి నుంచే ప్రతి క్లాసులో, ప్రతి స్కూల్లో పెట్టిన ఐఎఫ్‌పీ ప్యానెల్స్, డిజిటల్ స్క్రీన్ల సమర్థ వినియోగం కోసం ఫైనల్ ఇయర్ ఇంజినీరింగ్ స్టూడెంట్ను ప్రతి స్కూలుకూ పెట్టాలన్న కార్యక్రమాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? దీనివల్ల వేల మంది ఇంజినీరింగ్ స్టూడెంట్లకు వచ్చే ఉపాధి పోతుంది కదా? ఐఎఫ్‌పీ ప్యానెల్స్ మెయింటినెన్స్ మూలన పడదా?విద్యా దీవెన, వసతి దీవెనల కింద గతంలో విద్యార్థులకు ఇచ్చే తోడ్పాటు ఇప్పుడు లభిస్తోందా? ఈ జనవరి వస్తే నాలుగు త్రైమాసికాలుగా ఎలాంటి చెల్లింపులు లేవు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఇచ్చే వసతి దీవెన, విద్యా దీవెన.. ఈ రెండింటికీ కలిపి ఏకంగా రూ.3,900 కోట్లు బకాయిలుగా పెట్టి, ఈ రోజు పిల్లలను ఉద్ధరిస్తున్నట్టుగా మీరు చేస్తున్న డ్రామా మరో డీవియేషన్ రాజకీయం కాదా? -
ఇక నిలదీయడమే!
సాక్షి, హైదరాబాద్: పాలకుల అసమర్ధతపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ ఎస్.. ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి తగినంత సమ యం ఇచ్చామని, సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై గొంతు విప్పాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం చేతకాక ప్రభుత్వం కొనసాగిస్తున్న అణచివేత విధానాలను ఎండగట్టాలని చెప్పారు. ఆదివారం ఎర్రవల్లి నివాసంలో జరిగిన బీఆర్ఎస్ శాసనసభా పక్షం సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. సుమారు రెండున్నర గంటల పాటు సాగిన ఈ భేటీలో పలు అంశాలను ప్రస్తావించారు. నమ్మి ఓట్లేసిన వాళ్లను వేధిస్తున్నారు.. ‘త్యాగాలు చేసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఆగం చేయాలని కాంగ్రెస్ చూస్తోంది. నమ్మి ఓట్లు వేసిన రైతులు, గిరిజనులు, దళితులను వేధిస్తోంది. ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల మీద కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు కాళేశ్వరం అంశాన్ని ముందుకు తెచ్చింది. ఉద్యోగులకు మొండి చేయి చూపుతూ కేవలం ఒకేఒక్క డీఏను విడుదల చేసి అది కూడా 17 వాయిదాల్లో చెల్లిస్తోంది.దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దిన గురుకుల విద్యాలయాలను కాంగ్రెస్ ప్రభుత్వం అస్తవ్యస్తం చేసింది. విషాహారంతో పిల్లలు చనిపోవడాన్ని చూసి సభ్య సమాజం సిగ్గు పడుతోంది. గురుకుల బాట పేరిట బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన కమిటీని ప్రభుత్వం అడ్డుకుంది. గురుకులాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని పార్టీ కమిటీ నివేదిక ఇచ్చింది. గురుకుల విద్యా సంస్థల్లో సమస్యలపై బీఆర్ఎస్ త్వరలో కార్యాచరణ ప్రకటిస్తుంది. గురుకుల విద్యా సంస్థల్లో వైఫల్యాలను అసెంబ్లీలో ఎండగట్టాలి..’ అని కేసీఆర్ సూచించారు. తెలంగాణ అస్తిత్వం మీద సోయి లేదు ‘తెలంగాణ అస్తిత్వం, ప్రజల ఆకాంక్షల మీద సోయి లేని సీఎం కేవలం రాజకీయ స్వార్ధంతో పాటు నాపై ఉన్న కక్షతో తెలంగాణ విగ్రహం రూపురేఖలు మార్చే పిచ్చి పనులకు పూనుకుంటున్నాడు. తెలంగాణ తల్లి భావన కేవలం నాది మాత్రమే కాదు, మొత్తం తెలంగాణ సమాజానిది. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలనే మూర్ఖత్వంతో సీఎం వ్యవహరిస్తున్నాడు. ప్రత్యేక ఆంధ్ర ఉద్యమ సమయంలో ఆంధ్రామాత అనే భావన ముందుకు తెచ్చిన అక్కడి నాయకత్వం తర్వాత తెలుగు తల్లిని తెరమీదకు తెచ్చి తెలంగాణ అస్తిత్వాన్ని మరిపించింది.తెలుగు తల్లి విగ్రహం ఒక రకంగా తెలంగాణ ప్రజల్లో అస్తిత్వ భావనకు ఊపిరిపోసింది. ఇక్కడి ప్రజల అస్తిత్వానికి చిహ్నంగా తెలంగాణ తల్లిని భగవత్ స్వరూపంలో చేతులెత్తి మొక్కేలా రూపొందించాం. అనేకమంది మేధావులు, కవులు, కళాకారులు వేలాది గంటల పాటు చర్చించి, శ్రమించి తెలంగాణ చారిత్రక సాంస్కృతిక సామాజిక నేపథ్యంలో నుంచి ప్రస్తుత తెలంగాణ తల్లి రూపాన్ని తీర్చిదిద్దారు. సమైక్య పాలనలో మరిచిపోయిన తెలంగాణ ప్రతీకలను ఉద్యమ సమయంలో పునరుజ్జీవింప చేసుకోవడానికే తెలంగాణ తల్లిని నిలుపుకున్నాం.కానీ తెలంగాణ సాంస్కృతిక వారసత్వంపై అవగాహన లేని సీఎం తెలంగాణ అస్తిత్వానికి మచ్చ తెస్తున్నారు. కొత్త రూపంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తెలంగాణ విగ్రహం ఆవిష్కరణకు నన్ను ఆహా్వనించడం వెనుక ఉన్న కోణం, ఉద్దేశం ఏదైనా ఇంటికి వచ్చిన మంత్రికి తెలంగాణ సాంప్రదాయం ప్రకారం భోజనం పెట్టి సాదరంగా గౌరవించాం..’ అని మాజీ సీఎం చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టండి‘కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని విర్రవీగుతున్న ముఖ్యమంత్రి నేను చేపట్టిన అనేక పనులు, పథకాలను ప్రారంభిస్తున్నాడు. యాదాద్రి పవర్ ప్లాంట్ కేసీఆర్ ఆనవాలు అనే విషయం తెలియదా. వ్యవసాయ రంగాన్ని నిరీ్వర్యం చేయడంపై అసెంబ్లీలో నిలదీయాలి, రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని స్థిరీకరిచేందుకు దార్శనికతతో వ్యవసాయ అభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం. ఎలాంటి పరిమితులు విధించకుండా రైతుబంధును అందజేశాం. కానీ ఎన్నికల సమయంలో రైతులకు ఆశపెట్టి ఎగవేస్తున్న ప్రభుత్వ వైఖరిని అసెంబ్లీలో ఎండగట్టాలి. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు హామీల అమలుపై నిలదీయాలి. కేవలం ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడానికే పరిమితం కాకుండా గతంలో బీఆర్ఎస్ పాలనలో అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలను వివరించాలి..’ అని కేసీఆర్ చెప్పారు. వచ్చే ఏడాదంతా సంస్థాగత నిర్మాణం ‘ప్రజలు కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ను మాత్రమే చూస్తున్నారు. ఫిబ్రవరి చివరి వారంలో వరంగల్, హైదరాబాద్ కాకుండా అందరికీ అందుబాటులో ఉండే చోటును చాటుకుని భారీ జనసమీకరణతో సభ నిర్వహిద్దాం. వచ్చే ఏడాదంతా పూర్తిగా పార్టీ సంస్థాగత నిర్మాణం, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కార్యవర్గాల ఏర్పాటు, సంస్థాగత శిక్షణ కార్యక్రమాలపైనే దృష్టి పెడదాం. జమిలి ఎన్నికలు జరిగే పక్షంలో పెద్దగా సమయం ఉండదు. మళ్లీ అధికారంలోకి వంద శాతం మనమే వస్తాం..’ అని బీఆర్ఎస్ అధినేత భరోసా ఇచ్చారు. ఈ సమావేశం అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ నేతృత్వంలోని పార్టీ కమిటీ కేసీఆర్‌కు ‘గురుకుల బాట’ నివేదిక అందజేసింది. ఈ సందర్భంగా కమిటీని కేసీఆర్ అభినందించారు. ఇలావుండగా హైదరాబాద్‌లో ఈ నెల 11న జరిగే తన పెద్ద కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి.. ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్‌ను, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆహా్వనించారు. -
BRS నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం
-
నేడు బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 9 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో నేడు బీఆర్ఎస్ శాసనసభా పక్ష భేటీ జరగనుంది. ఎర్రవల్లి నివాసంలో ఆదివారం ఉదయం 10.30కు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగే ఈ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కొందరు ముఖ్య నేతలు కూడా హాజరుకానున్నారు. సుమారు వారం రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ నాయకులకు దిశానిర్దేశం చేస్తారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలు, ఏడాదిలో రేవంత్ ప్రభుత్వ పాలన వైఫల్యాలతో పాటు ప్రజా సమస్యలను ప్రస్తావించాలని బీఆర్ఎస్ భావిస్తోంది.మరోవైపు సోమవారం బీఏసీ సమావేశంలో ప్రతిపాదించే ఎజెండా ఆధారంగా తమ వ్యూహానికి పదును పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. కాగా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేది, లేనిదీ ఆదివారం జరిగే భేటీలో స్పష్టత వచ్చే అవకాశముంది. గత ప్రభుత్వం చేసిన పలు చట్టాలకు ప్రస్తుత ప్రభుత్వం సవరణలు తీసుకువస్తోంది. అలాగే విద్యుత్ కొనుగోలు అంశంపై విచారణ నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టేందుకు అధికార పార్టీ సన్నద్ధమవుతోంది.ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పాలనలో తీసుకున్న నిర్ణయాలపై ప్రభుత్వం ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తే వాటిని తిప్పికొట్టేందుకు అనుసరించే వ్యూహంపైనా ఈ భేటీలో కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు. కేవలం అసెంబ్లీ సమావేశాల కోణంలోనే కాకుండా జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు, బీఆర్ఎస్ ప్రతిస్పందించాల్సిన తీరుపై కేసీఆర్ సూచనలు చేస్తారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.ఏడాది పాలనపై బీఆర్ఎస్ చార్జిషీట్ నేడుసాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన వైఫ ల్యాలపై ఆదివారం ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ చార్జిషీట్ విడుదల చేయనుంది. మాజీ మంత్రి హరీశ్ రావు, మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు, బీ ఆర్ఎస్ సీనియర్ నాయకులు కార్యక్రమంలో పాల్గొంటారు. ‘నమ్మించారు.. నట్టేట ముంచారు. ఏడాది కాంగ్రెస్ పాలన చూస్తే.. వంచనే తప్ప ఏ వర్గానికి జరిగిన మేలు లేదు.. అన్ని వర్గాలను విజయవంతంగా రోడ్డెక్కించారు’..అని బీఆర్ఎస్ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించింది. -
రేపు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ శాసనసభా పక్ష భేటీ
-
ఫోన్ చేసి అడుగుతారంట.. అసలు ఉంటేనే కదా!: వైఎస్ జగన్ (ఫొటోలు)
-
శ్రీకాకుళం జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమావేశం
-
కూటమిపై పోరాటానికి సిద్దమైన జగన్.. పార్టీ నేతలకు దిశానిర్దేశం
-
YSRCP ముఖ్య నేతలతో YS జగన్ మోహన్ రెడ్డి సమావేశం
-
నేడు మహారాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష సమావేశం
-
సంస్థాగత ఎన్నికలపై నేడు బీజేపీ రాష్ట్రస్థాయి వర్క్ షాప్
-
రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రానికి తూట్లు..
-
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గతి ఇదే.. వైఎస్ జగన్ (ఫోటోలు)
-
కష్టమొచ్చినప్పుడు నన్ను గుర్తు తెచ్చుకోండి: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: తాను మీ అందరినీ కోరేది ఒక్కటే.. మన పోరాట పటిమ సన్నగిల్లకూడదంటూ వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలకు ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ, ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కష్ట,నష్టాలుంటాయి. కష్టకాలంలో ఉన్నప్పుడే మనకు అదొక పరీక్ష. కష్టమొచ్చినప్పుడు అందరూ నన్ను గుర్తు తెచ్చుకోండి’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.‘‘16 నెలలు నన్ను జైల్లో పెట్టారు. బెయిల్ కూడా ఇవ్వలేదు. అయినా ప్రజల అండతో ముఖ్యమంత్రి అయ్యాను. ఈ సంక్రాంతి తర్వాత జిల్లాల్లో పర్యటిస్తా. ప్రతి బుధవారం, గురువారం జిల్లాల్లోనే ఉంటా. రెండు రోజుల పాటు కార్యకర్తలతో మమేకం అవుతా.. ‘కార్యకర్తలతో జగనన్న, పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం’ అనే పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తాం’’ అని వైఎస్ జగన్ వెల్లడించారు.‘‘ప్రతిపక్షంలో ఉంటూ రాష్ట్రంలోనూ, దేశంలోనూ కాంగ్రెస్‌తో యుద్ధం చేశాను. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దరూ నా మీద పిటిషన్లు వేశారు. ఇంత మందితో యుద్ధం చేస్తున్నా... నేను బెయిల్ పిటిషన్ వేసినప్పుడల్లా అన్న మాటేమిటంటే.. నేను బయటకు వస్తే ఇన్ప్లూయన్స్ చేస్తానని చెప్పేవారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ మీ ప్రభుత్వాలే అయినా నేను ప్రభావితం చేస్తానని బెయిల్ తిరస్కరించారు. ఇలా 16 నెలలు చేసారు. కానీ ఏమైంది.. ఆ తర్వాత బయటకు వచ్చి.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి పరిపాలన చేశాం.ఇదీ చదవండి: ఈ దెబ్బకు చంద్రబాబు సింగిల్ డిజిట్‌కు వెళ్లాల్సిందే: వైఎస్ జగన్..అలానే కష్టాలు ఎల్లకాలం ఉండవు. చీకటి తర్వాత పగలు రాక తప్పదు. ఇది సృష్టి నేర్పిన రహస్యం. కాబట్టి ఇది కచ్చితంగా గుర్తుపెట్టుకొండి. కష్టాల్లో ఉన్నప్పుడు పోరాటం చేయగలిగితే మనం తిరిగి నిలబడగలుగుతాం. కాలం గడిచే కొద్దీ ఈ భయాలు పోతాయి. మరో రెండు మూడు నెలల్లో అందరూ దైర్యంగా రోడ్డు మీదకు వస్తారు. అందరిలో ఈ ధైర్యం రావాలి. ఎందుకంటే ప్రజల తరపున, ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి. ప్రజా వ్యతిరేక పెరుగుతోంది. ప్రజల తరపున వారికి అండగా నిలవగలిగితే... ప్రజలు మనతో పాటు నడుస్తారు. మీరందరూ ఎంపీపీ, జడ్పీటీసీ వంటి మండలస్ధాయి నాయకులు.. మీరు ఇంకా ఎదగాలంటే.. ప్రతిపక్షంలో మీరు ఏ రకమైన పాత్ర పోషిస్తున్నారు అన్నదే నిర్ణయిస్తుంది.’’ అని వైఎస్ జగన్ చెప్పారు. -
జీ-20: మోదీ మెలోని భేటీ...
రియో డీ జెనీరో: బ్రెజిల్‌లోని రియో డీ జెనీరోలో జరుగుతున్న జీ-20 సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీలో ఇరువురు నేతలు వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంతోపాటు సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై చర్చించారు.సమావేశం అనంతరం ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఒక పోస్ట్ షేర్ చేశారు. ఈ పోస్ట్‌లో ఆయన పలు ఫోటోలను పంచుకుంటూ ఇలా రాశారు.. రియో డీ జెనీరో జీ- 20 సమ్మిట్ సందర్భంగా ప్రధాని జార్జియా మెలోనిని కలవడం చాలా ఆనందంగా ఉంది. మా చర్చలో ఇరు దేశాల రక్షణ, భద్రత, వాణిజ్యం, సాంకేతికత తదితర అంశాలలో సంబంధాలను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాం. దీనితో పాటు భారత్, ఇటలీ మధ్య స్నేహం గురించి కూడా చర్చించా మన్నారు. #WATCH | Prime Minister Narendra Modi and Italian Prime Minister Giorgia Meloni hold bilateral meeting on the sidelines of the 19th G-20 summit, Rio de Janeiro, Brazil(Source - DD News) pic.twitter.com/mVjOKkuJ4O— ANI (@ANI) November 18, 2024జీ-20 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ నార్వే ప్రధాన మంత్రి జోనాస్ గహర్ స్టోర్‌తో ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. అంతకుముందు ఇండోనేషియా, పోర్చుగల్ నేతలతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. వాణిజ్యం, రక్షణ వంటి రంగాల్లో ఇతర దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ప్రధాని మోదీ చర్చించారు.Glad to have met Prime Minister Giorgia Meloni on the sidelines of the Rio de Janeiro G20 Summit. Our talks centred around deepening ties in defence, security, trade and technology. We also talked about how to boost cooperation in culture, education and other such areas.… pic.twitter.com/BOUbBMeEov— Narendra Modi (@narendramodi) November 18, 2024భారత్-ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరింపజేస్తామని ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోకు ప్రధాని మోదీ హామీ ఇచ్చారని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ట్విట్టర్లో ఆయన ఇలా పేర్కొన్నారు. ‘ఇండియా-ఇండోనేషియా: 75 సంవత్సరాల స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తున్నాయి. జీ 20 బ్రెజిల్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంటోతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించారు’ అని తెలిపారు.ఇది కూడా చదవండి: భారత్ దౌత్య విజయం.. ఏకాభిప్రాయం అమలుకు చైనా సిద్ధం -
మీటింగ్‌కు రాలేదని 90 శాతం ఉద్యోగులను తొలగించిన సీఈఓ
సంస్థ నిర్వహించిన సమావేశానికి హాజరుకాలేదని.. దాదాపు ఉద్యోగులందరినీ సీఈఓ తొలగించిన ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెరికాకు చెందిన మ్యూజిక్ కంపెనీలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.ఉదయం ఉద్యోగులందరీ సమావేశానికి హాజరుకావాలని కంపెనీ సీఈఓ వెల్లడించారు. కానీ ఈ సమావేశానికి 99 మంది హాజరుకాలేదు. దీంతో కోపంతో ఊగిపోయిన సీఈఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వీరందరిని తొలగిస్తున్నట్లు ప్రకటించారు. నిజానికి ఆ కంపెనీలో పనిచేసే మొత్తం ఉద్యోగుల సంఖ్య 110 మంది మాత్రమే. 99 మందిని తీసేస్తూ సీఈఓ నిర్ణయం వల్ల ఆ సంస్థలో 11 మంది మాత్రమే మిగిలారు.ఉద్యోగులను తొలగించడం మాత్రమే కాకుండా.. కంపెనీకి సంబంధించిన వస్తువులు మీ దగ్గర ఏవైనా ఉంటే తిరిగి ఇచ్చేయండి. అన్ని అకౌంట్స్ నుంచి లాగ్ అవుట్ అవ్వండి అంటూ సీఈఓ పేర్కొన్నారు. సమావేశానికి హాజరుకాలేదనే కారణంతో జాబ్ నుంచి తొలగించిన సీఈఓపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పని పూర్తి చేయడంలో నిమగ్నం కావడం వల్లనే, సమావేశానికి హాజరు కాలేదని ఉద్యోగులు చెబుతున్నారు.ఇదీ చదవండి: భర్తకు తెలియకుండా చేసిన పని.. బెంజ్ కంపెనీ బతికేలా చేసిందిఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఒక్క సమావేశానికి హాజరు కాలేదని సుమారు 90 శాతం మందిని తొలగించడం ఎంతవరకు న్యాయం అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి కొందరు మిగిలిన 11 మంది ఉద్యోగులను సీఈఓ పీల్చి పిప్పి చేస్తాడు అని అన్నారు. ఇంకొందరు.. ఇలాన్ మస్క్ నుంచి ఆయన పాఠాలు నేర్చుకున్నట్లు చెప్పుకొచ్చారు. -
కాసేపట్లో YSRCP ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ భేటీ
-
ప్రశ్నిస్తామన్న భయంతో ప్రతిపక్షహోదా ఇవ్వలేదు: వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్సీలతో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సోమవారం(నవంబర్ 11) తాడేపల్లిలో భేటీ అయ్యారు. ఎమ్మెల్సీలు శాసనమండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఎమ్మెల్సీలను ఉద్దేశించి మాట్లాడారు.ప్రశ్నిస్తామన్న భయంతోనే వైఎస్సార్సీపీకి అసెంబ్లీలో ప్రతిపక్షహోదా ఇవ్వలేదన్నారు. అయినా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీలు ప్రభుత్వ విధానాలపై మండలి నుంచి నిలదీయాలని ఎమ్మెల్సీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు.ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ ఏమన్నారంటే..అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోరుతూ కోర్టులో పిటిషన్ వేశాం.కాని కౌంటర్‌కు స్పీకర్ సమాధానం ఇవ్వడంలేదు.అసెంబ్లీలో ఉన్న ఏకైక ప్రతిపక్షం మనమే.కాని ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ముందుకు రావడంలేదు: ప్రతిపక్ష హోదాను అంగీకరిస్తే, మాట్లాడడానికి అవకాశాలు ఇవ్వాల్సి వస్తుందని అధికారపక్షం అంగీకరించడంలేదు.ప్రతిపక్ష నాయకుడుకి హక్కుగా మైక్, సమయం లభిస్తుంది.అలా ఇవ్వాల్సి వస్తుందని, ప్రతిపక్ష పార్టీ ఒకటి ఉందని గుర్తించడానికి కూడా ముందుకు రావడంలేదు.40శాతం ఓట్ షేర్ సాధించిన పార్టీని ప్రతిపక్ష పార్టీగా గుర్తించడానికి ఇష్టపడని పరిస్థితులు కనిపిస్తున్నాయి.అందుకే ప్రతిరోజూ మీడియా ద్వారా ఎమ్మెల్యేలు,సీనియర్ నాయకులు మాట్లాడతారు.అసెంబ్లీలో ఏ మాదిరిగా ప్రశ్నలు వేస్తామో, అదేరీతిలో ఇక్కడ నుంచి అధికార పక్షాన్ని ప్రశ్నిస్తాం.పూర్తి వివరాలు ఆధారాలు, సాక్ష్యాలతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం.ఇవన్నీకూడా ప్రతి మండలి సభ్యుడికీ పంపిస్తాం.ఆధారాలు చూపిస్తూ..ప్రభుత్వాన్ని నిలదీయండి..ప్రశ్నించండి.మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదు.ప్రశ్నిస్తే..బుల్డోజ్ చేయాలని చూస్తున్నారు.అప్పుల విషయంలో ఎన్నికలకు ముందు వాళ్లు చేసిన ప్రచారం పచ్చి అబద్ధమని వాళ్లే బడ్జెట్ పత్రాల ద్వారా చెప్పారు.దీనిపై రాష్ట్ర ప్రజలకు సమగ్రవివరాలను ప్రెస్మీట్ద్వారా నేను వివరిస్తాను.చంద్రబాబు చెప్పేవన్నీ మోసం అని, అబద్ధం అని ఇప్పటికే తేలిపోయింది.ఈ ఆరునెలల కాలంలోనే చంద్రబాబు నైజాన్ని ప్రజలు గుర్తించారు.ఎవ్వరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు.కష్టాలు అనేవి శాశ్వతం కాదు .వ్యక్తిత్వాన్ని, విలువలను నిలబెట్టుకుంటూ ముందుకు సాగుదాం.కచ్చితంగా తిరిగి మనం అధికారంలోకి వస్తాం.జమిలి ఎన్నికలు లాంటి వార్తలు కూడా వింటున్నాం.వైఎస్సార్సీపీ సైనికులుగా మండలిలో ప్రభుత్వాన్ని ఎండగట్టాలి.ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపాలి.గట్టిగా ప్రశ్నిస్తే..కేసులు పెడతారన్న భయాందోళనలు అనవసరం.నేను మీకు అండగా ఉంటాను.నా వయసు చిన్నదే.మరో 30 ఏళ్లు రాజకీయాలను చూస్తాను.మనం అందరం కలిసి ప్రయాణం చేద్దాం.ఎప్పుడూ లేని విధంగా మనం సోషల్ ఇంజినీరింగ్ చేశాం.ఎక్కడాలేని మార్పులు తీసుకు వచ్చాం.కాలక్రమేణా మనం చేసిన పనుల ప్రాధాన్యతను తప్పకుండా గుర్తిస్తారు. ఇదీ చదవండి: ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ భేటీ -
పార్టీ ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ భేటీ
-
ఈనెల 5న గాంధీ ఐడియాలజీ సెంటర్ లో కులగణనపై సమావేశం
-
మరింత దగ్గరైన పాక్- రష్యా.. సైనికాధికారుల భేటీలో వెల్లడి
ఇస్లామాబాద్: పాకిస్తాన్, రష్యా సైనికాధికారులు సమావేశం ఆ ఇరు దేశాల సాన్నిహిత్యాన్ని మరింత దగ్గర చేసింది. ఈ సమావేశంలో భద్రత, రక్షణ రంగాల్లో తమ సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. రష్యా డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్ కల్నల్ జనరల్ అలెగ్జాండర్ వీ ఫోమిన్ పాకిస్తాన్ త్రివిధ దళాల అధిపతులతో విడివిడిగా సమావేశమై రక్షణ సంబంధాలను పెంపొందించే మార్గాలపై చర్చించారు.పాకిస్తాన్ ఆర్మీ మీడియా విభాగం 'ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్పీఆర్) విడుదల చేసిన ఒక ప్రకటనలోని వివరాల ప్రకారం ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌తో జరిగిన సమావేశంలో ప్రాంతీయ భద్రత, పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ఇరు పక్షాలు చర్చించుకున్నాయి. రష్యాతో సంప్రదాయ రక్షణ సంబంధాలను పటిష్టం చేసుకోవడంతో పాటు ఉమ్మడి సైనిక విన్యాసాలు, పీఏఎఫ్ పరికరాల కోసం సాంకేతిక మద్దతు ఇరుదేశాల మధ్య ఉంటుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.ఇదిలా ఉండగా బ్రిక్స్‌లో సభ్యదేశంగా మారేందుకు పాకిస్తాన్ తహతహలాడుతోంది. తమను బ్రిక్స్‌లో భాగం చేయాలని పాకిస్తాన్ రష్యాకు విజ్ఞప్తి చేసింది. గత ఏడాది బ్రిక్స్ సభ్యత్వం కోసం పాకిస్తాన్ దరఖాస్తు చేసుకున్నప్పటికీ కజాన్‌లో జరిగిన బ్రిక్స్ సమావేశానికి ఆహ్వానం రాకపోవడం గమనార్హం. భారత్ వ్యతిరేకత కారణంగా బ్రిక్స్‌లో పాకిస్తాన్‌కు సభ్యత్వం కల్పించలేదు.ఇది కూడా చదవండి: నేడు రికార్డుకు సిద్ధమవుతున్న దీపోత్సవం -
తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలివే..
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ శనివారం(అక్టోబర్ 26) సాయంత్రం సమావేశమైంది. కేబినెట్లో పలు కీలక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంది. ములుగులో సమ్మక్క సారలమ్మ వర్శిటీకి భూ కేటాయింపుతో పాటు హన్మకొండ, వరంగల్ జిల్లాల పరిధి పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ కీలక నిర్ణయాలు..మెట్రో రైలు మార్గాల విస్తరణకు కేబినెట్ గ్రీన్సిగ్నల్ఎల్బీనగర్ టు శంషాబాద్ ఎయిర్‌పోర్టు, నాగోల్ టు ఎల్బీనగర్, ఎల్బీనగర్ టు హయత్‌నగర్ పొడిగింపుఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేందద్రాల ఏర్పాటునకు ఆమోదంఉస్మానియా ఆస్పత్రి పునర్నిర్మాణానికి గోషామహల్ గ్రౌండ్స్ భూమి బదలాయింపుకొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు గ్రామ పంచాయతీ మున్సిపాలిటీగా అప్గ్రేడ్రేరాలో 54 పోస్టుల భర్తీకి నిర్ణయంములుగులో సమ్మక్కసారక్క గిరిజన యూనివర్సిటీ నిర్ణయానికి భూ కేటాయింపులుఎకరా రూ.250 చొప్పున భూమి కేటాయింపు టీచర్ పోస్టుల రేషనలైజేషన్‌కు నిర్ణయంఇదీ చదవండి: ఆ నిర్మాణాలపై ‘హైడ్రా’ కొరడా తప్పదు: భట్టి -
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని.. ప్రభుత్వానికి సహకరించాలంటూ ఉద్యోగులను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. గురువారం.. ఉద్యోగ సంఘాలతో సమావేశమైన సీఎం.. ఆర్థికేతర అంశాలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామన్నారు. సబ్ కమిటీ ఛైర్మన్‌గా భట్టి విక్రమార్క.. శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా ఉద్యోగుల సమస్యలపై త్వరలో సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. రేపు సాయంత్రంలోపు డీఏలపై స్పష్టత ఇస్తామని రేవంత్ తెలిపారు.భేటీ అనంతరం జేఏసీ సెక్రెటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ, 51 డిమాండ్లపై సీఎం మాతో చర్చించారని.. 11 ఏళ్ల తర్వాత మంచి చర్చలు జరిగాయన్నారు. గతంలో ఇలాంటి చర్చలు జరగలేదన్నారు. 317 జీవో, హెల్త్ కార్డులు, డీఏలు, పీఆర్సీ, సీపీఎస విధానంప కూడా చర్చించినట్లు ఆయన తెలిపారు. దీపావళి తర్వాత కేబ్‌నెట్ సబ్ కమిటీ 51 సమస్యలపై చర్చిస్తుందని తెలిపారు.ఇదీ చదవండి: ఖబడ్దార్ రేవంత్.. కాంగ్రెస్ కార్యకర్త పేరుతో పోస్టర్ కలకలం -
వచ్చే నెలలో చర్లపల్లి రైల్వేస్టేషన్ ప్రారంభం: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ, కర్ణాటక ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే అధికారుల భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎంపీలు సురేష్ రెడ్డి, కావ్య, రఘునందన్, డీకే అరుణ పాల్గొన్నారు. నియోజకవర్గాల వారీగా రైల్వే అభివృద్ధిపై చర్చించారు. రైళ్ల హోల్డింగ్, కొత్త రైల్వే లైన్లతో పాటు అండర్ పాసులు, బ్రిడ్జిల నిర్మాణంపై చర్చ జరిగింది.ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యానికి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 90 శాతం రైల్వేలైన్ల విద్యుదీకరణ ప్రక్రియను పూర్తి చేసేలా ముందుకెళ్తున్నామని.. 40 రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేస్తామన్నారు. వరంగల్‌లో రూ.650 కోట్లతో రైల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు.గతంలో ఎన్నడూ లేని విధంగా దక్షిణ మధ్య రైల్వేకు బడ్జెట్లో కేటాయింపులు పెంచాం. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 5 వందే భారత్ రైళ్లు ఉన్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని వందే భారత్ రైళ్లు తీసుకొస్తాం. రూ.720 కోట్లతో సికింద్రబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు వేగవంతగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పనులు పూర్తవుతాయి. రూ. 430 కోట్లతో చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తాం. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ సేవలు పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు మరో రూ.650 కోట్లు కావాల్సి ఉంటుందని కిషన్‌రెడ్డి వెల్లడించారు.జంట నగరాల నుంచి యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి ఆలయ దర్శనానికి వెళ్లే భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఎంఎంటీస్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు 800 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. రైల్వే అభివృద్ధి పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం వెనుకడుగు వేసి, చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం సహకరించకపోయినా ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ కింద సర్వీసును పొడిగిస్తున్నాం. మొత్తం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రూ.33 వేల కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది రైల్వే పనుల కోసం సుమారు 6 వేల కోట్లు బడ్జెట్ మంజూరు అయింది’’ అని కిషన్‌రెడ్డి తెలిపారు. -
బ్రిక్స్ సదస్సు: రష్యాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం
కజాన్: బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేడు (మంగళవారం) రష్యాలోని కజాన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయానికి భారీగా తరలి వచ్చిన ప్రజలు ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. రష్యా అధ్యక్షతన 16వ బ్రిక్స్ సదస్సును నేడు రేపు(అక్టోబర్ 22, 23) నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు రష్యాలోని కజాన్ నగరం వేదికగా మారింది. ఈ సంద్భంగా ప్రధాని మోదీ బ్రిక్స్ దేశాల అధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. దీంతో పాటు పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొననున్నారు. #WATCH | Prime Minister Narendra Modi receives a warm welcome as he lands in Kazan, Russia. He is here to attend the 16th BRICS Summit, being held under the Chairmanship of Russia. The Prime Minister is also expected to hold bilateral meetings with his counterparts from BRICS… pic.twitter.com/ATyEIRSXZa— ANI (@ANI) October 22, 2024రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ రష్యాలో పర్యటిస్తున్నారు. ఆతిథ్య రష్యా అధ్యక్షతన 16వ బ్రిక్స్ సదస్సు జరుగుతోంది. 16వ బ్రిక్స్ సదస్సులో ‘సమాన రీతిలో ప్రపంచ అభివృద్ధి’ అనే అంశంపై చర్చ జరగనుంది. కాగా ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ల మధ్య ద్వైపాక్షిక సమావేశం కూడా జరగవచ్చని తెలుస్తోంది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ బ్రిక్స్ వ్యవస్థాపక సభ్యులతో పాటు కొత్త సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. అక్టోబరు 22న తొలిరోజు సాయంత్రం నేతలకు విందు ఉంటుందన్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో 23న క్లోజ్డ్ ప్లీనరీ, ఓపెన్ ప్లీనరీ సెషన్ ఉంటుందని తెలిపారు.ఇది కూడా చదవండి: ఈజీగా విదేశీ భాష, క్రేజీగా కొరియన్ నేర్చుకుందామా! -
పార్టీ వేడుకలతో సర్కార్‌కు మావోయిస్టుల సవాల్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఇటీవల జరి గిన వరుస ఎన్కౌంటర్ల కారణంగా మావోయిస్టు ల పని అయిపోయిందనే అభిప్రాయం రోజురో జుకూ బలపడుతున్న సమయంలో ఛత్తీస్ గఢ్లోని బస్తర్ అడవుల్లో పార్టీ ఆవిర్భావ వేడుక లను ఘనంగా నిర్వహించి మావోయిస్టులు మరోసారి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఈ వేడుకల వీడియోలు గురు, శుక్రవారాల్లో ప్రధాన, సోషల్ మీడియాల్లో ప్రత్యక్షమ య్యాయి. బస్తర్ అడవుల్లో గుర్తుతెలియని ప్రాంతంలో జరిగిన ఈ వేడుకల్లో వేలాదిగా ఆదివాసీ ప్రజలు, వందల సంఖ్యలో సాయుధులు పాల్గొ న్నట్టుగా స్పష్టమవుతోంది. చనిపోయిన మావో యిస్టులను స్మరిస్తూ.. పాటలు పాడుతూ స్తూపా ల దగ్గర కవాతు చేస్తూ మావోయిస్టులు, వారి సానుభూతిపరులు ఈ వీడియోల్లో కనిపించారు. ఆపరేషన్ కగార్ మొదలయ్యాక అబూజ్మడ్ అడవుల్లో తుల్తులీ ఎన్కౌంటర్ తర్వాత మావో యిస్టులకంటూ సురక్షిత ప్రాంతం లేదనే అభిప్రా యం బలంగా ఏర్పడింది. అయితే వేలాది మంది ఒక చోట గుమిగూడి ఆటలు ఆడుతూ.. పాటలు పాడుతూ, డోలు వాయిద్యాలు ఉపయోగిస్తూ వేడుకలు చేసుకోవడం, వేడుకల వీడియోలు బయటకు విడుదల చేయడం చూస్తూంటే ఇప్పటికీ అబూజ్మడ్, దండకారణ్యం ప్రాంతంలో మావోయిస్టులకు గట్టి పట్టు ఉందనే అంశం స్పష్టమవుతోంది. అయితే ప్రాంతం, తేదీ తదితర వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా లేకపోవడంతో పాత వీడియోనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు ఈ వీడియోలపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. -
వర్క్ షాప్ సక్సెస్ తో మరింత జోష్ లో వైఎస్సార్సీపీ
-
ఇవాళ పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమావేశం
-
రతన్ టాటాతో చివరి మీటింగ్ గుర్తు చేసుకున్న గూగుల్ సీఈఓ
ముంబై: ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా తన 86వ ఏట కన్నుమూశారు. ఆయన మృతిపై పారిశ్రామికవేత్తలతో పాటు పలువురు రాజకీయ నేతలు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు నివాళులు అర్పించిన వారిలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా ఉన్నారు.భారతీయ సంతతికి చెందిన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వ్యాపార దిగ్గజం రతన్ టాటాతో తన చివరి సమావేశాన్ని గుర్తు చేసుకున్నారు. గూగుల్‌లో రతన్ టాటాతో తమ చివరి సమావేశంలో తాము అనేక అంశాలపై చర్చించామని సుందర్ పిచాయ్ తెలిపారు. ఆయన విజన్ చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఆయన తన దాతృత్వ విలువలను మనకు అందించారు. మన దేశంలో ఆధునిక వ్యాపార నాయకత్వానికి మార్గదర్శకత్వం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పిచాయ్ ఎక్స్ వేదికగా ఒక పోస్టులో పేర్కొన్నారు.భారతదేశాన్ని అభివృద్ధిపథంలో నడపడంలో టాటా ఎంతో శ్రద్ధ వహించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. రతన్ జీ.. మీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని వేడుకుంటున్నాను అంటూ సుందర్ పిచాయ్ ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించారు. టాటా గ్రూప్‌నకు రతన్ టాటా 20 ఏళ్లు ఛైర్మన్‌గా ఉన్నారు. ఆయన ముంబైలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ మీడియాకు ఈ విషయాన్ని తెలిపారు.ఇది కూడా చదవండి: రతన్ టాటా..రతనాల మాటలు -
తాడేపల్లిలో మంగళగిరి వైఎస్సార్సీపీ నేతలతో వైఎస్ జగన్ సమావేశం (ఫొటోలు)
-
మొత్తం చెరువులెన్ని.. ఎన్ని మిగిలాయి?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహా నగరం పరిధిలో మొత్తంగా ఎన్ని చెరువులు ఉండేవి? ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి? ఎంత మేర ఆక్రమణలకు గురయ్యాయి? అనే లెక్కలను శాస్త్రీయంగా తేల్చాలని ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)’నిర్ణయించింది. దీని కోసం సర్వే ఆఫ్ ఇండియా సహకారం తీసుకోనుంది. ఈ మేరకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, ఇతర అధికారులు మంగళవారం హబ్సిగూడలో ఉన్న సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయానికి వెళ్లారు.సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ బీసీ పరీడా, సూపరింటెండెంట్ ఆఫ్ సర్వే దేబబ్రత పాలిత్తోపాటు ఇతర అధికారులతో సమావేశమై చర్చించారు. సర్వే ఆఫ్ ఇండియా గతంలో రూపొందించిన మ్యాప్‌లను రంగనాథ్ పరిశీలించారు. 1971–72 నాటి సర్వే ప్రకారం నగరంలో ఎన్ని చెరువులు ఉన్నాయి? అప్పట్లో వాటి విస్తీర్ణం ఎంత? నాలాలు ఎక్కడెక్కడ, ఎంత విస్తీర్ణంలో ఉండేవి? తదితర విషయాలు పరిశీలించారు. తాజా మ్యాప్‌లతో వాటిని సరిపోల్చి చూశారు. ఈ అంశాలను సర్వే ఆఫ్ ఇండియా అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా హైడ్రా బృందానికి వివరించారు. పూర్తి వివరాలతో నివేదిక రూపకల్పనపై దృష్టి చెరువుల ఫుల్ ట్యాంక్ లెవల్, మాగ్జిమమ్ వాటర్ స్ప్రెడ్ ఏరియాలను గుర్తించడానికి, తాజాగా నిర్థారించడానికి ఇప్పటికే హెచ్ఎండీఏ, ఇరిగేషన్, జీహెచ్‌ఎంసీలతో కలిసి ముందుకు వెళ్తున్న హైడ్రా.. ఇప్పటికే ఆయా విభాగాల నుంచి సమాచారం సేకరించింది. ఆ డేటాను సర్వే ఆఫ్ ఇండియా డేటాతో క్రోడీకరించనుంది. మంగళవారం సర్వే ఆఫ్ ఇండియా అందించిన వివరాలతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోని చెరువుల పరిస్థితిపై సమగ్ర నివేదిక తయారు చేయాలని నిర్ణయించింది. సర్వే ఆఫ్ ఇండియా డేటాను డిజిటలైజ్ చేయడంతోపాటు చెరువుల విస్తీర్ణం, నాలాల పొడవు, వెడల్పులను నిర్ధారించి ఈ నివేదికలో పొందుపర్చనుంది. నివేదికకు తుదిరూపు ఇచ్చాక తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనుంది. ప్రాధాన్యత క్రమంలో చెరువులను గుర్తించి పునరుద్ధరించడంపై దృష్టి పెట్టాలని భావిస్తున్నట్టు హైడ్రా అధికారులు తెలిపారు. -
అమిత్ షా అధ్యతన వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సమావేశం
-
నెల్లూరులో వైఎస్సార్సీపీ జెండా ఎగరేస్తాం..
-
వైఎస్సార్సీపీ ముఖ్యనేతలతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ ముఖ్య నేతలతో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. సుప్రీంకోర్టు తీర్పుపై నేతలతో ఆయన చర్చిస్తున్నారు. సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, కన్నబాబు సహా పలువురు నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. స్వతంత్ర సంస్థతో విచారణ జరపాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై సమాలోచనలు జరిపారు.తిరుమల లడ్డూ కేసులో చంద్రబాబుకు సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. తిరుమల లడ్డూ వివాదంపై దాఖలైన పిటిషన్లపై నేడు(శుక్రవారం) విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో స్వతంత్ర సిట్‌ను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు సర్కార్ ఏర్పాటు చేసిన సిట్‌ను రద్దు చేసింది.ఇదీ చదవండి: చంద్రబాబుకు సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ -
సభా వేదికపై ఖర్గేకు అస్వస్థత
జమ్మూ:కాంగ్రెస్‌పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే వేదికపైనే అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం(సెప్టెంబర్29) జమ్మూకాశ్మీర్‌లోని కతువా జిల్లాలో ఎన్నికల సభలో ప్రసంగిస్తుండగా ఆయన కళ్లుతిరిగి కిందపడబోయారు.దీంతో అక్కడున్న నేతలు వెంటనే ఖర్గేను పడకుండా పట్టుకున్నారు.తర్వాత ఆయనకు నీళ్లందించారు. అనంతరం ఖర్గే తన ప్రరసంగాన్ని కొనసాగించారు.ప్రసంగిస్తుండగా పార్టీ నేతలు ఆయనను పట్టుకొని నిల్చున్నారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను తిరిగి తీసుకువస్తామన్నారు. ఇందుకోసం పోరాడుతూనే ఉంటామని తెలిపారు. తాను అప్పుడే చనిపోనని,మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు అలసిపోనని సవాల్ చేశారు.అయితే ఖర్గే వేదికపైనుంచి కిందపడబోయిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.కాగా,జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగిసింది. మూడో విడత పోలింగ్ సోమవారం జరగనుంది. ఇక్కడ మొత్తం 5 విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు.ఇదీచదవండి: పదేళ్ల మన్‌కీ బాత్‌లో ప్రధాని భావోద్వేగం -
YSRCP నేతలతో వైఎస్ జగన్ సమావేశం
-
3 జిల్లాల నేతలతో వైఎస్ జగన్ సమావేశం
-
వైఎస్ జగన్ దిశానిర్దేశం
-
నేడు 3 జిల్లాల నేతలతో వైఎస్ జగన్ సమావేశం
-
ఉక్రెయిన్‌లో శాంతి నెలకొనాలి
న్యూయార్క్: ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సంఘర్షణపై, సాధారణ ప్రజల మరణాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ సాధ్యమైనంత త్వరగా యుద్ధం ముగిసిపోవాలని, శాంతియుత పరిస్థితులు నెలకొనాలని ఆకాంక్షించారు. అమెరికాలోని న్యూయార్క్‌లో స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మోదీ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై మూడు గంటలకుపైగా చర్చించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రధానంగా ఉక్రెయిన్‌లో సంక్షోభానికి త్వరగా తెరపడేలా తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. చక్కటి పరిష్కార మార్గం కోసం అంకితభావంతో ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఉక్రెయిన్ విజ్ఞప్తితోనే మోదీ–జెలెన్స్కీ మధ్య ఈ సమావేశం జరిగిందని అధికార వర్గాలు వెల్లడించాయి. జెలెన్స్కీతో భేటీ అనంతరం మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. భారత్–ఉక్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావడమే లక్ష్యంగా గత నెలలో జరిగిన పర్యటనలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడంలో చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నామని వివరించారు.ఉక్రెయిన్‌లో సంక్షోభానికి తెరపడి, శాంతి, స్థిరత్వం నెలకొనాలని కోరుకుంటున్నామని, అందుకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. సమస్యలకు యుద్ధం పరిష్కారం కాదని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. శాంతి కోసం దౌత్య మార్గాల్లో ప్రయత్నించాలన్నారు. ఉక్రెయిన్–రష్యా మధ్య శాంతి చర్చలు జరగాలని సూచించారు. తమ దేశ సార్వ¿ౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన ప్రధాని మోదీకి ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆర్మేనియా ప్రధానితో భేటీ ప్రధాని నరేంద్ర మోదీ న్యూయార్క్‌లో ఆర్మేని యా ప్రధానమంత్రి నికోల్ పాషిన్యాన్‌తో భేటీ అయ్యారు. భారత్– ఆర్మేనియా మధ్య సంబంధాలపై చర్చించారు. నికోల్తో అద్భుతమైన చర్చ జరిగిందని మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. అలాగే వియత్నాం అధ్యక్షుడు టో లామ్‌ను సైతం మోదీ కలుసుకున్నారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. సిక్కులతో మోదీ సమావేశం ప్రధాని మోదీ న్యూయార్క్‌లో పలువురు సిక్కు పెద్దలతో సమావేశమయ్యారు. భారత్ లో సిక్కు సామాజిక వర్గం అభ్యున్నతికోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారంటూ మోదీకి సిక్కులు కృతజ్ఞతలు తెలిపారు. ముగిసిన మూడు రోజుల పర్యటన ప్రధానమంత్రి మోదీ మూడు రోజుల అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసింది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం న్యూయార్క్ నుంచి భారత్‌కు తిరుగుపయనమయ్యారు. పశ్చిమాసియాలో కాల్పుల విరమణ పాటించాలి: మోదీపశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతుండడం, పెద్ద సంఖ్యలో జనం మరణిస్తుండడం పట్ల ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. ఆయన న్యూయార్క్‌లో పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్‌తో భేటీ అయ్యారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు తెరపడాలని, అన్ని పక్షాలు తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని చెప్పారు. చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయాలని హమాస్‌కు మోదీ విజ్ఞప్తి చేశారు. ఇజ్రాయెల్–పాలస్తీనా మధ్య శాంతికి చర్చలే మార్గమని పునరుద్ఘాటించారు. -
లక్షల కోట్ల కంపెనీ.. మీటింగ్‌లో ఓ ఖాళీ కుర్చీ: ఎందుకంటే..
1994లో జెఫ్ బెజోస్ సీటెల్ గ్యారేజీలో స్థాపించిన ఒక చిన్న ఆన్లైన్ బుక్ స్టోర్ నేడు ట్రిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించింది. ఆ సంస్థ పేరే 'అమెజాన్'. లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యంగా ఎదిగిన అమెజాన్.. సమావేశాల్లో ఎప్పుడూ ఓ కుర్చీ ఖాళీగానే ఉంటుంది. ఇంతకీ మీటింగులో ఖాళీ కుర్చీ ఎందుకు ఉంటుంది. దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.బిలినీయర్ జెఫ్ బెజోస్ నిర్వహించే ప్రతి సమావేశంలోనూ కనిపించే ఖాళీ కుర్చీ కస్టమర్లను గుర్తుకు తెస్తుంది. సమావేశంలో తీసుకునే నిర్ణయాలు కస్టమర్లను దృష్టిలో ఉంచుకునే తీసుకోవడం జరుగుతుంది. కంపెనీ తన మొదటి ప్రాధాన్యతను కస్టమర్లకు ఇస్తున్నట్లు చెప్పడానికే అమెజాన్ కంపెనీ ఆ ఖాళీ కుర్చీని ఉంచుతుంది.ఇక్కడ తెలుసుకోవలసిన మరో విషయం ఏమిటంటే.. అమెజాన్ కంపెనీ నిర్వహించే సమావేశాల్లో కేవలం ఆరు నుంచి ఎనిమిది మంది సభ్యులు మాత్రమే ఉంటారు. సమావేశంలో ఎక్కువమంది సభ్యులు ఉంటే సరైన నిర్ణయాలు తీసుకోవడం కష్టమని కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.ఇదీ చదవండి: 'రిటర్న్ టు ఆఫీస్.. ఇదో పెద్ద ప్లాన్': మాజీ ఉద్యోగి ఫైర్దిగ్గజ కంపెనీలలో ఒకటిగా ఎదిగిన అమెజాన్ సంస్థలో నిర్వహించే సమావేశాలలో ఇప్పటికి కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నిషేధమే. సమావేశంలో పాల్గొనేవారు ఖచ్చితంగా తమ ప్రెజెంటేషన్లను పాయింట్ల రూపంలో లేదా మెమోల రూపంలో సమర్పించాల్సిందే. బహుశా ఇలాంటి విధానాన్ని పాటిస్తున్న పెద్ద కంపెనీ అమెజాన్ అనే చెప్పాలి. -
తిరువూరు వైఎస్సార్ సీపీ విస్తృత స్థాయి సమావేశం..
-
‘విద్యుత్’కు రోల్‌మోడల్‌గా రాష్ట్రం
సాక్షి, పెద్దపల్లి: విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ విషయంలో తెలంగాణను దేశంలోనే రోల్‌మోడల్‌గా నిలుపుతామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. 2030 నాటికి ఉండే డిమాండ్‌ను అంచనా వేస్తూ అందుకు అనుగుణంగా గ్రీన్ పవర్, సోలార్ పవర్, ఫ్లోటింగ్ సోలార్, పంప్డ్ స్టోరేజీ తదితర రంగాల్లో దాదాపు 20 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. శనివారం పెద్దపల్లి జిల్లా ధర్మారం, పెద్దపల్లిలో ఐటీ శాఖమంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి భట్టి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.అనంతరం నిర్వహించిన బహిరంగ సభల్లో భట్టి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా పైలట్ ప్రాజెక్టు కింద 30 గ్రామాలను ఎంపిక చేసి, అక్కడ వ్యవసాయ మోటార్లకు పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో సోలార్ పంపుసెట్లను ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. తద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును రైతులు వ్యవసాయ రంగానికి ఉపయోగించుకోవడంతో పాటు మిగిలిన విద్యుత్తును గ్రిడ్‌కు అనుసంధానం చేయడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవచ్చని చెప్పారు. ఇందులో భాగంగా నందిమేడారం గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున సోలార్ పవర్ప్లాంట్లను మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. పెద్దపల్లి జిల్లాలోని కాచాపూర్ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని, అక్కడ అందుబాటులో ఉన్న 12 ఎకరాలు సేకరించి సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షను డిప్యూటీ సీఎం ఆదేశించారు.రామగుండంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందని, త్వరలోనే భూమిపూజ చేస్తామని తెలిపారు. దశాబ్దానికి పైగా పెండింగ్‌లో ఉన్న ఎల్లంపల్లి నిర్వాసితుల సమస్య పరిష్కారానికి ప్రజాప్రభుత్వం పరిష్కారం చూపించి, వారి ఖాతాల్లో రూ.18 కోట్లు జమ చేయడం సంతోషంగా ఉందన్నారు. పదేళ్లలో రూ.లక్ష రుణమాఫీ చేయలేని బీఆర్ఎస్ నేతలు.. రుణమాఫీపై మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉందని విమర్శించారు. ఎమ్మెల్యేలు బజారున పడటం బాధ కలిగించింది ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, అరికెపూడి గాంధీ వ్యవహారంపై మీడియా ప్రశ్నలకు స్పందిస్తూ.. బాధ్యతగల ఎమ్మెల్యేలు బజారునపడి కొట్లాడుకోవడం బాధ కలిగించిందని భట్టి అన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేల తగాదా వెనుక కాంగ్రెస్ పెద్ద తలకాయ ఉందని బీజేపీ ఆరోపించడం అర్థరహితమని పేర్కొన్నారు. కాగా ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్టుకుంటే కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు. ప్రభుత్వంపై అడ్డగోలుగా మాట్లాడుతూ ప్రతి అంశాన్ని బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని విమర్శించారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు విజయరమణరావు, మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
20న తెలంగాణ కేబినెట్ భేటీ.. వీటిపైనే చర్చ!
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 20న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. సచివాలయంలో సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ భేటీ జరగనుంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేబినెట్ చర్చించనుంది.వరద నష్టం గురించి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. వ్యవసాయ కమిషన్‌కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఆర్వోఆర్ చట్టం రద్దు చేయనున్నట్లు సమాచారం. పేదలందరికీ ఆరోగ్య బీమా, భూమాత పోర్టల్, కొత్త రేషన్ కార్డు మార్గదర్శకాలు, విద్యా కమిషన్, 200 కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనున్నట్లు తెలిసింది.ఇదీ చదవండి: మాజీ సీఎస్ సోమేష్‌కుమార్‌కు సీఐడీ నోటీసులు -
నేడు హైదరాబాద్ లో BJLP సమావేశం
-
జియో యూజర్లకు శుభవార్త!.. అంబానీ అదిరిపోయే గిఫ్ట్
'రిలయన్స్ యాన్యువల్ జనరల్ మీటింగ్' (AGM) ప్రారంభమైంది. ఇందులో ముకేశ్ అంబానీ మాట్లాడుతూ.. రిలయన్స్ ఇండస్ట్రీస్ తన ఈక్విటీ షేర్‌హోల్డర్‌కు 1:1 బోనస్ ఇష్యూను పరిశీలించడానికి 2024 సెప్టెంబర్ 5న తన డైరెక్టర్ల బోర్డుతో సమావేశం కానుందని వెల్లడించారు. ఇందులో జియో ఏఐ క్లౌడ్ ఆఫర్ గురించి కూడా ప్రస్తావించారు.100 జీబీ ఫ్రీ47వ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియో ఏఐ క్లౌడ్ ఆఫర్ ప్రకటించారు. ఈ ఆఫర్ ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉందని షేర్హోల్డర్లను ఉద్దేశించి రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ అన్నారు. ఈ రోజు జియో వినియోగదారులు 100 జీబీ వరకు ఫ్రీ క్లౌడ్ స్టోరేజిని పొందుతారని ఆయన ప్రకటించారు.ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు, అన్ని ఇతర డిజిటల్ కంటెంట్, డేటాను సురక్షితంగా నిల్వ చేయడానికి & యాక్సెస్ చేయడానికి జియో ఏఐ క్లౌడ్ వెల్కమ్ని ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాము. వచ్చే దీపావళి నుంచి ఇది అందుబాటులోకి రానున్నట్లు పేర్కొన్నారు.#WATCH | Addressing the shareholders during the 47th Annual General Meeting, Reliance Industries Chairman Mukesh Ambani says, "I am thrilled to announce the Jio AI-Cloud Welcome offer. Today, I am announcing that Jio users will get up to 100 GB of free cloud storage, to securely… pic.twitter.com/80RnNxePI7— ANI (@ANI) August 29, 20241:1 బోనస్ ఇష్యూసెప్టెంబర్ 5న జరగబోయే సమావేశంలో 1:1 బోనస్ ఇష్యూ ప్రతిపాదన ఆమోదించబడితే.. పెట్టుబడిదారుడు ప్రతి షేరుకు అదనపు వాటాను పొందే అవకాశం ఉంటుంది.డైరెక్టర్ల బోర్డు 1:1 బోనస్ ఇష్యూను ప్రతిపాదిస్తే.. కంపెనీ నిల్వలను క్యాపిటలైజ్ చేయడం ద్వారా నిధులు సమకూరుస్తాయి. 1:1 బోనస్ ఇష్యూ అనేది ఇప్పటికే ఉన్న షేర్హోల్డర్లు కలిగి ఉన్న షేర్ల సంఖ్యను పెంచడం ద్వారా రివార్డ్ చేయడానికి ఒక మార్గంగా పరిగణించబడుతుంది. ఇది ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా వారి షేర్లను సమర్థవంతంగా రెట్టింపు చేస్తుంది. బోనస్ ఇష్యూలు కంపెనీ తన భవిష్యత్తు అవకాశాలపై మరియు బలమైన ఆర్థిక స్థితిపై విశ్వాసాన్ని ప్రతిబింబిస్తాయి. -
విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీ, కార్మిక సంఘాల నేతల మధ్య సమావేశం
-
హాయ్, నేను సీజేఐని... క్యాబ్‌కు రూ.500 పంపండి!
న్యూఢిల్లీ: సైబర్ నేరగాళ్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా వదలడం లేదు. సీజేఐ పేరిట ఒక వ్యక్తిని రూ.500 అడిగారు! సదరు స్కామర్ తనను తాను సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్‌గా చెప్పుకున్నాడు. ‘‘హలో! నేను సీజేఐని. కొలీజియం అత్యవసర భేటీకి వెళ్లాల్సి ఉంది. కన్నాట్ ప్లేస్‌లో చిక్కుకున్నాను. క్యాబ్ కోసం రూ.500 పంపగలరా! కోర్టుకు చేరగానే తిరిగి పంపిస్తా’’ అంటూ మెసేజ్ చేశాడు. అది నిజమైందేనని నమ్మించడానికి ఐ పాడ్ నుంచి పంపుతున్నట్టు కూడా చెప్పుకొచ్చాడు. అయితే దాన్నిండా స్పెల్లింగ్, వ్యాకరణ దోషాలే ఉండటం విశేషం! ఈ నకిలీ మెసేజ్ వైరల్‌గా మారింది. దాన్ని కైలాశ్ మేఘ్వాల్ అనే వ్యక్తి ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘ఫ్రెండ్స్, ఏం చేద్దాం మరి!’ అంటూ కామెంట్ చేశారు. ఈ వైరల్ పోస్టును సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. సీజేఐ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్స్‌కు ఫిర్యాదు చేసింది. -
వైఎస్ఆర్ సీపీ నేతలతో వైఎస్ జగన్ సమావేశం
-
టార్గెట్ 2036.. ఒలింపిక్స్ విజేతలకు మోదీ భరోసా
-
యలమంచిలి, భీమిలి నియోజకవర్గాల ప్రజాప్రతినిధులతో YS జగన్ భేటీ
-
వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ
-
కాంగ్రెస్ కీలక సమావేశం..
-
ముగిసిన కాంగ్రెస్ హైకమాండ్ కీలక భేటీ
సాక్షి,న్యూఢిల్లీ: కాంగ్రెస్ బలోపేతంపై పార్టీ హైకమాండ్ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా మంగళవారం(ఆగస్టు13) ఉదయం అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులతో పార్టీ అగ్రనేతలు భేటీ అయ్యారు. సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీచీఫ్ మల్లికార్జున ఖర్గే , ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ పాల్గొని పీసీసీ చీఫ్‌లకు దిశానిర్దేశం చేశారు. రానున్న ఎన్నికలకు కాంగ్రెస్‌ను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే అంశంపై ఈ సమావేశంలో చర్చించారు. రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి జరుగుతున్న సమావేశం ఇదే. -
పీసీసీ చీఫ్‌ల భేటీ.. సీఎం రేవంత్ ప్లేస్‌లో ఢిల్లీకి మంత్రి ఉత్తమ్
సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం(ఆగస్టు12) ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. పర్యటనలో భాగంగా నేషనల్డ్యామ్సేఫ్టీఅథారిటీ(ఎన్డీఎస్ఏ) ఛైర్మన్‌ను ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భేటీ అవనున్నారు.మంగళవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే అధ్యక్షతన జరగనున్న అన్ని రాష్ట్రాల కాంగ్రెస్(పీసీసీ) అధ్యక్షుల భేటీలో ఉత్తమ్ పాల్గొననున్నారు. సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నందున ఆయనకు బదులు సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొంటారు. -
రెండో రోజు వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ
-
చంద్రబాబులా కాదు.. విలువలున్న రాజకీయాలే చేశా: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్మోహన్రెడ్డి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అరకు, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులతో బుధవారం ఆయన భేటీ అయ్యారు.‘‘ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తిరుగులేని మెజార్టీలు సాధించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి తగిన సంఖ్య బలం లేదు. నైతికలు విలువలు పాటిస్తే గనుక ఆ పార్టీ పోటీ పెట్టకూడదు. గెలిచినవారంతా ఆయా పార్టీల గుర్తుల మీద గెలిచినవారు. మీ జగన్ ముఖ్యమంత్రిగా ఉండింటే… విలువలు పాటిస్తూ పోటీకి పెట్టేవారం కాదు’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.నైతికత ఉంటే..:పాడేరు, అరకు నియోజకవర్గాల నుంచి నుంచి మన పార్టీ తరపున ఎన్నికైన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు అంతా ఇవాళ ఇక్కడ సమావేశమయ్యాం. మామూలుగా అయితే ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలో తెలుగుదేశం పార్టీతో పాటు నైతిక విలువులు ఉన్న ఏ పార్టీ అయినా పోటీ పెట్టకూడదు. కారణం ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల్లో 600కు పైగా స్థానాల్లో మనం గెలిస్తే.. టీడీపీ వాళ్లు కేవలం 200కు పైగా స్థానాల్లోనే గెల్చారు. వారికి, మనకు దాదాపుగా 387 స్ధానాల తేడా ఉంది. అదే మనం అయితే..:గెలిచిన వాళ్లు అంతా మన పార్టీ గుర్తు, జెండా మీద గెలిచారు. అలాంటి పరిస్థితుల్లో మెజారిటీ లేనప్పుడు ఎవరైనా పోటీ పెట్టకూడదు. మీ జగనే ఈరోజు ముఖ్యమంత్రి స్ధానంలో ఉండి ఉంటే.. వాళ్లకు అక్కడ మెజారిటీ ఉండి ఉంటే, మనం పోటీ కూడా పెట్టి ఉండేవాళ్లం కాదు. వేరే పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్లకు.. ప్రజలు ఆ పార్టీ గుర్తును చూసి వారికి ఓట్లేసి గెలిపిస్తే.. మనం ముఖ్యమంత్రిగా ఉన్నాం. మన దగ్గర డబ్బులు దండిగా ఉన్నాయని.. పోలీసులు, అధికారులు మన చేతిలో ఉన్నారని అధర్మంగానైనా గెలిచే కార్యక్రమం చేస్తే అది ఏ మాత్రం ధర్మం కాదు.చంద్రబాబు నైజం:కానీ, ఇక్కడ చంద్రబాబునాయుడు మాత్రం తన నైజం చూపిస్తూనే ఉన్నాడు. ఈ రోజుకి కూడా అధర్మంగా యుద్ధం చేసే కార్యక్రమంలో భాగంగా మన పార్టీ తరపున గెలిచిన వాళ్లకు ఫోన్లు చేసి ప్రలోభపెడుతున్నారు. మనుషులను పంపించిన మరీ మీకు రూ.5 లక్షలు, రూ.10 లక్షలు ఇస్తామని ఆఫర్ చేస్తున్నారు.అప్పుడే ఎవరైనా ఎదుగుతారు:అంటే ఈరోజు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలో రాజకీయాల్లో విలువలును అట్టడుగు స్ధానంలోకి తీసుకుని పోయే కార్యక్రమం జరుగుతోంది. ఏ రోజైనా ఒక రాజకీయ నాయకుడు విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయం చేస్తేనే ఎదుగుతాడు. ఈ విలువలను, విశ్వసనీయతను వదిలి రాజకీయం చేయడం ఏ రోజైతే మనం మొదలుపెడతామే ఆ రోజు ప్రజలకు సమాధానం చెప్పడం మాట దేవుడెరుగు.. ఇంటిలో కూడా గౌరవం ఉండదన్న సంగతి ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి.అదే నా రాజకీయ జీవితం:నేను నా జీవితంలో విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయమే చేశాను. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు వెనక్కి తిరిగి చూస్తే నేను, అమ్మ తప్ప ఎవరూ లేరు. మా ఇద్దరమే బయటకు వచ్చాం. నేను నా జీవితంలో అలాంటి రాజకీయాలే చేశాను. విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు మాత్రమే చేశాను. నేను అమ్మ ఇద్దరమే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చాం. నాతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు వస్తామని అడిగితే.. నాతో పాటు రావాలంటే రాజీనామా చేసి రావాలని చెప్పాను. అక్కడ నుంచి మొదలుపెడితే కేవలం ఇద్దరమే మొదలుపెట్టి దేవుని దయతో ప్రతి అడుగులో విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయమే చేశామని తలెత్తుకుని గర్వంగా చెప్పుకోగలం.అవి చెప్పమన్నారు. కానీ నేను..:2014 ఎన్నికల్లో మనం ఓడిపోయాం. అప్పుడు కూడా మన వాళ్లు నా దగ్గరికి వచ్చి నా మంచి కోసం, మన మంచి కోసం చాలా చెప్పారు. చంద్రబాబునాయుడు ఇష్టం వచ్చిన్లు అబద్దాలు ఆడుతున్నారు. రైతులు, మహిళలకు రుణమాఫీ అంటున్నారు. ఇంటింటికీ ఉద్యోగం. ఒకవేళ అది ఇవ్వలేకపోతే రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామంటున్నారు. అలాగే ప్రతి పేద కుటుంబానికి 3 సెంట్ల స్ధలం అంటున్నారు. కాబట్టి, మనం కూడా రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పమన్నారు. ముందైతే చెప్పేయండి. ఆ తర్వాత సంగతి చూద్దామన్నారు. కానీ చేయలేనిది, జరగనిది చెప్పడానికి మీ జగన్ ఇష్టపడడు. అబద్దం చెప్పనందుకు ఆ ఎన్నికల్లో మనం ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్నాం.ఆ తర్వాత బాబుకు ఏం జరిగింది?:ఆ తర్వాత చంద్రబాబు పరిపాలన చేశాడు. ఆ ఎన్నిక్లలో అడ్డగోలుగా అబద్దాలు చెప్పిన చంద్రబాబు.. ప్రజలను మోసం చేశాడు అన్నది అందరికీ తెలిసేటట్టుగా 2019 ఎన్నికలు వచ్చేసరికి డిపాజిట్లు దక్కని స్ధితిలోకి పోయాడు.మేనిఫెస్టో నిర్వచనం మార్చాం:అప్పుడు మనం అధికారంలోకి వచ్చాం. మన మేనిఫెస్టోలో చెప్పినది ఏదీ కూడా తప్పకుండా.. మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత అంటే అర్ధం చెప్పేలా.. అడుగులు వేశాం. గతంలో మేనిఫెస్టో అంటే చెత్తబుట్టలో వేసే డాక్యుమెంటు. కానీ మొట్టమొదటిసారిగా మేనిఫెస్టో అంటే ఒక బైబిల్, ఖురాన్ అని నిర్వచనం మారుస్తూ మాట తప్పకుండా అమలు చేశాం.మోసపు ప్రచారం:మొన్న ఎన్నికల్లో ఓ 10 శాతం ప్రజలు చంద్రబాబునాయుడు మాటలు నమ్మారు. చంద్రబాబు నాయుడు, ఆయన ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లి నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు సంతోషమా? అని ప్రచారం చేశారు. అలాగే వాళ్ల అమ్మ కనిపిస్తే నీకు రూ.18 వేలు సంతోషమా? అని అడుగుతూ ప్రచారం చేశారు. అదే ఇంట్లో వృద్దులు ఉంటే.. నీకు నెలకు రూ.4 వేలు పెన్షన్ సంతోషమా?. అని ప్రచారం చేశారు. ఈ మోసపు ప్రచారంతో ఓ పది శాతం ప్రజలు మన దగ్గర నుంచి దూరమయ్యారు.ఉన్నదీ పోయింది..:కానీ ఏమైంది?. చంద్రబాబు పాలన వచ్చిన రెండు నెలలు అయింది. స్కూళ్లు తెరిచారు, పిల్లలు బడులకు వెళ్తున్నారు. కనీసం జగన్ ఉండి ఉంటే అమ్మఒడి కింద అయినా రూ.15 వేలు ఇచ్చుండే వాడు. ఇప్పుడు ఆ రూ.15వేలు పోయే.. నీకు రూ.15వేలు, నీకు రూ.15 వేలు ఇస్తానని చెప్పిందీ పోయింది. వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. జగన్ ఉండి ఉంటే రైతుభరోసా కింద రూ.13,500 చేతిలో పడేవి. చంద్రబాబు వచ్చాడు. రూ.20 వేలు ఇస్తానన్నాడు. జగన్ ఇస్తానన్న రూ.13,500 పోయాయి. చంద్రబాబు ఇస్తానన్న రూ.20 వేలు మొత్తమే రాకపోయే.మీ జగన్ ఉండి ఉంటే..:అదే ఈరోజు మీ జగన్ ఉండి ఉంటే.. పెద్ద చదువులు చదువుతున్న పిల్లలందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ కింద ప్రతి మూడునెలలకొకసారి ఫీజులు జమ అయ్యేవి. ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చి త్రైమాసికానికి సంబంధించి ఫీజులు ఎగిరిపోయాయి. జగన్ ఉండుంటే మే నెలలో ఆ డబ్బులు పడేవి. అదీ పోయింది. డిగ్రీ చదువుతున్న పిల్లలకు ఫీజులు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో వారు కాలేజీలుకు వెళ్తున్నారు. ఫీజులు కట్టకపోతే టీసీలు తీసుకుని వెళ్లిపొమ్మని కాలేజీలు చెబుతున్నాయి. వసతి దీవెన పథకం కూడా పోయింది. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు ఏప్రిల్‌లో పడాల్సిన సున్నావడ్డీ డబ్బులు కూడా రాలేదు.అదే మన సర్టిఫికెట్:నేను ఒక్కటే విషయం చెపుతున్నాను. మోసం, అబద్దాలతో చేసిన పాలన ఎక్కువ రోజులు ఉండదు. మనం చేసిన పనులకు ఇవాళ తలెత్తుకుని గర్వంగా ప్రతి ఇంటికి పోగలగుతున్నాం. చెప్పిన మాట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేశామని తలెత్తుకుని వెళ్లగలుగుతున్నాం. అదీ మనకున్న సర్టిఫికేట్. కానీ చంద్రబాబునాయుడుకి సంబంధించిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ప్రజల్లోకి వెళ్తే.. మీరిచ్చిన సూపర్ సిక్స్, సూపర్ టెన్, ఇచ్చిన హామీలు ఏమయ్యాయని అడిగితే సమాధానం చెప్పుకోలేని స్ధితిలో టీడీపీ కేడర్ ఉంది. అదే వాళ్లకూ మనకూ ఉన్న తేడా.ప్రలోభాలకు లొంగవద్దు:మనం ప్రవర్తించే తీరు మార్గదర్శకంగా ఉండేటట్టుగా, గొప్పగా ప్రజల్లో నిలబడేటట్టుగా నా దగ్గర నుంచి మీ దగ్గర వరకు వరకు ప్రతి అడుగూ వేద్దాం. తెలుగుదేశం పార్టీ చేస్తున్న కొనుగోలు కార్యక్రమాలు, ప్రలోభాలు పెట్టే కార్యక్రమాలకు ఎవ్వరూ లొంగవద్దు.బాబును నమ్మితే..:ఒకే ఒకటి చెబుతున్నాను. జగన్ పలావ్ పెట్టాడు. చంద్రబాబు బిర్యానీ పెడతామన్నాడు. చంద్రబాబుని నమ్మి ఓటేశారు. పలావ్ పోయింది. బిర్యానీ పోయింది. చివరకు పస్తు పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబును నమ్ముకున్న ప్రజలైనా, నాయకులకైనా అంతే.వారంతా జీరో అయ్యారు:గతంలో మన పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను తీసుకున్నాడు. ఆ 23 మంది ఎమ్మెల్యేల్లో కేవలం ముగ్గురికి టిక్కెట్టిచ్చాడు. వాళ్లకు ఒక్కొక్కరికి రూ.20 కోట్లు ఇస్తామని.. కేవలం అడ్వాన్స్ ఇచ్చాడు. దాంతో అటువైపు పోయిన వాళ్లందరూ మరలా వెనక్కి వచ్చేస్తామని నాకు ఫోన్ చేశారు. కానీ ఒక్కసారి జారిపోయిన తర్వాత వెనక్కి వస్తే విలువలు, గౌరవం పోతుంది. వెనక్కి తీసుకోలేకపోయాం. వాళ్ల రాజకీయ జీవితం సున్నా అయిపోయింది.ఇది గుర్తు పెట్టుకొండి:రాజకీయాల్లో ఏ రోజైనా నిలబడాలి అంటే, ప్రజల మన్ననలు ఉంటాలంటే.. ఎప్పుడూ షార్ట్ కట్ దారి ఎంచుకోకూడదు. కష్టమైన కూడా విలువలు, విశ్వసనీయతతో కూడిన దారినే ఎంచుకోవాలి. మీ అందరి దగ్గర నుంచి కూడా నేను ఇదే ఉండాలని ఆశిస్తున్నాను. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రజల్లోకి పోతే.. మాట చెప్పాం, నెరవేర్చాం అని కాలర్ ఎగరేసుకుని చెప్పాలి. మాలో అబద్దాలు, మోసాలు, కల్మషం ఉండవని చెప్పాలి. ప్రతి ఒక్కరూ ఇది గుర్తు పెట్టుకొమ్మని కోరుతున్నాను.మన్యం నాకు తోడు:మన్యం ప్రాంతం ఎప్పుడూ నాకు తోడుగా ఉంది. పార్టీ స్ధాపించినప్పటి నుంచి వెనక్కి తిరిగి చూస్తే ఎప్పుడూ నాకు తోడుగా నిలబడింది. ఏ ప్రాంతం, ఎవరెటుపోయినా ఇక్కడ నాయకులు మాత్రం ఎప్పుడూ వంద శాతం నాకు తోడుగా ఉన్నారు. మీ ప్రేమలు, ఆప్యాయతలు ఇదే మాదిరిగా కొనసాగించమని కోరుతున్నాను. కష్టాకాలంలో ఉన్నప్పుడే ఇంకా మీ సహాయం, సహకారం ఎక్కువ కావాలని కోరుతున్నాను. కష్టాల్లో ఉన్నప్పుడే మీరు ఇంకా గట్టిగా నిలబడాలి. ఐదేళ్లు కళ్లు మూసుకుంటే అయిపోతుంది. ఈ ఐదేళ్ల మన పోరాటంలో మీ సహాయ, సహకారాలు మెండుగా ఉండాలని కోరుతున్నాను.ఏకాభిప్రాయంతోనే ఎంపిక:బొత్స సత్యనారాయణను మన పార్టీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్ధిగా రంగంలోకి దింపుతున్నాం. మన ప్రాంత ప్రజా ప్రతినిధులను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్యే అభ్యర్ధులు అందరినీ పిలిచి అడిగాను. ఎవరైతో బాగుంటుందో అడిగాను. అందరూ ఏకగ్రీవంగా చెప్పారు. ఈ ఎన్నికలు శకుని పాచికలు మాదిరిగా జరుగుతున్న ఎన్నికలు. ఇటువంటి ఎన్నికల్లో మనకు బొత్స సత్యనారాయణ లాంటి స్ట్రేచర్, ప్రొఫైల్ ఉండి ఓర్చుకోగలిగిన, నిలబడగలిగిన వ్యక్తి అయితే బాగుంటుందని అందరి నోటి నుంచి బొత్స సత్యనారాయణ పేరు వచ్చింది. జిల్లా మొత్తం ఏకంగా కావాలంటే అటువంటి వ్యక్తి అయితే బాగుంటుందని అందరూ చెప్పారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం. అదీగాక, ప్రత్యేకంగా చంద్రబాబు లాంటి అన్యాయస్తుడితో యుద్ధం చేస్తున్నాం కాబట్టి.. గట్టిగా నిలబడగలిగిన నాయకుడిని నిలబెడితేనే మనకు అడ్వాంటేజ్‌గా ఉంటుంది. అలాగే బొత్సగారు కూడా మన వాళ్లకు గట్టి తోడుగా నిలబడగలగుతాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా విలువలతో కూడిన రాజకీయాలపై ఫోకస్ పెడుతున్నాం. మీ అందరూ బొత్స సత్యనారాయణకు మనస్ఫూర్తిగా సహకరించాలని.. పేరుపేరునా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. -
Bangladesh: వర్శిటీ అధికారులతో పీఎం హసీనా భేటీ
బంగ్లాదేశ్‌లో విద్యార్థుల రిజర్వేషన్ ఆందోళలను అదుపుచేసేందుకు ఆ దేశ ప్రధానిషేక్ హసీనా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు, కాలేజీ ప్రిన్సిపాళ్లతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. అయితే విద్యార్థి ఉద్యమ నాయకులు ఈ చర్చల ఆహ్వానాన్ని తిరస్కరించారు. పీఎం హసీనా వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నవారి బంధువులకు ప్రభుత్వ ఉద్యోగాలలో 30 శాతం రిజర్వ్ చేసే కోటా వ్యవస్థను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ బంగ్లాదేశ్‌లో ఇటీవల పోలీసులు- విద్యార్థి నిరసనకారుల మధ్య హింసాత్మక ఘర్షణలను చోటుచేసుకున్నాయి. వీటిని అదుపు చేసేందుకు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు, సీనియర్ అధ్యాపకులు, కళాశాల ప్రిన్సిపాళ్లతో ప్రధాని సమావేశమయ్యారని పీఎంవో ప్రతినిధి తెలిపారు. శనివారం రాత్రి 8:15 గంటలకు ప్రారంభమైన సమావేశం దాదాపు మూడు గంటల పాటు కొనసాగింది.దీనిముందు పీఎం హసీనా వివిధ విద్యార్థి సంఘాల నేతలతో మాట్లాడుతూ ఈ విషయంలో చర్చల కోసం ఎవరైనా తన వద్దకు రావచ్చని, విద్యార్థులు తమ తల్లిండ్రులను కూడా తీసుకుని రావచ్చన్నారు. అయితే ప్రభుత్వంతో చర్చలు జరిపే ఆలోచన తమకు లేదని విద్యార్థి ఉద్యమ నేతలు మీడియాకు తెలిపారు. -
చివరి వరకు అండగా ఉంటా.. జగన్ భరోసా..
-
కార్యకర్తలతో వైఎస్ జగన్
-
కేబినెట్ కీలక భేటీ.. చర్చంచబోయే అంశాలు ఇవే..
-
నీతి ఆయోగ్ సమావేశంలో తనను ఘోరంగా అవమానించారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపాటు... భేటీ నుంచి వాకౌట్.. ఇంకా ఇతర అప్డేట్స్
-
నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించిన ఇండియా కూటమి
-
మూసీ ప్రక్షాళన: కేంద్రమంత్రికి సీఎం రేవంత్ విజ్ఞప్తి
సాక్షి,ఢిల్లీ: కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో సోమవారం(జులై 22) భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కు సహకరించాలని కేంద్ర మంత్రిని ఈ సందర్భంగా సీఎం విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరంలోని మురికి నీరు అంతా మూసీలో చేరుతోందని, దానిని శుద్ది చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందన్నారు. జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద మూసీలో శుద్ధి పనులకు రూ.4 వేల కోట్లు ఇవ్వాలని కోరారు. గోదావరి నది జలాలను ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లతో నింపే పనులకు రూ.6 వేల కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ను గోదావరి నీటితో నింపితే హైదరాబాద్ నగరానికి తాగునీటి ఇబ్బందులు ఉండవని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ దృష్టికి రేవంత్‌రెడ్డి తీసుకెళ్లారు. -
ఉచిత పంటల బీమాపై నీలి నీడలు
సాక్షి, అమరావతి: రైతులపై పైసా భారం పడకుండా ఐదేళ్లుగా విజయవంతంగా అమలు చేస్తోన్న వైఎస్సార్ ఉచిత పంటల బీమాకు మంగళం పాడేందుకు చంద్రబాబు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. పంటల బీమాపై అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ సోమవారం సచివాలయంలో సమావేశం కాబోతోంది. రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత పంటల బీమా పథకంతో పాటు వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న పంటల బీమాపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. ఐదేళ్లుగా విజయవంతంగా అమలవుతున్న వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తివేస్తున్నట్టుగా తొలి సమీక్షలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకం స్థానంలో 2019కి పూర్వం రైతుల భాగస్వామ్యంతో అమలైన ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) తీసుకొస్తున్నట్టు స్వయంగా వెల్లడించారు. ఈ ప్రకటనకు కొనసాగింపుగా ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్‌లో ఉచిత పంటల బీమా పథకం స్థానంలో మెరుగైన బీమా పథకం కోసం అధ్యయనం పేరిట వ్యవసాయ, పౌర సరఫరాలు, ఆర్థిక శాఖా మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాల్లో అమలులో ఉన్న క్రాప్ ఇన్సూ్యరెన్స్ చట్టాలపై ఈ కమిటీ సమగ్ర అధ్యయనం చేసి నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని కేబినెట్లో తీర్మానించారు. పథకాలన్నీ మరింత మెరుగ్గా అమలు చేస్తామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చి గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం.. ఆ తర్వాత ఒక్కొక్కొటిగా వాటికి మంగళం పాడుతోంది.అత్యుత్తమ పథకంగా కొనియాడిన కేంద్రంప్రస్తుతం రాష్ట్రంలో అమలులో ఉన్న ఉచిత పంటల బీమా పథకం దేశంలోనే ది బెస్ట్ క్రాప్ ఇన్సూ్యరెన్స్ పథకమని కేంద్రమే అధికారికంగా ప్రకటించింది. ఇన్నోవేషన్ కేటగిరి కింద 2023లో అవార్డును సైతం అందించింది. ఏపీ స్ఫూర్తితో నోటిఫై చేసిన పంటలకు యూనివర్సల్ కవరేజి కల్పించేందుకు ఫసల్ బీమాలో పలు మార్పులు కూడా చేసింది. ఈ క్రాప్ నమోదే ప్రామాణికంగా నోటిఫై చేసిన ప్రతీ పంటకు, సాగు చేసిన ప్రతీ ఎకరాకు యూనివర్సల్ కవరేజి కల్పిస్తూ రైతులపై పైసా భారం పడకుండా 2019 రబీ నుంచి వైఎస్ జగన్ ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని విజయవంతంగా అమలు చేసింది. రూ.7802 కోట్ల పరిహారంఈ పథకం కింద రికార్డు స్థాయిలో దాదాపు 5 కోట్ల ఎకరాలకు బీమా కవరేజ్ కల్పించడం ద్వారా 2.04 కోట్ల మంది రైతులకు ఉచితంగా బీమా రక్షణ కల్పించింది. ఐదేళ్లలో వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్న 54.55 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7802.08 కోట్ల బీమా పరిహారం నేరుగా జమ చేసింది. 2023–24 సీజన్‌కు సంబంధించి రైతుల వాటాతో కలిపి ప్రీమియం రూపంలో రూ.1,384 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిలు చెల్లించ కుండా ఎగ్గొట్టాలనే ఆలోచనతో ఉన్న కూటమి ప్రభుత్వం రైతుల భాగస్వామ్యంతో పాత పంటల బీమాను పునరుద్దరిస్తున్నట్టుగా ప్రకటించింది. ఇందులో భాగంగానే ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సోమవారం భేటీ కానుంది. పైసా భారం పడకుండా ఐదేళ్లుగా వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలంటూ రాష్ట్రంలోని రైతులు, రైతు సంఘాలు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. -
కొనసాగుతున్న భేటీ ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం
-
కాసేపట్లో వైఎస్ఆర్ సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ
-
కాసేపట్లో వైఎస్ఆర్ సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ
-
రేపు వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని శనివారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిర్వహించనున్నారు.ఈ మేరకు పార్టీ ఎంపీలకు గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం సమాచారం అందించింది. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు -
ఢిల్లీలో కొనసాగుతున్న ఏపీ సీఎం చంద్రబాబు టూర్
-
నేడు కాంగ్రెస్ కీలక భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేడు కీలక భేటీ నిర్వహించనుంది. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రజాభవన్ వేదికగా జరగనున్న ఈ సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు హాజరు కానున్నారు. ఈ మేరకు సమావేశానికి రావాలంటూ గాంధీభవన్ నుంచి నేతలందరికీ సమాచారం పంపారు.ఈ సమావేశంలో రైతు రుణమాఫీపైనే ప్రధానంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది. పంద్రాగస్టు లోపు రైతులకు రుణమాఫీ చేస్తామన్న సీఎం రేవంత్ హామీ అమలు కానున్న నేపథ్యంలో పార్టీ పరంగా అనుసరించాల్సిన వైఖరిపై ఈ సమావేశంలో చర్చిస్తారని, రుణమాఫీ సందర్భంగా రైతుల సమక్షంలో నిర్వహించాల్సిన సంబురాలకు సంబంధించిన కార్యాచరణ గురించి సమావేశం పిలుపునిస్తుందని గాం«దీభవన్ వర్గాలు వెల్లడించాయి. ఇటీవలి రాజకీయ పరిణామాలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, రైతు భరోసా అమలు, విద్యుత్ ఒప్పందాలపై ఏర్పాటు చేసిన కమిషన్ విషయంలో సుప్రీం ఆదేశాల పర్యవసానాలు తదితర అంశాలపై కూడా సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. -
మా టార్గెట్ మీరే.. మీ కోసమే మేము..
-
రైతులతో సమావేశం
-
కాసేపట్లో టీ-బీజేపీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం
-
పార్లమెంట్ అభ్యర్థులతో భేటీ అయిన కురియన్ కమిటీ
-
అందరి మాటతోనే ‘భరోసా’
సాక్షి, ఆదిలాబాద్: ‘రైతు భరోసాను నిర్దిష్టంగా అమలు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ఈ విషయంలో ఓపె న్ మైండ్‌తో ఉన్నాం. మాకు మేము ఏదో నిర్ణయం తీసుకోవడం లేదు. అందరితో చర్చించి అందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలనే సదుద్దేశంతోనే ఉన్నాం. అన్ని జి ల్లాల్లో కేబినెట్ సబ్ కమిటీ పర్యటించి ప్రజాక్షేత్రంలో అభిప్రాయాలు సేకరించి...అసెంబ్లీలో నివేదిక పొందుపరుస్తాం. రైతుభరోసా పేద, బడుగువర్గాలకు న్యాయం చేసేదిగా ఉండాలని విజ్ఞప్తులు వస్తున్నాయి. రైతు భరోసా పథకానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి పరిమితులు ఖరారు కాలేదు. గ్రామం యూనిట్‌గా తీసుకోవాలని ఎక్కువమంది రైతులు సూచిస్తున్నారు.. పోడు రైతులకు సర్కారు సాయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం.’అని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని కుమురంభీం కాంప్లెక్స్ సమావేశ మందిరంలో రైతు భరోసా విధివిధానాల ఖరారుపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతుల నుంచి అభిప్రాయాలు, సలహాల ను కేబినెట్ సబ్ కమిటీ సేకరించింది. ఈ కమిటీ చైర్మన్ మ ల్లు భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్క, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఆరు గ్యారంటీల్లో కీలకమైన రైతుభరోసా పథకాన్ని పకడ్బందీగా అమలు చేసి తీరుతామని డిప్యూటీ సీఎం అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని చెప్పారు. నిజమైన రైతులకే రైతుభరో సా అందించేందుకు అన్నివర్గాల ప్రజల నుంచి అభిప్రాయా లు స్వీకరిస్తున్నట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మరోమంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడు తూ ఇంకా ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లోనూ ప్రజల అభిప్రాయాలు సేకరిస్తామన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలువురు రైతులకు భూమికి సంబంధించి సరైన పత్రాలు కూడా లేవని తెలిపారు. ఇలా అన్ని విషయాల్లోనూ ఆలోచన చేస్తామని చెప్పా రు. ఎకరం భూమి లేకున్నా, ఏదో ఒకవిధంగా సాగు చేస్తు న్న రైతులకు లబ్ధి చేకూర్చాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేకంగా బడ్జెట్లో 20 శాతం నిధులు కేటాయించి ఆదుకోవాలని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు కోరారు.వైఎస్ అమలు చేసిన కౌలురైతు చట్టాన్ని తీసుకురావాలి దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి 2011లో అమలు చేసిన కౌలు రైతు చట్టాన్ని తీసుకురావాలని రైతులు, రైతు సంఘాల నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. సాగుచేస్తున్న వారిలో 30 నుంచి 40 శాతం మంది కౌలురైతులే ఉన్నారని వివరించారు. 95 శాతం ఆత్మహత్య లు కౌలు రైతులవేనని పేర్కొన్నారు. పట్టాదారులకు భరోసా కల్పించి కౌలు రైతులకు న్యాయం చేయాలని మంత్రివర్గ ఉప సంఘాన్ని కోరారు. రైతు భరోసానే కాకుండా మిగతా వాటి విషయంలోనూ కౌలు రైతులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం విధివిధానాలు రూపొందించాలన్నారు. ఉమ్మ డి ఆదిలాబాద్ జిల్లాలో పహాణీలు, పోడు భూముల సమస్య కారణంగా మెజారిటీ రైతులు ప్రభుత్వ సాయం పొందలేక పోతున్నారన్నారు. పేద, దళిత, గిరిజన రైతులకు రైతు భరో సా అందించాలని పలువురు కోరారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ప్రత్యేకంగా తీసుకొని పదెకరాలు సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా వర్తింపజేయాలని కోరారు. ఎంపిక చేసిన వారితోనే మాట్లాడించారు ఎంపిక చేసిన రైతులతోనే మాట్లాడిస్తున్నారని నిజమైన రైతులతో మాట్లాడించడం లేదని కొందరు ఆరోపించారు. దీంతో స్పెషల్ రోప్ పార్టీ పోలీసులు ఎంటర్ అయ్యారు. వేదిక ముందు ప్రజాప్రతినిధులకు రక్షణగా ఇటువైపు నుంచి అటు వైపు వరకు కూర్చున్నారు. కాగా రైతులను తాము ఎంపిక చేయలేదని, వ్యవసాయ అధికారులే గుర్తించారని ఖానా పూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. కాగా కేబినెట్ సబ్‌కమిటీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. -
రేవంత్ రెడ్డి, బాబు మీటింగ్ పై మార్గాని భరత్ కీలక వ్యాఖ్యలు
-
రేవంత్, చంద్రబాబు సమావేశంలో నిర్ణయాలు
-
Gun Shot: పదేళ్ల పంచాయతీ