
అమరావతి: తాను రేపు(మంగళవారం) సిట్ విచారణకు హాజరవుతున్నట్లు రాజ్ కేసిరెడ్డి వెల్లడించారు. రేపు మధ్యాహ్నం గం. 12:00ల,కు సిట్ ఆఫీసుకు వస్తానని ఆయన తెలిపారు. ఈ మేరకు సిట్ అధికారులకు సమాచారం ఇచ్చానన్నారు. ఈ విషయాన్ని ఆడియో ద్వారా తెలిపారు. ఇక తన ముందస్తు బెయిల్ అంశానికి సంబంధించి హైకోర్టులో వాదనలకు సమయం పట్టేలా ఉందని, అందుజేత సిట్ విచారణకు హజరవుతున్నట్లు పేర్కొన్నారు.
రెండురోజుల క్రితం విజయసాయి రెడ్డిపై రాజ్ కేసిరెడ్డి ధ్వజమెత్తారు. విజయసాయి చెప్పే మాటలు నమ్మొద్దంటూ మీడియాకు రాజ్ కసిరెడ్డి ఆడియో విడుదల చేశారు. త్వరలోనే విజయసాయి బండారం బయటపెడతానన్నారు. పోలీసుల విచారణకు సహకరిస్తానని తెలిపారు. న్యాయపరమైన ప్రక్రియ పూర్తి అయిన తర్వాత పోలీసులకు సహకరిస్తానని పేర్కొన్నారు. కొద్దిరోజులుగా తనపై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు.
‘‘సిట్ నోటీసులపై హైకోర్టును ఆశ్రయించా. మార్చిలో సిట్ అధికారులు మా ఇంటికి వచ్చారు. నేను లేనప్పుడు మా అమ్మకు నోటీసులు ఇచ్చారు. సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశా’ అని గత ఆడియోలో పేర్కొన్నారు రాజ్ కేసిరెడ్డి.