
●తేమ, నీడతో మిద్దె, పెరటి తోటల రక్షణ
ఉష్ణోగ్రతలు పెరిగిన నేపథ్యాన మిద్దె తోటలు, పెరటి తోటల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి ఎంవీ.మధుసూదన్ సూచిస్తున్నారు. తోటల నిర్వాహకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలా ఉన్నాయి.
●తెల్లవారుజాము, సూర్యాస్తమయ సమయాల్లో తోటలకు నీరు పెట్టాలి. మధ్యాహ్నం నీరు పెడితే ఎక్కువగా ఆవిరవుతుంది. తోటకు మల్చింగ్ చేస్తే ఎక్కువ సేపు తేమ ఉంటుంది. ఎండుగడ్డి కూడా మల్చింగ్‌గా వాడొచ్చు. పాత షీట్లు, పాత కిటికీ తెరలను మొక్కలపై కప్పినా ఫలితం ఉంటుంది. అధిక నీరు పెడితే బ్యాక్టీరియా అభివృద్ధి చెంది, ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. అంతేకాక వ్యాధుల బారిన పడే ప్రమాదమూ లేకపోలేదు. తోటలో క్రమం తప్పకుండా కలుపు నివారించాలి. వేడిగాలుల సమయాన ఎరువులు వేయొద్దు. ఎండతో ఒత్తిడికి గురైన మొక్కలు కోలుకునే వరకు ఎరువు వేయకూడదు.

●తేమ, నీడతో మిద్దె, పెరటి తోటల రక్షణ