
సోషల్ మీడియా.. ఏఐ జనరేటెడ్ స్టూడియో జిబ్లీ స్టైల్ చిత్రాలతో నిండిపోతోంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విటర్) ఏది ఓపెన్ చేసినా.. జిబ్లీ ఫొటోలే కనిపిస్తున్నాయి. దీనిపైన ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మాన్ స్పందిస్తూ.. ఇక విరామం తీసుకోండి అని ట్వీట్ చేశారు.
జిబ్లీ వినియోగం ఎక్కువగా ఉంది. యూజర్లు ఫోటోలను రూపొందించడంలో కొంత విశ్రాంతి తీసుకోండి. ఎందుకంటే మా సిబ్బందికి కూడా నిద్ర అవసరం కదా అంటూ శామ్ ఆల్ట్‌మాన్ ట్వీట్ చేశారు.
can yall please chill on generating images this is insane our team needs sleep
— Sam Altman (@sama) March 30, 2025
సాయం ఆల్ట్‌మాన్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫీచర్ వెనుక పనిచేసే బృందాన్ని తొలగించి, కొత్త టీమ్ ఏర్పాటు చేసుకోండి అంటూ.. ఒక యూజర్ కామెంట్ చేశారు. దీనికి ఆల్ట్‌మాన్ సమాధానమిస్తూ.. ఈ బృందం ప్రపంచంలోనే అతిపెద్ద వెబ్‌సైట్‌ను నిర్మించే పనిలో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ టీమ్ అని అన్నారు.
ఇదీ చదవండి: ఇండియన్ రైల్వే ఒకరోజు సంపాదన ఎంతో తెలుసా?
నిజానికి ఓపెన్ఏఐ కొన్ని రోజులకు ముందు.. యూజర్లను ఆకట్టుకోవడానికి చాట్‌జీపీటీలో 'జిబ్లీ'ని తీసుకొచ్చింది. దీనిని యూజర్లకు ఎక్కువగా వినియోగించడం మొదలుపెట్టారు. దీనివల్ల జీపీయూ సిస్టంపై అధిక ప్రభావం చూపుతోంది. ఈ కారణంగానే దీనికి ఒక లిమిట్ పెడుతున్నట్లు సీఈఓ వెల్లడించారు. అయితే ఈ లిమిట్ ప్రీమియమ్ యూజర్లకు వర్తించదు.
no thanks
in addition to building agi this team is on trajectory to build the biggest website in the world from a cold start 2.33 years ago
best team in the world, it's just hard— Sam Altman (@sama) March 30, 2025