
హైదరాబాద్: ఫిట్‌నెస్ సంస్థలకు టెక్నాలజీ సేవలు అందించే గ్లోబల్ సంస్థ ఏబీసీ ఫిట్‌నెస్ హైదరాబాద్‌లో తమ ఇన్నోవేషన్ హబ్‌ను ఆవిష్కరించింది. ఫిట్‌నెస్ పరిశ్రమకు అవసరమైన టెక్నాలజీలను రూపొందించడంపై ఇది ప్రధానంగా దృష్టి పెడుతుంది.
అంతర్జాతీయంగా ఎఫ్45 ఫ్రాంచైజీ, స్థానికంగా ది ఫిట్ స్ట్రీక్‌లాంటి ఇరవై పైగా కస్టమర్లకు కంపెనీ సర్వీసులు అందిస్తోంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, డేటా సైంటిస్టులు సహా వచ్చే ఏడాది వ్యవధిలో 200 మంది సిబ్బందిని నియమించుకోనున్నట్లు సంస్థ సీఈవో బిల్ డేవిస్ వివరించారు.
భారత్‌లో ఒసాము సుజుకీ ఎక్సలెన్స్ సెంటర్
జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం సుజుకీ మోటర్ కార్పొరేషన్ తమ మాజీ చైర్మన్, దివంగత ఒసాము సుజుకీ గౌరవార్థం భారత్‌లో ఆయన పేరిట సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను (ఓఎస్‌సీవోఈ) ఏర్పాటు చేయనుంది. దేశీ కార్ల దిగ్గజం మారుతీ సుజుకీతో కలిసి గుజరాత్, హర్యానాలో ఓఎస్‌సీవోఈని నెలకొల్పనుంది. తయారీ రంగం అధిక వృద్ధి సాధనలోను, విడిభాగాల తయారీ సంస్థల ప్రమాణాలను మెరుగుపర్చడంలోను ప్రభుత్వ లక్ష్యాలకు తోడ్పడేదిగా ఇది ఉంటుందని మారుతీ సుజుకీ తెలిపింది.