
శిథిల ఇళ్లకు నోటీసులు
భద్రాచలంఅర్బన్: పట్టణంలో శిథిలావస్థలో ఉన్న 23 ఇళ్ల యజమానులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. భద్రాచలంలో పోకల వీధిలో నివాసం ఉండే శ్రీపతి శ్రీనివాస్ అనే వ్యక్తి తన పాత ఇంటిపై మరో ఐదంతస్తులు నిర్మాణం చేపట్టి, పనులు పూర్తి చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు బిల్డింగ్ పేకమేడలా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు మృతి చెందారు. ఈ క్రమంలో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా గ్రామ పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టారు. శిథిలావస్థలో ఉన్న 23 ఇళ్లను గుర్తించి, సంబంధిత యజమానులకు నోటీసులిచ్చారు. ఏజెన్సీ ప్రాంతం భద్రాచలంలో అనధికారికంగా (జీ+3)గా నిర్మించిన 131 ఇళ్లను గుర్తించారు. వారిలో 20 మంది ఇంటి యజమానులకు గ్రామ పంచాయతీ అధికారులు నోటీసులు అందించారు.