
రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకులు ధీరూభాయ్ అంబానీ 92వ జయంతిని పురస్కరించుకుని, జామ్ నగర్ రిఫైనరీ ప్రారంభించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ధీరూభాయ్ అంబానీ కోడలు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ(Nita Ambani) ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.
ధీరూభాయ్(dhirubhai ambani) కలల భూమి జామ్ నగర్ అని నీతా అంబానీ అభివర్ణించారు. ఆయన ధైర్యసాహసాలు, అలుపెరగని సంకల్పం, ఆకాంక్షలు నిజం అయ్యాయని చెప్పారు. జామ్ నగర్ కేవలం ఒక ప్రదేశం మాత్రమే కాదని, రిలయన్స్ గ్రూప్‌నకు కేంద్ర బిందువు అని కంపెనీ సృజనాత్మకత, సర్వీస్‌ను ప్రతిబింబిస్తుందని ఆమె నొక్కి చెప్పారు. రిఫైనరీ స్థాపించినప్పటి నుంచి కంపెనీ ఎదిగిన తీరుకు జామ్ నగర్ ఉదాహరణ అని అన్నారు. సంస్థ వ్యవస్థాపకులు ధీరూభాయ్ అంబానీకి నివాళులు అర్పించడానికి ఈ కార్యక్రమంలో భాగమైన ఉద్యోగులు, వారి కుటుంబాలు, కీలక ఎగ్జిక్యూటివ్‌కు ధన్యవాదాలు తెలిపారు. రిలయన్స్ ఎదుగుదలకు, సంస్థ విజయానికి కారణమైన కోకిలాబెన్ అంబానీ(ధీరూభాయ్ అంబానీ భార్య)కు నీతా కృతఙ్ఞతలు తెలియజేశారు.
ఇదీ చదవండి: జీఎస్టీ నిబంధనలు పాటించని 30 విభాగాలు గుర్తింపు
రిలయన్స్ జామ్ నగర్ రిఫైనరీ ప్రత్యేకతలు..
గుజరాత్‌లోని జామ్ నగర్‌లోని రిలయన్స్(Reliance) రిఫైనరీ ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత సంక్లిష్టమైన సింగిల్ సైట్ రిఫైనరీ.
సామర్థ్యం: రోజుకు 1.4 మిలియన్ బ్యారెళ్ల ప్రాసెసింగ్ సామర్థ్యం (ఎంఎంబీపీడీ) కలిగి ఉంది.
ఈ రిఫైనరీ 216 వివిధ గ్రేడ్ల ముడి చమురును ప్రాసెస్ చేయగలదు.
ఇది ఫ్లూయిడైజ్డ్ కెటాలిటిక్ క్రాకర్ (ఎఫ్‌సీసీ), కోకర్, ఆల్కైలేషన్, పారాక్సిలీన్, పాలీప్రొపైలిన్, రిఫైనరీ ఆఫ్ గ్యాస్ క్రాకర్ (ఆర్ఓజీసీ), పెట్‌కోక్ గ్యాసిఫికేషన్ ప్లాంట్లతో సహా మరిన్ని ప్రాసెసింగ్ యూనిట్లను కలిగి ఉంది.
ఈ రిఫైనరీలో అధిక నాణ్యతగల మౌలిక సదుపాయాలు ఉన్నాయి.