వేలాదిగా పాల్గొన్న జనం,వందలాదిగా సాయుధులు!
సోషల్ మీడియాలో వీడియోలు
ఆరా తీస్తున్న పోలీసులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఇటీవల జరి గిన వరుస ఎన్‌కౌంటర్ల కారణంగా మావోయిస్టు ల పని అయిపోయిందనే అభిప్రాయం రోజురో జుకూ బలపడుతున్న సమయంలో ఛత్తీస్ గఢ్‌లోని బస్తర్ అడవుల్లో పార్టీ ఆవిర్భావ వేడుక లను ఘనంగా నిర్వహించి మావోయిస్టులు మరోసారి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఈ వేడుకల వీడియోలు గురు, శుక్రవారాల్లో ప్రధాన, సోషల్ మీడియాల్లో ప్రత్యక్షమ య్యాయి. బస్తర్ అడవుల్లో గుర్తుతెలియని ప్రాంతంలో జరిగిన ఈ వేడుకల్లో వేలాదిగా ఆదివాసీ ప్రజలు, వందల సంఖ్యలో సాయుధులు పాల్గొ న్నట్టుగా స్పష్టమవుతోంది.
చనిపోయిన మావో యిస్టులను స్మరిస్తూ.. పాటలు పాడుతూ స్తూపా ల దగ్గర కవాతు చేస్తూ మావోయిస్టులు, వారి సానుభూతిపరులు ఈ వీడియోల్లో కనిపించారు. ఆపరేషన్ కగార్ మొదలయ్యాక అబూజ్‌మడ్ అడవుల్లో తుల్‌తులీ ఎన్‌కౌంటర్ తర్వాత మావో యిస్టులకంటూ సురక్షిత ప్రాంతం లేదనే అభిప్రా యం బలంగా ఏర్పడింది.
అయితే వేలాది మంది ఒక చోట గుమిగూడి ఆటలు ఆడుతూ.. పాటలు పాడుతూ, డోలు వాయిద్యాలు ఉపయోగిస్తూ వేడుకలు చేసుకోవడం, వేడుకల వీడియోలు బయటకు విడుదల చేయడం చూస్తూంటే ఇప్పటికీ అబూజ్‌మడ్, దండకారణ్యం ప్రాంతంలో మావోయిస్టులకు గట్టి పట్టు ఉందనే అంశం స్పష్టమవుతోంది.
అయితే ప్రాంతం, తేదీ తదితర వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా లేకపోవడంతో పాత వీడియోనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు ఈ వీడియోలపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment