
తిరుపతి జిల్లా: గూడూరు సమీపంలో రైలు పట్టాలు విరిగాయి. గొర్రెల కాపరి గమనించి ఎర్ర టవలు కట్టడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో విజయవాడ తిరుపతికి వెళ్లే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పట్టాలు ప్రమాదవశాత్తు విరిగిందా? లేక కుట్ర ఏమైనా దాగి ఉందా? అనే కోణంలో రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు.