
సాక్షి, విజయవాడ : ఏపీ ప్రభుత్వం 9.2 కోట్లతో కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్ని కొనుగోలు చేయనుంది. 10 కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కొనుగోలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం చంద్రబాబుతో పాటు వీఐపీల భద్రత కోసం కొత్త వాహనాలు కొనుగోలు చేయనుంది. కొత్త వాహనాలు ఉన్నా అదనంగా మరో పది వాహనాల కొనుగోలుకు సిద్ధమైంది.